ముంబయి: ఎన్సీపీకి షాక్ ఇచ్చిన శరద్ పవార్ సోదరుడి కొడుకు అజిత్ పవార్.. ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై స్పందించిన శరద్ పవార్.. తమ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవని అన్నారు. కుటుంబంలో రాజకీయాల గురించి మాట్లాడబోమని చెప్పారు. ప్రతి ఒక్కరికీ తమ సొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
స్వాతంత్ర్య పోరాట నాయకుడు వై బీ చౌహాన్ స్మారకాన్ని దర్శించడానికి సతారాకు ఈ రోజు ఉదయమే శరద్ పవార్ వెళ్లారు. నిన్న నుంచి ఎవ్వరినీ తాను కలవలేదని శరద్ పవార్ చెప్పారు. అజిత్ పవార్ పార్టీని వీడడంపై ఎలాంటి న్యాయ పరమైన చర్యలు తీసుకుంటారనేది ఇంకా తెలియలేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జయంతి పటేల్ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
2024 ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిని ఏర్పరచాలని నిర్ణయం తీసుకుంటున్న తరుణంలో ఎన్సీపీలో చీలిక వచ్చింది. అయితే.. ఈ పరిణామాలతో ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకు ఎలాంటి ఆటంకం కలగదని శరద్ పవార్ చెప్పారు. బెంగళూరులో త్వరలో ప్రతిపక్ష కూటమి సమావేశం జరుగుతుందని వెల్లడించారు. జులై 16-18 మధ్య ఈ మీటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది.
ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి ఏక్‌నాథ్ షిండే వర్గంతో చేతులు కలిపారు. ఈ మేరకు రాజ్ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అజిత్ పవార్‌తో పాటు షరద్ పవార్‌కు నమ్మిన బంటు ఛగన్ భుజ్‌భల్, ప్రఫుల్ పటేల్‌లు కూడా ఉన్నారు. అయితే.. ఎన్సీపీలో 40 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఏంపీలు తనకు మద్దతుగా ఉన్నారని తెలిపారు.
ఇదీ చదవండి: ప్రధాని నివాసంపై డ్రోన్ కలకలం.. ఉలిక్కిపడ్డ భద్రతా సిబ్బంది..
Comments
Please login to add a commentAdd a comment