ఎంత కష్టం...
Published Mon, Dec 26 2016 11:56 PM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM
గర్భగుడిలాంటి అమ్మ పొట్టలో ఎంచక్కా అడుకున్నాం... ఎవరు ముందు బయటపడితే వారే పెద్దంటూ ఎన్నో ఊసులాడుకున్నాం
అక్కా, అన్నా, తమ్ముడు, చెల్లి వరుసలు చెప్పుకున్నాం నెలలు నిండుతుంటే మాలో ఆనందం బయటకు వస్తున్నామనే ఆలోచనే ఓ ఉద్వేగం కళ్లు తెరిచీ, తెరవక ముందే. ఎంత కష్టం...తొమ్మిది నెలల భారం మోసి పురిటి నొప్పుల బాధను ఓర్చి అష్టకష్టాలు పడి జన్మనిచ్చిన
ఆ అమ్మ ఏదీ... ఆదుకోవల్సిన నాన్న ఏడీ నోట్లో గుడ్డలు కుక్కి... మా ఇద్దర్నీ మూటగట్టేసి చిమ్మ చీకట్లో... వణికించే చలిలో.. ముళ్లపొదల మధ్యలో ఎంత కష్టం...
Advertisement
Advertisement