
ఢిల్లీలో తలెత్తిన నీటి సమస్యకు పరిష్కారం కోరుతూ నిరాహార దీక్షకు దిగిన ఆప్ మంత్రి ఆతిశి ఆరోగ్యం దిగజారడంలో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆమెను సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పరామర్శించారు.
మంత్రి ఆతిశి చికిత్స పొందుతున్న లోక్ నాయక్ ఆసుపత్రికి వచ్చిన అఖిలేష్ ముందుగా అక్కడి వైద్యులను అడిగి మంత్రి అతిషి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఆతిశిని పరామర్శించారు. ఐదు రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్న ఆతిశి మంగళవారం అస్వస్థతకు గురవడంతో ఆమె పార్టీ నేతలు ఎల్‌ఎన్ ఆస్పత్రికి తరలించారు.
ఢిల్లీలో నీటి కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో మంత్రి ఆతిశి హర్యానా నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 21న నిరాహార దీక్షకు దిగారు. ప్రస్తుతం ఆతిశి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment