శివాజీనగర(బెంగళూరు): బెంగళూరులో పెరుగుతున్న వీధి కుక్కల దాడులపై విధానసభలో మంగళవారం ఘాటుగా చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో బసవనగుడి ఎమ్మెల్యే రవి సుబ్రమణ్య ఈ అంశాన్ని ప్రస్తావించారు. నగరంలో కుక్కల బెడద అధికమైంది. ప్రజలు తిరిగేందుకు భయపడుతున్నారని, ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలని ఆయన కోరారు.
మంత్రి జేసీ మాధుస్వామి మాట్లాడుతూ వీధి కుక్కల నియంత్రణకు జనన నియంత్రణ శస్త్రచికిత్సల చేయడానికి టెండర్లను పిలిచినట్లు చెప్పారు. వాటికి వ్యాధి నిరోధక టీకాలను కూడా వేయాలన్నారు. కుక్కలను చంపడానికి చట్టంలో అవకాశం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment