సియోల్:సౌత్‌కొరియాలో ఘోర విమాన ప్రమాదం మరువకముందే మరో విమానానికి పెద్ద గండం తప్పింది. ఈ విమానం కూడా ఆదివారం 179 మంది ప్రాణాలను బలిగొన్న జెజు ఎయిర్‌లైన్స్‌కు చెందినదే కావడం గమనార్హం. జెజు ఎయిర్‌లైన్స్‌కు చెందిన సోమవారం(డిసెంబర్30) ఉదయం సియోల్‌లోని గింపో ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయింది.
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని పైలట్ వెంటనే గుర్తించాడు. దీంతో విమానాన్ని తిరిగి గింపో విమానాశ్రయంలో సురక్షితంగా దించాడు. అయితే ఈ విమానానికి కూడా ల్యాండింగ్ గేర్ సమస్యనే వచ్చినట్లు తెలుస్తోంది.
కాగా, ఆదివారం సౌత్‌కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ గేర్ విఫలం కావడంతో విమానం క్రాష్ ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 181 మందిలో ఇద్దరు తప్ప అందరూ దుర్మరణం పాలయ్యారు. జెజు ఎయిర్‌లైన్స్‌కు సామాన్యులకు అందుబాటు ధరల్లో విమానాలు నడిపే బడ్జెట్ ఎయిర్‌లైన్ కంపెనీగా పేరుంది.
ఇదీ చదవండి: గాలిలో ప్రాణాలు
Comments
Please login to add a commentAdd a comment