మంచినీటి సమస్యను పరిష్కరించండి
మంచినీటి సమస్యను పరిష్కరించండి
Published Mon, Feb 20 2017 11:11 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
కలెక్టర్ అరుణ్‌కుమార్
కాకినాడ సిటీ : జిల్లాలోని ఏజెన్సీ, కోనసీమ ప్రాంతాలలో మంచినీటి సమస్యలు ఎదుర్కొంటున్న గ్రామాలకు ప్రత్యేక నిధులు వినియోగించి సమస్య పరిష్కరించాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ సూచించారు. ఏజెన్సీలో వైద్యసేవలు మెరుగుపరించేందుకు ప్రైవేటు వైద్య సేవలను వినియోగించాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులకు సూచించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో సోమవారం వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిసెంబర్ నెలాఖరు నాటికి జిల్లాలోని అన్ని గ్రామాలను బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు. ఉపా«ధి హామీ పథకంలో జరిగిన అవకతవకలపై సోషల్ ఆడిట్‌లో ప్రస్తావించిన రూ.7.50 కోట్లను సంబంధిత సిబ్బంది నుంచి రికవరీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి హామీ పథకం సమన్వయంతో జిల్లాలో 530 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లను మార్చి నెలాఖరుకు పూర్తి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ భవనాలలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలకు టాయిలెట్స్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. ఉపాధి హామీ పథకం, ఇతర శాఖల సమన్వయం కోసం డ్వామా పీడీ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సహకార శాఖ ద్వారా గిడ్డంగులు, పాఠశాలలకు అదనపు గదుల నిర్మాణం వటి పనులు చేపట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
ఆరోగ్య రక్షతో మేలు
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య రక్ష పథకం ద్వారా ప్రతి వ్యక్తి రూ.1,200 చెల్లిస్తే రూ. రెండు లక్షల మేర 1,044 వ్యాధులకు వైద్య సదుపాయాన్ని 410 నెట్‌వర్క్ ఆస్పత్రులలో పొందవచ్చన్నారు. ఽజాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జేసీ-2 జె.రాధాకృష్ణమూర్తి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ రాజేశ్వరరావు, పంచాయతీరాజ్ ఎస్‌ఈ వెంకటేశ్వరరావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సీఎస్‌ఎన్ మూర్తి, డీఆర్‌డీఏ పీడీ ఎస్.మల్లిబాబు, డ్వామా పీడీ ఎ.నాగేశ్వరరావు, సీపీఓ మోహన్‌రావు, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం.జ్యోతి పాల్గొన్నారు.
అనంతరం కలెక్టర్ చాంబర్‌లో హైటెక్ విజయరహస్యం జనరల్ నాలెడ్జ్-2017 వాల్యూమ్-1,2 పుస్తకాలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఽఏపీ ఓపెన్‌స్కూల్ ద్వారా 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఓపెన్ స్కూల్ సొసైటీ వారు ఈ పుస్తకాన్ని ఉచితంగా ఇస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అబ్రహం, జిల్లా సమన్వయకర్త కె.జగన్నాధరావు, ఎస్‌ఎస్‌ఏ పీఓ ఎం.శేషగిరి రావు, వేళంగి హెచ్‌ఎం బీవీ శివప్రసాద్ పాల్గొన్నారు.
Advertisement