స్పైస్‌జెట్‌ విమానంలో సమస్య: మధ్యలోనే వెనక్కి | SpiceJet Delhi Nashik flight returns midway due to autopilot snag | Sakshi
Sakshi News home page

SpiceJet: స్పైస్‌జెట్‌ విమానంలో సమస్య: మధ్యలోనే వెనక్కి

Published Thu, Sep 1 2022 11:08 AM | Last Updated on Thu, Sep 1 2022 11:10 AM

SpiceJet Delhi Nashik flight returns midway due to autopilot snag - Sakshi

న్యూఢిల్లీ: బడ్జెట్‌ ఎయిర్‌లైన్‌ స్పైస్‌జెట్‌కు చెందిన విమానంలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. ఢిల్లీ-నాసిక్ విమానం 'ఆటోపైలట్' సమస్య కారణంగా మధ్యలోనే వెనక్కి మళ్లించాల్సి వచ్చింది.  బోయింగ్ 737 స్పైస్‌జెట్‌ విమానంలో గురువారం ఉదయం సమస్య ఏర్పడింది. వెంటనే   స్పందించిన సిబ్బంది  విమానాన్ని తిరిగి  సురక్షితంగా ల్యాండ్  చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ అంశాన్ని డీజీసీఏ పరిశీలిస్తోంది.

ఢిల్లీ ఇందిరాగాంధీఅంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మహారాష్ట్రలోని నాసిక్‌కు బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం 'ఆటోపైలట్' సమస్య కారణంగా నగరానికి మధ్యలో తిరిగి వచ్చిందని డీజీసీఏ అధికారి తెలిపారు. కాగా అధిక ఇంధన ధరలు,రూపాయి క్షీణత మధ్య ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్ విమానాలు ఇబ్బందుల్లో పడిన ఘటనలు గతంలో కూడా  వరుసగా చోటు చేసుకన్నాయి. దీంతో  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమానయాన సంస్థకు షో-కాజ్ నోటీసు జారీచేయడం, ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ ఎనిమిది వారాల పాటు గరిష్టంగా 50శాతం  విమానాలను  మాత్రమే రన్‌ చేయాలని జూలై 27న ఆదేశించిన సంగతి తెలిసిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement