Autopilot
-
టెస్లా విజయం వెనుక ఇండియన్.. థాంక్స్ చెప్పిన మస్క్
గ్లోబల్ మార్కెట్లో అమెరికన్ కంపెనీ టెస్లా ఎంత ఎత్తుకు ఎదిగిందో అందరికి తెలుసు. అయితే ఆ సంస్థ నేడు ఈ స్థాయికి రావడానికి కారణమైన వారిలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఒకరు ఉన్నారని బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయనే 'అశోక్ ఎల్లుస్వామి'. ఈయనకు మస్క్ కృతజ్ఞతలు చెబుతూ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.టెక్ బిలియనీర్ అశోక్ ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) వేదికగా టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్'ను ప్రశంసించారు. కంపెనీలో ఏఐ / ఆటోపైలెట్ విభాగాలు అభివృద్ధి చెందడం వెనుక మస్క్ పాత్ర అనన్యసామాన్యమని అన్నారు. ప్రారంభంలో ఈ టెక్నాలజీ స్టార్ట్ చెయ్యాలనే ఆలోచనను మస్క్ చెప్పినప్పుడు.. అసలు అది సాధ్యమవుతుందా అని అందరు అనుకున్నారు. కానీ మస్క్ ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా.. టీమ్‌ను ముందుకు నడిపించారు.అనుకున్న విధంగా ముందుకు వెళుతూ 2014లో ఆటోపైలట్‌ను ఓ చిన్న కంప్యూటర్‌తో స్టార్ట్ చేసాము. అది కేవలం 384 KB మెమరీ మాత్రమే కలిగి ఉంది. ఆ తరువాత లేన్ కీపింగ్, లేన్ ఛేంజింగ్, లాంగిట్యూడినల్ కంట్రోల్ ఫర్ వెహికల్స్ వంటి వాటిని అమలు చేయాలని మస్క్ ఇంజనీరింగ్ టీమ్‌కు చెప్పారు. ఇది మాకు చాలా క్రేజీగా అనిపించింది. అయినా పట్టు వదలకుండా 2015లో టెస్లా ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోపైలట్ సిస్టమ్‌ను తీసుకువచ్చాము.https://t.co/yUqvdS7JOf— Ashok Elluswamy (@aelluswamy) June 9, 2024ఆటోఫైలెట్ కోసం ఇతరుల మీద ఆధారపడకుండా.. కంపెనీలోనే చేయడం ప్రారంభించాము. కేవలం పదకొండు నెలల్లోనే ఈ లక్ష్యాన్ని సాధించాం. ఇది టెస్లా బలమైన ఏఐ బృందం సాధించిన గొప్ప విజయం. మస్క్ కేవలం బలమైన ఏఐ సాఫ్ట్వేర్ కోసం మాత్రమే కాకుండా, శక్తివంతమైన AI హార్డ్‌వేర్ కోసం కూడా ప్రయత్నించారు. ఇందులో భాగంగానే న్యూరల్ నెట్‌వర్క్‌లను సమర్థవంతంగా అమలు చేయడానికి సిలికాన్‌ను తయారు చేసాము.మొత్తం మీద ఏఐలో టెస్లా విజయానికి మస్క్ కీలకమైన వ్యక్తి. ఇది ఆయనకు టెక్నాలజీ మీద ఉన్న అవగాహన, పట్టుదల వల్ల సాధ్యమైంది. గొప్ప గొప్ప టెక్నాలజీలను ఇతరులు చూడకముందే మస్క్ కనిపెడుతున్నారు. అదే టెస్లాను వాస్తవ ప్రపంచ AIలో అగ్రగామిగా నిలిపింది. రాబోయే రోజుల్లో ఫుల్లీ అటానమస్ కార్లు, హౌస్ హోల్డ్ రోబోట్స్ సర్వ సాధారణమైపోతాయని అశోక్ ఎల్లుస్వామి.. మస్క్‌ను గొప్పగా ప్రశంసించారు.థాంక్యూ అశోక్ అని ప్రారంభించి.. అశోక్ టెస్లా ఆటోపైలట్ బృందంలో చేరిన మొదటి వ్యక్తి. నేడు ఆటోపైలట్ సాఫ్ట్వేర్లకు నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారు. అతడు.. మా అద్భుతమైన టీమ్ లేకుండా మేము విజయాలను సాధించి ఉండేవారము కాదేమో.. అంటూ ఎల్లుస్వామి ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు.Thanks Ashok! Ashok was the first person to join the Tesla AI/Autopilot team and ultimately rose to lead all AI/Autopilot software. Without him and our awesome team, we would just be another car company looking for an autonomy supplier that doesn’t exist. Btw, I never… https://t.co/7eBfzu0Nci— Elon Musk (@elonmusk) June 9, 2024 -
స్పైస్‌జెట్ విమానంలో సమస్య: మధ్యలోనే వెనక్కి
న్యూఢిల్లీ: బడ్జెట్ ఎయిర్‌లైన్ స్పైస్‌జెట్‌కు చెందిన విమానంలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. ఢిల్లీ-నాసిక్ విమానం 'ఆటోపైలట్' సమస్య కారణంగా మధ్యలోనే వెనక్కి మళ్లించాల్సి వచ్చింది. బోయింగ్ 737 స్పైస్‌జెట్ విమానంలో గురువారం ఉదయం సమస్య ఏర్పడింది. వెంటనే స్పందించిన సిబ్బంది విమానాన్ని తిరిగి సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ అంశాన్ని డీజీసీఏ పరిశీలిస్తోంది. ఢిల్లీ ఇందిరాగాంధీఅంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మహారాష్ట్రలోని నాసిక్‌కు బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం 'ఆటోపైలట్' సమస్య కారణంగా నగరానికి మధ్యలో తిరిగి వచ్చిందని డీజీసీఏ అధికారి తెలిపారు. కాగా అధిక ఇంధన ధరలు,రూపాయి క్షీణత మధ్య ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్ విమానాలు ఇబ్బందుల్లో పడిన ఘటనలు గతంలో కూడా వరుసగా చోటు చేసుకన్నాయి. దీంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమానయాన సంస్థకు షో-కాజ్ నోటీసు జారీచేయడం, ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ ఎనిమిది వారాల పాటు గరిష్టంగా 50శాతం విమానాలను మాత్రమే రన్ చేయాలని జూలై 27న ఆదేశించిన సంగతి తెలిసిందే. -
స్కిల్స్ లేనోళ్లు మాకెందుకు..వందల మంది టెస్లా ఉద్యోగుల తొలగింపు!
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికిల్ దిగ్గజం టెస్లా సంస్థ ఉద్యోగులు తొలగింపు కొనసాగుతుంది. తక్కువ జీతం, తక్కువ స్కిల్ ఉన్న 229 మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించినట్లు టెస్లా సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కాలిఫోర్నియాలోని టెస్లా ఆఫీస్ సెయింట్ మాథ్యూలో టెస్లా కారు ఆటో పైలెట్ విభాగంలో మొత్తం 276మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే తాజాగా 276మందిలో 229 మంది ఉద్యోగులకు స్కిల్స్ లేవంటూ టెస్లా వారిని ఇంటికి పంపించేసింది. మిగిలిన 47మంది ఉద్యోగుల్ని టెస్లా బఫెల్లో ఆటోపైలెట్ విభాగానికి షిఫ్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది స్కిల్స్ లేనోళ్లతో మాకేం పని ఉద్యోగుల తొలగింపు నేపథ్యంలో టెస్లా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డైరెక్టర్ ఆండ్రెజ్ కర్పతి స్పందించారు. తొలగించిన ఆటోపైలెట్ ఉద్యోగులకు ఏం వర్క్ చేస్తున్నాం. ఏం వర్క్ చేయబోతున్నామనే విషయంలో స్పష్టత లేదు. అయితే లాంగ్ టర్మ్ విజన్ ఉండేందుకు ఏఐ మీద ఎక్కువ టైం స్పెండ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామంటూ ఉద్యోగుల్ని ఎందుకు తొలగించారనే అంశంపై దాటవేత ధోరణిలో మాట్లాడారు. ఇదో వ్యూహం ఇటీవల కతర్ ఎకనమిక్ ఫోరంలో టెస్లా సీఈవో ఎలన్ మస్క్ రానున్న 3 నెలల్లో టెస్లాకు చెందిన 10శాతం మంది ఉద్యోగులపై కోత విధిస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా టెస్లాలో ఉద్యోగులకు చెల్లించే జీతభత్యాలు 3.5శాతం తగ్గిపోనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా అందుకు ఊతం ఇచ్చేలా టెస్లా ఉద్యోగుల తొలగింపు అనివార్యమైంది. -
ఎలాన్ మెచ్చిన మన ఎల్లుస్వామి
ఏ వ్యాపారికైనా లాభం ముఖ్యం. అమెరికన్ ఎలక్ట్రానిక్ వెహికిల్ అండ్ క్లీన్ఎనర్జీ కంపెనీ ‘టెస్లా’ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌కు లాభాలు అనేవి తరువాత విషయం. రకరకాలుగా జల్లెడ పట్టి చురుకైన, చురకత్తుల్లాంటి, తెలివైన ఉద్యోగులను ఎంపిక చేసుకోవడం అతడి తిరుగులేని విజయసూత్రం. తన ప్రతిష్ఠాత్మకమైన ‘ఆటోపైలట్’ హెడ్‌గా భారతసంతతికి చెందిన అశోక్ ఎల్లుస్వామిని ఎంపిక చేసుకోవడమే దీనికి నిదర్శనం.... ‘టెస్లా’ వ్యవస్థాపకుడు, సీయివో ఎలాన్ మస్క్ రూట్ ఎప్పుడూ సెపరేటే. ఎలాన్ తన కంపెనీ ఆదాయాన్ని రిసెర్చ్, డెవలప్మెంట్ మీదే ఎక్కువ ఖర్చు చేస్తుంటాడు. నష్టాలు వచ్చినా పట్టించుకోలేదు. ఎలక్ట్రానిక్ కార్ల నుంచి సోలార్ టైల్స్ వరకు తయారుచేసే ‘టెస్లా’ తమ ఉత్పత్తులకు సంబంధించి అదరగొట్టే భారీ ప్రచార ఆర్భాటం అంటూ ప్రత్యేకంగా చేయదు. ‘నీలో టాలెంట్ ఉంటే భారీ ప్రచారం అక్కర్లేదు. నీ కంపెనికి నువ్వే పెద్ద బ్రాండ్ అంబాసిడర్’ అనే తన నమ్మకాన్ని తానే నిజం చేసి చూపించాడు ఎలాన్ మస్క్. అడ్వాన్స్డ్ డ్రైవర్–అసిస్టెన్స్ సిస్టమ్స్(ఏడీఏస్) ‘టెస్లాఆటోపైలట్’లో లేన్ సెంటరింగ్, ట్రాఫిక్ అవేర్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమెటిక్ లేన్ చేంజెస్, సెల్ఫ్పార్కింగ్....మొదలైన ప్రత్యేకఫీచర్లు ఉన్నాయి. ‘ఆటోపైలట్’ బృందం కోసం ఎప్పటి నుంచో వెదుకుతున్నాడు ఎలాన్ మస్క్. ఇందుకు సంప్రదాయ నిబంధనలను కూడా పక్కన పెడుతున్నాడు. ‘మీరు ప్రతిష్ఠాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో చదువుకోనక్కర్లేదు’ ‘ఏఐలో మీకు తిరుగులేని టాలెంట్ ఉంటే, కాలేజీ డిగ్రీ కాదు కదా హైస్కూలు డిగ్రీ కూడా అక్కర్లేదు’...అని అంటాడు. ఒకవైపు ప్రతిభావంతుల కోసం సోషల్ మీడియా వేదికగా వెదుకుతానే, మరోవైపు తన అమ్ముల పొదిలో పదునైన బాణం అశోక్ ఎల్లుస్వామికి కీలకమైన బాధ్యతలు అప్పగించాడు. భారతసంతతికి చెందిన అశోక్ ‘ఆటోపైలట్’ బృందంలో తొలి ఉద్యోగిగా నియామకం అయ్యాడు. ఆటోపైలట్ బృందానికి అశోక్ నాయకత్వం వహించనున్నాడు. చెన్నైలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన అశోక్ ఎల్లుస్వామి కార్నెగి మెలన్ యూనివర్శిటీలో(యూఎస్)లో రోబోటిక్స్ మాస్టర్ డెవలప్మెంట్లో మాస్టర్ డిగ్రీ చేశాడు. 2014లో ‘టెస్లా’లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ప్రవేశించాడు. ఆ తరువాత సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సీనియర్ స్టాఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ప్రమోషన్ పొందాడు. 2019లో డైరెక్టర్ ఆఫ్ ది ఆటోపైలట్ సాఫ్ట్‌వేర్‌గా నియామకం అయ్యాడు. ‘టెస్లా’కు ముందు వోక్స్ వేగన్ ఎలక్ట్రానిక్ రిసెర్చ్ల్యాబ్లో కొన్ని నెలల పాటు పనిచేశాడు. ‘అశోక్ అద్భుతమైన విద్యార్థి. విభిన్న విషయాలపై ఆసక్తి, వాటి గురించి తెలుసుకొని పట్టు సాధించాలనే పట్టుదల ఉన్న తెలివైన కుర్రాడు’ అంటున్నాడు అశోక్‌కు పాఠాలు చెప్పిన ప్రొఫెసర్ జోన్ డెలన్. ఇప్పుడు అశోక్ ముందు రకరకాల సవాళ్లు ఉన్నాయి. సవాలును సవాలు చేసి సక్సెస్ సాధించడం అనేది ఈ టెక్ మాంత్రికుడికి కంప్యూటర్‌తో పెట్టిన విద్య! -
టెస్లా ఆటో పైలెట్ టీమ్‌కి ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తి!
Elon Musk Said 1st Indian-Origin Employee On Teslas Autopilot Team: ప్రముఖ దిగ్గజ టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు సీఈవో ఎలన్ మస్క్ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే భారత సంతతి వ్యక్తి అయిన అశోక్ ఎల్లుస్వామిని తన ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీకి సంబంధించిన ఆటోపైలట్ టీమ్‌లో నియమించుకున్నట్లు ట్విట్టర్లో వెల్లడించారు. అంతేకాదు ఆటో పైలెట్ టీమ్‌ను ప్రారంబిస్తున్నానని, పైగా టీమ్‌లో నియమించబడిని తొలి భారతసంతతి వ్యక్తి అశోక్ అని కూడా తెలిపారు. (చదవండి: ఫుడ్ కంటైనర్‌లో స్పై కెమెరా!) ఈ మేరకు అశోక్ ఆటోపైలట్ ఇంజనీరింగ్ హెడ్‌గా పనిచేయనున్నట్లు మస్క్ చెప్పారు. పైగా టెస్లా ఆటోపైలెట్ బృందంలో చాలా ప్రతిభావంతులు ఉంటారని వాళ్లు ప్రపంచంలోనే తెలివైన వ్యక్తుల్లో కొందరని అన్నారు. అంతేకాదు అశోక్‌ని ఇంటర్వ్యూ చేసిన వీడియోని కూడా మస్క్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇటీవలే టెస్లా ప్రజల జీవితాలను ప్రభావితం చేసే సమస్యలను నేరుగా పరిష్కరించడంలో శ్రద్ధ వహించే హార్డ్‌కోర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇంజనీర్ల కోసం వెతుకుతున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే అశోక్ ఎల్లుస్వామి వోక్స్వ్యాగన్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ ల్యాబ్‌కి సంబంధించిన డబ్ల్యూబీఏసీఓ వెహికల్ కంట్రోల్ సిస్టమ్‌లో పనిచేశారు. ఆయన చెన్నైలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ గిండీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని , కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం నుండి రోబోటిక్స్ సిస్టమ్ డెవలప్మెంట్లో మాస్టర్స్ డిగ్రీని చేశారు. (చదవండి: ఫుల్‌గా తాగి సెక్యూరిటీ గార్డ్‌తో గొడవపడిన మహిళ) Elon on Teslas Autopilot team: Ashok is actually the head of Autopilot engineering. Andrej is director of AI; People often give me too much credit & give Andrej too much credit. The Tesla Autopilot AI team is extremely talented. Some of the smartest people in the world. @elonmusk pic.twitter.com/a6vJ64aphG — Sawyer Merritt (@SawyerMerritt) December 29, 2021 -
వీజీగా వేపేస్తుంది...
వేపుడు వంటకాలను వీజీగా చేసుకోవడానికి వీలుంటే బాగుండునని చాలామంది అనుకునే ఉంటారు. అలాంటి వారి కోసమే అందుబాటులోకి వచ్చింది ఈ ఇంటెలిజెంట్ మూకుడు. అందుకే దీనికి ‘పాంటెలిజెంట్’ అనే పేరు పెట్టారు. చూడటానికి సాదా సీదాగానే కనిపిస్తుంది గాని, ఇది చాలా స్మార్ట్ గురూ! అనకుండా ఉండలేరు. ఇండక్షన్ స్టవ్ మీదైనా, గ్యాస్ స్టవ్ మీదైనా... దేని మీదైనా దీంతో కోరుకున్న వేపుళ్లను టేస్టీ టేస్టీగా వేయించేసుకోవచ్చు. ఇది స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. ఈ మూకుడులోని టెంపరేచర్ సెన్సర్లు ఎప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా ఉష్ణోగ్రత వివరాలను అందిస్తూ ఉంటాయి. దాని బట్టి మూకుడులోని వంటకాన్ని ఎప్పుడు తిరగేయాలో, కలపాలో నిర్ణయించుకోవచ్చు. అలాగే, ఎప్పుడు వేడిని పెంచాలో, తగ్గించాలో కూడా నిర్ణయించుకోవచ్చు. ఇదంతా తలనొప్పి వ్యవహారంలా అనిపిస్తే, ఇందులోని ‘ఆటోపైలట్’ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. అప్పుడు ఈ మూకుడు తనకు కావలసిన వేడిని తనే అడ్జస్ట్ చేసుకుంటుంది. ఏమాత్రం తేడా లేకుండా టేస్టీ టేస్టీగా వేడివేడి వేపుడును వడ్డనకు సిద్ధం చేసి పెడుతుంది.