Elon Musk Said 1st Indian-Origin Employee On Teslas Autopilot Team: ప్రముఖ దిగ్గజ టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు సీఈవో ఎలన్ మస్క్ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే భారత సంతతి వ్యక్తి అయిన అశోక్ ఎల్లుస్వామిని తన ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీకి సంబంధించిన ఆటోపైలట్ టీమ్‌లో నియమించుకున్నట్లు ట్విట్టర్‌లో వెల్లడించారు. అంతేకాదు ఆటో పైలెట్ టీమ్‌ను ప్రారంబిస్తున్నానని, పైగా టీమ్‌లో నియమించబడిని తొలి భారతసంతతి వ్యక్తి అశోక్ అని కూడా తెలిపారు.
(చదవండి: ఫుడ్ కంటైనర్‌లో స్పై కెమెరా!)
ఈ మేరకు అశోక్ ఆటోపైలట్ ఇంజనీరింగ్ హెడ్‌గా పనిచేయనున్నట్లు మస్క్ చెప్పారు. పైగా టెస్లా ఆటోపైలెట్ బృందంలో చాలా ప్రతిభావంతులు ఉంటారని వాళ్లు ప్రపంచంలోనే తెలివైన వ్యక్తుల్లో కొందరని అన్నారు. అంతేకాదు అశోక్‌ని ఇంటర్వ్యూ చేసిన వీడియోని కూడా మస్క్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇటీవలే టెస్లా ప్రజల జీవితాలను ప్రభావితం చేసే సమస్యలను నేరుగా పరిష్కరించడంలో శ్రద్ధ వహించే హార్డ్‌కోర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇంజనీర్ల కోసం వెతుకుతున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
అయితే అశోక్ ఎల్లుస్వామి వోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ ల్యాబ్‌కి సంబంధించిన డబ్ల్యూబీఏసీఓ వెహికల్ కంట్రోల్ సిస్టమ్‌లో పనిచేశారు. ఆయన చెన్నైలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ గిండీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని , కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం నుండి రోబోటిక్స్ సిస్టమ్ డెవలప్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీని చేశారు.
(చదవండి: ఫుల్‌గా తాగి సెక్యూరిటీ గార్డ్‌తో గొడవపడిన మహిళ)
Elon on Teslas Autopilot team: Ashok is actually the head of Autopilot engineering. Andrej is director of AI; People often give me too much credit & give Andrej too much credit. The Tesla Autopilot AI team is extremely talented. Some of the smartest people in the world. @elonmusk pic.twitter.com/a6vJ64aphG
— Sawyer Merritt (@SawyerMerritt) December 29, 2021
Comments
Please login to add a commentAdd a comment