ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఫైలింగ్ విధానంలో ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనూ నిర్వహించుకోవచ్చని భాష సమస్య ఆన్‌లైన్‌లో ఉత్పన్నం కాదని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం జిల్లా అధికారుల కోఆర్డినేషన్ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.
ఆన్‌లైన్‌లో భాష సమస్య ఉత్పన్నం కాదు
Published Mon, Oct 3 2016 10:18 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
ఏలూరు (మెట్రో) : ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఫైలింగ్ విధానంలో ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనూ నిర్వహించుకోవచ్చని భాష సమస్య ఆన్‌లైన్‌లో ఉత్పన్నం కాదని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం జిల్లా అధికారుల కోఆర్డినేషన్ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లాస్థాయి అధికారి వరకూ ప్రతిఫైలూ ఆన్‌లైన్‌లోనే పొందుపరచాలని, అయితే దిగువ స్థాయిలో ఇంగ్లిష్‌లో పట్టులేక ఫైల్‌ను ఆన్‌లైన్‌లో పొందుపరచక నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. జిల్లాలో రెండేళ్ల నుంచి ఒత్తిడి తెచ్చిన ఫలితంగా ఆన్‌లైన్‌లో ఫైల్స్ పొందు పరిచే ప్రక్రియ వేగవంతమైందన్నారు. ప్రజలకు సత్వరమే పనులు జరిగేందుకు ఆన్‌లైన్ విధానం ఎంతో దోహదపడుతుందని అవినీతిని కూడా కొంతవరకూ నిరోధించగలుగుతున్నామన్నారు. పాఠశాల విద్యస్థాయిలో టీచర్లకు బయోమెట్రిక్ విధానాన్ని పటిష్టవంతంగా అమలు చేయాలని కలెక్టర్ చెప్పారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో 382 మంది సిబ్బందికి 298 మంది సిబ్బంది మాత్రమే బయోమెట్రిక్ హాజరు వేస్తున్నారని మిగిలిన 84 మంది ఎందుకు బయోమెట్రిక్ వేయడం లేదని డీసీహెచ్‌ఎస్ శంకరరావును ప్రశ్నించారు. జేసీ పులిపాటి కోటేశ్వరరావు, ఏజేసీ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement