Whatsapp Missing Media File Problem Solve Process In Telugu: వాట్సాప్‌ యాప్‌లో మీడియా కనిపించాలంటే... - Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో కొత్త సమస్య..! పరిష్కరించండి ఇలా...

Published Sat, Apr 24 2021 4:20 PM | Last Updated on Sun, Apr 25 2021 3:19 PM

Missing Media Problem On Whatsapp For Android - Sakshi

వాట్సాప్‌ మన జీవితంలో ఒక భాగమైపోయింది. మనలో చాలా మంది తెల్లవారగానే ముందుగా డేటా ఆన్‌ చేసి వాట్సాప్‌లో ఏమైనా మెసేజ్‌లు వచ్చాయే లేదో చూసుకుంటాం. నేటి టెక్నాలజీ యుగంలో అప్పుడప్పుడు వాట్సాప్‌ లేదా ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ సర్వర్లు డౌన్‌ అవుతూంటాయి. దీనితో కాస్త ఇబ్బందికి గురవుతుంటాం. ప్రస్తుతం వాట్సాప్‌లో కొత్త సమస్య వచ్చి పడింది. అదేంటంటే వాట్సాప్‌ కొత్త వినియోగాదారులకు మిస్సింగ్‌ మీడియా ప్రాబ్లమ్‌ వస్తోంది. వినియోగదారులు వారి వాట్సాప్‌ యాప్‌లో మీడియాను చూసుకోలేక పోతున్నారు. ఈ సమస్య కొన్ని ఆండ్రాయిడ్‌ ఫోన్లల్లో కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో వాట్సాప్‌ ఆప్‌డేట్‌ చేసిన వారు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య  వాట్సాప్‌ వర్షన్‌ 2.21.9.3 వాడుతున్న వినియోగదారులను ప్రభావితం చేసింది.

తాజా వెర్షన్‌లోని కొంతమంది వినియోగదారులు కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నారు. వాట్సాప్‌ ఈ సమస్యను గుర్తించినప్పటీకి, సమస్యకు ఇంకా పరిష్కారం చూపలేదు. మీ మీడియా కంటెంట్‌ను తిరిగి తీసుకురావడానికి సరళమైన ప్రత్యామ్నాయం ఉంది. కొంత మంది వాట్సాప్‌ వినియోగదారులు ఈ సమస్యకు గురయ్యారని వాట్సాప్‌ బేటా ట్రాకర్‌ డబ్ల్యూఏబేటాఇన్ఫో తెలిపింది. ఈ మీడియాను మొబైల్‌ ఫోన్‌లో పొందినప్పటికి కింద సూచించిన విధంగా చేస్తే ఏకంగా మీడియాను మీ వాట్సాప్‌ యాప్‌లో చూసుకోవచ్చును. 

వాట్సాప్‌ యాప్‌లో మీడియా కనిపించాలంటే...
►ముందుగా మీ ఫోన్‌లో వాట్సాప్‌ను క్లోజ్‌ చేసి క్యాచీ డేటాను క్లియర్‌ చేయాలి ఇక్కడ యాప్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో నడవకుండా చూసుకోవాలి.

►తరువాత మీ ఫోన్‌లో ఫైల్‌ మెనేజర్‌లో ఉన్న వాట్సాప్‌లోని మీడియా ఫోల్ఢర్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి.

►ఇప్పుడు మీడియా ఫోల్డర్‌లోని కంటెంట్‌ను ఆండ్రాయిడ్‌ ఫోల్డర్‌లోని మీడియా ఫోల్డర్‌లో కామ్‌.వాట్సాప్‌లో ఉన్న వాట్సాప్‌లోని మీడియా ఫోల్డర్‌లోకి మూవ్‌ చేయాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కేవలం వాట్సాప్‌ ఫోల్డర్‌లోని మీడియా ఫోల్డర్‌ మాత్రమే మూవ్‌ చేయాలి.

►మీడియా కంటెంట్‌ పూర్తిగా మూవ్‌ అయ్యే వరకు నిరిక్షించాలి. ఈ స్టెప్స్‌ పూర్తి చేశాక మీడియా మిస్సింగ్‌ అనే బాధ ఉండదు.  మీ వాట్సాప్‌ యాప్‌లో  మీడియాను మీ కళ్లముందు ఉంటుంది.

ఒకవేళ ఈ సమస్య ఉన్నవారు పై స్టెప్స్‌నుపయోగించి మాన్యువల్‌ గా చేయాలని ఉద్ధేశ్యం లేకపోతే వాట్సాప్‌ యాప్‌ను ఆప్‌డేట్‌ చేసేదాక వేచి ఉండండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement