ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్ల యూజర్లు వాట్సాప్ సొంతం. వాట్సాప్‌తో ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వాట్సాప్ యాప్‌లో మనందరికీ గ్రూప్‌లు ఉండే ఉంటాయి. ఫ్యామిలీ గ్రూప్, స్కూల్ ఫ్రేండ్స్ గ్రూప్స్, ఆఫీస్ కోలిగ్స్ గ్రూప్ ఇలా..ఎన్నో..మనకు తెలిసిన వాళ్లతో గ్రూప్‌ను క్రియేట్ చేసి మన అభిప్రాయాలను ఆయా సభ్యులతో పంచుకుంటాం.
వాట్సాప్ గ్రూప్‌లో మనకు తెలిసిన వాళ్లు యాడ్ చేస్తే పెద్ద సమస్య లేదు కానీ...మనకు తెలియకుండా వేరే ఇతర వాట్సాప్ గ్రూప్‌ల్లో యాడ్ చేస్తే కాస్త ఇబ్బంది కల్గుతుంది. మనలో కొంతమంది ఈ సమస్యను ఎదుర్కొన్నవాళ్లమే..! కొన్ని సార్లు వాట్సాప్ గ్రూప్‌లో వచ్చే మెసేజ్‌లతో అప్పుడప్పుడు మనలో చాలా మందికి విసుగు వస్తుంది. కాగా వాట్సాప్‌లోని ఒక చిన్న ట్రిక్‌తో తెలియని వాట్సాప్ గ్రూప్‌ల బెడద నుంచి తప్పించుకోవచ్చును. వాట్సాప్ గ్రూప్‌ల్లో ఎవరు మిమ్మల్ని యాడ్ చేయాలనే విషయాన్ని నిర్ణయించవచ్చును.
వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయకుండా ఉండటం కోసం ఇలా చేయండి..!
- మీ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయండి. స్క్రీన్ కుడి ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయండి.
- తరువాత ‘సెట్టింగ్’ పై క్లిక్ చేయండి. తరువాత ‘అకౌంట్’ ఆప్షన్‌ను ఎంచుకోండి.
- అకౌంట్‌పై క్లిక్ చేసిన తరువాత ‘ప్రైవసీ’ అప్షన్‌పై క్లిక్ చేయండి. కొద్దిగా స్క్రీన్‌ను పైకి స్క్రోల్ చేసి ‘గ్రూప్స్’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.
- ఇక్కడ మీకు మూడు రకాల ఆప్షన్‌లు కనిపిస్తాయి.
1. ఎవ్రీవన్, 2. మై కాంటాక్ట్స్, 3. మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అనే ఆప్షన్‌లు ఉంటాయి. ఎప్పుడు డిఫాల్ట్‌గా ‘ఎవ్రీవన్’ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్‌లతో ఎవరు మిమ్మల్ని ఇతర వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసే విషయాన్ని నిర్ణయించవచ్చును.
- ఎవ్రీవన్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుంటే ఈ ఆప్షన్ ద్వారా మిమ్మల్ని ఆయా వాట్సాప్ గ్రూప్‌లో ఏవరైనా యాడ్ చేయవచ్చును
- మై కాంటాక్ట్స్ ఆప్షన్‌తో మీ కాంటాక్ట్ లిస్ట్‌లో మీరు సేవ్ చేసిన నంబర్లకు మాత్రమే ఇతర వాట్సాప్ గ్రూపుల్లో చేర్చడానికి యూజర్లను అనుమతిస్తుంది.
- మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ ఆప్షన్ ద్వారా సదరు వ్యక్తులు మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయకుండా చేయవచ్చును. మిమ్మల్ని ఎవరు ఇతర గ్రూప్‌ల్లో యాడ్ చేసే వారిని మీరు ఎంచుకోవచ్చును.
మీకు నచ్చిన విధంగా సెట్టింగ్‌లను ఎంచుకోని సేవ్ చేస్తే చేయాలి. మిమ్మల్ని ఎవరు వేరే వాట్సాప్ గ్రూప్‌ల్లో యాడ్ చేయలేరు.
Comments
Please login to add a commentAdd a comment