Settings
-
మీ పాత ఫోన్లో పర్సనల్ డేటా ఎలా డిలీట్ చేయాలంటే?
మీరు కొత్త స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీ పాత ఫోన్ విషయంలో తస్మాత్ జాగ్రత్త. పాత ఫోన్ అమ్మేసే సమయంలో అందులో ఉండే వ్యక్తిగత డేటాను మీరు కాపీ చేసుకొని భద్రపరుచుకుంటే ఫర్వాలేదు. లేదంటే పర్సనల్ డేటా లీకయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే పాత ఫోన్లో ఉన్న డేటాను డిలీట్ చేయడం, లేదంటే కాపీ చేయడం చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాతే ఆ డేటాను రీసెట్ చేయాలి. అలా చేస్తేనే పాత ఫోన్లో డేటా అంతా డిలీట్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఫోన్‌ను ఎలా రీసెట్ చేయాలో తెలుసుకుందాం. ఫోన్‌ను ఎలా రీసెట్ చేయాలంటే స్టెప్ 1: ముందుగా ఫోన్ సెట్టింగ్‌లోకి వెళ్లి సిస్టం అనే అప్షన్‌పై ట్యాప్ చేయాలి స్టెప్2: సిస్టం ఆప్షన్ పై ట్యాప్ చేస్తే రీసెట్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది స్టెప్3: అందులో మీకు ఎరేజ్ ఆల్ డేటా, లేదంటే (ఫ్యాక్టరీ రీసెట్) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. స్టెప్4: డిలీట్ అవుతున్న డేటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చదివి, ఎరేజ్ ఆల్ డేటాను క్లిక్ చేయాలి. స్టెప్5: కన్ఫర్మేషన్ కోసం స్క్రీన్‌పై పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. స్టెప్6: అనంతరం స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎరేజ్ ఆల్ డేటాపై క్లిక్ చేస్తే.. ఆ డేటా మొత్తం డిలీట్ అవుతుంది. -
వాట్సాప్ గ్రూప్స్‌తో విసుగుచెందారా..! అయితే ఇది మీ కోసమే..!
ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్ల యూజర్లు వాట్సాప్ సొంతం. వాట్సాప్‌తో ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వాట్సాప్ యాప్‌లో మనందరికీ గ్రూప్‌లు ఉండే ఉంటాయి. ఫ్యామిలీ గ్రూప్, స్కూల్ ఫ్రేండ్స్ గ్రూప్స్, ఆఫీస్ కోలిగ్స్ గ్రూప్ ఇలా..ఎన్నో..మనకు తెలిసిన వాళ్లతో గ్రూప్‌ను క్రియేట్ చేసి మన అభిప్రాయాలను ఆయా సభ్యులతో పంచుకుంటాం. వాట్సాప్ గ్రూప్‌లో మనకు తెలిసిన వాళ్లు యాడ్ చేస్తే పెద్ద సమస్య లేదు కానీ...మనకు తెలియకుండా వేరే ఇతర వాట్సాప్ గ్రూప్‌ల్లో యాడ్ చేస్తే కాస్త ఇబ్బంది కల్గుతుంది. మనలో కొంతమంది ఈ సమస్యను ఎదుర్కొన్నవాళ్లమే..! కొన్ని సార్లు వాట్సాప్ గ్రూప్‌లో వచ్చే మెసేజ్‌లతో అప్పుడప్పుడు మనలో చాలా మందికి విసుగు వస్తుంది. కాగా వాట్సాప్‌లోని ఒక చిన్న ట్రిక్‌తో తెలియని వాట్సాప్ గ్రూప్‌ల బెడద నుంచి తప్పించుకోవచ్చును. వాట్సాప్ గ్రూప్‌ల్లో ఎవరు మిమ్మల్ని యాడ్ చేయాలనే విషయాన్ని నిర్ణయించవచ్చును. వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయకుండా ఉండటం కోసం ఇలా చేయండి..! మీ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయండి. స్క్రీన్ కుడి ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయండి. తరువాత ‘సెట్టింగ్’ పై క్లిక్ చేయండి. తరువాత ‘అకౌంట్’ ఆప్షన్‌ను ఎంచుకోండి. అకౌంట్‌పై క్లిక్ చేసిన తరువాత ‘ప్రైవసీ’ అప్షన్‌పై క్లిక్ చేయండి. కొద్దిగా స్క్రీన్‌ను పైకి స్క్రోల్ చేసి ‘గ్రూప్స్’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు మూడు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. 1. ఎవ్రీవన్, 2. మై కాంటాక్ట్స్, 3. మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అనే ఆప్షన్లు ఉంటాయి. ఎప్పుడు డిఫాల్ట్‌గా ‘ఎవ్రీవన్’ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్లతో ఎవరు మిమ్మల్ని ఇతర వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసే విషయాన్ని నిర్ణయించవచ్చును. ఎవ్రీవన్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుంటే ఈ ఆప్షన్ ద్వారా మిమ్మల్ని ఆయా వాట్సాప్ గ్రూప్‌లో ఏవరైనా యాడ్ చేయవచ్చును మై కాంటాక్ట్స్ ఆప్షన్‌తో మీ కాంటాక్ట్ లిస్ట్‌లో మీరు సేవ్ చేసిన నంబర్లకు మాత్రమే ఇతర వాట్సాప్ గ్రూపుల్లో చేర్చడానికి యూజర్లను అనుమతిస్తుంది. మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ ఆప్షన్ ద్వారా సదరు వ్యక్తులు మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయకుండా చేయవచ్చును. మిమ్మల్ని ఎవరు ఇతర గ్రూప్‌ల్లో యాడ్ చేసే వారిని మీరు ఎంచుకోవచ్చును. మీకు నచ్చిన విధంగా సెట్టింగ్‌లను ఎంచుకోని సేవ్ చేస్తే చేయాలి. మిమ్మల్ని ఎవరు వేరే వాట్సాప్ గ్రూప్‌ల్లో యాడ్ చేయలేరు. -
మన లైక్ కౌంట్... ఇకపై సీక్రెట్
యువతకు, సామాజిక మాధ్యమాలపై కోట్లాది మందికి మోజు పెరగడానికి ఒక ప్రధాన కారణం లైక్స్. తాము పెట్టే పోస్టులు, చేసే షేరింగ్స్...ఇంకేవైనా సరే విశ్వవ్యాప్తంగా లైక్స్‌ను కొల్లగొట్టే అవకాశం ఉండడంతో పోటా పోటీగా సోషల్ వీరులు చెలరేగిపోతున్నారనేది తెలిసిందే. అదే సమయంలో లైక్స్ తగ్గడం, పెరగడం అనేవి అనేక రకాలుగా సమస్యలు సృష్టిస్తున్న సంగతీ తెలిసిందే. ఈనేపథ్యంలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పై ప్రతి ఒక్కరికీ తమకు వచ్చే లైక్ కౌంట్స్‌ను ఇతరులకు కనబడకుండా దాచుకునే అవకాశం అందిస్తున్నట్లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్రతినిధులు ప్రకటించారు. సాధారణ ప్రజలతో పాటుగా నిపుణుల నుంచి విన్నదాని ప్రకారం లైక్ కౌంట్స్ అనేవి కొంతమందికి ఏ మాత్రం ప్రయోజనం కలిగించడం లేదు, కొంతమందికి మాత్రం ఇది బాధను మిగులుస్తుంది. కొంతమంది ప్రజలు లైక్ కౌంట్స్‌ను ఏది ట్రెండింగ్‌లో ఉందనేది తెలుసుకోవడం కోసం వినియోగిస్తున్నారని తేలింది. అందుకే ఈ మార్పు చేర్పులను జత చేసినట్టు వెల్లడించారు. తాము జత చేసిన కొత్త టూల్స్ ద్వారా తమ డీఎంల నుంచి ప్రమాదకరమైన కంటెంట్‌ను యూజర్స్ ఫిల్టర్ చేసుకునేందుకు వీలు కలుగుతుందని, అలాగే ఫేస్బుక్ న్యూస్ ఫీడ్‌పై తాము ఏది చూస్తున్నాం, ఏది పంచుకుంటున్నామనే అంశాలపై నియంత్రణకు సాధ్యమవుతుందని వివరించారు. ఇప్పుడు యూజర్స్ మరింత ప్రైవసీని, సౌకర్యాలను కోరుకుంటున్నారనీ రాబోయే కొద్ది వారాలో ఈ కంట్రోల్స్ అన్నీ కూడా ఫేస్‌బుక్‌పై కనిపించనున్నాయనీ వీరు తెలిపారు. దాచుకోండి ఇలా... సొంత పోస్ట్‌లపై లైక్ కౌంట్స్‌ను దాచుకునే అవకాశం వల్ల ఇతరులు మన పోస్ట్‌లకు ఎన్ని లైక్‌లు వచ్చాయనేది ఏ మాత్రం తెలుసుకోలేరు. దాంతో ఎవరైనా సరే మన పోస్ట్‌లకు ఎన్ని లైక్‌లు వచ్చాయన్న అంశం పై దృష్టి సారించకుండా, మనం షేర్ చేసే ఫోటోలు, వీడియోలపై మాత్రం దృష్టి సారించవచ్చు. సెట్టింగ్స్‌పై న్యూ పోస్ట్స్ విభాగాన్ని సందర్శించడం ద్వారా ఇతరుల పోస్ట్‌లపై లైక్ కౌంట్స్‌ను సైతం మనం దాయవచ్చు మన ఫీడ్‌లోని అన్ని పోస్ట్‌లకూ ఇది వర్తిస్తుంది. ఓ పోస్ట్‌ను షేర్ చేసే ముందే లైక్ కౌంట్స్‌ను హైడ్ చేసుకోవచ్చు.. అంతేకాదు ఈ సెట్టింగ్‌ను ఒక వేళ పోస్ట్ లైవ్‌లోకి వెళ్లిపోయినప్పుడు సైతం ఆప్షన్ ఆఫ్ చేయవచ్చు. ఇలాంటి అనేక మార్పులతో సోషల్ మీడియా మరింత కొత్తదనాన్ని సంతరించుకోనుంది. చదవండి: ట్విటర్‌పై కేంద్రం ఆగ్రహం -
సినిమా కోసం కదలి వచ్చిన ఊళ్లు
మారేడుమిల్లి అటవీ ప్రాంతం భాగ్యనగరానికి వచ్చింది. నేను కూడా అంటూ ఇటలీ వచ్చేసింది. నేనూ వస్తా అంటూ అమెరికా వచ్చింది. నేను సైతం అంటూ కోల్కత్తా తరలి వచ్చింది. ఊరికి దూరంగా ఉండే అడవి ఊళ్లో ప్రత్యక్షమైంది. ఏలూరు.. ఆ ఊరు.. ఈ ఊరు.. మదనపల్లి.. ఆ పల్లి.. ఈ పల్లి.. అన్నీ హైదరాబాద్ వచ్చేశాయి. కరోనా వల్ల వలస కార్మికులు ఊళ్లు చేరితే.. సినిమా కోసం ఊళ్లు హైదరాబాద్‌కి కదలి వచ్చాయి.. ‘కదలి వచ్చిన ఊళ్లు’... కరోనా పరిస్థితుల్లో ప్రయాణాలు తగ్గించాలని ‘సెట్స్’ సెట్ చేస్తున్నారు. చిరంజీవి ‘ఆచార్య’లో ఓ పురాతన ఆలయం ఉంటుంది. ఏదైనా ఊళ్లో పురాతన ఆలయం ఉంటే అక్కడికి వెళ్లి చిత్రీకరించాలన్నది ప్లాన్. అయితే తర్వాత ఆ ఆలయం సెట్‌ని హైదరాబాద్‌లో వేశారు. ఈ సినిమాలో ‘ధర్మస్థలి’ అనే ఊరు ఉంటుంది. ఈ ఊళ్లోనే గుడి కూడా ఉంటుంది. 16 ఎకరాల విస్తీర్ణంలో 20 కోట్ల బడ్జెట్‌తో వేసిన ఈ భారీ సెట్ ‘ఆచార్య’కి ఓ హైలైట్. ఇక హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోకి వెళితే తమిళనాడుకి చెందిన ఓ ఊరు కనబడుతుంది. ఆ ఊరికి పెద్దన్న ఉంటారు. ఆయనే రజనీకాంత్. సినిమా పేరు ‘అన్నాత్తే’. అంటే.. పెద్దన్నయ్య అని అర్థం. ఈ చిత్రం కోసం తమిళనాడు ఊరి సెట్ వేశారు. ఆ ఊరెళ్లి చిత్రీకరణ అంటే కష్టమే అని, సెట్ వేశారు. ప్రస్తుతం ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారు రజనీ. మన దేశానికి చెందిన ఊళ్ల సెట్లే కాదు.. ప్రభాస్ ‘రాధేశ్యామ్’ కోసం ఇటలీ ఇక్కడికి వచ్చేసింది. ఈ సినిమా యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. లాక్‌డౌన్‌కి ముందు, ఆ తర్వాత యూనిట్ అక్కడికెళ్లి షూటింగ్ చేసింది. మళ్లీ ప్రయాణం ప్లాన్ చేయకుండా ఇటలీ సెట్‌ని ఇక్కడ వేశారు. 1970ల కాలంలో సాగే పీరియాడిక్ లవ్‌స్టోరీ ఇది. పైగా ప్రపంచంలో ‘కళాత్మకం’గా ఉండే దేశం యూరప్. దాన్ని మ్యాచ్ చేసేలా చిత్ర ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ రెడ్డి యూరప్‌కి సంబంధించిన హౌస్ ఇంటీరియర్ సెట్‌ని ఇక్కడ వేశారు. విదేశాలు, దేశీ ఊళ్లు, పల్లెలే కాదు అడవి కూడా నగరానికి వచ్చింది. అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. రాజమండ్రి సమీపంలో గల మారేడుమిల్లి ఫారెస్ట్‌లో ఎక్కువ శాతం చిత్రీకరణ ప్లాన్ చేసుకున్నారు. కరోనా లాక్డౌన్ తర్వాత యూనిట్ అక్కడికెళ్లింది. అయితే నలుగురికి కరోనా రావడంతో తిరిగొచ్చేశారు. ఇప్పుడు కొంత భాగం అడవి సెట్‌ని ఇక్కడ వేసి, షూటింగ్ జరిపి, కొంచెం పరిస్థితులు చక్కబడ్డాక మారేడుమిల్లి వెళ్లాలనుకుంటున్నారు. మరోవైపు కోల్‌కత్తాని భాగ్యనగరానికి తెచ్చారు. ‘నాని’ నటిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ కథానుసారం ఎక్కువ శాతం కోల్‌కత్తాలో షూట్ చేయాలి. కోల్కత్తా ప్రాధాన్యం ఉన్న కథ కాబట్టి, ఎక్కువ రోజులు అక్కడ చిత్రీకరణ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం అవుతుందని కోల్కత్తా సెట్ వేశారు. కాళీ టెంపుల్ సెట్ కూడా ఒకటి ఉందని తెలిసింది. ముంబైని హైదరాబాద్ తీసుకొచ్చారు ‘ఫైటర్’. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకి ముంబై కీలకం. లాక్‌డౌన్‌కి ముంబై వెళ్లి షూటింగ్ కూడా చేశారు. ఇలా హాట్ టాపిక్‌గా నిలిచిన సెట్స్‌లో బంగారు గనుల సెట్ ఒకటి. యశ్ హీరోగా సంచలన విజయం నమోదు చేసుకున్న ‘కేజీఎఫ్’ చిత్రం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో సాగిన విషయం తెలిసిందే. ఈ చిత్రం సీక్వెల్ కోసం బంగారు గనుల సెట్ వేశారు. ఇక అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ షూటింగ్ దాదాపు పూర్తయింది. అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. ఇంకో చిన్న షెడ్యూల్ కోసం అమెరికాని తలపించే చిన్న చిన్న ఎక్స్టెన్షన్ సెట్స్ వేశారని తెలిసింది. రాజకీయ నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ ఓ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఏలూరిని తలపించే సెట్ వేశారు. ప్రస్తుతం ఏలూరులో చిత్రీకరణ జరుగుతోంది. ఆ తర్వాత సెట్లో షూట్ మొదలవుతుంది. కల్యాణ్ దేవ్ ‘కిన్నెరసాని’ని మదనపల్లిలో షూట్ చేశారు. ఇందులో హీరో ఇంటి సన్నివేశాలను మదనపల్లిలో తీశారు. కొనసాగింపు సన్నివేశాల కోసం ఇక్కడ ఇంటి సెట్ వేశారు. ఇంకా ఇలా ప్రయాణాలు తగ్గించుకునే క్రమంలో ఇక్కడే సెట్ వేసుకున్న సినిమాలు కొన్ని ఉన్నాయి. కరోనా కారణంగా ఆగిన చిత్రీకరణల వల్ల నిర్మాతలకు నష్టమే. దాంతోపాటు అనుకోకుండా సెట్లు వేయాల్సి రావడంతో బడ్జెట్ పెరగడం ఖాయం. సినిమాల కోసం సెట్ల రూపంలో ఊళ్లు కదలి వచ్చాయి. ప్రేక్షకులు థియేటర్లకు కదలి వస్తే సినిమాని నమ్ముకున్నవారు ‘సెట్’ అవుతారు. ‘పుష్ప’లో అల్లు అర్జున్; ‘అన్నాతే’లో రజనీకాంత్ ‘రాధేశ్యామ్’లో పూజాహెగ్డే, ప్రభాస్; ‘ఫైటర్’లో విజయ్ దేవరకొండ, అనన్య; ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో పూజా హెగ్డే, అఖిల్ ‘కేజీఎఫ్ 2’లో యశ్; కల్యాణ్‌దేవ్; నాని -
నో సెట్టింగ్ రెడీ 2 షూటింగ్
సినిమా అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సెట్టింగ్స్ లేకుండా ఒక్కపనీ జరగదు. చివరికి స్టూడియోల్లో సైతం సీన్‌కు తగ్గట్టు ‘సెట్’ చేయాల్సిందే. ఖరీదైన ఇల్లులాంటిది వేయాలంటే.? అందులో ఇంటీరియర్ రిచ్‌గా ఉండాలంటే.? మాత్రం లక్షలకు లక్షలు ఖర్చు చేయాల్సిందే. మరి ఏ గ్రాఫిక్నో నమ్ముకుంటే.? అబ్బే.. ప్రేక్షకులు గుర్తుపట్టేస్తారు. అంతా నేచురల్‌గా ఉండాలి. మరేం చేయాలి. నిజమైన ఇంట్లోనే షూటింగ్ చేయాలి. అదెలా అంటారా? ఇప్పుడు నగరంలోని కొన్ని ఖరీదైన ఇళ్లను అద్దెకు ఇస్తున్నారు. ఇళ్ల యజమానులకు ఇదో ఆదాయ మార్గంగా మారింది. ‘లౌక్యం’ సినిమాలోని కొన్ని సీన్లు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్.72లోని ఇంట్లో (ఇంటి నంబర్ 96–3) చిత్రీకరించారు. ఆ ఇంటి యజమానికి సినిమాలంటే ఇష్టం. నాలుగేళ్లుగా ఆ ఇంట్లో చాలా సినిమాలు షూట్ చేశారు. లైఫ్ ఈజ్ బ్యూటిపుల్, పైసా, పవిత్ర, ఒక లైలా కోసం.. వంటి సినిమాల్లోని ఇంటి లోపల సీన్లు చాలా వరకూ ఇక్కడే చిత్రీకరించారు. షూటింగ్ లొకేషన్‌కు తగ్గట్టుగా ఈ ఇంట్లోని చెట్లు, మొక్కలు అందర్నీ ఆకర్షిస్తాయి. అందుకే ఈ ఇల్లు సినిమా లొకేషన్‌గా మారింది. సెట్టింగులకు బోలెడంత ఖర్చుతో పాటు సమయం కూడా వృథా అవుతుంది. అందుకే రిచ్‌గా ఉండే హౌస్‌లను నమ్ముకుంటున్నారు నిర్మాతలు. నగరంలో ఇలాంటి ఇళ్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. అలాంటి ఇళ్లను కొన్ని రోజులు బుక్ చేసుకొని తక్కువ మొత్తంలోనే పని కానిచ్చేస్తున్నారు. సినిమాలపై అభిమానం, వెండితెరపై తమ ఇల్లు కనిపిస్తుందన్న ఆశ.. పైగా ఆర్థికంగా లాభసాటిగా ఉండడంతో వాటి యజమానులూ ఓకే అంటున్నారు. ఇంటి లోపల రిచ్‌నెస్ క్లాస్ అండ్ క్లాసిక్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని సాయితేజ అపార్ట్మెంట్ టెరస్ర్ సినిమా లొకేషన్ పాయింట్. అపార్ట్మెంట్ ఐదో అంతుస్తులో ‘ఎరబ్రస్సు’ చిత్రీకరణ జరిగింది. ఇంటి యజమాని రవీంద్రారెడ్డి బిల్డర్. దీంతో ఇంటిని కాస్త భిన్నంగా, అందంగా కట్టించారు. టెరస్ర్పై విశాల స్థలంలో గార్డెన్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా చేయించుకున్న వాల్ మ్యూరల్స్ ఈ గార్డెన్‌కు అదనపు ఆకర్షణ. అంతేకాదు అడుగడుగునా శిల్పకళా సౌందర్యం కనిపిస్తుంది. రాత్రిపూట టెరస్ర్ మొత్తం రంగురంగుల కాంతుల్లో మెరిసిపోతుంది. రెండేళ్లుగా ఈ ఇంట్లో పదుల సంఖ్యలో సినిమాలు షూట్ చేశారు. ఇంటి లోపల లేటెస్ట్గా డిజైన్ చేసిన ఓపెన్ కిచెన్, విశాలమైన హాల్ కూడా షూటింగ్లో చేరిపోయాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్. 26లోని ‘ఛత్రపతి హౌస్’లోనూ షూటింగ్‌లు జరుగుతుంటాయి. ‘ఛత్రపతి’ సినిమాలోని చాలా సీన్లు ఇక్కడ షూట్ చేయడంతో ఆ ఇంటికా పేరు వచ్చింది. -
స్మార్ట్
కళా దర్శకుడి ప్రతిభను బట్టే వెండితెరకు నిండుదనం చేకూరుతుంది. అతనెంత సృజన చూపితే అంతగా ఆ సినిమాలోని సెట్టింగ్స్ ప్రేక్షకుడి మదిలో చెరగని ముద్ర వేస్తాయి. ఆయా సన్నివేశాలకు బలమైన నేపథ్యంగా ఉపయోగపడటంతో పాటు కొన్నిసార్లు ‘సీన్’ను పీక్కు తీసుకువెళ్తాయి. సినిమాలోని సన్నివేశాలను ఎలివేట్ చేసేవి సెట్టింగ్‌లే. అందుకే, వీటికున్న ప్రాధాన్యమే వేరు. కళా దర్శకుడు చూపే వైవిధ్యమే వీటికి ప్రాణం. ఇదే విషయం ఆనంద్‌సాయిని అడిగితే- ‘నా ‘కళ’ సినిమాలు దాటి పెళ్లి మంటపాల వరకూ చేరి అదో ట్రెండ్‌గా స్థిరపడింది. నా మొదటి సినిమా తొలిప్రేమ. అందులో నేను వేసిన తాజ్‌మహల్ సెట్టింగ్ అందరికీ చాలా బాగా నచ్చింది’ అంటారు. ఈ రంగంపై మీకు ఆసక్తి ఎలా కలిగిందంటే- ‘ఫైన్ ఆర్ట్స్ పూర్తవ్వగానే.. నా మనసు ఆర్ట్ డిపార్ట్మెంట్కు అంకితమైపోయింది. దర్శకుడికి అవసరమైన అవుట్‌పుట్ ఇస్తూనే.. ఆ సెట్టింగ్‌లో అడుగడుగునా నా మార్క్ కనిపించేలా ప్రయత్నిస్తుంటాను. సినిమా చూసిన ప్రేక్షకులకు అద్భుతమైన రూపాలను చూపించాలన్న తపనే.. నా ఊహలకు ప్రాణం పోస్తుంది’ అంటారాయన. నాన్నే స్ఫూర్తి... ‘మా నాన్న ప్రముఖ ఆర్ట్ డెరైక్టర్ బి.చలం.జగదేకవీరుడు అతిలోకసుందరి, గోవిందా గోవిందా.. వంటి సినిమాలకు ఆయన ఆర్ట్ డెరైక్టర్‌గా పనిచేశారు. దాదాపు 700 సినిమాలకు కళాదర్శకుడిగా పనిచేసిన నాన్నే ఈ కళలో నాకు స్ఫూర్తి. ఆయన వారసత్వంగా వచ్చిన ఈ కళను.. మారుతున్న కాలానికి తగ్గట్టుగా ‘సెట్’ చేసుకుంటున్నాను. సినిమా సినిమాకూ కొత్తదనం చూపించగలగాలి.. అప్పుడే మనకంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. సినిమాలకు పనిచేస్తూనే పెళ్లిళ్లకు సెట్టింగ్‌లు వే స్తుంటాను. చిరంజీవి కుమార్తె పెళ్లి నుంచి జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి వరకూ చాలామంది ప్రముఖుల పెళ్లిళ్లకు సెట్లు వేశాను. నిజమైన కట్టడాలను మరపించేలా కనిపించే ఆ సెట్టింగ్‌లకు ఖర్చు పెద్ద మొత్తంలోనే అవుతుంది. ఖర్చు ఎంతైనా.. వెనుకాడకుండా ఎంతో ఆసక్తితో దగ్గరుండి మరీ సెట్టింగ్‌లు వేయించునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది’ అని వివరించారు ఆనంద్‌సాయి. సెట్ అయిపోతుంది.. ఈ మధ్యకాలంలో ఒక సినిమా కోసం వేసిన సినిమా సెట్టింగ్‌ను చిన్న చిన్న మార్పులతో ఇతర సినిమాలకూ వాడుతున్నారు.‘బృందావనం’ సినిమాకి వేసిన ఇంటి సెట్టింగ్‌ను ఇటీవల కాలంలో వచ్చిన చాలా సినిమాలకు వాడారు. అలాగే ‘నాయక్’ సినిమాకి వేసిన కాలనీ సెట్టింగ్‌ను స్వల్ప మార్పు చేర్పులతో ‘ఎవడు’ సినిమాకీ వాడారు. కోట్లు ఖర్చు పెట్టి వేయించుకున్న సెట్టింగ్‌లను మళ్లీ మళ్లీ వేరే కోణాల్లో వాడుతున్నారు. సాధారణంగా సినిమా షూటింగ్ పూర్తవగానే కొన్ని సెట్లను తీసేస్తారు. కొన్నింటిని అలాగే ఉంచుతారు. ‘నేను ‘యమదొంగ’ సినిమా కోసం వేసిన యమలోకం సెట్ అలాంటిదే. దాని కోసం చాలా కష్టపడ్డాను. తర్వాత చాలా సినిమాలకు ఆ సెట్టింగ్ వాడారు’ అని ఆనంద్ చెబుతారు. ప్రయాణాలే రహస్యం.. వైవిధ్యభరితమైన సెట్టింగ్స్‌కు రూపమెలా ఇస్తారని అడిగితే- ‘సీక్రెట్ ఏమీ లేదు. విరివిగా ప్రయాణాలు చేస్తా. ఎక్కడికి వెళ్లినా.. ప్రత్యేకంగా కనిపించే దృశ్యాల కోసం నా కళ్లు వెతుకుతాయి. అవి నా మనసుకు హత్తుకుంటే వెంటనే కళ్లలో ప్రింట్ చేసుకుంటాను. లేదంటే అప్పటికప్పుడు పేపర్‌పై పెట్టేస్తాను’అంటారాయన.