మీరు కొత్త స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీ పాత ఫోన్ విషయంలో తస్మాత్ జాగ్రత్త. పాత ఫోన్ అమ్మేసే సమయంలో అందులో ఉండే వ్యక్తిగత డేటాను మీరు కాపీ చేసుకొని భద్రపరుచుకుంటే ఫర్వాలేదు. లేదంటే పర్సనల్ డేటా లీకయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అందుకే పాత ఫోన్‌లో ఉన్న డేటాను డిలీట్ చేయడం, లేదంటే కాపీ చేయడం చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాతే ఆ డేటాను రీసెట్ చేయాలి. అలా చేస్తేనే పాత ఫోన్‌లో డేటా అంతా డిలీట్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఫోన్‌ను ఎలా రీసెట్ చేయాలో తెలుసుకుందాం.
ఫోన్‌ను ఎలా రీసెట్ చేయాలంటే
స్టెప్ 1: ముందుగా ఫోన్ సెట్టింగ్‌లోకి వెళ్లి సిస్టం అనే అప్షన్‌పై ట్యాప్ చేయాలి
స్టెప్2: సిస్టం ఆప్షన్ పై ట్యాప్ చేస్తే రీసెట్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది
స్టెప్3: అందులో మీకు ఎరేజ్ ఆల్ డేటా, లేదంటే (ఫ్యాక్టరీ రీసెట్) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్4: డిలీట్ అవుతున్న డేటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చదివి, ఎరేజ్ ఆల్ డేటాను క్లిక్ చేయాలి.
స్టెప్5: కన్ఫర్మేషన్ కోసం స్క్రీన్‌పై పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి.
స్టెప్6: అనంతరం స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎరేజ్ ఆల్ డేటాపై క్లిక్ చేస్తే.. ఆ డేటా మొత్తం డిలీట్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment