అదిరిపోయే ఫీచర్లతో.. నయా స్మార్ట్‌ఫోన్‌ లాంచింగ్‌కు షావోమీ రెడీ! | Sakshi
Sakshi News home page

అదిరిపోయే ఫీచర్లతో.. నయా స్మార్ట్‌ఫోన్‌ లాంచింగ్‌కు షావోమీ రెడీ!

Published Wed, May 22 2024 12:56 PM

Xiaomi Teases Launch First ever Civi Phone In India

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ షావోమీ స్మార్ట్‌ ఫోన్‌ ప్రియులకు శుభవార్త చెప్పింది. దేశంలో తొలిసారిగా సినిమాటిక్‌ విజన్‌ (సివి) ‘CI’ (of Cinematic) and ‘VI’ (of Vision) సిరీస్‌ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఆ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. కానీ ఫోన్‌ గురించి ఎలాంటి వివరాల్ని వెల్లడించ లేదు.  

ఈ తరహా సివి ఫోన్‌ల గురించి గతంలో పుకార్లు వచ్చాయి. షావోమీ సివి 4 ప్రోని..షావోమీ 14 సివిగా భారత్ మార్కెట్‌కు పరిచయం చేయనుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అదే జరిగితే ప్రస్తుతం ఇండియన్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న షావోమీ 14 సిరీస్‌కి అప్‌డేటెడ్‌ వెర్షన్‌ రానుంది. ఈ సిరీస్‌లో రెండు ఫోన్‌లు షావోమీ 14, షావోమీ 14 ఆల్ట్రా ఉన్నాయి. 

 
సివి 4ప్రోకి రీబ్రాండ్‌ షోవోమీ 14 సివీ
 

 సివి 4ప్రోకి రీబ్రాండ్‌ షోవోమీ 14 సివీ అనే ఊహాగానాలు నిజమైతే స్మార్ట్‌ఫోన్ 1.5కే  రిజల్యూషన్‌తో 6.55 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, 120హెచ్‌జెడ్‌ (Hertz) రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన డిస్ప్లే. 2160హెచ్‌జెడ్‌ పీడబ్ల్యూ ఎం డిమ్మింగ్ , కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో రానుంది.  

క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌
అంతేకాదు ఈ ఫోన్‌లో క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8ఎస్‌ జెన్‌3 చిప్‌ సెట్‌ ఉండగా 12జీబీ ఎల్‌ పీపీడీడీఆర్‌ 5ఎక్స్‌ ర్యామ్‌, 512జీబీ వరకు యూఎఫ్‌ఎస్‌ 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. ఇక ఫోన్‌ వెనుక కెమెరాలో 12-మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ ఓవీ13బీ10 అల్ట్రా వైడ్ సెన్సార్, 50-మెగాపిక్సెల్ 2ఎక్స్‌ టెలిఫోటో కెమెరా, సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.  

4,700ఎంఏహెచ్‌ బ్యాటరీ
4,700ఎంఏహెచ్‌ బ్యాటరీ, 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానుండగా.. ఆఫోన్‌ షావోమీ ఐపర్‌ ఓఎస్‌లో రన్‌ అవుతుందని తెలుస్తోంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఆర్‌ బ్లాస్టర్ సెన్సార్, హై రెసెల్యూషన్‌ ఆడియో, స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మోస్ సపోర్ట్ వంటితో పాటు ఇతర ఫీచర్లు ఉన్నాయని సమాచారం. 

Advertisement
 
Advertisement
 
Advertisement