స్మార్ట్ | smart | Sakshi
Sakshi News home page

స్మార్ట్

Published Wed, Oct 8 2014 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM

స్మార్ట్

స్మార్ట్

 కళా దర్శకుడి ప్రతిభను బట్టే వెండితెరకు నిండుదనం చేకూరుతుంది. అతనెంత సృజన చూపితే అంతగా ఆ సినిమాలోని సెట్టింగ్స్ ప్రేక్షకుడి మదిలో చెరగని ముద్ర వేస్తాయి. ఆయా సన్నివేశాలకు బలమైన నేపథ్యంగా ఉపయోగపడటంతో పాటు కొన్నిసార్లు ‘సీన్’ను పీక్‌కు తీసుకువెళ్తాయి. సినిమాలోని సన్నివేశాలను ఎలివేట్ చేసేవి సెట్టింగ్‌లే. అందుకే, వీటికున్న ప్రాధాన్యమే వేరు. కళా దర్శకుడు చూపే వైవిధ్యమే వీటికి ప్రాణం. ఇదే విషయం ఆనంద్‌సాయిని అడిగితే- ‘నా ‘కళ’ సినిమాలు దాటి పెళ్లి మంటపాల వరకూ చేరి
 అదో ట్రెండ్‌గా స్థిరపడింది. నా మొదటి సినిమా తొలిప్రేమ. అందులో నేను వేసిన తాజ్‌మహల్ సెట్టింగ్ అందరికీ చాలా బాగా నచ్చింది’ అంటారు. ఈ రంగంపై మీకు ఆసక్తి ఎలా కలిగిందంటే-  ‘ఫైన్ ఆర్ట్స్ పూర్తవ్వగానే.. నా మనసు ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌కు అంకితమైపోయింది. దర్శకుడికి అవసరమైన అవుట్‌పుట్ ఇస్తూనే.. ఆ సెట్టింగ్‌లో అడుగడుగునా నా మార్క్ కనిపించేలా  ప్రయత్నిస్తుంటాను. సినిమా చూసిన ప్రేక్షకులకు అద్భుతమైన రూపాలను చూపించాలన్న తపనే.. నా ఊహలకు ప్రాణం పోస్తుంది’ అంటారాయన.
 
నాన్నే స్ఫూర్తి...

‘మా నాన్న ప్రముఖ ఆర్ట్ డెరైక్టర్ బి.చలం.జగదేకవీరుడు అతిలోకసుందరి, గోవిందా గోవిందా.. వంటి సినిమాలకు ఆయన ఆర్ట్ డెరైక్టర్‌గా పనిచేశారు. దాదాపు 700 సినిమాలకు కళాదర్శకుడిగా పనిచేసిన నాన్నే ఈ కళలో నాకు స్ఫూర్తి. ఆయన వారసత్వంగా వచ్చిన ఈ కళను.. మారుతున్న కాలానికి తగ్గట్టుగా ‘సెట్’ చేసుకుంటున్నాను. సినిమా సినిమాకూ కొత్తదనం చూపించగలగాలి.. అప్పుడే మనకంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. సినిమాలకు పనిచేస్తూనే పెళ్లిళ్లకు సెట్టింగ్‌లు వే స్తుంటాను. చిరంజీవి కుమార్తె పెళ్లి నుంచి జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి వరకూ చాలామంది ప్రముఖుల పెళ్లిళ్లకు సెట్‌లు వేశాను. నిజమైన కట్టడాలను మరపించేలా కనిపించే ఆ సెట్టింగ్‌లకు ఖర్చు పెద్ద మొత్తంలోనే అవుతుంది. ఖర్చు ఎంతైనా.. వెనుకాడకుండా ఎంతో ఆసక్తితో దగ్గరుండి మరీ సెట్టింగ్‌లు వేయించునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది’ అని వివరించారు ఆనంద్‌సాయి.
 
సెట్ అయిపోతుంది..

ఈ మధ్యకాలంలో ఒక సినిమా కోసం వేసిన సినిమా సెట్టింగ్‌ను చిన్న చిన్న మార్పులతో ఇతర సినిమాలకూ వాడుతున్నారు.‘బృందావనం’ సినిమాకి వేసిన ఇంటి సెట్టింగ్‌ను ఇటీవల కాలంలో వచ్చిన చాలా సినిమాలకు వాడారు. అలాగే
 ‘నాయక్’ సినిమాకి వేసిన కాలనీ సెట్టింగ్‌ను స్వల్ప మార్పు చేర్పులతో ‘ఎవడు’ సినిమాకీ వాడారు. కోట్లు ఖర్చు పెట్టి వేయించుకున్న సెట్టింగ్‌లను మళ్లీ మళ్లీ వేరే కోణాల్లో వాడుతున్నారు. సాధారణంగా సినిమా షూటింగ్ పూర్తవగానే కొన్ని సెట్‌లను
 తీసేస్తారు. కొన్నింటిని అలాగే ఉంచుతారు. ‘నేను ‘యమదొంగ’ సినిమా కోసం వేసిన యమలోకం సెట్ అలాంటిదే. దాని కోసం చాలా కష్టపడ్డాను. తర్వాత చాలా సినిమాలకు ఆ సెట్టింగ్ వాడారు’ అని ఆనంద్ చెబుతారు.
 
ప్రయాణాలే రహస్యం..

వైవిధ్యభరితమైన సెట్టింగ్స్‌కు రూపమెలా ఇస్తారని అడిగితే- ‘సీక్రెట్ ఏమీ లేదు. విరివిగా ప్రయాణాలు చేస్తా. ఎక్కడికి వెళ్లినా.. ప్రత్యేకంగా కనిపించే దృశ్యాల కోసం నా కళ్లు వెతుకుతాయి. అవి  నా మనసుకు హత్తుకుంటే వెంటనే కళ్లలో ప్రింట్ చేసుకుంటాను. లేదంటే అప్పటికప్పుడు పేపర్‌పై పెట్టేస్తాను’అంటారాయన.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement