కమింగ్ సూన్.. ‘అమీర్‌పేటలో’.. | IT students short film about of their life | Sakshi
Sakshi News home page

కమింగ్ సూన్.. ‘అమీర్‌పేటలో’..

Published Sat, May 16 2015 2:39 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM

కమింగ్ సూన్..  ‘అమీర్‌పేటలో’..

కమింగ్ సూన్.. ‘అమీర్‌పేటలో’..

- ఐటీ విద్యార్థుల కథే సినిమాగా..
హైదరాబాద్ మహానగరం ప్రయోగాలకు వేదిక. సిటీలోని ఒక్కో ప్రాంతానిది ఓ ప్రత్యేకత. కృష్ణానగర్ సినీ జీవుల నిలయం.. మాదాపూర్ ఐటీ ఉద్యోగుల ప్లేస్.. అమీర్‌పేట ఐటీ కోర్సులు చేసి అమెరికా వెళ్లాలనుకునే జీవుల ఆశల అడ్డా. ఇప్పుడు ఈ అడ్డా సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. సాఫ్ట్‌వేర్ శిక్షణ కేంద్రాల నిలయంగా పేరున్న అమీర్‌పేట.. సోషల్ వెబ్‌సైట్,

కళాశాలల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘అమీర్‌పేటలో’.. ఫేస్‌బుక్ పేజీ క్రియేట్ చేసిన కొద్దీ రోజుల్లోనే వేలాది మంది ఆ గ్రూప్‌లో చేరడం ఆ పేరుకు ఉన్న క్రేజ్‌కి అద్దం పడుతోంది. ఇంతకీ ఈ పేరే ంటో అనేకదా..! అమీర్‌పేటలో అన్నది సిటీలో ఓ ప్రాంతం పేరు.. అంతకు మించి ఇప్పుడిది సినిమా పేరు. -సాక్షి, సిటీబ్యూరో
 
- సోషల్ మీడియాలో హల్‌చల్
- యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం
- సిటీ లైఫ్‌లో కొత్తకోణం

‘అమీర్‌పేటలో’.. సినిమా టైటిల్. ‘కాప్షన్ కమింగ్ సూన్’ అన్నది కాప్షన్. ఈ మూవీ పేరును ఇప్పుడు సిటీలో యూత్ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తమ పేర్లకు ముందు తమ ప్రాంతం పేరును యాడ్ చేసి ఫేస్‌బుక్‌లో హల్‌చల్ చేస్తున్నారు. ‘అమీర్‌పేటలో శ్రీ, అమీర్‌పేటలో అనూష’.. అంటూ ఈ ప్రాంతం వారు ఫేస్‌బుక్ ఐడీ క్రియేట్ చేసుకుంటే.. ‘ఉప్పల్‌లో సోనీ’, ‘రామాంతపూర్‌లో రాము’, ‘మెహదీపట్నంలో సందీప్’, ‘లింగంపల్లిలో కిషన్‌రావు’.. ఇతర ప్రాంతాలవారు కూడా ఇలా కొత్త ట్రెండ్‌కు నాంది పలుకుతున్నారు. ఒక రకంగా వీరంతా ‘అమీర్‌పేటలో’.. చిత్రానికి ప్రచారం కల్పిస్తున్నారు. మరోపక్క ఈ మూవీ కథాంశాన్ని యువతకు తెలియజేస్తూ ఈ చిత్రం టీం సిటీలోని వివిధ కళాశాలల్లో ఫ్లాష్ మాబ్ డాన్స్ చేస్తున్నారు. దీనికి అట్రాక్ట్ అయిన కాలేజీ కుర్రాళ్లు ‘అమీర్‌పేటలో’ మూవీ ప్రమోషన్‌లోనూ భాగమువుతున్నారు.

‘బీటెక్ చదువు తర్వాత తమ కెరీర్ గోల్ చేరుకునే క్రమంలో అమీర్‌పేట అడ్డాగా ఎంత మందికి లైఫ్‌నిస్తుందో, అక్కడ విద్యార్థుల లైఫ్ స్టైల్‌ను కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్న ఈ సినిమా కథాంశం మాకు బాగా నచ్చింది. సినిమా టైటిల్ కొత్తగా ఉండటంతో ఈ మూవీ పబ్లిసిటీలో భాగస్వాములం అవుదామని వారి ఫేస్‌బుక్ పేజీలో మెంబర్ అయ్యామ’ని చెబుతున్నారు ఓ కళాశాల విద్యార్థులు. ‘ఈ టైటిల్ ఇన్నోవేటివ్‌గా ఉంది. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగే ఈ సినిమాను తెరకెక్కించడం, బీటెక్ చదివిన మధును హీరోయిన్‌గా తీసుకోవడం... ఇలా దాదాపు బీటెక్ చదివిన వారందరూ ఈ మూవీలో చేస్తుండటం మమ్మల్ని ఆలోచింపజేస్తోంది. అందుకే మా వంతుగా ఈ మూవీ ప్రమోషన్‌లో పాల్గొంటున్నామని చెబుతున్నారు అమీర్‌పేట హాస్టళ్లలో ఉంటున్న యువతీయువకులు. వాస్తవానికి ‘అమీర్‌పేటలో’.. అంటూ ఓ ప్రాంతం పేరును సినిమా టైటిల్‌గా పెట్టడం కొత్తేమీ కాదు. దాదాపు 24 ఏళ్ల క్రితమే కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘మధురానగరిలో’.. చిత్రం వచ్చింది. అయితే, అప్పటికి ఫేస్‌బుక్, మాబ్ డాన్సుల వంటి ప్రచారం లేదు.
 
ఇన్నోవేటివ్ పబ్లిసిటీ..
సినిమా షూటింగ్ పూర్తయ్యాక పబ్లిసిటీపై దృష్టి పెడతారు. అయితే ‘అమీర్‌పేటలో’ టీం మాత్రం.. ఓ వైపు షూటింగ్ చేస్తూ.. పబ్లిసిటీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ వెబ్‌సైట్‌తో పాటు తమ టైటిల్ లోగోతో కాలేజీలకు వెళ్లి యువతను ఆకట్టుకుంటున్నారు. డిఫరెంట్ థీమ్‌తో ఉన్న టీషర్ట్‌లతో వెళుతుండడం అందరినీ అటువైపు కన్నేసేలా ఉంది ప్రచారం. ఆడియో లాంచింగ్ కూడా డిఫరెంట్‌గా.. అమీర్‌పేట వేదికగా చేసే ప్లాన్‌లో ఉన్నారు ఈ మూవీ టీం.
 
 
ఉద్యోగం వదిలేశా..
‘నేను చదివింది బీటెక్. ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశా. అప్పుడు అమీర్‌పేటలో ఉండేవాడిని. అక్కడి వాతావరణం, విద్యార్థుల తీరు చూశాక.. నా వ్యక్తిగత అనుభవంతో ఓ మూవీ చేయాలనుకున్నా. అందుకే ఏడాది క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశా. 20 మంది ఫ్రెండ్స్‌తో కలిసి ఈ మూవీ ప్లాన్ చేశా. ‘అమీర్‌పేటలో..’ టైటిల్ చెప్పగానే ఓకే అన్నారు. తొలుత ఇబ్బందులు ఎదురైనా ఇప్పుడు సాఫీగా సాగుతోంది. అమీర్‌పేటలో ఉండేవారినే ఈ సినిమాలో క్యారెక్టర్లుగా తీసుకున్నాం. హీరోయిన్ మధు కూడా అక్కడే ఉంటుంది. ఈ సినిమాలో హీరో పాత్ర పోషిస్తున్నా. డెరైక్టర్, నిర్మాతను కూడా నేనే. అమీర్‌పేటలో నా లైఫ్ ఈ మూవీ తీసేలా చేస్తోంద’ని అంటున్నారు శ్రీకాంత్ పొడపాటి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement