వాట్సాప్.. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్. ప్రపంచ వ్యాప్తంగా 295 కోట్ల మంది వినియోగదారులు ఈ మెసేజింగ్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ‘మెటా’ ఈ ఏడాది వాట్సాప్‌లో పలు ఫీచర్లను జోడించింది. అంతేకాకుండా దాని ఇంటర్‌ఫేస్‌లో కూడా మార్పు చోటుచేసుకుంది. ఫలితంగా వాట్సాప్‌లో చాటింగ్ అనుభవం పూర్తిగా మారిపోయింది. ఈ ఏడాది వాట్సాప్‌లో ప్రవేశించిన ప్రత్యేక ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
మెటా ఏఐ
మెటా ఏఐ.. జనరేటివ్ ఏఐ చాట్‌బాట్ వాట్సాప్‌కి జోడించింది. మెటా దాని అన్ని ప్లాట్‌ఫారమ్‌లకు దాని లామా (లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్) ఆధారిత ఉత్పాదక ఏఐ సాధనాన్ని జోడించింది. వాట్సాప్ యూజర్లు మెటా ఏఐ ద్వారా పలు ప్రయోజనాలు పొందవచ్చు. ఈ చాట్‌బాట్ వినియోగదారుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాకుండా, ఆదేశాలకు అనుగుణంగా చిత్రాలను కూడా రూపొందిస్తుంది.
వీడియో కాల్ ఫిల్టర్
వాట్సాప్ వీడియో కాల్ ఫీచర్‌కు ఈ ఏడాది కొత్త ఇన్నోవేటివ్ ఫిల్టర్‌లు జోడించారు. వీడియో కాల్‌ల సమయంలో వినియోగదారులు ఈ ఫిల్టర్‌లను ఉపయోగించి తమకు నచ్చిన నేపథ్యాన్ని మార్చుకోవచ్చు. ముఖ్యంగా వ్యాపార కాల్‌లు లేదా సమావేశాల సమయంలో, వినియోగదారులు ఈ వీడియో కాల్ ఫిల్టర్‌లను ఉపయోగించవచ్చు.
కస్టమ్ చాట్ జాబితా
ఈ సంవత్సరం మెటా.. వాట్సాప్‌లో కస్టమ్ చాట్ జాబితా ఫీచర్‌ను జోడించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ వారికి ఇష్టమైన స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల చాట్ జాబితాను సృష్టించవచ్చు. ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ తమకు నచ్చినవారితో నిత్యం కనెక్ట్ కాగలరు.
వాయిస్ సందేశాలకు అక్షరరూపం
వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్‌ల కోసం ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్ జోడించారు. ఈ ఫీచర్ ద్వారా వాయిస్ మెసేజ్ రిసీవ్ చేసుకునే వినియోగదారులు ఆ వాయిస్ మెసేజ్‌లను అక్షర రూపంలో చదవగలరు. వినియోగదారులు తమకు నచ్చిన భాషలో వాయిస్ సందేశాలను చదువుకునే అవకాశం కూడా ఉంది.
ఇంటర్‌ఫేస్‌లో మార్పులు
ఇతర ప్రధాన అప్‌గ్రేడ్‌లతో పాటు, యాప్ వినియోగదారులు ఇంటర్‌ఫేస్‌ను కూడా మార్చుకోవచ్చు. వాట్పాప్ మరింత యూజర్ ఫ్రెండ్లీగా చేయడానికి, టైపింగ్ ఇండికేటర్‌ను జోడించారు. మీరు ఎవరితోనైనా చాట్ చేస్తున్నప్పుడు, అవతలి వ్యక్తి ప్రత్యుత్తరం కోసం ఏదైనా టైప్ చేస్తే, అది చాటింగ్ విండోలో కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి: మందపాటి రగ్గు కప్పుకున్నా చలి తగ్గడంలేదా.. కారణమిదే..
Comments
Please login to add a commentAdd a comment