నిండు గర్భిణులకు నోట్ల కష్టాలు
నిండు గర్భిణులకు నోట్ల కష్టాలు
Published Fri, Nov 11 2016 11:11 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM
దాచేపల్లి: తొమ్మిది నెలల గర్భిణికి నోట్ల కష్టలు తప్పలేదు. మరో నాలుగు రోజుల్లో డెలీవరి కావాల్సిన ఆ నిండు గర్భీణి అతికష్టం మీద నడికుడి భారతీయ స్టేట్ బ్యాంక్‌కు వచ్చింది. డెలీవరి కోసం అప్పుగా తెచ్చుకున్న పాత నగదు మార్చి కొత్త నగదును తీసుకునేందుకు యిరికేపల్లికి చెందిన కొదమగుండ్ల సునీత తల్లితో కలిసి బ్యాంక్‌కు చేరుకున్నది. తొమ్మిది నెలల గర్భిణీ అయిన సునీత మరో రెండు రోజుల్లో డెలివరీకి వెళ్లాల్సి ఉంది. ఆపరేషన్ ద్వారా మొదటì æకాన్పులో బిడ్డకు జన్మనిచ్చిన సునీత రెండో సారి గర్భం దాల్చి డెలివరీ సమయంలో అపరేషన్ చేయించుకునేందుకు సిద్ధమైంది. భర్త మల్లికార్జునరావు వ్యవసాయ కూలీ కావటంతో డెలీవరి కోసం అవసరమైన రూ10వేల నగదును ఇతరుల వద్ద అప్పుగా తెచ్చుకున్నారు. పాత నోట్లను ఇవ్వడంతో వాటిని మార్చుకునేందుకు బ్యాంక్‌కు వచ్చింది. గంటల తరబడి లైన్లో నిలబడిన సునీత అలసిపోయింది. దీంతో అక్కడ ఉన్న వారు విషయాన్ని బ్యాంక్ మేనేజర్‌కు చెప్పడంతో లోపలికి అనుమతిచ్చారు. తన వద్ద ఉన్న పాత నోట్లను బ్యాంక్‌లో ఇచ్చి కొత్త నోట్లను తీసుకున్నారు. అపరేషన్ కోసం వెళ్లాల్సి ఉండటం వలనే తాను బ్యాంక్‌కు వచ్చానని, ఇబ్బందులు పడుతూ బ్యాంక్‌కు చేరుకున్నానని సునీత చెప్పింది. మొత్తంమీద పాతనోట్ల బాధలు నిండు గర్భీణిని కూడా వెంటాడాయి.
Advertisement