సాక్షి, హైదరాబాద్: నిజాం కాలేజి విద్యార్థుల సమస్యపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. రోడ్డెక్కిన నిజాం కాలేజీ విద్యార్థుల సమస్యపై విద్యాశాఖ మంత్రి స్వయంగా రంగంలోకి దిగినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. నిజాం కాలేజీ విద్యార్థుల సమస్య పరిష్కారమైందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
50 శాతం డిగ్రీ, 50 శాతం పీజీ విద్యార్థులకు హాస్టళ్లు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం తలనొప్పిగా మారింది. కాగా, ప్రభుత్వ ఉత్తర్వులపై డిగ్రీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం తమకే కేటాయించాలని డిగ్రీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
చదవండి: తెలంగాణ పాలిటిక్స్‌లో హీటెక్కిస్తున్న మోదీ టూర్
Comments
Please login to add a commentAdd a comment