సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజ్ ముందు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. యూనివర్శిటి నుంచి అనుమతులు లేకుండా యాజమాన్యం అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ విషయం తెలియడంతో ఉదయం నుంచి కాలేజ్ గేట్ ముందు విద్యార్థులు, వాళ్ల తల్లితండ్రులు, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు.
కాలేజ్ యజమాన్యం వచ్చి సరైన సమాధానం చెప్పే వరకు అక్కడ నుండి కదిలేదు లేదంటూ ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ స్పష్టం చేశారు. కాలేజ్ యాజమాన్యంతో విద్యార్థి తల్లిదండ్రులు చర్చలు జరిపి అనురాగ్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవచ్చని నచ్చజెప్పారు. దీంతో ప్రత్యేక బస్సులో అనురాగ్ యూనివర్సిటీకి వెళ్లిన తల్లిదండ్రులు.. తిరిగి గురునానక్ కాలేజ్‌కు వచ్చి తమకు అక్కడ న్యాయం జరగలేదని వాపోయారు.
ఈ క్రమంలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ ఆధ్వర్యంలో విద్యార్థులు కాలేజ్ గేటు దుకి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. పోలీసులకు, ఎన్‌ఎస్‌యూఐ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో విద్యార్థులపై పోలీసులు లాఠీ జార్జ్ చేయడంతో పాటు ధర్నాకు మద్దతు తెలిపిన వివిధ సంఘాల నేతలను అదుపులోకీ తీసుకున్నారు.
చదవండి: మంత్రి మల్లారెడ్డి కాలేజీలో భారీగా నగదు స్వాధీనం: ఈడీ
Comments
Please login to add a commentAdd a comment