Nizam College Students
-
‘తెలంగాణలో విద్యా వ్యవస్థనే నాశనం చేస్తున్న వ్యక్తి నవీన్ మిట్టల్’
సాక్షి, హైదరాబాద్: నిజాం కాలేజీలో హాస్టల్ భవనం కేటాయింపు విషయంలో విద్యార్థినిలు కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆందోళనకు కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. ‘విద్యార్థులు చేస్తున్న ధర్నాకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాను. సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క, నేను కూడా మాజీ నిజాం కాలేజీ విద్యార్థులమే. ఇక్కడ హాస్టల్లో ఉండి మేము చదువకున్నవారిమే. అందువల్ల మీ ఇబ్బందులు, కష్టాలపై మాకు పూర్తి అవగాహన ఉంది. విద్యార్థులకు హాస్టల్ చాలా అవసరం అందులోనూ మహిళా విద్యార్థులకు ఇంకా ముఖ్యం. హాస్టల్ కేటాయింపు కోసం యూజీ విద్యార్థినులు చేస్తున్న ధర్నా, డిమాండ్‌కు మా మద్దతు పూర్తిగా ఉంటుంది. పీజీ విద్యార్థినులకు ఉస్మానియాలో హాస్టల్ ఉంది. కాబట్టి ఇక్కడ కట్టిన కొత్త హాస్టల్ భవనం యూజీ విద్యార్థినులకు ఇవ్వాలి. పీజీ విద్యార్థులకు ఇవ్వాలి అనుకుంటే మరో కొత్త భవనం కట్టి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. అధికారంలో ఉన్నారు కాబట్టి అహాంకారంతో ప్రవర్తిస్తే మంచిది కాదని నవన్ మిట్టల్‌ను హెచ్చరిస్తున్నాం. మొత్తం విద్యా వ్యవస్థనే నాశనం చేస్తున్న వ్యక్తి నవీన్ మిట్టల్. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు చదువు అందకుండా ఉన్నత విద్యను ప్రైవేట్‌పరం చేస్తున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలు, కాలేజీలకు సహకరిస్తూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోంది. టీఆర్ఎస్కు తొత్తులా నవీన్ మిట్టల్ పనిచేస్తున్నారు. నవీన్ మిట్టల్ వచ్చాకే ప్రభుత్వ కాలేజీలు మూత పడుతున్నాయి. విద్యార్థులకు మరో మార్గంలేక ప్రైవేట్ యూనివర్సిటీల్లో చేరేలా పరోక్షంగా ఒత్తిడి తీసుకువస్తోంది ఈ ప్రభుత్వం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నిజాం కాలేజ్ ఇష్యూ పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందన
-
ప్రభుత్వ ఉత్తర్వులపై నిజాం కాలేజ్ డిగ్రీ విద్యార్థుల ఆగ్రహం ..
-
Nizam College: విద్యార్థుల నిరసన.. తలనొప్పిగా సర్కార్ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: నిజాం కాలేజి విద్యార్థుల సమస్యపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. రోడ్డెక్కిన నిజాం కాలేజీ విద్యార్థుల సమస్యపై విద్యాశాఖ మంత్రి స్వయంగా రంగంలోకి దిగినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. నిజాం కాలేజీ విద్యార్థుల సమస్య పరిష్కారమైందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. 50 శాతం డిగ్రీ, 50 శాతం పీజీ విద్యార్థులకు హాస్టళ్లు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం తలనొప్పిగా మారింది. కాగా, ప్రభుత్వ ఉత్తర్వులపై డిగ్రీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం తమకే కేటాయించాలని డిగ్రీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: తెలంగాణ పాలిటిక్స్‌లో హీటెక్కిస్తున్న మోదీ టూర్ -
నిజాం కాలేజీలో పీక్ స్టేజ్‌కు విద్యార్థినిల ఆందోళన.. మంత్రి కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనల ఘటన ముగియకముందే నిజాం కాలేజీ విద్యార్థులు నిరసనలు దిగారు. నిజాం కాలేజీలో విద్యార్థినిలు ఆందోళన బాటపట్టారు. డిగ్రీ విద్యార్థులకు హాస్టల్ బిల్డింగ్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకుని ఆందోళనలు చేస్తున్నారు. కొత్త హాస్టల్ బిల్డింగ్‌ను పీజీ విద్యార్థులకు కేటాయించడంపై నిరసనలు తెలుపుతున్నారు. యూజీ హాస్టల్ పీజీ కెట్ల..? డిగ్రీ వాళ్లు ఉండేదెట్ల..? అంటై ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ఇక, విద్యార్థినిల ఆందోళనలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ విషయంపై కేటీఆర్.. మంత్రి సబిత ఇంద్రారెడ్డికి ట్వీట్ చేసి.. సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ మంత్రి సబిత సమాధానమిస్తూ.. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించనున్నట్టు పేర్కొన్నారు. -
బషీర్ బాగ్ నిజాం కాలేజ్ లో విద్యార్థుల ఆందోళన
-
టీజేఏసీ నేతల అరెస్ట్
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఏపీ ఎన్జీవోలు శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ సందర్భంగా పోలీసులు అరెస్ట్ చేసిన నిజాం కళాశాల విద్యార్థులను పరామర్శించేందుకు వచ్చిన టీజేఏసీ చైర్మన్ ఫ్రొఫెసర్ కోదండరాం, టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ మాలమహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్, ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ తదితరులను అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు ప్రకటించటంపై తెలంగాణవాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున నినాదాలు చేయడంతో గోషామహల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అనంతరం టీజేఏసీ నాయకులు పోలీసుల అనుమతితో స్టేడియం గేటు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు... అక్రమ కేసులు పెడతారేమో?: దేవీప్రసాద్ తెలంగాణ విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు సాయంత్రం వరకు విడుదల చేయకపోవడం చూస్తుంటే అక్రమంగా కేసులు పెట్టాలని కుట్ర పన్నినట్లు భావిస్తున్నాం. ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన అధికారులంతా సీమాంధ్ర సభలో పాల్గొన్నారు. ఈ సభను ప్రభుత్వమే నిర్వహించిందనేందుకు అనేక ఆధారాలున్నాయి. తెలంగాణా ప్రజలపై ఆధిపత్యం చెలాయించేందుకే సభ నిర్వహించారు. ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు లేవనెత్తిన అంశాలన్నీ చర్చించుకుంటే పరిష్కారమయ్యేవే. జాతీయ గీతాన్ని అవమానించారు: శ్రీనివాస్‌గౌడ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో గజల్ శ్రీనివాస్ జాతీయగీతాన్ని తప్పుగా ఆలపించి అవమానించారు. దీనిపై అక్కడే ఉన్న సచివాలయ ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూస్తాం. మేం సభలు పెడితే బారికేడ్లు పెట్టి రాకుండా అడ్డుకుంటారు. సీమాంధ్రుల సభకూ బారికేడ్లు పెట్టి మమ్మల్ని ఎటూ వెళ్లకుండా దిగ్బంధించారు. ఇది ప్రజాస్వామ్యమా? నిరంకుశమా? జై తెలంగాణా అన్న కానిస్టేబుల్‌ను చితకబాదారు. తెలంగాణ పదం నిషేధితమా? సీమాంధ్రలో పోటీ సభ నిర్వహిస్తాం: మంద కృష్ణమాదిగ ఒక్కసారి తెలంగాణ అని నినదించినందుకే కానిస్టేబుల్ అని కూడా చూడకుండా చితకబాదారు. కలిసి ఉందామంటూనే దాడులకు పాల్పడటం అమానుషం. నగరంలో సీమాంధ్రుల సభకు అనుమతించి రక్షణ కల్పించిన సీఎం కిరణ్ మాకు అనుమతిస్తే సీమాంధ్రలోనే పోటీ సభ నిర్వహిస్తాం. సీమాంధ్ర సభకు జనాలను బస్సుల్లో పోలీసు వాహనాల రక్షణతో తరలించినట్లు మా సభకు తరలించాల్సిన అవసరం లేదు. కేవలం సభకు అనుమతించి రక్షణ కలిస్తే చాలు. సభ ఎప్పుడు, ఎక్కడ? అనే వివరాలను ఆదివారం వెల్లడిస్తాం. చంపేందుకే కలిసుందామంటున్నారు: విఠల్ సభలో 30 శాతం కూడా ఉద్యోగులు లేరు. గజల్ శ్రీనివాస్, విద్యార్థి నేతలు, పీఆర్పీ మాజీ నేత డాక్టర్ మిత్ర వీరంతా ఉద్యోగులేనా? పోలీసులు వారిని లోపలికి ఎలా అనుమతించారో వివరణ ఇవ్వాలి.