నా వయసు 24 సంవత్సరాలు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ని. నా పనిలో బాగా రాణిస్తున్న తరుణంలో ఒకరోజు లిఫ్ట్‌లో 15 నిమిషాలు ఒక్కదాన్ని స్ట్రక్ అయ్యాను. అపుడు నాకు విపరీతంగా చెమటలు పట్టి, గుండె ఆగిపోతుందేమో అన్నంత వేగంగా కొట్టుకుని, ఒళ్ళంతా చల్లబడి, ఊపిరి ఆడనంత పరిస్థితి. ఆ సమయంలో ఇక చనిపోతానేమో అనేంత భయం వేసింది. ఇది జరిగి ఒక సంవత్సరం అయినప్పటికీ, దీని తర్వాత నేను లిఫ్ట్ ఎక్కడం మానేసి మెట్లే ఎక్కడం కాకుండా, ఫ్లైట్ ట్రావెల్‌ని కూడా అవాయిడ్ చేస్తున్నాను. మరల అలాంటి ఎటాక్ వస్తుందేమో అన్న భయం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంది. అనేక సార్లు వచ్చిన ప్రమోషన్ అవకాశాన్ని కూడా ఈ ట్రావెల్ ఫోబియా వల్ల వదులుకున్నాను. నాకు సహాయం చేయండి.
– నందిని, కాకినాడ
నందినీగారూ! మీకున్న ఈ సమస్యను ప్యానిక్ ఎటాక్ అంటారు. ఇటువంటి సమస్య తరచూ వస్తున్నా లేదా వస్తాయనే భయంతో మీరు లిఫ్ట్, ఫ్లైట్ వంటివి అవాయిడ్ చేస్తుండటాన్ని ప్యానిక్ డిజార్డర్ అంటారు. ఇది చాలా సాధారణ మానసిక కండిషన్. కొంతమంది బాగా జనం ఉన్న ప్రదేశాలలో మరికొంత మంది తలుపులు అన్ని మూసేసిన గదిలో ఉన్నా ఇలా అనేక సందర్భాల్లో ప్యానిక్ అటాక్ రావచ్చు.
వీటిని నిర్లక్ష్యం చేసినట్లయితే అకారణంగా కూడా ఈ అటాక్ వచ్చే అవకాశం ఉంది. ప్యానిక్ అటాక్‌ని ట్రీట్ చేయడానికి ‘కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’ ‘మైండ్‌ఫుల్‌నెస్ ట్రెయినింగ్’ ‘రిలాక్సేషన్ ఎక్సర్‌సైజెస్’తో పాటు కొన్ని రకాల మంచి మందుల ద్వారా చికిత్స చేయవచ్చు. మీ జీవితంలో ఇబ్బంది వల్ల మీరు ఎంతో కోల్పోతున్నట్లు తెలుస్తుంది. కనుక మీరు తొందరలో మంచి మానసిక వైద్యుణ్ణి కలిసి దీని నుండి విముక్తి పొందాలని, మీ పూర్తి సామర్థ్యాన్ని తిరిగి సాధించాలని ఆశిస్తున్నాను.
డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com
(చదవండి: పట్టు చీరలకు కేరాఫ్ అడ్రస్ ఆ ఊరు..!)
Comments
Please login to add a commentAdd a comment