కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న మహిళ(ఫైల్)
చారకొండ : దీపం సిలిండర్లు అందక మండల పరిధిలోని గ్రామీణ మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంటచెరుకుకోసం మహిళలు, వృద్ధులు పడరాని పా ట్లు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలకులు గ్యాస్ సిలిండర్లు మంజూరు చేస్తున్నామని ఎంతో గొప్పలు చెప్పుకుంటున్నారు. కాని నేటికి వంటగ్యాస్ రాక ఇబ్బందులు పడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు.
మంజూరు కాని సిలిండర్లు...
మండలంలో ప్రస్తుతం 8 గ్రామ పంచాయతీలలో 2000 గ్యాస్ కనెక్షన్‌లు ఉన్నాయి. 160 మంది దీపం పథకం క్రింద దరఖాస్తు చేసుకున్నారు. ఇంత వరకు మంజూరు కాలేదు. వీరి బాధలు అధికారులు, ప్రజాప్రతినిదులకు పట్టడం లేదు. గ్యాస్ గోదాముల్లో కొనుగోలు చేయడానికి డబ్బులు లేక అడవుల్లో వంట చెరుకు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. సిలిండర్లు కొనుగోలు చేయడానికి అదిక ధరలు ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారు నేటికి వాటిని వినియోగించడం లేదు. వంటగ్యాస్ కనెక్షన్‌కు రూ.4500 నుంచి రూ5500 వరకు ఉండడంతో ఎంతో మంది వీటికి దూరమవుతున్నారు. గ్యాస్ ఒక సారి నింపడానికి రూ.850 రూ పాయలు ఖర్చవుతున్నాయి. నగదు బది లీ ద్వారా 177 రూపాయలు మాత్రమే బ్యాంకు ఖాతాలలో జమచేస్తున్నారు.
కట్టెల పొయ్యితో కష్టాలు..
ఆధునిక ప్రపంచంలో నేటికీ మండల పరిధిలోని అనేక గ్రామాల్లో మహిళలు కట్టెల పొయ్యిలు వాడుతూ అనారోగ్య పాలవుతున్నారు. కళ్లు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. దీ పం సిలిండర్లను పంపిణీ చేయాల్సిన అధికారులు, ప్ర జాప్రతినిధులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక గ్రామాల్లో వంటచెరు కు కోసం కొన్ని సందర్భాల్లో ఇంటిల్లిపాది అడవుల వెంట తిరుగుతున్నారు.
అధికారులు స్పందించాలి
చారకొండ: మా గ్రామంలో చాలా మందికి సిలిండర్లు లేవు. సిలిండర్లు లేక కట్టెల పొయ్యిలతో ఇబ్బందులకు గురౌతున్నారు. ప్రభుత్వం నుంచి మంజూరవుతున్న సిలిండర్లు పేదలకు అందడం లేదు. దీంతో మహిళలు కట్టెల కోసం అడవులకు వెళ్తూ అనేక పాట్లు పడుతున్నారు. అదికారులకు ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా కనికరించడం లేదు. సంబంధిత అధికారులు స్పందించి సబ్సిడీపై నిరుపేద కుటుంబాలకు సిలిండర్లు మంజూరు చేయాలి. మహిళల పాట్లు తొలగించాలి.
– కొండల్, జూపల్లి
Comments
Please login to add a commentAdd a comment