sylinder
-
సిలిండర్ లో నీళ్లు.. ఆందోళనకు దిగిన బాధితులు
-
కర్నూలులో ఘోర ప్రమాదం
సాక్షి, కర్నూలు: జిల్లాలోని వక్కరవాగు వద్ద శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న ఓ ఆటోలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ధాటికి ఆటో డ్రైవర్‌తో పాటు మరొకరు సంఘటనాస్థలంలోనే మృతిచెందారు. ఇంకొకరికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎండవేడి కారణంగా సిలిండర్లు పేలి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఆటోడ్రైవర్ పేరు రషీద్ అని తెలిసింది. సోడా షాపులకు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గ్యాస్ లీకేజీ : మూడు ఇళ్లు ధ్వంసం
రామసముద్రం : గ్యాస్ సిలిండర్ లీకై వచ్చిన పెను శబ్దానికి మూడు ఇళ్లు ధ్వంసమైన సంఘటన శుక్రవారం మండలంలోని కుదురు చీమనపల్లెలో చోటుచేసుకుంది. వివరాలు..గ్రామంలోని ఆర్.ఈశ్వర్‌రెడ్డి ఇంట ఉదయం వంట చేసి, సిలిండర్ రెగ్యులేటర్ ఆ ఫ్ చేయడం మరచారు. తలుపులు వేసుకుని పొలం పనులకు వెళ్లిపోయారు. ఆ సమయంలో రెగ్యులేటర్ నుంచి గ్యాస్ లీకైంది. తలుపులన్నీ మూసి ఉండడంతో అది బయటకు వెళ్లే మార్గం లేక ఇల్లంతా వ్యాపిం చింది. బెలూన్ను అదే పనిగా ఊదుతూ ఉంటే ఒక స్థితికి వచ్చేసరికి అది ఢామ్మనడం విదితమే. అదే తరహాలో ఈ ఇంట గ్యాస్ ఇల్లంతా వ్యాపించి ప్రమాదానికి దారితీసింది. గ్యాస్ ఇల్లంతా వ్యాపించి ఒత్తిడి ఎక్కువై ఉన్న తరుణంలో కరెంటు వచ్చింది. దీంతో పేలుడు తరహాలో ఆ ఇంట పెద్దపెట్టున శబ్దం వచ్చింది. దీని ధాటికి ఇంటి గోడలు, పైకప్పులతో కూలిపోయాయి. ఈ ఘటనలో ఇంట్లోని వస్తుసామగ్రి మొత్తం ధ్వంసమైంది. అలాగే పక్కనే ఉన్న ఈశ్వర్‌రెడ్డి సోదరుడు రామచంద్రారెడ్డి ఇంటి గోడలు, పొరుగునే ఉన్న ఎన్.శ్రీనివాసులురెడ్డి ఇంటి గోడలు సైతం కూలిపోయాయి. అతని ఇంటి ఆవరణలోని ద్విచక్రవాహనం సైతం ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇళ్లల్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఇక, పెద్దపెట్టున శబ్దం రావడంతో గ్రామస్తులు హడలిపోయారు. పరుగున అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఈశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఉరుకులు పరుగులతో అక్కడికి చేరుకున్నారు. భూకంపం వస్తే నేలమట్టమైన తరహాలో ఉన్న తమ ఇంటిని చూసి భోరున విలపించారు. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని వాపోయారు. గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం చేరవేశారు. ఎస్ఐ శివశంకర్, తహసీల్దార్ రామచంద్రయ్య, ఎంపీడీఓ మస్తాన్‌వల్లి, పంచాయతీ కార్యదర్శి వసుంధర, వీఆర్ఓ రామ్మూర్తి తదితరులు అక్కడికి చేరుకుని ప్రమాద ఘటనపై ప్రాథమిక విచారణ చేశారు. సుమారు రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. బాధితుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి : ఎమ్మెల్యే డిమాండ్ కుదురుచీమనపల్లెలో గ్యాస్ లీకై సంభవించిన ప్రమాదాన్ని తెలుసుకున్న మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి బాధితులను పరామర్శించారు. కూలిపోయిన గృహాలను పరిశీలించారు. బాధితులు, అధికారులతో ఆయన మాట్లాడారు. రూ.60 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు ఆయన పేర్కొన్నారు. బాధిత కుటుం బాలకు పక్కా గృహాలు మంజూరు చేయాలని, నష్టపరిహారం అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్కడికక్కడే అగ్నిమాపక సిబ్బంది ఆస్తి నష్టంపై ఫోన్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపి ఆదుకోవాలని సూచించారు. ఇక, గ్రామస్తులు పుంగనూరు ఇండేన్ గ్యాస్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ కన్వీనర్ భాస్కర్‌గౌడు, సింగిల్‌విండో చైర్మన్ కేశవరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు వెంకట్ర మణ, నాయకులు కృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, ఈశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ వాడకంపై అవగాహన పుంగనూరు అగ్నిమాపకాధికారి బాలసుబ్రమణ్యం, సిబ్బంది సుబ్బరాజు, లక్ష్మీనారాయణ, ఆనంద్ గ్యాస్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్యాస్ వాడకంలో అప్రమత్తంగా ఉంటే ఎలాంటి ప్రమాదాలూ సంభవించవన్నారు. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రదేశంలో ధారాళంగా వెలుతురూ, గాలి ప్రసరించేలా వెంటిలేటర్లు ఉండాలన్నారు. గ్యాస్ పొయ్యి మీద వంట పనులు పూర్తి అయ్యాక రెగ్యులెటర్ ఆఫ్ చేయాలన్నారు. ఆన్‌లో పెట్టి ఆదమరిస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. -
సిలిండర్ పేలి పూరిళ్లు దగ్ధం
నెల్లిమర్ల: నగర పంచాయతీలో గ్యాస్ సిలిండర్ పేలడంతో శుక్రవారం మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. దీనికి సంబంధించి స్థానికులు అందించిన వివరాలు...పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జికి సమీపంలోనున్న ఓ పూరింట్లో ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. దీంతో పక్కపక్కనే ఉన్న ఇట్లా అప్పారావు, ఇట్లా అప్పలనర్సమ్మ, ఇట్లా రమణలకు చెందిన మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. అప్పారావు కుమార్తెకు తాజాగా వివాహం నిశ్చయమైంది. పెళ్లి ఖర్చుల నిమిత్తం అప్పు చేసిన నగదు రూ. 75 వేలు, మూడు తులాల బంగారం ఈ ప్రమాదంలో కాలి బూడిదైంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో నిత్యావసరాలు సైతం కాలిపోయాయి. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ఇదిలా ఉంటే అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే ఫోన్ చేసినప్పటికీ ఫైర్ ఇంజన్ రావడం ఆలస్యమైంది. దీంతో వాహనం వచ్చేసరికి పూర్తిగా కాలిపోయాయి. రెవెన్యూ అధికారులు ప్రమాద స్థలానికి వచ్చి ఆస్తి నష్టం అంచనా వేశారు. రూ.5లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్టు ప్రాథమిక అంచనా. -
గ్యాస్ కోసం అగచాట్లు
కోటవురట్ల(పాయకరావుపేట): మండలవాసులకు గ్యాస్ కష్టాలు తీరలేదు. గంటల కొద్దీ నిరీక్షణ తప్పడం లేదు. పండగైనా, సెలవైనా పడిగాపులు కాయాల్సిందే. మండలంలో సుమారు 8 వేల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. భారత్, హెచ్‌పీ, ఇండేన్ గ్యాస్ కనెక్షన్లు ఉండగా ఒక్క గ్యాస్ ఏజన్సీ కూడా స్థానికంగా లేదు. హెచ్‌పీ, ఇండేన్ గ్యాస్ నర్సీపట్నం, భారత్ గ్యాస్ అడ్డురోడ్డు నుండి సరఫరా చేస్తున్నారు. వారానికోమారు వచ్చే గ్యాస్ వ్యాన్ కోసం మండలంలోని మెయిన్‌రోడ్డు వెంబడే కాకుండా మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో వినియోగదారులు గ్యాస్ కోసం వేచి ఉంటారు. సమయపాలన పాటించకపోవడంతో ఎపుడు వస్తుందో తెలియని వ్యాన్ కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు కాపలా కాస్తారు. గ్యాస్ బండలను క్యూలో పెట్టి ఎదురు చూస్తుంటారు. ఇది ఇరవై ఏళ్లుగా సాగుతున్న వ్యవహారమే. అప్పటికీ ఇప్పటికీ మార్పులేదు. వినియోగదారులు పెరిగారు తప్ప సరఫరా మాత్రం యథాతథం. గురువారం సెలవు రోజైనా సరే గ్యాస్ కోసం పలువురు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో పడిగాపులు కాసారు. మరికొందరు గ్యాస్ బండను సెక్యూరిటీగా తమ తలదగ్గర పెట్టుకుని కునుకుతీశారు. ఇదీ మండలంలోని గ్యాస్ వినియోగదారులు వ్యధ. -
వెలగని దీపం
చారకొండ : దీపం సిలిండర్లు అందక మండల పరిధిలోని గ్రామీణ మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంటచెరుకుకోసం మహిళలు, వృద్ధులు పడరాని పా ట్లు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలకులు గ్యాస్ సిలిండర్లు మంజూరు చేస్తున్నామని ఎంతో గొప్పలు చెప్పుకుంటున్నారు. కాని నేటికి వంటగ్యాస్ రాక ఇబ్బందులు పడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. మంజూరు కాని సిలిండర్లు... మండలంలో ప్రస్తుతం 8 గ్రామ పంచాయతీలలో 2000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 160 మంది దీపం పథకం క్రింద దరఖాస్తు చేసుకున్నారు. ఇంత వరకు మంజూరు కాలేదు. వీరి బాధలు అధికారులు, ప్రజాప్రతినిదులకు పట్టడం లేదు. గ్యాస్ గోదాముల్లో కొనుగోలు చేయడానికి డబ్బులు లేక అడవుల్లో వంట చెరుకు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. సిలిండర్లు కొనుగోలు చేయడానికి అదిక ధరలు ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారు నేటికి వాటిని వినియోగించడం లేదు. వంటగ్యాస్ కనెక్షన్‌కు రూ.4500 నుంచి రూ5500 వరకు ఉండడంతో ఎంతో మంది వీటికి దూరమవుతున్నారు. గ్యాస్ ఒక సారి నింపడానికి రూ.850 రూ పాయలు ఖర్చవుతున్నాయి. నగదు బది లీ ద్వారా 177 రూపాయలు మాత్రమే బ్యాంకు ఖాతాలలో జమచేస్తున్నారు. కట్టెల పొయ్యితో కష్టాలు.. ఆధునిక ప్రపంచంలో నేటికీ మండల పరిధిలోని అనేక గ్రామాల్లో మహిళలు కట్టెల పొయ్యిలు వాడుతూ అనారోగ్య పాలవుతున్నారు. కళ్లు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. దీ పం సిలిండర్లను పంపిణీ చేయాల్సిన అధికారులు, ప్ర జాప్రతినిధులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక గ్రామాల్లో వంటచెరు కు కోసం కొన్ని సందర్భాల్లో ఇంటిల్లిపాది అడవుల వెంట తిరుగుతున్నారు. అధికారులు స్పందించాలి చారకొండ: మా గ్రామంలో చాలా మందికి సిలిండర్లు లేవు. సిలిండర్లు లేక కట్టెల పొయ్యిలతో ఇబ్బందులకు గురౌతున్నారు. ప్రభుత్వం నుంచి మంజూరవుతున్న సిలిండర్లు పేదలకు అందడం లేదు. దీంతో మహిళలు కట్టెల కోసం అడవులకు వెళ్తూ అనేక పాట్లు పడుతున్నారు. అదికారులకు ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా కనికరించడం లేదు. సంబంధిత అధికారులు స్పందించి సబ్సిడీపై నిరుపేద కుటుంబాలకు సిలిండర్లు మంజూరు చేయాలి. మహిళల పాట్లు తొలగించాలి. – కొండల్, జూపల్లి -
గ్యాస్ సిలిండర్ లీక్: మహిళకు గాయాలు
హైదరాబాద్: సిలిండర్ లీకై ఓ మహిళకు గాయాలయిన సంఘటన నగరంలోని ఎల్బీనగర్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్తానిక నాగోల్ లో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో విజయలక్ష్మీ అనే మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు సమయంలో మరో రెండు సిలిండర్ కూడా ఉన్నాయి. సిలిండర్ పెలి ఉంటే పెద్ద ప్రమాదమే సంభవించేదని స్థానికులు అంటున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వంటగ్యాస్ సిలిండర్‌పై రూ. 3.46 పెంపు
వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.3.46 పెరిగింది. డీల్లర్లకు చెల్లించే కమిషన్ మొత్తాన్ని ప్రభుత్వం 9 శాతం పెంచడంతో ఈ పెరుగుదల చోటుచేసుకుంది. 14.2 కిలోల సిలిండర్‌పై డీలర్ల కమిషన్‌ను రూ.3.46 పెంచడంతో వారి కమిషన్ రూ.40.71 చేరుకుంది. ఫలితంగా సిలిండర్ అమ్మకపు ధర రూ.3.46 మేర పెరగనుందని చమురు మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. పెంచిన కమిషన్ మొత్తం వినియోగదారులపైనే పడుతుందని, కొత్త ధర మంగళవారం నుంచే అమల్లోకి వచ్చిందని వివరించారు. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్ బండ ధర రూ.410.50 ఉండగా, ధర పెంపు అనంతరం రూ.413.96కి చేరింది. మరోవైపు 5 కిలోల సిలిండర్‌పై కూడా డీలర్ల కమిషన్‌ను రూ.1.73 పెంచారు. దీంతో వారి కమిషన్ రూ.20.36కి చేరింది. ప్రస్తుతం ఢిల్లీలో 5 కిలోల సిలిండర్ ధర రూ.353 ఉంది. వేతనాలు, భత్యాల వంటి వ్యయం పెరిగిన నేపథ్యంలో డీలర్ల కమిషన్ పెంచినట్టు ఆ అధికారి తెలిపారు. అయితే సబ్సిడీ లేని సిలిండ్లరపై డిస్టిబ్యూటర్లకు అదనంగా ఇస్తున్న 75 పైసల కమిషన్ మొత్తంలో ఎలాంటి మార్పూ లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో సబ్సిడీ లేని సిలిండర్ ధర రూ.1,017.50గా ఉంది.