ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు
వాటిని పరిష్కరించకుంటే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని హెచ్చరిక
ఈ నెల 3న ఛలో పాలకొల్లుకు పిలుపు
పాలకొల్లులో భవిష్యత్ కార్యాచరణకు రూపకల్పన
సాక్షి, అమరావతి: ఆక్వా రంగ సమస్యల పరిష్కారానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆక్వా రైతులు ఉద్యమ బాట పడుతున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే ప్రకటించేందుకూ సిద్ధమవుతున్నారు. ఈ నెల 3న తలపెట్టిన ‘ఛలో పాలకొల్లు’ ద్వారా భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. అకాడెమీ ఆఫ్ సస్టైనబుల్ ఇంటిగ్రేటెడ్ లివింగ్, జై భారత్ క్షీర రామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి తీర ప్రాంత జిల్లాల రైతులు పాల్గొంటున్నారు.
ఈ సమావేశంలో చర్చించే అంశాలు, తీర్మానాల వివరాలను అకాడెమీ ఆఫ్ సస్టైనబుల్ ఇంటిగ్రేటెడ్ లివింగ్ డైరెక్టర్ షేక్ అలీ హుసేన్, ఆక్వా రైతు సంఘం అ«ధ్యక్ష, కార్యదర్శులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, బోనం చినబాబు సోమవారం మీడియాకు వివరించారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఆక్వా సాగుకు క్రాప్ హాలిడే ప్రకటిస్తామని హెచ్చరించారు.
ఆక్వా రైతుల డిమాండ్లు ఇవీ..
⇒ ఆక్వా రంగం బలోపేతానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఏటా కనీసం రూ.1000 కోట్లు కేటాయించాలి
⇒ జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లకు అనుగుణంగా చేపలు, రొయ్యలకు కనీస మద్దతు ధర ప్రకటించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి
⇒ దేశంలోనే ఎక్కడా లేని విధంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ (అప్సడా) చట్టాన్ని మరింత సమర్ధంగా అమలు చేయాలి
⇒ అప్సడా చట్టం ద్వారా హేచరీలను నియంత్రించాలి. నాణ్యత లేని వనామీ రొయ్యల మేత తయారు చేసే కంపెనీలను మూసివేయాలి.
⇒ అప్సడా చట్టం ద్వారా ఆక్వా రైతుల రిజి్రస్టేషన్‌ను మరింత సరళతరం చేసేందుకు మండల స్థాయిలో రిజి్రస్టేషన్ మేళాలు నిర్వహించాలి
⇒ వ్యవసాయ, ఉద్యాన పంటల మాదిరిగానే మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా ఏఏ ఆక్వా ఉత్పత్తులు ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలో ఏటా పంటల ప్రణాళిక ముందస్తుగా తయారు చేసి కచి్ఛతంగా అమలు చేయాలి
⇒ ఆక్వా సాగుకు ఉపయోగించే పెట్రో ఉత్పత్తులను జిల్లా పౌర సరఫరాల సంస్థ ద్వారా సబ్సిడీపై అందించాలి
⇒ ఆక్వా సాగుకు ఉపయోగించే విద్యుత్ పరికరాలు, ట్రాన్స్‌ఫార్మర్లలో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి విద్యుత్ శాఖ ద్వారా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి
⇒ ఆక్వా రైతుల ఫిర్యాదుల పరిష్కారానికి సింగిల్ విండో విధానం ప్రవేశÔ¶ పెట్టాలి.
⇒ దళారీల వల్ల మోసపోతున్న రైతుల కోసం తీర ప్రాంత జిల్లాల్లో ఆక్వా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి
⇒ నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్‌కు అనుబంధంగా మండలానికో ల్యాబ్, మండలానికో యాంటీ బయాటిక్ ల్యాబ్ ఏర్పాటు చేయాలి
⇒ గత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఆక్వా యూనివర్శిటీని వేగంగా పూర్తి చేసేందుకు తక్షణమే రూ.350 కోట్లు కేటాయించాలి. యూనివర్సిటీ ద్వారా వనామీ రొయ్యల సాగులో మెళకువులపై రైతులకు శిక్షణ ఇవ్వాలి
⇒ ఆక్వా పరికరాలకు 90 శాతం సబ్సిడీ, రిటైల్ అవుట్‌లెట్లకు 90 శాతం ఆరి్ధక సాయం అందించాలి
⇒ ఎన్నికల్లో ఇచి్చన హామీ మేరకు తీరప్రాంత జిల్లాల్లో ఆక్వా ఉత్పత్తుల నిల్వకు 90 శాతం సబ్సిడీతో శీతల గిడ్డంగులు నిర్మించాలి
⇒ జోన్‌తో సంబంధం లేకుండా ఎకరాకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరా చేయాలి. హేచరీలు, ఆక్వా నర్సరీలు, ప్రాసెసింగ్ యూనిట్లకు కూడా సబ్సిడీపై విద్యుత్ అందించాలి.
⇒ తల్లి రొయ్యలు, లార్వా, పోస్ట్ లార్వా ఫీడ్లతో పాటు మేత తయారీలో ఉపయోగించే ముడి పదార్ధాల దిగుమతిపై సుంకం ఎత్తివేయాలి
Comments
Please login to add a commentAdd a comment