aqua farmers
-
ఆ రొయ్యపై మనసైంది
ఆక్వా రైతులు ఫ్లోరిడా రొయ్యపై మన‘సై’ందని అంటున్నారు. మేలు రకం ఉత్పత్తిగా ఇప్పటికే మార్కెట్ నుంచి ప్రశంసలు అందుకుంటున్న ‘సై’ ఆక్వా రకం రొయ్యనుతమ చెరువుల్లోనూ దింపేందుకు సైసై అంటున్నారు. వ్యాధుల తీవ్రత గణనీయంగా తగ్గడం, దిగుబడిపై నమ్మకం కుదరడంతో ఇప్పటికే పలువురు రైతులు ఈ రకంతో లాభాలు చూస్తున్నారు. వనామీలో సుమారుగా 10కి పైగా తల్లిరొయ్యల ఉత్పత్తి సంస్థలు వారి జెనెటికల్లైన్స్ను హేచరీల ద్వారా అందిస్తున్నాయి.జిల్లాలో ఆక్వా రైతులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. సామాజిక మాధ్యమాల సాయంతో పలు రకాల సంస్థల సహకారంతో కొత్త కొత్త రకాలను పరిచయం చేసుకుంటున్నారు. వారిని మరింత ఉత్సాహ పరిచేలా వనామీలో కొత్తరకం జెనెటికల్ లైన్ ఇప్పుడు రికార్డు స్థాయిలో ఎఫ్‌పీఆర్ (ఫీడ్ కన్వర్షన్ రేషియో) నమోదవుతుంది. జిల్లాలో ఎక్కువ మంది రొయ్యల రైతులు ఇప్పుడు ఈ రకం రొయ్యల సాగు చేసేందుకు ఉత్సాహ పడుతున్నారు. జిల్లాలో రొయ్యల సాగు విస్తీర్ణం 4200 ఎకరాల వరకు ఉంటుంది. – పోలాకిఏమిటీ ‘సై’ ఆక్వా ‘సై’ ఆక్వా అనేది ఫ్లోరిడాకు చెందిన తల్లిరొయ్యల ఉత్పత్తి సంస్థ. ఎప్పటికçప్పుడు శాస్త్రీయంగా కొత్త జెనెటిక్స్ ఎంపిక, ఎగ్ ప్రొడక్షన్, లార్వాల ఉత్పత్తి, ఉత్తమ స్థాయి ఆరోగ్య నిర్వహణ చేసి మేలు రకం ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తారు. గతంలో టైగర్ రొయ్యల సాగు తర్వాత ఆక్వారంగం అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంది. వనామీ రకం సాగుతో కొంత వరకు బయటపడింది. ఆ తర్వాత రొయ్యల సాగు ఇలాంటి కొత్త జెనెటికల్ లైన్స్‌తో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తోంది. వనామీలో సుమారుగా 10కి పైగా తల్లిరొయ్యల ఉత్పత్తి సంస్థలు వారి జెనెటికల్ లైన్స్‌ను హేచరీల ద్వారా అందిస్తున్నాయి. ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆ ఉత్పత్తుల వాడకం జరుగుతుంది. మూడేళ్ల కిందటే జిల్లా పరిచయమైన సై ఆక్వా బ్యాలెన్స్ లైన్ రికార్డు స్థాయిలో విజయవంతమైంది. బ్యాలెన్స్ లైన్ ప్రత్యేకత అందుబాటులో ఉన్న జెనెటికల్ లైన్స్‌తో పోల్చితే తక్కువ కాలంలో ఎక్కువ పెరుగుదల కనబరుస్తూ, వ్యాధులను తట్టుకుంటూ, చక్కటి ఎఫ్‌సీఆర్ నమోదు కావటం దీని ప్రత్యేకత. ఆక్వా సాగులో మేత వినియోగం కీలకం. సగానికిపైగా పెట్టుబడి ఫీడింగ్ కోసం వెచ్చిస్తారు. సాధారణంగా 1కిలో రొయ్యల ఉత్పత్తికి 1.1కిలో నుంచి 1.3కిలో వరకు మేత వినియోగం జరిగితే రొయ్యలసాగు లాభ దాయకం అనుకోవచ్చు. సై ఆక్వా సాగు చేస్తున్న రైతులు ఇప్పుడు ఇదే ఎఫ్సీఆర్లో రొయ్యల ఉత్పత్తి చేస్తున్నారు. గతంలో 1.5కు పైగా ఎఫ్‌సీఆర్ నమోదైన సందర్భాలు కూడా ఉన్నాయి. బ్రూడ్ స్టాక్ దిగుమతి పెంచుతున్నాం ఇండియన్ కోస్ట్‌లో మా బ్యాలెన్స్ జెనెటికల్ లైన్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, బ్రూడ్‌స్టాక్(తల్లి రొయ్య) దిగుమతులు పెంచేందుకు ప్రతిపాదనలు చేశాం. రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి సాంకేతికంగా మరింత ముందకు తీసుకెళ్లేందుకు కృషిచేస్తాం. – జి.విద్యాధరరావు, టెక్నికల్ సేల్స్ మేనేజర్, సైఆక్వా రెండేళ్లుగా సాగు చేస్తున్నాం రెండేళ్లుగా ఈ రకం పీఎల్‌ను మేము సాగు చేస్తున్నాం. కొత్త జెనెటికల్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పాతకాలపు వ్యాధుల తీవ్రత బాగా తగ్గింది. బ్యాలెన్స్లైన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వైట్ గట్, రన్నింగ్ మోరా్టలిటీ వంటి వ్యాధుల తీవ్రత తగ్గింది. – చింతు అప్పన్న, ఆక్వా రైతు, బెలమర డిమాండ్ ఉంది ఇటీవల కాలంలో రైతుల నుంచి సై ఆక్వా బ్యాలెన్స్ లైన్ రకం రొయ్య పిల్లలకు డిమాండ్ పెరిగింది. అందుకు తగ్గస్థాయిలో మేము కూడా సిద్ధం చేసుకోవాల్సి వస్తోంది. కొన్నిసార్లు అడ్వాన్స్ బుకింగ్ లేకపోతే పీఎల్(పోస్ట్ లార్వా) అందించలేకపోతున్నాం. – ఎన్.కల్యాణ చక్రవర్తి, రమా స్రింప్ హేచరీస్, తోనంగి, గార -
ఆక్వా రైతుల ఉద్యమ బాట
సాక్షి, అమరావతి: ఆక్వా రంగ సమస్యల పరిష్కారానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆక్వా రైతులు ఉద్యమ బాట పడుతున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే ప్రకటించేందుకూ సిద్ధమవుతున్నారు. ఈ నెల 3న తలపెట్టిన ‘ఛలో పాలకొల్లు’ ద్వారా భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. అకాడెమీ ఆఫ్ సస్టైనబుల్ ఇంటిగ్రేటెడ్ లివింగ్, జై భారత్ క్షీర రామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి తీర ప్రాంత జిల్లాల రైతులు పాల్గొంటున్నారు.ఈ సమావేశంలో చర్చించే అంశాలు, తీర్మానాల వివరాలను అకాడెమీ ఆఫ్ సస్టైనబుల్ ఇంటిగ్రేటెడ్ లివింగ్ డైరెక్టర్ షేక్ అలీ హుసేన్, ఆక్వా రైతు సంఘం అ«ధ్యక్ష, కార్యదర్శులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, బోనం చినబాబు సోమవారం మీడియాకు వివరించారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఆక్వా సాగుకు క్రాప్ హాలిడే ప్రకటిస్తామని హెచ్చరించారు.ఆక్వా రైతుల డిమాండ్లు ఇవీ.. ⇒ ఆక్వా రంగం బలోపేతానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఏటా కనీసం రూ.1000 కోట్లు కేటాయించాలి ⇒ జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా చేపలు, రొయ్యలకు కనీస మద్దతు ధర ప్రకటించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి ⇒ దేశంలోనే ఎక్కడా లేని విధంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) చట్టాన్ని మరింత సమర్ధంగా అమలు చేయాలి ⇒ అప్సడా చట్టం ద్వారా హేచరీలను నియంత్రించాలి. నాణ్యత లేని వనామీ రొయ్యల మేత తయారు చేసే కంపెనీలను మూసివేయాలి. ⇒ అప్సడా చట్టం ద్వారా ఆక్వా రైతుల రిజి్రస్టేషన్‌ను మరింత సరళతరం చేసేందుకు మండల స్థాయిలో రిజి్రస్టేషన్ మేళాలు నిర్వహించాలి ⇒ వ్యవసాయ, ఉద్యాన పంటల మాదిరిగానే మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా ఏఏ ఆక్వా ఉత్పత్తులు ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలో ఏటా పంటల ప్రణాళిక ముందస్తుగా తయారు చేసి కచి్ఛతంగా అమలు చేయాలి ⇒ ఆక్వా సాగుకు ఉపయోగించే పెట్రో ఉత్పత్తులను జిల్లా పౌర సరఫరాల సంస్థ ద్వారా సబ్సిడీపై అందించాలి ⇒ ఆక్వా సాగుకు ఉపయోగించే విద్యుత్ పరికరాలు, ట్రాన్స్ఫార్మర్లలో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి విద్యుత్ శాఖ ద్వారా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి ⇒ ఆక్వా రైతుల ఫిర్యాదుల పరిష్కారానికి సింగిల్ విండో విధానం ప్రవేశÔ¶ పెట్టాలి. ⇒ దళారీల వల్ల మోసపోతున్న రైతుల కోసం తీర ప్రాంత జిల్లాల్లో ఆక్వా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి ⇒ నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్‌కు అనుబంధంగా మండలానికో ల్యాబ్, మండలానికో యాంటీ బయాటిక్ ల్యాబ్ ఏర్పాటు చేయాలి ⇒ గత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఆక్వా యూనివర్శిటీని వేగంగా పూర్తి చేసేందుకు తక్షణమే రూ.350 కోట్లు కేటాయించాలి. యూనివర్సిటీ ద్వారా వనామీ రొయ్యల సాగులో మెళకువులపై రైతులకు శిక్షణ ఇవ్వాలి ⇒ ఆక్వా పరికరాలకు 90 శాతం సబ్సిడీ, రిటైల్ అవుట్లెట్లకు 90 శాతం ఆరి్ధక సాయం అందించాలి ⇒ ఎన్నికల్లో ఇచి్చన హామీ మేరకు తీరప్రాంత జిల్లాల్లో ఆక్వా ఉత్పత్తుల నిల్వకు 90 శాతం సబ్సిడీతో శీతల గిడ్డంగులు నిర్మించాలి ⇒ జోన్‌తో సంబంధం లేకుండా ఎకరాకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరా చేయాలి. హేచరీలు, ఆక్వా నర్సరీలు, ప్రాసెసింగ్ యూనిట్లకు కూడా సబ్సిడీపై విద్యుత్ అందించాలి. ⇒ తల్లి రొయ్యలు, లార్వా, పోస్ట్ లార్వా ఫీడ్లతో పాటు మేత తయారీలో ఉపయోగించే ముడి పదార్ధాల దిగుమతిపై సుంకం ఎత్తివేయాలి -
ఆక్వా, పాడి రైతులకు భరోసా
సాక్షి, అమరావతి: కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా పాడి, ఆక్వా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఒక్కో ఆక్వా రైతుకు గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఆరి్థక చేయూతనిస్తుండగా.. పాడి రైతులకు ఎలాంటి హామీ లేకుండా రూ.1.60 లక్షల వరకు రుణాలిస్తోంది. కార్డుల జారీ, రుణ పరపతి కోసం ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ ఆధారిత అప్లికేషన్ కూడా అభివృద్ధి చేసింది. జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించి మరీ రుణాలు మంజూరు చేస్తోంది. ముందెన్నడూ లేనివిధంగా ఐదేళ్లలో రూ.4,420.38 కోట్ల రుణాలను ప్రభుత్వం అందించింది. కార్డు పొందే పాడి రైతులకు బీమా సదుపాయం కూడా కల్పించింది. తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీలో 1.5 శాతం చొప్పున ఏటా వడ్డీ రాయితీ పొందొచ్చు. సకాలంలో చెల్లించిన వారికైతే 3 శాతం వరకు వడ్డీ రాయితీ పొందే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఐదేళ్లలో 1.30 లక్షల మంది పాడి, ఆక్వా రైతులకు రూ.4,420 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రుణాలుగా అందించింది. పాడి రైతులకు రూ.1,747.18 కోట్లు వైఎస్సార్ చేయూత, ఆసరా వంటి పథకాల ద్వారా పొందిన లబి్ధతో పాడి పశువులు, సన్న జీవాలు కొనుగోలు చేసిన పాడి రైతులకు ప్రభుత్వం పశు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేసింది. జగనన్న పాలవెల్లువ, జగనన్న జీవక్రాంతి పథకాల కింద ఐదేళ్లలో 5.15 లక్షల మందికి మూగ, సన్నజీవాలను అందించింది. వీరందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేసింది. కార్డులు పొందిన వారిలో ఇప్పటివరకు 1,38,392 మంది రుణాల కోసం దరఖాస్తు చేయగా, వారిలో 1,13,399 మందిని అర్హులుగా గుర్తించింది. వీరిలో ఇప్పటికే 1,09,199 మందికి రూ.1.60 లక్షల వరకు రుణాలు ఇచి్చంది. ఇలా రూ.1,747.18 కోట్ల రుణం అందించింది. వ్యక్తిగతంగానే కాకుండా గ్రూపులుగా ఏర్పడినా కేసీసీ కార్డులు జారీ చేసేందుకు అవకాశం కల్పించింది. ఆర్బీకేల ద్వారా దరఖాస్తు చేసే పాడి రైతులు ఎంతకాలం నుంచి పశుపోషణ చేస్తున్నారు, ఎంత పాడి ఉంది, ఎన్ని పాలను ఉత్పత్తి చేస్తున్నారనే వివరాలను స్థానిక పశువైద్యాధికారి ధ్రువీకరిస్తే చాలు. ఎలాంటి హామీ లేకుండా రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంది. ఈ రుణాలతో పాడి రైతులు పశువులు, సన్నజీవాలకు షెడ్లు, మంచినీటి తొట్టెల నిర్మాణం, తాళ్లు, ఇతర సామగ్రితో పాటు పశుగ్రాసం కొనుగోలు చేశారు. ఆక్వా రైతులకు రూ.2,673 కోట్లు ఐదేళ్లలో 19,059 మంది ఆక్వా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. కార్డులు పొందిన ఆక్వా రైతులకు ప్రతి సీజన్లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణం ఇస్తోంది. ఇందులో మొదటి రూ.2 లక్షలను కేసీసీ రుణంగా పరిగణిస్తోంది. రూ.2 లక్షలపై 2 శాతం, మిగిలిన రుణం సకాలంలో చెల్లిస్తే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కింద మరో 3 శాతం వడ్డీ రాయితీ పొందే వెసులుబాటు కల్పించింది. ఇలా ఐదేళ్లలో రూ.2,673 కోట్లను రుణాలుగా ఇచ్చింది. -
రొయ్య రైతుల ‘ధర’హాసం
సాక్షి, అమరావతి: ఏపీలో 100 కౌంట్ రొయ్యలకు ప్రభుత్వం నిర్దేశించిన ధర కిలో రూ.210. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రాసెసింగ్ యూనిట్లు చెల్లిస్తున్న ధర రూ.245. ఇదే కౌంట్ రొయ్యలను గుజరాత్, తమిళనాడులో రూ.230కు కొనుగోలు చేస్తుండగా.. ఒడిశాలో రూ.210కు మించి కొనడం లేదు. 30 కౌంట్ రొయ్యలకు ఏపీ ప్రభుత్వం నిర్దేశించిన ధర రూ.380 కాగా.. ప్రాసెసింగ్ ఆపరేటర్లు కొనుగోలు చేస్తున్న ధర రూ.470. ఇదే కౌంట్ రొయ్యలను ఒడిశాలో రూ.370, గుజరాత్లో రూ.380, తమిళనాడులో రూ.430కు కొనుగోలు చేస్తున్నారు. ఏపీలో దక్కుతున్న గిట్టుబాటు ధర దేశంలో మరే రాష్ట్రంలోనూ రొయ్యల రైతులకు దక్కడం లేదు. ఆక్వా రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న కృషే ఇందుకు ప్రధాన కారణమని ఆక్వా రైతులే చెబుతున్నారు. ఫలించిన ప్రభుత్వ చర్యలు ఆక్వా జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు విస్తీర్ణంలో చెరువులు కలిగిన ప్రతి రైతుకూ యూనిట్ విద్యుత్ రూ.1.50కే సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తోంది. నాణ్యమైన సీడ్, ఫీడ్ అందిస్తూ.. పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర కల్పన కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. సంక్షోభ సమయంలో ఏ ఒక్క రైతు ఆర్థికంగా నష్టపోకూడదన్న సంకల్పంతో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, అప్సడా కో–వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్‌తో ఏర్పాటు చేసిన ఆక్వా సాధికారత కమిటీ ప్రతి నెలా సమావేశమవుతూ రైతులకు ఏ మాత్రం నష్టం కలుగకుండా క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలు, మార్కెట్లో కొనుగోలు చేస్తున్న ధరలను సమీక్షిస్తూ ప్రతి రైతుకు మద్దతు ధర దక్కేలా యంత్రాంగానికి దిశా నిర్దేశం చేస్తోంది. మరోవైపు అప్సడా ఆధ్వర్యంలో ప్రతి 15 రోజులకు ఒకసారి రైతులతో పాటు ప్రాసెసింగ్ ఆపరేటర్లు, ఎగుమతిదారులతో సమావేశాలు నిర్వహిస్తూ అంతర్జాతీయంగా ధరలు పతనమైన సందర్భంలో కూడా స్థానికంగా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటోంది. ఆక్వా రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్‌తో కాల్ సెంటర్‌ను సైతం ఏర్పాటు చేసింది. ఇలా అడుగడుగునా ప్రభుత్వం అండగా నిలుస్తుండడంతో రాష్ట్రంలో ఆక్వా రైతులకు అన్ని విధాలుగా భరోసా లభిస్తోంది. మంచి ధర వస్తోంది ఆక్వా రైతులకు మంచి ధర లభిస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ధర చెల్లిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల కంటే మిన్నగా ఏపీ రైతులకు గిట్టుబాటు ధర దక్కుతోంది. గడచిన ఐదేళ్లలో ఆక్వా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా నిలిచింది. – వత్సవాయి లక్ష్మీకుమార్రాజా, ఆక్వా రైతు, అరిపిరాల, కృష్ణా జిల్లా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి 10 రోజులకు ఒకసారి రొయ్యల ధరలను సమీక్షిస్తున్నాం. మార్కెట్లో హెచ్చుతగ్గులను గమనిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన ధర రైతులకు దక్కేలా చూస్తున్నాం. ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క ఆక్వా రైతు నష్టపోకుండా ప్రభుత్వం అన్నివిధాలుగా తోడుగా నిలిచింది. మూడుసార్లు పెంచిన ఫీడ్ ధరలను కంపెనీలు ఉపసంహరింపజేశాం. నాణ్యమైన సీడ్, ఫీడ్ అందేలా ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నాం. – వడ్డి రఘురామ్, కో–వైస్ చైర్మన్, అప్సడా -
అర్హతగల ఆక్వా రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన ఆక్వా రైతులందరికీ సబ్సిడీపై విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరావు, బొత్స సత్యనారాయణ, డాక్టర్ సీదిరి అప్పలరాజు, అప్సడా కో వైస్ చైర్మన్ వడ్డి రఘురాం స్పష్టంచేశారు. విజయవాడలోని మంత్రి పెద్దిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆక్వా సాధికారికత కమిటీ సమావేశం జరిగింది. ఇటీవల ఈ–ఫిష్ సర్వే ద్వారా ఆక్వా జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు అర్హత పొందిన 3,467 విద్యుత్ కన్‌క్షన్లకు మార్చి ఒకటో తేదీ నుంచి విద్యుత్ సబ్సిడీ వర్తింపజేయాలని డిస్కమ్‌లను ఆదేశిస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేశారు. రాష్ట్రంలో 4,68,458 ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా, దానిలో 3,33,593.87 ఎకరాలు ఆక్వాజోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు ఉన్నట్టుగా ఈ–ఫిష్ సర్వే ద్వారా నిర్ధారించినట్లు మంత్రులు తెలిపారు. మొత్తం 66,993 విద్యుత్ కనెక్షన్లలో ఇప్పటికే ఆక్వా జోన్ పరిధిలో అర్హత పొందిన 50,605 కనెక్షన్లకు విద్యుత్ సబ్సిడీ వర్తింపజేస్తుండగా, తాజాగా కమిటీ ఆమోదంతో ఆ సంఖ్య 54,072కు పెరిగిందన్నారు. ఆక్వా రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా రూ.3,306.5 కోట్లు విద్యుత్ సబ్సిడీని డిస్కమ్‌లకు చెల్లించిందన్నారు. తాజాగా అర్హత పొందిన కనెక్షన్లకు ఏటా రూ.55 కోట్లు అదనపు భారం పడనుందన్నారు. ఆక్వా రైతాంగానికి అండగా నిలిచేందుకు సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. నాణ్యమైన సీడ్ సరఫరా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని వడ్డీ రఘురాం చెప్పారు. ఇక నుంచి అప్సడా అనుమతి పొందిన తర్వాతే విదేశాల నుంచి బ్రూడర్స్‌ను దిగుమతి చేసుకోవాలని, అలా చేయని కంపెనీలపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కొత్తగా విద్యుత్ కనెక్షన్లు పొందేవారిలో అర్హులను గుర్తించి సబ్సిడీ వర్తింపజేసేందుకు మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తామన్నారు. ఏపీలోనే వంద కౌంట్ రూ.245 ఆక్వా ఉత్పత్తుల రేట్లను ఆర్బీకేల ద్వారా ప్రకటిస్తూ, దళారుల చేతుల్లో రైతులు మోసపోకుండా తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని అధికారులు వివరించారు. వంద కౌంట్ రొయ్యలకు కేజీకి రూ.245 ధర ప్రస్తుతం మార్కెట్లో లభిస్తోందన్నారు. గుజరాత్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే ఎక్కువ రేటు రైతుకు దక్కుతోందన్నారు. సమావేశంలో స్పెషల్ సీఎస్‌లు గోపాలకృష్ణ ద్వివేది, నీరబ్‌కుమార్ ప్రసాద్, కె.విజయానంద్ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు, మత్స్యశాఖ కమిషనర్ కూనపురెడ్డి కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. -
రొయ్యకు బీమా.. రైతుకు ధీమా
సాక్షి, భీమవరం: ఆక్వా రైతుకు అడుగడుగునా అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బీమా సదుపాయంతో సాగులో వారికి ధీమా కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో బీమా పాలసీ కల్పనకు ఇప్పటికే రాష్ట్రాన్ని కేంద్రం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. బీమా పాలసీలపై రైతులకు అవగాహన కల్పించి, వారి అభిప్రాయాలు తీసుకునేందుకు ఆలిండియా ప్రాన్ ఫెడరేషన్, స్టేట్ ప్రాన్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. అందులో భాగంగా శనివారం పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి 200 మందికి పైగా ఆక్వా రైతు సంఘాల నాయకులు, రైతులు హాజరయ్యారు. ఓరియంటల్, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ, అలయన్స్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై వారు అందించే పాలసీల వివరాలను రైతులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సాగు కాలం, ప్రీమియం రేట్లు, సైక్లోన్ జోన్, నాన్ సైక్లోన్ జోన్లలో పాలసీ కవరేజీ వివరాల గురించి అవగాహన కల్పించారు. రైతులు తమ ఎంపిక ప్రకారం 135 రోజుల నుంచి 180 రోజుల వరకు ప్రాథమిక కవర్‌ను ఎంచుకోవడం ద్వారా ప్రకృతి వైపరీత్యాల నుంచి పంట నష్టాన్ని కవర్ చేసుకోవచ్చునని తెలిపారు. పాలసీలపై రైతులు లేవనెత్తిన సందేహాలను బీమా సంస్థల ప్రతినిధులు నివృత్తి చేశారు. వ్యాధులు, వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న ఖర్చులు, మార్కెట్ సమస్యలు, ఇతర సవాళ్లను ఆక్వా రైతులు అధిగమించేందుకు ప్రభుత్వం బీమా పాలసీ తెచ్చిందని ఫిషరీస్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అంజలి ఈ సందర్భంగా తెలిపారు. ఫిషరీస్ జేడీ మాధవీలత, డిప్యూటీ డైరెక్టర్ ఆనందరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి ఆర్వీఎస్వీ ప్రసాద్, నేషనల్ ప్రాన్ ఫార్మర్స్ అధ్యక్షుడు ఐపీఆర్ మోహనరావు, ఏపీ ప్రాన్ ఫార్మర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జీకేఎఫ్ సుబ్బరాజు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మల్ల రాంబాబు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా ఆక్వా ఫార్మర్స్ అధ్యక్షుడు నాగభూషణం, వత్సవాయి కుమార్‌రాజా తదితరులు పాల్గొన్నారు. రైతుల ప్రయోజనాల కోసమే బీమా ఈ సదస్సులో అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం మాట్లాడుతూ ఆక్వా రైతుల ప్రయోజనాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. ఏదోక పాలసీని తెచ్చి రైతులపై రుద్దకుండా వారి సూచన మేరకు ప్రయోజనకరమైన పాలసీ తేవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తోందన్నారు. ఫిబ్రవరి 10 నాటికి సదస్సులు పూర్తి చేసి పాలసీలపై రైతుల నుంచి వచ్చిన సూచనలను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. గత ఎన్నికలకు ఆరు నెలల ముందు చంద్రబాబు ఆక్వా రైతులకు పెట్టిన రూ. 340 కోట్ల విద్యుత్ బకాయిలను వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించిందని వివరించారు. అప్సడా ఏర్పడిన ఏడాదిన్నర కాలంలో రైతులకు మూడు లక్షలకు పైగా సబ్సిడీ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో బ్రూడల్ స్టాక్ మెయింటెనెన్స్ సెంటర్ (బీఎంసీ) ఏర్పాటులో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం బంగారుపేటలో రూ. 36 కోట్లతో బీఎంసీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ఆగస్టు నాటికి ప్రారంభించే విధంగా సీఎం జగన్ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారని రఘురాం తెలిపారు. -
చంద్రబాబు మమ్మల్ని మోసం చేస్తే..సీఎం జగన్ ఆదుకున్నారు..
-
రొయ్యల రైతుకు చేదోడు.. చైన్ డ్రాగింగ్ బోట్!
చైన్ డ్రాగింగ్ బోట్’.. రొయ్యల సాగులో రైతులకు ఉపయోగపడే ఒక ఆవిష్కరణ ఇది. ఆక్వా సాగులో శారీరక కష్టం, ఖర్చు, వ్యాధుల బెడద తగ్గించడంతో పాటు రొయ్యల నాణ్యత పెంపొందించేందుకు ఈ చైన్ డ్రాగింగ్ బోట్ ఉపయోగపడుతుంది. చైన్ డ్రాగింగ్ అంటే? రొయ్యల పట్టుబడి పూర్తయిన తర్వాత చెరువును ఎండగడతారు. ఎండి నెర్రెలుబారిన ఆ చెరువులో మళ్లీ రొయ్యల సాగు ప్రారంభించడానికి చెరువులో నీరు నింపిన తర్వాత.. నేలను సిద్ధం చేసే క్రమంలో ఇనుప గొలుసులు చెరువు అడుగున వేసి, ఇద్దరు మనుషులు నడుములోతు నీటిలో నడుస్తూ లాగుతారు. దీన్నే చైన్ డ్రాగింగ్ అంటారు. తద్వారా చెరువు అడుగు మట్టిలో వ్యర్థాలు, విషవాయువులు బయటకు వెళ్లిపోవటంతో పాటు రొయ్యలకు సహజ ఆహారమైన ప్లవకాలు వృద్ధి చెందుతాయి. అయితే, మనుషులు నీటిలో నడుస్తూ చైన్ డ్రాగింగ్ చేయటం వ్యయ ప్రయాసలతో కూడిన పని. ఈ పనిని సులువుగా, తక్కువ కాలంలో, తక్కువ ఖర్చుతో చేయడానికి ఉపయోగపడే వినూత్నమైన పడవకు గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ అధ్యాపకుడు డాక్టర్ తౌసీఫ్ అహ్మద్ రూపుకల్పన చేశారు. ఈ ‘చైన్ డ్రాగింగ్ బోట్’ఆక్వా రైతులకు ఎంతో ప్రయోజనకరంగా నిలుస్తోంది. గుంటూరు జిల్లా నిజాంపట్నం ప్రాంతంలోని ఆక్వా రైతుల కోరిక మేరకు నాలుగేళ్ల క్రితం డాక్టర్ ౖతౌసీఫ్ పరిశోధనలు ప్రారంభించారు. ఈ క్రమంలో యూనివర్సిటీలోని త్రీడీ ఎక్స్పీరియన్స్ ల్యాబ్‌లో ‘చైన్ డ్రాగింగ్ బోట్’ను డిజైన్ చేశారు. ఈ ఆవిష్కరణకు భారతీయ పేటెంట్ సంస్థ 2020లో డిజైన్ పేటెంట్‌ను మంజూరు చేసింది. 'చైన్ డ్రాగింగ్ బోట్’ లీటరు పెట్రోల్‌తో 2 గంటలు పనిచేస్తుంది. దీనితో అర గంట సమయంలోనే 10 ఎకరాల్లోని రొయ్యల చెరువుల్లో చైన్ డ్రాగింగ్ పనిని పూర్తి చేయవచ్చని డా. తౌసీఫ్ తెలిపారు. మనుషులు చేసిన దానికంటే అధిక సామర్థ్యంతో స్లడ్జ్ వంటి వ్యర్థాలను తొలగించటం, చెరువు అడుగు నేలను గుల్లబరచటంలో ప్రయోజనకారిగా నిలుస్తోందన్నారు. ‘ఆంగ్రూ’ ప్రోత్సాహం ‘చైన్ డ్రాగింగ్ బోట్’కు సంబంధించి డాక్టర్ వైఎస్సార్ ఏఎన్‌యూ ఇంజనీరింగ్ కళాశాలలోని త్రీడీ ఎక్స్పీరియన్స్ ల్యాబ్‌లో ప్రత్యేక డిజైన్‌ను రూపొందించిన డా. తౌసీఫ్ అహ్మద్.. అందుకు అనుగుణంగా మూడు ప్రత్యేక స్టీల్ ఫ్రేమ్‌లతో కూడిన బోట్‌ను తయారు చేయించారు. దానికి జీఎక్స్ 160 హోండా ఇంజన్‌ను, వెను చైన్‌ను అమర్చారు. పెట్రోల్‌తో నడిచే ఈ బోట్‌పై ఒకరు కూర్చుని నడపవచ్చు. దీని తొలి బోట్‌ను రైతులకు ఇచ్చి వాడిన తర్వాత వారి సూచనల మేరకు తగు మార్పులు చేశారు. చైన్ డ్రాగింగ్ బోట్ ప్రాజెక్టుకు తిరుపతిలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్విద్యాలయం (ఆంగ్రూ) పోషన్ ఇంక్యూబేషన్ సెంటర్ రూ. 5 లక్షలను అందించింది. ఈ ఆవిష్కరణను న్యూఢిల్లీలోని ప్రధాన మంత్రి కిసాన్ మేళాలో కూడా ఇటీవల ప్రదర్శించారు. సబ్సిడి కోసం ప్రయత్నిస్తున్నాం.. చైన్ డ్రాగింగ్ బోట్ వాడకం వల్ల రొయ్యల నాణ్యత, సర్వయివల్ రేటు పెరుగుతుంది. ‘ఆంగ్రూ’ సహకారంతో కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా సబ్సిడీపై ఆక్వా రైతులకు ఈ బోట్లను అందించేందుకు చర్యలు చేపడుతున్నాం. తౌషా టెక్నాలజీ ఇన్నోవేషన్ అనే స్టార్టప్ ద్వారా రైతులకు వారం రోజుల్లో తయారు చేయించి ఇస్తున్నాం. – డా. తౌసీఫ్ అహ్మద్ (98852 09780), ఆవిష్కర్త, నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, గుంటూరు రొయ్యలు పెరిగే కాలంలో కూడా.. ‘చైన్ డ్రాగింగ్ బోట్’కు ఆక్వా రైతుల నుంచి ఆదరణ లభిస్తోంది. డా. తౌసీఫ్ అహ్మద్ రెండు బోట్లను తయారు చేసి నిజాంపట్నం ప్రాంతంలోని ఆక్వా రైతులకు అందజేశారు. ఒకొక్క బోట్ తయారీ వ్యయం రూ. 80 నుంచి 90 వేలు ఉంటుందని, ఆర్డర్ ఇచ్చిన వారం రోజుల్లో తయారు చేసి ఇవ్వగలం. ఆక్వా రైతులకు అవగాహన కల్పించేందుకు ఒక బోట్‌ను విజయవాడలోని కృష్ణా నదీ తీరంలో ప్రదర్శనకు పెట్టారు. బోట్‌ను మనిషి గట్టు మీద నుంచే రిమోట్ పద్ధతిలో విద్యుత్తు బ్యాటరీ లేదా సౌర విద్యుత్తు ద్వారా నడిపించేందుకు పరిశోధనలు కొనసాగిస్తున్నానని డా. తౌసీఫ్ తెలిపారు. రొయ్యల సాగు ప్రారంభ దశలోనే కాకుండా, రొయ్యల పెంపకం జరిగే కాలంలో కూడా చైన్ డ్రాగింగ్ బోట్‌ను నడిపేందుకు ఆయన పరిశోధనలు కొనసాగిస్తున్నారు. పనిలో పనిగా డైనమిక్ ఎయిరేషన్ వ్యవస్థను కూడా ఈ బోట్‌కు అనుసంధానం చేస్తున్నామన్నారు. రొయ్య పిల్లలకు హాని కలగకుండా ఉండేలా అల్యూమినియం ప్రొపెల్లర్‌కు బదులు ఫైబర్ ప్రొపెల్లర్‌ను వినియోగించనున్నామని వివరించారు. – దాళా రమేష్ బాబు, సాక్షి ప్రతినిధి, గుంటూరు ఇన్పుట్స్: డా.ఎన్.అశోక్ కుమార్, సాక్షి, ఏఎన్‌యూ (చదవండి: కొబ్బరికాయ భూగర్భ జలాల జాడను కనిపెట్టగలదా? సైన్స్ ఏం చెబుతోంది..?) -
తల్లి రొయ్య ఇక లోకల్
సాక్షిప్రతినిధి, కాకినాడ: అమెరికన్ తల్లి రొయ్యకు మన ఆక్వా రైతులు త్వరలో గుడ్‌బై చెప్పనున్నారు. తల్లి రొయ్యలను దేశీయంగా మన హేచరీల్లో ఉత్పత్తి చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తీర ప్రాంత రాష్ట్రాల్లోని హేచరీల్లో రొయ్య పిల్లల పునరుత్పత్తి కోసం తల్లి రొయ్యలను కొన్నేళ్లుగా లక్షలు వెచ్చించి అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మన హేచరీల్లో బ్లాక్ టైగర్(మోనాడామ్) తల్లి రొయ్యలు 2009కి ముందు భారతీయ సముద్ర జలాల్లో లభించేవి. ఆ తర్వాత బ్లాక్‌టైగర్ 60 శాతం బాక్టీరియాతో రోగాల బారిన పడి తల్లి రొయ్యలు దెబ్బతిన్నాయి. అనంతరం రోగాల్లేని తల్లి రొయ్యలను ఉత్పత్తి చేస్తున్న అమెరికా నుంచి వెనామీ దిగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. పసిఫిక్ మహాసముద్రంలో మాత్రమే లభించే ఈ వెనామీ(ఎగ్జోటిక్ స్పీసిస్)వైట్‌లెగ్ ష్రింప్‌ను దిగుమతి చేసుకునేలా నిబంధనలను సడలించింది. అమెరికాలో వెనామీని పునరుత్పత్తి చేస్తున్న కంపెనీల్లో ఎంపిక చేసిన 14 కంపెనీల నుంచి తల్లి రొయ్య దిగుమతి చేసుకునేలా ఒప్పందం కుదిరింది. ఇలా దిగుమతి చేసుకునే వెనామీని చెన్నైలోని సెంట్రల్ క్వారంటైన్లో ఐదు రోజులు అన్ని పరీక్షల అనంతరం ఒడిశా, గుజరాత్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా.. మన రాష్ట్రంలోని హేచరీల్లో వినియోగిస్తున్నారు. వెనామీ తల్లి రొయ్య ప్రస్తుతం అమెరికాలో 80 డాలర్లు (రూ.6,400) పలుకుతోంది. కస్టమ్స్, లాజిస్టిక్, ఫ్లైట్ చార్జీలు 30 శాతం అదనంగా కలుపుకొంటే సుమారు రూ.10,000 వరకు అవుతుంది. ఇక్కడి హేచరీలు అమెరికాలోని టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాల నుంచి ఏటా 2లక్షల నుంచి 2.50 లక్షల తల్లి రొయ్యలను దిగుమతి చేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా తీరంలో 550 హేచరీలుంటే అత్యధికంగా మూడొంతులు హేచరీలు కాకినాడ తీరంలోనే ఉండటం విశేషం. మరో రెండేళ్ల సమయం.. కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీకి కేంద్రం తీసుకొచ్చి న సవరణలు వెనామీ తల్లి రొయ్యల స్థానే.. దేశీయంగా తల్లి రొయ్యల ఉత్పత్తికి మార్గం సుగమం చేశాయని చెప్పొచ్చు. ఇందుకోసం రెండు దశలను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. తొలి దశలో బ్రూడ్‌స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్(బీఎంసీ)లు, మలి దశలో న్యూక్లియర్ బ్రీడింగ్ సెంటర్(ఎన్బీఎస్)లు నెలకొల్పుకోవచ్చు. ఈ రెండు దశలు పూర్తయ్యేసరికి తల్లి రొయ్య కోసం అమెరికాపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఈ రెండు దశలు చేరుకోవడానికి మరో రెండేళ్లు పడుతుందని అంచనా. తొలి దశలో భాగంగా బీఎంసీ ద్వారా తల్లి రొయ్య స్థానంలో పిల్ల రొయ్యలను దిగుమతి చేసుకుంటారు. బ్రూడ్‌స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్(బీఎంసీ)లలో పిల్ల రొయ్యలను పునరుత్పత్తి చేస్తారు. అమెరికా నుంచి దిగుమతిచేసుకునే ఒక తల్లి రొయ్య స్థానంలో అంతే ఖర్చుతో 1000 పిల్ల రొయ్యలను పునరుత్పత్తి చేయొచ్చు. ఇలా పిల్ల రొయ్యలను దిగుమతి చేసుకుని బీఎంసీలలో పునరుత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియ ఇప్పటికే మన రాష్ట్రంలో నిర్వహించేందుకు వీలుగా పలు సెంటర్లకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం నెల్లూరు బీఎంఆర్, భీమవరం ఆమందా, శ్రీకాకుళం కోనాబే, విశాఖలో ఎమ్పెడా బీఎంసీ(బ్రూడ్‌స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్స్)లు సిద్ధమయ్యాయి. మలి దశలో ఇక అమెరికా వైపు కన్నెత్తి చూడాల్సిన అవసరం లేకుండా మనమే నేరుగా తల్లి రొయ్యను పునరుత్పత్తి చేయొచ్చు. ఇందుకోసం న్యూక్లియర్ బ్రీడింగ్ సెంటర్లు నెలకొల్పుతారు. ప్రస్తుతం అమెరికాలో మాత్రమే నిర్వహిస్తున్న సెంటినల్ ట్రైల్స్ ఇక్కడ ఏర్పాటు చేసే ఎన్బీసీలలో నిర్వహిస్తారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులకనుగుణంగా జెనెటిక్ బ్రీడింగ్, జెనెటిక్ ప్రాసెసింగ్ చేస్తారు. ఇక లక్షలు ఖర్చుపెట్టాల్సిన అవసరం ఉండదు.. బ్రూడ్‌స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్ల ఏర్పాటు ద్వారా మన తల్లి రొయ్యను మనమే పునరుత్పత్తి చేసుకునేందుకు వీలుంటుంది. దీనివల్ల అమెరికా నుంచి లక్షలు ఖర్చుపెట్టి తల్లి రొయ్యలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఇక ఉండదు. – హరినారాయణరావు, ప్రధాన కార్యదర్శి, ఆలిండియా ష్రింప్హేచరీస్ అసోసియేషన్ -
ఆక్వా రైతును కాపాడుకుందాం..
సాక్షి, అమరావతి : ఆక్వా రైతును కాపాడుకోకుంటే ఆ పరిశ్రమ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్‌రావు, అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాంలు కంపెనీలను హెచ్చరించారు. ఆక్వా రైతుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందని, అదే రీతిలో ఈ పరిశ్రమలు కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు, హేచరీలు, మందుల కంపెనీల ప్రతినిధులతో శనివారం విజయవాడలో జరిగిన సాధికారత కమిటీ భేటీలో ఎంపీ మస్తాన్‌రావు మాట్లాడుతూ తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాలు యూనిట్ విద్యుత్ రూ.8కి సరఫరా చేస్తుండగా.. మన రాష్ట్రంలో మాత్రమే యూనిట్ రూ.1.50కే సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కౌంట్ రూ.210 చొప్పున కొనుగోలు చేసినా ఎగుమతిదారులకు ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. హేచరీలతో పాటు ఫీడ్ ప్లాంట్ నిర్వాహకులు కూడా రైతులపై భారం తగ్గించేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రైతులతో పాటు హేచరీలు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంబంధించి ఢిల్లీకి ప్రతినిధుల బృందం వస్తే సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సీఆర్‌జెడ్ పరిధిలోని హేచరీలను మూసివేయాలన్న గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను అమలు చేయకుండా అడ్డుకోగలిగామని, ఆ మేరకు కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ(సీఏఏ) చట్టసవరణ జరిగేలా కృషి చేస్తున్నట్టు తెలిపారు. వడ్డి రఘురాం మాట్లాడుతూ నాణ్యమైన సీడ్ సరఫరా చేయని హేచరీలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అనధికారిక, నిబంధనలు పాటించని హేచరీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇక నుంచి ప్రతి నెలా రైతులతో సమావేశాలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించినట్టు వెల్లడించారు. 30 పైసలకే వనామీ సీడ్ సరఫరా నాణ్యమైన వనామీ సీడ్‌ను 30 పైసలకు రైతులకు అందుబాటులో ఉంచుతామని హేచరీ యజమానులు భరోసా ఇచ్చారు. నాణ్యమైన టైగర్ సీడ్ దొరకని కారణంగా ఉత్పత్తి దెబ్బతిని నష్టపోయామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సీజన్లో టైగర్ సీడ్ ఉత్పత్తిని తగ్గించాలని రఘురాం కోరగా.. హేచరీల యజమానులు ఆ మేరకు స్పందించారు. బ్రూడ్ స్టాక్ క్వాలిటీ మేనేజ్మెంట్పై సెపె్టంబర్ 29న విశాఖలో జరిగే జాతీయ స్థాయి సెమినార్లో రైతులను కూడా భాగస్వాములను చేస్తామని హేచరీ ప్రతినిధులు చెప్పారు. జాతీయ రొయ్య హేచరీల సంఘం అధ్యక్షుడు యల్లంకి రవికుమార్, జాతీయ రొయ్య రైతుల సంఘం అధ్యక్షుడు ఐపీఆర్ మోహన్‌రాజు, సీఏఏ డైరెక్టర్ (చెన్నై) పి.శంకరరావు ఎంపెడా రీజనల్ మేనేజర్ జయభేల్ తదితరులు పాల్గొన్నారు. -
Fact Check: ఆక్వా రైతు బరువు కాదు.. బాధ్యత
సాక్షి, అమరావతి: కళ్ల ముందు వాస్తవాలు స్పష్టంగా కనిపిస్తున్నా అవేవీ తెలీనట్లు కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తూ అబద్ధాలను అడ్డగోలుగా అచ్చేయడంలో ఈనాడు రామోజీకే చెల్లింది. పైపెచ్చు పచ్చ పార్టీని జాకీలు పెట్టి మరీ పైకి లేపేందుకు తెగ ప్రయాసపడుతోంది. ఇందులో భాగంగా తన ప్రతి కథనంలోనూ గత ప్రభుత్వాన్ని ఆహా ఓహో అంటూ కీర్తించేందుకు నానాపాట్లు పడుతోంది. పత్రికా విలువలు ఎలాగూ లేవు.. కనీసం ప్రజలు నవ్వుతారనే ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఆక్వా రైతులకు సబ్సిడీ ఇస్తానని మోసంచేసి, ఎన్నికలు సమీపించిన వేళ కొన్నిరోజులు మాత్రమే సబ్సిడీ ఇస్తున్నట్లు నటించి ఆ సొమ్మునూ డిస్కంలకు ఎగ్గొట్టిన గత టీడీపీ ప్రభుత్వ భాగోతాలను ఆ పత్రిక నిస్సిగ్గుగా దాచిపెట్టింది. ‘‘ఆక్వారైతు బరువయ్యాడా’’.. అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టారాజ్యంగా విషం కక్కింది. నిజానికి.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే సబ్సిడీ ఇచ్చి ఆక్వా రైతులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆదుకుంది. ఆక్వా రైతేకాదు.. రాష్ట్రంలోని ఏ రైతూ తమకు బరువు కాదని, వారందరి సంక్షేమం తమ బాధ్యతని ప్రభుత్వం తన చేతల ద్వారా చాటిచెబుతోంది. పచ్చ పత్రిక రాయని వాస్తవాలను ఇంధన శాఖ శనివారం మీడియాకు వెల్లడించింది. ఆ వివరాలివీ.. ఆరోపణ: ఆక్వా విద్యుత్ సర్వీసులకు యూనిట్ ధరను రూ.7 నుంచి రూ.2కు తగ్గించిన గత ప్రభుత్వం.. వాస్తవం: గత ప్రభుత్వం 2014 నుంచి 2016 వరకు ఆక్వా సాగుకు స్లాట్ల ఆధారంగా విద్యుత్ టారిఫ్‌ను యూనిట్‌కు రూ.4.63 నుంచి రూ.7.00 వరకూ వేసి అత్యధిక భారం మోపింది. 2016 నుంచి 2018 మే వరకూ యూనిట్ రేటు రూ.3.86 చొప్పున సరఫరా చేసింది. ఇక ఎన్నికలకు కొద్దినెలల ముందు యూనిట్‌కు రూ.2 చొప్పున ఇచ్చింది. అందుకోసం ఇవ్వాల్సిన సబ్సిడీ భారం రూ.312.05 కోట్లను విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు చెల్లించకుండా బాకీ పెట్టింది. దానిని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం భరించాల్సి వచ్చింది. అంటే.. గత ప్రభుత్వం ఆక్వా రైతులకు రాయితీతో కూడిన విద్యుత్ సరఫరా చేయలేదనేది స్పష్టంగా తెలుస్తోంది. కానీ, ఈనాడు మాత్రం ఈ నిజాన్ని దాచేసి, గత ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చిందని ఎడాపెడా రాసేసింది. ఆరోపణ: అర్హుల గుర్తింపు పేరుతో రాయితీ నిలిపేశారు.. వాస్తవం: ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జూలై 2019 నుండి అన్ని ఆక్వా కనెక్షన్లకు యూనిట్ రూ.1.50 పైసలకే విద్యుత్ సరఫరా చేస్తోంది. అప్పటి నుంచి మార్చి 2023 వరకూ ప్రతి యూనిట్‌పై రూ.2.36 పైసలు చొప్పున మొత్తం రూ.2,792.88 కోట్లు విద్యుత్ సబ్సిడీ భారం మోస్తూ ఆక్వా రైతులను ఆదుకుంటోంది. 2022 జూలై నుంచి ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ జోన్లలో ఆక్వాసాగు చేస్తున్న రైతులకు యూనిట్‌ను రూ.1.50 పైసలకు విద్యుత్ సరఫరా చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నాన్–ఆక్వా జోన్లలోనూ అర్హత కలిగిన ఆక్వా జోన్లను గుర్తించి ఆయా చెరువులను ఆక్వా జోన్లుగా పరిగణిస్తూ జిల్లా గెజిట్లలో నోటిఫై చేసింది. తద్వారా మొత్తం ఈ సర్వే ద్వారా గుర్తించిన 4.66 లక్షల ఎకరాల ఆక్వా సాగులో 4.22 లక్షల ఎకరాలను ఆక్వా జోన్లలో చేరుస్తూ నోటిఫై చేసింది. వీటిలో మొత్తం 63,754 ఆక్వా కనెక్షన్లలో 46,445 ఆక్వా కనెక్షన్లను అర్హత కలిగినవిగా గుర్తించి ఆ కనెక్షన్లు కలిగిన ఆక్వా రైతులకు యూనిట్‌ను రూ.1.50 పైసలకు విద్యుత్ సరఫరా చేస్తోంది. యూనిట్ సర్వీస్ ధర రూ.6.89 పైసలకు పెరిగిన నేపథ్యంలో ఆక్వా, నాన్–ఆక్వా జోన్లలో ఉన్న 10 ఎకరాలపైన ఆక్వా చెరువులు కలిగి ఉన్న అధిక సాగు రైతులకు చెందిన 17,309 కనెక్షన్లకు యూనిట్‌ను రూ.3.85 పైసలకు విద్యుత్ సరఫరా చేస్తోంది. ఆక్వా రైతులకు రాయితీపై విద్యుత్ సరఫరా చేస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి. అసలు ఇవ్వడంలేదని ఎలా రాస్తారు రామోజీ? ఆరోపణ: అధికారంలోకి వచ్చాక ఆక్వా రైతుల గోడు పట్టించుకోవడంలేదు.. వాస్తవం: ఆక్వా రైతులు తమ రొయ్య ఉత్పత్తులను అంతర్జాతీయ విపణిలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చేది. కానీ, ఆ అవసరంలేకుండా రాష్ట్ర ప్రభుత్వం సాధికార కమిటీ ద్వారా వివిధ కౌంట్ల రొయ్యలకు కనీస కొనుగోలు ధరలను నిర్ణయించింది. ఆ ధరలకు తగ్గకుండా కొనుగోలు చేసేట్లుగా చర్యలు తీసుకుని అమలుచేస్తోంది. రైతుభరోసా (ఆర్బీకే) కేంద్రాల్లో కొనుగోలు ధరల పట్టిక, కాల్ సెంటర్ నెంబర్‌ను అందుబాటులో ఉంచింది. ఏ రైతుకైనా రొయ్యల అమ్మకంలో ఇబ్బంది ఎదురైతే తమ సమస్యలను, ఫిర్యాదులను ప్రభుత్వానికి తెలియజేసేలా ఏర్పాటుచేసింది. రొయ్య మేత ధరలను కూడా మేత ఉత్పత్తిదారులు ఇష్టానుసారం పెంచకుండా, సంప్రదింపుల ద్వారా మాత్రమే పెంచడానికి అనుమతి తీసుకునేలా కట్టుబాటు విధించింది. ఆక్వాసాగు రైతుల ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలన్నీ పట్టించుకోవడంలో భాగం కాదా రామోజీ? మీ కళ్లకు ఇవేమీ ఎందుకు కనిపించడంలేదు?? -
రొయ్యల కోసం ఆక్వారోబో
సాక్షి, అమరావతి: అత్యాధునిక సాంకేతిక పరిజా్ఞనాన్ని అందిపుచ్చుకున్న ఓ ఆక్వా రైతు రొయ్యల పెంపకంలో రోబోను వినియోగిస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని చినఅమిరం గ్రామానికి చెందిన వత్సవాయి లక్ష్మీకుమార్‌రాజు మద్రాస్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. కొంతకాలం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన ఆయన ఆ కొలువును వదిలి రొయ్యల సాగు చేపట్టారు. కృష్ణా జిల్లా నందివాడ మండలం అరిపిరాల గ్రామంలో దాదాపు 700 ఎకరాల్లో రొయ్యలను పెంచుతున్నారు. వాటికి ఆహారం అందించేందుకు ఆక్వా రోబో (బాట్)ను తయారు చేయించుకుని వినియోగిస్తున్నారు. ఇది సౌర విద్యుత్ తానే తయారు చేసుకుని పని చేస్తుంది. విద్యుత్ ఆదా కోసం అనేక సాంకేతిక విధానాలను, పరికరాలను వాడుతున్నారు. ఈ మొత్తం వ్యవస్థను ఒక ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా అరచేతిలోనే నడిపిస్తున్నారు. ఆక్వా రంగంలో భారతదేశంలోనే తొలి రోబో ఇదే కావడం విశేషం. కూలీల అవసరం లేకుండానే..: చెరువులోని రొయ్యలకు మనుషులే ఆహారం (ఫీడింగ్) అందించడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అది అనేక ఇబ్బందులతో కూడుకోవడంతో పాటు ఆహారం సకాలంలో అందేది కాదు. దీంతో మార్కెట్లో ఆటోమేటిక్ ఫీడర్ల కోసం వెతికారు. కానీ.. అవి కూడా ఒకేచోట ఫీడింగ్ చేసేవి. దానివల్ల రొయ్యలన్నిటికీ ఆహారం సమానంగా అందేది కాదు. దీంతో చెరువు మొత్తం తిరిగేలా యంత్రాన్ని తయారు చేస్తే బాగుంటుందనే ఆలోచనకు వచ్చారు లక్ష్మీకుమార్‌రాజు. నెక్ట్ ఆక్వా సంస్థతో తన ఆలోచనను పంచుకున్నారు. ఆ సంస్థ ఐఐటీ గ్రాడ్యుయేట్లతో ఏర్పాటైంది. వారికి ఈ ఆలోచన నచ్చి నాలుగేళ్ల పాటు అరిపిరాలలోనే ఉండి పరిశోధన చేశారు. రకరకాల ప్రయత్నాల తరువాత చివరకు మూవింగ్ రోబోను తయారు చేశారు. చెరువులో తాడుతో (గైడెడ్) లైన్లా కట్టి దాని సాయంతో రెండేళ్లుగా ఈ రోబోను నడుపుతున్నారు. దీని ఆపరేటింగ్ మొత్తం మొబైల్‌తోనే జరుగుతుంది. ఎన్ని కేజీల ఆహారం.. ఏ సమయంలో.. ఎన్నిసార్లు అందించాలనేది ముందుగానే ప్రోగ్రా>మింగ్ చేసుకోవచ్చు. దాని ప్రకారం కచ్చితంగా అంతే ఆహారాన్ని ఆయా సమయాల్లో ఈ రోబో రొయ్యలకు అందిస్తుంది. ముఖ్యంగా ఈ రోబోకి అవసరమైన విద్యుత్‌ను దానిపైనే అమర్చిన సౌర పలకల ద్వారా తానే తయారు చేసుకుంటుంది. క్షణక్షణం.. అప్రమత్తం కరెంట్ ట్రాన్స్ఫార్మర్ (సీటీ) లేదా పవర్ మోనిటర్ (బ్లాక్ బాక్స్)అనే పరికరంతో విద్యుత్ సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. ఇది ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ కంట్రోలర్‌గా పనిచేస్తూ విద్యుత్ నష్టాలను, విద్యుత్ బిల్లులను తగ్గిస్తుంది. ఎన్ని ఏరియేటర్స్ (రొయ్యలకు ఆక్సిజన్ అందించే పరికరాలు) పని చేస్తున్నాయనేది నిరంతరం చూస్తుంటుంది. ఏరియేటర్స్ ఆగితే వెంటనే చెబుతుంది. మూడు మొబైల్ నంబర్లకు ఫోన్ అలర్ట్ వెళ్లిపోతుంది. నిజానికి ప్రతి పరిశ్రమలో ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ కంట్రోలర్స్ వాడుతుంటారు. వీటిని ఆక్వాలో వాడటం అనేది చాలా అరుదు. మోటార్లు ఆగిపోతే వెంటనే సరిచేసి ఆన్ చేయాలి. లేదంటే రొయ్యలు చనిపోతాయి. ఇందుకోసం రైతులు రాత్రివేళల్లో చెరువుల వద్ద కాపలాగా పడుకోవాల్సి వస్తోంది. అలాంటి సమయంలో విద్యుత్ ప్రమాదాల బారినపడి రైతులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు జరుగుతున్నాయి. ఈ సమస్యలను పవర్ మోనిటర్ తీరుస్తోంది. ఎన్ని ఏరియేటర్స్ ఆన్ చేస్తే అన్నే కెపాసిటర్లు ఆన్ అయ్యేలా చూస్తుంది. అవి ఆగిపోతే కెపాసిటర్లను ఆపేస్తుంది. జనరేటర్ పనితీరును కూడా ఇది పర్యవేక్షిస్తుంది. దీనివల్ల డీజిల్ దొంగతనాన్ని అరికట్టవచ్చు. స్మార్ట్ స్టార్టర్ కంట్రోలర్ అనే పరికరం ద్వారా మొబైల్‌తోనే ఏరియేటర్స్ని ఆన్ చేయవచ్చు. అవి ఎంతసేపు పనిచేయాలనేది ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. సాంకేతిక సమస్య ఏదైనా ఏర్పడితే మొబైల్‌కి సమాచారం వచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల మోటారు కాలిపోకుండా కాపాడుతుంది. విద్యుత్ బిల్లులు ఆదా విద్యుత్ వ్యవస్థకు సాంకేతికతను జోడించి మా చెరువుల్లో వినియోగిస్తున్నాం. పర్యావరణ హితం కోరి 15 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను వాడుతున్నాం. పవర్ మాంక్స్ సాఫ్ట్వేర్ ద్వారా చెరువుల మొత్తం ఎంత విద్యుత్ వినియోగం జరుగుతోంది, సరఫరా ఎలా ఉంది, ఎక్కడైనా సాంకేతిక, భౌతిక ఇబ్బందులు ఉన్నాయా అనేది రియల్ టైమ్ (ఎప్పటికప్పుడు) సమాచారాన్ని టీవీ (మోనిటర్)లో కనిపించేలా సెన్సార్లు ఏర్పాటు చేశాం. దీనివల్ల 95 శాతం కంటే ఎక్కువగా విద్యుత్ వినియోగం సక్రమంగా జరుగుతోంది. ప్రతి 100 కేవీ ట్రాన్స్ఫార్మర్పై నెలకు కనీసం రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ విద్యుత్ ఆదా అవుతోంది. – వత్సవాయి లక్ష్మీకుమార్‌రాజు, ఆక్వా రైతు -
ఆక్వా రైతులకు శుభవార్త
-
మండ పీతకు మంచి డిమాండ్.. 4 లక్షల ఆదాయం!
సాక్షి, అమలాపురం: ఆక్వాలో కీలకమైన చేపలు, వనామీ రొయ్యల పెంపకం సంక్షోభంలో కూరుకుపోతోంది. మరీ ముఖ్యంగా వనామీ సాగు రైతులకు నష్టదాయకంగా మారింది. ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటిస్తున్నా ఎగుమతిదారులు కొనుగోలు చేయకపోవడంతో రైతులకు నష్టాలు తెచ్చిపెడుతోంది. దీంతో పలువురు ఆక్వా రైతులు ప్రత్యామ్నాయ సాగు వైపు దృష్టిసారించారు. ప్రస్తుతం వారు పీతల సాగుపై ఆసక్తి చూపుతుండగా.. అందుకు ప్రభుత్వం దన్నుగా నిలిచేందుకు సిద్ధమైంది. పీతల సాగుకు మద్దతుగా పలు చర్యలు తీసుకుంటోంది. కోనసీమలో ఒకటిన్నర దశాబ్దాలుగా తీర ప్రాంత మండలాల్లో పీతల సాగు చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా సాగు విస్తీర్ణం మాత్రం పెద్దగా పెరగలేదు. జిల్లాలో ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాల్లో కేవలం 200 ఎకరాల్లో సాగు జరుగుతోంది. దీనిని మరింత పెంచేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. అంతర్జాతీయంగా ఇటీవల కాలంలో మన దేశం నుంచి పీతల ఎగుమతి పెరుగుతోంది. సెల్లా సెరటా, స్కెల్లా ట్రాంక్బారికా (మండ పీత) రకాలకు మంచి డిమాండ్ ఉంది. ఇవి కిలో రూ.600 నుంచి రూ.వెయ్యి వరకూ ధర పలుకుతున్నాయి. ఈ రకం పీతల పెంపకం లాభదాయకంగా ఉంటుందని మత్స్యశాఖాధికారులు చెబుతున్నారు. ఎకరా సాగుకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకూ ఖర్చు కాగా, దిగుబడిని బట్టి ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ ఆదాయం వచ్చే అవకాశముంది. చిర్రయానాంలో హేచరీ పీతల సాగు ప్రోత్సాహంలో భాగంగా కాట్రేనికోన మండలం చిర్రయానాం వద్ద ప్రైవేట్ హేచరీ నిర్మాణానికి మత్స్యశాఖ ప్రోత్సాహం అందిస్తోంది. స్థానికంగా హేచరీ వస్తే పీతల సీడ్ తక్కువ ధరకు రావడంతో పాటు సాగు విస్తీర్ణం పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం ఆర్జీసీ విజయవాడ నుంచి, చెన్నై నుంచి తీసుకువస్తున్నారు. ఇది రైతులకు భారంగా మారింది. ఇదే సమయంలో సాగు ప్రోత్సాహంలో భాగంగా పెట్టుబడికి అవసరమైన రుణ పరిమితిని ఇటీవల డిస్ట్రిక్ట్ లెవిల్ టెక్నికల్ కమిటీ (డీఎల్టీసీ) పెంచిన విషయం తెలిసిందే. కమిటీ ఎకరాకు రూ.78 వేలుగా పేర్కొనగా, జిల్లా కలెక్టర్ శుక్లా దీనిని రూ.లక్షకు పెంచాలని సూచించారు. వనామీకి ప్రత్యామ్నాయంగా పీతల సాగు పెంచితే అటు వనామీకి కూడా మంచి డిమాండ్ వస్తోందని అంచనా. మూడు రకాలుగా.. పీతల సాగు మూడు రకాలుగా చేయవచ్చు. కానీ జిల్లా రైతులు కేవలం సంప్రదాయ పద్ధతిలో చెరువుల చుట్టూ వలలు వేసి పెంపకం చేపడుతున్నారు. సాధారణ ఆక్వా చెరువుల మాదిరిగానే ఇక్కడా చేస్తున్నారు. దీంతో పాటు బాక్సులలో పీతలను పెంచే అవకాశముంది. అభివృద్ధి చెందిన దేశాల్లో బాక్సులలో పీతలను పెంచుతున్నారు. మూడో రకం సాఫ్ట్ సెల్స్ ఎప్పటికప్పుడు సేకరించడం ద్వారా సాగు చేస్తారు. మన తీరం అనుకూలం జిల్లాలో ఇప్పుడు మూడు మండలాల్లో మాత్రమే చాలా తక్కువ మొత్తంలో పీతల సాగు జరుగుతోంది. పీతల సాగుకు తీర ప్రాంత మండలాలు అనుకూలం. ఇటు వరికి, అటు రొయ్యల సాగుకు పనికిరాని చౌడు నేలల్లో సైతం పండించవచ్చు. ఆక్వా రైతులు ముందుకు వస్తే ప్రభుత్వం సాగుకు సాంకేతిక సహకారం, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తుంది. –షేక్ లాల్ మహ్మద్, జిల్లా మత్స్యశాఖాధికారి -
బ్రాండింగ్ ‘చేప’ట్టిన సర్కారు.. ‘ఫిష్ ఆంధ్ర’కు ప్రమోషన్
సాక్షి, అమరావతి: ’ఫిష్ ఆంధ్ర’ బ్రాండింగ్‌ను మరింతగా ప్రోత్సహించేందుకు మత్స్య శాఖచర్యలు చేపట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకులతో ఆక్వా రంగంలో తరచూ తలెత్తుతున్న సంక్షోభం దృష్ట్యా కేవలం ఎగుమతులపైనే ఆధారపడకుండా స్థానిక వినియోగంపైనా దృష్టి సారించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా మత్స్య ఉత్పత్తుల తలసరి వినియోగం పెంచడం.. తద్వారా ఆక్వా రైతులు, మత్స్యకారులకు అండగా నిలబడటమే లక్ష్యంగా ముందుకెళుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో లభించే సముద్ర, రైతులు పండించే మత్స్య ఉత్పత్తులను ‘ఫిష్ ఆంధ్ర’ పేరిట హబ్‌లు, అవుట్‌లెట్స్, కియోస్క్‌ల ద్వారా మత్స్య శాఖ విక్రయిస్తోంది. వీటిని బ్రాండింగ్ చేసేందుకు ప్రత్యేకంగా యూట్యూబ్ చానల్‌తో పాటు ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రమోట్ చేయనుంది. డోర్ డెలివరీ కోసం ప్రత్యేకంగా యాప్‌ను డిజైన్ చేయనున్నారు. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ వ్యవస్థ (సీఆర్ఎంఎస్) ద్వారా వినియోగదారులు ఎలాంటి ఉత్పత్తులను ఎక్కువగా ఇష్టపడుతున్నారనే దానిపై ప్రతిరోజూ ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కన్సల్టెంట్ నియమించనున్నారు. ఆసక్తి కల్గిన ఏజెన్సీల నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్ఎఫ్పీ) కోరుతూ బుధవారం మత్స్యశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి గల ఏజెన్సీలు www.fisheries.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా టెండర్ డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకుని వచ్చే నెలాఖరులోగా apfisheriestender@gmail.comలో దరఖాస్తు చేసుకోవాలని మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు కోరారు. -
జోన్.. జోష్
ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న కరెంట్ కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న ప్రణాళిక రూపొందించింది. ఆక్వా జోనేషన్ విధానంతో సాగు చేసే విస్తీర్ణం, రైతుల వివరాలతో లెక్కలు తేల్చి అన్ని విధాలా ఆదుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఈ–ఫిష్ యాప్‌లో వివరాలు నమోదు చేయడం ద్వారా ఎంత విద్యుత్ అవసరమో గుర్తించి రైతులకు విద్యుత్ చార్జీల భారం నుంచి భారీ విముక్తిని కల్పించనుంది. విడవలూరు: ఆక్వా రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆక్వా జోనేషన్ విధానం వరంగా మారనుంది. ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో రొయ్యల ధరల ఒడిదుడుకుల కారణంగా జిల్లాలోని ఆక్వా రైతులు అతలాకుతలమవుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ క్షేతస్థాయిలో దళారులు మొండి చేయి చూపుతున్నారు. ఆక్వా రైతులకు అండగా ఉండేందుకు ఇప్పటికే ఆక్వా జోనేషన్ విధానం అమల్లోకి తెచ్చింది. మత్స్యశాఖ, విద్యుత్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో సర్వే చేపడుతున్న అధికారులు ఆక్వా సాగు విస్తీర్ణం, రైతుల వివరాలు, విద్యుత్ వినియోగం వివరాలను ఈ–ఫిష్ యాప్ ద్వారా నమోదు చేస్తున్నారు. తాజాగా మరోసారి సర్వే ప్రారంభించారు. ఇంకా నమోదు చేసుకోని రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రస్తుతం గ్రామ సభలను నిర్వహిస్తున్నారు. ఆక్వా రైతులకు ఊరట ప్రతి ఆక్వా రైతు ఈ–ఫిష్‌లో నమోదు చేసుకోవడం వల్ల వారికి కరెంట్ చార్జీలు భారీగా తగ్గుముఖం పడుతాయి. జిల్లాలోని తీర ప్రాంతాలైన ఉలవపాడు, గుడ్లూరు, కావలి, బోగోలు, అల్లూరు, విడవలూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు మండలాల్లో ఆక్వా సాగు కింద రొయ్యలు, చేపలను సాగు చేస్తున్నారు. ఈ 9 మండలాల్లో సుమారు 8,500 మంది రైతులు సుమారు 40 వేల ఎకరాల ఆక్వా సాగు చేస్తున్నారు. ఏటా రెండు దఫాలుగా సాగు జరుగుతోంది. ఈ సాగులో మొదటి నెలలో ఎకరా గుంతకు రెండు ఏయిరేటర్లు, రెండు మోటార్లు నిత్యం నియోగించాలి. రెండో నెలలో నాలుగు ఏయిరేటర్లు, రెండు మోటార్లు, మూడో నెలలో ఆరు ఏయిరేటర్లు, రెండు మోటార్లను రైతులు వినియోగిస్తుంటారు. ఏడాదికి రూ. 480 కోట్ల మేర భారం ప్రస్తుతం ఆక్వా సాగు కింద విద్యుత్ యూనిట్‌ను రూ.3.85 చొప్పున వసూలు చేస్తున్నారు. నెలకు ఒక ఎకరాకు రూ.30 వేల విద్యుత్ బిల్లు వస్తుంది. అయితే ఈ–ఫిష్ రీ సర్వే పూర్తయ్యాక యూనిట్ విద్యుత్‌ను రూ.1.50లకే అందిస్తారు. దీంతో నెలకు ఎకరాకు సుమారు రూ.10 వేల లోపు మాత్రమే విద్యుత్ బిల్లు వస్తుంది. ఈ లెక్కన నెలకు ప్రభుత్వంపై దాదాపు రూ.80 కోట్లు భారం పడనుంది. ఏడాదిలో ఆక్వా సాగు జరిగే ఆరు నెలలకు నెలకు రూ. 80 కోట్లు చొప్పున రూ.480 కోట్ల మేర భారం పడనుంది. ఈ– ఫిష్ నమోదు ప్రక్రియ ఇలా.. ►కేవలం 10 ఎకరాల్లోపు విస్తీర్ణం కలిగిన రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ►ఆక్వా సాగు చేసే పరిధిలోని సచివాలయంలో మత్స్యశాఖ ఉద్యోగి ద్వారా నమోదు ప్రక్రియ చేసుకోవాలి. ►రైతుకు సంబంధించిన ఆక్వా సాగు విస్తీర్ణ ధ్రువీకరణ పత్రాలు, సర్వే నంబర్ పత్రాలు, విద్యుత్ సర్వీస్ నంబర్ పత్రాలు, ఆధార్‌కార్డు, మత్స్యశాఖ వారు జారీ చేసిన లైసెన్సు లేదా, కార్డును ఉద్యోగులకు అందజేయాలి. ►అనంతరం వాటిని జిల్లా మత్స్యశాఖ జేడీ కార్యాలయానికి పంపి అక్కడ నుంచి విద్యుత్ జిల్లా అధికారులకు నివేదికను అందజేస్తారు. రైతులకు భారీ ఊరట ఆక్వా జోనేషన్ నిజంగా ఆక్వా రైతుల పాలిట వరం. ప్రస్తుతం ఆక్వా సాగు ఒడిదుడుకుల మధ్య సాగడంతో నష్టాలను చవి చూస్తున్నాం. విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేకపోతున్నాం. ఈ విధానంతో యూనిట్ విద్యుత్ కేవలం రూ.1.50లకే మాత్రమే పడడంతో చాలా వరకు కష్టాలు తీరనున్నాయి. – వెంకటేశ్వర్లు, రామచంద్రాపురం, విడవలూరు మండలం చిన్న రైతులకు మేలు ఈ ఆక్వా జోనేషన్ చిన్న, సన్న కారు ఆక్వా రైతులు చాల మేలు కలిగిస్తుంది. ప్రస్తుతం ఈ పథకం ద్వారా కేవలం 10 ఎకరాల లోపు వారు మాత్రమే నమోదు చేసుకోవాల్సి ఉంది. చిన్న రైతులకు విద్యుత్ భారం తగ్గనుంది. చిన్న రైతులు కూడా సాగు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. – సంతోష్, ఆక్వా రైతు, గంగపట్నం, ఇందుకూరుపేట మండలం ఆక్వా జోనేషన్ వరం ఈ ఆక్వా జోనేషన్ పథకం ద్వారా విద్యుత్ చార్జీలు భారీగా తగ్గుతాయి. ఇప్పటికే మా సిబ్బంది రీ సర్వే చేసి గ్రామ సభలను నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సాగును నమోదు చేస్తున్నాం. ఇంకా నమోదు చేసుకోని రైతులు సచివాలయాలను సంప్రదించి నమోదు చేసుకోవాలి. – నాగేశ్వరరావు, మత్స్యశాఖ జేడీ -
రొయ్యల కొనుగోళ్లు: కోతేస్తే.. కొరడా
అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా ఆక్వా ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. ధరల పతనంతో రొయ్య రైతులు దిగాలు పడ్డారు. ఈ సమయంలో ప్రభుత్వం అండగా నిలబడింది. గిట్టుబాటు ధర కల్పించేందుకు ముందుకొచ్చింది. ధరల స్థిరీకరణకు ఆక్వా సాధికారత కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేయని ప్రాసెసింగ్ కంపెనీలపై కొరడా ఝులిపించేందుకు రంగం సిద్ధం చేసింది. మరో వైపు ఆక్వా రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు, సీడ్, ఫీడ్ తయారీదారులు సమన్వయంతో ముందుకు సాగేలా చర్యలు చేపట్టింది. ఎప్పుటికప్పుడు ధరలను సమీక్షిస్తూనే రైతుల కోసం జిల్లా మత్స్యశాఖ అధికారులు హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. హెల్ప్‌లైన్ నంబర్లు : 9392905878, 9392905879 సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దాదాపు 16 వేల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. ప్రధానంగా రొయ్యల సాగు చేపడుతున్నారు. రొయ్యల సాగును మూడు విడతల్లో చేపడతారు. ప్రధాన రెండు సీజన్లలో అధిక సంఖ్యలో రైతులు అధిక మొత్తంలో దిగుబడి సాధిస్తారు. ఒక్కో సీజన్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దాదాపు 30 వేల టన్నుల రొయ్యల దిగుబడి వస్తోంది. ఈ మొత్తాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్లు కొనుగోలు చేయాల్సిందే. జిల్లాలో ఉన్న ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్లు దేవీ సీ ఫుడ్స్, జీవీఆర్ ఆక్వా, మున్నంగి ఆక్వా, సదరన్ ఆక్వా, కళ్యాణి ఆక్వా, నీలా ఆక్వా, క్రిస్టల్ ఆక్వా, రాయల్ ఆక్వా, ఆక్వా టీకాలు కొనుగోలు చేయాలి. ఇదిలా ఉండగా అంతర్జాతీయంగా ఏర్పడిన సంక్షోభంతో రొయ్యల ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. దీనిని సాకుగా చూపి వ్యాపారులు రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఆక్వా వ్యాపారులు, ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు, ఎగుమతిదారులు కుమ్మక్కై కూడబలుక్కుని రొయ్యలు సాగు చేస్తున్న రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దీంతో నీలివిప్లవానికి పెట్టింది పేరైన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రొయ్యల రైతులు విలవిల్లాడిపోతున్నారు. ఈ దశలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. గత నెల 17వ తేదీ విజయవాడలో అధికారులు, మంత్రులు కలిసి రొయ్యల రైతులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. వ్యాపారులకు దిశానిర్దేశం చేశారు. అయినా వారిలో మార్పురాలేదు. రైతుల పక్షాన ప్రభుత్వం... ప్రభుత్వం ఆక్వా రైతుల పక్షాన నిలిచింది. వ్యాపారులు, ఎగుమతిదారులతో మంత్రుల సబ్ కమిటీ సంప్రదింపులు జరిపింది. ప్రస్తుతం ఎగుమతులు లేవని, అందుకోసం తగ్గించి కొనుగోలు చేయాల్సి వస్తుందని వ్యాపారులు, ఎగుమతిదారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడిన మంత్రుల సబ్ కమిటీ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లింది. రొయ్యలు పచ్చి సరుకు కాబట్టి ప్రభుత్వమే ఒక మెట్టు దిగి గతంలో నిర్ణయించిన ధరను కొంచెం తగ్గించి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ధరలు సవరించిన ప్రభుత్వం... వ్యాపారులు, ఎగుమతిదారులు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తక్కువగా ఉన్నాయనడంతో ప్రభుత్వం ఆక్వా రైతులతో చర్చించిన మీదట ధరల్లో కొంత మార్పు చేసింది. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని ముందు నిర్ణయించిన ధరలను కొంచెం తగ్గించి కొనుగోలు చేయాలని నూతన ధరలను ప్రకటించింది. ఆ ధరలకు కొనుగోలు చేస్తున్నామంటూనే నూతనంగా నిర్ణయించిన ధరలను కూడా పెడచెవిన పెట్టి మరీ తక్కువకు కొనుగోలు చేయడం ప్రారంభించారు. బుధవారం మరోసారి రాష్ట్ర మంత్రులు సాధికారిత కమిటీతో సమావేశమయ్యారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు స్థానిక మార్కెట్లో ధరలను సమీక్షించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రేట్లకు కొనుగోలు చేయకపోతే రైతులు తమ దృష్టికి తీసుకురావాలని సూచిస్తున్నారు. ఈ విషయంపై రైతులకు ఆవగాహన కల్పిస్తున్నారు. ఇందుకు సంబంధించి హెల్ప్‌లైన్ నంబర్లు కూడా అందుబాటులో ఉంచారు. ఇక్కడ పండించిన పంట ఉత్పత్తులను ఇదే ప్రాంతంలో విక్రయించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాల వారీగా ఆక్వా రైతు కమిటీలు గురువారం జూమ్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుచుకునేలా తీర్మానం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం రొయ్యల రైతులకు అండగా ఉంది. అందుకే అటు వ్యాపారులతో, ఇటు రైతులతో విరామం లేకుండా చర్చలు జరుపుతోంది. అయినా రొయ్యల ధరల విషయంలో వ్యాపారుల్లో మార్పు లేదు. ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, వ్యాపారులు రైతులను నిలువునా నష్టపరుస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరల కంటే తక్కువకు కొనుగోలు చేయడం ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. – దుగ్గినేని గోపీనా«థ్, రొయ్యల రైతు సంఘ నాయకుడు వ్యాపారులు, ఎగుమతిదారులు తీరు మార్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా సాగుకు పూర్తి భరోసానిస్తోంది. కరోనా సమయంలోనూ రైతులకు ఇబ్బంది లేకుండా వ్యాపారులతో రొయ్యలు కొనుగోలు చేయించింది. 10 ఎకరాల్లోపు సాగు చేసే రైతులకు విద్యుత్ చార్జీ యూనిట్‌కు కేవలం రూ.1.50గా నిర్ణయించింది. ఇటీవల రొయ్య మేత ధరలను టన్ను రూ.2,600కు తగ్గించింది. ప్రస్తుతం ఆక్వా వ్యాపారులు ధరలు తగ్గించేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వం 100 కౌంట్ రూ.210గా నిర్ణయించి వ్యాపారులచే కొనుగోలు చేయిస్తోంది. – మాలె రంగారెడ్డి, ఆక్వా రైతు, మూలగుంటపాడు ఇతర దేశాల్లో తక్కువ ధరకు రొయ్యల ఎగుమతి ఇతర దేశాల్లో తక్కువ ధరకు రొయ్యలు ఎగుమతి చేయడం వలన మన దేశం రొయ్యల ధర దిగజారింది. యూరప్ కంట్రీస్‌లో ఉన్న ఈక్విల్యాండ్ దేశంలో రొయ్యలు 100 కౌంట్ రూ.140కు విక్రయిస్తున్నారు. అక్కడ ఏడాది క్రితం రొయ్యల కల్చర్ మొదలుపెట్టారు. ఎకరానికి 5 టన్నులకు తగ్గకుండా తీస్తారు. మన దేశంలో 2 టన్నుల్లోపే వస్తుంది. వారికి ఎగుమతి ఖర్చులు, రొయ్యల యూనిట్లు దగ్గర ఉండటం వలన చార్జీలు తక్కువ. అందుకే తక్కువ ధరకు ఇస్తారు. మనదేశంలో రొయ్యల రైతులకు 100 కౌంట్ ధర రూ.250కు తగ్గకుండా ఇస్తేనే గిట్టుబాటవుతుంది. – గాదె కోటిరెడ్డి, రొయ్యల రైతు, గాదెపాలెం -
‘ఆక్వా’ సంక్షోభం తాత్కాలికమే
సాక్షి, రాజమహేంద్రవరం: ‘ఆక్వా సంక్షోభం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడిందని.. మరో రెండు నెలల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని.. సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించేందుకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు రొయ్యలు కొనుగోలు చేస్తామని సీఫుడ్స్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు అల్లూరి ఇంద్రకుమార్, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావ్, అసోసియేషన్ నేతలు వెల్లడించారు. రాజమహేంద్రవరంలో గురువారం ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాలకు చెందిన రైతులు, ఎగుమతిదారుల సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా యూరోపియన్, చైనాల జీరో కోవిడ్ పాలసీ అమలు, అమెరికాలో వనామీ రొయ్యల నిల్వలు పెరిగిపోవడం లాంటి పరిణామాలతో ఆక్వా రంగం గత మూడు నెలలుగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. డిసెంబర్, జనవరి నెలల్లో విదేశాల్లో పండుగలు ఉన్నాయని.. అక్కడ నిల్వ ఉన్న సరుకుతోపాటు దేశంలో ఎగుమతిదారుల వద్ద ఉన్న సరుకు అమ్ముడుపోతుందని, ఫలితంగా భారత్‌లో తిరిగి రొయ్యల ఎగుమతులు పుంజుకుంటాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు 100 కౌంట్ రూ.210, 30 కౌంట్ రూ.380కి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతిరోజూ ధరల్లో మార్పులేకుండా 10–20 రోజుల పాటు నిర్ణీత ధర ఇచ్చేందుకు అంగీకరించారు. సంక్షోభంలో ఉన్న రైతులను ఆదుకోవాల్సింది పోయి.. కొంతమంది జె–ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అంటూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలను మానుకోవాలని హితవు పలికారు. వ్యవసాయం తర్వాత అత్యధిక సాగులో ఉన్న ఆక్వా రంగంపై లేనిపోని ఆరోపణలుచేసి రైతులతో రాజకీయం చెయ్యొద్దని వారు విజ్ఞప్తి చేశారు. క్రాప్ హాలిడే ఆలోచనే లేదు: ఆక్వా రంగం సంక్షోభాలు రైతులకు కొత్తేమీకాదన్నారు. టైగర్ రొయ్య సాగులో నష్టాలు చూశారన్నారు. ప్రస్తుతం వనామీలో సంక్షోభం తాత్కాలికమేనని వారు స్పష్టంచేశారు. రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తారన్న ఆరోపణలను వారు ఖండించారు. అలాంటి ఆలోచన రైతులకు లేదన్నారు. కేవలం గిట్టుబాటు ధర కావాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. అందుకనుగుణంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతులు, ఎగుమతిదారులను సంప్రదిస్తూ సూచనలు చేస్తోందన్నారు. ఇందుకుగాను ఒక కమిటీ వేసి మరీ పర్యవేక్షిస్తోందని గుర్తుచేశారు. రైతుల సమస్యలపై సంప్రదించేందుకు త్వరలో టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటుచేస్తామన్నారు. రైతులకు సూచనలు.. ఆక్వా రంగంలో నష్టాల నుంచి గట్టెక్కాలంటే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాలని విధానాలపై వక్తలు అవగాహన కల్పించారు. భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. అవి.. ► అందరూ ఒకేసారి పంట వేసి ఇబ్బందులు పడకుండా క్రాప్ రొటేషన్ పద్ధతి పాటించాలి. ► ఎగుమతులకు ఇబ్బందికరంగా మారిన 100 కౌంట్ రొయ్యల సాగుకు స్వస్తిపలికి 70, 80, 30 కౌంట్ రొయ్యలపై దృష్టిపెట్టాలి. ► చెరువుల్లో తక్కువ స్థాయిలో సీడ్ వేసి ఎక్కువ కౌంట్ సాధించేలా ప్రణాలికాబద్ధంగా వ్యవహరించాలి. ► దేశంలో 8 లక్షల మెట్రిక్ టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 5 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి జరుగుతోంది. ► ఇందులో సింహభాగం ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచే ఉంటోంది. పెద్ద రైతులకూ విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలి ప్రభుత్వం చిన్న రైతులకు విద్యుత్ సబ్సిడీ ఇస్తోంది. వాటిని పెద్ద రైతులకూ అమలుచేయాలి. మేతల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. నాణ్యమైన సీడ్, మేత లభించకపోవడం ఓ కారణమైపోతోంది. – రుద్రరాజు నానిరాజు, ఆక్వా రైతులు, కోనసీమ -
పది రోజుల్లో ‘ఆక్వా సమస్య’ పరిష్కారం
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదొడుకుల వల్లే ఆక్వా ఎగుమతులు తగ్గాయని, పది రోజుల్లో ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఆక్వా సిండికేట్ వ్యాపారులకు కొమ్ముకాసి, రైతుల పొట్టకొట్టిన టీడీపీ నేతలు ఇప్పుడు ప్రభుత్వంపై దుష్ఫ్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతల నేతృత్వంలో ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని నమ్మవద్దని ఆక్వా రైతులకు విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చైనా, అమెరికా వంటి దేశాలకు ఎగుమతులు తగ్గడం వల్ల ఆక్వా ధరలు.. ప్రధానంగా రొయ్యల ధరలు తగ్గాయని తెలిపారు. ఈక్వెడార్ దేశంలో రొయ్యల ఉత్పత్తి గణనీయంగా పెరగడమూ కారణమని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించి ఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు మంత్రుల నేతృత్వంలో సాధికార కమిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఈ కమిటీ ఇప్పటికే ఎగుమతిదారులతో సమావేశమై మద్దతు ధర ఇవ్వాలని ఆదేశించిందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులు ఏర్పడినప్పుడు రొయ్యలు, చేపలను నిల్వ చేసుకోవడానికి రూ.546 కోట్లతో పది ప్రాసెసింగ్ యూనిట్లు, 23 ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆక్వా రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఆక్వా రైతులకు సీఎం జగన్ ఎన్నో ప్రయోజనాలు చేకూర్చారని తెలిపారు. పాదయాత్ర చేసిన సందర్భంగా యూనిట్ విద్యుత్ రూ.1.50కే హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక దానిని అమలు చేశారని చెప్పారు. దీనివల్ల 86 శాతం రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. మూడేళ్లలో విద్యుత్ సబ్సిడీ రూపంలోనే రూ.2,377 కోట్లు ఇచ్చారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో ఆక్వాకు రూ. 100 కోట్లు కూడా ఖర్చు చేయలేదని చెప్పారు. కరోనా సంక్షోభంలోనూ సీఎం జగన్ రైతులకు అండగా నిలిచారని, ఎన్నడూ లేని రీతిలో ఆక్వా ఉత్పత్తులకు మంచి ధరలు ఇప్పించారని గుర్తు చేశారు. తక్కువ ధరకు నాణ్యమైన విత్తనం (సీడ్), ఫీడ్ (మేత) అందించేలా చట్టాలను తెచ్చారన్నారు. ఈ చర్యల ద్వారా పెట్టుబడి వ్యయాన్ని తగ్గిస్తున్నారని వివరించారు. ఆక్వా డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేశారన్నారు. అనుమతులను సులభతరం చేయడం వల్ల ఆక్వా సాగు ఐదు లక్షల ఎకరాలకు చేరుకుందన్నారు. ఆక్వా సాగులో దేశంలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపిన ఘనత సీఎంకు దక్కిందన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శిష్యులైన కొందరు వ్యాపారులు సిండికేట్ అయ్యి ఆక్వా రంగాన్ని దెబ్బతీసేలా దుష్ఫ్రచారం చేస్తున్నారని, వారి ఆటలు సాగనివ్వబోమని చెప్పారు. -
జగన్ ప్రభుత్వం ఆక్వా రైతులకి అండగా నిలిచింది : ఏపీ చీఫ్ విప్ ప్రసాద రాజు
-
నిర్దేశించిన ధరలకు రొయ్యలు కొనాల్సిందే
సాక్షి, అమరావతి: ‘ఆక్వా రైతులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. 100 కౌంట్ రొయ్యలకు కనీసం రూ.210 తగ్గకుండా చెల్లించాల్సిందే. ఇదే రీతిలో మిగిలిన కౌంట్ ధరలు కూడా చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేయాల్సిందే. ఇష్టమొచ్చినట్టు రొయ్యల ధరలు తగ్గిస్తే చర్యలు తప్పవు’ అని ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులను ఆక్వా సాధికార కమిటీ హెచ్చరించింది. ఆక్వా రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వాహకులు, సీడ్, ఫీడ్ కంపెనీల ప్రతినిధులతో ఏపీఐఐసీ భవనంలో గురువారం ఆక్వా సాధికార కమిటీ భేటీ జరిగింది. రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ రైతులకు అండగా నిలిచే విషయంలో ప్రాసెసింగ్ కంపెనీలు పెద్ద మనసు చాటుకోవాలని కోరారు. కనీసం10 రోజులపాటు ఇవే ధరలు కొనసాగాలని, ప్రభుత్వం రోజూ కొనుగోళ్లు, ధరలను సమీక్షిస్తుందని చెప్పారు. ధరల విషయంలో ప్రతి 10 రోజులకు ఒకసారి సమావేశమై తగిన నిర్ణయాలు తీసుకుందామని సూచించారు. మార్కెట్ బాగోలేదనే సాకుతో ధరలను తగ్గిస్తామంటే సహించేది లేదన్నారు. ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్ మాట్లాడుతూ రైతులను గందరగోళపరిచేలా కంపెనీలు వ్యవహరించొద్దని హితవు పలికారు. ధరలు, మార్కెట్ పరిస్థితులపై ప్రతి రోజు మానిటరింగ్ చేస్తున్నామని చెప్పారు. రైతుల వద్ద ఉన్న సరుకును పూర్తి స్థాయిలో నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేయాలని కోరారు. కొనుగోళ్ల విషయంలో రైతుల నుంచి ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకాడదన్నారు. జాతీయ రొయ్య రైతుల సంఘం అధ్యక్షుడు ఐపీఆర్ మోహన్‌రాజు మాట్లాడుతూ ప్రాసెసింగ్ కంపెనీలను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని, వాళ్లెంత కొనుగోలు చేయగలరో ముందే చెబితే ఆ మేరకే ఇక నుంచి ఉత్పత్తి చేస్తామని చెప్పారు. మార్కెట్ లేనప్పుడు ఎందుకు 80 బిలియన్ల సీడ్, 16 లక్షల టన్నుల ఫీడ్ ఉత్పత్తి చేస్తున్నారని ప్రశ్నించారు. యూఎస్ మార్కెట్ ఆగిపోయిందని, చైనా మార్కెట్ ఓపెన్ కాలేదని, అందువల్లే పూర్తి స్థాయిలో కొనుగోలు చేయలేకపోతున్నామని పలువురు ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వాహకులు సాధికార కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. అయినా రైతుల వద్ద ఉన్న సరుకును ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. మత్స్యశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, కమిషనర్ కన్నబాబు పాల్గొన్నారు. ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు వద్దు ప్రభుత్వంతో చర్చల అనంతరం నాలుగు నెలలుగా రాష్ట్రంలో రొయ్యల మేతల్ని తగ్గింపు ధరలకు సరఫరా చేస్తున్నామని రొయ్యల మేత తయారీదారుల సంఘం పేర్కొంది. ముడి సరుకుల ధరలు పెరిగినప్పటికీ రొయ్యల రైతుల అభ్యర్థన, ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కానీ, రొయ్యల మేత తయారీదారుల నుంచి రూ.5 వేల కోట్లు వసూలు చేయడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేసింది. రాష్ట్రంలో రొయ్యల మేత తయారీ పరిశ్రమ ఏడాది టర్నోవరే రూ.5 వేల కోట్లు ఉంటుందని తెలిపింది. అలాంటిది ప్రభుత్వానికి రూ.5 వేల కోట్లు లంచంగా ఇవ్వనున్నారని కొందరు రాజకీయ నేతలు ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొంది. -
ఎస్‌ఐఎఫ్‌టీ ఆక్వా ల్యాబ్‌కు అంతర్జాతీయ గుర్తింపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ (స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (ఎస్‌ఐఎఫ్‌టీ) కాకినాడ)కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఎస్‌ఐఎఫ్‌టీలోని ఆక్వా లేబొరేటరీకి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆక్వా ల్యాబ్‌ల నైపుణ్యతను పరీక్షించేందుకు అమెరికాకు చెందిన ఆరిజోనా యూనివర్సిటీ నిర్వహించే రింగ్ టెస్ట్‌లో ఎస్‌ఐఎఫ్‌టీ అత్యుత్తమ ప్రతిభను కనబర్చింది. ఇందులో 14 దేశాలకు చెందిన 29 ఆక్వా ల్యాబ్‌లతో పాటు భారత్ తరఫున ఎస్‌ఐఎఫ్‌టీ ఆక్వా ల్యాబ్ పాల్గొంది. రొయ్యలలో తెల్లమచ్చల వ్యాధి, ఎంట్రోసైటోజూన్ హైపాటోపెనై (ఈహెచ్‌పీ) వ్యాధి కారకాలను నిర్ణీత కాలవ్యవధిలో అత్యంత సమర్థవంతంగా పరీక్షించి గుర్తించగలగడంతో ఎస్‌ఐఎఫ్‌టీలోని ఆక్వా ల్యాబ్ విజయం సాధించింది. ల్యాబ్, పరీక్షల నిర్వహణ, వ్యాధి కారకాల గుర్తింపులో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్న ల్యాబ్‌గా ఎస్‌ఐఎఫ్‌టీ ల్యాబ్‌ను ఆరిజోనా యూనివర్సిటీ గుర్తించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో 61 పరీక్షలు 2001లో కాకినాడ ఎస్‌ఐఎఫ్‌టీలో ఏర్పాటైన రియల్ టైం పాలీమరేస్ చైన్ రియాక్షన్ (ఆర్టీపీసీఆర్) ఆక్వా ల్యాబ్‌కు 2017లో ఐఎస్ఓ సర్టిఫికేషన్ రాగా, గతేడాది బోర్డ్ ఆఫ్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు లిమిటెడ్ (ఎన్ఏబీఎల్) గుర్తింపు కూడా లభించింది. ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో 61 రకాల పరీక్షలు చేస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా కల్చర్ యాక్ట్ (అప్సడా) నియమావళి ప్రకారం వివిధ రకాల మేతలు, సీడ్ నాణ్యతలను పరీక్షించి ధృవీకరించేందుకు ఎస్‌ఐఎఫ్‌టీ ఆక్వాకల్చర్ ల్యాబ్ రాష్ట్ర రిఫరల్ ల్యాబ్‌గా పనిచేస్తోంది. అలాగే, నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులు సాధించడమే లక్ష్యంగా రూ.50.30 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ఎనిమిది ఆక్వా ల్యాబ్స్‌ను ఆధునీకరించడంతోపాటు కొత్తగా 27 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్‌ను ఏర్పాటుచేస్తోంది. 35 ల్యాబ్‌లలో స్థానిక అవసరాలను బట్టి 14 చోట్ల మేతల నాణ్యత విశ్లేషణ, 17 చోట్ల పీసీఆర్, 14 చోట్ల క్వాలిటీ కంట్రోల్æ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లుచేశారు. ఆక్వా రైతులు వినియోగించుకోవాలి ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన ఎస్‌ఐఎఫ్‌టీ ఆక్వా ల్యాబ్‌ను ఆరిజోనా యూనివర్సిటీ కూడా గుర్తించడం ద్వారా మన ల్యాబ్ అంతర్జాతీయ ప్రమాణాలు కల్గిన ల్యాబ్‌గా ఖ్యాతిని గడించింది. ఆక్వా రైతులు, హేచరీలు ఈ ల్యాబ్ సేవలను సద్వినియోగం చేసుకుని సుస్థిర సాగుతో పాటు అధిక దిగుబడులు సాధించేందుకు కృషిచేయాలి. – పి.కోటేశ్వరరావు, ప్రిన్సిపల్, ఎస్‌ఐఎఫ్‌టీ -
రొయ్య రైతుకు బాసట
సాక్షి, అమరావతి: రొయ్య రైతుకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో రొయ్య ధరలు తగ్గుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆక్వా రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతుల వద్ద ఉన్న రొయ్యలు పూర్తి స్థాయిలో అమ్ముడయ్యే వరకు వారికి అండగా నిలవాలని స్పష్టంగా చెప్పారు. దీంతో సీనియర్ మంత్రుల సారథ్యంలో ఏర్పాటు చేసిన ఆక్వా సాధికారత కమిటీ రంగంలోకి దిగింది. కమిటీ సభ్యులైన మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) వైస్ చైర్మన్ వడ్డి రఘురాం, స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, కమిషనర్ కన్నబాబు ప్రతి రోజు మార్కెట్‌ను నిశితంగా పరిశీలిస్తున్నారు. రొయ్య ధరలను సమీక్షించి, ఆక్వా రైతులకు నష్టం కలగకుండా కమిటీ చర్యలు చేపడుతోంది. సమీపంలోని ప్రాసెస్ కంపెనీల ద్వారా రొయ్యలు కొనుగోలు చేయిస్తోంది. రవాణాకు అవసరమైన వాహనాలను సమకూరుస్తూ క్రయవిక్రయాలను దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌ను బూచిగా చూపి ధరలు తగ్గించే ప్రాసెసింగ్ యూనిట్లపై కఠిన చర్యలకు సైతం కమిటీ సిద్ధమవుతోంది. అవసరమైతే కంపెనీల్లో విస్తృత తనిఖీలు చేపట్టాలని యోచిస్తోంది. త్వరలో మరోసారి రాష్ట్రస్థాయిలో ఆక్వా రైతులు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఫీడ్, సీడ్ కంపెనీలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. నిలకడగా కౌంట్ ధరలు రాష్ట్రంలో ప్రస్తుతం వంద కౌంట్ రొయ్యలు రూ.190కు, 30 కౌంట్ రొయ్యలను రూ. 370కి తక్కువ కాకుండా కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన కౌంట్ ధరలూ నిలకడగానే ఉన్నాయి. 100 కౌంట్ రొయ్యలను కనీసం రూ.240కు కొనాలని ప్రాసెసింగ్ కంపెనీలకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రస్తుతం మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో 100 కౌంట్ రూ.220కు తక్కువ కాకుండా కొనాలని కంపెనీలను ఆదేశించింది. అమెరికా, చైనా, ఈక్విడార్ దేశాల నుంచి ఆర్డర్లు ఊపందుకోగానే ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే కొంటామని కంపెనీలు చెబుతున్నాయి. వచ్చేవారంలో చైనా మార్కెట్ ఓపెన్ కానుండడంతో 100 కౌంట్ ధరలు రూ.240కు పైగా పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. విపక్షాలది దుష్ప్రచారం రొయ్య రైతులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ విపక్షాలు చేస్తున్నది దుష్ప్రచారం. రాష్ట్రంలో ఎక్కడా వంద కౌంట్ రూ.190కు తగ్గలేదు. ప్రతిరోజూ మార్కెట్‌ను సమీక్షిస్తూ కౌంట్ ధర రూ.240కి పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనాలని ప్రాసెసింగ్ కంపెనీలను ఆదేశించాం. అవసరమైతే కంపెనీలపై చర్యలకు సైతం ప్రభుత్వం వెనుకాడదు. ఆ అధికారాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధికారత కమిటీకి ఇచ్చారు. –వడ్డి రఘురాం, వైస్ చైర్మన్,అప్సడా ఆందోళన వద్దు రొయ్య రైతులు ఆందోళన చెందాల్సిన ప నిలేదు. వారం పదిరోజుల్లో చైనా మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఎగుమతులు పుంజుకుంటాయి. వందకౌంట్కు రూ. 240 కుపైగా ధర వస్తుంది. – ఐపీఆర్ మోహనరాజు, జాతీయ రొయ్య రైతుల సంఘం అధ్యక్షుడు -
Aqua Farmers: ఆక్వా రైతులను ముంచేస్తున్నారు..
వ్యాపారులంతా ఒక్కటయ్యారు. సిండికేట్‌గా మారి ఆక్వా రైతులను నిట్టనిలువునా ముంచేస్తున్నారు. 40 కౌంట్ రొయ్యలను రూ.395కి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. వ్యాపారులు మాత్రం రూ.330కే కొనుగోలు చేస్తున్నారు. నిర్ణీత ధరలకే రైతుల నుంచి రొయ్యలు కొనుగోలు చేయాలని స్పష్టం చేసినా.. వారిలో ఎలాంటి మార్పు కనిపించడంలేదు. సంబంధిత శాఖల అధికారులు సైతం దృష్టి సారించకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపారులు, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానుల తీరుతో సాగుకు పెట్టిన పెట్టుబడి రాక ఆక్వా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది సాక్షి ప్రతినిధి, ఒంగోలు: డాలర్ల పంటగా పేరొందిన ఆక్వా సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. గత ప్రభుత్వ నిర్ణయాలతో తీవ్రంగా నష్టపోయిన వీరిని ఆదుకునేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ రాయితీలు ప్రకటించారు. వాణిజ్యపరంగా అండగా నిలిచేందుకు ఆక్వా హబ్‌లు, మార్కెట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కానీ, వ్యాపారులు మాత్రం రైతులను అడ్డగోలుగా దోచేస్తున్నారు. ఎంతగా అంటే.. ఒక్కో రైతు రూ.లక్షల్లో నష్టపోయేంత. రాష్ట్ర వ్యాప్తంగా రొయ్యల రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించింది. ఈ నెల 17వ తేదీ విజయవాడలో అధికారులు, మంత్రులు, రైతులు, వ్యాపారులతో ఉమ్మడిగా సమావేశం నిర్వహించింది. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే రొయ్యలు కొనుగోలు చేయాలని వ్యాపారులకు దిశానిర్దేశం చేసింది. సమావేశం ముగిసి పదిరోజులు కావస్తున్నా వ్యాపారులు, రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానుల్లో కనీస మార్పు రాలేదు. దానికితోడు జిల్లాలోని అధికారులు సైతం రొయ్యల మార్కెట్‌పై దృష్టి సారించకపోవడం కూడా ప్రధాన కారణమని విమర్శలూ వినిపిస్తున్నాయి. విజయవాడలో వ్యాపారులతో ప్రభుత్వం చర్చలు జరిపి కనీస మద్దతు ధర ప్రకటించినా ఆ ధరలను వ్యాపారులు అమలు చేయడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన ధర కంటే వెనామీ రొయ్యలు కేజీకి రూ.30 నుంచి రూ.55 వరకు తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. కౌంట్ పేరుతో దోపిడీ... వ్యాపారులు కూటమికట్టి ఇష్టారీతిన దోపిడీ చేస్తున్నారు. వెనామీతో పాటు టైగర్ రొయ్యలను కూడా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న కౌంట్ రొయ్యలు తీసుకోకుండా లేని కౌంట్ రొయ్యలు కావాలని వ్యాపారులు మెలికపెట్టి మరీ దోచుకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరకంటే మరీ తక్కువ చేసి కొనుగోలు చేయడంతో రైతులు భారీగా నష్టపోవాల్సి వస్తోంది. ఎకరా సాగుకయ్యే ఖర్చు రూ.4.15 లక్షలు... రైతును తీవ్రంగా నష్టపరుస్తున్నారు వ్యాపారులు, రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారు. అధికారుల పట్టించుకోవడం లేదు. దిగుబడి వచ్చిన తర్వాత రొయ్యలను నిల్వ చేసుకునే అవకాశం లేదు. దీనిని ఆసరా చేసుకుంటున్న వ్యాపారులు ఇష్టమొచ్చిన ధరకు కొనుగోలు చేస్తున్నారు. అధికారులు పట్టించుకుని ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానుల ఎగుమతులను ఆపేయాలి. అప్పుడే వాళ్లకు కష్టం అర్థమవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే వ్యాపారులు రైతులను అణగదొక్కుతున్నారు. – బత్తుల రమేష్‌రెడ్డి, ఆక్వా రైతు, కొత్తపట్నం అధికారులు నిర్లక్ష్యం వీడాలి రొయ్యల ధరల విషయంలో జిల్లా అధికారులు నిర్లక్ష్యం వీడాలి. ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, వ్యాపారులు రైతులను నిలువునా నష్టపరుస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరల కంటే తక్కువకు కొనుగోలు చేయడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. లేకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారు. – దుగ్గినేని గోపీనాథ్, రొయ్యల రైతుల సంఘ నాయకుడు జిల్లా వ్యాప్తంగా సమావేశం ఏర్పాటు చేస్తాం జిల్లా వ్యాప్తంగా రొయ్యల వ్యాపారులు, రైతులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం ఇప్పటికే వారికి ప్రకటించిన ధరలకే అమ్మాలని నిర్దేశించింది. అయినా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్దేశించిన ధరలను అమలుచేస్తాం. – ఆవుల చంద్రశేఖరరెడ్డి, మత్స్యశాఖ జిల్లా అధికారి -
AP: రొయ్య రైతుకు బాసట
సాక్షి, అమరావతి: ఆక్వా ఫీడ్ ధరలను ఇష్టారీతిన పెంచడం, రొయ్యల కౌంట్ ధరలను తగ్గించడంపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆక్వా ఫీడ్ తయారీ కంపెనీలు, ప్రాసెసర్లు దిగి వచ్చారు. పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను పూర్తిగా ఉపసంహరించుకోవడంతో పాటు రొయ్యల కౌంట్ ధరలను పెంచేందుకు అంగీకరించారు. గురువారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో జరిగిన ఆక్వా సాధికార కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 17 నుంచి దీనిని అమలు చేస్తామని ప్రకటించారు. రొయ్యల ఫీడ్ ధరలు ఇష్టానుసారం పెంచుతున్నారని, కౌంట్ ధరలు తగ్గిస్తున్నారంటూ ఆక్వా రైతులు ఫిర్యాదు చేయడంతో, ఈ వ్యవహారంపై సీఎం వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం నేతృత్వంలో సాధికార కమిటీని ఏర్పాటు చేశారు. బుధవారం జరిగిన కమిటీ తొలిభేటీలో మంత్రుల ఆదేశాల మేరకు ఆక్వా రైతులు, ఫీడ్ తయారీదారులు, ప్రాసెసర్లతో గురువారం సాయంత్రం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రి అప్పలరాజు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం, స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, కమిషనర్ కె.కన్నబాబు పాల్గొన్నారు. రైతులు, ఫీడ్ కంపెనీలు, ప్రాసెసర్ల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. రైతులకు నష్టం కలిగించే చర్యలొద్దు ఆక్వా రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి నష్టం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని మంత్రి అప్పలరాజు స్పష్టంచేశారు. ప్రభుత్వం, రైతులతో చర్చించకుండా ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచినా, కౌంట్ ధరలు తగ్గించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. పెంచిన ఫీడ్ ధరలు తగ్గించాలని, కౌంట్ ధరలను పెంచాలని ఆదేశించారు. స్టేక్ హోల్డర్స్, ఎగుమతిదారులు, ప్రాసెసరల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. లాజిస్టిక్స్ సమస్యలేమైనా ఉంటే చెప్పాలని సూచించారు. ముడి సరుకుల ధరలు పెరగడం వల్లే ఫీడ్ ధరలు పెంచాల్సి వచ్చిందని వారు కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. సోయాబీన్, ఫిష్ ఆయిల్, ఇతర ముడిసరుకుల ధరలు గతంతో పోలిస్తే ఇప్పుడు తగ్గాయని, ఈ సమయంలో పెంచిన ధరలు ఎందుకు కొనసాగిస్తున్నారని అప్సడా వైస్ చైర్మన్ రఘురాం ప్రశ్నించారు. పెంచిన ఫీడ్ ధరలను తగ్గించాలని కమిటీ ఆదేశించింది. దీంతో నెల క్రితం టన్నుకి రూ.2,600 చొప్పున పెంచిన ఫీడ్ ధరను ఉపసంహరించుకునేందుకు తయారీదారులు అంగీకరించారు. కౌంట్‌కు రూ.55 వరకు పెంపునకు ప్రాసెసర్లు అంగీకారం రొయ్యల కౌంట్ ధరలు అనూహ్యంగా తగ్గించడంపైనా సమావేశంలో చర్చించారు. రూ.270 నుంచి రూ. 280 ఉన్న 100 కౌంట్ «ధరను రూ.200కు, రూ.420కు పైగా ఉన్న 30 కౌంట్ ధరను రూ.380కు తగ్గించారు. మిగిలిన కౌంట్ ధరలను కూడా రూ.30 నుంచి రూ.80 వరకు తగ్గించారు. ఈ విషయం సీఏం దృష్టికి వెళ్లడం, ఆయన ఆదేశాలతో సాధికార కమిటీ ఏర్పాటు చేయడంతో కౌంట్‌కు రూ.20 నుంచి రూ.35 వరకు పెంచారు. ఈ ధరలు ఏమాత్రం లాభసాటి కాదని రైతులు స్పష్టంచేసారు. అంతర్జాతీయంగా ధరలు నిలకడగా ఉన్నప్పుడు ఇక్కడ ఏ విధంగా తగ్గిస్తారని, తక్షణం పెంచాల్సిందేనని మంత్రి, అప్సడా వైస్ చైర్మన్లు ఆదేశించారు. దీంతో సీఎం జోక్యం చేసుకోడానికి ముందు ఉన్న ధరలతో పోలిస్తే కౌంట్‌కు రూ.40 నుంచి రూ.55 మేర పెంచేందుకు ప్రాసెసర్లు అంగీకరించారు. ఫీడ్ ధరల తగ్గింపు, కౌంట్ ధరల పెంపును 17వ తేదీ నుంచి అమలు చేస్తామని తెలిపారు. ఈ ధరల వివరాలను అన్ని ఆర్బీకేల్లో ప్రదర్శించాలని, ఇవే ధరలు 24వ తేదీ వరకు కొనసాగించాలని మంత్రి సూచించారు. ఇకపై ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తర్వాతే ధరలపై నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. -
‘ఆక్వా’లో ఏమిటీ దందా?
సాక్షి, అమరావతి: ఆక్వా రైతుల ఫిర్యాదులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్‌గా స్పందించారు. ఆక్వా ధరల పతనం, ఆక్వా ఫీడ్ ధర పెంపుపై రైతులు, రైతు సంఘాల నేతలు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించేస్తున్నారని వాపోయారు. ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన సీఎం.. ముగ్గురు మంత్రులు, సీనియర్ అధికారులతో సాధికారత కమిటీ ఏర్పాటు చేశారు. వారంలోగా సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఎవరైనా సరే రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చినా, సిండికేట్‌గా మారి రైతులను నష్టపరచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పశు సంవర్ధక, మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మత్స్యశాఖ కమిషనర్లతో సాధికారత కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. మత్స్యశాఖ కమిషనర్ కమిటీ సభ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీ ఆక్వా ఫీడ్ సరఫరా, ఆక్వా ఫీడ్ ధర, ఆక్వా కొనుగోలు ధర.. సంబంధిత అంశాలను అధ్యయనం చేయడంతో పాటు రైతులు నష్టపోకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై వారంలోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. నాణ్యత, ధరల పర్యవేక్షణకూ చట్టం ► ఆక్వా రైతుల ప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యంగా కొత్తగా ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఎస్డీఏ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం చేసింది. ఈ చట్టం ద్వారా ఆక్వాకల్చర్‌కు సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలు, ఉత్పత్తులు, సేవల ఏకీకృత డెలివరీ మెకానిజం ఒకే గొడుకు కిందకు తీసుకు వచ్చింది. ► ఆక్వాకల్చర్ ఇన్పుట్ల (విత్తనం, మేత) నాణ్యత, ధర, ఉత్పత్తుల ధరల పర్యవేక్షణ, నియంత్రణను ఈ అథారిటీ చూస్తుంది. ఆక్వాకల్చర్ వాటాదారులకు ఆన్లైన్ ప్రక్రియ ద్వారా లైసెన్స్‌లు, ఎండార్స్మెంట్ల జారీని సులభతరం చేస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా ఆక్వా ఉత్పత్తుల వాణిజ్యం, ఎగుమతి కోసం అనుకూలమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రత్యేకంగా యూనివర్సిటీ ► మత్స్య పరిశ్రమ, ఆక్వాకల్చర్ సమగ్రాభివృద్ధి కోసం ఆ రంగంలో నిపుణుల అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీని పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఆక్వా రంగ అభివృద్ధికి ఈ యూనివర్సిటీ ఎంతగానో దోహదపడుతుంది. ► కోవిడ్ సంక్షోభ సమయంలో కూడా 2020లో ప్రభుత్వం ఆక్వా రైతులకు అండగా నిలబడేందుకు పలు చర్యలు తీసుకుంది. రొయ్యలు దిగుమతి చేసుకునే దేశాల్లో నిషేధం కారణంగా.. ధరలు గణనీయంగా పడిపోవడంతో పాటు రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోలేని పరిస్థితి తలెత్తింది. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని, శీతల గిడ్డంగులను, ప్రాసెసింగ్ ప్లాంట్లను వెంటనే తెరిపించడంతో పాటు రైతుల ఉత్పత్తులకు తగిన ధరలను నిర్ణయించింది. బ్యాంకుల ద్వారా భరోసా ► ప్రైవేట్ రంగంలో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకునే పరిస్థితి లేకుండా.. ఆక్వా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ. మత్స్య శాఖ ఆధ్వర్యంలో బ్యాంకుల నుంచి రుణాలు. ఈ– మత్స్యకార పోర్టల్‌లో అందుబాటులో జిల్లాలు, సెక్టార్, బ్యాంకుల వారీగా రుణాలు పొందిన వారి వివరాలు. ఇప్పటి వరకు 19,059 కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ. రూ.2,673 కోట్ల రుణం మంజూరు. ► కొత్తగా 27 ఇంటిగ్రేటెడ్ ఆక్వా కల్చర్ ల్యాబ్‌లు. ఇప్పటికే ఉన్న మరో 8 ల్యాబ్‌ల ఆధునికీకరణ. తద్వారా అన్ని కోస్తా జిల్లాల్లోని 35 ప్రాంతాల్లో ల్యాబ్‌లు. నీరు, మట్టి విశ్లేషణ చేయడంతోపాటు వివిధ రకాల పరీక్షల కోసం రూ.50 కోట్లు కేటాయింపు. ఈ ల్యాబ్‌ల్లో 14 ఆక్వా ల్యాబ్‌లు కాగా, 3 మొబైల్.. మిగతావి ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌లు. 2022 ఆఖరుకు అందుబాటులోకి ఆక్వా ల్యాబ్‌లు. ఆక్వా రైతుల కోసం, ఫిష్ ఫీడ్ కోసం ప్రత్యేక చట్టం ► ఆక్వా రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ‘ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ సీడ్ (క్వాలిటీ కంట్రోల్) చట్టం–2020ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఆక్వా సీడ్లో నకిలీకి ఆస్కారం లేకుండా నాణ్యమైన సీడ్‌ను మాత్రమే రైతులకు సరఫరా చేసేలా చర్యలు చేపట్టింది. నకిలీ, అక్రమ పద్ధతుల్లో సాగుతున్న సీడ్ వ్యాపారాలను నిరోధించేందుకు చట్టం ద్వారా చర్యలు తీసుకుంది. ► ఫిష్ ఫీడ్ నాణ్యతకు ప్రత్యేక చట్టం చేసింది. ఆక్వా కల్చర్ నిర్వహణ వ్యయంలో 60 శాతం ఫీడ్‌కు ఖర్చు అవుతుంది. దేశం మొత్తం మీద ఫిష్ ఫీడ్‌లో క్వాలిటీ కంట్రోల్ కోసం ఎలాంటి నియంత్రణ యంత్రాంగం అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో ఫిష్ ఫీడ్‌కు సంబంధించి.. అధిక ధరలు, సిండికేట్ వ్యవహారాలను నియంత్రించడానికి, మత్స్య పరిశ్రమ మనుగడ కోసం ఏపీ ప్రభుత్వం ఏకంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రత్యేకంగా చేపల మేత పరిశ్రమల్లో అనైతిక, చట్టవిరుద్ధమైన పద్ధతులను నిరోధించడానికి, చేపల మేత వ్యాపారంలో నాణ్యత నియంత్రణ చర్యలను అమలు చేయడానికి దేశంలోనే తొలిసారిగా ఫిష్ ఫీడ్ (క్వాలిటీ, కంట్రోల్ ) చట్టం–2020 తీసుకువచ్చింది. ఆక్వా రైతుల సంక్షేమ కోసం ఎన్నో నిర్ణయాలు ► ఆక్వా రైతులకు అండగా నిలబడేందుకు ఉత్పాదక వ్యయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్‌ను 24 గంటల పాటు యూనిట్ రూ.1.50 చొప్పున సరఫరా చేస్తోంది. ► 2016లో ఆక్వా రైతులకు పవర్ టారిఫ్ యూనిట్ రూ.4.63 నుంచి రూ.7 కాగా.. 2016 నుంచి 2018 మే వరకు యూనిట్ రూ.3.86 చొప్పున సరఫరా చేశారు. 2108 జూన్ నుంచి 2019 జూన్ వరకు రూ.2కే యూనిట్ సరఫరా చేయగా, జూలైలో ప్రస్తుత ప్రభుత్వం యూనిట్ ధరను రూ.1.50కి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2019–20 నుంచి 2021–22 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కింద రూ.2,377.52 కోట్లు ఇచ్చింది. ► గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాల ద్వారా అండగా నిలుస్తోంది. రాయితీతో కూడిన ఫీడ్ వంటి ఇన్పుట్స్ అందించడంతో పాటు, ఆక్వా సాగులో అత్యాధునిక, వినూత్న విధానాల్లో శిక్షణ. దీనికోసం ఆర్బీకే స్థాయిలో దాదాపు 732 మంది విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్లను నియామకం. ► ఆక్వా రైతుల ఉత్పత్తులకు లాభదాయకమైన ధర కల్పించేందుకు ఈ–క్రాప్ (ఇ–ఫిష్) బుకింగ్ సౌకర్యం. ఈ–ఫిష్ యాప్ సహకారంతో సుమారు 4.02 లక్షల హెక్టార్లలో మత్స్య, రొయ్యల సాగు విస్తీర్ణం నమోదు. ► ఇ–మత్స్యకార పోర్టల్ సహాయంతో ఫార్మర్ ఫీల్డ్ స్కూల్ ఏర్పాటు. తద్వారా ఆక్వా సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు, అత్యాధునిక సౌకర్యాల వినియోగంపైన శిక్షణ. ఆర్బీకేల ద్వారా రూ.13.27 కోట్ల విలువైన 2,473 మెట్రిక్ టన్నుల ఫీడ్ సరఫరా. -
నష్టం కలిగిస్తే ఊరుకోం.. సీఎం జగన్ సీరియస్
సాక్షి, తాడేపల్లి: ఆక్వా రైతుల ఫిర్యాదులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్ అయ్యారు. ముగ్గురు మంత్రులు, సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆక్వా ధరల పతనం, ఆక్వా ఫీడ్ పెంపుపై సీఎంకు రైతులు, రైతు సంఘాల నేతల ఫిర్యాదు చేశారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించేస్తున్నారని, ధరలు పతనమై నష్టపోతున్నామని రైతులు పేర్కొన్నారు. అలాగే ఆక్వాఫీడ్ విషయంలోనూ వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు పెంచారని ఫిర్యాదు చేశారు. చదవండి: అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు తన దృష్టికి వచ్చిన అంశాలను తీవ్రంగా పరిగణించిన సీఎం.. రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రైతులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చినా సిండికేట్‌గా మారి రైతులను నష్టపరచడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు మంత్రులు, సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిన సీఎం.. వారం రోజుల్లో నివేదిక అందించాలన్నారు. నివేదిక ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, సీఎస్, సీనియర్ అధికారులు విజయానంద్, పూనం మాలకొండయ్య, కన్నబాబులతో ప్రభుత్వం కమిటీని నియమించింది. -
రొయ్యో.. అయ్యయ్యో.. భారీగా ధర పతనం!
కాజులూరు(కాకినాడ జిల్లా): రొయ్యల ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో రొయ్యల సాగు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. చెరువుల్లో ఆక్సిజన్ స్థాయిని పెంచేందుకు ఏరియేటర్లు పెడుతూ.. అవసరమైన మందులు వాడుతూ రైతులు రొయ్యల సాగును ముందుకు నెట్టుకొస్తున్నారు. ఏదో ఒకవిధంగా కనీసం 30 కౌంట్ వరకూ అయినా రొయ్యలను పెంచితే గత ఏడాది నష్టాలను పూడ్చుకోవచ్చని భావిస్తున్నారు. అయితే వరుసగా కురుస్తున్న వర్షాలకు వాతావరణంలో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. దీంతో వైట్‌స్పాట్, రెడ్గ్రిల్ వంటి వ్యాధులకు గురై చెరువుల్లో రొయ్యలు తేలిపోతున్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు 150, 120 100, 90 వంటి తక్కువ కౌంట్లోనే పట్టుబడి పట్టాల్సి వస్తోంది. ఇదే అదునుగా కంపెనీలు ధరను అమాంతం తగ్గించేశాయి. వారం క్రితం 100 కౌంట్ ధర రూ.270 ఉండగా ప్రస్తుతం రూ.210కి మించి రావడం లేదు. దీనికి తోడు పట్టుబడి పట్టిన రొయ్యలు పీలింగ్, గుళ్లకొట్టులో ఉన్నాయంటూ నాణ్యత లోపం పేరుతో మరికొంత కోత విధిస్తున్నారు. ఎకరం చెరువులో సగటున రెండు టన్నుల దిగుబడి వస్తే కేజీకి రూ.60 చొప్పున రూ.1.20 లక్షల వరకూ రైతు నష్టపోవాల్సి వస్తోంది. తగ్గిపోయిన ధర రూపంలో కష్టార్జితమంతా కోల్పోతున్నామని వారు వాపోతున్నారు. ఈక్వెడార్ వంటి దేశాల నుంచి ప్రస్తుతం రొయ్యల ఉత్పత్తి ఎక్కువగా జరుగుతూండటంతో ఇక్కడి రొయ్యలకు డిమాండ్ తగ్గి, ధర పడిపోతోందని కొనుగోలుదారులు చెబుతున్నారు. అయితే అది వాస్తవం కాదని, వాతావరణ మార్పులతో వ్యాధులు సోకి రొయ్యలు చనిపోతుండటంతో అందరూ ఒకేసారి పట్టుబడి పట్టాల్సి వస్తోందని, ఒకేసారి పెద్ద మొత్తంలో సరుకు రావడంతో కంపెనీలు ధర తగ్గించేస్తున్నాయని ఆక్వా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు జరిగే ఆక్వా మార్కెట్‌కు ఆ స్థాయిలో డిమాండ్, ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ధరల హెచ్చుతగ్గులుంటాయని.. అయితే స్థానిక కంపెనీలన్నీ సిండికేటుగా మారి సరుకు ఎక్కువగా వచ్చే సమయానికి ధరలు తగ్గించేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మేతలు, మందుల ధరలు రోజురోజుకూ పెరిగిపోతుండగా పట్టుబడి సమయానికి రొయ్యల ధరలు తగ్గిపోతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని, ధరలను ప్రభుత్వం స్థిరీకరించాలని కోరుతున్నారు. అదును చూసుకుని.. రైతుల నుంచి ఒకేసారి సరకు వస్తుంటే కంపెనీలన్నీ ఏకమై ధర తగ్గించేస్తున్నాయి. వ్యాధుల బారిన పడి చెరువుల్లో రొయ్యలు తేలిపోతుండటంతో తక్కువ కౌంట్లోనే పట్టుబడి పట్టాల్సి వస్తోంది. రొయ్య కేజీ 150 కౌంట్ కంటే చిన్నదిగా ఉంటే కంపెనీలు కొనటం లేదు. డైలీ మార్కెట్లో కేజీ రూ.50కి అమ్ముకోవాల్సి వస్తోంది. – పిల్లి కృష్ణమూర్తి ఆక్వా రైతు, కుయ్యేరు ఇలాగే ఉంటే సాగు కష్టమే మేత, ఇతర ఖర్చులు పెరుగుతుంటే రొయ్యల ధరలు మాత్రం తగ్గుతున్నాయి. పైగా పంట చేతికొచ్చే సమయంలో ధరలు పడిపోతున్నాయి. దీంతో నికర ఆదాయం తగ్గి రైతులు నష్టాల బారిన పడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఆక్వా సాగు ప్రశ్నార్థకమే. – వీరవల్లి గణపతి, ఆక్వా ట్రైనీ టెక్నీషియన్, గొల్లపాలెం -
రుణ సాయం... బీమా సౌకర్యం
సాక్షి, అమరావతి: కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ)ల ద్వారా ఆక్వా రైతులు, మత్స్యకారులకు మరింత మేలు చేకూర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మూడేళ్లలో 19,059 కేసీసీ కార్డుదారులకు రూ.2,673 కోట్ల రుణ పరపతిని ప్రభుత్వం కల్పించింది. మరింత ఎక్కువ మందికి కేసీసీలను జారీ చేయడం ద్వారా వారికి రుణ సాయం, బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేసీసీల జారీ, రుణపరపతి కోసం ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ ఆధారిత కేసీసీ అప్లికేషన్(ఆటోమేషన్)ను రూపొందించింది. జిల్లాల వారీగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు కేసీసీల జారీ, రుణాల మంజూరు వివరాలను ఆర్బీకేల్లోని మత్స్య సహాయకుల ద్వారా అప్లోడ్ చేస్తున్నారు. కేసీసీ పొందాలంటే... కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం మత్స్యకారులు, ఆక్వా రైతులు స్థానిక ఆర్బీకేల్లో దరఖాస్తు చేసుకోవాలి. వ్యక్తిగతంగానే కాకుండా జేఎల్‌జీ, మహిళా, స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడినా కిసాన్ క్రెడిట్ కార్డులు జారీచేస్తారు. ఇందుకోసం ఆర్బీకే స్థాయిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో వారి సామర్థ్యాన్ని బట్టి రుణపరపతి కోసం బ్యాంకులకు సిఫార్సు చేస్తారు. అర్హులైన కిసాన్ క్రెడిట్ కార్డుదారులకు పాండ్స్, ట్యాంక్స్, ఓపెన్ వాటర్ బాడీస్, హేచరీలు, రేరీంగ్, ప్రొసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రుణాలు ఇస్తారు. మత్స్యకారులకు వెస్సెల్స్, బోట్స్ నిర్మాణానికి ఆర్థిక చేయూతనిస్తారు. వర్కింగ్ క్యాపిటల్ కింద మత్స్యకారులకు సీడ్, ఫీడ్, ఎరువులు, ఫ్యూయల్, విద్యుత్, కూలీ, మార్కెటింగ్ చార్జీలు, లీజ్ రెంట్ల చెల్లింపుల కోసం రుణాలు పొందవచ్చు. మత్స్య ఉత్పత్తులు విక్రయించేవారు కూడా తమ వ్యాపార విస్తరణకు కోసం రుణ పరపతిని పొందవచ్చు. మత్స్యకారులకు భరోసా ప్రతి సీజన్లో ఆక్వా రైతులకు రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తారు. ఈ రుణంలో మొదటి రూ.2 లక్షలను కేసీసీ రుణంగా పరిగణిస్తారు. ఆ రూ.2లక్షలపై 2%, మిగిలిన రుణం సకాలంలో చెల్లిస్తే మరో 3% వడ్డీ రాయితీ పొందే వెసులుబాటు కల్పించారు. కేసీసీ పొందిన వారికి బీమా కూడా వర్తిస్తుంది. కార్డు పొందిన ప్రతీ మత్స్యకారునికి నెలకు రూ.12 ప్రీమియంతో 18 నుంచి 70 ఏళ్ల వయసున్న వారికి ప్రధానమంత్రి సురక్ష యోజన, 18 నుంచి 50 ఏళ్లలోపు వారికి రూ.330ల ప్రీమియంతో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన బీమా వర్తింపజేస్తారు. పెరుగుతున్న కార్డుదారులు.. రుణాలు రాష్ట్రంలో 2019–20 ఆర్థిక సంవత్సరంలో 2,865 కేసీసీ కార్డుదారులకు రూ.688.85కోట్లు, 2020–21లో 5,114 కార్డుదారులకు రూ.711.20కోట్లు, 2021–22లో 9,112 కార్డుదారులకు రికార్డు స్థాయిలో రూ.1,205.89 కోట్ల రుణాలు మంజూరు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 10వ తేదీ నాటికి 1,968 కార్డుదారులకు రూ.67.26కోట్ల రుణాలు మంజూరు చేశారు. ప్రస్తుతం బ్యాంకుల వద్ద రుణాల కోసం 46,383 కేసీసీ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. -
గంగపుత్రులకు బాసటగా..
సాక్షి, అమరావతి: నిత్యం నడిసంద్రంలో బతుకుపోరు సాగించే గంగపుత్రుల బెంగ తీర్చేలా రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది. పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనతో వారి అభివృద్ధికి బాటలు వేసింది. ప్రభుత్వ చర్యల ఫలితంగా గంగపుత్రుల జీవన ప్రమాణాలు మెరుగుపడడమే కాదు.. మత్స్యరంగంలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. బెస్ట్ మెరైన్ స్టేట్–2021 అవార్డుతో పాటు డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్‌లో స్కోచ్ అవార్డులు వరించాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల సుడిగుండంలో చిక్కుకున్న నావలా మారిన మత్స్యకారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చుక్కానిలా మారి ఒడ్డుకు చేర్చారు. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీరం వెంబడి 555 మత్స్యకార గ్రామాల్లో 8.50 లక్షల మంది మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా 2018–19లో 39.92 లక్షల టన్నులున్న మత్స్య ఉత్పత్తులు 2021–22 సీజన్లో ఏకంగా 48.13 లక్షల టన్నులకు చేరాయి. ఈ ఉత్పత్తులు మూడేళ్లలో ఎనిమిది లక్షల టన్నుల మేర పెరిగాయి. రాష్ట్రంలో ఆక్వారంగంపై ఆధారపడి 2018–19లో 16.46 లక్షల మంది జీవనోపాధి పొందారు. వారి సంఖ్య 2021–22 నాటికి 26.50 లక్షలకు పెరిగింది. మత్స్యకారులు, ఆక్వారైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) 738 మంది మత్స్యసహాయకులను నియమించింది. మత్స్యరంగ సుస్థిరాభివృద్ధి కోసం ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ యాక్టుతో పాటు ఏపీ ఫిష్, సీడ్ యాక్టులను తీసుకొచ్చింది. ఈ–ఫిష్ ద్వారా 4.49 లక్షల ఎకరాల ఆక్వాసాగును క్రమబద్ధీకరిస్తోంది. 6,854 మంది మత్స్యకారులకు కేసీసీ కార్డుల జారీ ద్వారా రూ.11.41 కోట్ల రుణసాయం అందించింది. ఆర్బీకేల ద్వారా 13,945 మత్స్యసాగు బడుల నిర్వహణతో నాణ్యమైన దిగుబడులను పెంపొందించేందుకు ఆక్వారైతులకు శిక్షణ ఇచ్చింది. సంక్షేమ పథకాలతో బాసట టీడీపీ హయాంలో కుటుంబానికి రూ.2 వేల చొప్పున రెండేళ్లు, ఆ తర్వాత రూ.4 వేల చొప్పున మూడేళ్లు మత్స్య వేట నిషేధ భృతి ఇచ్చారు. ఇలా టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.104.62 కోట్ల భృతి అందజేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ భృతిని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచింది. ఈ మూడేళ్లలో రూ.418.08 కోట్లను మత్స్యకారులకు అందించింది. టీడీపీ హయాంలో నిషేధకాలం ముగిసిన తరువాత ఏడాదికిగానీ సొమ్ము అందేదికాదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేట నిషేధకాలం ముగియకుండానే వారి ఖాతాల్లో జమచేస్తోంది. బోట్లకు డీజిల్ లీటర్‌కు రూ.6.03 వంతున సబ్సిడీగా టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 460 బోట్లకు రూ.60.12 కోట్ల లబ్ధిచేకూర్చింది. ఈ సబ్సిడీని లీటర్‌కు రూ.6.03 నుంచి రూ.9కి పెంచిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత మూడేళ్లలో 17,770 బోట్లకు రూ.89.17 కోట్ల లబ్ధికలిగించింది. గతంలో మాదిరి కాకుండా స్మార్ట్ కార్డుల ద్వారా సబ్సిడీ పోను మిగిలిన మొత్తం చెల్లించే విధంగా ఏర్పాటు చేసింది. చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోయే మత్స్యకారులకు ఇచ్చే నష్టపరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో 116 బాధిత కుటుంబాలకు రూ.11.60 కోట్ల సాయం అందించింది. ఆక్వా చెరువులకు అందించే విద్యుత్ ధరను యూనిట్‌కు రూ.3.86 నుంచి రూ.1.50కు తగ్గించడమేగాక 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. గడిచిన మూడేళ్లలో రూ.2,290.11 కోట్ల మేర ఆక్వారైతులు విద్యుత్ సబ్సిడీ ద్వారా లబ్ధిపొందారు. ఇక జీఎస్పీసీ పైపులైన్ నిర్మాణం వల్ల జీవనోపాధి కోల్పోయిన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన 38,282 కుటుంబాలకు రూ.178.04 కోట్ల సాయం అందించింది. మౌలిక సదుపాయాలకు పెద్దపీట రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తోంది. ఇన్పుట్స్ టెస్టింగ్, వ్యాధి నిర్ధారణ సౌకర్యాలు మెరుగుపర్చేందుకు తీరప్రాంతాల్లో రూ.50.30 కోట్లతో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. వీటికి ఐఎస్వో గుర్తింపు తీసుకొచ్చింది. ► పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వద్ద రూ.332 కోట్లతో ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తోంది. ఇటీవలే రూ.100 కోట్లతో తొలిదశ పనులకు టెండర్లు కూడా పిలిచింది. ► రూ.3177కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తోంది. రూ.155 కోట్లతో విశాఖపట్నం, కాకినాడ ఫిషింగ్ హార్బర్లను ఆధునికీకరిస్తోంది. వీటిద్వారా 76,230 మందికి ప్రత్యక్షంగా, 35 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. ► 40 ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లను రూ.90.44 కోట్లతో పునరుద్ధరించడమేగాక రూ.86.95 కోట్లతో కొత్తగా 4 ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లు నిర్మిస్తోంది. ► విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మపేట వద్ద రూ.36.55 కోట్లతో ఆక్వాటిక్ క్వారంటైన్ కేంద్రం, గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం పరసావారిపాలెంలో రూ.14.20 కోట్లతో పసుపుపీత హేచరీ, రూ.23.78 కోట్లతో పండుగప్ప హేచరీ ఏర్పాటు చేస్తోంది. ► పశ్చిమగోదావరి జిల్లా బాదంపూడి వద్ద రూ.5.26 కోట్లతో బ్రూడర్ బ్యాంక్, అనంతపురంలో రూ.5 కోట్లతో తలాపియా బ్రీడింగ్ సెంటర్‌తో పాటు రూ.184 కోట్లతో గుంటూరు జిల్లా పరసావారిపాలెం వద్ద 280 ఎకరాల్లో మెగా ఆక్వాపార్క్ ఏర్పాటు చేస్తోంది. ► మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం పెంచేందుకు 70 ఆక్వాహబ్స్తో పాటు 14 వేలకు పైగా రిటైల్ అవుట్ లెట్స్‌కు శ్రీకారం చుట్టింది. తొలిదశలో రూ.325.15 కోట్లతో 25 ఆక్వాహబ్‌లు ఏర్పాటు చేస్తోంది. రూ.546.97 కోట్లతో 10 ప్రాసెసింగ్, 23 ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. -
లాభాల పండుగప్ప
భీమవరం అర్బన్: పశ్చిమ గోదావరి జిల్లాలో తీర ప్రాంత గ్రామాల్లో పండుగప్ప చేప సాగు విస్తరిస్తోంది. రెండేళ్లుగా కరోనాతో సాగు అంతంతమాత్రంగా ఉండగా గతనెల నుంచి చేప ధరలు పెరగడంతో ఆక్వా రైతులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలోని భీమవరం, మొగల్తూరు, నరసాపురం, కాళ్ల మండలాల్లో సముద్రం, ఉప్పుటేరు తీర ప్రాంతాల్లో సుమారు నాలుగు వేల ఎకరాల్లో పండుగప్పను సాగుచేస్తున్నారు. ఈ చేప సప్ప, ఉప్పు నీటిలోనూ పెరుగుతుంది. ఇటీవల పండుగప్పకు డిమాండ్ పెరగడంతో సాగుకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. ధర ఆశాజనకం ప్రస్తుతం పండుగప్ప చేపల ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. కిలో నుంచి రెండు కిలోలలోపు ఉన్న చేప రూ.320, రెండు నుంచి ఐదు కిలోలలోపు ఉంటే రూ.380, ఐదు నుంచి ఏడు కిలోలలోపు ఉంటే రూ.420, ఏడు కిలోలలు దాటితే రూ.480 చొప్పున ధర పలుకుతోంది. జిల్లాలో పండిన చేపలను హౌరా, ముంబై, గోవా, కోల్‌కతా, బిహార్ ప్రాంతాలతో పాటు విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. లోతు ఎక్కువగా ఉన్న ఎకరా చెరువులో 500 నుంచి 700 వరకు పిల్లలు వదులుతున్నామని, వీటికి ఆహారంగా చైనా గొరకలు, చిన్న చేపలను వేస్తుంటామని రైతులు అంటున్నారు. బతుకున్న చేపలను మాత్రమే వేటాడటం పండుగప్ప ప్రత్యేకత. చెరువులో ఏడాది పాటు పెంచితే పది కిలోల వరకు బరువు వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న, సన్నకారు రైతుల మొగ్గు వనామీ పెంపకంలో వైట్ స్పాట్, విబ్రియో, వైరస్ వల్ల నష్టాలను చవిచూస్తున్న రైతులకు పండుగొప్ప పెంపకం వరంలా మారింది. ఎకరా, రెండెకరాల్లో వనామీ సాగు చేసిన ఆక్వా రైతులు ప్రస్తుతం మూడు నుంచి నాలుగు ఎకరాల్లో పండుగప్పను సాగుచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. పెట్టుబడులు పోను రాబడి బాగుంటుందని అంటున్నారు. ఆహారంగా చైనా గొరకలు పండుచేప బతుకున్న చేపలను మాత్రమే ఆహారం తింటుంది. దీంతో రైతులు స్థానిక చేపల చెరువుల్లో బెత్తులు, చైనా గొరకలు వంటి చిన్నపాటి చేపలను ఆహారంగా వేస్తున్నారు. కొంతకాలంగా మేత కొరత రావడంతో కొల్లేరు, మచిలీపట్నం, కైకలూరు ప్రాంతాల నుంచి లారీలపై డ్రమ్ముల్లో ఆక్సిజన్ సాయంతో చైనా గొరకలు, చిన్న చేపలను తీసుకువచ్చి పండుగప్ప చెరువుల్లో వేస్తున్నారు. లాభసాటిగా ఉంది నాకు రెండు మీటర్ల లోతు కలిగిన ఎకరా ఉంది. దానిలో 600 పండుగప్ప చేప పిల్లలు వదిలాను. ఏడాది పాటు చైనా గొరకలు, చిన్న చేపలను రోజుకు 60 కిలోల వరకు మేతగా వేశాను. రూ.3 లక్షల వరకు పెట్టుబడి అయ్యింది. పట్టుబడి అనంతరం ఖర్చులు పోగా మిగిలిన దాంతో అప్పులు తీర్చాను. –దాసరి నారాయణరావు, రైతు, లోసరి మేత కోసం ఇబ్బందులు తీర ప్రాంతాల్లో పండు చేప సాగు చేస్తున్నారు. ఈ చేపలకు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో డిమాండ్ బాగుంది. వీటికి ఆహారంగా వేసే చైనా గొరకల ధరలు ఇటీవల బాగా పెరిగాయి. ప్రస్తుతం కిలో రూ.25కు కొని వీటికి మేతగా వేస్తున్నాం. మేత కోసం ఇబ్బందులు తప్పడం లేదు. – గంధం రమేష్, రైతు, లోసరి ఏడాదికి 5 వేల టన్నుల వరకు ఎగుమతి పండుగప్ప చేప శాస్త్రీయ నామం లేటస్ కాల్‌కేర్‌ఫర్. ఇది ఉప్పు, సప్ప నీటిలో పెరుగుతుంది. దీనిలో ప్రోటీన్లు, కార్పొహైడ్రేట్లు ఉండటంతో డిమాండ్ బాగుంది. ఏడాదికి జిల్లావ్యాప్తంగా 4 వేల నుంచి 5 వేల టన్నుల పండుగప్ప చేపలు ఎగుమతి అవుతున్నాయి. – ఎల్ఎల్ఎన్ రాజు, మత్స్య అభివృద్ధి అధికారి, భీమవరం -
నిరంతర విద్యుత్‌తో ‘వెలుగు’తున్న ఆక్వా
జాలాది శ్రీమన్నారాయణ, జయలక్ష్మి.. ఆక్వా సాగుకోసం 2018–19లో 1,400 లీటర్ల డీజిల్‌ను వినియోగించారు. 2019–20లో అది 540 లీటర్లకు తగ్గింది. 2020–21లో 180 లీటర్లు సరిపోయింది. పామర్తి బాలకోటేశ్వరరావు ఆక్వా సాగుకోసం 2018–19లో 32 లీటర్ల డీజిల్ వినియోగించారు. 2019–20లో 12 లీటర్లకు తగ్గింది. 2020–21లో కేవలం 10 లీటర్లు మాత్రమే వినియోగించారు. సాక్షి, అమరావతి: చేప ఎండకుండా ఉండాలంటే మోటారుతో నీటిని తోడి చెరువు నింపాలి. చెరువులో రొయ్య బతికుండాలంటే నిరంతరం విద్యుత్ అందుబాటులో ఉండాలి. ఈ రెండిటిలో ఏది జరగకపోయినా ఆక్వా రైతు ఆస్తులు అమ్ముకున్నా తీర్చలేనంత అప్పులపాలవడం ఖాయం. అందుకే ఆక్వా రైతులు ఖర్చెంతైనా పర్లేదనుకుంటూ డీజిల్ మోటార్లు వాడుతుంటారు. పెట్రోల్‌తో సమానంగా డీజిల్ ధరలు పెరుగుతూనే ఉండటంతో పెట్టుబడులకు భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో నేనున్నానంటూ ఆదుకున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. చేపలు, రొయ్యల చెరువుల విద్యుత్ సర్వీసులకు రూ.3.85 ఉన్న క్రాస్ సబ్సిడీని రూ.2.35కు తగ్గించారు. 60,472 సర్వీసులకు సబ్సిడీపై యూనిట్ విద్యుత్ రూ.1.50కే అందేలా చేశారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.720 కోట్ల భారం పడుతోంది. అయినా ప్రభుత్వం ఆక్వా రైతుల సంక్షేమం కోసం ఈ భారాన్ని భరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విద్యుత్ పంపిణీ సంస్థలు ఆక్వాసాగుకు నిరంతర విద్యుత్‌ను సమకూరుస్తున్నాయి. ఫలితంగా డీజిల్ వాడకం కొన్ని ప్రాంతాల్లో సగానికిపైగా, మరికొన్ని ప్రాంతాల్లో దాదాపు పూర్తిగా తగ్గిపోయింది. ఆర్థికభారం తగ్గింది నేను ఆలపాడులో రొయ్యలు సాగుచేశాను. గతంలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉండటంతో ఎకరానికి రోజుకు 40 లీటర్ల డీజిల్ అవసరం ఉండేది. దానికి నెలకు రూ.86,800 ఖర్చుపెట్టాల్సి వచ్చేది. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్వా రైతులకు యూనిట్ కరెంటును రూ.1.50కి అందించారు. దీంతో ఇప్పుడు ఎకరానికి నెలకు కేవలం విద్యుత్ బిల్లు రూ.5,800 వస్తోంది. సబ్సిడీ లేకపోతే ఇదే బిల్లు నెలకు రూ.25 వేలకుపైనే వచ్చేది. విద్యుత్‌ను సబ్సిడీతో నిరంతరం ఇవ్వడం వల్ల నాలాంటి ఆక్వా రైతులందరూ సంతోషంగా ఉన్నారు. – ముంగర నరసింహారావు, ఆక్వా రైతు, వడ్లకూటితిప్ప, కైకలూరు మండలం ఆక్వా రైతులకు వరం దేశంలోనే ఆక్వా ఉత్పత్తుల్లో మన రాష్ట్రం అగ్రగామిగా ఉంది. నేను పెంచికమర్రు గ్రామంలో రొయ్యలు సాగుచేశాను. ఒక పంట సాగుకు నాలుగు నెలలు సమయం పట్టేది. 2019 ప్రారంభంలో నాలుగు నెలలకు ఒక ఎకరం రొయ్యల సాగుకు డీజిల్ కోసం రూ.3,47,200 ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఒక్కో ఎకరానికి రోజుకు కనీసం 40 లీటర్ల డీజిల్ వినియోగించాలి. ఇప్పుడు విద్యుత్ ధర రూ.1.50 చేయడం వల్ల నాలుగు నెలలకు కరెంటు బిల్లు రూ.24 వేలు మాత్రమే వస్తోంది. లక్షల్లో ఖర్చు మిగులుతోంది. – జయమంగళ కాసులు, రొయ్యల రైతు, పెంచికలమర్రు, కైకలూరు మండలం -
మత్స్యానికి మహర్దశ
నరసాపురం: మత్స్య పరిశ్రమ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఏర్పాటు చేస్తున్న రాష్ట్రంలో తొలి ఫిషరీస్ యూనివర్సిటీకి నిధులు మంజూరు చేసింది. ఆక్వా పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కీలకమైన ఈ విశ్వవిద్యాలయానికి తొలి విడతగా రూ.100 కోట్లు మంజూరు చేసింది. నరసాపురం మండలం తీరగ్రామం వేములదీవి ప్రాంతంలో 400 ఎకరాల్లో వర్సిటీ నిర్మాణం చేపడతారు. పరిపాలన భవనాన్ని 40 ఎకరాల్లో సమీపంలోని సరిపల్లి గ్రామంలో నిర్మిస్తారు. వీటికి స్థల సేకరణ కూడా పూర్తయింది. విశ్వవిద్యాలయం నిర్మాణం, కోర్సుల నిర్వహణ, ప్రయోగాలు తదితర అంశాలకు ఐదేళ్లలో రూ.400 కోట్ల వరకూ ఖర్చుచేస్తారని అధికారులు తెలిపారు. ఈ విశ్వవిద్యాలయం ద్వారా ఆక్వా రంగానికి నిపుణుల కొరత తీరుతుంది. పెద్ద ఎత్తున పరిశోధనలకు, ఆక్వా రంగం అభివృద్ధికి వర్సిటీ దోహదం చేస్తుందని అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 90 వేల మంది ఆక్వా రైతులు, పరోక్షంగా 8 లక్షల మంది ప్రజలు లబ్ధిపొందుతారని అంచనా. మత్స్య శాఖకు సంబంధించిన అన్ని కోర్సుల బోధన ఈ వర్సిటీ ద్వారానే సాగుతుంది. ఆక్వా రంగానికి జగన్ సర్కారు దన్ను మత్స్య సంపద, ఆక్వా ఎగుమతుల్లో రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి నుంచి దేశ, విదేశాలకు భారీగా ఆక్వా ఎగుమతులు జరుగుతాయి. ఆదాయం భారీగా సమకూరుతుంది. అయితే ఈ రంగం అభివృద్ధిపై గత ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు. దీంతో పూర్తిస్థాయిలో ఆదాయం రావడంలేదు. నిపుణులు, హార్బర్, ఇతర మౌలిక వసతులు ఉంటే ఎగుమతులు మరో 40 శాతం పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. నిపుణులు లేక ప్రయోగాలు, కొత్త ఆవిష్కరణలు లేవు. వైరస్లు సోకకుండా, లాభదాయకంగా ఆక్వా సాగు చేయడం లాంటి ప్రయోజనాలు రైతులు కోల్పోతున్నారు. ఆక్వా నిపుణుల కొరత కారణంగా రాష్ట్రం ఏటా రూ.25 వేల కోట్ల అదనపు ఆదాయం కోల్పోతోందని అంచనా. గత ప్రభుత్వాల తప్పిదాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు తొలి నాళ్లలోనే గుర్తించింది. భారీగా ఆదాయం వచ్చే ఆక్వా, మత్స్య ఎగుమతుల అభివృద్ధిపై దృష్టిపెట్టింది. రాష్ట్రంలో మత్స్యకారుల జీవన ప్రమాణాలు, మత్స్య ఉత్పత్తులను పెంచే చర్యలు చేపట్టింది. మత్స్యకారుల వలసలను నివారించడానికి రూ.3,200 కోట్లతో రాష్ట్రంలో మేజర్ ఫిషింగ్ హార్బర్లు, మినీ ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా నరసాపురం మండలం బియ్యపుతిప్పలో 600 ఎకరాల్లో రూ.350 కోట్లతో హార్బర్ నిర్మించనున్నారు. ఆక్వా చెరువులకు నిబంధనలు సరళతరం చేయడం, సబ్సిడీపై విద్యుత్ అందించడం లాంటి చర్యలు జగన్ ప్రభుత్వం చేపట్టింది. ఇప్పుడు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చకచకా చర్యలు చేపడుతోంది. ఆక్వా, మత్స్య ఉత్పత్తులకు మహర్దశ జిల్లాలో ఫిషరీస్ యూనివర్సిటీకి తొలివిడతగా రూ.100 కోట్లు మంజూరు చేయడం హర్షణీయం. ఇది ఆక్వా, మత్స్య రంగాల్లో నూతన విప్లవం. ఆక్వా రంగ నిపుణులను తయారు చేసుకుని, సాగులో నైపుణ్యాలను పెంచుకుంటే నష్టాలు తగ్గుతాయి. ప్రభుత్వం జిల్లాలో ఆక్వా, మత్స్య రంగాల అభివృద్ధికి పరితపిస్తోంది. అందుకే బియ్యపుతిప్పలో హార్బర్ కట్టబోతున్నారు. –ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే -
మూడు ప్రతిష్టాత్మక ఆక్వా ప్రాజెక్టులకు శ్రీకారం
సాక్షి, అమరావతి: ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్ అందుబాటులోకి వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం 3 ప్రతిష్టాత్మక ఆక్వా ప్రాజెక్టుల ఏర్పాటుకు శ్రీకారం చుడుతోంది. రొయ్య పిల్లల ఉత్పత్తి కోసం ఉపయోగించే బ్రూడర్స్ (తల్లి రొయ్యలు) నాణ్యతను కాపాడేందుకు, వాటినుంచి ఎలాంటి రోగాలు లేని సీడ్‌ను ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడే ఆక్వాటిక్ క్వారంటైన్ కేంద్రాన్ని రూ.36.55 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పనుంది. ఇలాంటి కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం దేశంలో ఇదే ప్రథమం. మరోవైపు పండుగప్ప పిల్లల ఉత్పత్తికి రూ.23.78 కోట్లతో హేచరీ, పసుపు పీత పిల్లల ఉత్పత్తి కోసం రూ.14.20 కోట్లతో మరో హేచరీ రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్నాయి. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పిలిచిన అధికారులు 2023 మార్చి నాటికి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేవిధంగా చర్యలు చేపట్టారు. ఈ ప్రాజెక్టుల నిర్వహణకు సిబ్బంది నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బంగారమ్మపేట వద్ద ఆక్వాటిక్ క్వారంటైన్ విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మపేట వద్ద ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్ (ఏక్యూఎఫ్‌సీ) ఏర్పాటు కాబోతుంది. ఆర్గనైజేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఎపిడ్యూజిస్ (ఓఐఈ) గుర్తించిన 8 రకాల వ్యాధులు సంక్రమించని బ్రూడర్స్ నుంచి మాత్రమే సీడ్ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. వాటికి వ్యాధులు లేవని నిర్ధారించే పరీక్షలు నిర్వహించే కేంద్రమే ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్. ప్రస్తుతం దేశంలో చెన్నైలో మాత్రమే ఈ కేంద్రం ఉంది. దేశవ్యాప్తంగా రొయ్య పిల్లల్ని ఉత్పత్తి చేసే 560 హేచరీలుండగా.. వాటిలో 389 హేచరీలు ఏపీలోనే ఉన్నాయి. సీడ్ ఉత్పత్తి కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బ్రూడర్స్‌ను క్వారంటైన్ చేసేందుకు హేచరీలన్నీ చెన్నై కేంద్రం వద్ద నెలల తరబడి పడిగాపులు పడాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బంగారమ్మ పేట వద్ద 30 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఏడాదికి 1.25 లక్షల బ్రూడర్స్‌ను పరీక్షించే సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ కేంద్రంలో 625 బ్రూడర్స్‌ను క్వారంటైన్ చేయ్యొచ్చు. పరసావారిపాలెం వద్ద రెండు హేచరీలు ఏపీలో ప్రస్తుతం 12వేల హెక్టార్లలో సాగవుతున్న పండుగప్ప (సీబాస్), పసుపు పీత (మడ్ క్రాబ్) సాగు విస్తీర్ణాన్ని రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి సీడ్ కోసం మన రైతులు తమిళనాడుపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ పరిíస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం పరసావారిపాలెంలో రూ.14.20 కోట్లతో పసుపు పీతల హేచరీ, రూ.23.78 కోట్లతో పండుగప్ప హేచరీ ఏర్పాటు చేస్తోంది. ఆక్వారంగ విస్తరణకు ఊతం బ్రూడర్స్ సకాలంలో క్వారంటైన్ కాకపోవడంతో సీజన్లో డిమాండ్‌కు తగిన స్థాయిలో రొయ్యల సీడ్‌ను హేచరీలు ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏర్పాటు చేయబోతున్న ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్ ఆక్వారంగ విస్తరణకు దోహదపడుతుంది. – ఐపీఆర్ మోహన్‌రాజు, అధ్యక్షుడు, జాతీయ రొయ్య రైతుల సమాఖ్య ప్రతిష్టాత్మక ప్రాజెక్టులివి ఆక్వా ఉత్పత్తుల్లో దేశంలోనే నంబర్ వన్‌గా ఏపీలో ఆక్వా రంగ సుస్థిరతకు ఈ ప్రాజెక్టులు ఎంతగానో దోహదపడతాయి. అక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్ చాలా కీలకమైనది. దేశంలో మరెక్కడా ఈ సెంటర్ లేదు. పసుపు పీత, పండుగప్ప హేచరీల ఏర్పాటుతో రాష్ట్రంలో ఆక్వారంగం మరింత విస్తరిస్తుంది. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ -
టైగర్ రొయ్యపై పెరుగుతున్న ఆసక్తి
అంతర్జాతీయ ఆక్వా మార్కెట్లో రారాజుగా నిలిచి దాదాపు దశాబ్దానికి పైగా డాలర్ల వర్షం కురిపించిన టైగర్ రొయ్య తిరిగొస్తోంది. గతంలో వివిధ రకాల వైరస్లు చుట్టుముట్టడంతో ఆక్వా సాగులో అవి అంతర్ధానమయ్యాయి. తాజాగా టైగర్ రొయ్యల సాగు ప్రభ మళ్లీ ప్రారంభం కానుంది. టైగర్ సరికొత్త బ్రూడర్‌తో పునరాగమనంతో రైతుల్లో ఆశలు మోసులు ఎత్తుతున్నాయి. వెనామీకి ప్రత్యామ్నాయంగా ప్రకాశం జిల్లాలోని ఆక్వా రైతులు టైగర్ సాగు వైపు అడుగులు వేస్తున్నారు. నకిలీలపై దృష్టిసారించిన అధికార యంత్రాంగం హేచరీల్లో విస్తృత తనిఖీలు చేపట్టేందుకు ఎక్కడికక్కడ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టైగర్ అంటే ఆక్వా రంగంలో రారాజు... నీలి విప్లవానికి నాంది. అంతర్జాతీయ మార్కెట్లో టైగర్ రొయ్యకు మంచి గిరాకీ ఉంది. కేవలం ఎగుమతి కోసమే ఉత్పత్తి చేసే టైగర్ రొయ్య పేరు రెండు దశాబ్దాల పాటు వినపడకుండా పోయింది. 1990 తరువాత వివిధ రకాల వైరస్లు సోకటంతో కనుమరుగైంది. ఆ తరువాత వెనామీదే రాజ్యం. తాజాగా వెనామీ కూడా వైరస్‌లా బారిపడి రైతులకు నష్టాలు తెచ్చిపెడుతోంది. ప్రస్తుతం ఎన్నో అధునాతన ప్రయోగాలు, పరిశోధనలతో వైరస్‌కు ఎలాంటి తావులేకుండా ఉండే సరికొత్త టైగర్ బ్రూడర్స్‌ను దేశానికి దిగుమతి చేసుకుంటున్నారు. ఆ బ్రూడర్స్ ద్వారా సీడ్‌ను ఉత్పత్తి చేసి ఆక్వా సాగు చేసే రైతులకు అందజేస్తున్నారు. దీంతో తిరిగి వెనామీకి ప్రత్యామ్నాయంగా టైగర్ రొయ్య పూర్వ వైభవాన్ని సంతరించుకోనుంది. నకిలీకి తావులేకుండా నిఘా.. టైగర్ రొయ్యల సాగు తిరిగి ప్రారంభం కానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నకిలీ టైగర్ రొయ్యల సీడ్ బారిన పడకుండా ఆక్వా రైతులను కాపాడటానికి తనిఖీలను ఇప్పటికే ముమ్మరం చేసింది. టైగర్ సీడ్ ముసుగులో వెనామీ రొయ్య పిల్లలను రైతులకు అంటగట్టకుండా హేచరీలపై ప్రత్యేక నిఘా పెట్టింది. ప్రత్యేకంగా అధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేసింది. జిల్లాలోని 41 హేచరీలపై కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ (సీఏఏ), జిల్లా మత్స్య శాఖ అధికారులు సంయుక్తంగా ఇటీవల దాడులు నిర్వహించారు. ఈతముక్కల గ్రామంలో ఒక హేచరీ నుంచి నకిలీ టైగర్ సీడ్ బయటకు వచ్చిందని సమాచారం రావటంతో అధికారులు తనిఖీలు చేసి దానిని మూసివేశారు. టైగర్ సీడ్ పేరుతో మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో రెండు హేచరీలకు అనుమతి.. టైగర్ రొయ్యల సీడ్ ఉత్పత్తికి దక్షిణ భారతదేశంలో రెండు హేచరీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. సరికొత్త బ్రూడర్‌తో సీడ్‌ను ఉత్పత్తి చేయటానికి తమిళనాడు చెంగల్పట్టులోని హేచరీ, నెల్లూరు జిల్లాలోని వైష్ణవి హేచరీలకు మాత్రమే అనుమతులిచ్చాయి. ఈ రెండు హేచరీలు సరికొత్త బ్రూడర్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని సీడును ఉత్పత్తి చేస్తున్నాయి. అమెరికా నుంచి సరికొత్త బ్రూడర్స్‌ను దిగుమతి చేసుకొని కొన్ని రోజుల పాటు క్వారంటైన్లో ఉంచి అనేక పరీక్షల తరువాత అనుకూలంగా ఉంటేనే వాటి నుంచి సీడ్ ఉత్పత్తి చేస్తున్నారు. జిల్లాలో సాగు చేయాలనుకునే వారు నేరుగా ఈ రెండు హేచరీల నుంచి మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంది. అక్కడ నుంచి తీసుకొచ్చిన సీడ్ నేరుగా సాగు చేస్తున్న చెరువుల్లోనే వెయ్యాలి. వాటిని తీసుకొచ్చి స్థానికంగా ఉండే హేచరీలలో వెనామీ సీడ్‌తో కలిపి మొత్తం టైగర్ సీడేనని రైతులను మోసం చేయాలని చూసే వారిపై క్రిమినల్ చర్యలకు కూడా ప్రభుత్వం వెనకాడకుండా ఉండేలా అధికారులకు ఆదేశాలు వచ్చాయి. స్టేక్ హోల్డర్స్‌కు అవగాహన.. ఆక్వాకల్చర్ భాగస్వాముల సమావేశాలు (స్టేక్ హోల్డర్స్) ఏర్పాటు చేసి మత్స్య శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఆక్వా రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఎస్ఏడీఏ) యాక్ట్‌ను తీసుకొచ్చింది. ఆక్వాకల్చర్ భాగస్వాములు అంటే రైతులతో పాటు, ఫీడు, సీడు ఉత్పత్తిదారులు, హేచరీల యజమానులు, ట్రేడర్స్,ఎక్స్‌పోర్టర్లు, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు దీనికిందకు వస్తారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే జిల్లా కేంద్రం ఒంగోలులో ఈ నెల 23న స్టేక్ హోల్డర్స్ సమావేశం నిర్వహించి నకిలీ టైగర్ రొయ్య సీడ్‌తో పాటు ఆక్వాకు సంబంధించిన అన్ని అంశాలపై లోతుగా అధికారులు అవగాహన కల్పించారు. నకిలీ సీడ్స్ సృష్టిస్తే కఠిన చర్యలు జిల్లాలో ఉన్న 41 హేచరీలపై ప్రత్యేక నిఘా ఉంటుంది. కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ (సీఏఏ) అధికారులు జిల్లా మత్స్య శాఖ అధికారులతో సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. ఎప్పటికప్పుడు సీఏఏ అధికారులకు సమాచారం అందిస్తున్నాం. అనుమతి ఉన్న రెండు హేచరీల నుంచి తీసుకొచ్చిన టైగర్ సీడ్ నేరుగా సాగు చేస్తున్న చెరువుల్లోకే వెళ్లాలి. హేచరీలకు వెళ్లకూడదు. అలా ఎవరైనా టైగర్ రొయ్య సీడ్‌ను తీసుకొచ్చి హేచరీల్లోని వెనామీ సీడ్‌తో కలిపి నకిలీగా సృష్టిస్తే క్రిమినల్ చర్యలకు కూడా వెనుకాడం. టైగర్ సీడ్ నకిలీ అన్న మాట ఏ ఒక్క ఆక్వా రైతు నోటి నుంచి రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. – ఆవుల చంద్ర శేఖర రెడ్డి, జాయింట్ డైరెక్టర్, జిల్లా మత్స్యశాఖ -
ముక్కుడు పారతో మంచి ఆదాయం
సాక్షి, అమరావతి: ఆక్వా రైతులకు ముక్కుడు పార(ఇండియన్ పాంపనో) చేపలు సిరులు కురిపిస్తున్నాయి. స్థానిక మార్కెట్లలోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లోనూ దీనికి మంచి డిమాండ్ వచ్చింది. వైరస్లు, తెగుళ్లు దరిచేరని ఈ సముద్రపు చేపల సాగు ద్వారా రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. వీటిలో అంతర పంటగా రొయ్యలు సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని కూడా ఆర్జిస్తున్నారు. ఇండియన్ పాంపనో.. శాస్త్రీయ నామం ట్రాచినోటుస్మూకలీ.. వాడుక భాషలో ‘ముక్కుడు పార’గా పిలుస్తారు. ఈ చేపలో ప్రొటీన్స్, వైట్‌మీట్ అధికంగా ఉంటుంది. విశాఖలోని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీఎంఎఫ్ఆర్ఐ)లో 2016లో అభివృద్ధి చేసిన ‘ఇండియన్ పాంపనో’.. సంప్రదాయ చేపలు, రొయ్యలకు ప్రత్యామ్నాయంగా మారుతోంది. ప్రస్తుతం పలుచోట్ల తీరప్రాంత లోతు జలాల్లో వీటిని సాగు చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా కృష్ణా, తూ.గోదావరిలో.. సీఎంఎఫ్ఆర్ఐ ద్వారా కృష్ణా జిల్లా నాగాయలంక మండలం భవదేవరపల్లి, తూర్పు గోదావరి జిల్లా కొమరిగిరిపట్నంలో ప్రయోగాత్మకంగా 6 ఎకరాల్లో సాగు మొదలుపెట్టగా.. ప్రస్తుతం అక్కడి పరిసర గ్రామాల్లో మరో 50 ఎకరాల్లో రైతులు ఈ చేపలను పెంచుతూ లాభాలు గడిస్తున్నారు. 2 నుంచి 10 గ్రాముల సైజులో ఉన్న చేప పిల్లలను ఎకరాకు 4 వేల నుంచి 4,500 వరకు వేసుకోవచ్చు. ఇవి 7 నెలలకు 900 గ్రాముల నుంచి కేజీ వరకు పెరుగుతాయి. రోజుకు 4 సార్లు మేత వేస్తే సరిపోతుంది. ఈ చేప.. ఆరోగ్యంగా, వేగంగా పెరుగుతుంది. 600 గ్రాముల నుంచి పట్టుబడి మొదలు పెడతారు. కిలో సైజుండే చేపకు మార్కెట్లో రూ.300 నుంచి రూ.330 వరకు ధర పలుకుతోంది. అంతరపంటగా రొయ్యలు.. ఇండియన్ పాంపనోతో పాటు అంతర పంటగా రొయ్యలు సాగు చేస్తున్నారు. కిలో సైజులో ఉండే పాంపనో ఎకరాకు 4 టన్నులు వస్తుండగా, అంతర పంటగా వేసే రొయ్యలు 18–20 కౌంట్‌లో టన్ను వరకు దిగుబడి వస్తున్నాయి. పెట్టుబడి హెక్టార్‌కు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు అవుతుండగా.. రొయ్యలతో కలిపి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఆదాయం వస్తోంది. పెట్టుబడి పోనూ హెక్టార్‌కు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లాభాలు ఆర్జిస్తున్నారు. కేరళ, బెంగాల్లో వీటిని పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. అవసరమైన సహకారమిస్తాం.. ఇండియన్ పాంపనో సాగును మరింత విస్తరించాల్సిన అవసరముంది. మంచి పోషక విలువలున్న ఈ చేపల సాగు పట్ల ఏపీలో ఇప్పుడిప్పుడే రైతులు ఆసక్తి చూపుతున్నారు. సాంకేతికంగా అవసరమైన సహకారం అందించేందుకు సీఎంఎఫ్ఆర్ఐ సిద్ధంగా ఉంది. – డాక్టర్ సుభదీప్ఘోష్, విశాఖ రీజనల్ హెడ్, సీఎంఎఫ్ఆర్ఐ హేచరీలను ప్రోత్సహించాలి.. రొటేషన్ పద్ధతిలో రొయ్యలకు ప్రత్యామ్నాయంగా ఇండియన్ పాంపనోను పెంచవచ్చు. అపారమైన సముద్ర తీర ప్రాంతం ఉన్న ఏపీలో ఇండియన్ పాంపనో సాగుకు విస్తారమైన అవకాశాలున్నాయి. అవసరమైన సీడ్ ఉత్పత్తి కోసం హేచరీలను ప్రోత్సహించాల్సిన అవసరముంది. – డాక్టర్ శేఖర్ మేఘరాజన్, సీనియర్ శాస్త్రవేత్త, సీఎంఎఫ్ఆర్ఐ రూ.8 లక్షల ఆదాయం వచ్చింది ఎకరాకు 6 వేల పిల్లలు వేశాను. ఐదు టన్నుల వరకు వచ్చింది. వీటిని కేరళకు ఎగుమతి చేశా. కిలోకి రూ.330 వరకు ఆదాయం వచ్చింది. అంతర పంటగా 10 వేల రొయ్య పిల్లలు వేశాను. 20 కౌంట్‌లో టన్ను వచ్చింది. మొత్తమ్మీద పెట్టుబడి పోగా రూ.8 లక్షలు మిగిలింది. – ఉప్పలపాటి కృష్ణప్రసాద్, రైతు, కొమరిగిరిపట్నం -
100కు పైగా ఆక్వా హబ్‌లు
గతంలో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడు దురదృష్టవశాత్తు చనిపోతే పట్టించుకున్న వారు లేరు. కానీ మన ప్రభుత్వం వచ్చాక అలా చనిపోతే వెంటనే గుర్తించాం. 67 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.6.7 కోట్లు ఆర్థిక సహాయం అందజేశాం. దేవుడి దయ వల్ల మత్స్యకారులకు మంచి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ ఫిషరీస్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏడాదిలోనే పనులు మొదలు పెట్టబోతున్నాం. దీని ద్వారా మత్స్యకారులకు సాంకేతిక పరమైన శిక్షణ ఇచ్చి, వారికి మంచి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం. నాణ్యత లేకపోవడం వల్ల ఆక్వా రైతులు నష్టపోకూడదన్న లక్ష్యంతో ఆక్వా సాగు చేస్తున్న 35 నియోజకవర్గాల్లో రూ.50.30 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. ఆర్బీకేలతో అనుసంధానం చేసి ప్రతి రైతుకు నాణ్యతతో కూడిన సీడ్, ఫీడ్, మందులు సరఫరా చేస్తున్నాం. అన్ని విధాలా తోడుగా ఉంటున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఆక్వా రైతులతో పాటు ఏ ఒక్క మత్స్యకారుడు నష్టపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా ఆక్వా హబ్‌ల నిర్మాణం చేపడుతున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఒక్కో హబ్ కింద 120 రిటెయిల్ షాప్‌ల చొప్పున మొత్తం 12 వేల షాప్‌లు వస్తాయని, రెండేళ్లలో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నామని వెల్లడించారు. వీటి ద్వారా ఆక్వా ఉత్పత్తులతో పాటు మత్స్యకారుల చేపలకు గిట్టుబాటు ధర లభిస్తుందని చెప్పారు. చేపల వేటపై నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద వరుసగా మూడో ఏడాది 1,19,875 మత్స్యకార కుటుంబాలకు మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి రూ.10 వేల చొప్పున రూ.119.88 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రాలు, ఆర్బీకేల నుంచి పాల్గొన్న అధికారులు, మత్స్యకారులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. కోవిడ్ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ప్రభుత్వ కష్టాలకన్నా, పేదలు, సామాన్యుల కష్టాలు ఇంకా ఎక్కువని భావించి ఇవాళ మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో దాదాపు రూ.120 కోట్లు జమ చేస్తున్నందుకు ఎంతో సంతోష పడుతున్నానని అన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట నిలబెట్టుకున్నాను ► ఇది మంచి కార్యక్రమం. ఎందుకంటే ఒక వైపు కోవిడ్. మరోవైపు ఏప్రిల్ 15 నుంచి రెండు నెలల పాటు చేపల వేటపై నిషేధం. ఇటువంటి పరిస్థితుల్లో దాదాపు 1.20 లక్షల కుటుంబాలకు రూ.10 వేల సహాయం ఎంతో ఉపయోగపడుతుంది. ► ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే, ప్రతి కుటుంబంలో ఒక అన్నగా, తమ్ముడిగా, అన్ని రకాలుగా తోడుగా ఉంటానని చెప్పి, మత్స్యకార భరోసా పథకం అమలు చేస్తున్నాము. తొలి ఏడాది లక్ష మందితో మొదలు పెట్టగా ఇప్పుడు దాదాపు 1.20 లక్షల మంది లబ్ధిదారులు. ఇప్పటి వరకు దాదాపు రూ.332 కోట్లు నేరుగా మత్స్యకార కుటుంబాలకు చేరవేశామని సగర్వంగా తెలియజేస్తున్నాను. అక్క చెల్లెమ్మలకు ప్రతి అడుగులో తోడు ► మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23 నెలల కాలంలో ప్రతి పథకం, ప్రతి అడుగులో.. అక్క చెల్లెమ్మలకు అండగా ఉండాలని, పేదలకు మంచి జరగాలనే తపన, తాపత్రయంతో అడుగులు వేశాము. ► అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్సార్ రైతు భరోసా, ఆసరా, వైఎస్సార్ చేయూత, పెన్షన్ కానుక, వైఎస్సార్ ఇళ్ల పట్టాల పంపిణీ.. ఇలా ఏ పథకం చూసినా ఎక్కడా వివక్ష, అవినీతికి తావు లేకుండా చూస్తున్నాం. గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి, మీ బిడ్డగా ప్రతి పథకంలో పేదలకు అండగా ఉన్నానని సంతోషంగా చెబుతున్నాను. గతంలో అలా.. ఇప్పుడు ఇలా.. ► చేపల వేట నిషేధ సమయంలో గతంలో రూ.4 వేలు ఇస్తామని చెప్పినా, ఏనాడూ సక్రమంగా అమలు చేయలేదు. ఏనాడూ సకాలంలో ఇవ్వలేదు. ఇచ్చినా అరకొరగానే ఇచ్చారు. డీజిల్‌పై రూ.6 సబ్సిడీ ఇస్తామన్నా సక్రమంగా ఏనాడూ ఇవ్వలేదు. పైగా కేవలం 5 వేల బోట్లకు మాత్రమే ఇచ్చారు. ► ఇవాళ 26,823 బోట్లకు లీటరు డీజిల్‌కు రూ.9 సబ్సిడీ ఇస్తున్నాము. అంటే బోట్ల సంఖ్య పెరిగింది. సబ్సిడీ కూడా పెరిగింది. 100 పెట్రోల్ బంకులను అందు కోసం కేటాయించాము. డీజిల్ కొనుగోలు చేసిన వెంటనే స్మార్ట్ కార్డుల ద్వారా ఆ రాయితీని బంకు యజమానులకు చెల్లించేలా ఏర్పాటు చేశాం. దీనికి మరో రూ.48 కోట్లు ఖర్చు చేశామని మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తున్నాను. ఆక్వా రైతులకు అన్ని విధాలా అండ ► మత్స్యకారులకు తోడుగా ఉండడంతో పాటు, ఆక్వా సాగుపై ఆధార పడిన రైతులకు కూడా అండగా నిల్చాం. ఆక్వా సాగుకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే సరఫరా చేయడం ద్వారా 53,550 మంది ఆక్వా రైతులకు ప్రయోజనం కలుగుతోంది. ► దీని వల్ల ఏటా దాదాపు రూ.780 కోట్ల భారం పడుతున్నా, ఈ రెండేళ్లలో దాదాపు రూ.1,560 కోట్ల భారం పడుతున్నా ఆక్వా రైతుల కోసం ప్రభుత్వం సంతోషంగా భరిస్తోంది. ఆక్వా రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నాం. వేగంగా ఫిషింగ్ హార్బర్లు ► మన మత్స్యకారులు ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వలస పోయి, తెలిసీ తెలియక విదేశీ సముద్ర జలాల్లోకి ప్రవేశించి, జైళ్ల పాలవుతున్నారని గతంలో ఎవరూ ఆలోచించలేదు. ఆ పరిస్థితి రాకూడదని 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ► గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ల ఆధునికీకరణతో పాటు, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద కొత్తగా రెండు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాం. ఇప్పటికే వీటి పనులు మొదలయ్యాయి. ► ఈ నాలుగు ప్రాజెక్టుల వ్యయం రూ.1,509.80 కోట్లు. రెండో దశలో భాగంగా రూ.1,365.35 కోట్ల అంచనాతో శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి త్వరలో టెండర్లు ఖరారు చేసి, ఈ ఏడాదిలోనే పనులు మొదలు పెడతాం. ► రూ.2,775 కోట్లతో నిర్మించే ఎనిమిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో దాదాపు 80 వేల మంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. అందుకే ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాము. ఓఎన్జీసీ ఇవ్వకపోయినా.. ► 2012లో జీఎస్పీసీ, ఓఎన్జీసీ తవ్వకాల వల్ల ముమ్మిడివరం నియోజకవర్గంలో దాదాపు 14,927 మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లేకుండా పోయింది. ఒక్కో కుటుంబానికి రూ.47,250 పరిహారం ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. వారి గురించి ఎవరూ పట్టించుకోలేదు. ► ఆ కుటుంబాలను ఆదుకుంటానని నా పాదయాత్రలో వారికి హామీ ఇచ్చాను. ఆ తర్వాత అధికారంలోకి రాగానే ముమ్మిడివరంలోనే సమావేశం పెట్టి, రూ.75 కోట్లు ప్రభుత్వమే భరించి ఇచ్చింది. ఆ విధంగా 14,927 కుటుంబాలను ఆదుకుంది. ఓఎన్జీసీ నుంచి ఇంకా ఆ డబ్బులు పూర్తిగా రాలేదు. ► పేదలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ప్రతి అడుగు ముందుకు వేశామని సగర్వంగా చెబుతున్నా. దేవుడి దయతో మీ అందరికీ ఇంకా మంచి చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ► ఈ కార్యక్రమంలో పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు, ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయం) అంబటి కృష్ణారెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. మత్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు కోవిడ్ సంక్షోభంలో కూడా ఏ ఒక్క కార్యక్రమాన్ని, పథకాన్ని ఆపకుండా దేశంలోనే మీరు (సీఎం) ఆదర్శంగా నిలుస్తున్నారు. విదేశాల్లో చిక్కుకున్న మత్స్యకారులను సురక్షితంగా తీసుకు వచ్చారు. కోవిడ్ సమయంలో వివిధ తీర ప్రాంతాలు, పోర్టుల్లో చిక్కుకుపోయిన మత్య్సకారులను స్వస్థలాలకు తరలించారు. తీర ప్రాంతం ఉన్న ప్రతి జిల్లాకు హార్బర్ కట్టించాలన్న మీ ఆలోచనకు ప్రతి మత్స్యకారుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. – సీదిరి అప్పలరాజు, పశు సంవర్థక శాఖ మంత్రి -
మీనం.. దీనం: తగ్గిన చేపల ధరలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: చేపల ధరలు పడిపోవడంతో రాష్ట్రంలోని ఆక్వా రైతులు నష్టాలను చవిచూసే పరిస్థితులు తలెత్తాయి. శీలావతి, కట్ల, బొచ్చె చేపలను 15 రోజులక్రితం వరకు కిలో రూ.110 వరకు ఎగుమతిదారులు కొనుగోలు చేయగా.. ప్రస్తుతం ఆ ధర రూ.90కి పడిపోయింది. ధరలు పడిపోవడం, ఎగుమతులు మందగించడంతో చేపల్ని చెరువుల్లోనే ఉంచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల మేత, నిర్వహణ ఖర్చులు పెరిగిపోతున్నాయి. కిలోకు రూ.20 చొప్పున ధర తగ్గడంతో రైతులు టన్నుకు రూ.20 వేల ఆదాయాన్ని నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మేత, నిర్వహణ ఖర్చుల రూపంలో మరో రూ.10 వేల వరకు నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఉత్పత్తి పెరిగింది.. డిమాండ్ తగ్గింది రాష్ట్రవ్యాప్తంగా 2.25 లక్షల హెక్టార్లలో రైతులు చేపల సాగు చేస్తున్నారు. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 1.20 లక్షల హెక్టార్లలో రైతులు చేపలు సాగు చేస్తుండగా.. తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలు ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో ఏటా సుమారు 22.50 లక్షల టన్నులకు పైగా చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. మన రాష్ట్రం నుంచి 15 రోజుల క్రితం వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, అసోం, నాగాలాండ్, బిహార్, కర్ణాటక రాష్ట్రాలకు రోజుకు సగటున 6,500 టన్నుల చేపలు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం 3,900 టన్నులు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి. 15 రోజుల క్రితం వరకు శీలావతి, కట్ల, బొచ్చె వంటి రకాల చేపలను కిలో రూ.110 వరకు ఎగుమతిదారులు కొనుగోలు చేయగా.. ప్రస్తుతం కిలో రూ.90కి పడిపోయింది. పెట్టుబడులు, లీజు, మేత, కూలీల ఖర్చులు పెరిగిపోయిన తరుణంలో చేపల ధర తగ్గడం రైతులను నష్టాలకు గురి చేస్తోంది. మరోవైపు బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లోనూ చేపల సాగు మొదలవడంతో ఉత్పత్తి పెరిగింది. దీంతో ఆయా రాష్ట్రాలకు ఎగుమతులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని, దీనివల్ల ధరలు తగ్గుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో విద్యుత్ కొరత, యూనిట్ ధరలు ఎక్కువ ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆక్వా రైతులకు తక్కువ ధరకే విద్యుత్ అందించడంతోపాటు వివిధ ప్రాంతాల్లో ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. గత ఏడాది కరోనా వైరస్ విజృంభించిన సమయంలో ఇతర రాష్ట్రాల్లో చేపల దిగుమతులు నిలిచిపోకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకోవడంతో ఆక్వా రైతులు ఎంతో ఉత్సాహంతో సాగును చేస్తున్నారు. స్థానిక మార్కెట్లూ మందగమనమే కోవిడ్ కారణంగా పట్టణ పేదల ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయి. సెకండ్ వేవ్ ఉధృతమవుతుండటంతో ఆ ప్రభావం స్థానిక చేపల మార్కెట్లలో కొనుగోలుపై పడుతోందని రైతులు చెబుతున్నారు. మరోవైపు గోదావరిలో నీరు తక్కువగా ఉండటం, చేపల చెరువులకు నీరిచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. చేపల చెరువులకు మరికొంత కాలం నీరివ్వగలిగితే కొంతకాలం పట్టుబడులు పట్టకుండా ఆపవచ్చని, ఈలోగా ధర పెరిగితే నష్టాల నుంచి గట్టెక్కుతామని రైతులు అభిప్రాయపడుతున్నారు. కొనుగోలు శక్తి తగ్గడం వల్లే.. కోవిడ్ తదనంతర పరిణామాల వల్ల వివిధ రాష్ట్రాలలోని పట్టణ ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గింది. దీంతో చేపల ఎగుమతులపై దీని ప్రభావం పడుతోంది. కిలో ధర వంద రూపాయలకు తగ్గితే రైతులు నష్టపోతారు. ఇతర రాష్ట్రాలలో చేపల పెంపకం పెరగడం కూడా ధరపై ప్రభావం చూపుతోంది. – ఎంవీఎస్ నాగిరెడ్డి, వైస్ చైర్మన్, రాష్ట్ర వ్యవసాయ మిషన్ కిలోకు రూ.20 తగ్గింది నెల రోజుల్లో చేపల ధర కిలోకు రూ.20 వరకూ తగ్గింది. ఇతర రాష్ట్రాల్లో చేపల ఉత్పత్తి పెరగడం, అక్కడ చేపల పట్టుబడులు ముమ్మరంగా చేపట్టడమే ఇందుకు కారణం. రైతులంతా ఒకేసారి చెరువుల్లో చేప పిల్లలు వేయకుండా జాగ్రత్త వహిస్తే.. చెరువులన్నీ ఒకేసారి పట్టుబడులకు రాకుండా ఉంటాయి. తద్వారా చేపల ధరల తగ్గుదలను నివారించవచ్చు. – గాదిరాజు సుబ్బరాజు, అధ్యక్షుడు, చేపల రైతుల సంఘం కరోనా ప్రభావంతో.. కరోనా ప్రభావం ఇంకా ప్రజల్లో పూర్తిగా తొలగిపోలేదు. దేశవ్యాప్తంగా చేపల కొనుగోలు చేసేవారి సంఖ్య తగ్గడంతో ధరలు తగ్గుతున్నాయి. దీనికితోడు ఇతర రాష్ట్రాల్లో చేపల పెంపకం పెరగడంతో అక్కడి వినియోగదారులు లైవ్ ఫిష్ తినడానికి అలవాటుపడ్డారు. దీనివల్ల ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యే చేపలకు గిరాకీ తగ్గింది. – శాయన సుపర్ణ, చేపల రైతు, ఆకివీడు, పశ్చిమ గోదావరి చదవండి: రూ.92 కోట్లతో పార్కులు.. పచ్చదనం చంద్రబాబు నుంచి ప్రాణ హాని.. -
మేత కంపెనీల అదనపు భారం
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా ఎగుమతులు తగ్గి నష్టపోతున్న ఆక్వా రైతులపై మేత కంపెనీలు అదనపు భారాన్ని మోపుతున్నాయి. మార్కెట్లో 80 శాతం అమ్మకాలు కలిగిన మూడు ప్రధాన కంపెనీలు నెల కిందటే కిలోకు రూ.6 వరకు ధర పెంచాయి. అప్పటి వరకూ కిలో రూ.81 వరకూ ఉన్న ధర రూ.87కు చేరింది. దీంతో రాష్ట్రంలోని ఆక్వా రైతులపై దాదాపు రూ.600 కోట్ల భారం పడుతోందని ఆ రంగానికి చెందిన నిపుణులంటున్నారు. రాష్ట్రంలో వనామితోపాటు తీర ప్రాంతాల్లోని రైతులు సంప్రదాయ విధానంలో దాదాపు రెండు లక్షల ఎకరాల్లో రొయ్యలను సాగు చేస్తున్నారు. వనామి సాగు చేస్తున్న రైతులు మేత అధికంగా వాడాల్సి ఉండటంతో వారిపై అదనపు భారం పడుతోంది. ► ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ధర పెంచని ఆక్వా కంపెనీలు ఇతర దేశాలకు ఎగుమతులు ప్రారంభమయ్యాక రేట్లను పెంచాయి. ► ఈ నేపథ్యంలో తమ ఇబ్బందులపై ప్రాన్ ఫార్మర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖలు రాశారు. ► పెంచిన రేట్లపై పునరాలోచన చేయాలని ఆయా కంపెనీల ప్రతినిధులను ఆ నాడు సీఎం కార్యాలయం కోరింది. ► దీంతో ప్రధాన కంపెనీలన్నీ డీలర్ రేటుపై కిలోకు రూపాయి వరకూ ధర తగ్గించాయి. ► అయితే తగ్గించిన రేట్లు అమలవుతున్నా రైతులపై ఆర్థిక భారం పడుతోందని, కరోనాకు ముందున్న రేట్లనే అమలు చేయాలని కోరుతూ మరోసారి ప్రాన్ ఫార్మర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఐపీఆర్ మోహన్‌రాజు ప్రధాని, సీఎంలకు లేఖలు రాశారు. -
ఆక్వా రైతుకు ‘అథారిటీ’
సాక్షి, అమరావతి: ఆక్వా రైతులకు కరెంట్ చార్జీలను తగ్గించడంతోపాటు కరోనా సమయంలో అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి చేపలు, రొయ్యల సాగు అభివృద్ధికి ప్రాధికార సంస్థ (డెవలప్మెంట్ అథారిటీ)ని ఏర్పాటు చేసింది. నాణ్యమైన సీడ్,ఫీడ్ అందించడంతో పాటు విక్రయాల్లో రైతులు నష్టపోకుండా చూడటం అథారిటీ ప్రధాన లక్ష్యం రైతులు, మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తూ వారి ప్రయోజనాలను అథారిటీ పరిరక్షిస్తుంది. కమీషన్ ఏజెంట్లు, వ్యాపారుల దోపిడీ నుంచి రైతుల్ని కాపాడే రక్షణ కవచంలా నిలుస్తుంది. ఆక్వా రంగం అభివృద్ధికి రైతులు, వ్యాపారులతో సామరస్య పూర్వకంగానే వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే పరిధి దాటిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అథారిటీ ఏమాత్రం వెనుకాడదు. ఈ మేరకు మత్స్య, పశు సంవర్థ్ధకశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందడంతో ప్రాధికార సంస్థ ఏర్పాటై విస్తారమైన కోస్తా తీరాన్ని అభివృద్ధికి ఆలవాలంగా, ఉపాధికి నెలవుగా తీర్చిదిద్దనుంది. గ్రామ సచివాలయాల ద్వారా ఇప్పటికే ఆక్వా అసిస్టెంట్లు సాగుదారులకు అన్ని రకాలుగా తోడ్పాటునందిస్తుండగా రైతు భరోసా కేంద్రాల ద్వారా సీడ్, ఫీడ్, సాంకేతిక సలహాలను కూడా అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమస్యలను పరిష్కరించే ‘అథారిటీ’.. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో ఆక్వా రైతులకు కరెంట్ చార్జీలను యూనిట్ రూ.3.86 నుంచి ఏకంగా రూ.1.50కి తగ్గించిన ముఖ్యమంత్రి జగన్ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నారు. మత్స్యకార భరోసా, మరపడవల నిర్వాహకులకు డీజిల్ రాయితీ, చేపల వేట సమయంలో మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపు లాంటి పలు కార్యక్రమాలను తొలి ఏడాదిలోనే పూర్తి చేశారు. లాక్డౌన్ సమయంలో ఆక్వా వ్యాపారుల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేశారు. గత ప్రభుత్వాలేవీ ఆక్వా వ్యాపారుల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ధైర్యం చేయకపోవడంతో విపత్తులోనూ అదే రీతిలో వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. కొందరు ఆక్వా రైతులు ఈ అంశాన్ని నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తేవడంతో రొయ్యలకు ధరలను నిర్ణయించి అధికారుల పర్యవేక్షణలో తక్షణమే కొనుగోళ్లు జరిగేలా చేశారు. వ్యాపారులు, ఎగుమతిదారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా వారి సమస్యలనూ పరిష్కరించి విదేశాలకు ఆక్వా ఎగుమతులు జరిగేలా చర్యలు చేపట్టారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్ధ లేకపోవడంతో సీఎం జగన్ పలుదఫాలు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో స్వయంగా చర్చలు జరిపారు. ఆక్వా రంగం ఇంకా అసంఘటితంగా ఉన్నందున సమస్యలు తలెత్తినట్లు గుర్తించి చట్టం తేవాలని నిర్ణయించారు. ఈ రంగానికి చెందిన వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకుని బిల్లు రూపొందించాలని ఆదేశించారు. అధికారులు, మంత్రి మోపిదేవి తీర ప్రాంతాల జిల్లాల్లో పర్యటించి అన్ని రంగాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. వ్యాపారుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఆసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు సభ ఆమోదం పొందింది. సీడ్, ఫీడ్‌పై నియంత్రణ లేకపోవడంతో.. ► రాష్ట్రంలో మత్స్యసాగుకు అనువైన వనరులు సమృద్ధిగా ఉన్నా వ్యవస్థీకృత విధానాలు లేకపోవడంతో ఆక్వా రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఆక్వా సాగులో కీలకమైన సీడ్, ఫీడ్ నాణ్యతపై ప్రభుత్వ నియంత్రణ లోపించింది. మంచి రేటు వచ్చే వరకు రైతులు కోల్డ్‌స్టోరేజి ప్లాంట్లలో నిల్వ చేసుకునేందుకు అవసరమైన సదుపాయాలు లేవు. ► చేపలకు పెద్దగా విదేశీ ఎగుమతులు లేకపోవడంతో పూర్తిగా ఇతర రాష్ట్రాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. కరోనా విపత్తుతో ఇతర రాష్ట్రాల్లో మార్కెట్లు పూర్తిగా మూతపడటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ పరిస్థితిని నివారించి రాష్ట్రంలో చేపల వినియోగం, మార్కెట్ల విస్తరణకు చర్యలు చేపట్టడం అవసరం. ► రొయ్యల సాగుపై సరైన నియంత్రణ లేనందున నాణ్యతా లోపంతో విదేశీ ఎగుమతులు తరచూ తిరస్కరణకు గురవుతున్నాయి. సరైన ధర కూడా లభించడం లేదు. ► ఇవన్నీ పరిశీలించిన అనంతరం ఆక్వా సాగు, అనుబంధ రంగాల్లో సుíస్థిరత సాధించేందుకు ఒక చట్టం అవసరమని ప్రభుత్వం భావించింది. అథారిటీ విధులు ఇవీ ► రాష్ట్రంలో 2019–20లో 41.75 లక్షల టన్నుల చేపలు, రొయ్యల ఉత్పత్తి జరిగింది. 26.50 లక్షల మందికి ఈ రంగం ద్వారా ఉపాధి లభిస్తోంది. శాస్త్రీయ విధానాల ద్వారా దిగుబడిని మరింత పెంచేందుకు చట్టం అవకాశాలను కల్పిస్తుంది. ► ఈ చట్టం ద్వారా ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్, ఫీడ్ ఇతర ఇన్పుట్స్ సకాలంలో సరసమైన ధరలకు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందనుంది. ► విపత్కర పరిస్ధితుల్లోనూ రైతులు నష్టపోకుండా ఆక్వా ఉత్పత్తుల నిల్వకు మౌలిక సదుపాయాలు కల్పించడం, కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవడం. ఆక్వా రైతులు, అనుబంధ పరిశ్రమలకు సులభంగా లైసెన్సులు మంజూరు. ► ఆక్వా ల్యాబ్‌ల ద్వారా సీడ్, ఫీడ్ నాణ్యతా పరీక్షలు చేపట్టి వ్యాధి నివారణ చర్యలపై రైతులకు సూచనలు చేస్తుంది. సాగులో మంచి యాజమాన్య పద్ధతులు అనుసరించడం ద్వారా విదేశీ ఎగుమతులు, ఇతర రాష్ట్రాలకు మత్స్య సంపద చేరవేసేలా చర్యలు. ప్రాసెసింగ్, మార్కెటింగ్ రంగాలను మరింత బలోపేతం చేసి రైతులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం. అథారిటీ అధికారాలు ► రాష్ట్రంలో చేపల పెంపకం సామర్ధ్యం, సమస్యలు తెలుసుకునేందుకు సర్వేలు నిర్వహించడం ► ఆక్వా సాగుకు సంబంధించి అన్ని అంశాలపై చట్టాలు తయారు చేయడం, నియమ నిబంధనలు, విధి విధానాలు రూపొందించి అమలు చేయడం. జిల్లా, డివిజన్, ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయడం ► ప్రాధికార సంస్ధ విధుల నిర్వహణకు కేంద్రం నుంచి నిధులు పొందడం ► లాబ్‌ల అనుసంధాన వ్యవస్థ, ఆక్వా టెక్నీషియన్లు, సంస్థలను ఏర్పాటు చేయడం ► దాణా, చేపలు, రొయ్య పిల్లలపై నాణ్యతా ప్రమాణాలను పాటించడం కోసం వ్యాపార సంస్ధలు, హేచరీస్ల్లో తనిఖీలు, ఆడిట్లు చేయడం. చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించిన సంస్ధలపై పెనాల్టీలు విధించడం. ► అనధికారిక చేపల పెంపకం, ప్రాసెసింగ్, పంపిణీ, అమ్మకం యూనిట్లను క్రమబద్ధీకరించడం ► వ్యవసాయ ఉత్పాదక భూములను చేపల పెంపకం చెరువులుగా మార్పిడి చేయడాన్ని నియంత్రించడం ► స్టేక్ హోల్డర్లతో సంప్రదింపులు జరిపి చేపలు, సముద్ర ఉత్పత్తులకు రేటు నిర్ణయించడం ► శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం. నైపుణ్యాభివృద్ధి, మానవ వనరుల అభివృద్థికి చర్యలు తీసుకోవడం ► సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై మార్కెట్ సమాచారాన్ని సేకరించి రైతులకు అందించడం. ► చేపపిల్లలు, దాణా, ఆక్వా ఉత్పత్తులు, ఔషధాలు, ఇతర సేవలపై చార్జీలను విధించి వసూలు చేయడం ► విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు జాయింట్ వెంచర్ల ఏర్పాటుకు ఒప్పందాలు చేపట్టడటం. విపత్తులోనూ విదేశాలకు విక్రయాలు కేంద్రం లాక్డౌన్ నిబంధనలు సడలించిన నాటి నుంచి ఆక్వా సాగుదారులను ఆదుకునేందుకు విదేశాలకు రొయ్యలు ఎగుమతి అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకుల సమస్యలను పరిష్కరించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విదేశీ ఎగుమతులకు సానుకూల పరిస్థితులు కల్పించింది. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 8 జిల్లాల్లో 74,101 మెట్రిక్ టన్నులకుపైగా రొయ్యలను సేకరించగా విదేశాలకు 70,578 టన్నులు ఎగుమతి అయ్యాయి. విపత్తుకు ముందు సేకరించిన 96,536 టన్నులు విదేశాలకు ఎగుమతి చేసేందుకు కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లలో సిద్ధంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ వాటా 36.11 శాతంగా ఉంది. ఏటా ఈ వృద్ధి రేటు పెరుగుతూనే ఉంది. 2019–20లో సముద్ర ఉత్పత్తుల ఎగుమతి ద్వారా రాష్ట్రానికి రూ.17,500 కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభించింది. సేవలన్నీ ఒకే చట్రంలోకి.. ► రాష్ట్రంలో 30 శాతం మత్స్య ఉత్పత్తుల వినియోగం జరిగేలా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం. మంచి పోషక పదార్ధాలు కలిగిన ఆక్వా ఉత్పత్తుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం. ► సరళీకృత విధానాలను అనుసరిస్తూ ఆక్వా రంగంలో పెట్టుబడులను ఆహ్వానిస్తూ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం. ఆక్వా అభివృద్ధికి అవసరమైన అన్ని సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చి రైతులు, అనుబంధ సంస్ధలకు మేలైన సేవలు అందించడం. ఆక్వా రైతులకు మార్కెట్ ఇంటెలిజెన్స్ సేవలు అందించడం. ► జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారంతో సాంకేతిక విజ్ఞానం బదిలీని ప్రోత్సహించడం. రైతులకు అండగా ఆక్వా అసిస్టెంట్లు ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న721 మంది మత్స్యశాఖ సహాయకులు (ఆక్వా అసిస్టెంట్లు) ఆక్వా రైతులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రానున్న రోజుల్లో ఆక్వా రైతులకు సీడ్, ఫీడ్, ఇతర సాంకేతిక సలహాలను కూడా అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం 794 ఆక్వా అసిస్టెంట్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయగా 721 పోస్టులు భర్తీ అయ్యాయి. వీరంతా ప్రస్తుతం సచివాలయాల్లో అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారు. ఆక్వా రంగం బలోపేతానికే చట్టం ఆక్వా రంగాన్ని బలోపేతం చేయడానికే చట్టాన్ని తెచ్చాం. మాది స్నేహపూర్వక ప్రభుత్వం.అయితే రైతుల ప్రయోజనాలు కాపాడే విషయంలో వెనుకాడం. ఆక్వా అభివృద్ధికి సీఎం తీసుకుంటున్న చర్యలు రానున్న రోజుల్లో మంచి ఫలితాలనిస్తాయి. చట్టం పరిధిలోకి సముద్ర ఉత్పత్తుల వేటను కొనసాగించే మరపడవల నిర్వాహకులను కూడా చేర్చాం. ఫిష్‌ల్యాండ్ సెంటర్లు, హార్బర్ల నిర్మాణాలకు చర్యలు తీసుకున్నాం. మత్స్యకారుల అభ్యున్నతికి పలు పథకాలు అందుబాటులోకి తెచ్చాం. – మోపిదేవి వెంకట రమణారావు (మత్స్య శాఖ మంత్రి) అన్ని వర్గాలకు ఉపయోగం... విపత్తుల సమయంలో రైతులు దోపిడీకి గురికాకుండా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. అధికారులు నిర్ణయించిన రేటుకు ఎగుమతిదారులు పంటను కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోకుండా ఉంటారు. ఎగుమతిదారులు, హేచరీస్, కోల్డు స్టోరేజి ప్లాంట్ల నిర్వాహకుల సమస్యల పరిష్కారం, అభివృద్దికి చర్యలు తీసుకునేలా చట్టంలో విధివిధానాలున్నాయి. ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తుండటంతో నాణ్యమైన రొయ్యల్ని ఎగుమతి చేసి విదేశీ మారకద్రవ్యం ఆర్జించడానికి అవకాశం ఏర్పడుతుంది. – మోహన్‌రాజు (రొయ్య రైతుల ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు) రెండు వారాల్లో విధివిధానాలు... ఆక్వా చట్టంపై రెండు వారాల్లో విధి విధానాలు రూపొందిస్తాం. బిల్లు తయారు చేసే సమయంలో అందరి అభిప్రాయాలను తీసుకున్నాం. సాగుకు సంబంధించిన అన్నివర్గాలకు కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పించాం. సీడ్, ఫీడ్‌లో నాణ్యత పాటించని సంస్ధలపై కఠిన చర్యలు తీసుకుంటాం. సాగు లైసెన్సులను రెండు వారాల్లోనే మంజూరు చేస్తాం. విపత్తుల సమయంలో రైతులు నష్టపోకుండా ఆక్వా వ్యాపారులు, ఎగుమతిదారులతో సంప్రదింపులు జరిపి రేటు నిర్ణయిస్తాం. ప్రభుత్వం సీడ్, ఫీడ్‌ను అభివృద్ది చేసి రైతులకు సరఫరా చేస్తుంది. – కన్నబాబు, మత్స్యశాఖ కమిషనర్ -
ఆక్వాకు ఊపిరి!
-
ఆక్వా రైతుపై మరో పిడుగు
సాక్షి, అమరావతి: ఆక్వా రైతులపై మేత రూపంలో మరో పిడుగు పడింది. బహుళ జాతి సంస్థలు వారం రోజుల క్రితం అమాంతం ఫీడ్ ధరలు పెంచేశాయి. కేజీకి రూ.6 వరకు ధర పెరగడంతో రాష్ట్రంలోని ఆక్వా రైతులపై రూ.వెయ్యి కోట్ల వరకు భారం పడుతోంది. సీజన్ ప్రారంభానికి ముందే ధరలను పెంచేసిన కంపెనీలు.. మేత కొనుగోళ్లు ఊపందుకున్న తరువాత ఇంకా పెంచేసే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సీడ్ ధరను నియంత్రించినా.. ► సీజన్ ఆరంభంలో రొయ్య పిల్ల (సీడ్) రూపంలో ఆక్వా రైతులకు సమస్య ఎదురైంది. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని హేచరీలు, రైతులతో సమావేశం నిర్వహించి ఒక్కో రొయ్య పిల్లకు 30 నుంచి 35 పైసల్లోపు ధర నిర్ణయించింది. ► ఇందుకు విరుద్ధంగా అమ్మకాలు జరిపే హేచరీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కలెక్టర్లకు ఈ బాధ్యతను అప్పగించడంతో హేచరీల నిర్వాహకులు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే సీడ్ విక్రయిస్తున్నారు. ► అయితే, బహుళ జాతి సంస్థలు ఫీడ్ ధరలు ఉన్నట్టుండి పెంచేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 10 లక్షల మెట్రిక్ టన్నుల మేత అవసరం ► రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో 26 వేల హెక్టార్లలో వెనామీ రొయ్యలను సాగు చేస్తున్నారు. ఏటా రెండు పంటలకు కలిపి 10 లక్షల మెట్రిక్ టన్నుల మేత అవసరం అవుతుంది. ► మేతను ఉత్పత్తి చేసే సంస్థల్లో 70 శాతం థాయ్‌లాండ్‌కు చెందిన బహుళ జాతి కంపెనీలు, 30 శాతం స్థానిక కంపెనీలు ఉన్నాయి. రైతుల్లో ఎక్కువ మంది బహుళ జాతి కంపెనీల మేతనే కొనుగోలు చేస్తున్నారు. ► రైతులపై భారం తగ్గించేందుకు మేత కంపెనీలతో సంప్రదింపులు జరిపి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ప్రాన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు పీఆర్ మోహన్‌రాజు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. తగ్గించేవిధంగా సంప్రదింపులు ఫీడ్ ధరల తగ్గించే దిశగా బహుళ జాతి సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నాం. నాలుగేళ్లుగా ధరలు పెంచలేదని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. రైతుల వివరణ ఇందుకు విరుద్ధంగా ఉంది. రెండువర్గాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ధరలపై నిర్ణయం తీసుకుంటాం. ఆక్వా రైతులను ఆదుకునేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. – మోపిదేవి వెంకట రమణారావు, రాష్ట్ర పశు, మత్స్య శాఖ మంత్రి -
రైతు భరోసా కేంద్రాలపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి : రైతు భరోసా కేంద్రాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫార్మర్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు తీసుకొస్తే రైతులకు మరింత ఉపయోగం ఉంటుందని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బు డెబిట్ కార్డు ద్వారా రైతుకు అందాలన్నారు. సంబంధిత బ్యాంక్‌కు వెళ్ళి కార్డు చూపగానే డబ్బు రైతు చేతికిచ్చేలా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ ఖరీఫ్ కల్లా 56 లక్షల క్రెడిట్, 56 లక్షల డెబిట్ కార్డులు సిద్ధం చేయాలని సూచించారు. ఆక్వా రైతులకు నాణ్యమైన ఫీడ్, సీడు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి చోటా ఆక్వా టెస్టింగ్ ఫెసిలిటీ ఉండాలని ఆదేశించారు. పర్టిఫై చేసి నాణ్యమైన విత్తనాలను మాత్రమే రైతులకు ఇవ్వాలన్నారు. అలాగే ప్రకృతి సేద్యానికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. -
సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు
సాక్షి, తాడేపల్లి: కష్ట కాలంలో ఆక్వా రైతులకు ప్రభుత్వం అండగా నిలిచిందని కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి కొల్లేరు ప్రాంత చేపల రైతుల సమస్యలను వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆక్వా ఎగుమతులకు సీఎం ప్రత్యేక చర్యలు తీసుకున్నారని.. ఫలితంగా కరోనా విపత్తు సమయంలో ఆక్వా రైతుల కష్టాలు తీరాయని పేర్కొన్నారు. తమ ప్రాంతంలో చేపల రైతుల కష్టాలు గురించి ముఖ్యమంత్రికి విన్నవించామని..ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. (ఎమర్జెన్సీ సేవలు అందేలా చూడాలి: సీఎం జగన్) ధర విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. అలాగే కొనుగోలు సమయంలో రిబేటు వల్ల చేపల రైతులు నష్టపోతున్నారని సీఎం వివరించామని.. దీనిపై కూడా రైతులకు న్యాయం జరిగేవిధంగా చట్టం తీసుకువస్తామని సీఎం తెలిపారని చెప్పారు. కొల్లేరు వద్ద రెగ్యులేటర్ త్వరలో ఏర్పాటు చేయబోతున్నామని సీఎం చెప్పారని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. -
'ఆక్వా రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం'
సాక్షి, అమరావతి : కరోనా ప్రభావం ఆక్వారంగంపై పడకుండా చూస్తున్నామని, అనవసరంగా దళారుల మాటలు నమ్మి ఆక్వా రైతులెవరు మోసపోవద్దని మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేలా ఎగుమతిదారులతో మాట్లాడినట్లు తెలిపారు. కాగా ఆక్వా ఉత్పత్తులకు ధరలు కూడా నిర్ణయించినట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో ఆక్వాజోన్లలో కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా నివారణ చర్యలపై నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు మోపిదేవి తెలిపారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రతిపక్షం రాజకీయ విమర్శలు చేయడం దారుణమని తెలిపారు. గ్రామస్థాయిలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీపుకుంటున్నామన్నారు. హార్వెస్టింగ్ యంత్రాలకు, కూలీలకు ఇబ్బందులు కలిగించొద్దని ఆదేశాలిచ్చామన్నారు. పొలం పనులకు వెళ్లేవారు గుంపులుగా వెళ్లొద్దని కన్నబాబు తెలిపారు. -
ఆక్వా రైతుల్లో ఆత్మస్థయిర్యం కల్పించాం
-
ఆక్వాకు ఊపిరి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఆక్వా రంగానికి ఊపిరి పోస్తోంది. లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన రొయ్యల కొనుగోళ్లు తిరిగి ఊపందుకున్నాయి. ఇతర దేశాలకూ ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ప్రకటించిన ధరలకు ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వాహకులు రొయ్యలను కొనుగోలు చేస్తున్నారు. చెరువుల పట్టుబడి, రొయ్యల కొనుగోళ్లలో గ్రామ సచివాలయ సిబ్బంది ముఖ్య భూమిక పోషిస్తూ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. జిల్లా కలెక్టర్లు ప్రతిరోజూ కొనుగోళ్లపై సమీక్షలు నిర్వహిస్తూ రెవెన్యూ, మత్స్య శాఖలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు ఎదుర్కొంటున్న కార్మికులు, ప్యాకింగ్ సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుండటంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గత నెల 30వ తేదీ నుంచి ఈ నెల 6వ నాటికి రాష్ట్రంలోని 73 ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వాహకులు 5,819.3 మెట్రిక్ టన్నుల రొయ్యల్ని కొనుగోలు చేశారు. వాటిని ప్రాసెసింగ్ చేసి చైనా, మలేషియా, సింగపూర్, కెనడా, సౌత్ కొరియా, వియత్నాం దేశాలకు ఎగుమతి ప్రారంభించారు. విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం ఓడరేవుల నుంచి సోమవారం వరకు 233 కంటైనర్ల ద్వారా 3,695 మెట్రిక్ టన్నుల రొయ్యలు ఎగుమతి అయ్యాయి. ముఖ్యమంత్రి ఆదేశాలతో.. ► సరిగ్గా 15 రోజుల క్రితం ఆక్వా రైతులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి ఆక్వా సమస్యలను విన్నవించారు. ► తక్షణమే స్పందించిన సీఎం ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు, వ్యాపారులతో సమీక్ష జరపటంతో రొయ్యల కొనుగోళ్లు మొదలయ్యాయి. ► ప్రాసెసింగ్ ప్లాంట్లలోని కార్మికుల సమస్యలను అధికారులు పరిష్కరించి, వాటిల్లో ప్రాసెసింగ్ కార్యక్రమాలు ఉపందుకునేలా చేశారు. ► గతంలో కొనుగోలు చేసిన రొయ్యలను కూడా ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. గతంలో పరిస్థితి ఇలా.. ► కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో ఎగుమతులు లేక రాష్ట్రంలోని ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్లు మూతపడ్డాయి. ► ఇదే సమయంలో రొయ్యల చెరువులు పట్టుబడికి రాగా.. ప్లాంట్ల నిర్వాహకులు కొనుగోలుకు ముందుకు రాలేదు. ► స్థానిక మార్కెట్లలో 100 కౌంట్ రొయ్యలకు రూ.100 లోపే ధర పలకగా.. ఎకరాకు కనీసం రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లే దుస్థితి ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితి ఇదీ ► ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు గ్రామ సచివాలయ సిబ్బందిని, జిల్లా స్థాయి అధికారులను అప్రమత్తం చేశారు. ► గ్రామ సచివాలయ సిబ్బంది తమ పరిధిలో పట్టుబడికి వచ్చిన చెరువుల వివరాలను సేకరించి అధికారులకు నివేదిస్తున్నారు. ► అధికారులు ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులతో చర్చించి.. చెరువుల్లోని సరుకును కొనుగోలు చేసే ఏర్పాటు చేస్తున్నారు. ► కొన్ని ప్రాసెసింగ్ ప్లాంట్లు కార్మికుల కొరత వల్ల ఇంకా తెరుచుకోలేదు. అధికారులు రంగంలోకి దిగి కార్మికులతో చర్చలు జరిపి ఆ సమస్యను పరిష్కరిస్తున్నారు. ► మరోసారి అధికారులు, మంత్రులు జిల్లాల్లో పర్యటించిన క్షేత్రస్థాయిలో రొయ్యల కొనుగోళ్లు సక్రమంగా జరుగుతున్నాయో లేదో పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ► ప్రభుత్వం ప్రకటించిన ధరల ప్రకారం.. ఈ నెల 30న రొయ్యల ఎగుమతికి సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ► రాష్ట్రంలోని విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం ఓడరేవులకు ప్రాసెస్ చేసిన రొయ్యలను పంపిస్తున్నారు. జిల్లాల వారీగా పని చేస్తున్న ప్రాసెసింగ్ ప్లాంట్లు, కొనుగోలు చేసిన రొయ్యలు -
టీడీపీ నేతలకు ఎందుకంత కడుపుమంట?
సాక్షి, తూర్పుగోదావరి : కరోనా నేపథ్యంలో రాష్ట్ర రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకున్నామని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ నియంత్రణ చర్యల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. మొక్కజొన్న రైతుల కోసం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. సచివాలయంలో అగ్రికల్చరల్ అసిస్టెంట్ వద్ద రైతులు నమోదు చేసుకోవాలని సూచించారు. అరటి ధరలు పడిపోకుండా చూడాలని ఉద్యానవన శాఖకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఏపీ సీడ్స్ ద్వారా ఇప్పటికే లక్ష క్వింటాళ్ల విత్తనాలు కొనుగోలు చేశామని, 6 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సేకరించామని చెప్పారు. మరో 2 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సేకరిస్తున్నామని చెప్పారు.దళారులను నమ్మి పంటను తక్కువ ధరకు అమ్ముకోవద్దని రైతులను కోరారు. ఆక్వా రైతులు నష్టపోకుండా ప్రాసెసింగ్ యూనిట్లు సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించముందే పేద ప్రజలకు సీఎం జగన్ రూ.వెయ్యి ఆర్థిక సాయం ప్రకటించారని గుర్తుచేశారు. పేదలకు ఆర్థిక సాయం అందిస్తుంటే టీడీపీ నేతలకు ఎందుకంత కడుపుమంట అని ప్రశ్నించారు. కరోనాను కూడా టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు చౌకబారు విమర్శిలు మానుకోవాలన్నారు. -
సీఎం జగన్‌తో ఎంపెడా చైర్మన్ భేటీ
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఎంపెడా చైర్మన్ కేఎస్ శ్రీనివాస్ భేటీ అయ్యారు. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. కరోనా వైరస్ దృష్ట్యా ఆక్వా ఉత్పత్తులు, రైతుల ఇబ్బందులపై చర్చించారు. ఆక్వా రైతులు నష్టపోకుండా చూడాలని ఎంపెడా చైర్మన్‌కు సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా నిరోధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్వా జోన్లలో పర్యటించి రైతుల ఇబ్బందులను తెలుసుకోవాలన్నారు. దేశంలోని ఆక్వా ఉత్పత్తుల్లో అధికభాగం రాష్ట్రంనుంచి ఎగుమతి అవుతున్న నేపథ్యంలో ఇక్కడి రైతులకు కేంద్ర నుంచి ఆర్థిక సహాయం అందేలా తగిన చర్యలను తీసుకోవాలని సీఎం ఆదేశించారు. గడచిన ఐదురోజుల్లో 2832 మెట్రిక్ టన్నుల ఆక్వా ఉత్పతులను కొనుగోలు జరిగిందని, 2070 మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను ఎగుమతి జరిగిందని అధికారులు సీఎంకు వివరించారు. -
రైతుకు గిట్టుబాటు ధర
సాక్షి, అమరావతి: రైతుల ఉత్పత్తులకు కనీన గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందేనని సీఎం వైఎస్ జగన్ అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. ఆక్వా పంటకు కూడా కనీస గిట్టుబాటు ధర రావాల్సిందేనని పేర్కొన్నారు. వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తులు, వాటి ధరలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గిట్టుబాటు ధర అంశం చాలా ముఖ్యం అని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక అధికారాలను వాడండి.. ► ఆక్వా ఉత్పత్తులకు కనీస గిట్టుబాటు ధరలు రావాలి. ఎంపెడా ప్రకటించిన ధర రైతులకు లభించాలి. కలెక్టర్లందరికీ చెబుతున్నాం. ప్రాసెసింగ్ యూనిట్లకు కూలీలు రాలేని పరిస్థితి ఉంటే వెంటనే దృష్టి సారించాలి. సమస్యలు పరిష్కరించాలి. అవసరమైతే జేసీని, ఆర్డీఓని పంపించి వారికి ఇబ్బంది లేకుండా చూడాలి. ► ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్లు ఉద్దేశ పూర్వకంగా వ్యవహరించి దోపిడీకి ప్రయత్నిస్తే సహించేది లేదు. చెప్పిన రేటు ఇవ్వకపోతే ప్రత్యేక అధికారాలను వాడండి. అవసరమైతే ఆ ప్రాసెసింగ్ యూనిట్‌ను స్వాధీనం చేసుకోవడానికి వెనుకాడద్దు. ► రైతుల దగ్గర నుంచి ఆక్వా ఉత్పత్తులు కొనుగోలు చేసిన వెంటనే ప్రాసెసింగ్ చేయాలి. తర్వాత మార్కెటింగ్‌పై దృష్టి పెట్టాలి. ప్రాసెసింగ్ యూనిట్లు వెనుకడుగు వేస్తే.. నేరుగా ఎక్స్పోర్ట్ మార్కెటింగ్ వాళ్లతో మాట్లాడి వెంటనే ఎగుమతి అయ్యేలా చూడాలి. ► ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయంలో వ్యవసాయం, ఆక్వాపై సమీక్ష నిర్వహించాలి. మంత్రులు మంత్రి కన్నబాబు, మోపిదేవి అందుబాటులో ఉంటారు. ► రైతు తన పంటను కనీస రేటుకు అమ్ముకోలేకపోతున్నానన్న మాట రాకుండా చర్యలు తీసుకోవాలి. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు బొత్స, మోపిదేవి, సీఎస్ నీలం సాహ్ని ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఆక్వా ఉత్పత్తులకు ముందే ధరల నిర్ణయం
సాక్షి, అమరావతి: ఆక్వా రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ఆ ఉత్పత్తులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుగానే కొనుగోలు ధరలను నిర్ణయించారని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు తెలిపారు. వీటి ధరల్లో హెచ్చుతగ్గులున్నప్పటికీ రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ముఖ్యమంత్రి వీటి ధరలను ప్రకటించారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ తరహా నిర్ణయం తీసుకోలేదని, ఇదే మొదటిసారని వెల్లడించారు. ఆక్వా, పౌల్ట్రీ, పాడి రంగాలపై తీసుకున్న నిర్ణయాలను శనివారం సచివాలయంలో విలేకరులకు వెల్లడించారు. సమీక్షలో వ్యవసాయశాఖ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మత్స్యశాఖ కమిషనర్ సోమశేఖర్, ఎంపెడా జాయింట్ డైరెక్టర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి మోపిదేవి తెలిపిన వివరాలివీ.. - ఈనెల 14 వరకు ఆక్వా ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. - కరోనా వైరస్ కారణంగా ఆక్వా, పౌల్ట్రీ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. - రాష్ట్రంలోని మొత్తం ఆక్వా ఉత్పత్తుల్లో 90 శాతం అమెరికా, చైనా, యూరోపియన్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. - రాష్ట్రానికి అధిక ఆదాయాన్ని కలిగిస్తున్న ఈ రంగ రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నాం. - ఎగుమతులకు ఆటంకం కలగకుండా చూస్తాం. ఐదారు రోజులుగా ఆక్వా రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులతో సమీక్షిస్తున్నాం. - కరోనాతో సంబంధం లేకుండా ఆక్వా ఉత్పత్తుల కొనుగోలుకు ముందుకు వచ్చిన ఎగుమతిదారులను సీఎం అభినందించారు. - కరోనా పేరు చెప్పి దళారులు రైతుల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తాం. వీరిపై చర్యలు తీసుకునే అధికారాన్ని ఎంపెడాకు అప్పగిస్తున్నాం. - ఆక్వా, మత్స్య ఉత్పత్తులకు సంబంధించిన ఎక్స్‌పోర్టు ఇన్స్పెక్షన్ అథారిటీ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ అందించే ఏర్పాటు చేస్తున్నాం. - మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్‌ను ప్రతీ జిల్లాకు నోడల్ అధికారిగా నియమించాం. - విదేశాల నుంచి మేత తయారీకి సంబంధించిన ముడిపదార్థాల దిగుమతికి వీరు సహకరిస్తారు. - చికెన్, గుడ్లు మార్కెట్ల్లో అమ్ముకోడానికి రవాణాకు అన్ని చర్యలు తీసుకున్నాం. - సీఎం సహాయ నిధికి పౌల్ట్రీ రంగం రూ.60 లక్షలు అందజేసింది. -
అడకత్తెరలో ఆక్వా రైతులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆక్వా రైతుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారింది. లాక్డౌన్.. ఆక్వా ఫీడ్ సరఫరా, రవాణాకు తీవ్ర ఆటంకంగా నిలిచింది. ఆక్వా ఫీడ్, మేత తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల రవాణా, పంపిణీ లేక చేపలు, రొయ్యల చెరువుల యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రవాణాకు అనుమతి ఇచ్చినప్పటికీ కోవిడ్ వైరస్ భయంతో యువకులు తమ ఊళ్లలోకి లారీలను అనుమతించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. - గ్రామాల్లో గుండా వాహనాలను అనుమతించకపోవడంతో రొయ్యలు పట్టేందుకు, వాటి తలలు తీసేందుకు కూలీలు కరవయ్యారు. ఫలితంగా రొయ్యల కంపెనీల యజమానులు కొనుగోళ్లు నిలిపివేశారు. ఆక్వా పంట అంతా చెరువుల్లోనే ఉండడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. - గతంలో రొయ్యలు తీసుకువెళ్లేందుకు ప్రాసెసింగ్ యూనిట్లు, రొయ్యల కంపెనీల యజమానులు లారీలను పంపేవారు. ఇప్పుడు సరకును తమ కంపెనీల వద్దకే తెమ్మంటున్నారు. అయితే.. గ్రామాల్లోని ప్రజలు, పోలీసులు ఇందుకు అంగీకరించడం లేదు. - తయారీకి అవసరమైన ముడిపదార్థాలు, మైదా, సోయా, చేప మాంసం, విటమిన్లు వేర్వేరు ప్రాంతాల నుంచి రావాల్సి ఉండడంతో లారీలు రాక మేత తయారీ ఆగిపోయింది. దీంతో చేపలు, రొయ్యలు మేత కోసం అల్లాడుతున్నాయి. రొయ్యల కౌంట్, చేపల బరువు తగ్గిపోతున్నాయి. - హేచరీలు ఉత్పత్తి చేసిన రొయ్య పిల్లలను బయటకు పోనివ్వకపోవడంతో యజమానులు వాటిని సముద్రం పాల్జేస్తున్నారు. రైతులు కోరుతున్నదేమిటంటే.. - సీఎం చొరవ చూపి గ్రామ వలంటీర్ల ద్వారా చేపలు, రొయ్యల రవాణా, మేతల పంపిణీకి చర్యలు చేపట్టాలి. - మేతలు, ముడి పదార్థాలు, కూలీలు, ట్రాలీలను ఊళ్లలోని రహదారుల గుండా చేపల చెరువుల వద్దకు వచ్చేందుకు పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలి. ఆక్వా సంఘాల రైతులతో నేడు సీఎం సమావేశం మంత్రి మోపిదేవి వెంకట రమణారావు ఆక్వా రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు తెలిపారు. వైరస్ ఇతర ఇబ్బందులు లేకపోతే తమ పంటను రైతులు హార్వెస్ట్ చేయొద్దని సూచించారు. ఆక్వా రైతు సంఘాల నాయకులతో శనివారం సీఎం వైఎస్ జగన్ సమావేశమవుతారని, వారి సమస్యలు తెలుసుకుంటారని చెప్పారు. పతనమవుతున్న వనామీ ధర! - రాష్ట్రంలో దాదాపు ఏటా 80 లక్షల హెక్టార్లలో వనామీ సాగు జరుగుతోంది. - నాలుగు నెలల కాల వ్యవధిలో ఈ పంటను సాగు చేయడానికి రైతులు ఎకరానికి రూ.10 నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చు చేస్తారు. - అన్నీ సవ్యంగా ఉంటే రైతులు ఎకరాకు ఆరేడు లక్షల రూపాయల వరకు లాభాన్ని పొందుతారు. - అదే వనామీ నేడు రైతులకు రెండు లక్షలకుపైగా నష్టాన్ని కలిగిస్తోంది. ‘కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు’ మాదిరిగా వనామీ రేటు పతనానికి కోవిడ్ వైరస్, రొయ్యలకు సంక్రమిస్తోన్న వైట్‌స్పాట్ వ్యాధి, ప్రాసెసింగ్ ప్లాంట్ల మూసివేత, ఎగుమతులు లేకపోవడం వంటివి కారణమవుతున్నాయి. - కార్మికుల కొరత, ఎగుమతులు లేకపోవడంతో ప్రాసెసింగ్ ప్లాంట్లను నిర్వాహకులు మూసివేశారు. - దీంతో రొయ్యలను కొనుగోలు చేసేవారు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వైట్‌స్పాట్, ఇతర వైరస్లు సోకిన రొయ్యల్ని అమ్ముకోవడానికి చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో సమీప గ్రామాల ప్రజలకు 100 కౌంట్ రొయ్యను రూ.100లోపే అమ్మేస్తున్నారు. -
ఆక్వా రైతుల్లో కరోనా కల్లోలం
భీమవరం: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఆక్వా రైతుల్లో కలవరం మొదలైంది. వైరస్ భయాలతో రొయ్యల ఎగుమతులు నిలిచిపోతాయని రైతులు ఒక్కసారిగా పట్టుబడులు చేపట్టడంతో ధరలపై తీవ్ర ప్రభావం చూపింది. రొయ్యలు 100 కౌంట్ ధర కిలోకు రూ.60 పతనమైంది. గతంలో కిలో రూ.240 పలికే రొయ్య వంద కౌంట్ ధర ప్రస్తుతం రూ.180 పలుకుతోంది. ఇతర దేశాల్లో సైతం కరోనా వైరస్ వల్ల ఆయా ప్రభుత్వాలు అనేక ఆంక్షలు విధించడంతో రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు కరోనా వైరస్‌ను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల కూడా రొయ్యల అమ్మకాలపై ప్రభావం పడుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాలుగా ధరల్లో కొద్దిగా తగ్గుదల కనిపిస్తున్న నేపథ్యంలో ఆరోగ్యంగా పెరుగుతున్న రొయ్యలను సైతం పెద్దమొత్తంలో రైతులు పట్టుబడి చేసేస్తున్నారు. దీంతో ధరలు భారీగా పడిపోయాయి. పట్టుబడులు పెరగడంతో కూలీలు, ఐస్‌కు తీవ్ర గిరాకీ నెలకొంది. (ఆ నలుగురూ ఎక్కడ..?) నిలిచిన ఎగుమతులు: చైనా, అమెరికా వంటి దేశాలకు రొయ్యల ఎగుమతులు నిలిచిపోతాయని, దీనివల్ల రొయ్యల ధరలు మరింతగా తగ్గే ప్రమాదం ఉందంటూ భయపడి రైతులు పట్టుబడులు సాగిస్తున్నారు. జిల్లాలో సుమారు 90 వేల ఎకరాల విస్తీర్ణంలో రొయ్యల సాగు చేస్తుండగా మరొక 1.10 లక్షల ఎకరాల్లో చేపల సాగు చేస్తున్నారు. గత వారం 30 కౌంట్ రొయ్యలు కిలో సుమారు రూ.500 పైబడి ధరకు కొనుగోలు చేయగా ప్రస్తుతం రూ.460 పడిపోయింది. అలాగే కిలో 100 కౌంట్ రొయ్యలు రూ. 240 నుంచి రూ.180కు తగ్గిపోయింది. 90 కౌంట్ రూ.190, 80 కౌంట్ రూ.200, 70 కౌంట్ రూ. 210, 60 కౌంట్ రూ.230, 50 కౌంట్ రూ.250, 40 కౌంట్ రూ.310 కొనుగోలు చేస్తున్నారు. (కరీంనగర్లో ఇండోనేషియన్లకు ఏం పని..?) పెరిగిన రొయ్యల పట్టుబడులు జిల్లాలో రొయ్యల సాగుచేస్తున్న రైతులు ఎక్కువగా వేసవి సీజన్లో మంచి దిగుబడులు వస్తాయని ఆశిస్తారు. ఫిబ్రవరి నుంచి వాతావరణం అనుకూలంగా ఉండడం రొయ్యలకు పెద్దగా తెగుళ్లు సోకకపోవడం వంటి కారణంగా వల్ల మంచి దిగుబడులు సా«ధిస్తారు. నాలుగు నెలల కాలంలో రొయ్యలు ఆరోగ్యవంతంగా పెరిగితే కిలోకు 30 కౌంట్ సాధించే అవకాశం ఉంది. 30, 40 కౌంట్ రొయ్యలకు అత్యధిక ధర లభిస్తుంటుంది. అయితే ఇటీవల అమెరికా, చైనా వంటి దేశాల్లో 50 కౌంట్ పైబడిన రొయ్యలను ఎక్కువగా కొనుగోలు చేయడంతో ఎగుమతిదారులు కూడా వాటిపట్ల మక్కువ చూపుతున్నారు. ఇటువంటి తరుణంలో కరోనా వైరస్ కారణంగా రొయ్యల ధరలు మరింత తగ్గిపోతాయని రైతులు ఆందోళనకు గురై వారం రోజులుగా పెద్ద మొత్తంలో పట్టుబడులు సాగిస్తున్నారు. దీంతో రొయ్యల పట్టుబడి పట్టే కూలీలు, ఐస్‌కు డిమాండ్ పెరిగింది. రొయ్యల పట్టుబడి పట్టే కూలీలకు గతంలో రూ. 600 ఇస్తే ప్రస్తుతం రూ. 800 పైబడి డిమాండ్ చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూలీలకు రోజువారీ కూలీ సొమ్ములతోపాటు ఉదయం టీ, టిఫిన్స్, మధ్యాహ్న భోజనంతోపాటు కూల్ డ్రింక్స్ ఇతర సదుపాయాలు కలి్పంచాల్సి వస్తున్నదని చెబుతున్నారు. అలాగే ఒకేసారి రొయ్యల పట్టుబడులు పెరగడంతో ఐస్‌కు కూడా డిమాండ్ పెరిగిందని ఐస్ ధరల్లో పెద్ద వ్యత్యాసం లేకున్నా అవసరం మేరకు ఐస్ కావాలంటే సమయం పడుతుందని రైతులు తెలిపారు. కరోనా వైరస్ భయంతో ఎటువంటి వ్యాధులూ లేని ఆరోగ్యవంతమైన రొయ్యలను సైతం పట్టుబడులు చేస్తున్న కారణంగానే కూలీలకు, ఐస్‌కు డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఎగుమతి అవుతున్న రొయ్యలు గతంలో ఇచ్చిన ఆర్డర్ల మేరకే జరుగుతున్నాయి. రొయ్యల ఎగుమతి అయ్యే దేశాల నుంచి రొయ్యల దిగుమతులు నిలిపివేయాలని ఎటువంటి ఆంక్షలూ లేవని ఎగుమతిదారులు స్పష్టం చేస్తున్నారు. అంతేగాకుండా గతంలో చైనాకు రొయ్యల ఎగుమతులు నిలిచిపోగా గత మూడు రోజులుగా తిరిగి ప్రారంభమయ్యాయని చెబుతున్నారు. రొయ్యల ఎగుమతులపై ఎటువంటి ప్రభావం లేకున్నా కేవలం రైతుల్లో ఆందోళన కారణంగా పట్టుబడులు పెరగడం వల్లనే ధరల్లో మార్పు వచ్చిందని ఎగుమతిదారులు స్పష్టం చేస్తున్నారు. రొయ్యల ఎగుమతులు నిలిచిపోలేదు రొయ్యల ఎగుమతులు నిలిచిపోతున్నాయనే వదంతులను రైతులు నమ్మవద్దు. అనవసరంగా జరుగుతున్న ప్రచారంతో పట్టుబడులుచేసి రైతులు నష్టపోవద్దు. చైనా దేశానికి కూడా రొయ్యల ఎగుమతులు అవుతున్నాయి. రొయ్యలకు భవిష్యత్తులో మరింత డిమాండ్ ఏర్పడి ధరలు కూడా పెరిగే అవకాశం వుంది. రైతులు పరిస్థితులను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని కౌంట్ తక్కువ ఉన్న ఆరోగ్యవంతమైన రొయ్యలను పట్టుబడులు పట్టకుండా ఉంటే మేలు కలుగుతుంది. – భీమాల శ్రీరామమూర్తి, ఏపీ సీఫుడ్స్ సప్లయర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి -
రొయ్యల ఎగుమతికి విమానం
సాక్షి, విశాఖపట్నం: పదిహేనేళ్ల కల నెరవేరే రోజు వచ్చింది. రొయ్యల రవాణా కోసం ప్రత్యేక విమానం ఎగరనుంది. రోజంతా పడిగాపులు కాచి.. సరైన రవాణా సౌకర్యం లేక తీవ్రంగా నష్టపోతున్న ఆక్వా రైతుల వెతలు తీరనున్నాయి. రొయ్యలు, రొయ్య పిల్లల రవాణా కోసం ప్రత్యేక విమానం కావాలన్న డిమాండ్.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యల నేపథ్యంలో ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. మెరైన్ కృషి ఉడాన్ పథకంలో భాగంగా నీలి విప్లవానికి ఊతమిచ్చేలా విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళవారం స్పైస్ జెట్ కార్గో విమాన సర్వీసు (బోయింగ్ 737–700) ప్రారంభం కానుంది. 18 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ విమానం చెన్నై నుంచి విశాఖ మీదుగా వారంలో 3 రోజులు (రోజు విడిచి రోజు) సూరత్‌కు, అదేవిధంగా మరో మూడు రోజులు కోల్‌కతాకు వెళ్లనుంది. ఇందులో భాగంగా మంగళవారం చెన్నై నుంచి విశాఖపట్నం వచ్చే తొలి విమానం సూరత్ వెళ్లనుంది. 2.15 గంటల్లోనే విశాఖ నుంచి సూరత్‌కు... ఉత్తరాంధ్రలో రొయ్యల ఉత్పత్తి ఎక్కువగా ఉంటోంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల నుంచి రోజుకు సుమారు 15 టన్నుల వరకు ఉత్పత్తి జరుగుతోంది. వీటిలో 6 నుంచి 7 టన్నుల వరకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి (రైలు, రోడ్డు మార్గాల్లో) అవుతున్నాయి. ఇక్కడి రొయ్యలకు సూరత్, కోల్‌కతాల్లో మంచి డిమాండ్ ఉంది. అలాగే రొయ్య పిల్లల్ని మన రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకుని గుజరాత్, పశ్చిమ బెంగాల్లో సాగు చేస్తున్నారు. దీంతో మంచి లాభాల కోసం మన రైతులు సూరత్, కోల్‌కతాలకు ఎగుమతి చేసేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ ప్రక్రియలో వారు కొన్నిసార్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక్కడి నుంచి సూరత్‌కు తీసుకెళ్లాలంటే తొలుత ముంబయికి వెళ్లి.. అక్కడి నుంచి తిరిగి రోడ్డు మార్గం ద్వారా గానీ విమానంలో గానీ తరలించేవారు. దీనికి 18 నుంచి 24 గంటలు సమయం పట్టేది. దీని వల్ల రొయ్యల పిల్లలకు సరైన ఆక్సిజన్ అందక మృత్యువాత పడేవి. ఆహారానికి ఉపయోగించే రొయ్యలు పాడై పనికిరాకుండా పోయేవి. ఇప్పుడా ఇబ్బందులు తొలగిపోవడంతో ఆక్వా రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నేరుగా సూరత్, కోల్‌కతాలకు వెళ్లే కార్గో విమాన సర్వీసు రావడం రొయ్యల ఉత్పత్తికి, ఎగుమతికి ఊతం ఇస్తుందని అంటున్నారు. ఈ విమానం విశాఖ నుంచి సూరత్‌కు 2.15 గంటల్లో, కోల్‌కతాకు 1.25 గంటల్లో వెళ్లిపోతుంది. ప్రస్తుతం ఒక్కో విమానంలో రొయ్యలు, రొయ్య పిల్లలు కలిపి ఒకటిన్నర టన్నుల ఎగుమతికి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆక్వా ఎగుమతులకు మంచి రోజులు కార్గో విమాన సర్వీసు ప్రారంభం కావడంతో రొయ్యల ఎగుమతులు పెరగనున్నాయి. ప్రయోగాత్మకంగా ఒక సర్వీసు రోజు విడిచి రోజు 135 రోజుల పాటు, మరో సర్వీసు 246 రోజుల పాటు నడపాలని నిర్ణయించారు. ఇక్కడ సరకు రవాణాకు డిమాండ్ ఉండటం వల్ల సర్వీసులు నిరంతరం కొనసాగే అవకాశాలున్నాయి. – రాజకిషోర్, విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ 30 శాతం నష్టపోయేవాళ్లం రొయ్య పిల్లల్ని సూరత్, కోల్‌కతాకు పంపించాలంటే యాతన పడేవాళ్లం. ఆక్సిజన్ సిలెండర్లు ఏర్పాటు చేసి రోడ్డు, రైలు మార్గాల్లో పంపించేవాళ్లం. అయినప్పటికీ ఆక్సిజన్ సరిపోక 30 శాతం పిల్లలు చనిపోయేవి. ఇప్పుడు కార్గో విమాన సేవలు రావడంతో నష్టపోము. – గరికిన కింగ్, రొయ్యల ఎగుమతిదారు, మంగమారిపేట, విశాఖపట్నం -
రొయ్యకు ‘కోవిడ్’ దెబ్బ
సాక్షి, అమరావతి బ్యూరో: ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న రొయ్యల సాగు రైతులు.. కోవిడ్(కరోనా) వైరస్ దెబ్బకు కుదేలవుతున్నారు. చైనాను బెంబేలెత్తిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు రొయ్యల ఎగుమతిపై కూడా పడింది. కోస్తా జిల్లాల్లో లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఒక్క కృష్ణా జిల్లాలోనే 50 వేల ఎకరాల్లో వనామీ రొయ్యల సాగు చేస్తున్నారు. ఏటా 1.80 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి అవుతోంది. ఈ రొయ్యలను ఆక్వా రైతుల నుంచి వివిధ కంపెనీలు కొనుగోలు చేసి, ప్రాసెసింగ్ అనంతరం చైనా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల సహా యూరప్‌కు ఎగుమతి చేస్తుంటారు. జిల్లాలో ఉత్పత్తయిన రొయ్యల్లో 90 శాతం విదేశాలకే ఎగుమతి అవుతాయి. ప్రస్తుతం కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తుండడంతో రొయ్యల ఎగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. అదే సమయంలో మనదేశం నుంచి విదేశాలు రొయ్యల దిగుమతికి ఆసక్తి చూపడం లేదు. దీంతో కొనుగోలు కంపెనీలు రొయ్యల ధర తగ్గించేస్తున్నాయి. ఇలా ఇప్పుడు రొయ్యల సైజు/కౌంట్‌ను బట్టి రూ. 30 నుంచి రూ. 50 వరకు తగ్గిపోయింది. చిన్న రైతుల వద్ద అయితే ప్రస్తుత ధరల కంటే కౌంట్‌కు మరో రూ. 20 తక్కువకే కొనుగోలు చేస్తున్నారు. ఇలా రొయ్యల రైతుకు నష్టాల పాలవుతున్నాడు. కొన్నాళ్లుగా వైరస్ సోకి రొయ్యల సాగు నష్టాలను తెచ్చిపెడుతోంది. ఈ ఏడాది వైరస్ బెడద లేకపోవడంతో ఆక్వా రైతు సంతోషపడుతున్న తరుణంలో కరోనా వైరస్ వారిని దెబ్బకొట్టింది. మేత ధరలు మోత.. ఒకవైపు రొయ్యల ఎగుమతులు తగ్గి ధరలు క్షీణిస్తుండగా మరోవైపు రొయ్యల మేత ధరలు పెరిగిపోయాయి. కొంత కాలం క్రితం వరకు 25 కిలోల మేత (ఫీడ్) బస్తా రూ. 2,100 ఉండేది. ప్రస్తుతం అది రూ. 2,230కి పెరిగింది. వీటితో పాటు ఇతర కెమికల్స్, ప్రొబయోటిక్స్ వంటి వాటి ధరలు కూడా పెరిగాయి. విదేశాల నుంచి రొయ్యల మేత దిగుమతులు తగ్గడమే వీటి ధరల పెరుగుదలకు కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. విధిలేక అమ్ముతున్నాం.. ఇప్పటి వరకూ రొయ్యలకు వైరస్ సోకి నష్టాల పాలవుతున్నాం. కొత్తగా కరోనా వైరస్ పేరిట రొయ్యల ధరలు తగ్గించి కొనుగోళ్లు చేస్తున్నారు. ఈ పదిరోజుల్లో కౌంట్‌కు రూ. 30 నుంచి రూ. 50 వరకు ధర తగ్గిపోయింది. రొయ్యలను నిల్వ ఉంచుకునే పరిస్థితి లేదు. విధిలేక అమ్ముకోవలసి వస్తోంది. ఒకపక్క రొయ్యల ధరలు తగ్గడం, మరోపక్క మేత ధరలు పెరగడం మాకు నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. – తలారి శ్రీహరి, ఆక్వా రైతు, వేమవరప్పాడు. -
‘సీఎం జగన్ వరం.. 53 వేల మంది రైతులకు మేలు’
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన వరం.. 53 వేల మంది రైతులకు మేలు చేకూరుస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. ఇటీవల సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆక్వా రైతులకు రూ. 1.50కే యూనిట్ విద్యుత్ అందించే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ట్విటర్ వేదికగా విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆక్వా రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయన్నారు. చాలీ చాలని రాబడితో సతమవుతున్న 53వేల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. గత ప్రభుత్వం ఆక్వా సాగుకు యూనిట్ కరెంటుకు రూ. 3.86 వసూలు చేసేదని గుర్తుచేశారు. -
ఆక్వాకు ఆక్సిజన్
సాక్షి, మచిలీపట్నం: మత్స్యకారులకు భరోసా లభించింది. చేపల వేట జీవనంగా ఉన్న మత్స్యకారుల కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం మద్దతుగా నిలిచింది. శుక్రవారం ప్రకటించిన బడ్జెట్లో మత్స్యకారులకు పెద్ద పీట వేస్తూ నిధులు కేటా యించడం మత్స్యకారుల సంక్షేమంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోందని హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో 111 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. తీరం వెంబడి 49 వేల హెక్టార్లలో మంచినీటి చేపలు, మరో 19 వేల హెక్టార్లలో ఉప్పు నీటి చేపల సాగు చేస్తున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో సుమారు 30 వేల మంది రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. సముద్ర తీరం వెంబడి జిల్లాలోలో 101 మెకనైజ్డ్ బోట్లు, 1,458 మోటా రైజ్డ్ బోట్లను వినియోగిస్తూ మత్స్యకారులు చేపల వేట సాగిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. కేంద్ర ప్రభుత్వం మంజూ రుచేసిన నిధులు సైతం పక్కదారి పట్టించి మత్స్యకారులకు పూర్తిగా మొండి చేయి చూపింది. వైఎస్ జగన్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. బడ్జెట్లో తగిన నిధులు కేటాయించి వారిపై ఉన్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు. నిషేధ భృతి రూ.10 వేలకు పెంపు ఏటా వేసవిలో సముద్రతీరంలో రెండు నెలల పాటు చేపల వేట నిషేధం అమలు చేస్తున్నారు. ఆ సమయంలో మత్స్యకారుల జీవన భృతి పేరిట ఇప్పటివరకు ఒక్కొక్కరికి రూ. 4 వేలు ఇచ్చేవారు. అవి కూడా సమయానికి అందేవి కావు. కానీ అధికారంలోకి వస్తే మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో జీవన భృతి రూ.10 వేలు చేస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ ఈ మేరకు బడ్జెట్లో నిధులు కేటాయిం పులు చేశారు. సముద్ర తీరంలో ఉన్న 8,980మంది మత్స్య కారులకు ఇక నుం చి ఒక్కొక్కరికి రూ. 10 వేలు సాయంగా అందనున్నాయి. వీటిని 2020 జనవరిలో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తారు. ఆక్వాకు యూనిట్ విద్యుత్ రూ.1.50 కే ఆక్వా రైతులకు ఒక యూనిట్‌కు రూ. 2ను వసూలు చేస్తుండగా, ఇక నుంచి రూ. 1.50కే అందించనుంది. దీనికి సంబంధించి రూ. 475 కోట్లు కేటా యింపులు చేసింది. డీజిల్‌ను సబ్సిడీపై అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులకు రూ. 200 కోట్లు కేటాయించడం వల్ల ఎంఎస్ యాక్ట్ కింద మత్స్యశాఖాధికారుల వద్ద నమోదు చేసుకున్న మెకనైజ్ట్ బోట్లకు నెలకు రూ.3 వేల లీటర్లు, మోటారైజ్డ్ బోట్లకు నెలకు 300లీటర్ల డీజిల్‌ను ఒక్కొక్క లీటర్‌కు రూ. 6.03 చొప్పున సబ్సిడీ పొందే అవకాశం కలిగింది. దీంతోడీజిల్ భారం తగ్గి చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు మరింత ఆర్థిక ప్రయోజనం కలుగనుంది. మత్స్యకారులకు ఎంతో మేలు ప్రస్తుత ప్రభుత్వం మత్స్యకారులకు మేలు చేకూర్చేలా బడ్జెట్లో కేటాయింపులు చేయడం హర్షణీయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గత ప్రభుత్వం హామీలు ఇచ్చినప్పటికీ బడ్జెట్ కేటాయింపులు లేక, ఆర్థిక ప్రయోజనం కలుగలేదు. ప్రస్తుతం బడ్జెట్ కేటాయింపులు ఉన్నందున నిర్ధిష్ట కాలంలో మత్స్యకారులకు సాయం అందుతుందనే నమ్మకం ఉంది. – లంకే వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు, మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ జిల్లాలో సముద్ర తీరం 111 కిలోమీటర్లు మంచినీటి చేపల సాగు 49 వేల హెక్టార్లు చేపల వేటపై జీవిస్తున్న మత్స్యకారులు 8,980 మంది ఉప్పునీటి చేపల సాగు 19 వేల హెక్టార్లు ఆక్వా సాగు చేస్తున్న రైతులు 30 వేల మంది -
వైఎస్ జగన్ నిర్ణయం పట్ల ఆక్వా రైతుల హర్షం
-
రొయ్య రైతుకు జగన్ సర్కారు భరోసా
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు కష్టాల్లో ఉన్న ఆక్వా రైతులను ఆదుకొనేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది. గత ప్రభుత్వ హయాంలో ఉన్న యూనిట్ విద్యుత్ చార్జీని రూ.1.50కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం జీఓఆర్టీ నంబర్ 70 విడుదల చేసింది. దీనివల్ల రొయ్యల చెరువులు సాగు చేస్తున్న రైతుల విద్యుత్ చార్జీలు మరింత తగ్గనున్నాయి. జిల్లా పరిధిలో వేటపాలెం, కొత్తపట్నం, ఒంగోలు రూరల్, సింగరాయకొండ, టంగుటూరు, చినగంజాం, చీరాల, ఉలవపాడు, గుడ్లూరు, నాగులుప్పలపాడు, జరుగుమల్లి మండలాల్లో 28 వేల ఎకరాల్లో రైతులు రొయ్యల సాగు చేస్తున్నారు. వీటి పరిధిలో 2,530 కేటగిరి–3 విద్యుత్ సర్వీసులున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం రొయ్యల చెరువుల విద్యుత్ చార్జీలు యూనిట్‌కు రూ.3.86 చొప్పన నాలుగేళ్లపాటు వసూలు చేసింది. ఎన్నికలకు ముందుకు వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన తర్వాత యూనిట్ చార్జి రూ.2కు తగ్గించింది. దీనివల్ల ఒక పంట కాలానికి రూ.60 వేలు విద్యుత్ చార్జి కట్టాల్సి వస్తోంది. జగన్ సర్కార్ యూనిట్‌కు మరో 50 పైసలు తగ్గించడం వల్ల ఒక్కో ఎకరాకు నాలుగు నెలల పంట కాలానికి విద్యుత్ చార్జి రూ.45 వేలకు తగ్గుతోంది. దీనివల్ల ఒక పంట కాలానికి రూ.15 వేలు తగ్గనున్నాయి. ఈ లెక్కన జిల్లాలో 28 వేల ఎకరాలలో ఉన్న రొయ్యల చెరువుల సాగుకు ఒక పంటకు రూ.42 కోట్ల విద్యుత్ చార్జీలు తగ్గనున్నాయి. ఈ లెక్కన రొయ్య రైతులకు ఒక పంటకు రూ.42 కోట్లు మిగిలినట్లే లెక్క. దీంతో రొయ్య రైతులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. జిల్లాలో ఆక్వా సాగు విస్తీర్ణం : 28,000 ఎకరాలు వీటి పరిధిలో కేటగిరి–3 విద్యుత్ సర్వీసులు సంఖ్య: 2,530 చార్జీల తగ్గింపుతో ఒక పంట కాలానికి తగ్గనున్న భారం : రూ.42 కోట్లు మాట నిలబెట్టుకున్న జగన్.. అసలే రొయ్యకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితిలో వైఎస్ జగన్ సర్కార్ విద్యుత్ చార్జి భారం తగ్గించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. ఆక్వా రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. ఏడాది క్రితం వరకూ రొయ్యల చెరువుల విద్యుత్ చార్జీలు యూనిట్‌కు రూ.3.86 గా ఉంది. విద్యుత్ చార్జీ భారం తగ్గించాలని రైతాంగం నెత్తీ నోరు బాదుకున్నా నాలుగేళ్లపాటు గత ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో భారం భరించలేక చాలామంది రైతులు రొయ్యల సాగుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. దీంతో జిల్లాలో రొయ్యల సాగు మరింతగా తగ్గింది. రైతులు పలుమార్లు చార్జీలు తగ్గించాలని కోరారు. అప్పట్లో చంద్రబాబు పట్టించుకోక పోవడంతో అప్పటి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి విద్యుత్ చార్జీలు తగ్గించాలని రైతులు కోరారు. వారి సమస్యలను పరిశీలించిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే యూనిట్ విద్యుత్ చార్జీలను రూ.1.50కి తగ్గిస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు చార్జీలు తగ్గిస్తూ జీఓ జారీ చేసి హామీని నెరవేర్చారు. సీఎం జగన్ మాట నిలబెట్టుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
ఆక్వా రైతుకు వరం
సాక్షి, అమరావతి: ఆక్వా రైతులకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. ఈ రంగానికి పంపిణీ చేసే యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి మంగళవారం జీవో జారీ చేశారు. దీనివల్ల ఆక్వా రైతులకు రూ.720 కోట్ల మేర లబ్ధి చేకూరుతుంది. రాష్ట్రంలో ఆక్వా రైతన్నలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కల్తీ విత్తనాలు, మందుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి తోడు విద్యుత్ రేట్లు ఆక్వా రంగాన్ని మరింత నష్టానికి గురిచేస్తున్నాయి. విపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన పాదయాత్ర సందర్భంగా అనేక జిల్లాల్లో ఆక్వా రైతులు తాము నష్టపోతున్న వైనాన్ని వివరించారు. దీంతో జగన్ తాను అధికారంలోకి వస్తే ఆక్వా రైతుకు విద్యుత్‌ను యూనిట్ రూ.1.50 చొప్పునే అందిస్తానని హామీ ఇచ్చారు. దీంతో అప్పటి ప్రభుత్వం కంగారుపడింది. ఎన్నికల సమయంలో హడావుడిగా టారిఫ్ కొంత తగ్గించడం ద్వారా ప్రయోజనం పొందే ప్రయత్నం చేసింది. అయితే ఇటీవలి ఎన్నికల తర్వాత అధికారం చేపట్టిన వైఎస్ జగన్ తాను ఇచ్చిన మాట ప్రకారం ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక సంవత్సరం వరకు అమలులో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. -
ఆక్వా సాగు ఆరంభంలోనే చావుదెబ్బ
తూర్పుగోదావరి, అమలాపురం: వరుసగా రెండేళ్ల నుంచి సంక్షోభంలో కూరుకుపోయిన ఆక్వా రైతులకు ఈ ఏడాది కూడా కాలం కలసిరావడం లేదు. ఆరంభంలోనే ఆక్వా సాగును తెగుళ్లు చుట్టుముడుతున్నాయి. గత ఏడాది రెండో పంటను దెబ్బ తీసిన ఎన్ట్రోసైటోజూన్ హెపటోప్నియా (ఈహెచ్‌పీ) వ్యాధి ఈ ఏడాది ఆరంభంలోనే పంజా విసురుతుండడంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. గత ఏడాది ఆక్వా రెండు పంటలను రైతులను ముంచేశాయి. తొలి పంటను కొనుగోలుదారులు సిండుకేటుగా మారి ముంచేస్తే.. రెండో పంటలో హేచరీలు ఆ పాపానికి ఒడిగట్టాయి. తాజాగా ఈ ఏడాది తొలి పంటను సైతం రైతులకు నాశిరకం సీడ్ అందజేస్తున్న హేచరీల వల్ల నష్టపోతున్నారు. జిల్లాలో సుమారు 25 వేల ఎకరాలకు పైబడి వెనామీ సాగు జరుగుతుందని అంచనా. 90 శాతం ఆక్వా చెరువుల్లో సాగు ప్రారంభమైంది. చాలాచోట్ల సాగు మొదలై నెల రోజులు కావస్తోంది. తొలి పంట కావడంతో రైతులు చెరువుల సామర్థ్యానికి మించి రొయ్య పిల్లల పెంపకం ప్రారంభించారు. ఎకరాకు 1.5 లక్షల వరకు రొయ్య పిల్లలను వదులుతున్న రైతులు గణనీయంగా ఉన్నారు. ఈ ఏడాది కూడా రైతులకు తెగుళ్ల బెడద తప్పలేదు. రొయ్యల రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఈహెచ్‌పీతోపాటు వైట్‌కట్ వైరెస్, వైట్‌స్పాట్ కోస్తా రొయ్యల సాగుకు పెనుముప్పుగా మారాయి. విబ్రియో, వైట్‌స్పాట్ కూడా ఎక్కువగానే ఉంది. వీటిలో ఈహెచ్‌పీ అత్యంత ప్రమాదకరంగా మారింది. ఇది ఒక ఫంగల్ డిసీజ్ అన్నారు. దీని వల్ల ఎదుగుదల లోపం ఏర్పడుతుంది. రెండు నెలలకు గాను 12 గ్రాములు రావాల్సిన రొయ్యలు కేవలం 2 గ్రాముల బరువు వస్తున్నాయి. పైగా వీటిలో కూడా మూడు రకాల సైజులుంటున్నాయి. వెనామీలో రోజులు గడిచే కొద్దీ అంటే కౌంట్ తగ్గే కొద్దీ మేత వాడకం పెరుగుతోంది. దాని తగినట్టుగా బరువు రాకుంటే రైతుల నష్టాలు రెట్టింపవుతాయి. నాసిరకం సీడ్ హేచరీల నుంచి నాసిరకం రొయ్య పిల్లలు (సీడ్) రావడంతో పలురకాల వాధ్యులు సోకుతున్నాయి. దీంతోపాటు వైట్‌కట్ బ్యాక్టీరియల్ తెగులు కూడా ఎక్కువగానే ఉంది. ఇక వైట్‌స్పాట్ ఎలాను ఉంది. వీటిని అరికట్టే అవకాశం లేకపోవడంతో ఇవి సోకిన చెరువులను రైతులు ధ్వంసం చేస్తున్నారు. పట్టుబడి చేద్దామన్నా సాగు ఆరంభంలోనే ఉండటం వల్ల ప్రయోజనం లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో సాగు ఆరంభించిన ఆక్వా చెరువుల్లో 30 శాతం వరకు అంటే 7,500 ఎకరాల్లో పంట దెబ్బతిందని అంచనా. నియంత్రణ లేని హేచరీలు రైతులను నిలువునా ముంచేస్తున్నా మత్స్యశాఖ గానీ, కోస్టల్ ఆక్వా అథార్టీ (సీఏఏ)గానీ పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. అసలు హేచరీల్లోనే వ్యాధులు ఉండటం, వాటి ద్వారా ఉత్పత్తి అవుతున్న నాణ్యతలేని రొయ్య పిల్లలను తమకు అందచేస్తుండటం దుర్మార్గమని రైతులు వాపోతున్నారు. హేచరీలు సొమ్ము చేసుకుంటుంటే తాము నష్టాలను చవి చూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. -
కదంతొక్కిన ఆక్వా రైతులు
కైకలూరు: ఆక్వారంగ అభివృద్ధిలో ప్రభుత్వం చూపిస్తున్న అంకెల గారడీకి వాస్తవ పరిస్థితికి పొంతన ఉండటం లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సింహద్రి రమేష్‌బాబు అన్నారు. ఆక్వా రైతుల విద్యుత్ చార్జీల చెల్లింపు విధానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరికి నిరసనగా కైకలూరు తాలూకా సెంటర్లో శనివారం ఎస్సార్ సీసీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. నాగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షా 96 హెక్టార్లలో ఆక్వా సాగు జరుగుతోందన్నారు. మొదటి, ద్వితీయ స్థానాలు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు ఉన్నాయన్నారు. జిల్లాలో ఆక్వాసాగుకు 300 రోజులు నీరు అవసరమని చెప్పారు. అటువంటిది కేవలం 90 రోజులు నీరు మాత్రమే వస్తుందన్నారు. గత ఏడాది ఆక్వా రైతులకు రూ.5వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తంచేశారు. రైతు విభాగం ప్రధాన కార్యదర్శి సింహద్రి రమేష్‌బాబు మాట్లాడుతూ పోలవరంలో మూడు తరాల వాక్ అంటూ సీఎం హడావిడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఏలూరు పార్లమెంటు సమన్వయకర్త కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ కొల్లేరు సరస్సు, ఆక్వా రైతులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనే న్యాయం జరుగుతుందన్నారు. సమన్వయకర్త డీఎన్నార్ మాట్లాడతూ స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కాషాయ పార్టీనా, పసుపు పార్టీనా తెలియడం లేదన్నారు. ఆయన చెబుతున్న అక్వా అభివృద్ధిపై కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ నాయకులు బొడ్డు నోబుల్, పోసిన పాపారావుగౌడ్లు మాట్లాడుతూ ఆక్వా విద్యుత్ రాయితీని నేరుగా రైతులు చెల్లించుకునే అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర పార్టీ నాయకులు నిమ్మగడ్డ భిక్షాలు, వాసిపల్లి యోనాలు మాట్లాడుతూ ఆక్వా చెరువులకు తీవ్ర నీటి కొరత ఏర్పడిందన్నారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా రైతు సంఘం అధ్యక్షులు కొల్లి రాజశేఖర్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి నంబూరి శ్రీదేవి, రాష్ట్ర మైనార్టీ నాయకులు మహ్మద్ జహీర్, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. -
ఆక్వా రైతు గాయానికి ఎలక్షన్ పూత
సాక్షి, అమరావతి: ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్వా రైతుల కష్టాలపై స్పందించి తాము అధికారంలోకి రాగానే విద్యుత్తు ధరలు తగ్గించి యూనిట్ రూ.1.50కే అందచేస్తామని ప్రకటించటంతో రాష్ట్ర ప్రభుత్వం మేలుకుంది. శనివారం కొందరు ఆక్వా రైతులు, అనుబంధ పరిశ్రమలకు చెందిన వారితో సమావేశమైన సీఎం చంద్రబాబునాయుడు ఈ ఏడాది మాత్రం యూనిట్ విద్యుత్ రూ. 2కే సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్‌కు ఆక్వా రైతులు తమ కష్టాలను వివరించిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి రాగానే విద్యుత్తు ధరలు తగ్గించటంతోపాటు కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతామని జగన్ వారికి భరోసా ఇచ్చారు. ధరల స్థిరీకరణపై హామీ లేదు ఆక్వా సాగుదారుల ఇబ్బందులపై ప్రతిపక్ష నేత తక్షణమే స్పందించటం, మరోవైపు ఇది ఎన్నికల ఏడాది కావటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు శనివారం సచివాలయంలో హడావుడిగా సమావేశం నిర్వహించి ఆక్వాకు విద్యుత్తు చార్జీలు తగ్గించనున్నట్లు ప్రకటించారు. అయితే రొయ్యల మార్కెట్ ధర స్థిరీకరణపై నిర్ధిష్టమైన హామీ ఇవ్వలేదు. ఆక్వా ఉత్పత్తుల నాణ్యత నిర్ధారణకు అత్యాధునిక పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని రైతులు కోరారు. ప్రతిపక్ష నేత జగన్ చూపిన చొరవ వల్లే ఆక్వా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని, ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే సీఎం తాజా ప్రకటన చేసినట్లు కొందరు రైతులు బహిరంగంగానే చర్చించుకోవటం గమనార్హం. విద్యుత్ సబ్సిడీతో అదనపు భారం ఆక్వా రంగానికి ఇప్పటికే సబ్సిడీపై విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఇప్పుడు అదనంగా ఇచ్చే సబ్సిడీతో రూ. 350 కోట్లకు పైగా ప్రభుత్వంపై భారం పడుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కోస్తాంధ్రలో ఆక్వా, రాయలసీమలో ఉద్యాన రంగాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. ఆక్వా రైతులు బాగుండాలనే విద్యుత్ ధరలు తగ్గించామన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఆక్వా రైతులు ప్రాధాన్యం ఇవ్వాలని, ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ వినియోగించడం మంచిది కాదన్నారు. అధికంగా వాడితే ఎగుమతులపై నిషేధం విధించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాలుష్య నియంత్రణ కోసం జోన్లవారీగా ఆక్వాసాగుకు అనుమతులు ఇస్తామని చెప్పారు. పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకుని ఆక్వా రంగంలో సమస్యల పరిష్కారానికి కమిటీని నియమించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రిజిస్ట్రేషన్ చేయకుండా సాగు సరికాదని ఆక్వా రైతులతో భేటీ సందర్భంగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు ముందుకొచ్చే వారికి రైతులు సహకరించినప్పుడే గిట్టుబాటు ధర లభిస్తుందని చెప్పారు. రొయ్యల ఫీడ్ ధరలపై ఉత్పత్తిదారులు, రైతులు కలసి సమస్య పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు. అన్ని ప్రయోజనాలు తానే కల్పిస్తే ఇంట్లోకి వెళ్లి పడుకుంటారని రైతులు, ఎగుమతిదారులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడంతో సమావేశంలో పాల్గొన్నవారు నొచ్చుకున్నారు. -
ఆక్వా రైతులతో సీఎం సమావేశం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆక్వా రైతులు, ఎగుమతిదారులతో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఆక్వా రంగాన్ని, రాయలసీమలో ఉద్యాన రంగాన్ని తాము ప్రోత్సహిస్తూ వచ్చామని, ఆక్వా రైతు బాగుండాలనే విద్యుత్ ధరలు తగ్గించినట్టు చెప్పారు. ఆక్వా సాగుకు వినియోగించే విద్యుత్‌పై మరింత సబ్సిడీ ఇవ్వనున్నామని తెలిపారు. ఏడాది పాటు యూనిట్ విద్యుత్ రూ.2కే సరఫరా చేయనున్నట్టు పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వంపై రూ.300 కోట్లకు పైగా అదనపు భారం పడనుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు ఆక్వా రైతులు ప్రాముఖ్యత ఇవ్వాలని, ఇష్టానుసారంగా యాంటీ బయాటిక్స్ వినియోగించడం మంచిది కాదని చంద్రబాబు రైతులకు సూచించారు. పర్యావరణ రహితంగా వ్యాధుల నియంత్రణపై దృష్టి పెట్టాలని, పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవాలని రైతులకు చెప్పారు. రిజిస్ట్రేషన్ లేకుండా ఆక్వా సాగు సరికాదని, అక్రమ సాగుపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించకుండా.. నష్టపోకుండా అందరూ జాగ్రత్త పడాలని హెచ్చరించారు. ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు ముందుకొచ్చేవారికి రైతులు సహకరించినప్పుడే గిట్టుబాటు ధర లభిస్తుందని, రొయ్యల ఫీడ్ ధరలపై ఉత్పత్తిదారులు-రైతులు ఒకరిని ఒకరు నిందించుకోకుండా సమస్యను పరిష్కరించుకోవాలని చంద్రబాబు సూచించారు. -
నవరత్నాలు అమలు చేస్తాం..
-
ఆక్వా రైతులను ఆదుకుంటా: వైఎస్ జగన్
సాక్షి, ఆకివీడు (పశ్చిమ గోదావరి జిల్లా) : నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో దారుణంగా చితికిపోయిన రొయ్యల, చేపల రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే రొయ్యల రైతులకు అండగా సముద్ర తీరానా కోల్డ్ స్టోరేజ్, ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు. యూనిట్ కరెంటును రూపాయిన్నరకే అందజేస్తామని, ఆక్వా అనుబంధ పరిశ్రమలకు యూనిట్ కరెంటు ఐదు రూపాయలకే ఇస్తామని ప్రకటించారు. సీడ్ కొనుగోళ్ల నుంచి రైతు తన పంటను అమ్ముకునే దాకా మధ్యలో ఉన్న దళారీ వ్యవస్థను కూల్చేస్తామని, నిర్ణీత కాలంలోగా రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. 171వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చెరకు రసం కాదు..తాగే నీరు.. ‘‘రైతన్నలు, నా దగ్గరకు వచ్చి.. అన్నా ఇద్దరి నాయకుల గురించి చెబుతామన్నా..ఒకరు నాన్నగారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారన్నా.... విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచారన్నా.. నాన్న గారి హయాంలో ఈ నియోజకవర్గంలో 800 కోట్ల పనులు జరిగాయన్నా.. నీరు లేవంటే ప్రాజెక్టులతో ముందుడుగేశాడన్నా అని చెప్పారు. ఇంకో నేత సీఎం చంద్రబాబు నాయుడన్నా.. జిల్లాలోని 15 నియోజక వర్గాలను కట్టబెట్టమన్నా.. అయినా ఈ పెద్ద మనిషి చేసిందేమిలేదన్నా.. ఒక్కరోడ్డు వేయలేదన్నా.. మంచినీళ్లు దొరకని పరిస్థితుల్లో తాగుతున్న నీళ్లు ఇవ్వన్నా అని ఆవేదన చెందుతూ.. బాటిల్ చూపించారు. ఆ బాటిల్ చూపిస్తూ.. చెరకు రసం కాదు చంద్రబాబు గారు తాగె మంచినీళ్లు. చుట్టూ నీళ్లు కనిపిస్తాయి.. తాగాడానికి గుక్కెడుండవ్.. నీటి కోసం ప్రజలు దీక్షలు చేయడానికి పోతుంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. చుట్టు నీళ్లు కనిపిస్తాయి. తాగడానికి గుక్కెడుండవ్. బోర్లు వెస్తే ఉప్పునీరు.. నీరు లేక చేపల చెరువులు సైతం రొయ్యల చెరువుగా మార్చుతున్నారు. జలాలన్ని పూర్తిగా కలుషితమయ్యాని ఎలా బతకాలన్నా అని అడుగుతున్నారు. నాన్న గారి హయాంలో పైపులైన్ల ద్వారా నీళ్లు తీసుకురావాలని దానివల్ల చెరువులు నింపాలని, ఓ స్వప్నాన్ని చూశామన్నా. ముప్పై కిలోమీట్లరు పైపు లైను నాన్నగారున్నప్పుడే జరిగింది. ప్రత్యేక పైపులైన్ల ద్వారా గ్రామాలకు కూడా వచ్చాయి. నాన్న గారి మరణాంతరం పట్టించుకునే నాదుడేలేడన్నా అని వాపోతున్నారు. పేదలకు మూడు సెంట్ల భూమి ఇవ్వరు.. పేదలకు మూడు సెంట్ల భూమి ఇవ్వడానికి సిద్దపడరు. కానీ స్థానిక ఎమ్మెల్యేకు 350 ఎకరాలు ఇస్తారు. అది కూడా కొటిన్నర విలువ చేసే భూమిని కేవలం రూ.12.50 లక్షలకే కట్టపెడుతారు. నాలుగేళ్లలో పేదలకు ఒక్క ఇళ్లు కూడా కట్టించలేదు. కానీ చెరువులు కబ్జా చేసి మల్టీప్లెక్స్‌లు కడుతాడంటారు. వైఎస్ఆర్ హయాంలో వేల ఇళ్లు కట్టిస్తే.. నాలగేళ్లలో ఒక్క ఇళ్లు కూడా కట్టివ్వలేదు. మీ పాలనలో తాగు నీటికి నెలకు రూ.600 నుంచి 700 ఖర్చుపెడితే.. అన్ని వసుతులు కల్పించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిది రామరాజ్యం కాదా. దళారీ వ్యవస్థతో మోసం.. మధ్దతు ధర లేక రైతన్నలు వరి అమ్ముకుంటున్నారు. ఆక్వా పంట చేతికొచ్చి అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కేజీ రొయ్య 460 ఉండాల్సి రెండు వందలు కూడా పలకడం లేదు. కేజీ చేపలు 110 ఉండాల్సింది 80 కూడా పలకకుండా ఇబ్బంది పడుతున్నారు. పంట చేతిరాక ముందు ధరలు బాగుంటాయని, చేతికి వచ్చిన తర్వాత వ్యాపారులు ఒక్కటై రేటు తగ్గిస్తున్నారని రైతన్నలు వాపోతున్నారు. బాబు దళారీలతో కుమ్మక్కై ఈ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు. వర్షకాలం తప్ప నీరు అందుబాటులో ఉండటం లేదు. కాలువల్లో నీరు కనబడక అవస్థలు పడుతున్నారు. రొయ్యలు, చేపలు బతికించుకోవడానికి చెరువులు తవ్వితే నీరు కలుషితమవుతున్నాయి. చేపలు, రొయ్యలు, ఉత్పత్తి లేదని, హ్యార్చరీలు పుట్టగొడుగుల్లా వెలిసాయని, నాణ్యత లేని సీడ్స్ ఇస్తున్నారని, నాణ్యత పరీక్షించుకోవడానికి వెళ్తే ప్రభుత్వ ల్యాబ్‌లు మూసేశారని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ నియంత్రణ, నాణ్యత లేకపోవడంతో రైతులు మోసపోతున్నారు. మద్దతు ధర లేదు.. కానీ దాణ రేటు మద్దతు ధరలేక అవస్థ పడుతుంటే రొయ్యల, చేపల దాణరేటు మాత్రం విపరీతంగా పెరుగుతుందన్నా అని వాపోతున్నారు.. సోయాబిన్, ఫిష్ ఆయిల్, నువ్వులు, ముడిపదార్థల రేటు తగ్గినా కూడా దాణా రేటు మాత్రం తగ్గడం లేదని అంటుంటే పట్టించుకునే నాదుడు లేడు. దాణా ధరలపై నియంత్రణ ఉంటే రైతులకు మేలు జరిగేది. 15 నియోజకవర్గాలు కట్టబెడితే అండగా ఉండాల్సిన బాబు నాశనం చేస్తున్నారు. కోల్డ్ స్టోరేజ్, ఫుడ్‌ప్రాసెసింగ్‌లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేస్తాం.. వైఎస్ఆర్ హయాంలో యూనిట్ కరెంట్ రూ. 90 పైసలుంటే.. ప్రస్తుతం రూ. 3.90 పైసలు వసూలు చేస్తున్నారన్న అని ప్రజలు వాపోతున్నారు. ఆక్వా రంగంలో ఉన్నందరికి ఆ దేవుని ఆశిస్సులతో మనందరి ప్రభుత్వం అధికారంలో వస్తే.. కరెంట్ యూనిట్‌కు 1.50 ఇస్తాము. అనుబంద ఫ్యాక్టరీలు, ఐస్, ప్రాసెంసింగ్ యూనిట్లకు 7 రూ నుంచి 5 రూ.తగ్గిస్తామని హామీ ఇస్తున్నాను. దళారీవ్యవస్థను పూర్తిగా నియంత్రిస్తాను. అందరికీ తోడుగా ఉంటాను. కోల్డ్ స్టోరేజ్‌లో స్టోర్ చేయగలిగితే ఫుడ్‌ప్రాసెసింగ్‌లు ఉంటే ఈ పరిస్థితి రాదు. వీటిద్వారా 6నెలల వరకు నిల్వ ఉంచవచ్చు. మూడేళ్లలో వీటన్నిటిని సముద్ర తీరాన ఏర్పాటు చేసి మద్దతు ధర తీసుకొస్తాం. ఫోన్ కొడితే మందు బాటిల్.. నాలుగేళ్ల కింద ఎన్నికల్లో బాబు చెప్పిన మాటలను గుర్తుతెచ్చుకోండి. పిల్లలు తాగి చెడిపోతున్నారు అన్నడా లేదా.. అన్నాడు..(ప్రజల సమాధానం), అధికారంలోకి వస్తూ మద్యపాన నిషేదం చేస్తానని, బెల్ట్‌షాప్‌లు లేకుండా చేస్తానని సంతకం కూడా చేశారు. మినరల్ వాటర్ ప్లాంట్ ఉన్న గ్రామం ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ బెల్ట్ షాప్ లేని ఊరు లేదు. ఈ పెద్ద మనిషి హైటెక్ పాలనలో ఫొన్ కొడితే నీటి బాటిల్ వస్తదో లేదో తెలియదు కానీ మందుబాటిల్ మాత్రం ఇంటికి వస్తుంది. బియ్యం తెచ్చుకోవడానికి రేషన్ షాప్ పోయేవాళ్లం.. బియ్యంతో చక్కెర, కందిప్పు, పామాయిల్,గోధుమ, పసుపు,కారం,చింతపండు,కిరోసిన్‌లను కేవలం రూ.155కే ఇచ్చేవారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రేషన్ షాప్ వెళ్తే బియ్యం తప్ప ఏమైనా ఇస్తున్నారా? ఈ బియ్యంలో కూడా వేలి ముద్రలు పడటం లేదని కట్ చేస్తున్నారు. పెట్రోల్, డిజిల్ ధరల వ్యత్యాసం.. పెట్రోలు, డిజిల్‌లను మీ ట్రాక్టర్, బైక్‌లలో ఇక్కడ కొట్టించి.. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కొట్టించుకుంటే వ్యత్యాసం ఎంతో తెలుస్తోంది. ఎంత తెలుసా రూ. 7 ఎక్కువగా బాదుతున్నారు. నాలుగేళ్ల నుంచి ఇతర రాష్ట్రాల కన్నా రూ.7 ఎక్కవగా వసూలు చేస్తున్నారు. కరెంట్ చార్జీలు తగ్గిస్తానన్నారు. కానీ కరెంట్ బిల్లులు బాదుతునే ఉన్నారు. అప్పుడు 100 లోపు కరెంట్ బిల్లు వచ్చేది. ఇప్పడు 500పైగా వస్తుంది. పెనాల్టీ కట్టకుంటే కరెంట్ కట్‌చేస్తున్నారు. ఆయన వచ్చాడు.. మీ బంగారం వచ్చిందా? ఎన్నికల సమయంలో ఓ ప్రకటన వచ్చేది.. ఓ అక్క మెడలోని తాడును గుంజుకోపోతుంటే.. ఒకయాన వచ్చి అడ్డుకుంటాడు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మీ రుణాలు మాఫీ చేస్తాడని చెబుతాడు. మరి ఆయన వచ్చాడు మీ బంగారం వచ్చిందా. (ప్రజల నుంచి రాలేదని సమాధానం) పొదుపు సంఘాలు తీసుకొచ్చిందే తానంటారు. అక్కచెల్లెమ్మలు రుణాలు మాఫీకావాంటే బాబు కావాలని అన్నారు. అక్కమ్మ చెల్లెమ్మలకు ఒక్క రూపాయి అయినా మాఫీ అయిందా అని అడుగుతున్నా. ఆడవాళ్లకు కన్నీరు పెట్టిస్తే ఇంటికి అరిష్టం అంటారు. కానీ ఈ నాలుగేళ్లలో ఎంతమంది కన్నీళ్లు పెట్టారు. జాబు రావాలంటే బాబు రావాలి అన్నారు. మీ పిల్లలు ఏమి చదవక పోయినా ఉద్యోగం ఇస్తాం.. లేకుంటే ఉపాధి ఇస్తాం అదికాకపోతే.. రెండు వేలు ఇస్తానన్నారు. ఇలా ప్రతి ఇంటికి 96 వేలు బాకీ ఉన్నాడు. కనిపిస్తే అడగండి. నవరత్నాలు అమలు చేస్తాం.. మనందరి ప్రభుత్వం రాగానే నవరత్నాలు తీసుకొస్తాం. నవరత్నాలతో అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపుతాం. ఎన్నికల నాటికి డ్వాక్రా మహిళలకు ఎంత అప్పుంటే అంత మొత్తాన్ని నాలుగు విడతల్లో నేరుగా చెల్లిస్తాం. అక్కా చెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాలను పునరుద్ధరిస్తాం. ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టించి ఇస్తాం. ఆ ఇళ్లను అక్కా చెల్లెమ్మల పేరిట ఇప్పిస్తాం. అవ్వా, తాతలకు రూ.2 వేల పెన్షన్ ఇస్తాం. పెన్షన్ వయస్సు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తాం. అంతేగాకుండా పశ్చిమ గోదావరి జిల్లాకు స్వాతంత్ర్య సమరయోదుడు,మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెడ్తాం’’ అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. -
చెరువులో వల వేసి, లాగిన వైఎస్ జగన్
సాక్షి, ఉంగుటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు విశేష స్పందన వస్తోంది. జననేతకు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు తరలివస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాసంకల్పయాత్ర 171వరోజు పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్.. పెదకాపవరం గ్రామ శివారులో రొయ్యల చెరువు క్షేత్రాన్ని సందర్శించారు. రొయ్యల చెరువులో చేపలు, రొయ్యలకు మేత వేసిన స్వయంగా జననేత వైఎస్ జగన్.. వల వేయడంతో చేపలు, రొయ్యలు పట్టడం ఎలాగో వారిని అడిగి తెలుసుకున్నారు. రొయ్యలు, చేపల ధరలు ఎందుకు పడిపోతున్నాయో రైతులు ప్రతిపక్షనేతకు వివరించారు. తమను దళారులు ఏ విధంగా దోచుకుంటున్నది ఆక్వా రైతులు వైఎస్ జగన్‌కు వివరించారు. వ్యాపారులు సిండికేట్ అయ్యి తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారని వాపోయారు. ఈ సిండికేట్‌లో ప్రధాన భాగస్వామి అధికార పార్టీకి చెందిన నేత చింతమనేని ప్రభాకర్ అని వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. జననేత వారికి ధైర్యం చెప్పి, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తామని.. రైతులు గిట్టుబాటు ధర వచ్చేవరకు తమ పంటను కోల్డ్ స్టోరేజ్ లో దాచుకోవచ్చని చెప్పారు. ఆక్వా రైతులకు విద్యుత్తు చార్జీలు 4.75 పైసలు నుండి 1.50 పైసలు వరకు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. రైతు రుణ మాఫీ జరగలేదని పెదకాపవరం వద్ద కటారి కనక దుర్గ అనే మహిళ వైఎస్ జగన్‌ను కలుసుకుని.. తమ బాధ వివరించారు. లక్ష రూపాయల పంట రుణం తీసుకుని ప్రతి ఏటా వడ్డీ చెలిస్తన్నామని జగన్‌కి ఆ కుటుంబం వివరించింది. వైఎస్సార్ ప్రభుత్వంలో రుణ మాఫీ అయ్యిందని.. ఈ ప్రభుత్వంలో అసలు మాఫీ ఊసేలేదని వాపోయారు. -
ఆక్వా రైతులకు అవగాహన
కావలిఅర్బన్ : ఆక్వా ల్యాబ్‌ను రైతులు సద్వినియోగం చేసుకుని ఆక్వా రంగంలో లాభాలు గడించాలని అవంతి ఫీడ్స్ జనరల్ మేనేజర్ పీకే శెట్టి సూచించారు. స్థానిక ఉదయగిరి బ్రిడ్జి క్రిస్టియన్‌పేట 3వ లైనులో బుధవారం అవంతి ఆక్వాల్యాబ్‌ను ప్రారంభించారు. అంతరం ల్యాబ్‌ను పరిశీలించి ఆక్వా రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఆయన మాట్లాడుతూ ల్యాబ్‌లో పీహెచ్, సెలినిటీ, అమ్మోనియా, ఆల్కాలినిటి, హార్డ్నెస్, విబ్రియో లోడ్స్ తదితర పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అవంతి ఫీడ్స్ డీజీఎం ఎస్.మొహంతి, కావలి ఏరియా మేనేజర్ కె.మురళీకృష్ణ, నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎ.రమేష్ రెడ్డి, విజయశంకర్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాసి సీడ్ వలలో.. వెనామీ సాగు
* పుట్టగొడుగుల్లా వెలస్తున్న అనధికార హేచరీలు * నాణ్యత లేని రొయ్యపిల్లలకు వైరస్ వ్యాధులు * పెద్ద ఎత్తున నష్టపోతున్న ఆక్వా రైతులు * అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వినతి కాట్రేనికోన: కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ (సీఏఏ) అనుమతులు లేకుండా తీరం వెంబడి పుట్టగొడుగుల్లా వెలసిన వెనామీ హేచరీల్లో ఉత్పత్తవుతున్న నాణ్యత లేని రొయ్య సీడ్ (పిల్లలు) రైతులను దెబ్బ తీస్తోంది. వెనామీ రొయ్య ధర బాగున్నా సీడును యధేచ్ఛగా ఉత్పత్తి చేస్తున్నారు.రైతులు ఆశించిన స్థాయిలో వెనామీ రొయ్యలు ధరలు ఉన్నప్పటికీ సీడ్ నాసిరకం కావడంతో వైరస్ వ్యాధులు సోకి, నష్టాల పాలవుతున్నారు. చెన్నై కేంద్రంగా పని చేస్తున్న రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వా కల్చర్ పరిధిలో 2016కి సంబంధించి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, ఒడిశా, గుజరాత్, కర్నాటక రాష్ట్రాల్లో 254 వెనామీ హేచరీలకు మాత్రమే సీఏఏ అనుమతి ఉంది. అనుమతి ఉన్న హేచరీలకు వాటి సామర్థ్యాన్ని బట్టి 400 నుంచి 10 వేలకు పైగా వ్యాధిరహిత (ఎస్పీఎఫ్) తల్లి రొయ్యలను సీఏఏయే సరఫరా చేసింది. రాష్ర్టంలో 189 హే చరీలకు మాత్రమే అనుమతి ఉండగా నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలలో అనధికారిక హేచరీలు విస్తృతంగా ఉన్నాయి. తీరం వెంబడి ఉన్న హేచరీల్లో సగానికి పైగా సీఏఏ అనుమతి లేనివే. జిల్లావ్యాప్తంగా తీరంలో 200లకు పైబడి హేచరీలుండగా 63 హేచరీలకు మాత్రమే సీఏఏ అనుమతులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అమలాపురం పరిసర ప్రాంతాల్లో సుమారు 15 హేచరీలుండగా అల్లవరం మండలంలోని ఐదింటికే అనుమతి ఉంది. వెనామీ రొయ్యల పెంపకం చెరువులు, హేచరీలకు సీఏఏతో పాటు సెంటర్ ఫర్ ఆక్వా కల్చర్ అనుమతి తప్పనిసరి. అనుమతికి సంబంధించి కలెక్టర్ చైర్మన్‌గా ఉండే కమిటీలో మ త్స్యశాఖ డీడీ, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, వ్యవసాయశాఖ అధికారులు సభ్యులుగా ఉంటా రు. ఈ కమిటీ పరిశీలన అనంతరం సంబంధిత అధికారులు పర్యవేక్షించి నిబంధనల ప్రకారం ఉంటే అనుమతి ఇస్తారు. సీడ్ నాసిదైనా రేటు ఎక్కువే.. మత్స్యశాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 6 వేల హెక్టార్లలో వెనామీ సాగు జరుగుతోంది.అనుమతులు లేకుండా అనధికారికంగా మరొక 4 వేల హెక్టార్లలో సాగు చేస్తున్నట్టు అంచనా. సీఏఏ అనుమతులు లేని హేచరీలతో పాటు అనుమతి ఉన్న హేచరీలు కూడా ఒక అనుమతితో మరికొన్ని ఏర్పాటు చేసి, స్థానికంగా దొరికే తల్లిరొయ్యల తోనే సీడ్‌ను ఉత్పత్తి చేస్తున్నారుు. సీఏఏ అనుమతి ఉండి , నిబంధనల ప్రకారం నాణ్యైమైన రొయ్య పిల్లల్ని ఉత్పత్తి చేస్తున్న హేచరీలు పిల్లను 35 పైసల నుంచి 40 పైసల వరకు విక్రయిస్తుంటే అనుమతులు లేని హేచరీలు కూడా అదే ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారుు. అనుమతులు లేని హచరీల్లో నాసిరకం సీడ్ ఉత్పత్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వైరస్ రహిత సీడ్‌ను అందించేలా చూడాలి సీఏఏ అనుమతులు లేని హేచరీలు ఉత్పత్తి చేస్తున్న నాణ్యత లేని రొయ్య సీడు ఎదుగుదల లేక, వైరస్ వ్యాధులుతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నాం. వైరస్ రహిత ఎస్పీఎఫ్ సీడ్‌నే హేచరీలు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి. - భూపతిరాజు సుబ్రమణ్యంరాజు(బులిరాజు), రైతు, ఎదుర్లులంక అనుమతి ఉన్న హేచరీల్లోనే సీడ్ తీసుకోవాలి జిల్లాలో 63 హేచరీలకు మాత్రమే సీఏఏ అనుమతులు ఉండగా 80 హేచరీలకు అనుమతులు లేవు. 20 హేచరీలు నిర్మాణంలో ఉన్నట్టు గుర్తించాం. అనుమతులు లేకుండా సీడ్ ఉత్పత్తి చేయడం నేరం. అనుమతులు లేని హేచరీలు దరఖాస్తు చేసుకోవాలని, పాత హేచరీలు రెగ్యులర్ చేసుకోవాలని నోటీసులు జారీ చేశాం. సీఏఏ అనుమతి ఉన్న హేచరీల నుంచే రైతులు సీడ్ తీసుకోవాలి. - టి.కళ్యాణం, మత్స్యశాఖ డిప్యూటీ డెరైక్టర్ -
రైతులకు ‘పీత’ కష్టాలు
రాష్ట్రంలో లభించని పిల్ల పీతలు తమిళనాడులోని ఆర్జీసీఏ చుట్టూ ప్రదక్షిణలు చిన్న, సన్నకారు రైతులకు శిక్షణ కరువు సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సీఎం ఆదేశం సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతాల్లోని పీతల సాగు రైతులు ‘సీడ్’ (పిల్ల పీతలు) కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో సాగుకు అనువైన సీడ్ లభించకపోవడంతో త మిళనాడులోని నాగపట్నం సమీపంలో ఉన్న రాజీవ్‌గాంధీ సెంటర్ ఫర్ ఆక్వా (ఆర్జీసీఏ)కు పరుగులు తీస్తున్నారు. నాలుగు వారాలు తిరిగినా మేలురకం సీడ్ దొరక్క తిరుగుముఖం పడుతున్నారు. ఆక్వా రైతుల సమస్యపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు ఇటీవల రాష్ట్ర మత్స్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఏపీలో సాగయ్యే పీతలకు విదేశాల్లో డిమాండ్ సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న ఆక్వా రైతులు చేపలు, రొయ్యలతోపాటు పీతల సాగుపై కూడా ఆసక్తి చూపుతున్నారు. సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా వంటి దేశాల్లో మేలురకం పీతలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లో సాగయ్యే పీతలకు అక్కడ మంచి ఆదరణ లభిస్తోంది. కిలో పీతలను రూ.1,000 నుంచి రూ.1,200కు కొనుగోలు చేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని నరసాపురం, భీమవరం, మొగల్తూరు, రాజోలు, అంతర్వేది, కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను, మచిలీపట్నం, చల్లపల్లి, కైకలూరు, విజయనగరం జిల్లా పూసపాటిరేగ, శ్రీకాకుళం జిల్లాలోని సముద్రతీర మండలాల్లో పీతల సాగుపై రైతులు దృష్టి సారించారు. సరైన సీడ్ కోసం రెండు నెలలుగా వెతుకుతున్నారు. పీతల సాగులో మేలైనవిగా పేర్కొనే సిల్లా వలేషియా, సిల్లా సెరిటా రకం పిల్ల పీతలను కొనుగోలు చేసి చెరువుల్లో పెంచాల్సి ఉంటుంది. అయితే, ఈ రకం సీడ్ రాష్ట్రంలో ఎక్కడా దొరకడం లేదు. దీంతో తమిళనాడులోని ఆర్జీసీఏను ఆశ్ర యిస్తున్నారు. ఆ కేంద్రం నిర్వాహకులేమో నెలల తరబడి తిప్పుకుంటూ సీడ్‌ను మాత్రం అందజేయడం లేదు. దీంతో అదను దాటుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆర్జీసీఏ ఉప కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి పీతలు సాగుచేసే రైతులకు రాష్ట్రంలో సరైన శిక్షణ కరువైంది. పెద్ద చెరువులున్న బడా రైతులు ఇతర రాష్ట్రాల్లో మెలకువలు నేర్చుకొని వస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు మాత్రం సాగులో సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. ఏ ప్రాంతాల్లో ఏ రకం పీతల సాగు అనుకూలం? సీడ్‌ను ఎలా తెచ్చుకోవాలి? సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? అనే అంశాలపై పూర్తిస్థాయి అవగాహన కరువైంది. ఇటీవల పలువురు రైతులు తమ సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. రైతుల సమస్యలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన మత్స్యశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. 10 వేల హెక్టార్లలో సాగుకు అవసరమైన పిల్లపీతలను సూర్యలంక, తాళ్లపాలెం ప్రాంతాల్లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ నాయక్ చెప్పారు. ఆర్జీసీఏ ఉప కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేయించాలని ఆక్వా రంగ ప్రముఖులు సూచిస్తున్నారు. -
రొయ్యో.. మొర్రో
టంగుటూరు: వ్యాపారుల మాయాజాలంలో ఆక్వా రైతులు నలిగిపోతున్నారు. వ్యాపారులు కూటమికట్టి ధరలను నియంత్రిస్తున్నారు. మండలంలో సుమారు 5 వేల హెక్టార్లలో రొయ్యల సాగు చేస్తున్నారు. వ్యాపారులు ఏడాదికి ఒకసారి ధరలపై సీలింగ్ పెట్టి రైతులను దోచుకుంటున్నారు. ఇది ధరల సీజన్: అక్టోబర్, నవంబర్ నుంచి జనవరి వరకూ రొయ్యలకు అంతర్జాతీయంగా మంచి గిరాకీ ఉంటుంది. క్రిస్మస్, కొత్త సంవత్సరం, ముస్లిం పండుగలు ఇదే రోజుల్లో ఉండటంతో విదేశాలకు కంటైనర్ల కొద్దీ రొయ్యలు ఎగుమతవుతాయి. ఎగుమతి చేసేందుకు, కొత్తగా స్టాకు చేసుకునేందుకు వ్యాపారులు పోటీపడి రొయ్యలు కొనుగోలు చేస్తారు. వ్యాపారుల్లో పోటీతో సీలింగ్‌కు బ్రేక్ పడుతుంది. ఈ సీజన్లో రొయ్యల అమ్మకానికి వచ్చిన రైతులకు లాభాలపంట పండుతుంది. అయితే ఈసారి అందుకు విరుద్ధంగా ధరలున్నాయి. రెండు నెలల క్రితం వరకూ 30 కౌంట్ రూ.650 ఉన్న ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. 30 కౌంట్ ప్రస్తుతం రూ.500 ఉండగా, 40 కౌంట్ రూ.400, 50 కౌంట్ రూ.360 ఉంది. ఈ ధరలూ ఒకప్పుడు రైతులకు లాభాలు తెచ్చిపెట్టాయి. పెరిగిన సీడ్, ఫీడ్, విద్యుత్, ఇతర ఖర్చులతో ప్రస్తుతం ఉన్న ధరలు రైతులకు నష్టాలు మిగులుస్తున్నాయి. 30 కౌంట్ రొయ్యలు పెంచాలంటే రైతుకు రూ.500 వరకు, 40 కౌంట్ పెంచేందుకు రూ.400 వరకు ఖర్చవుతుంది. సగానికి పడిపోయిన రొయ్యల సర్వేయల్ (చెరువులో బతికిన రొయ్యలు): సీడ్లో లోపం కారణంగా చెరువులో వేసిన రొయ్యల సీడ్లో సగం కూడా బతకడం లేదు. 40 నుంచి 50 శాతం లోపే రొయ్యల సీడ్ బతికి ఉంటుంది. హేచరీల యాజమాన్యాలు లాభాపేక్షతో రైతులను మోసం చేస్తున్నారు. బ్లూడర్స్(తల్లిరొయ్య)సేకరణలో లోపంతో నాణ్యమైన సీడ్ రావడం లేదు. సీడ్లో నాణ్యత లేదని తెలిసీ రైతులకు అంటగడుతున్నారు. ఒకప్పుడు కేవలం 30 పైసలున్న సీడ్ ధరను నేడు 60 నుంచి 80 పైసలకు పెంచారు. వెనామిలో హెక్టారు చెరువుకు 2 నుంచి 5 లక్షల వరకూ సీడ్ పోస్తున్నారు. రైతులు సీడ్‌కే లక్షలో వ్యయం చేస్తున్నారు. వాతావరణంలో మార్పు, సీడ్ లోపం కారణంగా నెల రోజులకే కొన్ని చోట్ల చెరువులు దెబ్బతింటున్నాయి. దీంతో హెక్టారు చెరువులో రూ.7 నుంచి రూ.10 లక్షల వరకూ నష్టపోతున్నారు. యాంటీ బయాటిక్స్ వల్లే ధరలు పతనం: రైతులు యాంటీబయాటిక్స్ వాడకం వలన అంతర్జాతీయంగా మన రొయ్యలకు గిరాకీ తగ్గిందని, దీంతో రొయ్యల ధరలు పతనమవుతున్నాయని వ్యాపారి అల్లూరి వెంకట సత్యనారాయణరాజు అన్నారు. ఇతర దేశాలకు వెళ్లిన కొన్ని రొయ్యల లోడు కంటైనర్లు యాంటీ బయాటిక్స్ అవశేషాలున్నాయన్న కారణంగా తిరస్కరణకు గురై వెనక్కి వచ్చాయని ఆయన అన్నారు. రైతులు యాంటీ బయాటిక్స్ స్వయం నియంత్రణ ద్వారా సాధించాలని ఆయన సూచించారు. -
ఆక్వా రైతు కుదేలు
భారీస్థాయిలో చేపల మృత్యువాత వాతావరణ మార్పుతో రైతుల బెంబేలు హడావుడిగా పట్టుబడులు కలిదిండి : వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకోవటంతో చేపలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో ఆక్వా రైతులు కుదేలవుతున్నారు. రెండు రోజులుగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడి చిరు జల్లులు కురవటంతో చెరువులలో ఆక్సిజన్ తగ్గి చేపలు మృత్యువాత పడుతున్నాయి. కలిదిండి మండలంలో పెద్ద ఎత్తున చేపలు చనిపోవడంతో సాగుదారులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ప్రాంతంలో 29వేల ఎకరాల విస్తీర్ణంలో చేపల చెరువులు ఉండగా, ఈ నెల 10వ తేదీన వాతావరణ మార్పుల వల్ల 300 టన్నులు చేపలు చనిపోగా రూ.2కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. మరలా శుక్రవారం వాతావరణం చల్లబడి శనివారం ఉదయం వర్షపు జల్లులు కురవటంతో ఆక్సిజన్ లోపం వల్ల పెదలంక, పెద్దపుట్లపూడి, కొండంగి, లోడిదలంక, పోతుమర్రు, తాడినాడ, చినతాడినాడ, కోరుకొల్లు, సానారుద్రవరం, సంతోషపురం, అమరావతి, గుర్వాయిపాలెం, మూలలంక గ్రామాల్లోని చెరువుల్లో చేపలు చనిపోయి పైకి తేలాయి. అప్పారావుపేట గ్రామంలో ఒక రైతుకు చెందిన చెరువులో 3టన్నుల చేపలు చనిపోయాయి. దీంతో రైతులు అయినకాడికి అమ్ముకుందామన్న ఉద్దేశంతో హడావుడిగా పట్టుబడులు కానిచ్చేస్తున్నారు. 25 నుంచి 30 ఎకరాల్లో సుమారు 30 టన్నులు చేపలు మృత్యువాత పడ్డాయని రైతులు తెలిపారు. రూ.20లక్షల వరకు నష్టం వాటిల్లింది. అదే విధంగా వాతావరణ మార్పుల వల్ల వనామి రొయ్యలు మృత్యువాత పడటంతో రైతులు వర్షంలోనే పట్టుబడులు సాగించారు. వ్యవ ప్రయాశలకోర్చి సాగు చేస్తుంటే.. ఏటా వాతావరణ మార్పుల వల్ల తీవ్ర నష్టాలు చవిచూస్తున్నామని ఆక్వా రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. మండవల్లి మండలంలో.. ఈ ప్రాంతంలో సుమారు 12 వేల ఎకరాలలో చేపల సాగు జరుగుతోంది. ఒక్కసారిగా చేపలు మృత్యువాత పడి గట్ల వెంబడి తేలుతుతుండటంతో చేపల చెరువుల రైతులకు దిక్కుతోచడం లేదు. వివిధ మందులు చెరువులో పిచికారి చేస్తున్నప్పటికీ ఏవిధమైన ఉపయోగం లేదంటున్నారు. అమ్ముదామన్నా తగిన ధర లేదని ఆవేదన చెందుతున్నారు. -
ఆక్వా ఉక్కిరి బిక్కిరి
రొయ్యలు, చేపల రైతులకు గడ్డుకాలం వాతావరణంలో మార్పులతో అవస్థలు కరెంటు కోతలు.. తగ్గిన ధరలు పెరిగిన మేత.. సాగు వ్యయం వాతావరణ మార్పులు.. కరెంటు కోతలు.. పెరుగుతున్న మేత ధరలు.. తగ్గిన రొయ్యలు, చేపల ధరలు.. వెరసి జిల్లాలోని ఆక్వా రైతులు కుదేలవుతున్నారు. పెట్టుబడులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో సరైన ధర దక్కక రొయ్యలు, చేపల రైతులకు గడ్డుకాలం వచ్చిపడింది. ఆశ నిరాశలు, ఆటుపోట్ల నడుమ జిల్లాలోని ఆక్వారంగం ఉక్కిరిబిక్కిరి అయ్యే దుస్థితి నెలకొంది. సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో సుమారు లక్షా 50 వేల ఎకరాల్లో చేపలు, 65 వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. ఇటీవల రొయ్యలు, చేపల సాగుకు మరింత డిమాండ్ పెరగడంతో వాటి లీజులు ఎకరానికి ఏడాదికి రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు పెరిగాయి. ప్రధానంగా కృష్ణా-గోదావరి జిల్లాల్లో సుమారు ఆరు లక్షల ఎకరాలకు పైగా ఆక్వా సాగు జరుగుతున్నట్టు అంచనా. ఈ రెండు జిల్లాల్లోను ఆక్వా ఉత్పత్తులు కైకలూరు, ఏలూరు, ఆకివీడు, నారాయణపురం, భీమవరం ప్రాంతాల నుంచి రోజువారీగా 300 లారీల్లో ఎగుమతులు జరుగుతుంటాయి. చేపలు, రొయ్యల సాగుకు చెరువుల లీజులు పెరగడంతో పాటు మేత ధరలు కూడా పెరగడంతో వాటికి సరైన ధరలు రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సంక్షోభంలో చేపల సాగు... జిల్లాలో చేపల సాగు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రెండు నెలల క్రితం కిలో చేప రూ.90కి పైగా ధర పలికింది. ప్రస్తుతం చేప ధర కిలో రూ.75కి పడిపోయింది. దీంతో చేపల రైతులు నష్టాలకు గురవుతున్నారు. కిలో రూ.90 వరకు పలికిన ఫంగస్ చేపలు ఇప్పుడు సగానికి పడిపోయి కేవలం రూ.45 మాత్రమే పలుకుతున్నాయి. ఇదే సమయంలో లారీ (పది టన్నులు) తవుడు ధర రూ.1.10 లక్షలకు పెరిగింది. దీంతో చేపల రైతులు ఎకరానికి లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు నష్టపోవాల్సిన పరిస్థితి దాపురించింది. రొయ్య రైతు విలవిల.. కష్టనష్టాలు, ఆటుపోట్లతో రొయ్యల రైతులు విలవిల్లాడుతున్నారు. 40 పైసలు ఉండే రొయ్య పిల్ల ధర దారుణంగా దిగజారి ఏకంగా 8 పైసలకు పడిపోయింది. ఎకరానికి లక్ష రొయ్య పిల్లలను వేసే దశలోనే పెట్టుబడి రెట్టింపు అయ్యింది. దాదాపు నాలుగు నెలల పాటు కంటికి రెప్పలా రొయ్యలసాగు చేయడం రైతులకు కత్తిమీద సాములా మారింది. ఇదే సమయంలో రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ బ్యాలెన్స్ కోసం ఎకరానికి కనీసం రెండు సెట్లు ఏరియేటర్లు తిప్పాల్సి ఉంటుంది. దీంతో రూ.25 వేలు పలికిన ఏరియేటర్ల ధర ఇప్పుడు రూ.45 వేలకు పెరిగింది. రొయ్యల మేత ధర టన్ను రూ.75 వేలు పలుకుతోంది. టన్ను రొయ్యల ఉత్పత్తికి టన్ను మేతను వేయాల్సి రావడంతో పెట్టుబడులు రాక ఆక్వా రైతు కుదేలవుతున్నాడు. ప్రస్తుత పరిస్థితిలో రొయ్యల రైతులు టన్ను రొయ్యల ఉత్పత్తికి రూ.40 వేల వరకు అదనపు పెట్టుబడి పెట్టాల్సి రావడంతో తలకు మించిన భారం అవుతోంది. ఇంత చేసినా నష్టాల సాగు మాత్రమే మిగులుతోంది. కరెంటు కోతలతో నష్టాల వాత.. ఒకవైపు వాతావరణం రొయ్యల రైతులను కలవరపెడుతోంది. మరోవైపు కరెంటు కోతలు వారిని నష్టాలకు గురిచేస్తున్నాయి. మారుతున్న వాతావరణంతో రొయ్యలకు ఆక్సిజన్ లోపం తలెత్తుతోంది. ఉక్కపోతతో ఊపిరాడక రొయ్యలు చనిపోతున్నాయి. దీంతో ఏరియేటర్లు తిప్పేందుకు కరెంటు కోతలు ప్రధాన సమస్యగా మారాయి. దీంతో ఆయిల్ ఇంజన్ల సాయంతో ఏరియేటర్లను తిప్పడం అనదపు భారంగా మారింది. మరోవైపు ఆక్సిజన్ అందక రొయ్యలు చనిపోయే ప్రమాదం రావడంతో మధ్యలోనే వాటిని పట్టుబడి పడుతున్నారు. రొయ్యలు, చేపలను ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేద్దామంటే అవి దెబ్బతినకుండా ప్యాకింగ్ చేసేందుకు ఐస్ కొరత వచ్చిపడింది. కరెంటు కోతలతో ఐస్ ఉత్పత్తి నిలిచిపోయి, కూలీల కొరత వచ్చి ఆక్వా ఉత్పత్తులు దెబ్బతినే దుస్థితి నెలకొంది. గత రెండు నెలలతో పోల్చితే రొయ్యల ధరలు తగ్గిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రతి కౌంట్‌కు ధరలో తేడాతో రొయ్యల రైతులు దగాపడుతున్నారు. పంట చేతికొచ్చేటప్పటికి రేట్లు తగ్గుతున్నాయ్ లక్షల్లో పెట్టుబడులు పెట్టి రొయ్యలసాగు చేపడుతుంటే ధరలు ఒక్కసారిగా పడిపోవటంతో రైతులు నష్టపోతున్నారు. వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి ధరలు తగ్గిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ధరలు తగ్గిస్తున్నా రైతుల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇదే విధంగా ధరలు ఉంటే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిందే. - కట్టా గోపి, రైతు, గొల్లగూడెం, కలిదిండి మండలం కష్టాల్లో ఆక్వా రంగం ఆక్వా రంగంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సాగు చేపడుతున్నాను. వాతావరణంలో మార్పుల వల్ల ప్రతిసారి నష్టపోవలసి వస్తోంది. పంట చేతికొచ్చే సమయంలో రొయ్యల ధరలు దిగజారటంతో నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాం. టైగర్ రొయ్య ఆశలు చూపించటంతో సాగు చేపట్టి ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నాం. ప్రస్తుతం వనామిపై పెట్టుకున్న ఆశలు అడియాసలవుతున్నాయి. - ఎ.దుర్గారావు, మట్టగుంట ఆక్వా రైతు, కలిదిండి మండలం -
ఆక్వా రైతుకు కరెంటు కష్టాలు
వెంకటాచలం/తోటపల్లిగూడూరు,న్యూస్‌లైన్: విద్యుత్ సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో ఆక్వారైతులకు కంటిమీద కునుకు కరువవుతోంది. ప్రధానంగా ఆ శాఖ అధికారులు ఆక్వారంగంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎక్కువసేపు సరఫరా నిలిపివేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆక్వారైతులు తిరుగుబాటు స్వరం వినిపించి విద్యుత్ శాఖ సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో పాటు సబ్స్టేషన్ల ఎదుట ఆందోళనకు దిగుతున్నారు. వెంకటాచలం, తోటపల్లిగూడూరు మండ లాల్లో ఆక్వాసాగు విస్తారంగా సాగుతోంది. వేలాది ఎకరాల్లో వెనామీ రొయ్యలు సాగుచేస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో లక్షల సంఖ్యలో పిల్లలను పోస్తుండడంతో గుంటలో నీటి మట్టం తగ్గకుండా పర్యవేక్షించడంతో పాటు నిరంతరం ఏరియేటర్లను ఆడించాల్సిన పరిస్థితి. రైతుల అవసరాలను గమనించిన విద్యుత్ శాఖ అధికారులు 24 గంటలూ సరఫరా చేస్తామని చెప్పి డిపాజిట్లు, అడిషనల్ లోడ్ సర్‌చార్జీలు, సర్వీసు చార్జీలు అంటూ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. పలువురు రైతులు 25 కిలోవాట్ల నుంచి 100 కిలోవాట్ల సామర్ధ్యం కలిగిన ట్రాన్స్ఫార్మర్లను లక్షలాది రూపాయలు చెల్లించి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇండస్ట్రీయల్ విభాగం కింద డిపాజిట్లు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయాల్సిన అధికారులు కేవలం 4 నుంచి 5 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అది కూడా నిర్ధిష్ట సమయంలో లేకపోవడంతో ఆక్వా రైతుల అవస్థలు వర్ణణాతీతం. ఈ పరిస్థితుల్లో తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోయి రొయ్యలు మృత్యువాతపడుతున్నాయి. ఈ నష్ట నివారణకు రైతులు ఆయిల్ ఇంజన్లు, జనరేటర్లు వినియోగిస్తుండడంతో పెట్టుబడి తడిచిమోపెడవుతోంది. రేయింబవళ్లు రొయ్యలను కంటిపాపలా కాపాడుకుంటూ పెంచుతుంటే విద్యుత్ శాఖ అధికారుల తీరుతో తాము నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆక్వా రంగానికి నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని కోరుతున్నారు. -
ఆక్వా రైతులు అప్రమత్తం
= సూపర్‌సైక్లోన్‌గా ‘లెహర్’ = మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సురేష్ కైకలూరు, న్యూస్‌లైన్ : తుపాను సమయాల్లో ఆక్వా రైతులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కైకలూరు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి (ల్యాబ్) పీ సురేష్ సూచించారు. వరుస తుపానులు సంభవిస్తున్న నేపథ్యంలో ఆక్వారైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సోమవారం ఆయన న్యూస్‌లైన్‌కు వివరించారు. ఇటీవల కాలంలో నీలం, ఫై-లీన్, హెలెన్ వంటి తుపానులు ఆక్వారైతులను కోలుకోలేని దెబ్బతీయగా, తాజాగా ‘లెహర్’ తుపాను రాకాసి చుట్టుముడుతుందనే వార్తలతో ఆక్వా రైతు అల్లాడిపోతున్నారని చెప్పారు. జిల్లాలో దాదాపు 80 వేల ఎకరాల్లో చేపల చెరువులు, 40 వేల ఎకరాల్లో రొయ్యలసాగు జరుగుతుందన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో వరి రైతులతో పాటు ఆక్వారైతులు విపరీతంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రస్తుతం ముంచుకొస్తున్న లెహర్ సూపర్ సైక్లోన్‌గా మారే అవకాశం ఉందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆక్వా రైతులు ముందు జాగ్రత్తలు తీసుకుని నష్ట తీవ్రతను తగ్గించుకోవచ్చని చెప్పారు. గట్లను పటిష్ట పర్చడం.... బలహీనంగా ఉన్న గట్లను పటిష్ట పరుచుకోవడమే కాకుండా, ఇసుక బస్తాలను చెరువు వద్ద సిద్ధంగా ఉంచుకోవాలని, గట్ల వెంబడి ఉన్న బలహీనమయిన, ఎండిపోయిన చెట్లను తొలగించుకోవాలని సురేష్ సూచించారు. చెరువులో నీరు నిండుగా ఉన్నట్లుయితే అధిక వర్షం వచ్చినప్పుడు పొర్లిపోకుండా కొంతమేర నీటిని బయటకు పంపేసి మూడు అడుగుల నీరు పట్టెలా ఖాళీగా ఉంచాలన్నారు. చెరువు వద్ద జియోలైట్, సున్నం, హైడ్రోజన్ ఫెరాక్త్సెడ్ మందులు, టార్చిలైటు, డీజిల్ ఆయిల్‌ను నిల్వ చేసుకోవాలని తెలిపారు. చెరువు అడుగు భాగాన తూములను సరిచూసుకోవాలని చెప్పారు. నీటి పరీక్షలు.... చెరువు నీటిలో ఉన్న అమ్మోనియా, నైట్త్రెటు పరీక్షలు చేయించుకొని తగిన మందులు వాడితే ఆక్సిజన్ సమస్య ఉత్పన్నం కాకుండా ఉంటుందని సూచించారు. వర్షం తగ్గిన వెంట నే ఎకరాకు 15 నుంచి 20 కేజీల సున్నం వాడాలని, ఎరువులు, పేడ, కోళ్ల ఎరువు వాడకూడదని చెప్పారు. చెరువుల్లో మేతలు తగ్గించి కట్టుకోవాలని, అసలు వర్షం తగ్గే వరకు మేతలు పూర్తిగా మానివేయడం ఉత్తమమన్నారు. ప్రధానంగా ప్లాంక్టాను, పసరు అధికంగా ఉన్న చెరువుల్లో మేతలు పూర్తిగా మానివేయాలని, ఒకవేళ మేతలు కడితే అందులో విటమిన్ ‘సీ’ కలిపితే మంచిదని చెప్పారు. తడిసిన, బూజుపట్టిన మేతలను ఉపయోగించరాదు. వెనామి రొయ్యల రైతులకు సూచనలు.. తుపాను సమయంలో చెరువుల్లో పిల్ల వేయరాదని మత్స్యశాఖాధికారి సూచించారు. కౌంటుకు వస్తే వెంటనే పట్టుబడి చేయడం ఉత్తమమని తెలిపారు. వర్షం నీటిని చెరువులో పై తూము ద్వారానే బయటకు పంపాలని చెప్పారు.రొయ్యలకు ఒత్తిడి తగ్గించే అయోడిన్, బ్రోమిన్‌ను దగ్గర ఉంచుకోవాలని తెలిపారు. అవసరమైతే మత్య్సశాఖ అధికారుల సూచనలు, సలహాలు తీసుకుని పాటిస్తే కొంతమేర నష్టాలను నివారించవచ్చని చెబుతున్నారు. -
భయామీ
=వెనామీ రైతుకు కష్టకాలం =దేశంలో ప్రవేశించిన ఎర్లీ మోర్టాలిటీ సిండ్రోమ్ =ఆక్వా రైతుల ఆందోళన =రూ. 2,025 కోట్ల నష్టం ఆక్వా రైతుకు పెద్ద కష్టమే వచ్చిపడింది. ఇప్పటివరకు విదేశాలకే పరిమితమైన ఎర్లీ మోర్టాలిటీ సిండ్రోమ్ (ఈఎంఎస్) వ్యాధి మన దేశంలోని వెనామీ రొయ్యలకూ వ్యాపించింది. దీనివల్ల ఇప్పటికే 30 శాతం రొయ్యలు చనిపోయి ఆక్వా రంగానికి జరగరాని నష్టం జరిగిపోయింది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు మథనపడుతున్నారు. కైకలూరు, న్యూస్‌లైన్ : వెనామీ రొయ్యలకు నివారణ లేని ఈఎంఎస్ వ్యాధి సోకడంతో చైనా, మలేసియా, థాయ్‌లాండ్, వియత్నాం తదితర దేశాల్లో పంట విరామం ప్రకటించారు. ఈ క్రమంలో మన దేశంలో వెనామీ సాగుకు డిమాండ్ పెరిగింది. 2011-12 సంవత్సరాల్లో 91 వేల మెట్రిక్ టన్నుల వెనామీ ఉత్పత్తులు సాధించగా, 2012-13లో లక్షా 50 వేల మెట్రిక్ టన్నులకు పెరిగింది. అందులో సింహభాగం కోస్తా ప్రాంతాలైన నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో 90 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు ఎగుమతిఅవుతున్నాయి. తెల్లచేపలు, పంగాసియాస్ చేపలు సాగు చేసే రైతులు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అధిక విస్తీర్ణంలో ఈ సాగు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇటీవల కాలంలో రొయ్య మరణాలు ఎక్కువయ్యాయి. యాజమాన్య లోపాలు, తెల్లమచ్చ, విబ్రియో వంటి వ్యాధులతో టైగర్, వెనామీ రొయ్యలు చనిపోతున్నాయని రైతులు భావించారు. అనుమానం వచ్చి ఎంపెడా అధికారులు వ్యాధి సోకిన రొయ్యలను చెన్నైలోని రాజీవ్‌గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్ (ఆర్జీసీఏ)కు శాంపిల్స్ పంపారు. అక్కడినుంచి పరీక్షల నిమిత్తం అమెరికాలోని అరిజోన యూనివర్సిటీ ప్రొఫెసర్ లైట్నర్కు పంపించారు. ఆయన వాటిని పరీక్షించి ఎర్లీ మోర్టాలిటీ సిండ్రోమ్ సోకిందని నిర్ధారించి నివేదిక ఇచ్చారు. 30 శాతం మరణించాయి.. కలిదిండి, మండవల్లి, బంటుమిల్లి, నాగాయలంక, కృత్తివెన్ను మండలాలు, ఉభయగోదావరి జిల్లాల్లో ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు, నర్సాపురం, మొగ ల్తూరు, రాజోలు, ముమ్మిడివరం, అమలాపురం, కాట్రేనికోన, గుంటూరు జిల్లా రేపల్లె, నెల్లూరు జిల్లాలోని పలు మండలాల్లో ఈఎంఎస్ వ్యాధి సోకి 30 శాతం రొయ్యలు చనిపోయాయి. ఏడాదికి రూ. 6,700 కోట్ల ఆదాయానికి గాను ఇటీవలి కాలంలో రూ. 2,025 కోట్ల నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలిగా చైనాలో గుర్తింపు ఈఎంఎస్ వ్యాధిని మొదటిసారి 2009లో చైనాలోని టైగర్, వెనామీ చెరువుల్లో గుర్తించారు. పిల్ల వేసిన 30 నుంచి 40 రోజుల్లో మొత్తం మరణించాయి. సోకిన వ్యాధి ఏమిటో అర్థం కాక ఎర్లీ మోర్టాలిటీ సిండ్రోమ్ (చిన్న వయసులోనే చనిపోయే వ్యాధి)గా పేరు పెట్టారు. దీనిని సాంకేతికంగా ‘ఎక్యూట్ హెపటో పాంక్రియాటిక్ డిసీజ్’ అంటారు. 2011లో వియత్నాం, మలేసియా, 2012లో థాయ్‌లాండ్, 2013లో భారత్‌లోనూ ఈ వ్యాధి విస్తరించింది. ఇది స్వయంకృపరాధమే.. ఈ వ్యాధి వ్యాప్తి చెందడానికి పరోక్షంగా మనమే కారణమయ్యాం. వ్యాధి సోకిన వెనామీ బ్రూడు స్టాకును ఇతర దేశాల నుంచి దిగుమతి చేయవద్దని చెప్పినా కొందరు గుర్తింపులేని హేచరీలు వ్యాధిగ్రస్తమైన తల్లి రొయ్యలను దిగుమతి చేసుకున్నాయి. మన చెరువుల్లో పెంచిన తల్లిరొయ్యల నుంచి పిల్లలను పుట్టించి విక్రయించడం వల్ల ఇది మరింత వ్యాప్తి చెందింది. నీటిని శుద్ధి చేయకుండా కాల్వల ద్వారా చెరువుల్లో నింపుతున్నారు. ఇది కూడా వ్యాధి వ్యాప్తికి కారణమవుతోంది. ఎంపెడా సూచించిన హేచరీల్లో మాత్రమే వెనామీ సీడు కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలు.. = రొయ్యలు పాలిపోయి తెల్లగా మారిన కాలేయం, క్లోమంతో ఉంటాయి. = ఆహారనాళం అక్కడక్కడ లేదా పూర్తిగా ఖాళీగా ఉంటుంది. = కాలేయంలో నల్లటి గీతలు కనిపిస్తాయి. = పిల్ల వేసిన పది రోజుల నుంచి మరణాలు సంభవిస్తాయి. = కాలేయం కుచించుకుపోయి ఉంటుంది. =వ్యాధిగ్రస్త రొయ్యలు చెరువులో మునిగిపోతాయి. = చూపుడు వేలితో కాలేయాన్ని నొక్కినప్పుడు గట్టిగా ఉంటుంది. ఇలా చేయండి.. =ఈఎంఎస్ వ్యాధికి నివారణ లేదు. ముందస్తు చర్యలు తీసుకుంటే మంచిదని కైకలూరులోని మత్స్యశాఖ అభివృద్ధి అధికారి (ఆక్వా లేబొరేటరీ) పి.సురేష్ పలు సూచనలు చేశారు. =చెరువుల్లో నీటిని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలి. = చనిపోయిన రొయ్యలను ఏరివేసి గుంతలో పూడ్చి సున్నం, బ్లీచింగ్ చల్లాలి. = పట్టుబడి పట్టిన తర్వాత రెండు వారాలపాటు చెరువును ఎండగట్టాలి. = చెరువు అడుగుభాగాన మట్టిని బ్లేడుతో తొలగించి దూరంగా పడవేయాలి. = నీటిని 300 ఎంఎం సైజు మెష్‌తో వడకట్టుకోవాలి. =ఆరోగ్యవంతమైన రొయ్య పిల్లలను ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాతే వదలాలి. = రిజర్వాయర్‌ను ఏర్పాటు చేసి నీటి నిల్వ ఉంచి 10-15 రోజుల తర్వాత ఆ నీటని చెరువుల్లో నింపుకోవాలి. = నిషేధించిన రసాయనాలు, ఎరువులను వాడరాదు. = వ్యాధిగ్రస్తమైన నీటిని శుద్ధి చేసి బయటకు వదలాలి. =నీటి, మట్టి పరీక్షలు చేయించి, మత్స్యశాఖ అధికారుల సూచనలు పాటించాలి. -
వెనామీపై వ్యాధుల సునామీ!
కైకలూరు, న్యూస్‌లైన్ : ఓ సారి అతివృష్టి, మరోసారి అనావృష్టి.. ఇపుడేమో సమైక్యాంధ్ర ఉద్యమ ఫలితంగా అతలాకుతలమవుతున్న ఆక్వారైతును వ్యాధుల సునామీ భయపెడుతోంది. డెల్టాలో వరి తరువాత ప్రధాన సాగుగా వెనామీ (రొయ్యల్లో ఒక రకం) ఖ్యాతికెక్కింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ప్రారంభంలో 2 లక్షల 45 వేల 613 టన్నుల రొయ్యల ఎగుమతి జరగగా, దానిలో లక్షా 23 వేల 551 టన్నులు వెనామీ దే. ఈ సాగులో మన రాష్ట్ర వాటా దాదాపు 80 వేల టన్నులుగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 వేల ఎకరాల్లో వెనామీ సాగవుతుండగా, జిల్లాలోనే 30 వేల ఎకరాల్లో జరుగుతుంది. యాంటీ డంపింగ్, దిగుమతుల సుంకం వంటి ఒడిదొడుకులను అధిగమించి ముందుకెళుతున్న తరుణంలో వ్యాధులు భయపెడుతున్నాయని ఆక్వా రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది జనవరిలో వెనామీ దిగుబడి కోసం వాడుతున్న మందులు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని జపాన్ పరిశోధన శాస్త్రవేత్తలు కేంద్రానికి లేఖ రాయడంతో రైతులు కలత చెందారు. వెనామీని ఎక్కువగా సాగుచేసే వియత్నాం, చైనా, థాయ్‌లాండ్ తదితర దేశాల్లో భయంకరమైన ఎర్లీ మోర్టాలిటీ సిండ్రోమ్ వ్యాధి వ్యాపించడంతో దాదాపు అక్కడ ఈ సాగు తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఎగమతుల్లో సింహభాగం మన రాష్ట్రం నుంచే వెళుతున్నాయి. ప్రధానంగా ఈ సీజన్లో రొయ్యల రైతులను తెల్లమచ్చ, విబ్రియో వ్యాధులు వెంటాడుతున్నాయి. తెల్లమచ్చ వైరస్ వ్యాధి... వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్ (డబ్ల్యూఎస్‌ఎస్‌వీ) కారణంగా ఈ వ్యాధి వ్యాపిస్తోంది. రొయ్యల తలభాగం, తోక, శరీరంపై తెల్లమచ్చలు ఏర్పడటం వల్ల దీనికి తెల్లమచ్చల వ్యాధి అని పేరు వచ్చింది. వ్యాధి లక్షణాల విషయానికి వస్తే రొయ్యలు గులాబీ రంగులో ఉంటాయి. నీటిలో నిరసంగా ఈదుతూ మేతలు తినడం తగ్గిస్తాయి. ఆహార నాళం ఖాళీగా ఉండి ఎదుగుదల ఉండదు. చెక్ ట్రేలలో చూసినప్పుడు రంగుమారి మరణించిన రొయ్యలు ఎక్కువగా కనిపిస్తాయి. వ్యాధి ముదిరిన సందర్భాల్లో రోజుకు 80 నుంచి 100 రొయ్యలు చనిపోతాయి. పిల్లవేసిన 30 -45 రోజుల్లో ఈ వ్యాధి లక్షణాలు రొయ్యల చెరువుల్లో కనిపిస్తాయి. విబ్రియో వ్యాధి.... విబ్రియో బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. విబ్రియో సోకిన వెనామీ రొయ్య తలలో హెపటో, పేంక్రియా (కాలేయం, క్లోమం) ఎరుపు రంగులోకి మారతాయి. మిగిలిన శరీరం సాధారణ స్థితిలోనే ఉంటుంది. వ్యాధి లక్షణాల విషయానికొస్తే రొయ్య అంగాలు తినివేయబడి ఉంటాయి. చనిపోయిన రొయ్యలు గులాబీ, ఎరుపు రంగుల్లోకి మారి చెరువులో ఎయిరేటర్ల వల్ల నీటి పైభాగంగలో తేలుతూ ఉంటాయి. వ్యాధి సోకిన ప్రాథమిక దశలో నిత్యం కొన్ని రొయ్యలు మరణిస్తాయి. వ్యాధిగ్రస్త రొయ్యలు మందంగా తిరుగుతూ ఆహారం తీసుకోవు. పక్షులు ఎక్కువుగా రొయ్యల చెరువుపై తిరగుతూ ఉంటాయి. ముందస్తు చర్యలే ముఖ్యం పైన వివరించిన రెండు వ్యాధులు రొయ్యల సాగులో అత్యంత ప్రమాదకరమైనవని కైకలూరు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి (ఆక్వాల్యాబ్) పి.సురేష్ సూచించారు. నివారణ లేని హచ్‌ఐవీ వ్యాధి మాదిరిగా ఈ వ్యాధులు రొయ్యలకు సోకితే నివారణ లేదన్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే వ్యాధులనుంచి పంటను రక్షించుకోవచ్చని వివరించారు.