
సాక్షి, ఆకివీడు (పశ్చిమ గోదావరి జిల్లా) : నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో దారుణంగా చితికిపోయిన రొయ్యల, చేపల రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే రొయ్యల రైతులకు అండగా సముద్ర తీరానా కోల్డ్ స్టోరేజ్, ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. యూనిట్ కరెంటును రూపాయిన్నరకే అందజేస్తామని, ఆక్వా అనుబంధ పరిశ్రమలకు యూనిట్ కరెంటు ఐదు రూపాయలకే ఇస్తామని ప్రకటించారు. సీడ్ కొనుగోళ్ల నుంచి రైతు తన పంటను అమ్ముకునే దాకా మధ్యలో ఉన్న దళారీ వ్యవస్థను కూల్చేస్తామని, నిర్ణీత కాలంలోగా రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. 171వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
చెరకు రసం కాదు..తాగే నీరు..
‘‘రైతన్నలు, నా దగ్గరకు వచ్చి.. అన్నా ఇద్దరి నాయకుల గురించి చెబుతామన్నా..ఒకరు నాన్నగారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారన్నా.... విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచారన్నా.. నాన్న గారి హయాంలో ఈ నియోజకవర్గంలో 800 కోట్ల పనులు జరిగాయన్నా.. నీరు లేవంటే ప్రాజెక్టులతో ముందుడుగేశాడన్నా అని చెప్పారు. ఇంకో నేత సీఎం చంద్రబాబు నాయుడన్నా.. జిల్లాలోని 15 నియోజక వర్గాలను కట్టబెట్టమన్నా.. అయినా ఈ పెద్ద మనిషి చేసిందేమిలేదన్నా.. ఒక్కరోడ్డు వేయలేదన్నా.. మంచినీళ్లు దొరకని పరిస్థితుల్లో తాగుతున్న నీళ్లు ఇవ్వన్నా అని ఆవేదన చెందుతూ.. బాటిల్ చూపించారు. ఆ బాటిల్ చూపిస్తూ.. చెరకు రసం కాదు చంద్రబాబు గారు తాగె మంచినీళ్లు.
చుట‍్టూ నీళ్లు కనిపిస్తాయి.. తాగాడానికి గుక్కెడుండవ్..
నీటి కోసం ప్రజలు దీక్షలు చేయడానికి పోతుంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. చుట్టు నీళ్లు కనిపిస్తాయి. తాగడానికి గుక్కెడుండవ్. బోర్లు వెస్తే ఉప్పునీరు.. నీరు లేక చేపల చెరువులు సైతం రొయ్యల చెరువుగా మార్చుతున్నారు. జలాలన్ని పూర్తిగా కలుషితమయ్యాని ఎలా బతకాలన్నా అని అడుగుతున్నారు. నాన్న గారి హయాంలో పైపులైన్ల ద్వారా నీళ్లు తీసుకురావాలని దానివల్ల చెరువులు నింపాలని, ఓ స్వప్నాన్ని చూశామన్నా. ముప్పై కిలోమీట్లరు పైపు లైను నాన్నగారున్నప్పుడే జరిగింది. ప్రత్యేక పైపులైన్ల ద్వారా గ్రామాలకు కూడా వచ్చాయి. నాన్న గారి మరణాంతరం పట్టించుకునే నాదుడేలేడన్నా అని వాపోతున్నారు.
పేదలకు మూడు సెంట్ల భూమి ఇవ్వరు..
పేదలకు మూడు సెంట్ల భూమి ఇవ్వడానికి సిద్దపడరు. కానీ స్థానిక ఎమ్మెల్యేకు 350 ఎకరాలు ఇస్తారు. అది కూడా కొటిన్నర విలువ చేసే భూమిని కేవలం రూ.12.50 లక్షలకే కట్టపెడుతారు. నాలుగేళ్లలో పేదలకు ఒక్క ఇళ్లు కూడా కట్టించలేదు. కానీ చెరువులు కబ్జా చేసి మల్టీప్లెక్స్‌లు కడుతాడంటారు. వైఎస్‌ఆర్ హయాంలో వేల ఇళ్లు కట్టిస్తే.. నాలగేళ్లలో ఒక్క ఇళ్లు కూడా కట్టివ్వలేదు. మీ పాలనలో తాగు నీటికి నెలకు రూ.600 నుంచి 700 ఖర్చుపెడితే.. అన్ని వసుతులు కల్పించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిది రామరాజ్యం కాదా.
దళారీ వ్యవస్థతో మోసం..
మధ్దతు ధర లేక రైతన్నలు వరి అమ్ముకుంటున్నారు. ఆక్వా పంట చేతికొచ్చి అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కేజీ రొయ్య 460 ఉండాల్సి రెండు వందలు కూడా పలకడం లేదు. కేజీ చేపలు 110 ఉండాల్సింది 80 కూడా పలకకుండా ఇబ్బంది పడుతున్నారు. పంట చేతిరాక ముందు ధరలు బాగుంటాయని, చేతికి వచ్చిన తర్వాత వ్యాపారులు ఒక్కటై రేటు తగ్గిస్తున్నారని రైతన్నలు వాపోతున్నారు. బాబు దళారీలతో కుమ్మక్కై ఈ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు. వర్షకాలం తప్ప నీరు అందుబాటులో ఉండటం లేదు. కాలువల్లో నీరు కనబడక అవస్థలు పడుతున్నారు. రొయ్యలు, చేపలు బతికించుకోవడానికి చెరువులు తవ్వితే నీరు కలుషితమవుతున్నాయి. చేపలు, రొయ్యలు, ఉత్పత్తి లేదని, హ్యార్చరీలు పుట్టగొడుగుల్లా వెలిసాయని, నాణ్యత లేని సీడ్స్ ఇస్తున్నారని, నాణ్యత పరీక్షించుకోవడానికి వెళ్తే ప్రభుత్వ ల్యాబ్‌లు మూసేశారని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ నియంత్రణ, నాణ్యత లేకపోవడంతో రైతులు మోసపోతున్నారు.
మద్దతు ధర లేదు.. కానీ దాణ రేటు
మద్దతు ధరలేక అవస్థ పడుతుంటే రొయ్యల, చేపల దాణరేటు మాత్రం విపరీతంగా పెరుగుతుందన్నా అని వాపోతున్నారు.. సోయాబిన్, ఫిష్ ఆయిల్, నువ్వులు, ముడిపదార్థల రేటు తగ్గినా కూడా దాణా రేటు మాత్రం తగ్గడం లేదని అంటుంటే పట్టించుకునే నాదుడు లేడు. దాణా ధరలపై నియంత్రణ ఉంటే రైతులకు మేలు జరిగేది. 15 నియోజకవర్గాలు కట్టబెడితే అండగా ఉండాల్సిన బాబు నాశనం చేస్తున్నారు. కోల్డ్ స్టోరేజ్, ఫుడ్‌ప్రాసెసింగ్‌లు లేక ఇబ్బంది పడుతున్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేస్తాం..
వైఎస్‌ఆర్ హయాంలో యూనిట్ కరెంట్ రూ. 90 పైసలుంటే.. ప్రస్తుతం రూ. 3.90 పైసలు వసూలు చేస్తున్నారన్న అని ప్రజలు వాపోతున్నారు. ఆక్వా రంగంలో ఉన్నందరికి ఆ దేవుని ఆశిస్సులతో మనందరి ప్రభుత్వం అధికారంలో వస్తే.. కరెంట్ యూనిట్‌కు 1.50 ఇస్తాము. అనుబంద ఫ్యాక్టరీలు, ఐస్, ప్రాసెంసింగ్ యూనిట్‌లకు 7 రూ నుంచి 5 రూ.తగ్గిస్తామని హామీ ఇస్తున్నాను. దళారీవ్యవస్థను పూర్తిగా నియంత్రిస్తాను. అందరికీ తోడుగా ఉంటాను. కోల్డ్ స్టోరేజ్‌లో స్టోర్ చేయగలిగితే ఫుడ్‌ప్రాసెసింగ్‌లు ఉంటే ఈ పరిస్థితి రాదు. వీటిద్వారా 6నెలల వరకు నిల్వ ఉంచవచ్చు. మూడేళ్లలో వీటన్నిటిని సముద్ర తీరాన ఏర్పాటు చేసి మద్దతు ధర తీసుకొస్తాం.
ఫోన్ కొడితే మందు బాటిల్..
నాలుగేళ్ల కింద ఎన్నికల్లో బాబు చెప్పిన మాటలను గుర్తుతెచ్చుకోండి. పిల్లలు తాగి చెడిపోతున్నారు అన్నడా లేదా.. అన్నాడు..(ప్రజల సమాధానం), అధికారంలోకి వస్తూ మద్యపాన నిషేదం చేస్తానని, బెల్ట్‌షాప్‌లు లేకుండా చేస్తానని సంతకం కూడా చేశారు. మినరల్ వాటర్ ప్లాంట్ ఉన్న గ్రామం ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ బెల్ట్ షాప్ లేని ఊరు లేదు. ఈ పెద్ద మనిషి హైటెక్ పాలనలో ఫొన్ కొడితే నీటి బాటిల్ వస్తదో లేదో తెలియదు కానీ మందుబాటిల్ మాత్రం ఇంటికి వస్తుంది. బియ్యం తెచ్చుకోవడానికి రేషన్ షాప్ పోయేవాళ్లం.. బియ్యంతో చక్కెర, కందిప్పు, పామాయిల్,గోధుమ, పసుపు,కారం,చింతపండు,కిరోసిన్‌లను కేవలం రూ.155కే ఇచ్చేవారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రేషన్ షాప్ వెళ్తే బియ్యం తప్ప ఏమైనా ఇస్తున్నారా? ఈ బియ్యంలో కూడా వేలి ముద్రలు పడటం లేదని కట్ చేస్తున్నారు.
పెట్రోల్, డిజిల్ ధరల వ్యత్యాసం..
పెట్రోలు, డిజిల్‌లను మీ ట్రాక్టర్, బైక్‌లలో ఇక్కడ కొట్టించి.. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కొట్టించుకుంటే వ్యత్యాసం ఎంతో తెలుస్తోంది. ఎంత తెలుసా రూ. 7 ఎక్కువగా బాదుతున్నారు. నాలుగేళ్ల నుంచి ఇతర రాష్ట్రాల కన్నా రూ.7 ఎక్కవగా వసూలు చేస్తున్నారు. కరెంట్ చార్జీలు తగ్గిస్తానన్నారు. కానీ కరెంట్ బిల్లులు బాదుతునే ఉన్నారు. అప్పుడు 100 లోపు కరెంట్ బిల్లు వచ్చేది. ఇప్పడు 500పైగా వస్తుంది. పెనాల్టీ కట్టకుంటే కరెంట్ కట్‌చేస్తున్నారు.
ఆయన వచ్చాడు.. మీ బంగారం వచ్చిందా?
ఎన్నికల సమయంలో ఓ ప్రకటన వచ్చేది.. ఓ అక్క మెడలోని తాడును గుంజుకోపోతుంటే.. ఒకయాన వచ్చి అడ్డుకుంటాడు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మీ రుణాలు మాఫీ చేస్తాడని చెబుతాడు. మరి ఆయన వచ్చాడు మీ బంగారం వచ్చిందా. (ప్రజల నుంచి రాలేదని సమాధానం) పొదుపు సంఘాలు తీసుకొచ్చిందే తానంటారు. అక్కచెల్లెమ్మలు రుణాలు మాఫీకావాంటే బాబు కావాలని అన్నారు. అక్కమ్మ చెల్లెమ్మలకు ఒక్క రూపాయి అయినా మాఫీ అయిందా అని అడుగుతున్నా. ఆడవాళ్లకు కన్నీరు పెట్టిస్తే ఇంటికి అరిష్టం అంటారు. కానీ ఈ నాలుగేళ్లలో ఎంతమంది కన్నీళ్లు పెట్టారు. జాబు రావాలంటే బాబు రావాలి అన్నారు. మీ పిల్లలు ఏమి చదవక పోయినా ఉద్యోగం ఇస్తాం.. లేకుంటే ఉపాధి ఇస్తాం అదికాకపోతే.. రెండు వేలు ఇస్తానన్నారు. ఇలా ప్రతి ఇంటికి 96 వేలు బాకీ ఉన్నాడు. కనిపిస్తే అడగండి.
నవరత్నాలు అమలు చేస్తాం..
మనందరి ప్రభుత్వం రాగానే నవరత్నాలు తీసుకొస్తాం. నవరత్నాలతో అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపుతాం. ఎన్నికల నాటికి డ్వాక్రా మహిళలకు ఎంత అప్పుంటే అంత మొత్తాన్ని నాలుగు విడతల్లో నేరుగా చెల్లిస్తాం. అక్కా చెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాలను పునరుద్ధరిస్తాం. ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టించి ఇస్తాం. ఆ ఇళ్లను అక్కా చెల్లెమ్మల పేరిట ఇప్పిస్తాం. అవ్వా, తాతలకు రూ.2 వేల పెన్షన్ ఇస్తాం. పెన్షన్ వయస్సు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తాం. అంతేగాకుండా పశ్చిమ గోదావరి జిల్లాకు స్వాతంత్ర్య సమరయోదుడు,మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెడ్తాం’’ అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment