ఆ రొయ్యపై మనసైంది | Record FCR recorded in shrimp farming | Sakshi
Sakshi News home page

ఆ రొయ్యపై మనసైంది

Published Mon, Feb 3 2025 4:29 AM | Last Updated on Mon, Feb 3 2025 4:29 AM

Record FCR recorded in shrimp farming

రొయ్యల రైతులను ఊరిస్తున్న ఫ్లోరిడా రకం 

రికార్డు స్థాయి ఎఫ్‌సీఆర్‌ నమోదు

వనామీలో సునామీ సృష్టిస్తున్నకొత్త జెనెటికల్‌ లైన్‌  

ఆక్వా రైతులు ఫ్లోరిడా రొయ్యపై మన‘సై’ందని అంటున్నారు. మేలు రకం ఉత్పత్తిగా ఇప్పటికే మార్కెట్‌ నుంచి ప్రశంసలు అందుకుంటున్న ‘సై’ ఆక్వా రకం రొయ్యనుత­మ చెరువుల్లోనూ దింపేందుకు సైసై అంటున్నారు. వ్యాధుల తీవ్రత గణనీయంగా తగ్గడం, దిగుబడిపై నమ్మకం కుదరడంతో ఇప్పటికే పలువురు రైతులు     ఈ రకంతో లాభాలు చూస్తున్నారు. వనామీలో సుమారుగా 10కి పైగా తల్లిరొయ్యల ఉత్పత్తి సంస్థలు వారి జెనెటికల్‌లైన్స్‌ను హేచరీల ద్వారా అందిస్తున్నాయి.

జిల్లాలో ఆక్వా రైతులు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతున్నారు. సామాజిక మాధ్యమాల సాయంతో పలు రకాల సంస్థల సహకారంతో కొత్త కొత్త రకాలను పరిచయం చేసుకుంటున్నారు. వారిని మరింత ఉత్సాహ పరిచేలా వనామీలో కొత్తరకం జెనెటికల్‌ లైన్‌ ఇప్పుడు రికార్డు స్థాయిలో ఎఫ్‌పీఆర్‌ (ఫీడ్‌ కన్వర్షన్‌ రేషియో) నమోదవుతుంది. జిల్లాలో ఎక్కువ మంది రొయ్యల రైతులు ఇప్పుడు ఈ రకం రొయ్యల సాగు చేసేందుకు ఉత్సాహ పడుతున్నారు. జిల్లాలో రొయ్యల సాగు విస్తీర్ణం 4200 ఎకరాల వరకు ఉంటుంది. – పోలాకి

ఏమిటీ ‘సై’ ఆక్వా  
‘సై’ ఆక్వా అనేది ఫ్లోరిడాకు చెందిన తల్లిరొయ్యల ఉత్పత్తి సంస్థ. ఎప్పటికçప్పుడు శాస్త్రీయంగా కొత్త జెనెటిక్స్‌ ఎంపిక, ఎగ్‌ ప్రొడక్షన్, లార్వాల ఉత్పత్తి, ఉత్తమ స్థాయి ఆరో­గ్య నిర్వహణ చేసి మేలు రకం ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేస్తారు. గతంలో టైగర్‌ రొయ్యల సాగు తర్వాత ఆక్వారంగం అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంది. వనామీ రకం సాగుతో కొంత వరకు బయటపడింది. ఆ తర్వాత రొయ్యల సాగు ఇలాంటి కొత్త జెనెటికల్‌ లైన్స్‌తో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ వస్తోంది. 

వనామీలో సుమారుగా 10కి పైగా తల్లిరొయ్యల ఉత్పత్తి సంస్థలు వారి జెనెటికల్‌ లైన్స్‌ను హేచరీల ద్వారా అందిస్తున్నాయి. ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆ ఉత్పత్తుల వాడకం జరుగుతుంది. మూడేళ్ల కిందటే జిల్లా పరిచయమైన సై ఆక్వా బ్యాలెన్స్‌ లైన్‌ రికార్డు స్థాయిలో విజయవంతమైంది.  

బ్యాలెన్స్‌ లైన్‌ ప్రత్యేకత  
అందుబాటులో ఉన్న జెనెటికల్‌ లైన్స్‌తో పోల్చితే తక్కువ కాలంలో ఎక్కువ పెరుగుదల కనబరుస్తూ, వ్యాధు­లను తట్టుకుంటూ, చక్కటి ఎఫ్‌సీఆర్‌ నమోదు కావటం దీని ప్రత్యేకత. ఆక్వా సాగులో మేత వినియోగం కీలకం. సగానికిపైగా పెట్టుబడి ఫీడింగ్‌ కోసం వెచ్చిస్తారు. 

సాధారణంగా 1కిలో రొయ్యల ఉత్పత్తికి 1.1కిలో నుంచి 1.3కిలో వరకు మేత వినియోగం జరిగితే రొయ్యలసాగు లాభ దాయకం అనుకోవచ్చు. సై ఆక్వా సాగు చేస్తున్న రైతులు ఇప్పుడు ఇదే ఎఫ్‌సీఆర్‌లో రొయ్యల ఉత్పత్తి చేస్తున్నారు. గతంలో 1.5కు పైగా ఎఫ్‌సీఆర్‌ నమోదైన సందర్భాలు కూడా ఉన్నాయి.  

బ్రూడ్‌ స్టాక్‌ దిగుమతి పెంచుతున్నాం 
ఇండియన్‌ కోస్ట్‌లో మా బ్యాలెన్స్‌ జెనెటికల్‌ లైన్‌ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, బ్రూడ్‌స్టాక్‌(తల్లి రొయ్య) దిగుమతులు పెంచేందుకు ప్రతిపాదనలు చేశాం. రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి సాంకేతికంగా మరింత ముందకు తీసుకెళ్లేందుకు కృషిచేస్తాం. – జి.విద్యాధరరావు, టెక్నికల్‌ సేల్స్‌ మేనేజర్, సైఆక్వా  

రెండేళ్లుగా సాగు చేస్తున్నాం 
రెండేళ్లుగా ఈ రకం పీఎల్‌ను మేము సాగు చేస్తున్నాం. కొత్త జెనెటికల్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత పాతకాలపు వ్యాధుల తీవ్రత బాగా తగ్గింది. బ్యాలెన్స్‌లైన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత వైట్‌ గట్, రన్నింగ్‌ మోరా్టలిటీ వంటి వ్యాధుల తీవ్రత తగ్గింది.   – చింతు అప్పన్న, ఆక్వా రైతు, బెలమర  

డిమాండ్‌ ఉంది 
ఇటీవల కాలంలో రైతుల నుంచి సై ఆక్వా బ్యాలెన్స్‌ లైన్‌ రకం రొయ్య పిల్లలకు డిమాండ్‌ పెరిగింది. అందుకు తగ్గస్థాయిలో మేము కూడా సిద్ధం చేసుకోవాల్సి వస్తోంది. కొన్నిసార్లు అడ్వాన్స్‌ బుకింగ్‌ లేకపోతే పీఎల్‌(పోస్ట్‌ లార్వా) అందించలేకపోతున్నాం.  – ఎన్‌.కల్యాణ చక్రవర్తి, రమా స్రింప్‌ హేచరీస్, తోనంగి, గార  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement