Shrimp farming
-
రొయ్యల కోసం ఆక్వారోబో
సాక్షి, అమరావతి: అత్యాధునిక సాంకేతిక పరిజా్ఞనాన్ని అందిపుచ్చుకున్న ఓ ఆక్వా రైతు రొయ్యల పెంపకంలో రోబోను వినియోగిస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని చినఅమిరం గ్రామానికి చెందిన వత్సవాయి లక్ష్మీకుమార్‌రాజు మద్రాస్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. కొంతకాలం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన ఆయన ఆ కొలువును వదిలి రొయ్యల సాగు చేపట్టారు. కృష్ణా జిల్లా నందివాడ మండలం అరిపిరాల గ్రామంలో దాదాపు 700 ఎకరాల్లో రొయ్యలను పెంచుతున్నారు. వాటికి ఆహారం అందించేందుకు ఆక్వా రోబో (బాట్)ను తయారు చేయించుకుని వినియోగిస్తున్నారు. ఇది సౌర విద్యుత్ తానే తయారు చేసుకుని పని చేస్తుంది. విద్యుత్ ఆదా కోసం అనేక సాంకేతిక విధానాలను, పరికరాలను వాడుతున్నారు. ఈ మొత్తం వ్యవస్థను ఒక ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా అరచేతిలోనే నడిపిస్తున్నారు. ఆక్వా రంగంలో భారతదేశంలోనే తొలి రోబో ఇదే కావడం విశేషం. కూలీల అవసరం లేకుండానే..: చెరువులోని రొయ్యలకు మనుషులే ఆహారం (ఫీడింగ్) అందించడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అది అనేక ఇబ్బందులతో కూడుకోవడంతో పాటు ఆహారం సకాలంలో అందేది కాదు. దీంతో మార్కెట్లో ఆటోమేటిక్ ఫీడర్ల కోసం వెతికారు. కానీ.. అవి కూడా ఒకేచోట ఫీడింగ్ చేసేవి. దానివల్ల రొయ్యలన్నిటికీ ఆహారం సమానంగా అందేది కాదు. దీంతో చెరువు మొత్తం తిరిగేలా యంత్రాన్ని తయారు చేస్తే బాగుంటుందనే ఆలోచనకు వచ్చారు లక్ష్మీకుమార్‌రాజు. నెక్ట్ ఆక్వా సంస్థతో తన ఆలోచనను పంచుకున్నారు. ఆ సంస్థ ఐఐటీ గ్రాడ్యుయేట్లతో ఏర్పాటైంది. వారికి ఈ ఆలోచన నచ్చి నాలుగేళ్ల పాటు అరిపిరాలలోనే ఉండి పరిశోధన చేశారు. రకరకాల ప్రయత్నాల తరువాత చివరకు మూవింగ్ రోబోను తయారు చేశారు. చెరువులో తాడుతో (గైడెడ్) లైన్లా కట్టి దాని సాయంతో రెండేళ్లుగా ఈ రోబోను నడుపుతున్నారు. దీని ఆపరేటింగ్ మొత్తం మొబైల్‌తోనే జరుగుతుంది. ఎన్ని కేజీల ఆహారం.. ఏ సమయంలో.. ఎన్నిసార్లు అందించాలనేది ముందుగానే ప్రోగ్రా>మింగ్ చేసుకోవచ్చు. దాని ప్రకారం కచ్చితంగా అంతే ఆహారాన్ని ఆయా సమయాల్లో ఈ రోబో రొయ్యలకు అందిస్తుంది. ముఖ్యంగా ఈ రోబోకి అవసరమైన విద్యుత్‌ను దానిపైనే అమర్చిన సౌర పలకల ద్వారా తానే తయారు చేసుకుంటుంది. క్షణక్షణం.. అప్రమత్తం కరెంట్ ట్రాన్స్ఫార్మర్ (సీటీ) లేదా పవర్ మోనిటర్ (బ్లాక్ బాక్స్)అనే పరికరంతో విద్యుత్ సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. ఇది ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ కంట్రోలర్‌గా పనిచేస్తూ విద్యుత్ నష్టాలను, విద్యుత్ బిల్లులను తగ్గిస్తుంది. ఎన్ని ఏరియేటర్స్ (రొయ్యలకు ఆక్సిజన్ అందించే పరికరాలు) పని చేస్తున్నాయనేది నిరంతరం చూస్తుంటుంది. ఏరియేటర్స్ ఆగితే వెంటనే చెబుతుంది. మూడు మొబైల్ నంబర్లకు ఫోన్ అలర్ట్ వెళ్లిపోతుంది. నిజానికి ప్రతి పరిశ్రమలో ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ కంట్రోలర్స్ వాడుతుంటారు. వీటిని ఆక్వాలో వాడటం అనేది చాలా అరుదు. మోటార్లు ఆగిపోతే వెంటనే సరిచేసి ఆన్ చేయాలి. లేదంటే రొయ్యలు చనిపోతాయి. ఇందుకోసం రైతులు రాత్రివేళల్లో చెరువుల వద్ద కాపలాగా పడుకోవాల్సి వస్తోంది. అలాంటి సమయంలో విద్యుత్ ప్రమాదాల బారినపడి రైతులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు జరుగుతున్నాయి. ఈ సమస్యలను పవర్ మోనిటర్ తీరుస్తోంది. ఎన్ని ఏరియేటర్స్ ఆన్ చేస్తే అన్నే కెపాసిటర్లు ఆన్ అయ్యేలా చూస్తుంది. అవి ఆగిపోతే కెపాసిటర్లను ఆపేస్తుంది. జనరేటర్ పనితీరును కూడా ఇది పర్యవేక్షిస్తుంది. దీనివల్ల డీజిల్ దొంగతనాన్ని అరికట్టవచ్చు. స్మార్ట్ స్టార్టర్ కంట్రోలర్ అనే పరికరం ద్వారా మొబైల్‌తోనే ఏరియేటర్స్ని ఆన్ చేయవచ్చు. అవి ఎంతసేపు పనిచేయాలనేది ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. సాంకేతిక సమస్య ఏదైనా ఏర్పడితే మొబైల్‌కి సమాచారం వచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల మోటారు కాలిపోకుండా కాపాడుతుంది. విద్యుత్ బిల్లులు ఆదా విద్యుత్ వ్యవస్థకు సాంకేతికతను జోడించి మా చెరువుల్లో వినియోగిస్తున్నాం. పర్యావరణ హితం కోరి 15 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను వాడుతున్నాం. పవర్ మాంక్స్ సాఫ్ట్వేర్ ద్వారా చెరువుల మొత్తం ఎంత విద్యుత్ వినియోగం జరుగుతోంది, సరఫరా ఎలా ఉంది, ఎక్కడైనా సాంకేతిక, భౌతిక ఇబ్బందులు ఉన్నాయా అనేది రియల్ టైమ్ (ఎప్పటికప్పుడు) సమాచారాన్ని టీవీ (మోనిటర్)లో కనిపించేలా సెన్సార్లు ఏర్పాటు చేశాం. దీనివల్ల 95 శాతం కంటే ఎక్కువగా విద్యుత్ వినియోగం సక్రమంగా జరుగుతోంది. ప్రతి 100 కేవీ ట్రాన్స్ఫార్మర్పై నెలకు కనీసం రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ విద్యుత్ ఆదా అవుతోంది. – వత్సవాయి లక్ష్మీకుమార్‌రాజు, ఆక్వా రైతు -
అర్బన్ రొయ్యల చెరువు!
వాడేసిన కార్గో కంటెయినర్లలో లెట్యూస్ వంటి ఆకు కూరలు, కూరగాయలను హైడ్రోపోనిక్స్ లేదా ఆక్వాపోనిక్స్ పద్ధతుల్లో, మట్టి వాడకుండా కేవలం పోషక జలంతో సాగు చేసే అర్బన్ ఫార్మర్స్ చాలా దేశాల్లో ఉన్నారు. అయితే, నగరాల్లో ఆకాశ హర్మ్యాల మధ్య ఐరన్ కంటెయినర్లలో మంచినీటి రొయ్యల సాగు చేయటం.. అందులోనూ పర్యావరణానికి హాని కలిగించని కాలుష్య రహిత సుస్థిర అర్బన్ ఆక్వా సాగు పద్ధతులను అనుసరించడం సుసాధ్యమేనని రుజువు చేస్తోంది ‘అతర్రాయ’ అనే సంస్థ. కొద్దిపాటి శిక్షణతోనే కాలుష్య రహిత పద్ధతిలో కంటెయినర్ రొయ్యల సాగును సులువుగా నేర్పిస్తోంది ఈ సంస్థ. కంటెయినర్లో బయోఫ్లాక్ పద్ధతిలో రొయ్యల సాగు చేసే ‘ష్రింప్ బాక్స్’ సాంకేతికతపై పేటెంట్ పొందిన ఈ సంస్థ మెక్సికో కేంద్రంగా పనిచేస్తోంది. సాధారణ పద్ధతుల్లో సాగే రొయ్యల సాగులో యాంటీబయోటిక్స్, రసాయనాలు, గ్రోత్ హోర్మోన్స్ వాడుతున్నారు. వ్యర్థ జలాలతో సముద్రం కలుషితమవుతోంది. ‘మేం ఈ సమస్యలేవీ లేకుండా ఎథికల్ ఆక్వాకల్చర్ పద్ధతిలో ఎక్కడ కావాలంటే అక్కడే కంటెయినర్లో సులభంగా రొయ్యలు సాగు చేసే అత్యాధునిక సాంకేతికతను ప్రపంచంలో తొలిగా అందుబాటులోకి తెచ్చామ’ని అతర్రాయ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి డేనియల్ రసెక్ అంటున్నారు. రసెక్ మెక్సికోలో కాలేజీ విద్యను పూర్తి చేసుకొని 2005లో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి మత్స్యకారుల జీవితాలను మెరుగుపరచేందుకు కృషి చేశారు. ఆక్వాకల్చర్‌ను సుస్థిర సేద్య పద్ధతులపై పనిచేయడానికి ఓ స్టార్టప్ సంస్థను స్థాపించారు. ‘మెక్సికో ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటుతో విస్తారమైన చెరువుల్లో సాగు పరిస్థితులను మెరుగుపరచడంతో పాటు అతి తక్కువ చోటులో తక్కువ కాలుష్యం కలిగించే సుస్థిర సాగు పద్ధతులపై అధ్యయనం చేపట్టాం. 2019లో ఇతర వనరుల నుంచి ఆర్థిక సహాయం అందిన తర్వాత సాఫ్ట్వేర్, ఆటోమేషన్ ఉపకరణాలను కూడా సమకూర్చుకొని పర్యావరణానికి, ప్రజారోగ్యానికి నష్టం కలిగించని ఆరోగ్యదాయకమైన రీతిలో రొయ్యల సాగు చేపట్టే సమగ్ర అత్యాధునిక సాంకేతికతకు తుదిమెరుగులు దిద్దాం’ అని రసెల్ చెబుతున్నారు. కంటెయినర్ రొయ్యల సాగులో మూడు సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు. బయోఫ్లాక్.. రొయ్యలకు వ్యాధులు సోకకుండా ఉండే వాతావరణాన్ని కల్పిస్తుంది. అందువల్ల యాంటీబయోటిక్స్ లేదా హానికరమైన రసాయనాల అవసరమే రాదు. ఈ ష్రింప్ బాక్స్‌లో అన్ని పనులనూ సాఫ్ట్వేర్ ద్వారా ఎక్కడి నుంచైనా నియంత్రించుకునే అవకాశం ఉంది. నీటి నాణ్యత, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయి, రొయ్యల ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు గమనిస్తూ గణాంకాలను అందించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. కృత్రిమ మేధను ఉపయోగించి మేతను ఎక్కడి నుంచైనా అందించే సాంకేతికతను జోడించటం విశేషం. డేటాను బట్టి వర్క్‌ఫ్లో మాపింగ్ చేశారు. కాబట్టి, కంటెయినర్లో రొయ్యల సాగులో ఎవరికైనా అతి సులభంగా శిక్షణ ఇవ్వటం సాధ్యమవుతోంది. ఎలా పండించారో తెలియని, ఎప్పుడో పట్టుకుని నిల్వ చేసిన రొయ్యలను నగరవాసులు తినాల్సిన అవసరం లేదు. తమ ‘ష్రింప్ బాక్స్’ను నగరం నడిబొడ్డునైనా ఏర్పాటు చేసుకొని రొయ్యలను పెంచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాజాగా ఆరోగ్యదాయకమైన రొయ్యలను ఆరగించవచ్చు అంటున్నారు రసెక్. కంటెయినర్లో 1.5 టన్నుల రొయ్యలు అత్యాధునిక రొయ్యల చెరువుగా మేము రూపుదిద్దిన కార్గో కంటెయినర్ విస్తీర్ణం 50 చదరపు మీటర్లు. దీనిలో ఏటా 1.5 టన్నుల రొయ్యలను ఉత్పత్తి చేస్తున్నాం. సాధారణ చెరువుల్లో ఇన్ని రొయ్యలు పెంచాలంటే కనీసం రెండు హెక్టార్ల భూమి కావాలి. తక్కువ వనరులతో, తక్కువ ఖర్చుతోనే రొయ్యలను పెంచడానికి ‘ష్రింప్ బాక్స్’ ఉపయోగపడుతోంది. 70% పనులు ఆటోమేటిక్‌గా జరుగుతాయి. ‘ష్రింప్ బాక్స్’లో రొయ్యలు పెంచడానికి డాక్టరేట్ ఏమీ అక్కర్లేదు. 2–4 వారాల శిక్షణతో ఎవరైనా రొయ్యల రైతుగా మారొచ్చు. అమెరికా, ఐరోపా దేశాల్లో వ్యాపార విస్తరణే మా లక్ష్యం. – డేనియెల్ రసెక్, ‘ష్రింప్ బాక్స్’ ఆవిష్కర్త, మెక్సికో – పంతంగి రాంబాబు prambabu.35@gmail.com -
రొయ్యల మార్కెట్‌ను కుదిపేస్తున్న ‘ఈక్వెడార్’
ఆకివీడు: ఈక్వెడార్.. ఓ బుల్లి దేశం. అంతర్జాతీయంగా రొయ్యల మార్కెట్‌కు పెద్ద దెబ్బే కొట్టింది. మొత్తం ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. నాణ్యతతో కూడిన రొయ్యలను తక్కువ ధరకు ఎగుమతి చేస్తుండటంతో ఇతర దేశాల రొయ్యల ధరలు పడిపోయాయి. ఈ ప్రభావం రాష్ట్రంలోని రొయ్యల ఎగుమతులపైనా పడింది. ధరలు తగ్గిపోయి, రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా రొయ్యల ఉత్పత్తి 5049.5 మెట్రిక్ టన్నులు. ఇందులో ఇండియా వాటా 700 మెట్రిక్ టన్నులు.మన దేశం నుంచి ప్రాసెసింగ్ జరిగిన రొయ్యలు అమెరికా, చైనా, జపాన్, బంగ్లాదేశ్ దేశాలకు ఎగుమతి అవుతాయి. ఆ దేశాల్లో ప్యాకింగ్ చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇటీవలి కాలంలో రొయ్యల సాగులో ఈక్వెడార్ తారాజువ్వలా దూసుకొచ్చింది. గత ఆరు నెలల్లో ఏకంగా 1,150 మెట్రిక్ టన్నుల రొయ్యలు ఉత్పత్తి చేసింది. దీనిలో 1,010 మెట్రిక్ టన్నులు వనామి, మిగిలినవి టైగర్ రొయ్య. 2021లో ఈక్వెడార్ ఉత్పత్తులు 1,010 మెట్రిక్ టన్నులు మాత్రమే. అయితే, గత ఆరు నెలల్లోనే అక్కడ అంతకు మించి రొయ్యల ఉత్పత్తి జరిగింది. పైగా, ఈక్వెడార్‌లో వేగంగా యాంత్రీకరణ జరిగి, రొయ్యల ఉత్పత్తి వ్యయం బాగా తగ్గింది. ఎకరాకు 50 వేల పిల్లలను మాత్రమే పెంపకానికి వినియోగిస్తారు. ఎగుమతుల ఖర్చు తక్కువ. ఆరు నెలల్లోనే కౌంట్‌కు వస్తున్నాయి. ఈక్వెడార్‌లో తల్లి రొయ్య నుంచి 3 నుంచి 5 సార్లు మాత్రమే సీడ్ తీస్తారు. దీంతో నాణ్యమైన సీడ్ రైతులకు లభిస్తుంది. ఇది వైరస్లు, వ్యాధులను తట్టుకుంటుంది. దీంతో ఉత్పత్తి నాణ్యత ఎక్కువగా ఉంది. మన దేశంలో తల్లి రొయ్య నుంచి 10 నుంచి 15 సార్లు సీడ్ తీస్తున్నారు. దీంతో నాసిరకం, ఇమ్యూనిటీ లేని రొయ్య సీడ్ వస్తోంది. దీనినే పెంపకందారులకు సరఫరా చేస్తున్నారు. ఇటువంటి రొయ్యలు వ్యాధులు, వైట్‌గట్ తదితర వైరస్ల బారిన పడుతున్నాయి. 30, 40, 50 కౌంట్ రొయ్యల పెంపకానికి మన దేశంలో.. ముఖ్యంగా డెల్టా ప్రాంతాల్లో రూ.250 పైబడి ఖర్చవుతుంది. దీంతో పోలిస్తే ఈక్వెడార్‌లో అన్ని కౌంట్ రొయ్యలు రూ.100 తక్కువకు లభిస్తున్నాయి. దీంతో మన దేశం రొయ్యలకు ఆర్డర్లు తగ్గిపోయాయి. చైనా, అమెరికా దేశాల నుంచి ఆర్డర్లు రావడంలేదని బయ్యర్లు వాపోతున్నారు. మంచి ధర లభించేలా ప్రభుత్వ చర్యలు.. రొయ్య రైతులను ఆదుకునేందుకు గత రెండు నెలలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. రొయ్య ధరలు తగ్గకుండా చూసేందుకు ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ యూనిట్ యజమానులతో సంప్రదింపులు జరిపేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన సాధికార కమిటీని నియమించింది. నిపుణుల కమిటీని వేసి పరిశీలన జరుపుతోంది. సాధికార కమిటీ నిత్యం రొయ్యల మార్కెట్‌ను సమీక్షిస్తోంది. ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతి సంస్థలు, సీడ్, ఫీడ్ ఉత్పత్తిదారులతో సంప్రదింపులు జరుపుతోంది. మేత ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా నాణ్యమైన రొయ్య ఉత్పత్తికి చర్యలు తీసుకుంది. దీనివల్ల కొద్ది రోజుల్లోనే మన రాష్ట్రంలోని రొయ్యలకు కూడా మంచి డిమాండ్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అక్కడ ఉత్పత్తి వ్యయం తక్కువ.. నాణ్యత ఎక్కువ అంతర్జాతీయ రొయ్యల మార్కెట్లో ఈక్వెడార్ విపరీతంగా పోటీనిస్తోంది. అక్కడ ఉత్పత్తి వ్యయం తక్కువ. నాణ్యత ఎక్కువ. పోటీని తట్టుకునేందుకు మన దేశంలో నాణ్యమైన రొయ్య సీడు రైతులకు అందజేయాలి. మేత, మందుల ధరలను నియంత్రించాలి. ఉత్పత్తి వ్యయం బాగా తగ్గాలి. ఆధునిక పద్ధతులు వినియోగించాలి. ప్రభుత్వ సబ్సిడీలు కొనసాగించాలి. ఆక్వా రైతులకు తర్ఫీదు ఇవ్వాలి. ఈ ఏడాది చివరి నాటికి ఈక్వెడార్ ఉత్పత్తులు రెండువేల మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని అంచనా. అప్పటికల్లా మనమూ పోటీని తట్టుకొని నిలబడగలగాలి. – గోవిందరావు, ఆక్వా కన్సల్టెంట్, ఆకివీడు, పశ్చిమగోదావరి జిల్లా ఒడుదుడుకులు తాత్కాలికమే ఆక్వా మార్కెట్లో ఒడుదుడుకులు తాత్కాలికమే. రొయ్య ధరలు తగ్గకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంది. మంత్రుల కమిటీ, నిపుణుల కమిటీలను వేసి పరిశీలన చేస్తోంది. ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులతో సంప్రదింపులు జరుపుతోంది. త్వరలోనే రొయ్యలకు మంచి ధర లభిస్తుంది. –కేఎస్వీ నాగ లింగాచారి, జిల్లా మత్స్య శాఖ, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా -
AP: రొయ్య రైతుకు బాసట
సాక్షి, అమరావతి: ఆక్వా ఫీడ్ ధరలను ఇష్టారీతిన పెంచడం, రొయ్యల కౌంట్ ధరలను తగ్గించడంపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆక్వా ఫీడ్ తయారీ కంపెనీలు, ప్రాసెసర్లు దిగి వచ్చారు. పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను పూర్తిగా ఉపసంహరించుకోవడంతో పాటు రొయ్యల కౌంట్ ధరలను పెంచేందుకు అంగీకరించారు. గురువారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో జరిగిన ఆక్వా సాధికార కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 17 నుంచి దీనిని అమలు చేస్తామని ప్రకటించారు. రొయ్యల ఫీడ్ ధరలు ఇష్టానుసారం పెంచుతున్నారని, కౌంట్ ధరలు తగ్గిస్తున్నారంటూ ఆక్వా రైతులు ఫిర్యాదు చేయడంతో, ఈ వ్యవహారంపై సీఎం వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం నేతృత్వంలో సాధికార కమిటీని ఏర్పాటు చేశారు. బుధవారం జరిగిన కమిటీ తొలిభేటీలో మంత్రుల ఆదేశాల మేరకు ఆక్వా రైతులు, ఫీడ్ తయారీదారులు, ప్రాసెసర్లతో గురువారం సాయంత్రం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రి అప్పలరాజు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం, స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, కమిషనర్ కె.కన్నబాబు పాల్గొన్నారు. రైతులు, ఫీడ్ కంపెనీలు, ప్రాసెసర్ల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. రైతులకు నష్టం కలిగించే చర్యలొద్దు ఆక్వా రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి నష్టం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని మంత్రి అప్పలరాజు స్పష్టంచేశారు. ప్రభుత్వం, రైతులతో చర్చించకుండా ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచినా, కౌంట్ ధరలు తగ్గించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. పెంచిన ఫీడ్ ధరలు తగ్గించాలని, కౌంట్ ధరలను పెంచాలని ఆదేశించారు. స్టేక్ హోల్డర్స్, ఎగుమతిదారులు, ప్రాసెసరల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. లాజిస్టిక్స్ సమస్యలేమైనా ఉంటే చెప్పాలని సూచించారు. ముడి సరుకుల ధరలు పెరగడం వల్లే ఫీడ్ ధరలు పెంచాల్సి వచ్చిందని వారు కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. సోయాబీన్, ఫిష్ ఆయిల్, ఇతర ముడిసరుకుల ధరలు గతంతో పోలిస్తే ఇప్పుడు తగ్గాయని, ఈ సమయంలో పెంచిన ధరలు ఎందుకు కొనసాగిస్తున్నారని అప్సడా వైస్ చైర్మన్ రఘురాం ప్రశ్నించారు. పెంచిన ఫీడ్ ధరలను తగ్గించాలని కమిటీ ఆదేశించింది. దీంతో నెల క్రితం టన్నుకి రూ.2,600 చొప్పున పెంచిన ఫీడ్ ధరను ఉపసంహరించుకునేందుకు తయారీదారులు అంగీకరించారు. కౌంట్‌కు రూ.55 వరకు పెంపునకు ప్రాసెసర్లు అంగీకారం రొయ్యల కౌంట్ ధరలు అనూహ్యంగా తగ్గించడంపైనా సమావేశంలో చర్చించారు. రూ.270 నుంచి రూ. 280 ఉన్న 100 కౌంట్ «ధరను రూ.200కు, రూ.420కు పైగా ఉన్న 30 కౌంట్ ధరను రూ.380కు తగ్గించారు. మిగిలిన కౌంట్ ధరలను కూడా రూ.30 నుంచి రూ.80 వరకు తగ్గించారు. ఈ విషయం సీఏం దృష్టికి వెళ్లడం, ఆయన ఆదేశాలతో సాధికార కమిటీ ఏర్పాటు చేయడంతో కౌంట్‌కు రూ.20 నుంచి రూ.35 వరకు పెంచారు. ఈ ధరలు ఏమాత్రం లాభసాటి కాదని రైతులు స్పష్టంచేసారు. అంతర్జాతీయంగా ధరలు నిలకడగా ఉన్నప్పుడు ఇక్కడ ఏ విధంగా తగ్గిస్తారని, తక్షణం పెంచాల్సిందేనని మంత్రి, అప్సడా వైస్ చైర్మన్లు ఆదేశించారు. దీంతో సీఎం జోక్యం చేసుకోడానికి ముందు ఉన్న ధరలతో పోలిస్తే కౌంట్‌కు రూ.40 నుంచి రూ.55 మేర పెంచేందుకు ప్రాసెసర్లు అంగీకరించారు. ఫీడ్ ధరల తగ్గింపు, కౌంట్ ధరల పెంపును 17వ తేదీ నుంచి అమలు చేస్తామని తెలిపారు. ఈ ధరల వివరాలను అన్ని ఆర్బీకేల్లో ప్రదర్శించాలని, ఇవే ధరలు 24వ తేదీ వరకు కొనసాగించాలని మంత్రి సూచించారు. ఇకపై ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తర్వాతే ధరలపై నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. -
ఇక చేపలతో పాటు రొయ్యలు!
సాక్షి, అమరావతి: సహజ మత్స్య సంపదను వృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంచినీటి వనరుల్లో పెద్ద ఎత్తున చేప పిల్లలను వదలగా.. ఈ ఏడాది తొలిసారి రొయ్య పిల్లలనూ వదిలింది. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీరప్రాంతం ఉండగా, 5 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. రాష్ట్రంలో పెద్ద రిజర్వాయర్ల విస్తీర్ణం 3.10 లక్షల ఎకరాలు కాగా, చిన్న, మధ్య తరహా రిజర్వాయర్ల విస్తీర్ణం మరో 4.02 లక్షల ఎకరాలుగా ఉంది. మత్స్య సాగుకు అనువైన మైదాన ప్రాంతంలో 11 శాతంలో ఆక్వా కల్చర్ ఉండగా, మరో 11 శాతం విస్తీర్ణంలో పంచాయతీ, మైనర్ ఇరిగేషన్ చెరువులున్నాయి. ఇక రిజర్వాయర్ ప్రాంతం 9% ఉండగా, నదులు, కాలువలు 63 శాతం మేర విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం 1.86 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద రిజర్వాయర్లు, 402 ఎకరాల్లో చిన్న, మధ్య తరహా రిజర్వాయర్లలో మాత్రమే చేపల పెంపకం సాగుతోంది. వీటిలో మత్స్య దిగుబడులు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతో పట్టుబడి ద్వారా 2018–19లో 13.42 లక్షల టన్నుల దిగుబడి రాగా, 2019–20లో 15.91 లక్షల టన్నులు, 2020–21లో 18.46 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. గతేడాది పశ్చిమ గోదావరి జిల్లాలో 5,88 లక్షల టన్నులు, నెల్లూరులో 3.06 లక్షల టన్నులు, తూర్పుగోదావరి జిల్లాలో 1.96 లక్షల టన్నులు, విశాఖలో 1.77 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు పట్టుబడి చేయగలిగారు. ఇలా సహజ సిద్ధంగా పెరిగే మత్స్య ఉత్పత్తుల దిగుబడులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధాన రిజర్వాయర్లలోకి 6.66 లక్షల రొయ్య పిల్లలు ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 35 రిజర్వాయర్లలో 2.08 కోట్ల చేప పిల్లల(బొచ్చెలు, ఎర్రమోసు, శీలావతి)ను వదిలారు. అత్యధికంగా వెలుగొండ రిజర్వాయర్‌లో 29 లక్షలు, గోదావరి బ్యారేజ్‌లో 15.25 లక్షలు, ఏలేరు రిజర్వాయర్‌లో 14.39 లక్షలు, ఆరానియార్ రిజర్వాయర్‌లో 12 లక్షలు, వెలిగాలు, పేరూరు రిజర్వాయర్లలో 11.45 లక్షలు, నాగార్జున సాగర్, ప్రకాశం రిజర్వాయర్లలో 10 లక్షల చొప్పున చేప పిల్లలను వదిలారు. ఇక తొలిసారి 5.66 లక్షల వెనామియా జాతికి చెందిన రొయ్య పిల్లలను ప్రధాన రిజర్వాయర్లలో వదిలారు. శ్రీకాకుళం జిల్లాలో 51,450, విజయనగరం జిల్లాలో 1,80,180, విశాఖలో 1,20,120, తూర్పుగోదావరిలో 83,400, ప్రకాశం జిల్లాలో 1.31 లక్షల చొప్పున రొయ్య పిల్లలను వదిలారు. వీటి కోసం ఇప్పటి వరకూ కోటిన్నర వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. -
'రొయ్య'లసీమ
ప్రొద్దుటూరు: రాళ్లురప్పలతో కరువు ప్రాంతాన్ని తలపించే రాయలసీమ.. నేడు రొయ్యలు, చేపలు వంటి మత్స్యసంపదతో కళకళలాడుతోంది. వైఎస్సార్ జిల్లా చాపాడు మండలమైతే చేపల చెరువులతో కోనసీమను తలపిస్తోంది. ఒక్క రైతుతో 30 ఎకరాల్లో మొదలైన సాగు క్రమంగా వందల ఎకరాలకు విస్తరిస్తోంది. వివిధ రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్ వంటి దేశాలకు సైతం ఇక్కడి రొయ్యలు, చేపలను ఎగుమతి చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రజాప్రతినిధుల సహకారంతో మరింత మంది రైతులు ఆక్వా సాగుకు ముందుకు వస్తున్నారు. భీమవరం టూ వైఎస్సార్ జిల్లా.. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో భాగంగా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. ఆ సందర్భంగా అక్కడి రైతులతో రొయ్యలు, చేపల సాగు గురించి ఆరా తీశారు. అదే సమయంలో పోరుమామిళ్ల మండలం ఎరసాల గ్రామానికి చెందిన కల్లూరి భాస్కర్‌రెడ్డి భీమవరం ప్రాంతంలో చేపలు, రొయ్యలు సాగు చేస్తున్నాడని తెలుసుకుని ఎమ్మెల్యే ఆయన ఇంటికి వెళ్లారు. మన ప్రాంతంలో వీటిని సాగు చేస్తే బాగుంటుందని, ఇందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని భాస్కర్‌రెడ్డికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆ మేరకు చాపాడు మండలంలోని అనంతపురం–కుచ్చుపాప గ్రామాల మధ్య తనతో పాటు తన బంధువులు, గ్రామస్తులకున్న భూములను భాస్కర్‌రెడ్డికి ఎమ్మెల్యే లీజుకు ఇప్పించారు. ఆయన తొలుత 30 ఎకరాల్లో చేపలు, రొయ్యల సాగును ప్రారంభించి ప్రస్తుతం 100 ఎకరాలకు పైగా విస్తీర్ణానికి పెంచారు. రొయ్యల సాగును కూడా చేపట్టి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రూప్‌చంద్, కట్ల, శీలావతి, మోస్, పండుగప్ప, సీతల్ రకాల చేపలను సాగు చేస్తున్నారు. కుందూనది పరీవాహక ప్రాంతలో ఈ భూములు ఉండగా నీటి లభ్యత కోసం మోటార్లను ఏర్పాటు చేసుకున్నారు. ఆరు అడగుల మేర నీరు నింపి.. పలు చోట్ల చెరువులను తయారు చేశారు. దూర ప్రాంతాల నుంచి కార్మికులను తెచ్చుకోనవసరం లేకుండా ఈ ప్రాంతంలోని వారికే శిక్షణ ఇచ్చి నియమించుకున్నారు. ఇక్కడ 8 కిలోల వరకు చేపలు పెరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పాటు సీతల్ రకం చేపలను బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేశారు. కడపలో చేపల చెరువులా! కేవలం 9వ తరగతి చదువుకున్న భాస్కర్‌రెడ్డి సాగులో కొత్త మెళకువలను పాటించి అధిక ఉత్పత్తిని సాధిస్తున్నారు. తన కుమార్తెను గుజరాత్లో పీజీ ఫిషరీసైన్స్ చదివించారు. ఆమె డిగ్రీ, పీజీల్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఇటీవల మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో పాటు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, కడప పార్లమెంట్ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కె.సురేష్‌బాబు ఈ చేపల చెరువులను సందర్శించారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చేపల చెరువుల సాగు విషయాన్ని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు దృష్టికి తీసుకెళ్లారు. ‘కడపలో చేపల చెరువులా..’ అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు ఎమ్మెల్యే ‘సాక్షి’కి తెలిపారు. ఆక్వా బిల్లుతో సాగుకు ముందుకొస్తున్న రైతులు.. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా రాష్ట్రంలో చేపలు, రొయ్యల సాగు అభివృద్ధి, ఎగుమతులు తదితరాలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని మరికొన్ని చోట్ల కూడా చేపలు, రొయ్యలు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. చేపలు, రొయ్యల సాగుకు సహకారం అందిస్తున్నా.. నా స్వగ్రామం పరిధిలోని అనంతపురం గ్రామం వద్ద చేపలు, రొయ్యల సాగు విస్తీర్ణానికి సహకారం అందిస్తున్నాను. ఇక్కడ కుందూ నీరు వస్తేనే పంటలు పండే అవకాశముంది. లేని రోజుల్లో కౌలు కూడా రాని పరిస్థితిని చూశాం. ఈ కారణంతోనే చేపల చెరువులను సాగు చేయడం మంచిదని భావించా. ప్రస్తుతం రైతులకు మంచి కౌలు వస్తోంది. చెరువులను పరిశీలించి.. ఎగుమతులకు తగిన సహకారం అందించాలని కలెక్టర్‌ను కూడా కోరాను. – శెట్టిపల్లె రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే, మైదుకూరు. ఆశాజనంగా ఉంది భీమవరంలో పొందిన అనుభవంతో ఇక్కడ చేపలు, రొయ్యల చెరువులను సాగు చేస్తున్నా. ఇప్పటివరకు సాగు ఆశాజనకంగా ఉంది. అధికారుల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందితే మరింత వేగంగా వృద్ధి చెందే అవకాశముంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజల కోరిక మేరకు ఆదివారం ఉదయం చేపలు విక్రయిస్తున్నా. – కల్లూరి భాస్కర్‌రెడ్డి, రైతు -
రొయ్యకు ‘కోవిడ్’ దెబ్బ
సాక్షి, అమరావతి బ్యూరో: ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న రొయ్యల సాగు రైతులు.. కోవిడ్(కరోనా) వైరస్ దెబ్బకు కుదేలవుతున్నారు. చైనాను బెంబేలెత్తిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు రొయ్యల ఎగుమతిపై కూడా పడింది. కోస్తా జిల్లాల్లో లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఒక్క కృష్ణా జిల్లాలోనే 50 వేల ఎకరాల్లో వనామీ రొయ్యల సాగు చేస్తున్నారు. ఏటా 1.80 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి అవుతోంది. ఈ రొయ్యలను ఆక్వా రైతుల నుంచి వివిధ కంపెనీలు కొనుగోలు చేసి, ప్రాసెసింగ్ అనంతరం చైనా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల సహా యూరప్‌కు ఎగుమతి చేస్తుంటారు. జిల్లాలో ఉత్పత్తయిన రొయ్యల్లో 90 శాతం విదేశాలకే ఎగుమతి అవుతాయి. ప్రస్తుతం కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తుండడంతో రొయ్యల ఎగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. అదే సమయంలో మనదేశం నుంచి విదేశాలు రొయ్యల దిగుమతికి ఆసక్తి చూపడం లేదు. దీంతో కొనుగోలు కంపెనీలు రొయ్యల ధర తగ్గించేస్తున్నాయి. ఇలా ఇప్పుడు రొయ్యల సైజు/కౌంట్‌ను బట్టి రూ. 30 నుంచి రూ. 50 వరకు తగ్గిపోయింది. చిన్న రైతుల వద్ద అయితే ప్రస్తుత ధరల కంటే కౌంట్‌కు మరో రూ. 20 తక్కువకే కొనుగోలు చేస్తున్నారు. ఇలా రొయ్యల రైతుకు నష్టాల పాలవుతున్నాడు. కొన్నాళ్లుగా వైరస్ సోకి రొయ్యల సాగు నష్టాలను తెచ్చిపెడుతోంది. ఈ ఏడాది వైరస్ బెడద లేకపోవడంతో ఆక్వా రైతు సంతోషపడుతున్న తరుణంలో కరోనా వైరస్ వారిని దెబ్బకొట్టింది. మేత ధరలు మోత.. ఒకవైపు రొయ్యల ఎగుమతులు తగ్గి ధరలు క్షీణిస్తుండగా మరోవైపు రొయ్యల మేత ధరలు పెరిగిపోయాయి. కొంత కాలం క్రితం వరకు 25 కిలోల మేత (ఫీడ్) బస్తా రూ. 2,100 ఉండేది. ప్రస్తుతం అది రూ. 2,230కి పెరిగింది. వీటితో పాటు ఇతర కెమికల్స్, ప్రొబయోటిక్స్ వంటి వాటి ధరలు కూడా పెరిగాయి. విదేశాల నుంచి రొయ్యల మేత దిగుమతులు తగ్గడమే వీటి ధరల పెరుగుదలకు కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. విధిలేక అమ్ముతున్నాం.. ఇప్పటి వరకూ రొయ్యలకు వైరస్ సోకి నష్టాల పాలవుతున్నాం. కొత్తగా కరోనా వైరస్ పేరిట రొయ్యల ధరలు తగ్గించి కొనుగోళ్లు చేస్తున్నారు. ఈ పదిరోజుల్లో కౌంట్‌కు రూ. 30 నుంచి రూ. 50 వరకు ధర తగ్గిపోయింది. రొయ్యలను నిల్వ ఉంచుకునే పరిస్థితి లేదు. విధిలేక అమ్ముకోవలసి వస్తోంది. ఒకపక్క రొయ్యల ధరలు తగ్గడం, మరోపక్క మేత ధరలు పెరగడం మాకు నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. – తలారి శ్రీహరి, ఆక్వా రైతు, వేమవరప్పాడు. -
పేరేమో చేపది... సాగేమో రొయ్యది
సాక్షి, పెరవలి (పశ్చిమ గోదావరి): చేపల చెరువులకు అనుమతులు తీసుకుని ఆపేరుతో అనధికారికంగా రొయ్యల సాగు చేస్తున్నా అధికారులకు పట్టడం లేదు. ఈ రొయ్యల సాగుతో పంట భూములు కలుషితమై చౌడుబారుతున్నాయి. రొయ్యల చెరువుల నుంచి విడుదలయ్యే కలుషిత నీటితో భూగర్భ జలాలు కలుషితమై పంట భూములతో పాటు గట్ల వెంబడి ఉండే కొబ్బరి చెట్లు, తాడిచెట్లు సైతం మోడుబారిపోతున్నాయి. మామూళ్లమత్తులో అధికారులు చెరువుల తవ్వకాలప్పుడు పర్యవేక్షించాల్సిన రెవెన్యూ, ఫిషరీస్ డిపార్టుమెంట్ల అధికారులు మామూళ్ల మత్తులో కూరుకుపోవడంతో చెర్వుల యజమానులు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగుతోంది. జిల్లాలో ఈ విధంగా అనధికారకంగా రొయ్యల సాగు సుమారు 2 వేల హెక్టార్లలో సాగుతున్నట్టు అంచనా. ఒక్క పెరవలి మండలంలోనే కానూరు, నడుపల్లి, కానూరు అగ్రహారం, ఉసులమర్రు, తీపర్రు గ్రామాల్లో చేపల చెపల చెర్వుల తవ్వకాలకు 950 ఎకరాలకు అనుమతులు ఇచ్చారు. వీటిలో కేవలం 150 ఎకరాల్లో చేపల సాగు జరుగుతుండగా మిగిలిన 800 ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. ఇప్పటికే కానూరు, కానూరు అగ్రహారం, ఉసులుమర్రు గ్రామాల్లో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. ఇదేవిధంగా కొనసాగితే భవిష్యత్తులో స్వచ్ఛమైన తాగునీరు దొరకని పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. నిబంధనలు ఇలా.. ► చేపల చెరువుల యజమానులు వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. దీనికి అధికారులు కూడా వంత పాడుతున్నారు. చేపల చెరువులు, పంటభూమల వద్ద బోరు వేయాలంటే సబంధిత శాఖ అనుమతి తప్పనిసరి. కానీ పెరవలి మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండానే బోర్లు వేశారు. అయినా ఎలాంటి చర్యలూ లేవు. ఏ చెర్వు యజమాని అనుమతులు తీసుకోకుండా బోర్లు వేశారు. ► గతంలో ఆప్రాంతంలో బోరు ఉంటే మరో బోరుకు అనుమతి ఇవ్వకూడదు. మరో బోరు వేయాలంటే పాత బోరు పూర్తిగా పాడైయిందని నిర్ధారించిన తరువాత మాత్రమే కొత్తదానికి అనుమతి ఇవ్వాలి. ► ఒకబోరు వేసిన చోట నుంచి మరో బోరు వేయడానికి 250 మీటర్ల దూరం ఉండాలి. అప్పుడే కొత్తబోరుకి అనుమతి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఒకే చెర్వు వద్ద మూడు నుంచినాలుగు బోర్లు వేసి భూగర్భ జలాలను దుర్వినియోగం చేస్తున్నారు. ఈగ్రామాల ఆయకట్టు ప్రకారం మొత్తం కానూరు, కానూరు అగ్రహరం, ఉసులుమర్రు, తీపర్రు గ్రామాల్లో కేవలం 350 బోర్లు వేయాల్సి ఉండగా ఇక్కడ మాత్రం 800 బోర్లు పైనే ఉన్నాయి. వాల్టా చట్టం ప్రకారం ఉప్ప నీటిని పైకి తీసుకురావాలంటే ప్రత్యేక అనుమతి ఈ శాఖ వద్ద తీసుకోవలసి ఉంది. అలా తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. అంతే కాకుండా పంటభూములు ఉన్న చోట ఈ బోర్లకు అనుమతి ఇవ్వకూడదు. కానీ ఈ నిబంధనలు ఏమీ పాటించకుండానే ఇష్టారాజ్యంగా బోర్లు వేసి రొయ్యల సాగు చేస్తున్నారు. -
కుయ్యో..రొయ్యో
పశ్చిమగోదావరి, భీమవరం అర్బన్: వనామీ రొయ్య పెంపకం ప్రారంభంలో సిరులు కురిపించినప్పటికీ తర్వాత ఏయేటికాయేడు రైతులకు నష్టాలను మిగులుస్తోంది. దాంతో వనామీ సాగుపై ఆక్వా రైతులు ఆసక్తి చూపడం లేదు. గతేడాది పట్టుబడికి వచ్చిన రొయ్యలకు ధర లేకపోవడంతో అయినకాడికి అమ్ముకుని నష్టాలు చవిచూశారు. ఈ ఏడాది మళ్లీ అదే సమస్య వస్తే ఇబ్బందులు తప్పవన్న ఆలోచనలతో సన్నచిన్న కారు రైతులు దానికి ప్రత్యామ్నాయంగా పండుగొప్పవైపు దృష్టి సారిస్తున్నారు. భీమవరం మండలంలో దిరుసుమర్రు, దెయ్యాలతిప్ప, వెంప, గూట్లపాడు, దొంగపిండి, కొత్తపూసలమర్రు, నాగిడిపాలెం, తోకతిప్ప, లోసరి, అనాకోడేరు, ఎల్‌వీఎన్‌పురం, ఈలంపూడి తదితర గ్రామాల్లో సుమారు 7 వేల ఎకరాలలో వనామీ సాగుచేస్తున్నారు. పంట కాలం మూడు నెలలే ఉండి లాభార్జన ఎక్కువగా ఉండటంతో రైతులు ప్రారంభంలో వనామీపై ఆసక్తి చూపారు. రానురాను వైట్ స్పాట్, విబ్రియో, వైట్‌గట్ వంటి వ్యాధులు రావడంతో నెలరోజుల లోపే రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొనే నాథుడు కరువు ప్రస్తుత సీజన్లో ఏటా రొయ్య పెంపకంలో పెట్టుబడులు పోను కొంతైనా మిగిలేదని రైతులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ సీజన్ రొయ్య పెంపకానికి అనుకూలం కావడంతో అందరికీ ఒకేసారి పట్టుబడికి రావడంతో కొనేవారే ఉండటం లేదని రైతులు వాపోతున్నారు. పెరిగిన మేత ఖర్చులు, డీజిల్ ధరలు రొయ్యలకు మేతగా వేసే పిల్లెట్లు 25 కేజీలు రూ.1800 నుంచి రూ.2 వేలు, డీజిల్ లీటర్ రూ.70కి పైగా ఉండటంతో ఖర్చులు పెరిగిపోవడంతో సన్నచిన్నకారు రైతులు ఆసక్తి చూపడం లేదు. ఎకరానికి సుమారు రూ.2 లక్షలు నుంచి రూ. 3 లక్షలు పెట్టుబడి రైతులు పెడతారు. అయితే వేసిన తరువాత చలిగాలులు, వైరస్ బారిన పడితే తీవ్రంగా నష్టపోతున్నారు. రొయ్య సీడ్ ధర ఎక్కువ ఉండటం, కౌంట్ ధర తగ్గిపోవడంతో కౌలు రైతులు మరింత కుదేలవుతున్నారు. దాంతో సన్నచిన్నకారు రైతులు పండుగప్ప, శీలావతి, కట్ల సాగుపై మొగ్గు చూపుతున్నారు. రోజుకు రూ.17.5 కోట్ల విదేశీ మారకద్రవ్యం జిల్లాలో నరసాపురం, మొగల్తూరు, భీమవరం, కాళ్ల, ఉండి, పాలకొల్లు, పాలకోడేరు, వీరవాసరం, మండలాల్లో సుమారు 75 వేల ఎకరాలలో వనామీ రొయ్య పెంపకాన్ని సాగిస్తున్నారు. జిల్లా నుంచి సీజన్లో 250 టన్నులకు పైగా వనామీ రొయ్యలు విదేశాలకు ఎగుమతులు అవుతున్నట్లు ప్రాథమిక అంచనా. రోజుకు సుమారు రూ.17.50 కోట్ల విదేశీ మారక ద్రవ్యం జిల్లాకు వచ్చి చేరుతోంది. ఏటా పతనమవుతున్న ధర 2012 నుంచి వనామీ రొయ్య పెంపకంపై రైతులు మొగ్గు చూపించారు. మొదట్లో 50 కౌంట్ రూ.400పైగా ఉండటంతో సిరులు కురిపించింది. దీంతో మూడేళ్లు వనామీ సాగు రైతులకు సిరులు కురిపించింది. 2016 నుంచి నాణ్యతలేని వనామీ సీడ్, యాంటీబయోటిక్స్ వాడకం, వైరస్ వ్యాప్తి వంటి కారణాల వల్ల పతనమైంది. 2019 మొదటి పంటలో సుమారు 40–50 వేల ఎకరాలకు పడిపోవడంతో రైతులు ప్రత్నామ్నాయంగా చేపల పెంపకాన్ని సాగిస్తున్నారు. గతేడాది 100 కౌంట్ కేజీ ధర రూ. 160కి పడిపోవడంతో రొయ్య రైతులు నష్టపోకుండా ఆదుకునేందుకు ఎంపెడా 100 కౌంట్ కేజీ రూ.200 ఉండేటట్లు చూడాలని వ్యాపారులకు ప్రభుత్వం అదేశించినా ఫలితం శూన్యం. -
తస్సాదియ్యా.. రొయ్య
రొయ్య రైతులను మరోసారి దగా చేసింది. ధరలుఆశాజనకంగా లేక సాగుకు దూరమైన తరుణంలో ధరలు పుంజుకోవడం చూసి రైతులు బాధ, సంతోషం మిళితమైన భావంతో తస్సాదియ్యా.. రొయ్య అంటున్నారు. ప్రధానంగా ఈ ఏడాది ధరలు లేకపోవడంతో సాగు విస్తీర్ణం కూడా చాలా తగ్గింది. ఇప్పటికే దాదాపు 70 శాతం పైగా హార్వెస్టింగ్ పూర్తయిన తరుణంలో ధరలు ఆశాజనకంగా పెరగడంతో ఆసల్యంగా సాగు చేసిన రైతులకు ఊరటనిస్తుంది. గూడూరు: వారం రోజులుగా రొయ్యల ధరలు పుంజుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిన్నా.. మొన్నటి వరకూ ఆక్వా రైతును ఒక వైపు ధరలు పతనం.. మరో వైపు వైరస్లు వెంటాడి వేధిస్తూ ఫీడ్ తీసుకోకుండా పెరుగుదల లేకపోవడంతో అతలాకుతలం చేశాయి. సాధారణంగా జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో 1.25 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు చేపడుతారు. కానీ ఈ సీజన్లో ధరలు లేకపోవడం, వర్షాలు కురవకపోవడంతో ప్రస్తుతం 75 వేల ఎకరాల్లోనే రొయ్యల సాగును రైతులు చేపట్టారు. ఇప్పటికే దాదాపు 70 శాతం మేర రొయ్యలగుంతల్లో హార్వెస్టింగ్ చేశారు. ఈ క్రమంలో గత వారం రోజులుగా టన్ను రొయ్యలపై రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ పెరగడంతో ఆక్వా రైతులు ఆశలు చిగురిస్తున్నాయి. పెరిగిన వ్యయం.. నష్టాల పాలవుతున్న రైతాంగం రొయ్యల సాగు వ్యయం గణనీయంగా పెరిగింది. కానీ ధరలు మాత్రం నిలకడగా లేక రైతాంగం నష్టాలపాలవుతున్నారు. 2013 సంవత్సరం తర్వాత రొయ్యల ధరలు ఆశించిన మేర లేకుండా పోవడమేకాక, నిలకడగా ఉన్న పరిస్థితీ లేదు. దీంతో సొంత గుంతలున్న రైతులు మాత్రం విధిలేని పరిస్థితుల్లో సాగు కొనసాగిస్తుంటే, లీజుకు తీసుకుని సాగు చేస్తున్నవారు మాత్రం, పోగొట్టుకున్న మొత్తం ఏం చేíసినా తిరిగి రాదని, ఆ మొత్తాలు రావాలంటే కచ్చితంగా రొయ్యల సాగు చేయక తప్పదనుకుని రొయ్యల సాగులోనే పాకులాడుతున్నారు. వరుస నష్టాలపాలవుతూ సాగు కొనసాగిస్తున్న రైతాంగాన్ని 2015లో వరదలకు రొయ్యలతోపాటు, ఏయిరేటర్లు, మోటార్లు, ఇతర సాగు పరికరాలన్నీ సముద్రం పాలయ్యాయి. దీంతో కోలుకోలేని విధంగా ఆక్వా రైతులు మరింత నష్టాల ఊబిలో కూరుకుపోయారు. వెంటాడుతున్న వైరస్లు ఆక్వాసాగే చేపడుతూ, వైట్‌గట్, ఈహెచ్‌పీ అనే ప్రోటోజోవా తాకిడితో పెరుగుదల ఆగిపోవడంతో పాటు, నిలకడలేని రొయ్యల ధరలతో రైతులు నష్టాల పాలవుతున్నారు. ఈ సీజన్లో వరద తాకిడి ఉన్న తీరప్రాంత మండలాల్లో రొయ్యల సాగు గణనీయంగా పడిపోయింది. జిల్లాలోని కొన్ని మండలాలతో పాటు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో సైతం రొయ్యల ధరలు అంతంత మాత్రంగానే ఉండడంతో రొయ్యల గుంతల్లో చేపలు వదులుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రొయ్యల సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోవడంతోనే రొయ్యల ధరలు పెరుగుతున్నాయని రైతులు అంటున్నారు. సాగవుతున్న రొయ్యలకు కూడా వైట్ పీకల్, విబ్రియో వంటి వైరస్లు ప్రబలడంతో కూడా సాగు వ్యయం బాగా పెరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చేప పోయి రొయ్యొచ్చే..
బాల్కొండ : శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్‌లో జోరుగా రొయ్యల వేట సాగుతోంది. గతంలో ఎన్నడూ ప్రాజెక్టులో ఈ స్థాయిలో రొయ్యల వేట సాగలేదని మత్స్యకారులు చెబుతున్నారు. ఎస్సారెస్పీలో రొయ్యలు లభించేవి కావు. గత ఏడాది నుంచి ఎస్సారెస్పీలో రొయ్యల వేట షురువైంది. వారం రోజుల నుంచి భారీగా రొయ్యలు లభ్యమవుతున్నాయని మత్స్యకారులు తెలిపారు. గతేడాది ఎస్సారెస్పీలో పెద్ద మొత్తంలో చేపలు మత్యువాత పడ్డాయి. అందుకు ప్రధాన కారణం రొయ్యల విత్తనం పోయడమేనని మత్స్యకారులు చెబుతున్నారు. రొయ్యలకు, చేపలకు వైరం ఉంటుంది. రొయ్య గోళ్లతో గీరడం, కన్నుల్లో పొడవడంతో చేపలు నీటి లోపల ఉండకుండా పైకి వచ్చి ఎండ వేడిమి తట్టుకోలేక అధికంగా మృతి చెందాయని మత్స్యకారులు తెలిపారు. ఈ ఏడాది జాలర్లకు ప్రాజెక్టులో చేపల కంటే రొయ్యలే అధికంగా లభ్య మవుతున్నాయి. దీంతో మత్స్యకారులు ఒకింత సంతోష పడుతున్నా రొయ్యల ఉనికితో ప్రాజెక్టులో చేపలు ఉండవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడివి రొయ్యలు.. మూడేళ్ల క్రితం ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్ ఎస్సారెస్పీలో ఎడమ వైపు రొయ్యల విత్తనాన్ని వదిలాడు. తర్వాత రిజర్వాయర్‌లో రొయ్యల పెంపకం వలన పెద్దగా ప్రయోజనం ఉండదని గ్రహించి, వాటిని అలానే వదిలేసి వెళ్లాడని మత్స్యకారులు అంటున్నారు. ఎస్సారెస్పీ నుంచి ఆంధ్ర ప్రాంతానికి ఎగుమతి చేయడం ఖర్చు ఎక్కువగా అవుతుందని భావించి ప్రయోగాన్ని విరమించుకున్నట్లు తెలిపారు. అదే విత్తనం రెండేళ్ల నుంచి రొయ్య ఉత్పత్తులను ఇస్తోంది. నెల మాత్రమే.. మార్కెట్లో రొయ్య ధర కిలో రూ. 400 పలుకుతుంది. ఎస్సారెస్పీ డ్యాం పై దళారులు మత్స్యకారుల నుంచి కిలోకు రూ.170 నుంచి రూ. 200 వరకు కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రతి రోజు ఓ మత్స్యకారుడు కనీసం 5 నుంచి 6 కిలోల రొయ్యలను పడతాడు. దీంతో మత్స్యకారులకు ఆదాయం వస్తున్నా.. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా రొయ్యల పెంపకం సరైంది కాదని అంటున్నారు. రొయ్యలు జూన్ నెలాఖరు నుంచి జూలై నెలాఖరు వరకే దొరుకుతాయని, రొయ్యల పెంపకం వలన ఏడాది పాటు ఆదాయాన్ని ఇచ్చే చేపలు లేకుండా పోతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. చేపలు లేకుండా పోతున్నాయి.. ఎస్సారెస్పీలో రెండేళ్ల నుంచి రొయ్యలు దొరుకుతున్నాయి. కానీ రొయ్యల వల్ల డ్యాంలో చేపలు లేకుండా పోతున్నాయి. రొయ్య కు, చేపలకు కుదరదు. రొయ్య చేపను తన గోళ్ల తో గీరుతుంది. దీంతో చేపలు చనిపోతున్నాయి. ఎస్సారెస్పీలో రొయ్యల పెంపకం చేపట్టవద్దు. – హన్మండ్లు, మత్స్యకారుడు కొన్ని రోజులే ఉంటుంది.. ఎస్సారెస్పీలో రొయ్యలు నెల రోజులు మాత్రమే దొరుకుతాయి. తరువాత బ్యాక్ వాటర్ నిలిచే ముళ్ల పొదల్లోకి పోతాయి. చేపలు ఏడాది పొడవునా వేటాడుకుంటాం. రొయ్యల వల్ల చేపలు లేకుండా పోతున్నాయి. ఏడాది పొడవునాపొట్ట నింపే చేపల పెంపకమే మంచిది. – సుధాకర్, మత్స్యకారుడు -
సేంద్రియ ఆక్వా సాగుకు ఎంపెడా సమాయత్తం!
చేపలు, రొయ్యల సాగులో సేంద్రియ పద్ధతులను ప్రోత్సహించడానికి సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ(ఎంపెడా) సమాయత్తమవుతున్నది. సేంద్రియ ఆక్వా సాగులో ఖర్చు పెరుగుతుంది కాబట్టి సాధారణంగా ఆక్వా రైతులు వెనుకడుగు వేస్తుంటారు. అయితే, సేంద్రియ ఆక్వా ఉత్పత్తులకు 15 శాతం అధిక ధర చెల్లించి కొనుగోలు చేయడానికి విదేశీ సంస్థలు ముందుకొస్తున్నందున ఇక మీదట ఆ ఇబ్బంది ఉండబోదని ఎంపెడా చైర్మన్ ఎ.జయతిలక్ అంటున్నారు. స్విట్జర్లాండ్‌కు చెందిన అతిపెద్ద వినియోగదారుల సహకార సంస్థ ‘కూప్ కో–ఆపరేటివ్’కు అత్యంత నాణ్యమైన సేంద్రియ ఆక్వా సాగు, అంతర్జాతీయ సేంద్రియ ఆక్వా సర్టిఫికేషన్ పద్ధతులు తదితర అంశాల్లో పాతికేళ్ల అనుభవం ఉంది. గోవాలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ సీఫుడ్ షో–2018లో కూప్ కోఆపరేటివ్‌తో ‘ఎంపెడా’ అవగాహన కుదుర్చుకుంది. దేశీయంగా ఆక్వా సంస్థలు, రైతులతో సేంద్రియ ఆక్వా సాగు చేయించడంతోపాటు 15% అదనపు ధరకు కొనుగోలు చేయడానికి కూప్ కో–ఆపరేటివ్ అంగీకరించిందని ఎంపెడా చైర్మన్ తెలిపారు. సేంద్రియ సాగుకు సీడ్‌ను అందించేందుకు హేచరీ, మేత తయారీ కర్మాగారం, సేంద్రియ సాగు పద్ధతులపై సాంకేతిక సహకారం, శిక్షణ, దేశ,విదేశీ మార్కెట్ల కోసం సర్టిఫికేషన్, ఒప్పంద కొనుగోళ్లు.. వీటన్నిటిలోనూ ఆ సంస్థ తోడ్పాటును అందించనుంది. వియత్నాంలో సేంద్రియ ఆక్వా సాగును ప్రోత్సహిస్తున్న కూప్ కో–ఆపరేటివ్.. దిగుమతి చేసుకున్న ఆక్వా ఉత్పత్తులను స్విట్జర్లాండ్‌లో తన 2,200 అవుట్లెట్ల ద్వారా విక్రయిస్తోంది. -
రొయ్యల సేద్యం రాజేసి
చీరాల : తీర ప్రాంతం డాలర్ సేద్యానికి కేంద్రంగా మారింది. ప్రభుత్వ భూములు ఆక్రమించి ఏటా వందల కోట్ల రూపాయల రొయ్యల వ్యాపారం సాగుతున్నా సంబంధితాధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. కొంచెం కండబలం ... రాజకీయ దర్పం ఉంటే చాలు సర్కారు భూమి తమదేనన్నట్టుగా పాగా వేస్తున్నారు. ఈ ఆక్రమణదారుల్లో అధికంగా ప్రజాప్రతినిధులు, వీరి వెనుక చోటామోటా రాజకీయ నేతలతోపాటు బడాబాబులూ ఉన్నారు. చీరాల మండలంలోని కుందేరు భూములు నాయినిపల్లి నుంచి మోటుపల్లి వరకు కనీసం 400 ఎకరాలు ఆక్రమణలో ఉంది. ఎకరం కనీసం ఈ ప్రాంతాల్లో రూ.10-రూ.30 లక్షల వరకూ ధర పలుకుతోంది. ఈ భూములను చేజిక్కించుకొని రొయ్యల చెరువులు తవ్వి రెండు చేతులా ఆర్జిస్తున్నారు. ముఖ్యంగా వేటపాలెం నుంచి ఈ ఆక్రమణల పర్వం మొదలై చినగంజాం వరకు పాకింది. రొంపేరు భూములూ హాంఫట్... రొంపేరు కాలువ ఇరువైపులా ఉండే 300 ఎకరాలకుపైగా సర్కారు భూముల్లో రొయ్యల దందా సాగుతోంది. వేటపాలెం నుంచి చినగంజాం వరకు వందలాది ఎకరాలు రొయ్యల చెరువులుగా మారిపోయాయి. ముఖ్యంగా ‘వెనామీ’ సాగు లాభసాటిగా మారుతుండడంతో అటువైపు ఆక్రమణదారులు అడుగులు వేస్తున్నారు. దీంతో చెరువుల లీజులు భారీగా పెరిగిపోయాయి. గత ఏడాది రూ.లక్ష వరకు ఎకరాకు లీజు ఉండగా, ప్రస్తుతం అది కాస్తా రూ.1.70 లక్షల వరకూ పెరిగింది. ఒక్కొక్కరు 3 నుంచి 4 ఎకరాల వరకు సర్కారు భూమిని ఆధీనంలో పెట్టుకుని ఎటువంటి పెట్టుబడి లేకుండా ఏడాదికి లక్షలాది రూపాయలను లీజు పేరుతో వెనుకేసుకుంటున్నారు. ఆక్రమణలపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం: డ్రైనేజీ డీఈ సబ్బారావు కుందేరు, రొంపేరుకు రెండు ైవైపులా ఆక్రమణలున్న విషయం నిజమే. చాలామంది రొయ్యలు చెరువులు సాగు చేశారు. కుందేరులో ఆక్రమణదారులకు గతంలో రెండుసార్లు, రొంపేరు ఆక్రమణ దారులకు నాలుగుసార్లు నోటీసులు జారీచేశాం. త్వరలో రొంపేరులో ఆధునికీకరణ పనులు జరుగుతున్నందున ఈ ఆక్రమణలు తొలగించాల్సి ఉంది. ఈ ఆక్రమణల వ్యవహారంపై త్వరలో ఉన్నతాధికారులకు నివేదించి వారి ఆదేశాల మేరకు ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం. -
వర్షాలు లేక రొయ్యలకు సోకుతున్న రోగాలు
చీరాల : మూడు నెలలకే లక్షల రూపాయాల ఆదాయం తెచ్చే రొయ్యల సాగు.. ప్రస్తుతం ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. వరుస నష్టాలతో రైతులు అల్లాడిపోతున్నారు. ఆరు నెలల క్రితం వరకు రైతులకు సిరులు కురిపించిన రొయ్యల సాగు.. ప్రస్తుతం నష్టాలు తెచ్చి పెడుతోంది. అదునులో కూడా వర్షాలు కురవకపోవ డంతో వైట్‌స్పాట్ సోకి రొయ్యలు చనిపోతున్నాయి. రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితి లేదు. ఏడాదికి రెండు సార్లు సాగు చేయాల్సి ఉండగా రైతులు వరస పెట్టి చెరువులు సాగు చేయడం తెగుళ్లకు మరో కారణం. రొయ్య పిల్లల్లో నాణ్యత లేకపోవడం.. సాగు ఖర్చులు పెరిగిపోవడం.. వైరస్‌లతో దిగుబడులు పడిపోవడంతో గతంలో మీసాల తిప్పిన రైతులు ప్రస్తుతం నష్టాల ఊబిలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. జిల్లాలోని చీరాల, వేటపాలెం, చిన్నగంజాం, కొత్తపట్నం, టంగుటూరు, శింగారాయకొండ, ఉలవపాడు మండలాల్లో 3000 హెక్టార్లలో రొయ్యల చెరువులు సాగవుతున్నాయి. తెగుళ్లు ఆశిస్తున్న సమయాల్లో విస్తారంగా వర్షాలు కురిస్తే చెరువుల్లో చేరే నీటిని రైతులు బయటకు విడుదల చేస్తుంటారు. దీంతో వైరస్ ప్రభావం తగ్గుతుంది. {పస్తుతం వర్షాలు కురవక పోవడంతో రొయ్యలకు వైరస్ సోకి అవి చనిపోతున్నాయి. సీడ్ (రొయ్యపిల్లలు) ఎంపికలో నాణ్యత లేకపోడం తెగుళ్లకు మరో కారణం. ఇతర దేశాల నుంచి మన డిమాండ్‌కు తగ్గిన విధంగా బ్రూడర్ (తల్లి రొయ్య) అందకపోవడంతో రొయ్య పిల్లల కోసం రైతులు స్థానికంగా ఉండే హేచరీలను అశ్రయించాల్సి వస్తోంది. సీడ్ మంచిదో కాదో ల్యాబ్‌లో నిర్ధారించకుండానే చెరువుల్లో పెంచున్నారు. ఫలితంగా అవి నెల.. లేకుంటే రెండు నెలల్లో చనిపోతున్నాయి. సాధారణంగా చెరువుల్లో 100 పిల్లలు వేస్తే 70 పిల్లల వరకు బతుకుతాయి. ప్రస్తుతం వంద పిల్లలకుగాను 20 నుంచి 30 రొయ్య పిల్లలే బతుకుతున్నాయి. తడిసి మోపెడైన ఖర్చులు వనామి సాగు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. సీడ్, ఫీడ్, మందులు, డీజల్, లీజు ఖర్చులు అంతకంతకూ పెరిగాయి. వనామి సాగులో వరస లాభాలు రావడంతో రొయ్యల సాగుకు డిమాండ్ పెరిగి లీజు ధరలు రెట్టింప్పయ్యాయి. గతంలో ఎకరా చెరువు ఎడాదికి లక్ష రూపాయల లీజు ఉండగా ప్రస్తుతం రూ.1.80 లక్షలకు పెరిగింది. మందుల ధరలు ఈ ఎడాది 25శాతం పెరిగాయి. గత ఎడాది ఫీడ్ ధర టన్ను రూ.63 వేలుండగా ప్రస్తుతం రూ.70 వేల వరకు పెరిగింది. గత ఎడాది ఎకరా చెరువుకు రూ.7 నుంచి రూ.9 లక్షలు ఖర్చు కాగా ప్రస్తుతం రూ.13 నుంచి రూ.15 లక్షలకు పెరిగింది. దిగజారిన ధరలు రొయ్యల ధరలు రోజురోజూకూ పడిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో రొయ్యలు ధరలు జనవరి నెలకంటే ఇప్పుడు గణనీయంగా తగ్గాయి. జనవరిలో.. కౌంట్ రేటు ప్రస్తుతం 30 రూ.680 రూ.540 40 రూ.580 రూ.440 50 రూ.510 రూ.350 60 రూ.400 రూ.310 సీడ్లో కొరవడిన నాణ్యత : డాక్టర్ రఘునాథ్,మత్స్యశాఖ ఏడీ సీడ్లో నాణ్యత లేకపోవడం రొయ్యల సాగులో నష్టాలకు ప్రధాన కారణం. ముఖ్యంగా సర్వేయల్స్(బతికిన పిల్లల సంఖ్య) పడిపోతున్నాయి. 100 కిలోలకు 30 కిలోలే బతుకుతున్నాయి. రొయ్యలు సాగు చేసే రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. ఇతర దేశాల నుంచి వచ్చే తల్లి రొయ్యలను దిగుమతి చేసుకుని మన కేంద్ర ప్రభుత్వం వాటికి పరీక్షలు నిర్వహిస్తోంది. అందులో మంచివాటిని ఎంపిక చేసుకుని చెన్నైలో ఉన్న హేచరీస్‌కు పంపి సీడ్‌ను తయారు చేస్తారు. అక్కడ పరీక్షల అనంతరం మేలైన రొయ్య పిల్లలను రైతులకు విక్రయిస్తారు. ప్రస్తుతం డిమాండ్ ఉన్నా రొయ్య పిల్లలు దిగుమతి కావడం లేదు. రైతులు స్థానికంగా హేచరీల వద్ద నుంచి పిల్లలను కొనుగోలు చేస్తున్నారు. వాటిలో నాణ్యత లేకుండా ఉండటం వల్లే రొయ్య పిల్లలు చనిపోతున్నాయి. -
రొయ్యల పెంపకంపై లొల్లి
నిజాంసాగర్: వందలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న నిజాంసాగర్ ప్రాజెక్టులో రొయ్యల పెంపకం చేపట్టవద్దని మత్య్సకార్మికుల ఆందోళ నకు దిగారు. చేపపిల్లలను పెంచాలని కొందరు, రొయ్యలను పెంచాలని మరికొందరు కార్మికులు ఒకరినొకరు దూషించుకున్నారు. మంగళవారం మండలంలోని అచ్చంపేట చేపపిల్లల విత్తనోత్పత్తి కేంద్రం వద్ద స్థానిక మత్య్సకార్మిక సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా మత్స్యశాఖ ఏడీ, సంఘం అధ్యక్షుడు బాలక్రిష్ణ అధ్యక్షత వహించారు. సమావేశ ముఖ్య ఉద్దేశాన్ని ఏడీ కార్మికులకు వివరించారు. అంతలోనే కొం దరు కార్మికులు నిజాంసాగర్ ప్రాజెక్టులో రొయ్యల పెంపకాన్ని నిషేధించాలంటూ నినాదాలు చేశారు. ప్రాజెక్టులో చేప పిల్లల పెంపకం నాలుగేళ్ల నుంచి చేపట్టకపోవడంతో దళారులు రొయ్యల పెంపకానికి అలవాటుపడ్డారన్నారు. చేప పిల్లలను నాశనం చేస్తున్న రొయ్యల పెంపకాన్ని నిషేధించాలని సమావేశంలో నినాదాలు చేశారు. మరికొందరు కార్మికులు చేప పిల్లలతో పాటు రొయ్యల పెంపకాన్ని చేపట్టాలని డిమాం డ్ చేయడంతో సమావేశంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కార్మికులు ఒకరిని ఒకరు తోసుకుంటూ వేదిక వద్దకు వచ్చి మత్య్సశాఖ అధికారులను నిల దీశారు. దీంతో సమావేశంలో ఉద్రిక్తత నెలకొనడంతో అధికారులు జోక్యం చేసుకున్నారు. కార్మికుల నిర్ణయం మేరకు ప్రాజెక్టులో చేపపిల్లలను పెంచుతామన్నారు. ప్రైవేట్ వ్యాపారులు కాకుండా ప్రభుత్వ పరంగా రొ య్యల పెంపకానికి కృషిచేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. నాలుగేళ్ల నుంచి చేప పిల్లల పెంపకం లేకపోవడంతో ఉపాధి కోల్పోయామని, తమను ఆదుకోవాలని అధికారులతో కార్మికులు మొరపెట్టుకున్నారు. కార్యక్రమంలో స్థానిక మత్స్యశాఖ అధికారులు రాములు, రూపేందర్, రాజేంద్రప్రసాద్, స్థానిక మత్య్సకార్మిక సంఘం నాయకుడు రాములు పాల్గొన్నారు. -
జీవాలకు నట్టల నివారణ మందులు తాగించాలి
- అడపాదడపా వర్షాల వల్ల రాత్రి వాతావరణం చల్లగా ఉంటున్నందున గొర్రెలు, మేకలను చలిగాలుల నుంచి కాపాడు కోవాలి. నేల రొచ్చు లేకుండా పరిశు భ్రంగా ఉంచుకోవాలి. నట్టల నివారణ మందులు తాగించాలి. - జీవాలు ఎదకు వస్తున్నట్లయితే వాటిని జాగ్రత్తగా పోతుతో దాటించాలి. చూడితో ఉన్న జీవాల మేపు, ఆరోగ్య పరిరక్షణపై శ్రద్ధ చూపాలి. - అక్టోబర్/నవంబర్‌లో సైలేజి గడ్డిని తయారు చేయాలనుకునే రైతులు ఇప్పుడే ఆఫ్రికన్ టాల్ మొక్కజొన్న రకాలను విత్తుకోవాలి. పప్పుజాతి, గడ్డిజాతి పశుగ్రాసాలను పెంచాలి. జీవాలను వర్షంలో తిప్పకుండా షెడ్డులోనో, ఇంటిపట్టునో ఉంచి పుష్టిగా మేపాలి. - ఆచార్య టి. రఘునందన్ (9440477240), అధిపతి, ఐఎల్‌ఎఫ్‌సీ, పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్ రొయ్యల రైతు లాభదాయకత పెంచే బ్యాక్టీరియా! - రొయ్యల పెంపకంలో నేల స్వభావంతోపాటు నీటి నాణ్యత కూడా రొయ్యల పెరుగుదలకు సహాయపడుతుంది. గుల్లకొట్టడం(మోల్టింగ్) ద్వారా రొయ్యలు వదిలిన గుల్లను కిటెనో లైటిక్ బ్యాక్టీరియా(చెద పురుగులు కాగితాన్ని ఏ విధంగా తినేస్తాయో అలా) జీర్ణం చేసుకుంటుంది. అందులోని ఖనిజ లవణాలన్నీటినీ చెరువులో మళ్లీ వినియోగంలోకి తెస్తుంది. రొయ్యల పెంపకం జరుగుతున్నన్ని రోజులూ ఈ రీసైక్లింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. - నేల, నీరు ఈ బ్యాక్టీరియాకు ఎంత సహకరిస్తే అంతే నాణ్యతతో ఈ ఖనిజ లవణాల పునర్వినియోగ ప్రక్రియ జరుగుతుంది. తద్వారా రొయ్యల మోల్టింగ్ విధానం రైతుల లాభదాయకతకు తోడ్పడుతుంది. - నీటి నాణ్యత(ముఖ్యంగా క్షారత్వం, గాఢత)లో తేడాలుంటే రొయ్యల మోల్టింగ్ ప్రక్రియ నిలిచిపోయి రొయ్యల పెరుగుదల ఆగిపోతుంది. - ఆచార్య పి. హరిబాబు, ప్రభుత్వ మత్స్యకళాశాల, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా పొదుగు వ్యాధి రాకుండా జాగ్రత్త పడాలి - పాడి పశువుల్లో ప్రాణాంతకమైనది పొదుగువాపు వ్యాధి. 3 రకాల సూక్ష్మక్రిముల వల్ల పాల గ్రంధికి సోకుతుంది. పరిశుభ్రత పాటించడం ద్వారా రాకుండా జాగ్రత్తపడడం ఉత్తమం. - ఈ వ్యాధి వల్ల పొదుగు ఎర్రబడి, వాచి పశువుకు జ్వరం వస్తుంది. చనిపోయే ప్రమాదమూ ఉంటుంది. పాల దిగుబడి తగ్గి, పాలలో కుదపలు కనపడతాయి. పాలు పలచబడి గోధుమ రంగుకు మారతాయి. కొన్నిసార్లు లక్షణాలు త్వరగా కనపడవు. - నివారణ మార్గాలు: పాలు తీసిన తర్వాత 4 చనులను పావిడిన్ లోషన్లో ముంచి తీయాలి. పశువులు వట్టిపోయే సమయంలో పొదుగులోకి ట్యూబు మందులు ఎక్కించాలి. - డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506), అధిపతి, పశు పరిశోధన కేంద్రం, గరివిడి, విజయనగరం జిల్లా మీ అభిప్రాయాలు, ప్రశ్నలు, సూచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, సాక్షి (సాగుబడి), సాక్షి టవర్స,6-3-249/1, రోడ్డు నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్- 500 034 saagubadi@sakshi.com -
అన్నదాతను ఊరిస్తున్న ఆక్వా!
రొయ్యల చెరువులుగా మారుతున్న పంటపొలాలు పాయకరావుపేట : ఆక్వాసాగు రైతులను ఊరిస్తోంది. రొయ్యల పెంపకం కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకూ ఉప్పునీటి సాంద్రత కలిగిన ప్రాంతాలకే పరిమితమైన ఇది వనామి రొయ్య రాకతో భారీగా విస్తరించింది. ఈ రొయ్యల పెంపకం లాభసాటిగా ఉండటం, ఎలాంటి వాతావరణమైనా అనువుగా ఉండటంతో పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. పొలాలలను రొయ్యల పెంపకానికి చెరువులుగా మార్చివేస్తున్నారు. దీంతో భూముల లీజులు అమాంతంగా పెరిగిపోయాయి. ఒకప్పుడు ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ ఉన్న లీజు రూ. 30 వేల నుంచి రూ.70 వేల వరకూ ప్రాంతాన్ని బట్టి పెరిగిపోయింది. రెండేళ్ల పాటు ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేస్తే వచ్చే ఆదాయం ఇలా లీజు రూపంలో వచ్చేస్తుండటంతో పలువురు భూయజమానులు తమ పొలాలు లీజుకిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పాయకరావుపేట మండలంలోని సాల్మన్‌పేట, రాజయ్యపేట, వెంకటనగరం, పెంటకోట, రాజవరం, కుమారపురం ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. చెరువులు ఏర్పాటుకు సంబంధించి భారీగా వ్యయమవుతున్నా రైతులు వెనుకాడట్లేదు. సాధారణంగా రొయ్యలను మార్చి, ఏప్రిల్ నెలలో సాగు చేస్తారు. ఈ వేసవిలో చెరువుల తవ్వకం ఆలస్యమవడంతో ప్రస్తుతం సాగు మమ్మరంగా చేపట్టారు. మరోవైపు మార్కెట్లో రొయ్యల ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఆక్వాసాగు ఊపందుకుంది. ప్రభుత్వ పోత్సాహం అందిస్తే మరింత అభివృద్ధి చెందుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
హడలిపోతున్న ఆక్వారైతు
చేపలలకు ఆక్సిజన్ లేమి ముప్పు ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం ఏటా రూ. 100 కోట్ల నష్టం కైకలూరు : భానుడి భగభగలతో నిన్నటివరకు అగ్నిగోళంలా ఉన్న జిల్లా సోమవారం ఒక్కసారిగా చల్లబడడం ఆక్వా రైతులను హడలెత్తించేస్తోంది. ఉదయం నుంచే జిల్లా అంతటా ఆకాశం పూర్తిగా మేఘావృత్తమై వాతావరణం చల్లగా మారింది. అక్కడక్కడ సన్నపాటి వర్షపు జల్లులు పడ్డాయి. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పు వల్ల చేపలకు ఆక్సిజన్ లేమి సమస్య ఏర్పడుంతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో లక్షా 10వేల ఎకరాల్లో చేపల సాగు, 10వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతుంది. ఆదివారం వరకు జిల్లాలో ఉష్టోగ్రత 43 డిగ్రీల సెంటీగ్రేట్తో అదరగొట్టింది. రోహిణి కార్తె కావడంతో వేడి గాలులకు ప్రజలు అల్లాడిపోయారు. సోమవారం వచ్చిన మార్పు చేపల రైతులకు తీవ్ర నష్టదాయకమని పేర్కొంటున్నారు. విభజనతో ఇప్పటికే దెబ్బతిన్న రైతు ... రాష్ట్ర విభజన వ్యతిరేక, అనుకూల పోరాటాల నేపథ్యంలో ఇప్పటికే చేపల, రొయ్యల రైతులు రవాణా సౌకర్యం లేక తీవ్ర నష్టాల పాలయ్యారు. నెలల పాటు జరిగిన ఆందోళనల కారణంగా చెరువుల్లో వేసిన చేపల పట్టుబడికి వచ్చిన ఎగుమతిలు చే యలేని పరిస్థితి ఏర్పడింది. ఆందోళనకు ముందు కొల్లేరు సమీప ప్రాంతాల నుంచి రోజుకు 300 లారీల లోడు ఇతర ప్రాంతాలకు వెళ్లేది. నేడు ఆ సంఖ్య 250కి చేరింది. ఇదిలా ఉంటే గత రెండు నెలలుగా చేపల ధరలు పడిపోయాయి. గతంలో కిలో ధర రూ. 100 ఉంటే నేడు రూ. 75కి చేరింది. అదే విధంగా విద్యుత్ కోతలు ఆక్వా రంగాన్ని దెబ్బతీశాయి. ప్రధానంగా రొయ్యల సాగులో ఎరియేటర్ల ద్వారా నిత్యం వాటికి ఆక్సిజన్ అందించాలి. కోతల కారణంగా డీజిల్ ఇంజన్లు ఉపయోగించడంతో రైతులపై అదనపు భారం పడింది. ఇటీవల నీటి లభ్యత కొరత కారణంగా అనేక చెరువుల్లో నీటి మార్పిడి జరగలేదు. దీంతో నీరు చిక్కబడి చేపలు వ్యాధుల బారిన పడుతున్నాయి. ఏటా రూ. 100 కోట్ల నష్టం.... జిల్లాలో ఆక్వా రంగాన్ని ఆక్సిజన్ సమస్య ప్రతి ఏటా కుదిపేస్తోంది. అప్పటి వరకు ఎండలు మండిపోయి, ఒక్కసారిగా వర్షం కురిస్తే చెరువులు అడుగుభాగాన ఉన్న విష రసాయనాలు ఒక్కసారిగా పైకి వస్తాయి. దీని వల్ల ఆక్సిజన్ అందక చేపలు మృత్యువాత పడతాయి. మరో పక్క రుతుపవనాలు కారణంగా వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే 45 శాతం చెరువులు పట్టుబడి దశలో ఉన్నాయి. ఈ సమయంలో వర్షం వ స్తే ఆక్సిజన్ సమస్యతో చేపలు మరణిస్తాయని రైతులు దిగులు చెందుతున్నారు ఈ పద్ధతులు పాటించండి..... ప్రతి ఏటా చేపల చెరువుల్లో ఆక్సిజన్ లేమి కారణంగా అనేక మంది రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారని కైకలూరు మత్య్సశాఖ అభివృద్ధి అధికారి పి.సురేష్ చెప్పారు. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవించినప్పుడు పాటించాల్సిన పద్ధతులను ఆయన వివరించారు. కాల్షియం ఫెరాక్సైడ్, హైడ్రోజన్ ఫెరాక్సైడ్ మందులను చెరువుల వద్ద సిద్ధంగా ఉంచుకోవాలి. మేతలు, రసాయన పురుగుమందులను చెరువుల్లో వాడొద్దు. చేపల పట్టుబడులు నిలిపివేయాలి. చెరువులో ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి బోటును కలియతిప్పాలి. చిన్న చెరువుల నుంచి పెద్ద చెరువులకు చేప పిల్లను మార్చకూడదు. నీటి, మట్టి పరీక్షలు వెంటనే చేయించాలి. చేపలు పైకి ముట్టెలు ఎత్తితే మొదట్లో సూచించిన మందును ఎకరం చెరువుకు అరకేజీ నుంచి కేజీ వరకు పిచికారీ చేయాలి. వైద్యుల సలహాలను ఎప్పటికప్పుడు పాటించాలి. -
వెనామీకి ‘స్పాట్’
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: రొయ్యలు సాగుచేసే రైతుల ఆశలు ఆవిరయ్యాయి. రెండేళ్లుగా లాభాల బాటలో నడిచిన వెనామీ రైతులను ఒక్కసారిగా సమస్యలు చుట్టుముట్టాయి. ప్రతికూల వాతావరణానికి తోడు..వైట్‌స్పాట్ తెగులు వ్యాపించడం రొయ్యల రైతులకు శాపంగా పరిణమించాయి. జీరో సెలనిటీలో సైతం జీవించగల వెనామీ రొయ్యలు వ్యాధుల బారిన పడటం మొదలైంది. టైగర్ రొయ్య కనుమరుగయ్యేందుకు కారణమైన వైట్‌స్పాట్ వెనామీ రొయ్యలకు సోకడంతో రైతులు అర్ధంతరంగా చెరువులను ఖాళీ చేస్తున్నారు. ఐదు రోజుల నుంచి ధరల పతనం ఐదు రోజుల నుంచి రొయ్యల ధరలు పతనమవుతున్నాయి. ఆశాజనకంగా ఉన్న ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. కిలో రొయ్యలు రూ.100 నుంచి రూ.200 వరకు తగ్గింది. భారీగా ఖర్చుపెట్టి సాగు చేసిన పంటకు ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో ఇంకా ఎక్కడ పూర్తిగా తగ్గిపోతాయేమోనని వచ్చిన కాడికి చెరువుల్లో రొయ్యలు పట్టేస్తున్నారు. ప్రతికూల వాతావరణం: వాతావరణం ప్రతినుకూలంగా ఉండడంతో వెనామీ రొయ్యలు తట్టుకోలేకపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ దాటడం వల్ల ఆక్సిజన్ అందక ఎదుగుదల పూర్తిగా నిలిచిపోయింది. పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడం, రాత్రి వేళల్లో మంచు కురవడంతోపాటు 20 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడం కూడా రొయ్యలు అనారోగ్యం బారిన పడడానికి కారణ మైంది. ఎన్ని ఏరేటర్స్ పెట్టినా అవి వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక వృద్ధి మందగించింది. రైతులు సాగులో ఉన్న రొయ్యలను ఏ విధంగా కాపాడుకోవాలా అని మదనపడుతుంటే పుండుమీద కారంలా రొయ్యల వ్యాపారులు సిండికేట్‌గా మారి రొయ్యల ధరలను తగ్గించేస్తున్నారు. ఊపిరి సలుపుకోని రైతులు వ్యాపారుల ఎత్తుగడకు తలొగ్గక తప్పలేదు. సాధారణంగా 30 కౌంట్ వచ్చే వరకు ఉంచాల్సిన రొయ్యలను 60 కౌంట్ లేదా 70 కౌంట్‌కే చెరువులను ఖాళీ చేయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. లాభాలు రాకపోయినా ఫరవాలేదు, పెట్టుబడులు వస్తే చాలన్న ఆలోచనలో రైతులున్నారు. సగానికి పడిపోయిన సాగు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రొయ్యల చెరువుల సాగు విస్తీర్ణం ఇప్పటికే సగానికి పడిపోయింది. సాధారణంగా డిసెంబర్ నుంచే రొయ్యల సాగుకు ఉపక్రమిస్తారు. జనవరిలో రొయ్య పిల్లలను వదులుతారు. అప్పటికే రొయ్యల సీడ్ నాణ్యమైనది దొరక్కపోవడంతో కొంతమేర సాగు చేయలేదు. జిల్లాలో మొత్తం 5 వేల ఎకరాల్లో గతేడాది రొయ్యల సాగు చేపట్టారు. అలాంటిది ఈ ఏడాది వెయ్యి ఎకరాలకు పైగా సాగు చేయకుండా వదిలేశారు. నాలుగైదు చెరువులు సాగు చేసే రైతులు మూడు చెరువులకు కుదించుకున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో 1500 ఎకరాల మేర చెరువుల్లో వేసిన రెండు నెలలకే వచ్చిన వరకు తీసేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతోపాటు వైట్‌స్పాట్ వ్యాధి సోకడంతో ఇంకా ఉంచితే నష్టపోతామని చెరువులను ఖాళీ చేశారు. వైట్‌స్పాట్‌తోపాటు, లూజ్‌షెల్ వ్యాధి కూడా సోకి ఎదుగుదలను కట్టడి చేసింది. వీటికి తోడు ఫంగస్ వ్యాధి కూడా రొయ్యలను వెంటాడుతోంది. జిల్లాలో దాదాపు 2500 ఎకరాల్లోపు మాత్రమే ప్రస్తుతం సాగులో ఉన్నాయి.