
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన వరం.. 53 వేల మంది రైతులకు మేలు చేకూరుస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. ఇటీవల సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆక్వా రైతులకు రూ. 1.50కే యూనిట్ విద్యుత్ అందించే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ట్విటర్ వేదికగా విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆక్వా రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయన్నారు. చాలీ చాలని రాబడితో సతమవుతున్న 53వేల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. గత ప్రభుత్వం ఆక్వా సాగుకు యూనిట్ కరెంటుకు రూ. 3.86 వసూలు చేసేదని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment