సాక్షి, అమరావతి: ’ఫిష్ ఆంధ్ర’ బ్రాండింగ్‌ను మరింతగా ప్రోత్సహించేందుకు మత్స్య శాఖచర్యలు చేపట్టింది. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న ఒడిదుడుకులతో ఆక్వా రంగంలో తరచూ తలెత్తుతున్న సంక్షోభం దృష్ట్యా కేవలం ఎగుమతులపైనే ఆధారపడకుండా స్థానిక వినియోగంపైనా దృష్టి సారించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా మత్స్య ఉత్పత్తుల తలసరి వినియోగం పెంచడం.. తద్వారా ఆక్వా రైతులు, మత్స్యకారులకు అండగా నిలబడటమే లక్ష్యంగా ముందుకెళుతోంది.
ఇందులో భాగంగా రాష్ట్రంలో లభించే సముద్ర, రైతులు పండించే మత్స్య ఉత్పత్తులను ‘ఫిష్ ఆంధ్ర’ పేరిట హబ్‌లు, అవుట్‌లెట్స్, కియోస్క్‌ల ద్వారా మత్స్య శాఖ విక్రయిస్తోంది. వీటిని బ్రాండింగ్ చేసేందుకు ప్రత్యేకంగా యూట్యూబ్ చానల్‌తో పాటు ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రమోట్ చేయనుంది. డోర్ డెలివరీ కోసం ప్రత్యేకంగా యాప్‌ను డిజైన్ చేయనున్నారు.
కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ (సీఆర్ఎంఎస్) ద్వారా వినియోగదారులు ఎలాంటి ఉత్పత్తులను ఎక్కువగా ఇష్టపడుతున్నారనే దానిపై ప్రతిరోజూ ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కన్సల్టెంట్ నియమించనున్నారు.
ఆసక్తి కల్గిన ఏజెన్సీల నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్‌ఎఫ్‌పీ) కోరుతూ బుధవారం మత్స్యశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి గల ఏజెన్సీలు www.fisheries.ap.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా టెండర్ డాక్యుమెంట్స్ డౌన్‌లోడ్ చేసుకుని వచ్చే నెలాఖరులోగా apfisheriestender@gmail.comలో దరఖాస్తు చేసుకోవాలని మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు కోరారు.
బ్రాండింగ్ ‘చేప’ట్టిన సర్కారు.. ‘ఫిష్ ఆంధ్ర’కు ప్రమోషన్
Published Thu, Dec 29 2022 6:30 AM | Last Updated on Thu, Dec 29 2022 11:29 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment