
సాక్షి, అమరావతి: ఆక్వా రైతులకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారు. ఈ రంగానికి పంపిణీ చేసే యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి మంగళవారం జీవో జారీ చేశారు. దీనివల్ల ఆక్వా రైతులకు రూ.720 కోట్ల మేర లబ్ధి చేకూరుతుంది. రాష్ట్రంలో ఆక్వా రైతన్నలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కల్తీ విత్తనాలు, మందుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి తోడు విద్యుత్ రేట్లు ఆక్వా రంగాన్ని మరింత నష్టానికి గురిచేస్తున్నాయి.
విపక్ష నేతగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన పాదయాత్ర సందర్భంగా అనేక జిల్లాల్లో ఆక్వా రైతులు తాము నష్టపోతున్న వైనాన్ని వివరించారు. దీంతో జగన్ తాను అధికారంలోకి వస్తే ఆక్వా రైతుకు విద్యుత్‌ను యూనిట్ రూ.1.50 చొప్పునే అందిస్తానని హామీ ఇచ్చారు. దీంతో అప్పటి ప్రభుత్వం కంగారుపడింది. ఎన్నికల సమయంలో హడావుడిగా టారిఫ్ కొంత తగ్గించడం ద్వారా ప్రయోజనం పొందే ప్రయత్నం చేసింది. అయితే ఇటీవలి ఎన్నికల తర్వాత అధికారం చేపట్టిన వైఎస్ జగన్ తాను ఇచ్చిన మాట ప్రకారం ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక సంవత్సరం వరకు అమలులో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment