సాక్షి, తాడేపల్లి: కష్ట కాలంలో ఆక్వా రైతులకు ప్రభుత్వం అండగా నిలిచిందని కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కొల్లేరు ప్రాంత చేపల రైతుల సమస్యలను వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆక్వా ఎగుమతులకు సీఎం ప్రత్యేక చర్యలు తీసుకున్నారని.. ఫలితంగా కరోనా విపత్తు సమయంలో ఆక్వా రైతుల కష్టాలు తీరాయని పేర్కొన్నారు. తమ ప్రాంతంలో చేపల రైతుల కష్టాలు గురించి ముఖ్యమంత్రికి విన్నవించామని..ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.
(ఎమర్జెన్సీ సేవలు అందేలా చూడాలి: సీఎం జగన్)
ధర విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. అలాగే కొనుగోలు సమయంలో రిబేటు వల్ల చేపల రైతులు నష్టపోతున్నారని సీఎం వివరించామని.. దీనిపై కూడా రైతులకు న్యాయం జరిగేవిధంగా చట్టం తీసుకువస్తామని సీఎం తెలిపారని చెప్పారు. కొల్లేరు వద్ద రెగ్యులేటర్ త్వరలో ఏర్పాటు చేయబోతున్నామని సీఎం చెప్పారని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment