kaikaluru
-
కైకలూరు కోడి పందేల్లో ఆర్జీవీ హీరోయిన్ అప్సర రాణి సందడి (ఫొటోలు)
-
కైకలూరులో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
కొల్లేరులోని లంక గ్రామాల్లో పెద్దలదే పెత్తనం
కొల్లేరులో పెదరాయుళ్ల జమానా బలంగా నడుస్తోంది. అడ్డగోలు తీర్పులతో కుటుంబాలను విభజించడం, అన్యాయంగా కొన్ని కేసుల్లో బాధితులను ఇబ్బందులు పెట్టేలాంటి తీర్పులు తరచూ లంక గ్రామాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఏళ్ల తరబడి ఒకే తరహా తీర్పులతో కుల కట్టుబాట్ల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నా ఉన్నతాధికారులు నోరుమెదపలేని పరిస్థితి. అనేక ఘటనలు తెర మీదకు వచ్చి ఎస్పీ, కలెక్టర్లకు ఫిర్యాదులు చేసినా విచారణల పేరుతో వదిలేస్తున్నారు. తాజాగా చేతబడి నెపంతో ఒక కుటుంబాన్ని తీవ్రంగా కొట్టి గాయపరచడం, మరో కేసులో అడ్డగోలుగా భార్యాభర్తలకు విడాకులు ఇప్పించడం వివాదాస్పదంగా మారాయి. – సాక్షి ప్రతినిధి, ఏలూరుకొల్లేరులో పంచాయతీలకు సమాంతరంగా బంటాపెద్దలు తీర్పులు చెబుతూ సమాంతర పంచాయితీ నడుపుతున్నారు. సాధారణంగా తప్పు చేస్తే స్టేషన్‌కు వెళ్లే సంస్కృతి లేకుండా తప్పు జరిగితే బంటా పెద్దలకు ఫిర్యాదు చేయడం, వారే సెటిల్మెంట్ చేయడం కొల్లేరులోని ప్రజలు వారి తీర్పును వ్యతిరేకిస్తే గ్రామానికి వచ్చే అక్రమ చేపల చెరువుల ఆదాయంలో వాటాలు ఇవ్వబోమని బెదిరించడం, సాంఘిక బహిష్కరణ చేస్తామని హెచ్చరించడం చేస్తూ నిరాటంకంగా తమ జమానా కొనసాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొల్లేరు పెదరాయుళ్ళ హవా రెట్టించింది. అన్ని రాజకీయ పార్టీలకూ కొల్లేరు ఓట్లు అత్యంత కీలకం. 4 నియోజకవర్గాలు.. 9 మండలాల్లో విస్తరించిన కొల్లేరులో 122 గ్రామాలున్నాయి. బంటా పెద్దలదే పెత్తనం, ఓటింగ్ విషయంలో వీరి మాటే చెల్లుతుండటంతో అధికార పార్టీ సహా అందరూ పెద్దల మాటకు తలొగ్గాల్సిన పరిస్థితులున్నాయి.కొల్లేరు స్వరూపం ఇదీ..నియోజకవర్గాలు: ఉంగుటూరు, దెందులూరు, ఉండి, కైకలూరు మండలాలు: కైకలూరు, మండవల్లి, ఏలూరు రూరల్ మండలం, పెదపాడు, దెందులూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం, ఉండిగ్రామాలు : 122జనాభా: 3.50 లక్షలుకుటుంబాలు: 78 వేలుఓట్లు : 1.75 లక్షలుకట్టేసి కొట్టడమే కొన్నింటిలో శిక్షలుఉదాహరణకు భార్య, భర్త విడిపోతే వివాహ సమయంలో భర్త తీసుకున్న లాంచనాలు సర్వం చెల్లించేస్తే విడాకులు మంజూరవుతాయి. వివాహేతర సంబంధం కేసుల్లో అయితే వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తి వివాహిత భర్తకు పరిహారం ఇస్తే కేసు సెటిల్ అయిపోతుంది. అది కూడా కేసును బట్టి లక్షల్లోనే ఉంటుంది. ఇక చేతబడులు, ఇతరత్రా అనుమానాలు అయితే కట్టేసి కొట్టడమే శిక్ష. ఇలాంటి అనైతిక చర్యలు నేటికీ కొల్లేరులో కొనసాగుతున్నాయి. తాజాగా కైకలూరు మండలం చటాకాయి గ్రామంలో చేతబడి నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులను కొల్లేరు పెద్దల తీర్పుతో చితకబాదారు. అక్టోబరు 25న కమ్యూనిటీ హాలు వద్ద స్తంభాలకు కట్టేసి గ్రామపెద్దల సమక్షంలో 18 మంది కలసి కర్రలతో కొట్టారు. వీరిలో బాధితుడు సైదు రఘు ఏకంగా మంగళగిరి టీడీపీ కార్యాలయానికి వెళ్లి గోడు వెళ్లబోసుకున్నాడు. మరో ఇద్దరు మోరు రాంబాబు, జయమంగళ ధనుంజయ ఏలూరు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ కేసులో ఆరుగురిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా కొందరు బాధితులపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఏలూరు రూరల్ మండల శ్రీపర్రులో భార్యాభర్తలకు విడాకులు అడ్డగోలుగా ఇప్పించడంపై భార్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. శ్రీపర్రు గ్రామానికి చెందిన సుభాష్‌తో కైకలూరు మండలం చటాకాయి గ్రామానికి చెందిన మహిళకు 2012లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. గత నెల 27న గ్రామ పెద్దలు ఏకంగా రాతపూర్వకంగా విడాకుల తంతు పూర్తి చేశారు. దీంతో బాధిత మహిళ.. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ కేపీఎస్ కిషోర్‌లకు ఇటీవల ఫిర్యాదు చేసింది.1952 నుంచి తీర్పులుఒడిశాకు చెందిన ఒక తెగ వందల ఏళ్ల క్రితం కొల్లేరు ప్రాంతానికి వచ్చి చేపలు పట్టుకోవడం ప్రధాన వృత్తిగా ఎంచుకుని లంక గ్రామాల్లో స్థిరపడిపోయింది. 1952 నుంచి కొల్లేరులో బంటా పెద్దల పాలనకు తెర లేచింది. అందరికీ ఆదాయాన్ని చూపి పెద్దల పెత్తనం సాగిస్తుంటారు. ఉదాహరణకు ఒక గ్రామ పరిధిలో 500 ఎకరాల్లో అభయారణ్యం ఉంటే దానిలో కొందరు పెట్టుబడిదారులతో చెరువులు వేయించి ఎకరాకు రూ.లక్ష చొప్పున కౌలుకు తీసుకుని గ్రామంలో ఎంతమంది మగవారు ఉంటే అంతమందికి వాటాలేసి ప్రతి ఏటా బంటా పెద్దలు ఆదాయం ఇస్తుంటారు. కొన్ని కీలక ఘటనల్లో బాధితులు స్టేషన్లకువెళ్లినా..ఉన్నతాధికారులను కలిసినా వారిని కట్టుబాట్ల పేరుతో వేధించడం, బహిష్కరణకు గురి చేస్తున్నారు. 122 గ్రామాల్లో పంచాయతీ పాలన ఉండి, సర్పంచులు ఉన్నప్పటికీ వ్యవస్థ నడిపేది బంటా పెద్దలే. ఒక్కో గ్రామంలో 10 మందితో పెద్దలు కమిటీలా ఏర్పడి ప్రతిరోజూ కమ్యూనిటీ హాలు వద్ద పంచాయితీలు చేస్తుంటారు. -
ఓటు వేసే ముందు ఒక్కసారి ఈ విషయాలు ఆలోచించండి...
-
మంచికి చెడుకు మధ్య యుద్ధం: వైఎస్ జగన్
-
వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే
-
మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
ఏలూరు, సాక్షి: చంద్రబాబు ప్రలోభాలకు గురి కావొద్దని.. మళ్లీ మోసపోవద్దని కైకలూరు ఓటర్లకు సీఎం జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. పథకాలు కొనసాగాలన్నా.. ఇంటింటా అభివృద్ధి జరగాలన్నా మీ బిడ్డ జగన్‌ను మళ్లీ ఆశీర్వాదించాలని కోరారాయన. కైకలూరులో జరిగిన ఎన్నికల ప్రచార భేరిలో ఆయన మాట్లాడుతూ..కైకలూరు సిద్ధమా?.. ఇంతటి ఎండను ఏమాత్రం కూడా ఖాతరు చేయడం లేదు. ఎండ తీక్షణంగా ఉంది. అయినా కూడా అందరి ముఖంలో చిక్కటి చిరునవ్వు కనిపిస్తోంది. మీ అందరి ప్రేమానురాగాలు, మీ అందరి ఆప్యాయతల నడుమ.. ఇక్కడకు వచ్చిన నా ప్రతీ అక్కకూ, నా చెల్లెమ్మకి, నా ప్రతీ అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతీ సోదరుడికి, నా ప్రతీ స్నేహితునికీ ..మీ అందరికి మీ బిడ్డ జగన్ రెండు చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు.మరో 36 గంటల్లో జరగనుంది కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటం. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు అర్థం. పొరపాటున చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే.దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకువచ్చాడు. గతంలో ఎప్పుడూ జరగని విప్లవాలను మీ బిడ్డ తీసుకురాగలిగాడు. ఆలోచన చేయండి. అక్కచెల్లెమ్మల కోసం మీ బిడ్డ జగన్ వివిధ పథకాల కోసం 130 సార్లు బటన్ నొక్కాడు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు బటన్ నొక్కడం...నేరుగా నా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. నేరుగా వారి చేతికే డబ్బులు వెళ్లిపోతాయి. ఏదేళ్లు ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.మీ బిడ్డ పాలన కంటే ముందు ఈ మాదిరిగా బటన్లునొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ కావడం అనేది గతంలో ఎప్పుడైనా జరిగిందా?.గతంలో ఎప్పుడూ చూడని విధంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ 59 నెలల పాలనలో మీ బిడ్డ ఇవ్వగలిగాడు. ఇంతకు ముందు మేనిఫెస్టో ఇచ్చేవారు. ఎన్నికలయ్యాక చెత్త బుట్టలో వేసే పరిస్థితిని మీ బిడ్డ మార్చాడు. ఏకంగా 99% హామీలు నెరవేర్చి, ఆ మేనిఫెస్టోను ప్రతీ అక్కచెల్లెమ్మల ప్రతీ ఇంటికి పంపించాడు. మీరే టిక్కు పెట్టండి అంటూ విశ్వసనీయత పరిస్థితి ఈ 58 నెలల కాలంలోనే జరిగింది.ఇప్పుడు నేను గడగడా గడగడా మచ్చుకు కొన్ని పథకాల పేర్లు చెబుతా. గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు.. ఐబీ దాకా ప్రయాణం. గవర్నరమెంట్ బడుల్లో చదివే పిల్లల కోసం బైలింగువల్ టెక్స్ట్ బుక్‌లు. బడులు తెరిచేసరికే విద్యాకానుక. బడుల్ పిల్లలకు గోరుముద్ద. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా.. పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి. పెద్ద చదవుల కోసం ఏ తల్లీ తండ్రీ అప్పులపాలు అవ్వకూడదని.. మెడిసిన్, డిగ్రీలు చదువుతున్న పిల్లల కోసం అప్పులపాలయ్యే పరిస్థితి లేకుండా 93 శాతం పూర్తి ఫీజులు కడుతూ.. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన.మొట్టమొదటిసారిగా డిగ్రీలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సర్టిఫైడ్ కోర్సులు.. మాండేటరీ ఇంటర్న్‌షిప్.. ఈ చదువుల విప్లవాలు గతంలో ఏనాడైనా జరిగాయా?అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేలా.. వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్లుకూడా ఎదగాలని.. నా అక్కచెల్లెమ్మల కోసం ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్. అందులో ఏకంగా కడుతున్న ఏకంగా 22 లక్షల ఇళ్లు.. ఇంతగా అక్కచెల్లెమ్మల కోసం తాపత్రయపడిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా?గతంలో ఎప్పుడూ జరగని విధంగా.. అవ్వాతాతలకు నేరుగా ఇంటి వద్దకే పెన్షన్. ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు. ఇంటి వద్దకే పథకాలు.. గతంలో మీ ఇంటి వద్దకే ఎప్పుడైనా వచ్చాయా?. ఇంటికే పెన్షన్ వచ్చిందా?. ఇంటికే రేషన్ వచ్చిందా.. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇప్పుడు జరిగింది. మొట్టమొదటిసారిగా.. రైతన్నకు చెయ్యి పట్టుకుని నడిపిస్తూ.. పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా. రైతన్నలకు ఉచిత పంటలబీమా. సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ. రైతన్నలకు పగటి పూటే 9 గం.ల నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతన్నల చేయి పట్టుకుని నడిపించే గ్రామంలో ఒక ఆర్బీకే వ్యవస్థ.. గతంలో ఇన్నిన్ని మార్పులు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.స్వయం ఉపాధికి తోడుగా.. అండగా.. సొంతంగా ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవర్ అన్నదమ్ములకు ఓ వాహన మిత్ర, నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా.. ఫుట్‌పాత్‌ల ఉన్న నా అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలు, కూరగాయలు అమ్ముకునేవాళ్లు, ఫుట్‌పాత పక్కన ఇడ్లీలువేసుకునేవాళ్లు.. వారి కోసం ఈరోజు జగనన్న తోడు. రజకులకు, బ్రహ్మణులకు ఓ చేదోడు, లాయర్లకు ఒక లా నేస్తం. గతంలో ఇన్ని పథకాలు ఏనాడైనా ఉన్నాయా?.గతంలో ఎప్పుడూ చూడని విధంగా.. ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని.. మొట్టమొదటిసారిగా ఆరోగ్యరక్షగా విస్తరించిన ఆరోగ్యశ్రీ. ఉచితంగా రూ.25 లక్షల దాకా విస్తరించిన ఆరోగ్యశ్రీ. ఆపరేషన్ అయ్యాక రెస్ట్ పీరియడ్‌లో పేదవాడికి ఆరోగ్య ఆసరా. మొట్టమొదటిసారిగా గ్రామంలోనే విలేజ్ క్లినిక్. ఆ గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్. పేదవాడి కోసం ఇంటి వద్దకే టెస్టులు చేస్తూ.. మందులిస్తున్న ఆరోగ్య సురక్ష. ఇంతగా పేదవాడి ఆరోగ్యం గురించి పట్టించుకున్న పరిస్థితులు ఉన్నాయా?.గ్రామంలో అయినా 600 సేవలు అందిస్తూ కనిపిస్తున్న సచివాలయం. అదే గ్రామంలో వలంటీర్ వ్యవస్థ. నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ ఓ విలేజ్ క్లినిక్. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు వేస్తే కనిపిస్తుంది ఫైబర్ గ్రిడ్, గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరరీ. మొట్టమొదటిసారి నా అక్కచెల్లెమ్మల కోసం.. వాళ్ల రక్షణ కోసం గ్రామంలోనే మహిళా పోలీస్. మొట్టమొదటిసారి అక్కచెల్లెమ్మల కోసం ఫోన్లోనే దిశ యాప్. దిశ యాప్ ద్వారా అక్కచెల్లెమ్మలు ఏ ఆపదలో ఉన్నా.. ఫోన్ ఐదుసార్లు షేక్ చేసినా పోలీసులు వచ్చి ‘‘చెల్లెమ్మా ఏం జరిగింది?’’ అని అడుగుతున్న పరిస్థితి. గతంలో ఇలాంటి పరిస్థితులు చూశారా? ఆలోచన చేయండి.పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి.. మూడుసార్లు సీఎం చేశానంటాడు. మరి పేదవాళ్లకు ఒక్కటంటే ఒక్కటైనా మంచి గుర్తుకొస్తుందా?.(లేదు.. అనే సమాధానం వచ్చింది). చంద్రబాబు పేరు చెబితే ఏ పథకం కూడా గుర్తుకు రాదు. ఏ మంచి గుర్తుకు రాలేదు. ఈ పెద్ద మనిషి అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు.. మోసాలు.ఇది గుర్తుందా? (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ).. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడి ఈ ఫాంప్లెట్ మీద చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి.. సంతకం పెట్టిన ఈ ఫాంప్లెట్‌ను మీ ప్రతి ఇంటికీ పంపించాడు. 2014 ప్రజలు నమ్మి చంద్రబాబుకి ఓటేశారు. ముఖ్యమైన హామీలంటూ ప్రతీ ఇంటికి పంపించిన వాటిల్లో ఒక్కటైనా చేశారా?.రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు ఈ పెద్దమనిషి చంద్రబాబు. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు.. మాఫీ అయ్యాయా?. రెండో హామీ.. పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలన్నీ మాఫీ రద్దు చేస్తానన్నాడు. రూ.14,205 కోట్ల డ్వాక్రా రుణాలు ఒక్క రూపాయైనా మాఫీ అయ్యాయా?. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ వేస్తామన్నారు చంద్రబాబు. నేను అడుగుతున్నాను.. రూ.25 వేల కథ దేవుడెరుగు ఇన్ని వేలమంది ఇక్కడ ఉన్నారు కదా? ఒక్కరి అకౌంట్లో అయినా కనీసం ఒక్క రూపాయి అయినా చంద్రబాబు వేశారా? అని అడుగుతున్నా.అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నారు. చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చారా?. ఇంటింటికీ ఉద్యోగం అన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా అన్నారు. ఐదేళ్లు అంటే 60 నెలలు, నెలకు రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1,20,000 ఇచ్చారా?రూ.10,000 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నారు? చేశారా?. విమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నారు? చేశారా? సింగపూరుకు మించి అభివృద్ధి చేస్తామన్నారు.. చేశారా? కైకలూరులో ఏమైనా జరిగిందా? పోనీ ప్రత్యేక హోదా అయినా ఇచ్చారా? దాన్నీ అమ్మేశారు. మరి నేను అడుగుతున్నాను. ఇలాంటి వాళ్లను నమ్మొచ్చా?..మళ్లీ ఇదే ముగ్గురూ.. ఇదే కూటమి.. ఇదే చంద్రబాబు.. సూపర్ సిక్స్ అంట.. నమ్ముతారా?, సూపర్ సెవెన్ అంట.. నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారంట.. నమ్ముతారా? ఇంటింటికీ బెంజికారు అంట.. నమ్ముతారా? ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను.ఇలాంటి అబద్ధాలు, మోసాలతో యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబు ప్రలోభాలను నమ్మొద్దు. ఐదేళ్లు మీ అందరికి క్యాలెండర్‌ఇచ్చి.. ఏ నెలలో ఏం చేస్తాం అనేది.. ఏ నెలలో చేయూత, అమ్మ ఒడి అని ప్రతీ నెలా.. క్రమం తప్పకుండా చేస్తున్న మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి. చంద్రబాబు ప్రలోభాలతో మోసపోకండి. జరుగుతున్న మంచిని పొగొట్టుకోకండి.వలంటీర్లు ఇంటికే రావాలన్నా.. అవ్వాతాతల పెన్షన్ ఇంటికే రావాలన్నా.. నొక్కిన బటన్ డబ్బులు మళ్లీ నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాలో పడాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్ మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.కొల్లూరు సమస్య పరిష్కారం కావాలన్నా.. మీ బిడ్డ సీఎం కావాలి. చెప్పిన మాట ప్రకారం సర్వే జరుగుతోంది. సర్వేకు సంబంధించిన రిపోర్టు పూర్తికాగానే.. అదనపు భూమిని పంచుతాం. అదీ బిడ్డ జగన్ చేతుల మీదుగానే జరుగుతుంది.ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడూ.. మన గుర్తు ఫ్యాన్, అక్కా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అన్నా తమ్ముడు మన గుర్తు ఫ్యాన్.. చెల్లి మన గుర్తు ఫ్యాన్. మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి. బీజేపీ ఎక్కడ ఉండాలి.. సింక్‌లోనే ఉండాలి. కాదు.. చెరువులో ఉండాలి.వైఎస్సార్సీపీ తరఫున ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న డీఎన్ఆర్(దూలం నాగేశ్వరరావు) , కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెలమలశెట్టి సునీల్ గెలిపించాలని సీఎం జగన్ ప్రజలను కోరుతూ ప్రసంగం ముగించారు. -
కైకలూరులో సీఎం జగన్ కాన్వాయ్ ర్యాలీ కిక్కిరిసిన జనం
-
Watch Live: కైకలూరులో సీఎం జగన్ ప్రచార సభ
-
కదంతొక్కిన కైకలూరు
సాక్షి, భీమవరం/కైకలూరు: కొల్లేరులో సామాజిక సాధికార నినాదం ఉప్పొంగింది. కోల్లేరే పొంగిందా అన్నట్టుగా కైకలూరును జన సునామీ ముంచెత్తింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల ‘జై జగన్’ నినాదాలతో కైకలూరు నియోజకవర్గం హోరెత్తింది. నియోజకవర్గంలో మంగళవారం జరిగిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర వేలాది ప్రజలతో ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన బస్సు యాత్ర కైకలూరు సీతారామ›› ఫంక్షన్ హాల్ నుంచి రైతుబజారు సెంటర్లోని బహిరంగ సభ వేదిక వరకు సాగింది. అడుగడుగునా ప్రజలు పూలవర్షం కురిపిస్తూ యాత్రకు బ్రహ్మరథం పట్టారు. వివిధ ప్రాంతాల మహిళలు, గ్రామ పెద్దలు వాహనాలతో యాత్రకు వచ్చారు. సమావేశం ఆద్యంతం ‘జగనే కావాలి–జగనే రావాలి’ నినాదాన్ని హోరెత్తించారు. నాడు వివక్ష.. నేడు సామాజిక సాధికారత: మంత్రి రజిని ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల క్రితం వరకు వివక్షకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సీఎం వైఎస్ జగన్ అండతో ఇప్పుడు సామాజిక సాధికారత సాధించి, తలెత్తుకు తిరుగుతున్నారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఈ నాలుగేళ్లలో పేదల సంక్షేమం కోసం డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.4.8 లక్షల కోట్లు ఇస్తే.. అందులో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే అందించారని తెలిపారు. రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి బాటలు వేస్తున్న ఏకైక సీఎం జగన్ అని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా జగనన్నకు అండగా నిలవాలని కోరారు. 17 ఎమ్మెల్సీల్లో 14 బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకే: మంత్రి కారుమూరి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయానికి పెట్టింది పేరని అన్నారు. 17 ఎమ్మెల్సీల్లో 14 బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఇచ్చారని, బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆర్.కృష్ణయ్య, పిల్లి సుభాష్ చంద్రబోస్, బీద మస్తా¯Œ యాదవ్, మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు పంపారని తెలిపారు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపించలేదని విమర్శించారు. బీసీ అయిన జయమంగళ వెంకటరమణకు చంద్రబాబు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు రెండింటిలోనూ హామీ ఇచ్చి మోసం చేశారని, సీఎం జగన్ మాత్రం ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారని గుర్తుచేశారు. న్యాయం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్: ఎంపీ మోపిదేవి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ పేదల కష్టాలు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా ఎలాంటి పథకాలు ప్రవేశపెడితే వారు అభివృద్ధి చెందుతారో సీఎం జగ¯న్ ఆలోచన చేశారన్నారు. దీనికి అనుగుణంగానే ప్రతి కుటుంబానికీ రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ లబ్ధి చేకూరిందన్నారు. రాజకీయంగా అణచివేతకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సామాజిక న్యాయం చేశారన్నారు. అన్నింటా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే పెద్దపీట : మంత్రి జోగి రమేష్ కైకలూరు సభలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. సీఎం జగన్ సామాజిక ధర్మాన్ని పాటిస్తూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రామ్, మహాత్మా జ్యోతిరావ్ పూలే వంటి మహనీయుల అడుగు జాడల్లో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారని చెప్పారు. కేబినెట్ సహా అన్ని పదవుల్లో, పథకాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకే పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. కేబినెట్లో 25 మంది మంత్రులు ఉంటే వారిలో 17 మంది ఈ వర్గాల వారినే సీఎం నియమించారన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆరి్థకాభివృద్ధికి బాటలు వేశారని వివరించారు. ఈ ఘనత జగన్‌దే: ఎమ్మెల్యే నాగేశ్వరరావు సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒక్క కైకలూరులోనే 15 వేల ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందన్నారు. నియోజకవర్గంలో సంక్షేమ పథకాల కోసం రూ.746 కోట్లు అందించారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక పాల్గొన్నారు. -
కైకలూరులో సామాజిక సాధికారిక బస్సు యాత్ర
-
కొల్లేరులో వి‘హంగామా’
శీతాకాలపు విడిది పక్షుల కిలకిలారావాలతో కొల్లేరు కళకళలాడుతోంది. ఇక్కడే పుట్టి.. బతుకు పయనంలో వేల కిలోమీటర్ల మేర వలస పోయిన అతిథి పక్షులు గమనం తప్పకుండా ఏటా మాదిరిగానే విడిది కోసం కొల్లేరు అభయారణ్యానికి వస్తున్నాయి. సంతానాన్ని వృద్ధి చేసుకుని.. పిల్లలతో కలిసి విదేశాలకు వలస పోయేంతవరకు ఇక్కడే గూళ్లు కట్టుకుని సందడి చేస్తుంటాయి. నిండా పక్షులతో పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల పరిధిలోని కొల్లేరు ప్రాంతం ఈ ఏడాదీ పర్యాటకులకు ఆహ్వా నం పలుకుతోంది. ఏటా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కొల్లేరు పక్షుల వీక్షణకు అనువైన కాలం. ఈ దృష్ట్యా ఆటపాక, మాధవాపురం పక్షుల విహార కేంద్రాల వద్ద పర్యాటకుల కోసం అటవీ శాఖ మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ఈ ఏడాది ఎక్కువ మంది పర్యాటకులు కొల్లేరుకు విచ్చేస్తారని అంచనా వేస్తోంది. - కైకలూరు 105 రకాల పక్షులున్నాయ్ కొల్లేరు అభయారణ్యంలో వివిధ జాతులకు చెందిన 105 రకాల పక్షి జాతులు ఉన్నట్టు ఏషియన్ వాటర్ బర్ట్స్ సెన్సస్–2023 నివేదిక వెల్లడించింది. ఇక్కడ మొత్తం 81,495 పక్షులు ఉన్నట్టు నిర్థారించారు. వీటిలో అత్యధికంగా 7,875 కోయిలలు ఉండగా.. రెండో స్థానంలో 6,869 పెలికాన్లు (గూడబాతులు) ఉన్నట్టు తేల్చింది. వీటితోపాటు ఎర్రకాళ్ల కొంగ (పెయిండెడ్ స్టార్క్), కంకణాల పిట్ట (గ్లోబీ ఐబీస్), నల్లరెక్కల ఉల్లంకి పిట్ట (బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్) వంటి అనేక పక్షి జాతులు ఇక్కడ సందడి చేస్తున్నాయి. ఇవికాకుండా కొల్లేరు అభయారణ్యానికి ఏటా 3 లక్షల నుంచి 4 లక్షల పక్షులు విహారానికి వస్తున్నాయి. వీటిలో సుమారు 1.20 లక్షల పక్షలు విదేశాల నుంచి విడిది కోసం వచ్చే పక్షులు ఉంటున్నాయి. కొల్లేరు ప్రాంతాన్ని పక్షులు సంచరించే ప్రయాణంలో ‘సెంట్రల్ ఏషియన్ ఫ్లై వే’ అంటారు. కొల్లేరు చిత్తడి నేలల ప్రాంతం కావడంతో వలస పక్షుల ఇక్కడ విడిది చేసేందుకు ఇష్టపడతాయి. కొల్లేరు ప్రాంతానికి రష్యా, బ్రిటన్, మాల్దీవులు, బంగ్లాదేశ్ తదితర 30 దేశాల నుంచి వివిధ వలస జాతుల పక్షులు విచ్చేస్తాయి. అక్టోబర్ నుంచి వీటి రాక మొదలవుతుంది. మార్చి నాటికి సంతానోత్పత్తి చేసుకుని ఇవి తిరిగి తిరిగి వెళ్లడం అనవాయితీగా వస్తోంది. ఎకో టూరిజానికి ప్రతిపాదనలు జిల్లాల పునర్విభజన తర్వాత కొల్లేరు ప్రాంతమంతా ఏలూరు జిల్లా పరిధిలోకి చేరింది. కొల్లేరు ఎకో టూరిజం అభివృద్ధికి రూ.187 కోట్ల ఖర్చు కాగల ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో 20 ప్రదేశాలను గుర్తించి బోటు షికారు, సంప్రదాయ గేలాలతో చేపలు పట్టుకోవడం, పక్షుల వీక్షణ వంటివి ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 10 ప్రదేశాలను పర్యాటక శాఖ గుర్తించింది. రానున్న రోజుల్లో కొల్లేరు ఎకో టూరిజం పర్యాటక శాఖకు ప్రధాన ఆదాయ వనరుగా మారనుంది. ప్రధానంగా పర్యాటకులు విచ్చేసే పక్షుల విహార కేంద్రాల వద్ద మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రండి రండి.. ఇలా చేరుకోండి విజయవాడ.. ఏలూరు.. భీమవరం ప్రాంతాల నుంచి కైకలూరు–భీమవరం జాతీయ రహదారి మీదుగా ఆటపాక చేరుకోవచ్చు. ఈ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది. బస్సు దిగిన తరువాత పక్షుల కేంద్రానికి నడక మార్గంలో చేరుకోవచ్చు. విజయవాడ–విశాఖపట్నం రైలు మార్గంలో కైకలూరు రైల్వే స్టేషన్లో దిగి ఆటోలపై మూడు కిలోమీటర్ల దూరంలో పక్షుల కేంద్రానికి చేరవచ్చు. పక్షుల కేంద్రం, మ్యూజియం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తెరిచి ఉంటాయి. రూ.30 లక్షలతో అభివృద్ధి పనులు ఆటపాక పక్షుల కేంద్రం వద్ద రూ.30 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నాం. పక్షుల నివాసాలకు కృత్రిమ ఇనుప స్టాండ్లు, పక్షుల విహార చెరువు గట్లు పటిష్టపర్చడం, గోడలకు పక్షుల చిత్రాలు, పర్యాటకులకు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, ఇతర మరమ్మతులు చేయనున్నాం. పక్షి ప్రేమికుల స్వర్గథామంగా పేరుగడించిన ఆటపాక పక్షుల కేంద్రం అభివృద్ధికి అటవీ శాఖ అన్ని విధాలుగా కృషి చేస్తోంది. – జె.శ్రీనివాస్, అటవీశాఖ రేంజర్, కైకలూరు -
మెగా పొలిటికల్ బ్రోకర్ పవన్ కళ్యాణ్ కు కైకలూరు ఎమ్మెల్యే ఛాలెంజ్
-
మొన్న అలా..నిన్న ఇలా..గబ్బు లేపిన గబ్బర్ సింగ్..
-
కామ్రేడ్స్ పేరుతో బెదిరించి రూ.2 కోట్లు డిమాండ్
కైకలూరు: ఓ ఆక్వా రైతును నెల రోజులుగా కామ్రేడ్స్ పేరుతో సెల్ ఫోన్ల ద్వారా బెదిరించి రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్న డ్రైవర్ల గ్యాంగ్‌ను ఏలూరు జిల్లా కైకలూరు టౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. టౌన్ స్టేషన్లో సీఐ ఆకుల రఘు, ఎస్ఐ జ్యోతిబసు వివరాలు వెల్లడించారు. కైకలూరుకు చెందిన ఐబీకేవీ ప్రసాదరాజు (వజ్రం రాజు) ప్రముఖ ఆక్వా రైతు. నెల రోజులుగా రెండు నంబర్ల నుంచి ‘కామ్రేడ్స్ మాట్లాడుతున్నాం.. మాకు రూ.2 కోట్లు ఇవ్వకపోతే నీతో పాటు నీ కొడుకును చంపేస్తాం’ అంటూ బెదిరిస్తున్నారు. పదే పదే ఫోన్లు రావడంతో ప్రసాదరాజు ఈ నెల 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన సీఐ ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులను కనిపెట్టారు. మండవల్లి మండలం చావలిపాడు గ్రామానికి చెందిన తోకల ఏసేబు (36), చిన్నం బారంబాసు (51), హైదరాబాదు, ఏజీ కాలనీ, ఎర్రగడ్డకు చెందిన శీలం హేమంత్‌కుమార్ (33), హైదరాబాదు, హిమాయత్‌నగర్‌కు చెందిన దారా మాణిక్యరావు (44)గా వారిని గుర్తించారు. వీరిలో ఏసేబు, మాణిక్యరావు కైకలూరులో ప్రసాదరాజు దగ్గర గతంలో కారు డ్రైవర్లుగా పనిచేశారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో మాణిక్యరావు హైదరాబాదులోని తన స్నేహితుడు, కారు డ్రైవర్ హేమంత్‌కుమార్‌తో రెండు సిమ్ కార్డులు కొనుగోలు చేయించాడు. హైదరాబాదు శివారు రింగురోడ్డు నుంచి ఫోన్లు చేసి ప్రసాదరాజును డబ్బు కోసం బెదిరించారు. నిందితుల్లో ఏసేబు, బారంబాసు, హేమంత్‌కుమార్ అరెస్టు చేశారు. మాణిక్యరావును పట్టుకోవాల్సి ఉంది. -
'కొల్లేరు సమస్యపై సీఎం జగన్‌ను కలుస్తా.. ఆ తర్వాత రాజకీయ నిర్ణయం'
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొల్లేరు ప్రాంత సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వినతిపత్రం సమరి్పస్తానని తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ ఇన్చార్జి జయమంగళ వెంకటరమణ చెప్పారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. కొల్లేరు మూడో కాంటూరు వరకు కుదింపు, ఆక్వా జోన్ పరిధిలో మరిన్ని చెరువులు చేర్చటం, ఈబీసీలకు పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలు అందించడం తదితర అంశాలతో ముఖ్యమంత్రిని కలిసి విన్నవిస్తానని, ఆయన స్పందననుబట్టి రాజకీయ నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. కైకలూరు నియోజకవర్గంలో టీడీపీలో ఐదుగురిని బరిలో నిలిపి వారితో పనిచేయిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని చెప్పారు. వైఎస్సార్ హయాంలో అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందే 250 నియోజకవర్గాలకు అభ్యర్థులను నిర్ణయించారని, అది సరైన విధానమని తెలిపారు. నియోజకవర్గంలో ఐదుగురు నాయకులు ఉండటం వల్ల చివర్లో ఒకరికి టికెట్ వస్తే మిగిలినవారు వెన్నుపోటుదారులుగా మారుతున్నారని విమర్శించారు. 1999 నుంచి తెలుగుదేశం పార్టీలో సేవ చేస్తున్నానని, ఈ క్రమంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నానని వివరించారు. ఓ పౌరుడిగా ముఖ్యమంత్రిని కలిసే హక్కు ఉంటుందని, తాను గతంలో నలుగురు సీఎంలను కలిసి కొల్లేరు సమస్యలను విన్నవిస్తే అందరూ సానుకూలంగా స్పందించారని చెప్పారు. తనపై ఇటీవల హత్యాయత్నం జరిగితే రక్షణ కావాలని ప్రభుత్వానికి లేఖ రాశానని, అందుకే గన్‌మెన్‌ను కేటాయించారని ఆయన తెలిపారు. చదవండి: సైన్యం సన్నద్ధం -
ఆక్వా రంగానికి 24 గంటలు విద్యుత్
కైకలూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆక్వా రంగానికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మ జనార్ధనరెడ్డి చెప్పారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని గోపవరం గ్రామంలో 220/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు స్థలాన్ని ఆయన శనివారం పరిశీలించారు. అనంతరం కైకలూరు ట్రావెలర్స్ బంగ్లాలో పద్మ జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సబ్సిడీ పొందని అర్హులైన ఆక్వా రైతులు ఆయా ప్రాంతాల డీఈలకు సమాచారం అందించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం(ఆర్డీఎస్ఎస్) సాంకేతిక బిడ్లను పూర్తి చేసి ఆర్థిక అనుమతులకు పంపించామని పేర్కొన్నారు. సాంకేతికతను అందరూ ఆహ్వానించాలని కోరారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు రైతులకు ఎంతో ఉపయోగకరమని, వీటివల్ల జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 220 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరుగుతుందన్నారు. ఈ ఏడాది నెల్లూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ నుంచి 800 మెగావాట్లు విద్యుత్ అందుబాటులోకి వస్తుందని, రానున్న రోజుల్లో కరెంటు కోతలు ఉండబోవని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్), పలువురు అధికారులు పాల్గొన్నారు. -
చేపల పట్టుబడి.. మెలకువలతో అధిక రాబడి
కైకలూరు: ఏపీలో కొల్లేరు ప్రాంతం చేపల పరిశ్రమకు పెట్టింది పేరు. జిల్లాల పునర్విభజనలో భాగంగా కొల్లేరు పరీవాహక ప్రాంత నియోజకవర్గాలన్నీ ఒకే గూటికి చేరాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 1.72 లక్షల ఎకరాల్లో 55,866 మంది రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతాల నుంచి రోజు సుమారు 320 లారీల్లో చేపల ఎగుమతులు ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతాయి. ఇటీవల ఆక్వా పరిశ్రమపై మక్కువతో ఔత్సాహిక రైతులు ఈ రంగంపై దృష్టి సారిస్తున్నారు. చేప ఉత్పత్తులలో మేలైన విధానాలు అవలభించకపోతే 30 శాతం నష్టపోయే అవకాశం ఉంది. చేపలను పట్టిన తర్వాత మెత్తబడటం, పొలుసులు ఊడటం, మొప్పలు పాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని ప్యాకింగ్ చేయకూడదు. రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మార్కెట్లో చేపలకు మంచి ధర దక్కుతుంది. చెరువుల్లో చేపలను సరైన యాజమాన్య పద్ధతుల్లో సాగు చేయడం ఎంత ముఖ్యమో పట్టుబడి తర్వాత కూడా తాజా చేపలను మార్కెటింగ్ చేసి అధిక ధర దక్కించుకోవడమూ అంతే కీలకం. నీటి నుంచి చేపలను బయటకు తీసిన తర్వాత వాటి శ్వాసక్రియ ఆగిపోతుంది. ఆ వెంటనే జీవ రసాయన, సూక్షజీవుల చర్య మొదలవుతుంది. మాంసం సహజగుణం కోల్పోకుండా ప్యాకింగ్ చేసే వరకు చేపల రైతులు కొన్ని మెలకువలు పాటించాలని కలిదిండి మత్స్యశాఖ అభివృద్థి అధికారి సీహెచ్ గణపతి సూచిస్తున్నారు. ఆ వివరాలు ఆయన మాటాల్లోనే.. పట్టుబడికి ముందు ఈ జాగ్రత్తలు అవసరం ∙రైతులు మార్కెట్లో చేపల ధరలను ముందే తెలుసుకోవాలి ∙చెరువుగట్టు వద్దే తూకం జరిగేలా వ్యాపారులతో ఒప్పందం చేసుకోవాలి ∙పట్టుబడి ముందు రోజు చెరువులో చేపలకు మేతలను నిలుపుదల చేయాలి ∙చిన్న చెరువు అయితే ఒక్క రోజులో పట్టుబడి ముగిసేలా చూడాలి. ∙చెరువులో నీరు తోడటానికి డీజిల్ ఇంజిన్లను సిద్ధం చేసుకోవాలి ∙కూలీలను, ఐస్ ప్యాకింగ్ చేసే వారిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి ∙ప్యాకింగ్‌కు ఐస్ ఎంత కావాలో ముందుగానే అంచనా వేయాలి పట్టుబడి సమయంలో.. ∙ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు, తెల్లవారుజామున పట్టుబడి చేయాలి ∙చెరువులో నీటిమట్టం మూడో వంతుకు వచ్చిన తర్వాత లాగుడు వలలతో చేపలను పట్టాలి ∙నీరు బయటకుపోయే తూముకు సంచి కట్టాలి ∙పట్టుబడి చేసేటప్పుడు నీటిని ఎక్కువగా బురద చేయకూడదు ∙చేపల పట్టుబడికి రసాయనాలు, పేలుడు పదార్థాలు ఉపయోగించకూడదు ∙చేపలు ఎగరకుండా ట్రేలను ఉపయోగించాలి ∙చేపలను బయటకు తీసిన వెంటనే తూకం వేసే ప్రదేశానికి తరలించాలి పట్టుబడి తర్వాత.. ∙పట్టుబడి చేసిన చేపలను మంచినీటిలో శుభ్రపర్చాలి ∙నేలపై పరిచిన ప్లాస్టిక్ సంచి మీద మాత్రమే చేపలను వదలాలి ∙దెబ్బలు తగలకుండా, మట్టి అంటకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ∙తూకం, రవాణా ప్రదేశం ఒకే చోట ఉండేలా చూడాలి ∙పరిశుభ్రమైన మంచినీటితో తయారు చేసిన ఐస్‌ను వాడాలి ∙రవాణా సమయాన్ని బట్టి 1:1 నిష్పత్తిలో ఐస్ ఉపయోగించాలి ∙మోతాదుకు మించి ఎక్కువ వరసలో చేపలను ట్రేలలో ఉంచకూడదు ∙ప్లాస్టిక్ ట్రేలలో చేపలను ప్యాకింగ్ చేసినప్పుడు అడుగు భాగంలో రంధ్రాలు ఏర్పాటు చేయాలి ∙మిషన్ ఆడించి పొడిగా చేసిన ఐస్‌ను మాత్రమే ప్యాకింగ్‌కు ఉపయోగించాలి గ్రేడింగ్ ఇలా.. ∙చేపల పట్టుబడి తర్వాత గ్రేడింగ్ ఎంతో కీలకం ∙మెత్తబడిన చేపలు, గ్రహణం మొర్రి, వంకర తిరిగిన చేపలు, జన (గుడ్లు)ను గుర్తించాలి ∙ఆరోగ్యంగా లేని చేపలను విడిగా ప్యాకింగ్ చేయాలి ∙చేపలను ప్లాస్టిక్ ట్రేలు, థర్మకోల్ బాక్సుల్లోనే ప్యాకింగ్ చేయాలి ∙గ్రేడింగ్ చేసిన సమయంలో మెత్తబడిన చేపలను విడిచేటప్పుడు మిగిలిన చేపలతో కలవకుండా చూడాలి ∙చేపల సైజులను గుర్తించి విడివిడిగా ప్యాకింగ్ చేయాలి ∙గ్రేడింగ్ చేసేటప్పుడు కచ్చితంగా శుభ్రత పాటించాలి చదవండి: ‘ఎల్లువొచ్చి గోదారమ్మా’.. బిందెలన్నీ అక్కడ తయారైనవే! -
International Family Day: కలుపుకుంటేనే.. కలదు సుఖం
సాక్షి, కైకలూరు: ‘ప్రపంచ శాంతిని ప్రోత్సహించడానికి మీరు చేయవలసిన పని ఏమిటంటే ఇంటికి వెళ్లి మీ కుటుంబాన్ని ప్రేమించడం’ అన్నారు మదర్ థెరిస్సా. కుటుంబ ప్రాముఖ్యతను ఈ ఒక్క వాక్యంలో అర్థం చేసుకోవచ్చు. కుటుంబ ప్రాధాన్యతను అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో 1996 నుంచి ప్రతి ఏడాదీ మే 15న అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తోంది. ఈ ఏడాది ‘కుటుంబం – పట్టణీకరణ’ అనే నినాదంతో ముందుకొచ్చింది. కుటుంబాల్లో ఆరోగ్యం, లింగ సమానత్వం, పిల్లల హక్కులు, కుటుంబ సంక్షేమ వ్యవహారాలను చర్చించడం దీని లక్ష్యం. పౌర జీవనం పట్టణ ప్రాంతాల్లోకి మారినప్పుడు అక్కడి పోకడలకు అలవాటుపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి అన్నింటిపైనా కుటుంబ సభ్యులందరూ కలిసి చర్చించుకోవాలని కుటుంబాల దినోత్సవం గుర్తు చేస్తుంది. దూరం పెరుగుతోంది... 2017లో నిర్వహించిన ఓ సర్వేలో తాత ఇంటి వద్ద నివసించే 18 సంవత్సరాలలోపు పిల్లలు కేవలం ఏడు శాతంగా నమోదైంది. 11 సంవత్సరాల వయసు వచ్చే సమయానికి తోబుట్టువులతో కలిసి గడిపిన ఖాళీ సమయం కేవలం 33 శాతంగా ఉంది. ఒంటరి జీవితం అంత సులభం కాదు. కుటుంబంలో నివసించే వ్యక్తి తన సంతోషాన్ని, బాధలను పంచుకోవడానికి కుటుంబ వ్యవస్థ ఉండాలి. కుటుంబం ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన విషయం. పూర్వం గ్రామాల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందరూ కలసి ఒకే పొయ్యిపై వంటలు చేసుకుని కలసి భోజనాలు చేసేవారు. ఉమ్మడి వ్యవసాయం ఉండేది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతింది. ఉద్యోగాల రీత్యా పట్టణాలకు వెళ్లడం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపించడం వంటి కారణాలతో ఉమ్మడి కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. కుటుంబాలకు దిశానిర్దేశం చేసిన పెద్దలు ఒంటరిగా మిగిలారు. మారుతున్న జీవన పరిస్థితుల వల్ల కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరుగుతోంది. సెల్ఫోన్లు అందుబాటులోకి వచ్చాక దగ్గరగా కూర్చుని నాలుగు మాటలు మాట్లాడుకునే అవకాశం కోల్పోతున్నారు. కొత్త మార్పులు... కుటుంబ ప్రాధాన్యతను గుర్తిస్తున్నవారు ఇప్పటికీ కుటుంబ సభ్యులను దూరం చేసుకోవడం లేదు. మారిన జీవన పరిస్థితుల వల్ల దూరంగా ఉన్నప్పటికీ సాంకేతికత అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి మాధ్యమాల ద్వారా నిత్యం అందుబాటులో ఉంటున్నారు. ‘మై ఫ్యామిలీ’ అంటూ పలువురు వాట్సాప్‌లలో కుటుంబ సభ్యులను గ్రూపులుగా ఏర్పాటు చేసుకుని యోగక్షేమాలు తెలుసుకుంటూ, తాజా సమాచారం పంచుకుంటున్నారు. ఇంకా ఇలా చేయండి... కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు బలపడాలంటే కనీసం అందరూ ఏడాదికి రెండు పర్యాయాలు ఒకేచోట కలవడం ఉత్తమం. గ్రామాల్లో నివసిస్తున్న అమ్మమ్మ, నాన్నమ్మల దగ్గరకు తరచూ వెళ్లి వారి అనుభవాలను తెలుసుకోవాలి. పట్టణాల్లో నివసిస్తున్న బంధువులందరూ పండగల సమయంలో కలుసుకుని యోగక్షేమాలను ఆరా తీసుకోవాలి. కుటుంబ సభ్యులకు అత్యవసర సాయం అవవసరమైనప్పుడు అందరూ కలసి సహాయపడాలి. తరచుగా దేవాలయాలు, సాంస్కృతిక ప్రాంతాలను సందర్శించుకునేలా ప్రణాళిక చేసుకోవాలి. కుటుంబ ఆవశ్యకతను పిల్లలకు వివరించాలి. మార్పు రావాలి.. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడంతో మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. అనేక మంది బాల్యాన్ని కోల్పోతున్నారు. తాత, బామ్మల ప్రేమానురాగాలకు దూరమవుతున్నారు. ఇప్పటికైనా మార్పు రావాలి. తరచుగా కుటుంబ సభ్యులను కలుస్తూ ఆప్యాయతలు పెంచుకోవాలి. – చింతపల్లి వెంకటనారాయణ, ప్రముఖ సాహితీవేత్త, కైకలూరు ఉమ్మడి కుటుంబంతో ఎంతో మేలు.. మా నాన్న తరఫున ముగ్గురు అన్నదమ్ములు, మరో ముగ్గురు అక్క చెల్లెళ్లు. వివాహాలు కాకముందు అందరూ కలసికట్టుగా ఉండేవారు. మా చిన్నతనంలో ఇల్లంతా సందడిగా ఉండేది. ఇప్పుడు వారంతా ఖమ్మం, తణుకు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మరొకరు ఆమెరికాలో ఉద్యోగం చేస్తున్న అబ్బాయి దగ్గర ఉంటున్నారు. మా ఇంటి దగ్గర ఉన్న శివాలయంలో ఏటా జరిగే మహోత్సవాలకు కుటుంబ సభ్యులందరూ వస్తారు. ఇలా కలవడం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న ఆనందం ఎక్కడా ఉండదు. – బందా నారాయణ, ఆటపాక, కైకలూరు మండలం వసుధైక కుటుంబం అవసరం... నేటి సమాజానికి పూర్వపు వసుధైక కుటుంబాలు అవసరం. గతంలో నాలుగు తరాలు ఒకే గొడుకు కింద ఉండేవి. అవ్వాతాతలు చెప్పే కథల వల్ల పిల్లల్లో సృజనాత్మక శక్తి పెరిగేది. ఒంటరి జీవితం ఎంతో కష్టం. కుటుంబాల్లో పెద్ద దిక్కు లేకపోవడంతో ఆత్మహత్యలు, విడాకులు, భ్రూణ హత్యలు వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా తిరిగి వసుధైక కుటుంబంగా మారాలి. – డాక్టర్ బీవీ లీలారాణి, ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ, రిటైర్డ్ రీడర్ ఇన్ తెలుగు -
మగువా.. గొప్పదమ్మా నీ తెగువ!
కైకలూరు: కరోనా బారినపడిన నిండు గర్భిణికి 108 సిబ్బంది ఆ అంబులెన్స్‌లోనే ప్రసవం చేయించారు. వివరాల్లోకి వెళితే.. కైకలూరుకు చెందిన గర్భిణి కె.శ్రావణి ప్రసవ నొప్పులతో కైకలూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కి శనివారం వచ్చింది. వైద్యులు పరీక్షలు చేయగా.. ఆమెకు కరోనా సోకినట్టు తేలింది. దీంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం తీసుకువెళ్లాలని వైద్యులు చెప్పారు. దీంతో శ్రావణిని తీసుకుని 108 వాహనంలో ఈఎంటీ రజనీదేవి పీపీఈ కిట్ ధరించి, పైలట్ బోయిన రావుతో కలసి మచిలీపట్నం బయలుదేరారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత శ్రావణికి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో రజనీదేవి తెగువతో చాకచక్యంగా సుఖ ప్రసవం అయ్యేవిధంగా చేశారు. ఆమె ఆడ శిశువుకు జన్మనివ్వగా.. తల్లీబిడ్డలను మచిలీపట్నం ఆస్పత్రికి తరలించారు. ఎంతో ధైర్యంతో విధులు నిర్వర్తించిన ఈఎంటీని 108 వాహన జిల్లా అధికారి సురేష్‌కుమార్, డివిజనల్ అధికారి ప్రశాంత్ అభినందించారు. -
ప్రాణాలు తీసిన ‘పార్టీ’
దుండిగల్/కలిదిండి (కైకలూరు): మద్యం మత్తు.. అతివేగం ముగ్గురు యువకుల ప్రాణాలను బలిగొన్నాయి. నలుగురు యువకులు ప్రయాణిస్తున్న కారు తెలంగాణలోని దుండిగల్ సమీపంలో బౌరంపేట వద్ద ఆగి ఉన్న ట్రాలీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏపీలోని కృష్ణా జిల్లా కలిదిండి మండలం కాళ్లపాలెం, ఆవకూరు, కోరుకొల్లు గ్రామాలకు చెందిన పుప్పాల సత్యనారాయణ కుమారుడు గణేశ్ (25), నరహరిశెట్టి నర్సింహారావు కుమారుడు సంజయ్ (25), సలాది అశోక్ (26) స్నేహితులు. చదవండి: ‘గ్యారెంటీ’ కోసం డీఎస్పీని సృష్టించాడు! ఉన్నత విద్యనభ్యసించిన ఈ ముగ్గురూ కొన్ని నెలల క్రితమే నగరానికి వచ్చారు. ప్రగతి నగర్లో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ప్రస్తుతం అశోక్ సాఫ్టువేర్ ఇంజినీర్‌గా పని చేస్తుండగా మిగిలిన ఇద్దరూ ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. వీరి స్నేహితుడైన మియాపూర్‌కు చెందిన సాయి అప్పుడప్పుడు వీరి గదికి వస్తుండేవాడు. అతడి ద్వారా ఈ ముగ్గురికీ గాజుల వెంకటసాయి చరణ్‌తో (25) పరిచయమైంది. కారులో వెళ్తుండగా.. ఈ ఐదుగురూ మియాపూర్‌కు చెందిన దుర్గా, వేణుతో కలిసి శనివారం రాత్రి ప్రగతి నగర్‌లోని తమ గదిలో వీకెండ్ పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి తర్వాత సాయి, దుర్గా, వేణు గదిలోనే నిద్రించారు. అశోక్ దగ్గరి బంధువులు షాపూర్ నగర్‌లోని సంజయ్‌గాంధీ నగర్లో ఉంటున్నారు. అశోక్‌ను వారి ఇంట్లో దింపేందుకు చరణ్, గణేశ్, సంజయ్ సిద్ధమయ్యారు. తెల్లవారుజామున చరణ్‌కు చెందిన కియా కారులో గండిమైసమ్మ చౌరస్తా వైపు బయలుదేరారు. మితిమీరిన వేగంతో వెళ్తున్న కారు అక్కడ ఆగి ఉన్న ట్రాలీని వెనుక నుంచి బలంగా ఢీకొని నుజ్జునుజ్జయ్యింది. చరణ్, సంజయ్, గణేశ్ అక్కడికక్కడే మృతి చెందారు. అశోక్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద తీవ్రతను తగ్గించే ఎయిర్ బెలూన్లు తెరుచుకున్నప్పటికీ.. ప్రమాద తీవ్రతకు పగిలిపోవడంతో ఫలితం దక్కలేదు. -
కొల్లేరులో సారా తయారీ గుట్టు రట్టు
కైకలూరు: సారా తయారీపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కొల్లేరు సరస్సులో కిక్కిస పొదల మాటున సాగుతున్న సారా తయారీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, పలువురు పోలీసులు బుధవారం పడవలపై వెళ్లి ఆ స్థావరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా కొల్లేరు కిక్కిస పొదలపై నిఘా ఏర్పాటు చేశామన్నారు. కైకలూరు రూరల్ ఎస్ఐ చల్లా కృష్ణ పందిరిపల్లిగూడెం పరిధిలో కొల్లేరు సరస్సు మధ్యలో సారా తయారీ కేంద్రాన్ని మంగళవారం గుర్తించి దాడి చేశారని చెప్పారు. అక్కడ వెయ్యి లీగర్ల సారా, సారా తయారీకి ఉపయోగించే 50 వేల లీటర్ల బెల్లపు ఊటను స్వా«దీనం చేసుకుని పందిరిపల్లిగూడెంకు చెందిన భలే సుబ్బరాజు (40), ఘంటసాల రాంబాబు (35), భలే కోటశివాజీ(35), ఆకివీడుకు చెందిన పన్నాస కృష్ణ (35) అనే వారిని అరెస్ట్ చేశారని వివరించారు. నిందితుల నుంచి సారా తయారీకి ఉపయోగించే రూ.6.80 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. -
అమ్మా.. నాన్నా.. నేనూ మీ దగ్గరికే వచ్చేస్తున్నా...
కైకలూరు: తల్లిదండ్రులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగిన ఓ యువకుడికి అమ్మమ్మ ఆధారంగా మిగిలింది. ఆమె కూడా కన్నుమూయడంతో తట్టుకోలేని అతను మనస్థాపంతో ఉప్పుటేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ హృదయ విదారకర ఘటన వివరాలిలా ఉన్నాయి. గుడివాడకు చెందిన చిన్ని నవీన్ (24) అక్కడ ఫ్యాన్సీ దుకాణంలో పనిచేస్తున్నాడు. తండ్రి సుమారు 20 ఏళ్ల క్రిందట మృతి చెందాడు. అల్లారు ముద్దుగా పెంచిన తల్లి 9 నెలల క్రితం అనారోగ్యంతో మరణించింది. దీంతో అమ్మమ్మ, మేనమామ వద్ద ఉంటున్నాడు. వయసు రీత్యా సమస్యలతో అమ్మమ్మ 3 నెలల క్రితం మృతి చెందింది. దీంతో నా అనే వారు ఎవరూ లేరు.. అనే భావనతో కొద్ది రోజులుగా నవీన్ ముభావంగా ఉంటున్నాడు. చివరకు మనస్థాపంతో ద్విచక్రవాహనంపై కైకలూరు మండలం ఉప్పుటేరు బ్రిడ్జికి బుధవారం రాత్రి వచ్చాడు. చివరి సారిగా మేనమామకు ఫోన్ చేసి నేను కూడా మా అమ్మానాన్న దగ్గరకు వెళ్లిపోతున్నాను.. ఇక నన్ను మర్చిపోండి.. అంటూ సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఉప్పుటేరులో దూకేశాడు. గుడివాడ నుంచి హుటాహుటిన వచ్చిన మేనమామ పోలీసుల సాయంతో వెతకగా ఉప్పుటేరు వద్ద నవీన్ బైక్ కనిపించింది. గాలింపు చర్యలు చేయగా గురువారం రాత్రి ననీన్ మృతదేహం లభించింది. మేనమామ సన్నిది మంగరాజు ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ చల్లా కృష్ణ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అయినవాళ్ళను కోల్పోయి నిండు జీవితాన్ని వదిలిపెట్టిన నవీన్ మృతి అందరిని కంటతడి పెట్టించింది. -
రైతులా వచ్చిన సబ్ కలెక్టర్.. దుకాణాదారులకు ముచ్చెమటలు
కైకలూరు: అది కైకలూరు జాతీయ రహదారిపై అడవి నాయుడు సెంటర్. సమయం శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలు. లుంగీ, షర్టు ధరించి ఓ వ్యక్తి బైక్‌పై ఎరువుల దుకాణానికి వచ్చాడు. యూరియా, డీఏపీ రెండు బస్తాలు కావాలని అడిగాడు. దుకాణం యజమాని ఓ తెల్లచీటీపై రాసి, పక్కనే గోడౌన్లో తెచ్చుకో అని పంపించాడు. అక్కడకెళ్లి రెండు బస్తాలను బైక్‌పై వేసుకుని తిరిగి దుకాణం వద్దకు వచ్చాడు. బోర్డులో సూచించిన ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారేంటని నిలదీశాడు. రైతులందరి నుంచి ఇలానే వసూలు చేస్తున్నారా అంటూ గద్దించాడు.. అప్పటికి గానీ ఆ వ్యాపారికి అర్థంకాలేదు.. ఎరువుల కోసం వచ్చింది రైతు కాదు, విజయవాడ సబ్ కలెక్టరు జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ అని. అసలేం జరిగిందంటే... కలెక్టరు జె.నివాస్ ఆదేశాలతో సబ్ కలెక్టరు సూర్య సాయి ప్రవీణ్ చంద్ రైతు వేషధారణలో ఎరువుల దుకాణాల్లో తనిఖీలకు ముదినేపల్లి మండలం దేవపూడి శ్రీలక్ష్మీగణేష్ ట్రేడర్స్ వద్దకు వెళ్లారు. అప్పటికి దుకాణం తెరవలేదు. అక్కడే ఉన్న రైతులను ధరలపై ప్రశ్నించగా అధిక ధరలు అడుగుతున్నారని బదులిచ్చారు. వెంటనే వ్యవసాయ శాఖ ఏఓను పిలిపించి, ఆ దుకాణాన్ని తనిఖీచేసి, అధిక ధరలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ తర్వాత కైకలూరులో వాసవీ ఫెర్టిలైజర్స్‌కు వెళ్లి యూరియా కావాలని అడగ్గా, వ్యాపారి లేదని సమాధానం చెప్పాడు. అక్కడి నుంచి వెంకట నాగదత్త ఏజెన్సీస్‌కు వెళ్లి యూరియా, డీఏపీ కావాలని అడిగారు. యూరియా బస్తా ధర రూ.266.50 కాగా రూ.280, డీఏపీ బస్తాకు రూ.1200 బదులు రూ.1250 తీసుకున్నారు. పైగా ఆధార్ ద్వారా బయోమెట్రిక్ లేకుండా, బిల్ ఇవ్వకుండా విక్రయించారు. అనంతరం వాసవీ ఫెర్టిలైజర్స్‌లో తనిఖీ చేయగా గోడౌన్లో యూరియా నిల్వలు ఉన్నాయి. ఈ రెండు దుకాణాలను సీజ్ చేసి, చర్యలు తీసుకోవాలని తహసీల్దారు సాయి కృష్ణకుమారి, వ్యవసాయశాఖ ఏడీ జి.గంగాధరరావు, ఏఓ దివ్యను సబ్ కలెక్టర్ ఆదేశించారు. -
అంతరిస్తున్న 'కొండచిలువలు'
కైకలూరు: సరీసృపాలలో అరుదైన కొండచిలువల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. విషపూరిత సర్పాలు కానప్పటికీ మానవుల చేతుల్లో హతమవుతున్నాయి. ప్రకృతి సౌందర్యానికి నెలవైన కొల్లేరులో ఎక్కువగా ఉన్న కొండచిలువలు విషపూరితం కాకపోయినా.. కనిపిస్తే అంతమవుతున్నాయి. కొల్లేరులో పక్షులతోపాటు వివిధ జాతుల సరీసృపాలు జీవిస్తున్నాయి. వీటిలో ఇండియన్ రాక్ పైథాన్ ఒకటి. ఈ కొండచిలువ కొల్లేరు ప్రాంత ప్రజల చేతుల్లో ఎక్కువగా దాడికి గురవుతోంది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల ఉప్పుటేరు పరీహవాక ప్రాంత పరిధిలో వీటి సంచారం ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల కృష్ణాజిల్లా కలిదిండి మండలం కొండంగి, మట్టగుంట, పడమటిపాలెం, కైకలూరు మండలం ఆటపాక, ముదినేపల్లి, పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు ప్రాంతాల్లో ఎక్కువగా ఇవి మృత్యువాతపడ్డాయి. కొద్ది ఘటనలలో మాత్రమే అటవీశాఖ అధికారులు వీటిని రక్షిస్తున్నారు. చిత్తడి నేలలు అనుకూలం కొల్లేరు చిత్తడి నేలల ప్రాంతం. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తొమ్మిది మండలాల పరిధిలో 77,138 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. రెండు జిల్లాల్లో 2.25 లక్షల ఎకరాల్లో ఆక్వా చెరువులు సాగవుతున్నాయి. ఇక్కడి చిత్తడి నేలలు కొండచిలువలకు అనుకూల ఆవాసాలుగా మారాయి. చేపలు, రొయ్యల చెరువుల సమీపంలో ఉంటున్న ఇవి చెరువులపై కోళ్లు, పక్షులు, ఎలుకలను ఆహారంగా తీసుకుంటున్నాయి. నీటిలో వేగంగా ప్రయాణించగలిగిన కొండచిలువలు ఆహార అన్వేషణలో భాగంగా బయటకు వచ్చి ప్రజల చేతిలో మృత్యువాతపడుతున్నాయి. అరుదైన జాతి ఇండియన్ రాక్ పైథాన్ శాస్త్రీయ నామం పైథాన్ మోలురూస్. ఇది 9.8 అడుగుల పొడవు పెరుగుతుంది. బరువు 25 కిలోల వరకు ఉంటుంది. ముదురు గోధుమ రంగుపై నల్లటి డైమండ్ మచ్చలు ఉంటాయి. విషపూరితమైనవి కావు. క్షీరదాలు, పక్షులు, ఎలుకలను ఆహారంగా తీసుకుంటాయి. పూర్తిగా ఆహారం తీసుకున్నాక వారం పాటు ఏమీ తినకుండా ఉండగలవు. చిత్తడి నేలలు, గడ్డిభూములు, ఎర్రనేలలు, మడ ఆడవుల్లో ఉంటాయి. ఇవి వంద గుడ్ల వరకు పొదుగుతాయి. పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్ దేశాల్లో వీటి సంతతి ఉంది. ఇండియన్ రాక్ పైథాన్‌ను.. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎస్) హానికలిగే జాతుల జాబితా (రెడ్ లిస్ట్)లో చేర్చింది. అరుదైన కొండచిలువ ఇండియన్ రాక్ పైథాన్ విషసర్పం కాదు. ప్రజలు వీటిని చూడగానే దాడి చేస్తున్నారు. కొల్లేరు పరీవాహక ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఐయూసీఎస్ ఈ జాతి ప్రమాదకర స్థితిలో ఉందని రెడ్ లిస్టులో పేర్కొంది. ఆటపాక గ్రామంలో గాయపడిన 11 అడుగుల కొండచిలువకు శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడాను. ఇవి తారసపడితే అటవీ అధికారులకు తెలియజేయండి. – డాక్టరు సూరపనేని ప్రతాప్, వెటర్నరీ అసిస్టెంటు సర్జన్, అమరావతి చంపితే మూడేళ్ల శిక్ష కొండచిలువలు కనిపిస్తే చంపవద్దు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వండి. అటవీశాఖ చట్ట ప్రకారం ఈ జాతిని షెడ్యూల్–1లో చేర్చారు. దీన్ని చంపితే మూడేళ్ల శిక్ష పడుతుంది. వీటికి హానిచేయకుండా అప్పగిస్తే అటవీప్రాంతాల్లో వదిలిపెడతాం. – జి.జయప్రకాష్, ఫారెస్టు డిప్యూటీ రేంజ్ ఆఫీసరు, కైకలూరు -
కైకలూరు మాజీ ఎమ్మెల్యే రాజబాబు కన్నుమూత
సాక్షి, కైకలూరు: సీనియర్ రాజకీయ నాయకుడు, కృష్ణా జిల్లా కైకలూరు మాజీ ఎమ్మెల్యే యెర్నేని రాజారామచందర్ (రాజబాబు) (82) ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. కలిదిండి మండలం కొండూరు గ్రామానికి చెందిన రాజబాబు 1993, 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వీరాభిమాని అయిన రాజబాబు కైకలూరు నియోజకవర్గంలో 100 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. వైఎస్ఆర్ మరణం తరువాత క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. ఎర్నేని మృతి పట్ల కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. -
సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు
సాక్షి, తాడేపల్లి: కష్ట కాలంలో ఆక్వా రైతులకు ప్రభుత్వం అండగా నిలిచిందని కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి కొల్లేరు ప్రాంత చేపల రైతుల సమస్యలను వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆక్వా ఎగుమతులకు సీఎం ప్రత్యేక చర్యలు తీసుకున్నారని.. ఫలితంగా కరోనా విపత్తు సమయంలో ఆక్వా రైతుల కష్టాలు తీరాయని పేర్కొన్నారు. తమ ప్రాంతంలో చేపల రైతుల కష్టాలు గురించి ముఖ్యమంత్రికి విన్నవించామని..ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. (ఎమర్జెన్సీ సేవలు అందేలా చూడాలి: సీఎం జగన్) ధర విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. అలాగే కొనుగోలు సమయంలో రిబేటు వల్ల చేపల రైతులు నష్టపోతున్నారని సీఎం వివరించామని.. దీనిపై కూడా రైతులకు న్యాయం జరిగేవిధంగా చట్టం తీసుకువస్తామని సీఎం తెలిపారని చెప్పారు. కొల్లేరు వద్ద రెగ్యులేటర్ త్వరలో ఏర్పాటు చేయబోతున్నామని సీఎం చెప్పారని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. -
కామాంధుడి ‘మత్తు’ ‘దిశ’ యాప్‌తో చిత్తు
సాక్షి, కైకలూరు: రోజూ ఇంటికొచ్చి చిన్నారిని పాఠశాలకు తీసుకెళ్లే ఆటోడ్రైవర్ నమ్మకంగా నటిస్తూ ఆ ఇంటి ఇల్లాలిపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. బాధితురాలు సమయస్ఫూర్తితో ‘దిశ’ యాప్‌ను ఆశ్రయించడంతో ఆపద నుంచి సురక్షితంగా బయటపడింది. కాల్ సెంటర్‌కు ఫిర్యాదు అందిన 8 నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అక్కడకు చేరుకుని బాధితురాలిని రక్షించారు. కామాంధుడిని కటకటాల్లోకి గెంటేశారు. బస్సులో ఓ మహిళా అధికారిణిపై వేధింపులకు పాల్పడ్డ ఏయూ ప్రొఫెసర్ బసవయ్యను గత నెలలో దిశ యాప్ ద్వారా అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. కూల్‌డ్రింక్‌లో మత్తు మాత్రలు కలిపి.. పందిరిపల్లిగూడెం గ్రామానికి చెందిన భార్యభర్తలు హాస్టల్లో ఔట్సోర్సింగ్ వర్కర్లుగా పని చేస్తున్నారు. వీరికి ఓ పాప ఉంది. ఇదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ వడ్లమన్నాడ పెద్దిరాజు(21) రోజూ పాపను ఆటోలో స్కూల్‌కి తీసుకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒంటరిగా ఉన్న పాప తల్లి వద్దకు వచ్చి కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి తాగాలని బలవంతపెట్టాడు. దిశ యాప్ ద్వారా.. ఆటోడ్రైవర్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆమె 3.19 నిమిషాలకు దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. దిశ కాల్ సెంటర్ నుంచి సమాచారం అందుకున్న స్థానిక సీఐ వైవీవీఎల్.నాయుడు, రూరల్ ఎస్ఐ పి.రామకృష్ణ అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి సమీపంలోని పెద్దింట్లమ్మ జాతరలో విధులు నిర్వహిస్తున్న మహిళా హోంగార్డ్ వరలక్ష్మీ కుమారి, కానిస్టేబుళ్లు కిషోర్, నాగగణేష్ ఎనిమిది నిమిషాల వ్యవధిలోనే అక్కడకు చేరుకున్నారు. బాధిత మహిళకు ధైర్యం చెప్పారు. ఇది గమనించి పరారైన నిందితుడిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. మేజిస్ట్రేటు ఎదుట హాజరుపర్చగా ఈనెల 19 వరకు రిమాండ్ విధించినట్లు చెప్పారు. -
రైల్వే గేట్ వద్ద గూడ్స్ రైలు నిలిపివేత..
-
చుక్కలు చూపించిన గూడ్స్ రైలు...
సాక్షి, కృష్ణా : కైకలూరు మండలం ఆలపాడు రైల్వే క్రాసింగ్ వద్ద గూడ్స్ రైలు సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. ఇంజన్లో నుంచి అనూహ్యంగా పొగలు రావడంతో ఉదయం 9 గంటలకు ఆలపాడు రైల్వే గేట్ నెంబర్ 93 దగ్గర రైలును నిలిపివేశారు. దీంతో పామర్రు నుంచి కత్తిపూడి(165) జాతీయరహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇరువైపులా రాకపోకలు నిలిచి పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుండగా..సమాచారం తెలుసుకున కైకలూరు రూరల్ పోలీసులు, రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. -
కృష్ణా జిల్లాలో ఐదు పంచాయతీలకు పట్టణ హోదా
సాక్షి, మచిలీపట్నం: జిల్లాలో కొత్తగా మరో ఐదు నగర పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. 20వేల జనాభాకు పైబడిన మేజర్ పంచాయతీలు త్వరలో నగర పంచాయతీలుగా రూపాంతరం చెందనున్నాయి. నెలాఖరులోగా ఈ మేరకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ప్రస్తుతం మూడుగా ఉన్న నగర పంచాయతీల సంఖ్య ఎనిమిదికి చేరుతుంది. జిల్లాలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు, జగ్గయ్యపేట, పెడన మున్సిపాలిటీలుండేవి. ఆ తర్వాత ఉయ్యూరు, తిరువూరు, నందిగామ పంచాయతీలను 2011లో నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేశారు. కాగా ఇటీవలే మచిలీపట్నం మున్సిపాలిటీని జూలై 3వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. దీంతో జిల్లాలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీలున్నాయి. తాజాగా 20వేల జనాభా కల్గిన మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల నుంచి ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాలో కొత్తగా మరో ఐదు మేజర్ పంచాయతీలు గ్రేడ్–3 మున్సిపాల్టీలు(నగర పంచాయతీలు) ఏర్పాటు కాబోతున్నాయి. దశాబ్దకాలంగా పెండింగ్.. దశాబ్దకాలంగా ఈ ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. 2015 మేలో అప్పటి ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదనలు కోరినా నగర పంచాయతీల ఏర్పాటు మాత్రం కార్యరూపం దాల్చలేదు. కాగా 500 జనాభా ఉన్న గిరిజన తండాలను పంచాయతీలుగా గుర్తిస్తామన్న ప్రభుత్వం అదే దిశగా 20వేల జనాభాకు పైబడిన మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలు అప్‌గ్రేడ్ చేస్తామని ప్రకటించింది. ప్రకటనలతో సరిపెట్టకుండా వెంటనే కార్యచరణలో పెట్టింది. ఐదు పంచాయతీలు ఇవే.. జిల్లాలోని అవనిగడ్డ, కైకలూరు, మైలవరం, పామర్రు, విస్సన్నపేట పంచాయతీలు నగర పంచాయతీలుగా రూపాంతరం చెందనున్నాయి. 2019 ప్రొజెక్టడ్ జనాభా లెక్కల ప్రకారం అవనిగడ్డ పంచాయతీ జనాభా 27,298, కైకలూరులో 24,486, మైలవరంలో 25027, పామర్రులో 24,604, విస్సన్నపేటలో 20,530 మంది జనాభా ఉన్నారు. ఈ లెక్కన చుట్టుపక్కల పంచాయతీలు, గ్రామాలను విలీనం చేయకుండానే ఈ ఐదు పంచాయతీలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేసే వీలుంది. అయితే అవనిగడ్డ నగర పంచాయతీలోకి పులిగడ్డ, రామకోటిపురం పంచాయతీలతో పాటు వేకనూరు పంచాయతీ పరిధిలోని గుడివాకవారిపాలెంలను విలీనం చేయాలని ప్రతిపాదన ఉంది. అలాగే మైలవరం నగర పంచాయతీలోకి వేల్వాడు, పామర్రు నగర పంచాయతీలోకి కనువూరు, కురుమద్దాలి, విస్సన్నపేట నగర పంచాయతీలోకి చండ్రుపట్ల, పాతగుంట్ల పంచాయతీలు విలీనం చేయాలన్న ప్రతిపాదన ఉంది. చుట్టుపక్కల పంచాయతీలు, గ్రామాల విలీనం చేసినా చేయకున్నా ప్రతిపాదిత ఐదు మేజర్ పంచాయతీలకు పట్టణ హోదా పొందనున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున ప్రతిపాదనలు రాగానే వాటిని కేబినెట్లో పెట్టి ఆమోద ముద్ర వేయడం.. నగర పంచాయతీల ప్రకటించడం లాంఛనమే కానుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు జూలై 31వ తేదీలోగా ప్రతిపాదనలు పంపాలని మున్సిపల్ పరిపాలనా శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలోని ఐదు మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు వీలుగా ప్రతిపాదనలు పంపిస్తున్నాం. – జి.రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి -
కలిదిండిలో కక్షతో.. భర్త లేని సమయంలో..
సాక్షి, కలిదిండి(కైకలూరు): లైంగిక వేధింపులతో మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని పోతుమర్రు పంచాయతీ గొల్లగూడెంలో దళితవాడలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. పంచాయతీలో ఎన్ఆర్ఈజీఎస్ ఎఫ్ఏగా పనిచేస్తున్న చిన్నం శ్రీకాంత్ (28), భార్య శైలజ(25) ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న గ్రామానికి చెందిన కురేళ్ల రమేష్ కన్ను శైలజపై పడింది. ఆమెను లైంగికంగా వేధించ సాగాడు. స్వగ్రామం కలిదిండి శివారు ఇందిరాకాలనీకి చెందిన శైలజ ఈనెల 11న కలిదిండి వచ్చి, తిరిగి ఇంటికి వెళ్లడానికి రోడ్డుపై నిలబడి ఉండగా తన ఆటో ఎక్కమని శైలజను రమేష్ ఒత్తిడి చేశాడు. దీంతో అవమానానికి గురైన శైలజ భర్తకు చెప్పి కలిదిండి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్న విషయానికి తనపై కేసు పెట్టిందని కక్ష పెంచుకున్న రమేష్ 12న రాత్రి 8 గంటల ప్రాంతంలో భర్త ఇంట్లో లేని సమయం చూసి శైలజ కాళ్లు చేతులు కట్టివేసి వేధించాడు. భర్త శ్రీకాంత్ ఇంటికి వచ్చే సమయానికి శైలజ సృహలో లేదు. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శనివారం తెల్లవారుజామున ఆరోగ్య పరిస్థితి వికటించడంతో పోలీసులను పిలిపించారు. తనను రమేష్ అనే వ్యక్తి వేధింపులకు గురిచేశాడని అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. అనంతరం మృతి చెందినట్లు పోలీసులు వివరించారు. శైలజకు బాబు(5), పాప(3) ఉన్నారు. కలిదిండి ఎస్ఐ వై.సుధాకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఓటుకు పోటెత్తిన జనం
సాక్షి, ముదినేపల్లి : మండలంలో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓటేసేందుకు జనం పోటెత్తారు. ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఓటర్లు గురువారం ఉదయానికే పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటేసేందుకు చేరుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్రాల వద్ద బారులు తీరారు. సరైన శిక్షణలేని పోలింగ్ సిబ్బంది, ఈవీఎంల మొరాయింపుతో ఓటింగ్‌లో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో అనేక పోలింగ్ కేంద్రాల్లో ఓటేసేందుకు గంటల కొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. బొమ్మినంపాడు శివారు గొల్లగూడెం 98వ పోలింగ్ కేంద్రంలో ఉదయం 7గంటలకు ప్రారంభించాల్సిన ఓటింగ్ ప్రక్రియ ఈవీఎం సక్రమంగా పనిచేయనందున గంట ఆలస్యంగా ప్రారంభమైంది. అప్పటికే కేంద్రం వద్ద ఓటర్లు భారీసంఖ్యలో బారులు తీరారు. వైవాక శివారు పెదగరువు 108వ బూత్‌లో ఇదే పరిస్థితి ఏర్పడింది. స్వల్ప సంఘటనల మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో సిబ్బంది, నేతలు ఊపిరి పీల్చుకున్నారు. కలిదిండిలో 80 శాతం... కలిదిండి మండలంలో గురువారం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం పోలింగ్ ప్రారంభంలో పలుగ్రామాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభించారు. దీనికి తోడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు తీవ్ర నిరాశ పరిచింది. రెండు భవనాలు ఉన్న గ్రామంలో ఒకే భవనంలో రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం, కొన్ని గ్రామాల్లో మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంపై ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. ఎండ తీవ్రతకు కొందరు ఉదయం పోలింగ్ కేంద్రాలకు రాలేదు. పనులు ముగించుకుని రెండవ పూట భారీగా హాజరయ్యారు. మండలంలో మూలలంక, పౌలుపేట, తాడినాడ, చిన తాడినాడ గ్రామాల్లో పోలింగ్ ఆలస్యంగా జరిగింది. భాస్కరరావుపేట, తాడినాడ, సానారుద్రవరం, కోట కలిదిండి గ్రామాల్లో ఏడుగంటల తరువాత కూడా పోలింగ్ నిర్వహించారు. మొత్తానికి 80 శాతం పోలింగ్ నమోదైనట్టు తహసీల్దార్ కనకరాజు తెలిపారు. పోలీసులు తగిన భద్రత కల్పించడంతో మొత్తానికి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండవల్లిలో 84శాతం... మండవల్లి మండలంలో 37,791 ఓటర్లుకు గాను, 84 శాతం పోలింగ్ జరిగినట్లు తహసీల్దార్ పీవీ రమణకుమారి తెలిపారు. ఉదయం 7 గంటలకు ప్రారంభం కావలసిన పోలింగ్ పలు బూత్‌లలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు గంటల తరబడి క్యూలైన్లలో వేచిఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండవల్లి మండలంలో 29 గ్రామాలు ఉండగా సుమారు 11 గంటల వరకు పోలింగ్ సక్రమంగా జరగలేదు. మండల పరిధిలో 49 పోలింగ్ బూత్‌లలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో కొందరు ఓటర్లు ఎక్కువసేపు లైన్లో ఉండలేక ఇంటికి వెళ్లి మళ్లీ వద్దామని అనుకుని వెళ్లి తిరిగి 4గంటలు దాటిన తర్వాత ఓటు వేయడానికి వస్తే ఓటు వేయడానికి బాగా జాప్యం జరిగి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు 7 గంటల వరకు పోలింగ్ జరుగుతూనే ఉంది. కొవ్వాడలంక గ్రామంలో స్వల్ప ఘర్షణ చేసుకుంది. తక్కెళ్లపాడు గ్రామంలో 90 సంవత్సరాల వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకుంది. కైకలూరులో... పోలింగు ఈవీఎంలు ఓటర్లును ఇబ్బందులు పెట్టాయి. సాంకేతికలోపం, అవగాహన రాహిత్యం వెరసి ఓటర్లు గంటల తరబడి మలమలమాడారు. కైకలూరు నియోజకవర్గంలో కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో మొత్తం 234 పోలింగు బూత్‌లలో గురువారం పోలింగు జరిగింది. నియోజకవర్గాన్ని మొత్తం 12 సెక్టర్లు, 24 రూట్లుగా విభజించారు. ఈ ఏడాది ఎవరికి ఓటు వేశామనేది తిలకించే వీవీప్యాడ్లు తికమకపెట్టాయి. స్వల్ప సంఘటనల నడుమ పోలింగు ప్రశాతంగా ముగిసింది. ఓటు హక్కును ఉపయోగించుకున్న అభ్యర్థులు.. అసెంబ్లీకి పోటి చేసిన పలు పార్టీల అభ్యర్థులు ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు కైకలూరులో, టీడీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణ కొట్టాడ గ్రామంలో, బీజేపీ అభ్యర్థి కీర్తి వెంకట రామప్రసాద్, స్వతంత్య్ర అభ్యర్థి భూపతిరాజు రమేష్ కుమార్ రాజులు కైకలూరులో, మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్వగ్రామమైన వరహాపట్నం గ్రామంలో ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. వైఎస్సార్, టీడీపీ అభ్యర్థులు ఆయా పోలింగు బూత్‌లలో జరిగే పోలింగు సరళిని పరిశీలించారు. -
2014మేనిఫెస్టోపై నిలదీత.. మైకు విసిరిన టీడీపీ నేత
-
మేనిఫెస్టోపై నిలదీత.. మైకు విసిరిన టీడీపీ నేత
సాక్షి, కైకలూరు : ఓట్లు అడగడానికి ప్రజల్లోకి వెలుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు. 2014లో అబద్దపు హామీలతో టీడీపీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారంటూ మండిపడుతున్నారు. కైకలూరులో ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీడీపీ కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థి జయమంగళ వెంకటరమణను ప్రజలు నిలదీశారు. 2014 టీడీపీ మేనిఫెస్టోలోని ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదంటూ ధ్వజమెత్తారు. దీంతో ఖంగుతిన్న జయమంగళ సర్ధి చెప్పడానికి ప్రయత్నించారు. అనంతరం అందరు మాట్లాడితే తానేమి చెప్పలేనని, ఏం మట్లాడకూ అంటూ గట్టిగా అరిచి చేతిలో మైకును తీసి జనాలపైకి విసిరారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడుసామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
సాక్షి, కలిదిండి (కైకలూరు) : మండలంలోని పోతుమర్రు పంచాయతీ శివారు పరమానందునిపేటలో ఆదివారం ఓ గృహిణి తన ఇద్దరి పిల్లలతోపాటు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఈ ప్రాంతంలో కలకలం రేపింది. ఈ ఘటనలో గృహిణి, ఓ చిన్నారి మృతి చెందగా, మరో బాలిక భీమవరం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కట్టా త్రిమూర్తులు భార్య అశ్విని (27) తన ఇద్దరి పిల్లలు కట్టా శర్వాణి (3), కట్టా కిరణ్ (1) లకు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంట్లోనే పురుగు మందు పోసి తనూ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రమాదాన్ని గ్రహించిన కుటుంబీకులు ముగ్గురిని కైకలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అశ్విని, కిరణ్ ప్రాణాలు కోల్పోగా శర్వాణి చికిత్స పొందుతోంది. ఇరుగు పొరుగు కథనం ప్రకారం కుటుంబ కలహాల వల్ల అశ్విని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. గుడివాడ పట్టణంలోని బేతవోలుకు చెందిన అశ్వినికి త్రిమూర్తులుతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. తన అత్తతో అశ్వినికి మనస్పర్థలు ఉన్నాయి. ఇటీవల కుమారుడు కిరణ్ బర్త్‌డే కూడా చేశారు. అయితే, అత్తాకోడళ్ల గొడవ వల్ల అశ్విని ఆత్మహత్యకు పాల్ప డిందని సమాచారం. త్రిమూర్తులు అన్న గోవర్థన్ గుడివాడలో కానిస్టేబుల్‌గా పని చేస్తాడని, వాస్తవాలు నమోదు చేయడంలో పోలీసులు వెనుకాడవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. కలిదిండి ఎస్ఐ వై.సుధాకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
158వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
-
158వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, కైకలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం 158వ రోజు పాదయాత్రను వైఎస్ జగన్ కైకలూరు నియోజకవర్గంలోని మండవల్లి మండలం పెరికెగూడెం నుంచి ప్రారంభించారు. ఆయన వెంట నడిచేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. వారందరినీ ఆప్యాయంగా పలకరించి జననేత ముందుకు సాగారు. కొర్లపాడు క్రాస్, గన్నవరం క్రాస్‌ల మీదుగా ఈరోజు పాదయాత్ర కొనసాగిస్తారు. తమ సమస్యలు తెలుసుకునేందుకు స్వయంగా వస్తున్న రాజన్న తనయుడికి జనం నీరాజనాలు పడుతున్నారు. తమ కష్టాలు మొరపెట్టుకుంటున్నారు. ప్రజల కష్టాలు వింటూ, వారికి భరోసాయిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. జిల్లా నాయకులు కూడా స్థానిక సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకొస్తున్నారు. -
ప్రజాసంకల్పయాత్ర 157వ రోజు షెడ్యూలు
సాక్షి, కైకలూరు : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 157వ రోజు షెడ్యూల్ ఖరారైంది. బుధవారం ఉదయం ముదినేపల్లి శివారు నుంచి వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పెయ్యేరు, డాకరాం క్రాస్, కనుకొల్లు, పుట్ల చెరువు క్రాస్ మీదుగా లింగాల చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభంకానుంది. అక్కడి నుంచి పెరికగూడెం వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ ఎస్సీ సోదరులతో ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొంటారు. సమావేశం అనంతరం రాత్రికి వైఎస్ జగన్ ఇక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ముగిసిన పాదయాత్ర జననేత వైఎస్ జగన్ 156వ రోజు ప్రజాసంకల్పయాత్ర ముగిసింది. మంగళవారం వైఎస్ జగన్ పాదయాత్ర మల్లాయపాలెం క్రాస్, కాల్వపుడి అగ్రహరం క్రాస్ పెద్ద పాలపర్రు, కోడురు క్రాస్, చిన పాలపర్రు మీదుగా ముదినేపల్లి వరకు సాగింది. నేటి పాదయాత్రలో 8.1 కిలోమీటర్లు నడిచిన వైఎస్ జగన్ మొత్తం 1972.2 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. -
విద్యుదాఘాతంతో భారీ అగ్ని ప్రమాదం
శీతనపల్లి (కైకలూరు): విద్యుదాఘాతంతో మండలంలోని శీతనపల్లి గ్రామంలో సోమవారం మూడు తాటాకు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. సుమారు రూ.10 లక్షల మేరకు ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. బొర్రా పేర్రాజు, బొర్రా నాగమల్లేశ్వరీ, గోకనబోయిన చక్రవర్తి కుటుంబాలు పక్కపక్కనే తాటాకు ఇళ్లలో నివసిస్తున్నారు. విశ్రాంత ఉపాధ్యాయుడు పేర్రాజు ఆయన భార్య సామ్రాజ్యంతో నివసిస్తున్నారు. భర్త మరణించడంతో నాగమల్లేశ్వరి ఒంటరిగా ఉంటుంది. చక్రవర్తి పొలం పనులు చేస్తుండగా, భార్య మంగమ్మ పాఠశాలలో ఆయాగా పనిచేస్తుంది. విద్యుత్ షార్టు సర్కూట్ వల్ల ముందుగా చక్రవర్తి ఇంట్లో మంటలు రేగాయి. వృద్ధుడైన పేర్రాజును అతికష్టం మీద బయటకు తీసుకొచ్చారు. అదే విధంగా నాగమల్లేశ్వరి మంటలు చూసి బయటకు పరుగులు తీసింది. చక్రవర్తి గొడ్లసావిడ వద్ద రెండు పాడి గేదెలు, ఒక పడ్డా అగ్నికీలకల్లో చిక్కుకున్నాయి. గ్రామస్తులు వాటి కట్లు విప్పారు. అప్పటికే వాటి శరీరం భారీగా కాలింది. సమీపంలోని కొబ్బరిచెట్లు ఆకులు మండలకు కాలిపోయాయి. రెండు గ్యాస్ సిలిండర్లు భారీ శబ్ధంతో పేలాయి. అగ్నిమాపక సిబ్బంది ఒక సిలిండరును పేలకుండా అదుపు చేశారు. అగ్నికీలలు పెరగడంతో బొర్రా మురళీ, నీలపాల రామచంద్రరావు ఇళ్ల అద్దాలు పగిలాయి. కైకలూరు అగ్నిమాపక అధికారి జీవీ రామారావు ఆధ్వర్యంలో సిబ్బంది మంటలు అదుపు చేశారు. సర్పంచ్ కట్టా శ్రీనివాసరావు, వార్డు సభ్యులు పరమేశ్వరరావు, గ్రామ పెద్దలు బాధితులను పరామర్శించారు. గ్రామ ప్రత్యేకాధికారి అరుణ్‌కుమార్ వివరాలు సేకరించారు. పంచాయతీ, రెవెన్యూ అధికారులు బాధితుల వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం బాధితులను అదుకోవాలన్నారు. -
అతి చిన్న ఆవుకు దూడ జననం
కైకలూరు: ఏపీ రాష్ట్రంలో అతి చిన్న ఆవుకు 16.5 అంగుళాల దూడ జన్మించింది. గురువారం కృష్ణాజిల్లా కైకలూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన పశుపోషకుడు అల్లూరి శ్యాంప్రసాద్ ఇంటి వద్ద ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. రెండేళ్ల క్రితం కేరళ నుంచి కాసర్గడ్ జాతికి చెందిన ఆవును రైతు శ్యాంప్రసాద్ కొనుగోలు చేశాడు. ఆ ఆవుకు రెండు దూడలు పుట్టి చనిపోయాయి. మూడో విడత పుట్టిన దూడ ఆరోగ్యంగా ఉన్నట్టు ప్రముఖ వెటర్నరీ సర్జన్ ప్రతాప్ తెలిపారు. గతేడాది గిన్నిస్‌బుక్ రికార్డు కోసం ఈ ఆవు ఎత్తును పంపామన్నారు. 29 అంగుళాలతో అతి చిన్న ఆవుగా రెండో స్థానంలో నిలిచిందన్నారు. కేరళకు చెందిన వేచూర్ ఆవు 28.5 అంగుళాలతో మొదటి స్థానం సాధించిందన్నారు. ప్రపంచంలో కాసర్గడ్ ఆవులు కేవలం 70 మాత్రమే ఉన్నాయని తెలిపారు. -
అతిథి పక్షి వచ్చేసింది..
కృష్ణాజిల్లా కైకలూరు మండలంలోని ఆటపాక పక్షుల విహార కేంద్రంలో అరుదైన తెల్ల పెలికాన్ పక్షి ఆదివారం సందడి చేసింది. ఏటా ఈ పక్షి యూరప్, ఆఫ్రికా దేశాల నుంచి ఆటపాక పక్షుల కేంద్రానికి వస్తూంటుంది. ఈ అతిథి పక్షిని రోజీ పెలికాన్, అమెరికా పెలికాన్ అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం పెలికానుస్ ఒనోక్రొటలూస్. ఇది 140 నుంచి 180 సెంటీ మీటర్ల వెడల్పు, 47 సెంటీ మీటర్ల ఎత్తు, 15 కిలోల బరువు ఉంటుంది. శీతాకాలంలో ఈ పక్షులు ఇండియా, చైనా, మయన్మార్‌కు వస్తూంటాయి. ఇటీవల గుంటూరు జిల్లా ఉప్పలపాడులో కూడా తెల్ల పెలికాన్ సంచరిస్తున్నట్లు గుర్తించారు. –ఆటపాక (కైకలూరు) -
పామును మింగిన కప్ప
కైకలూరు : కప్పలను పాములు మింగడం సహజం. అయితే పామును కప్ప మింగిన ఘటన గురువారం ఉదయం కృష్ణాజిల్లా కైకలూరు మండలం గోపవరం గ్రామంలో చోటుచేసుకుంది. పంటకాల్వలో తనను మింగేయడానికి ప్రయత్నించిన బురద పామును ఓ కప్ప గుటకాయ స్వాహా చేసింది. గట్టిగా ఒడిసిపట్టిన కప్ప నుంచి తప్పించుకోలేక పాము విలవిల్లాడింది. ఈ పోరాటంలో అంతిమంగా కప్ప విజయం సాధించి పామును పూర్తిగా మింగి నీటిలోకి జారుకుంది. ఈ అరుదైన ఘటనను పలువురు వింతగా తిలకించారు. -
అక్రమ కేసులకు భయపడం
► వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్ జగన్ మాటల్లో తప్పేముంది? ► మృతులకు రూ.20 లక్షలు పరిహారం ఇవ్వాల్సిందే ► వనజాక్షి విషయంలో ఈ దూకుడేది..? ► డీఎన్నార్ ఆధ్వర్యంలో నిరసనలు కైకలూరు : నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు బలితీసుకున్న దారుణఘటనపై నిలదీసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డిపై కేసు నమోదు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని, అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) డిమాండ్ చేశారు. అక్రమ కేసులను నిరసిస్తూ నియోజకవర్గవ్యాప్తంగా కైకలూరు, మండవల్లి, కలిదిండి, ముదినేపల్లి మండల కేంద్రాల్లో ఉద్యమించారు. కైకలూరులోని పార్టీ కార్యాలయం నుంచి నల్లబ్యాడ్జీలు ధరించి తాలూకా సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వరకు గురువారం ర్యాలీ చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డీఎన్నార్ మాట్లాడుతూమృతిచెందిన కుటుంబాలు, బాధితుల పక్షాన నిలదీసిన జగన్‌పై అధికార పార్టీ నాయకులు బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కేవలం దివాకర్ బస్సు ట్రావెల్స్‌కు మేలు చేసే విధంగా అధికార చర్యలు ఉన్నాయన్నారు. ఒక్కో మృతుని కుటుంబానికి రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. జగన్‌పై కేసులు ఎత్తివేసి క్షమాపణ చెప్పకపోతే దశలవారీ అందోళన చేస్తామని హెచ్చరించారు. జిల్లా పార్టీ కార్యదర్శి బొడ్డు నోబుల్ మాట్లాడుతూ మహిళా తహసీల్దార్ వనజాక్షిని ఈడ్చుకువెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై రెవెన్యూ సంఘాలు ఏం చర్యలు తీసుకున్నాయని ప్రశ్నించారు. పార్టీ మైనార్టీ నాయకులు అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ జలీల్‌ఖాన్ ఏ పార్టీ నీడన బతికారో మరచిపోయి స్థాయికి మించి మాట్లాడుతున్నారన్నారు. పంజా రామారావు, మీగడ వెంకట కృష్ణారావు, నున్న రాంబాబు, తోట శేషవేణి, సలార్, దండే రవిప్రకాష్, బండి ప్రసాద్, విక్టర్, శ్యామలా, రహంతుల్లా, ఎంపీటీసీ ఆదినారాయణ, సంజీవరావు, జయరాజు, తాతాలు, అజ్మిత్భాషా, బాలమ్మ, రాఘవులు పాల్గొన్నారు. న్యాయ విచారణ చేపట్టాలి... దివాకర్ బస్సు ప్రమాదఘటనపై న్యాయ విచారణ చేయించాలని పార్టీ జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కందుల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. వైఎస్.జగన్‌పై అక్రమ కేసును నిరసిస్తూ కలిదిండిలో ఉద్యమించారు. నాయకులు ఛాంద్ భాషా, పంతగాని విజయ్, యలవర్తి శ్రీనివాసరావు, యాళ్ళ జీవరత్నం, సమయం సత్యనారాయణ కార్యకర్తలు పాల్గొన్నారు. కేసు ఎత్తివేయాలి.... మండవల్లి : చంద్రబాబు నిరంకుశ పాలన ఎన్నాళ్లో సాగదని పలువురు వైఎస్సార్ సీపీ నేతలు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చేబోయిన వీర్రాజు,ఎంపీపీ సాకా జసింత, వైస్ ఎంపీపీ యార్లగడ్డ సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు బోనం శేషగిరి, పెరుమాళ్ళ కొండారెడ్డి, మాజీ ఎంపీటీసీసభ్యుడు పెరుమాళ్ళ పెదవెంకటేశ్వర రెడ్డి, బేబీసరోజిని, చొప్పరపు నాగబ్రహ్మారావు కార్యకర్తలు పాల్గొన్నారు. బాబూ.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే... ముదినేపల్లి రూరల్ : వైఎస్సార్ సీపీ అధినేతగా, ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వై.ఎస్.జగన్ మోహనరెడ్డిపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నిమ్మగడ్డ భిక్షాలు, మండల కన్వీనర్ బడుగు భాస్కరరావు స్పష్టం చేశారు. పార్టీ ముఖ్యనేతలు బాబూ రాజేంద్రప్రసాద్ ,బేతపూడి వెంకటరమణ, షేక్ అల్లాభక్షు, బండి నాగరాజు, దాసరి శ్రీను, నేతలు పెద్దిబోయిన శివనాగరాజు, కట్టా వెంకటేశ్వరరావు, వర్రే నాగేంద్ర, బోయిన బోసు, గంటా సంసోను, దండే మోక్షానందం, దేవకోటి వెంకటేశ్వరరావు,కార్యకర్తలు పాల్గొన్నారు. -
సూపర్ సిక్స్ క్రికెట్ విజేత కైకలూరు 'ఏ' జట్టు
కైకలూరు : సూపర్ సిక్స్ ఫార్మాట్‌తో ఉత్సంఠభరితంగా జరిగిన క్రికెట్ పోటీల్లో కైకలూరు 'ఏ' జట్టు విజేతగా నిలిచింది. సంక్రాంతి పండగ సందర్భంగా స్థానిక వైవీ ఎన్నార్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈనెల 11న ప్రారంభమైన పోటీలు సోమవారం ముగిశాయి. టోర్నమెంట్లో మొత్తం 28 జట్లు పాల్గొన్నాయి. కేవలం ఆరు ఓవర్లు, ఆరుగురు ఆటగాళ్లతో సూపర్ సిక్స్ పోటీలు జరిగాయి. ఫైనల్ మ్యాచ్‌లో కైకలూరుకు చెందిన రాము సిక్సర్స్, కైకలూరు 'ఏ' జట్టు మధ్య పోటీ జరిగింది. టాస్ గెలిచిన రాము జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని ఆరు ఓవర్లలో 58 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కైకలూరు 'ఏ' జట్టు 3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా దిగిన కానిస్టేబుల్ రజనీ 11 బంతుల్లో 30 పరుగులు సాధించాడు. మరో బ్యాట్స్‌మెన్ సతీష్ 9 బంతుల్లో 29 పరుగులు సాధించి జట్టుకు విజయం అందించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కానిస్టేబుల్ రజనీకి దక్కింది. మొదటి బహుమతి రూ.15,000ను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్), రెండో బహుమతి రూ.12.000ను జనసేనకు చెందిన బాబీ, వదర్లపాడు చందులు సమకూర్చారు. యూత్ నాయకుడు కేవీఎన్‌ఎం నాయుడు విజేతలకు బహుమతులు అందించారు. అంపైర్లుగా అజ్మల్, రాంబాబు వ్యవహరించారు. నిర్వాహకులు ప్రసాద్, నిమ్మలసాయి, కిరణ్ పాల్గొన్నారు. -
వ్యర్థాలతో చేపల సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి
కైకలూరు : చేపల సాగులో మేతగా వ్యర్థాలను వినియోగించే రైతులు, రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర చేపల రైతుల సంఘ అధ్యక్షుడు ముదునూరి సీతారామరాజు అన్నారు. స్థానిక బృందావన్ లాడ్జిలో సంఘ నాయకులు, చేపల రైతులతో కలసి ఆయన గురువారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వ్యర్థాల సాగు కారణంగా మొత్తం చేపల పరిశ్రమపై చెడు ప్రభావం పడుతుందన్నారు. ఫంగాసీస్ చేపల సాగులో వ్యర్థాలను కొందరు రైతులు వాడుతున్నారన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారన్నారు. వ్యర్థాలతో సాగు చేస్తే సంఘం దృష్టికి తీసుకురావాలని కోరారు. సమీప రైతులు వ్యర్థాలతో మార్కెట్లో జరిగే నష్టాలను వివరించాలన్నారు. చేపల చెరువుల లైసెన్సులు నిమ్తితం రూ.700లతోపాటు ఆటో క్వాడ్ చెల్లించినవారికి అనుమతులు రాకపోతే గుడివాడ రోడ్‌లోని సంఘ కార్యాలయంలో వివరాలు తెలపాలని కోరారు. కార్యక్రమంలో సంఘ సెక్రటరీ చింతపల్లి అంకినీడు, కార్యవర్గ సభ్యులు నర్సిపల్లి అప్పారావు, భాస్కరవర్మ, ఘంటా సత్యనారాయణ, పాలచర్ల శ్రీనివాసచౌదరీ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
భారీగా పట్టుపురుగుల వ్యర్థాలు పట్టివేత
కైకలూరు : కృష్ణా జిల్లా కైకలూరు మండలం చెటాకాయి గ్రామంలో చేపల చెరువులో వేసేందుకు తెచ్చిన వ్యర్థాలను భారీ మొత్తంలో పోలీసులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన ఘంటసాల వెంకటేశ్వరరావుకు 20 ఎకరాల చేపల చెరువు ఉంది. చేపలకు ఆహారంగా ఆయన కర్ణాటక నుంచి రూ.3.70 లక్షల విలువైన 20 టన్నుల చనిపోయిన పట్టుపురుగులను తెప్పించాడు. గ్రామ సమీపంలో బుధవారం ఆగి ఉన్న లారీని పోలీసులు తనిఖీ చేసి సీజ్ చేశారు. దీనిపై వారు రెవెన్యూ, అటవీ, ఫిషరీస్ విభాగాల అధికారులకు సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి లారీ డ్రైవర్‌తో పాటు రైతుపై కేసులు నమోదు చేశారు. లారీలోని వ్యర్థాలను ధ్వంసం చేయనున్నట్లు రూరల్ ఎస్సై రంజిత్ కుమార్ తెలిపారు. రైతు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. చేపలకు ఆహారంగా వ్యర్థాలను వాడటంపై నిషేధం ఉన్న విషయం తనకు తెలియదని చెప్పారు. -
కొల్లేరు ప్రాంత చేపల సాగు ఆచరణాత్మకం
కైకలూరు : కొల్లేరు పరిసర ప్రాంతాల్లో చేపల చెరువు రైతులు అవలంభిస్తున్నా సాగు విధానాలు ఆచరణాత్మకంగా ఉన్నాయని బీహార్ రాష్ట్ర శివాన జిల్లా ఔత్సహక రైతులు కితాబిచ్చారు. చేపల సాగు అధ్యాయనంలో భాగంగా పది రోజుల క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా సోమవారం కైకలూరులో పర్యటించారు. కోరుకొల్లు రోడ్‌లోని సత్యం చేప పిల్లల హేచరీని పరిశీలించారు. ఇక్కడ తెలుసుకున్న సాగు పద్ధతులను బీహార్ ప్రభుత్వ అధికారులకు వివరిస్తామని రైతులు చెప్పారు. కాకినాడ ఫిషరీస్ అసిస్టెంట్ చీప్ టెక్నిషియన్ రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ కాకినాడ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీష్ ఎడ్యూకేషన్ (సీఐఎఫ్ఈ) డాక్టర్ మురళీధర్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పరిశీలనకు రైతులు వచ్చారన్నారు. చేపల పట్టుబడి, ప్యాకింగ్, సాగు పద్దతులపై స్థానిక రైతులతో బీహార్ రైతులకు అవగాహన కలిగిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఫిషరీస్ అసిస్టెంట్ చీప్ టెక్నిషియన్ నరసింహాచార్యులు పాల్గొన్నారు. -
ఆక్వా ల్యాబ్‌లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
కైకలూరు : జిల్లాలో ప్రయివేటు ఆక్వా ల్యాబ్‌లు తప్పనిసరిగా మత్స్యశాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మత్స్య శాఖ జిల్లా సహాయ సంచాలకుడు పి.కోటేశ్వరరావు చెప్పారు. కైకలూరులోని మత్స్యశాఖ కార్యాలయానికి ఆయన బుధవారం వచ్చారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం జీవో నంబరు 49 ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రయివేటు ల్యాబ్‌లను ఒకే గొడుకు కిందకు తీసుకువస్తుందన్నారు. జిల్లాలో 30 ప్రయివేటు ఆక్వా ల్యాబ్‌లు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. సీపా, ఎంపెడా వంటి సంస్థల ద్వారా కాకినాడ, కైకలూరు ప్రాంతాల్లో ప్రయివేటు ల్యాబ్ టెక్నీషియన్లకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. జిల్లాలో 48వేల హెక్టార్లలో మంచినీటి చెరువులు, 15 వేల హెక్టార్లులో ఉప్పునీటి చెరువులు ఉన్నాయని వివరించారు. ఇప్పటి వరకు మంచినీటి చెరువులు 25 వేలు, ఉప్పునీటి చెరువులు 3వేల వరకు రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలిపారు. చెరువుల అనుమతులకు సంబంధించి ఆటో క్యాడ్లు జతచేయని కారణంగా 433 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. చెరువులను ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోలేని చేపల రైతులకు డిసెంబరు 31వ తేదీలోపు రూ.500, 2017 మార్చి 31వ తేదీలోపు అయితే రూ.700 అపరాధ రుసుంతో దరఖాస్తులు అందించాలని చెప్పారు. సబ్సిడీపై పరికరాలు.. మత్స్యశాఖ పాలసీలో భాగంగా ఆక్వా రైతులకు సబ్సిడీపై పరికరాలను అందిస్తున్నట్లు కోటేశ్వరరావు చెప్పారు. జిల్లాలో ఐదు ఎకరాలలోపు రొయ్యల రైతులకు 50శాతం సబ్సిడీపై ఒక్కో రైతుకు 4 ఎరియేటర్లు చొప్పున 150 మందకి అందించామన్నారు. ఎస్సీ, ఎస్టీ ఆక్వా రైతులకు ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం రూ.7 కోట్లు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం, బీసీలకు 50 శాతం సబ్సిడీపై చేపల వలలను అందిస్తున్నట్లు వివరించారు. వేటకు ఉపయోగించే ఐబీఎం ఇంజిన్ రూ.1.20లక్షలకు 60 శాతం సబ్సిడీతో మత్స్యకారులకు అందజేస్తున్నట్లు చెప్పారు. కైకలూరు మత్స్యశాఖ ల్యాబ్‌ను త్వరలోనే అప్ గ్రేడ్ చేసి పూర్తిస్థాయిలో ఆధునికీకరిస్తామని ఆయన తెలిపారు. మత్స్య శాఖ కైకలూరు ఏడీ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
బాలికపై లైంగిక దాడి
కైకలూరు (కృష్ణా జిల్లా) : మద్యంమత్తులో ఉన్న యువకుడు బాలిక (14)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా కైకలూరులో శుక్రవారం జరిగింది. స్ధానిక వెలంపేట కాలనీలో ఆరో తరగతి చదువుతోన్న బాలిక దసరా సెలవులు ఇవ్వడంతో తన స్నేహితురాలితో కలిసి ఇంట్లో ఉంది. ఈ సమయంలో బీరువాల తయారీ దుకాణంలో పనిచేసే బెల్లాని నాని (22) అనే వ్యక్తి మద్యం మత్తులో ఇంటిలో దూరాడు. బాలిక స్నేహితురాలిని బయటకు పంపి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇరుగుపొరుగువారు రావడంతో పరారయ్యాడు. తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరీక్షల నిమిత్తం బాలికను ప్రభుత్వాసుపత్రికి పంపారు. టౌన్ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిషేధిత క్యాట్‌ఫిష్ స్వాధీనం
కైకలూరు(కృష్ణా): అక్రమంగా తరలిస్తున్న క్యాట్‌ఫిష్‌ను కృష్ణా జిల్లా కైకలూరు పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని లక్ష్మీపురం వద్ద శుక్రవారం రాత్రి వాహన తనిఖీలు చేపట్టిన అటవీ అధికారులు వ్యాన్‌లో తరలిస్తున్న 8 క్వింటాళ్ల క్యాట్‌ఫిషను గుర్తించి, వాహన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీటి విలువ రూ.80 లక్షలు ఉంటుందని తెలిపారు. సీజ్ చేసిన క్యాట్‌ఫిషను గుంత తీసి పూడ్చి పెడతామన్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే చేపల్లో ఒక రకమైన క్యాట్ ఫిష్ వాడకాన్ని, పెంపకాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. -
కష్టపడి కాదు.. ఇష్టపడే
కైకలూరు : తమ బిడ్డలు ఎంతో ఉన్నతస్థానానికి ఎదగాలని తల్లిదండ్రులు కలలు కనడం సహజమే. అయితే వారి ఆశలను నిజం చేసే క్రమంలో ఎంత కష్టాన్నయినా ఇష్టంగా మలచుకుని విజయం సాధించే బిడ్డలు అరుదుగా ఉంటారు. ఆ కోవలోకే వస్తుంది కైకలూరుకు చెందిన కొణిజేటి సాయిశ్రీలక్ష్మి. పదిలో నియోజకవర్గ ఫస్ట్, ట్రిపుల్ ఐటీలో టాపర్, సీపీటీలో ఆలిండియా 6వ ర్యాంకు, ఐపీసీసీలో సౌత్ ఇండియా ఫస్ట్, సీఎంఏలో ఆల్ఇండియా ఫస్ట్, ఇప్పుడు ఐసీడబ్ల్యూఏ ఆలిండియా ఫస్ట్రాంకర్గా నిలిచి తన ప్రతిభ చాటుకుంది. ఓ చిన్న కిరాణ దుకాణంతో జీవనం సాగిస్తున్న తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయని చదువుల తల్లితో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ.... సాక్షి : ఆలిండియా ర్యాంకుల విజయ రహస్యం ఏంటి ? శ్రీలక్ష్మి: విజయ రహస్యం అంటూ ఏమీ లేదండి. నేను అందరిలోనూ ముందుండాలి అనే బలమైన కోరికే నన్ను ఈ స్థాయికి తెచ్చింది. చిన్నప్పటి నుంచి నాకు చదువంటే ఎంతో ఇష్టం. ఏకాగ్రతతో ఏదైనా సాధించవచ్చు. సాక్షి : టాపర్ స్థాయికి చేరుకోడానికి కారణం ఎవరు ? శ్రీలక్ష్మి: కైకలూరు నేషనల్ స్కూల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివాను. పదిలో 574 మార్కులు సాధించి నియోజకవర్గంలోనే మొదటి స్థానం సాధించాను. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. నాకు స్కూలు విద్యాభ్యాసమే పునాది. సాక్షి : మీ భవిష్యత్తు లక్ష్యం ఏమిటీ ? శ్రీలక్ష్మి: ఐసీడబ్ల్యూఏ పూర్తి చేసి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. అదే విధంగా సివిల్స్‌లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. సాక్షి : మీ విజయ పరంపర వెనుక ఎవరున్నారు? శ్రీలక్ష్మి: మా తల్లిదండ్రులు పాండురంగారావు, నాగజ్యోతి సహకారం ఎప్పటికి మర్చిపోను. ఎంతోగానో నన్ను ప్రోత్సహించారు. అదే విధంగా విజయవాడ సూపర్‌విజ్‌లో అధ్యాపకులు గుప్తా మోటివేషన్ తరగతులు నన్ను ఎంతో ముందుకు తీసుకువెళ్లాయి. సాక్షి : ఆలిండియా ర్యాంకుల కైవసంపై మీ అనుభూతి ? శ్రీలక్ష్మి: ఎంతో సంతోషంగా ఉంది.. నేను కైకలూరులో పుట్టినందుకు గర్వపడుతున్నాను. మా తల్లిదండ్రులు, నా గ్రామానికి మంచి పేరు తీసుకురావడానికి మించిన సంతోషం ఏముంటుంది. నన్ను ఆదర్శంగా తీసుకోవాలని నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులే మిగతా విద్యార్థులకు చెప్పడం ఆనందాన్నిచ్చింది. సాక్షి : పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మీరిచ్చే సలహా ? శ్రీలక్ష్మి: మనం ఇష్టపడింది పొందాలంటే దాని కోసం ఖచ్చితంగా కష్టపడాలి. అయితే ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా మలచుకోవాలి. ఎంత సమయం చదివామన్నది ముఖ్యం కాదు, ఎంత వరకు అర్థం చేసుకున్నామనేది ముఖ్యం. విద్యార్థులు లక్ష్యం ఎన్నుకుని, ప్రణాళికతో సాధన చేస్తే విజయం తథ్యం. -
క్యాట్‌ఫిష్ లారీ పట్టివేత
కైకలూరు : కేంద్ర ప్రభుత్వం నిషేధించిన క్యాట్‌ఫిష్ సాగు కొల్లేరు గ్రామాల్లో యథేచ్ఛగా కొనసాగుతోంది. కైకలూరు మండలం శృంగవరప్పాడు నుంచి కర్ణాటక రాష్ట్రానికి రవాణా అవుతోన్న లారీని పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దుల్లో అటవీశాఖ అధికారులు మంగళవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. చటాకాయి గ్రామానికి చెందిన లారీ లోపల టార్ఫాలిన్ కవర్లో నీటిని పోసి 8 టన్నుల చేపలను తరలిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న వీటి విలువ రూ.4 లక్షలు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. శృంగవరప్పాడుకు చెందిన డాబా శ్రీను, సైదు దుర్గాంజనేయులుకి చెందిన సరకుగా భావించిన అధికారులు విచారణ సాగిస్తున్నారు. లారీ డ్రైవర్ తాతారావును అదుపులోకి తీసుకున్నారు. లారీని కైకలూరు అటవీశాఖ కార్యాలయం వద్ద ఉంచారు. ఆ సమయంలో చటాకాయికి చెందిన బలే కల్యాణం రాముడు నుంచి వివరాలు సేకరించారు. అటవీశాఖ డీఆర్వో జి.ఈశ్వరరావు నేతృత్వంలో సిబ్బంది రాజేష్, లాజర్, సతీష్, దీనబాబు, నరేష్, కిరణ్ దాడిలో పాల్గొన్నారు. ఫిషరీష్, రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం అందించి పట్టుకున్న క్వాట్ఫిష్ను పర్యావరణం దెబ్బతినకుండా పూడ్చుతామని డీఆర్వో తెలిపారు. మంత్రి చెప్పినా మార్పు లేదు సాక్షిత్తూ స్థానిక ఎమ్మెల్యే, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తన నియోజకవర్గంలో అనారోగ్యకర క్యాట్‌ఫిష్ చేపల రవాణాను అడ్డుకోవాలని పదే పదే చెబుతున్నా అధికారుల్లో చలనం లేదు. నిత్యం క్యాట్‌ఫిష్ రవాణా గుట్టుచప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. -
ఎడారిని తలపిస్తున్న కొల్లేరు
బీటలు వారిన చిత్తడి నేల వలసపక్షులకు నీటి కొరత సముద్రపు ఉప్పునీరు కొల్లేరుకు మాయమైన పచ్చదనం కైకలూరు: కోటి అందాల కొల్లేరు కళ తప్పింది. చుక్క నీరు లేక ఎడారిని తలపిస్తోంది. పచ్చదనం మాయమైంది. విడిది కోసం వలస వచ్చే అతిథి పక్షులు నీటికోసం,ఆహారం కోసం అల్లాడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పర్యవేక్షణ కొరవడడంతో దక్షిణ కాశ్మీరంగా పేరొందిన కొల్లేరు కన్నీరు పెడుతోంది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి 67 డ్రెయిన్లు, వాగుల ద్వారా లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు వరదల సమయంలో కొల్లేరులోకి చేరుతుంది. ప్రధానంగా బుడమేరు, తమ్మిలేరు డ్రెయిన్ల నుంచి ఎక్కువ నీరు వస్తుంది. ఒక్క కృష్ణాజిల్లా నుంచే వివిధ డ్రెయిన్ల ద్వారా 35 వేల 590 క్యూసెక్కుల నీరు కొల్లేరులో కలుస్తుంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది కొల్లేరులోకి నీటి ప్రవాహం తగ్గింది. దీంతో లక్షాలాది ఎకరాల కొల్లేరు భూములు బీటలు వారాయి. పర్యాటకులను ఆకర్షించే సహజసిద్ధ అందాలు నీరులేక కళావిహీనంగా తయారయ్యాయి. అలమటిస్తున్న అతిథి పక్షులు కొల్లేరు సరస్సుకు ఏటా సైబీరియా, అస్ట్రేలియా, నైజీరియా వంటి పలు దేశాల నుంచి వలస పక్షులు విడిది కోసం వస్తాయి. మొత్తం 189 రకాల పక్షులు కొల్లేరుపై ఆధారపడి జీవి స్తున్నాయి. ఏటా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలు పక్షుల సంతానోత్పత్తికి అనుకూల కా లం. కొల్లేరులో నీరు లేకపోవడంతో పక్షులకు వేట కరువైంది. కరువు పరిస్థితులు పక్షుల సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి. అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి పక్షుల విహార చెరువులో పూర్తిస్థాయిలో నీరు నింపలేదు. సముద్రపు నీరు కొల్లేరులోకి... కొల్లేరులో నీరు లేకపోవడంతో సముద్రపు ఉప్పునీరు పైకి ఎగదన్నుతోంది. దీంతో పంటపొలాలు చౌడుబారుతున్నాయి. ఇప్పటికే కృష్ణాజిల్లా కలిదిండి మండలం ఉప్పుటేరు పరివాహక ప్రాంతాల్లో లక్షలాది ఎకరాల భూములు పాడయ్యాయి. కొల్లేరుకు చేరే నీరు పెద ఎడ్లగాడి, చినఎడ్లగాడి కాలువలకు చేరుతుంది. అక్కడ నుంచి ఉప్పుటేరులో కలసి 40 కిలోమీటర్ల దూరంలోని కృత్తివెన్ను వద్ద సముద్రంలో కలుస్తోంది. రెగ్యులేటర్ నిర్మించి నీరు నిల్వ చేయాలని ప్రజలు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉప్పునీరు చేరడంతో కొల్లేరులో చేపజాతులు అంతరించిపోతున్నాయి. కొల్లేరు ప్రమాదంలో పడింది కృష్ణా డెల్టా కరువు పరిస్థితులు కొల్లేరుపై తీవ్ర ప్రభావం చూపాయి. అభయారణ్యంలో అక్రమ చేపల చెరువులకు కొల్లేరు నీరు తరలిస్తున్నారు. సముద్రం నుంచి ఉప్పునీరు కొల్లేరుకు చేరుతోంది. ఈ నీటి కారణంగా చేపలు మృత్యువాతపడుతున్నాయి. సముద్రపు నీరు చేరడంతో రెండు జిల్లాల్లో లక్షలాది ఎకరాల పంట పొలాలు చౌడు భూములుగా మారాయి. - యెర్నేని నాగేంద్రనాథ్, కొల్లేరు సరస్సు పునరుద్ధరణ సమితి అధ్యక్షుడు రెగ్యులేటర్ నిర్మించండి కొల్లేరు ఆపరేషన్‌కు సహకరిస్తే రెగ్యులేటర్‌ను బహుమతిగా అందిస్తామని నమ్మబలికారు. ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదు. రెగ్యులేటర్ నిర్మిస్తే కొల్లేరులో నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నీటిలో ఫింగర్ లింగ్స్ (2 అంగుళాల చేప పిల్లలు)ను వదిలితే కొల్లేరు ప్రజలకు వేట ఉంటుంది. ప్రభుత్వం త్వరగా రెగ్యులేటర్‌ను నిర్మించాలి. - బలే ఏసురాజు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల కొల్లేరు సంఘ ప్రధాన కార్యదర్శి -
మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిప్పుడు...
సినిమా పేరు : పట్నం వచ్చిన పతివ్రతలు (1982) డెరైక్ట్ చేసింది : మౌళి సినిమా తీసింది : అట్లూరి రాధాకృష్ణమూర్తి, కొమ్మన నారాయణరావు మాటలు రాసింది : జంధ్యాల-కాశీ విశ్వనాథ్ పిండి కొద్దీ రొట్టె అంటారు. కానీ నూతన్ ప్రసాద్‌కి ఇంత పిండి ఇచ్చినా అంత రొట్టె చేసేవాడు. అదీ చాలా రుచికరంగా. పాత్ర చిన్నదా పెద్దదా అనేది చూసుకునేవాడు కాదు. తన పేరుకి తగ్గట్టే నూతనత్వం కోసం తపించేవాడు. అది హీరో కావచ్చు. విలన్ కావచ్చు. కేరెక్టర్ ఆర్టిస్టు కావచ్చు.కమెడియన్ కావచ్చు... ఏదైనా నూతన్‌ప్రసాద్ యాక్ట్ చేస్తే ఆ పాత్రలకో దర్జా. ఈ ‘నూటొక్క జిల్లాల అందగాడు’ చేసిన చాలా పాత్రలు ఎవర్గ్రీన్. అసలే కామెడీ చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉందిప్పుడు... ఈ టైమ్‌లో నూతన్‌ప్రసాద్‌ని ఓసారి స్మరించుకోవాల్సిందే! హిట్ క్యారెక్టర్ అసలు పేరు : తాడినాడ దుర్గా సత్యవరప్రసాద్ పుట్టింది : 1945 డిసెంబర్ 12న కృష్ణా జిల్లా కైకలూరులో తొలి చిత్రం : నీడలేని ఆడది (1973) ఆఖరి సినిమా : రాజు-మహరాజు (2009) మొత్తం చిత్రాలు : సుమారు 500 మరణం : 2011 మార్చి 30 టాప్ టెన్ మూవీస్ 1. అందాల రాముడు (1973) 2. చలి చీమలు (1975) 3. రాజాధిరాజు (1980) 4. పట్నం వచ్చిన పతివ్రతలు (1982) 5. సుందరి సుబ్బారావు (1984) 6. అహ నా పెళ్లంట (1987) 7. {పజాస్వామ్యం (1987) 8. నవభారతం (1988) 9. బామ్మ మాట-బంగారు బాట (1989) 10. వసుంధర (1992) మన రాష్ట్రంలో ఎంతమంది పోలీస్ ఇన్స్పెక్టర్లు ఉంటారు? లెక్క తెలీదు కానీ... వాళ్లందర్నీ ఓ చోట నిలబెడితే ఒకే ఒక్కడు మాత్రం చాలా స్పెషల్‌గా కనబడతాడు. ఆ ఒక్కడే - బెల్లం అప్పారావ్. మన రాష్ట్రపతి - ప్రధానమంత్రి - మిలట్రీ ఛీఫ్ - వీళ్లెవరూ కూడా దేశం గురించి ఇతను ఆలోచించినంత ఎక్కువ ఆలోచించరు. ప్రతి రోజు - ప్రతి గంట - ప్రతి నిమిషం - ప్రతి క్షణం - ఈ దేశం గురించి తెగ ఫీలైపోతుంటాడు. టెన్షన్ పడిపోతుంటాడు. ఆగమాగమైపోతుంటాడు. దేన్నైనా దేశంతో ముడిపెట్టేస్తుంటాడు. అందర్నీ ఇరకాటంలో పెట్టేస్తుంటాడు. శాంపిల్ సీన్ నం. 1 ఓ లాడ్జి ముందు పోలీస్ వ్యాన్ ఆగింది. మన స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ అండ్ ఎనర్జిటిక్ అండ్ పేట్రియాటిక్ ఇన్స్పెక్టర్ బెల్లం అప్పారావ్ దిగాడు. అతని వెనుకే అయిదుగురు కానిస్టేబుళ్లు. ‘‘కానిస్టేబుల్.. మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిప్పుడు. వ్యభిచారమనేది రాన్రానూ ఎక్కువైపోతోంది. మీరు ఈ లాడ్జిలోని ప్రతి రూమూ, ప్రతి మంచం, ప్రతి దుప్పటి, ప్రతి తలగడ చెక్ చేసి ఆడకూతురు కనిపిస్తే చాలు వ్యానెక్కించేయండి... అంతే’’ అని ఆర్డరేశాడు. కానిస్టేబుళ్లు లాడ్జిని అణువణువూ గాలించేస్తున్నారు. ఆ లాడ్జికొచ్చేవాళ్లకి మాలిష్ చేసే కొండల్రావ్ వచ్చి చాలా వినయంగా ‘‘దండాలండీ ఇన్స్పెక్టర్ గారూ’’ అన్నాడు. ‘‘దండలకు, దండాలకు లొంగే మనిషిని కాను నేను. ఎందుకంటే... దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిప్పుడు. లొంగకూడదు’’ అన్నాడు బెల్లం అప్పారావ్ చాలా సీరియస్‌గా. ‘‘మన దేశ పరిస్థితుల్లాగే తమరి తల కూడా పెనం మీద వేసిన పెసరట్టులాగా కుతకుతలాడిపోతోంది. 5 నిమిషాలు మాలిష్ చేశానంటే హెడ్ అంతా కూలింగ్ అయిపోద్ది’’ అంటూ కొండల్రావ్ చాలా నాజూగ్గా మాటల్లోకి దించి మాలిష్ చేయడానికి సిద్ధమయ్యాడు. ‘‘నేనిప్పుడు డ్యూటీ మీదున్నా. డ్యూటీలో ఉన్నప్పుడు మాలిష్ చేయించుకుంటే అమెరికా, రష్యా వాళ్లు ఏమనుకుంటార్రా ఇడియట్’’ అని తిట్టినంత పని చేశాడు బెల్లం అప్పారావ్. అయినా కొండల్రావ్ తగ్గలేదు. ఇన్స్పెక్టర్కి మాలిష్ చేసి, ఎంతో కొంత నొక్కేయాలి.‘‘రెండో కంటోడికి తెలీకుండా ఆ మూల సోఫా మీద కూర్చోబెట్టి మాలిష్ చేసేస్తా రండి’’ అంటూ ఇబ్బంది పెట్టేసి మరీ బెల్లం అప్పారావ్‌ని పక్కకు తీసుకెళ్లాడు. తన టోపీ పక్కన పెట్టి హెడ్‌ని కొండల్రావ్కి అప్పగించాడు బెల్లం అప్పారావ్. కొండల్రావ్ చాలా ఒడుపుగా మాలిష్ చేస్తున్నాడు. ‘‘మీలాంటి ఖరీదైన బుర్రకాయల్ని కొబ్బరికాయల్లాగా వదిలేయకుండా, అప్పుడప్పుడు మాలిష్ చేయించుకుంటుండాలి. ఎంచేతంటారా? దేశానికి ఢిల్లీ ఎలాంటిదో... మన బాడీకి తలకాయ అలాంటిదండీ’’ చెప్పాడు కొండల్రావ్. ‘‘నాదసలే తూగోజీ... కాకినాడ. పది ఢిల్లీలతో సమానం’’ గర్వంగా చెప్పాడు బెల్లం అప్పారావ్. మాలిష్ పూర్తయింది. కొండల్రావ్ చేతులు నలుపుకోవడం చూసి ‘‘ఏంటి చేతులు నలుపుకుంటున్నావ్? డబ్బులా? అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిప్పుడు. డబ్బులడగకూడదు... తీసుకోకూడదు’’ అని తన నెత్తి మీద టోపీ పెట్టుకుని మళ్లీ డ్యూటీకి సిద్ధమైపోయాడు ఇన్స్పెక్టర్ బెల్లం అప్పారావ్. కొండల్రావ్ మహాముదురు. ఈ ఇన్స్పెక్టర్ దగ్గర ఎలా డబ్బులు వసూలు చేయాలో బాగా తెలుసు. ‘‘అయ్యా.. విషయం చెప్పడం మరిచిపోయా. మీకు డీఎస్పీగా ప్రమోషనొచ్చినట్టు కలొచ్చింది’’ అన్నాడు కొండల్రావ్. దాంతో బెల్లం అప్పారావ్ ఖుష్ అయిపోయి, జేబులోంచి డబ్బులు తీసిచ్చేశాడు. కొండల్రావ్ ఆ డబ్బుని ముద్దు పెట్టుకుంటూ ‘‘బాబూ... మీ తలకాయను జాగ్రత్తగా చూస్కోండి’’ అన్నాడు. ‘‘నా తలకాయకు ఎటువంటి డేంజరూ రాకూడదనే నిద్దట్లో కూడా టోపీ పెట్టుకుని పడుకుంటాన్నేను’’ అంటూ తన సీక్రెట్ చెప్పేశాడు బెల్లం అప్పారావ్. ఈలోగా కానిస్టేబుల్స్ వచ్చి ‘‘సార్... ఆడంగులెవరూ లేరు’’ అన్నారు. బెల్లం అప్పారావ్ ఆశ్చర్యపోతూ ‘‘వ్వాట్... ఒక్కరు కూడా దొరకలేదా? పోయినసారొచ్చినపుడు నలుగురు ఆడకూతుళ్లు దొరికారు. ఈసారి ఒక్కళ్లూ దొరకలేదంటే... దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నమాట. పదండి... మనమే వ్యాన్ ఎక్కుదాం’’ అంటూ లాడ్జిలోంచి బయటకు దారి తీశాడు. శాంపిల్ సీన్ నం. 2 మాలిష్ కళాకారుల సంఘం మీటింగ్. చాలా వేడివేడిగా జరుగుతోంది. కొండల్రావ్ తమ జాతినుద్దేశించి చాలా ఆవేశంగా ప్రసంగిస్తున్నాడు. అందరూ విప్లవానికి సన్నద్దం కావాలని ఉత్తేజపరుస్తున్నాడు. దాంతో అందరూ చప్పట్లు కొట్టారు. సరిగ్గా అదే టైంలో ఎంటరయ్యాడు బెల్లం అప్పారావ్. ‘‘ఆపండి... ఇది చప్పట్లు కొడుతూ ఆనందిస్తూ కూర్చోవాల్సిన సమయం కాదిది. అసలే మన దేశం చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది. లెఫ్ట్ నుంచి చైనా... రైట్ నుంచి పాకిస్థాన్... ఫ్రంట్ నుంచి వరదలు... బ్యాక్ నుంచి కరువులు... మన దేశాన్ని పట్టుకుని పీడిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మాలిష్ చేసే మీరు కూడా విప్లవం లేవదీస్తే - అమెరికా, రష్యా వాళ్లు ఏమనుకుంటారు మన గురించి? ఎద్దేవా చేస్తారు’’ అంటూ బెల్లం అప్పారావ్ బాగా క్లాస్ పీకి, వాళ్లందర్నీ అరెస్ట్ చేసి పారేశాడు. శాంపిల్ సీన్ నం. 3 అరెస్టయిన వాళ్లలో ఓ అమ్మాయి గర్భవతి. వెంటనే క్లాసు పీకడం మొదలెట్టాడు బెల్లం అప్పారావ్. ‘‘అసలే మన దేశం చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉందిప్పుడు. ఇలాంటి టైమ్‌లో పిల్లల్ని కనకూడదు. అయినా తొలి కాన్పు కాబట్టి అమెరికా, రష్యాలు ఏమీ అనుకోవు. మగబిడ్డ పుడితే నాలా ఇన్స్పెక్టర్ని చేయ్. ఆడబిడ్డ పుడితే ఇన్స్పెక్టర్కిచ్చి పెళ్లి చేయ్’’ అనేసి వెళ్లిపోయాడు. అసలు పిల్లల్ని కనడానికీ - అమెరికా, రష్యాకీ సంబంధం ఏమన్నా ఉందా? మోకాలికీ బోడిగుండుకీ లింకు పెట్టడమంటే ఇదేనేమో! అసలీ బెల్లం అప్పారావ్కి పెళ్లయిందా? పెళ్లయినా పిల్లలున్నారా? పిల్లలుంటే స్కూలుకెళ్తున్నారా? ఇవన్నీ తెలుసుకోవాలనిపిస్తోంది కదూ. అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ టైమ్‌లో ఇవన్నీ మనకవసరం అంటారా? హ్యాపీగా మాలిష్ చేయించుకుని బుర్ర ఫ్రెష్ చేయించుకోక... - పులగం చిన్నారాయణ ఈ ఇన్స్పెక్టర్ పాత్రకు అతనే ఇన్స్పిరేషన్! నేను వైజాగ్ పోర్ట్‌ట్రస్ట్ ఆఫీసులో కొన్నేళ్లు ఉద్యోగం చేశా. అక్కడ భాస్కర్‌రావు అని ఒకతను ఉండేవాడు. మొత్తం దేశం భారమంతా తన మీద ఉన్నట్టుగా, ఎప్పుడో ఏదో ఒకటి గొణుక్కుంటూ తెగ బిల్డప్లిచ్చేవాడు. అతని ఇన్స్పిరేషన్తో ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర అనుకుని ‘అసలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందిప్పుడు...’ అనే ఊతపదం పెట్టా. ఓ రోజు నిర్మాత విజయ బాపినీడు గారిని కలవడానికెళ్తే ఆయన చాలా సీరియస్ మూడ్‌లో ఉన్నారు. ‘‘నాలుగు జోకులు చెప్పండి’’ అనడిగితే నేను ఈ ఇన్స్పెక్టర్, మాలిష్ కేరెక్టర్లను యాక్ట్ చేసి సరదాగా చూపించా. ఆయనకు విపరీతంగా నచ్చేసింది. అప్పటికప్పుడు బీరువాలోంచి ఓ స్క్రిప్టు తీశారు. ఓ కన్నడ సినిమా ఆధారంగా రెండేళ్ల క్రితం ఆయన, జంధ్యాలగారు కలిసి ఓ స్క్రిప్టు చేశారు. ఎందుకో నచ్చక పక్కన పెట్టేశారట. ‘‘ఈ రెండు కేరెక్టర్లనీ ఇందులో పెట్టి ఈ స్క్రిప్టుతో వెంటనే సినిమా చేద్దాం’’ అన్నారు విజయ బాపినీడు. అలా ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ మొదలుపెట్టారు. ై డెలాగ్స్ నేనే రాశా. ఇన్స్పెక్టర్ పాత్రకు నూతన్‌ప్రసాద్‌ని అనుకున్నారు. మా ఇంటికొచ్చి కేరెక్టర్ గురించి మొత్తం తెలుసుకున్నాడు. ఆ ఇన్‌పుట్స్‌ని బేస్ చేసుకుని తన బాడీలాంగ్వేజ్, డైలాగ్ డిక్షన్కి తగ్గట్టుగా బ్రహ్మాండంగా మౌల్డ్ చేసేసుకున్నాడు నూతన్‌ప్రసాద్. ఈ ఇన్స్పెక్టర్ పాత్రకు మేం ప్రత్యేకంగా పేరు పెట్టలేదు. కానీ కాస్ట్యూమ్ మీద నేమ్ ప్లేట్లో బెల్లం అప్పారావు అని ఉంటుంది. అదే ఉంచేశాం. ఈ ఇన్స్పెక్టర్ పాత్ర సూపర్ డూపర్ హిట్. తర్వాత ఇదే పాత్రను మగమహారాజు, మగధీరుడు, హీరో, కృష్ణగారడి, దొంగకోళ్లు, దొంగల్లో దొర... ఇలా తొమ్మిది సినిమాల్లో కంటిన్యూ చేశాం. ఇదో రికార్డు కూడా. ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ లోని నూతన్‌ప్రసాద్, రావుగోపాలరావుల డైలాగ్స్ - క్యాసెట్ రూపంలో కూడా వచ్చాయి. - కాశీ విశ్వనాథ్, రచయిత -
'పార్టీని అమ్ముకున్నవారు విమర్శించడం విడ్డూరం'
కైకలూరు (కృష్ణాజిల్లా) : పార్టీని హోల్‌సేల్‌గా అమ్మేసుకుని కాంగ్రెస్ చెంతకు చేరిన చిరంజీవికి సీఎం చంద్రబాబును రాజీనామా చేయమనే అర్హత లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సిహెచ్.అయ్యన్నపాత్రుడు విమర్శించారు. కృష్ణాజిల్లా కైకలూరులో శనివారం పుష్కర యాత్రికులకు ఎంపీ మాగంటి బాబు ఏర్పాటు చేసిన ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పుష్కరాల మొదటి రోజు జరిగిన ఘటన గురించి చిరంజీవి టీవీల ముందు మాట్లాడారే కానీ, రాజమండ్రి వచ్చి బాధితులను పరామర్శించలేదన్నారు. అనంతపురం జిల్లాలో పర్యటన చేస్తున్న రాహుల్ గాంధీ.. ఉపాధి హామీ పథకంపై విమర్శలు చేయడం తగదన్నారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ పాలనలోనే ప్రారంభించారనే విషయం తెలుసుకోవాలన్నారు. అప్పట్లో ఆ పార్టీ నాయకులకు ఉపాధి హామీ పథకం ఆర్థిక వనరుగా మారిందన్నారు. తాను వచ్చిన తర్వాత కేంద్రంతో మాట్లాడి ఈ నిధులతో గ్రామాల్లో స్థిరాస్తులను పెంచడానికి కృషి చేశానన్నారు. డ్వాక్రా సంఘాలను రాహుల్ తల్లిదండ్రులు ఏర్పాటు చేయలేదని, చంద్రబాబు రూపొందించారని తెలుసుకోవాలన్నారు. ప్రతిపక్ష నేత జగన్ మంచి సూచనలు చేస్తే తప్పక పరిశీలిస్తామన్నారు. రాష్ట్రానికి 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.16 వేల కోట్లు రానున్నాయని చెప్పారు. వాటిలో సగం నిధులు తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్‌లకు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి మేజర్ పంచాయతీకి చెత్త సేకరణ ట్రాక్టర్‌ను అందిస్తామన్నారు. -
కైకలూరు టీడీపీలో ఎమ్మెల్సీ రగడ
విజయవాడ : ఎన్నికల సమయంలో..అప్పటి కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణకు ఎమ్మెల్సీ సీటు ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆ పార్టీ స్థానిక నాయకులు డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు బుధవారం స్థానిక సీతారామ ఫంక్షన్ హాలులో సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈడ్పుగంటి వెంకట్రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కీలక సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ... ఎన్నికల పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్‌కు కైకలూరు ఎమ్మెల్యే సీటు కేటాయించారని తెలిపారు. ఆ సమయంలో జయమంగళకు ఎమ్మెల్సీ సీటును ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు ప్రకటించే ఎమ్మెల్సీ జాబితాలో తొలిగా జయమంగళ పేరు ఉండాలని ఈ సందర్బంగా చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై జిల్లాలోని మంత్రులను కలిసి ఆ తర్వాత సీఎం చంద్రబాబును కలవాలని వారు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల కొల్లేరు ప్రాంతీయ వ్యవసాయ, మత్స్య సహకార సంఘాల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బలే ఏసురాజు, కలిదిండి, ముదినేపల్లి మండలాల జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు నున్న రమాదేవి, భూపతి నాగకల్యాణి, బండి లక్ష్మి, పోసిన కుమారి, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. -
శ్మశానంలో కూర్చుని ఆ కథ రాశా...
దర్శకుడు కావాలని పదిహేనేళ్లు తపస్సు చేశాడు రాజ్‌కిరణ్. అసిస్టెంట్ మేనేజర్‌గా, సహాయ దర్శకునిగా, అసోసియేట్ డెరైక్టర్‌గా అంచెలంచెలుగా ఎదుగుతూ ఎట్టకేలకు ‘గీతాంజలి’తో దర్శకుడయ్యారు. ఆయనతో జరిపిన మాటామంతీ. కైకలూరులో ఫొటోస్టూడియో నడిపా: మాది కృష్ణాజిల్లా కైకలూరు. నేను ఫొటోగ్రాఫర్‌ని. ఫోటో స్టూడియో కూడా రన్ చేశాను. సినిమాలంటే చిన్నప్పట్నుంచీ పిచ్చి. నూతనప్రసాద్ మా ఊరు నుంచే వెళ్లి పెద్ద స్టార్ అయ్యారు. ఆయనలా నేనూ స్టార్ అవ్వాలని కలలు కనేవాణ్ణి. నిర్మాత మాగంటి బాబుగారి ద్వారా హైదరాబాద్‌లో అడుగుపెట్టాను. అప్పటికే నాకు పెళ్లయ్యింది. పిల్లలు కూడా. జీవనోపాధినిచ్చే స్టూడియోకి తాళం వేసి హైదరాబాద్‌లో అవకాశాల కోసం వేట మొదలుపెట్టా. సినీ ప్రయాణం అలా మొదలైంది: రవిరాజా పినిశెట్టిగారి ‘అల్లుడుగారొచ్చారు’ చిత్రానికి అసిస్టెంట్ మేనేజర్‌గా చేరాను. సీన్ పేపర్లు జిరాక్స్ తీసుకురమ్మని పంపిస్తే... రెండు సెట్లు తీయించి, ఒక సెట్ నా దగ్గర ఉంచుకునేవాణ్ణి. వన్ లైన్ ఆర్డర్ అంటే ఏమిటి? సన్నివేశాలు ఎలా రాయాలి? అనేది వాటిని చూసి నేర్చుకునేవాణ్ణి. తర్వాత ‘చూసొద్దాం రండి’, ‘9 నెలలు’ చిత్రాలకు సహాయ దర్శకునిగా పనిచేశాను. ఎన్టీఆర్ ‘నిన్ను చూడాలని’ చిత్రంతో అసోసియేట్ డెరైక్టర్‌గా ప్రమోటయ్యా. ఆ తర్వాత కథలు తయారు చేసుకుని, దర్శకత్వం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టా. సునీల్‌తో చేద్దామన్నారు: ఓ శ్మశానంలో కూర్చొని ‘గీతాంజలి’ కథ రాసుకున్నా. ఈ కథకు నేను పెట్టిన పేరు ‘టూ లెట్’. తర్వాత అది ‘బాలాత్రిపుర సుందరి’గా మారింది. ఈ కథ విని నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఓకే చేశారు. అయితే... సునీల్‌తో చేద్దామన్నారు. అప్పటికే శ్రీనివాసరెడ్డికి మాటిచ్చి ఉన్నాను. అందుకే ఒప్పులేకపోయాను. తర్వాత ఎన్నో చేతులు మారి చివరకు కోన వెంకట్‌గారి వద్దకు చేరిందీ కథ. ఆయన నిర్మాత ఎంవీవీ సత్యనారాయణగార్ని రంగంలోకి దించడంతో ఇక కథ ఎక్కడా ఆగలేదు. కోన వెంకట్‌గారు ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ అవ్వడంతో సినిమాకు మరింత హైప్ వచ్చింది. బ్రహ్మానందంగారి సైతాన్‌రాజ్ పాత్ర, షకలక శంకర్ పాత్ర ఆయన క్రియేషనే. త్వరలో ఓ యువ హీరోతో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థలో సినిమా చేయబోతు న్నాను. -
మద్యం దుకాణం దగ్ధం
రూ.10 లక్షల విలువైన మద్యం నిరుపయోగం కైకలూరు మండలం వింజరం గ్రామంలో ఘటన వింజరం (కైకలూరు) : మండలంలోని వింజరం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో మద్యం దుకాణం, ఓ పూరిల్లు కాలిపోయాయి. వివరాల ప్రకారం.. కలిదిండి మండలం ఆవకూరు గ్రామానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చలమలశెట్టి రామానుజయ్యకు చెందిన ఈ దుకాణా న్ని ఇటీవలే ఏర్పాటు చేశారు. షాపులోనుంచి శుక్రవారం తెల్లవారుజామున మంటలు వస్తుండటాన్ని అటుగా వెళుతున్న ఆటో డ్రైవర్ చూసి పోలీసులకు సమాచారం అందించాడు. కైకలూరు నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. పోలీసులు, గుమస్తా కొండవీటి వెంకట కృష్ణ తెలి పిన వివరాల ప్రకారం గురువారం సా యంత్రం దుకాణాన్ని మూసి వెళ్లారు. దుకాణం వద్ద ఓ వ్యక్తి రోజూ బజ్జీలు అ మ్ముకుంటూ వెనుకభాగంలోని పాకలో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అతడు కుటుంబంతో సహా బంధువుల ఇంటికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తి పాకకు నిప్పంటించడంతో మంటలు వ్యాపించి ఉంటాయని భా విస్తున్నారు. ఈ ఘటనలో రూ. 10 లక్షలు విలువ చేసే మద్యం పాడైందని, రూ.80 వేల నగదు కాలిపోయిందని నష్టపోయామని గుమస్తా చెబుతున్నాడు. విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగా జరిగిందని భావించడానికి ఈ దుకాణానికి విద్యుత్ సర్వీసు లేదు. జనరేటర్‌ను వాడుతున్నారు. ఎవరో నిప్పంటించి ఉంటారని పోలీ సు లు భావిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఇంటిలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి శకలాలు రోడ్డుపైన, పక్కన ఉన్న పొలంలో పడ్డాయి. ఈ ఘటన జరిగినప్పుడు జనసంచారం ఉంటే ప్రమాదబారిన పడేవారని స్థానికులు చెబుతున్నారు. దుకాణం వెనుక నివసిస్తున్న బజ్జీల వ్యాపారితో విరో ధం ఉన్నవారు ఎవరైనా ఈ పని చేశారా? అనే కోణంలో విచారణ జరుగుతోంది. టీడీపీ కలి దిండి మండల అధ్యక్షుడు శ్రీని వాసచౌదరి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై టౌన్ అదనపు ఎస్ఐ షబ్బిర్ అ హ్మద్ కేసు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. -
‘నకిలీ’ కలకలం
కైకలూరు : కొల్లేరు తీరంలో నకిలీ కరెన్సీ నోట్లు లభించడంతో కలకలం రేగింది. దొంగనోట్లు చెలామణి చేసే ముఠాలో ఈ ప్రాంతవాసులు కూడా ఉన్నట్లు తెలియడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. కలిదిండిలోని ఓ ఇంటి వెనుక తవ్వి దాచిన రూ.4.50లక్షల విలువైన నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది. కొల్లేరు పరిసర ప్రాంతాల్లో చేపలు, రొయ్యిల చెరువులు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ రోజూ కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతుంటాయి. దీంతో ఈ ప్రాంతం తమకు అనుకూలమని భావించిన నకిలీ కరెన్సీ ముఠా జోరుగా దొంగనోట్లను చెలామణి చేస్తోంది. సులభంగా డబ్బు సంపాదించాలనుకునే కొందరిని కూడా ఈ ఉచ్చులోకి లాగుతున్నారు. బంగ్లాదేశ్‌లో తయారీ.. బంగ్లాదేశ్‌లో తయారుచేసిన నకిలీ కరెన్సీని విజయనగరం నుంచి రాజమండ్రి మీదుగా కొల్లేరు ప్రాంతానికి తరలిస్తున్నారు. అసలు నోట్లు రూ.25వేలు ఇస్తే నకలీ నోట్లు లక్షన్నర వరకు అందజేస్తారని సమాచారం. కలిదిండిలోనే నకిలీ నోట్లు తయారుచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నకిలీ నోట్ల ముఠా సభ్యుడి బంధువుల ఇంట్లో ప్రింటర్ లభించడం ఇందుకు బలాన్నిస్తోంది. ఇటీవల కాలంలో కైకలూరు రైల్వేస్టేషన్ నుంచి ప్రయాణికులు ఇచ్చిన రూ.500, రూ.100 నోట్లు నకిలీవని రైల్వేపోలీసులు గుర్తించారు. ఈ కేసును విచారించాలని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు రెఫర్ చేశారు. లబోదిబోమంటున్న వ్యాపారులు.. నకిలీ నోట్ల కారణంగా వ్యాపారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల క్రితం కైకలూరులోని ఓ హోటల్‌కు వచ్చిన నిత్యావసర వస్తువులను విక్రయించే వ్యక్తి రూ.500 నోటు ఇచ్చాడు. హోటల్ వ్యాపారి తిరిగి చిల్లర అతనికి ఇచ్చాడు. మరుసటి రోజు ఆ నోటును కరెంటు బిల్లు కట్టడానికి వెళితే అక్కడ అధికారులు దొంగ నోటుగా గుర్తిం చారు. ఇటువంటి ఘనలు పదేపదే జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వివిధ బ్యాంకులకు డబ్బులు చెల్లించే క్రమంలోనూ అధికారులు నకిలీ నోట్లు గుర్తించి చింపివేస్తున్నారు. నకిలీ నోట్లు తెచ్చిన వ్యక్తులు కేసు పెట్టేందుకు వెనుకాడుతున్నారు. -
రుణమాఫీ మాయరా.. సూరయ్య..
గ్రామంలో ఏ నలుగురు కలిసినా రుణమాఫీపైనే చర్చ. ఎలక్షన్లో నమ్మించి.. ఆ తరువాత నట్టేట ముంచిన చంద్రబాబు వైఖరిపై ప్రతి ఒక్కరూ దుమ్మెత్తి పోస్తున్నారు. కైకలూరు మండలం ఆళ్లపాడు రచ్చబండ వద్ద గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో కొందరు రైతుల సంభాషణ ఇదీ.. రామ్మూర్తి : ఏంటి.. సూరయ్య బావా అంత దిగాలుగా కూర్చున్నావ్.. ఇంట్లో ఎవరికైనా బాగాలేదా ఏంటీ.. సూరయ్య : అదేంలేదు రామ్మూర్తి.. ఇప్పుడే పొలంగాడికి పోయి వత్తున్నా.. రాకరాక చినుకుపడింది.. సాగు చేద్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు.. మన ఊరి ఆసామిని అప్పడిగితే లేదు పొమ్మన్నాడు. రామ్మూర్తి : అయ్యో.. బావా ఎంతకట్టమెచ్చిపడింది.. పోని బ్యాంకోళ్ల కాడికి పోకూడదూ.. సూరయ్య : అదీ అయ్యింది బావా.. మొన్న పంటకు మీ అక్క సుబ్బలక్ష్మి నగలు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాను.. సరిపోక పొలం కాగితాలు పెట్టి మళ్లీ తీసుకున్నాను.. ఇప్పుడేమో ఏవో నోటీసులంటా.. ఇంటికి పంపారు.. తాగడానికి.. గంజినీళ్లే దొరకడం లేదు.. ఇప్పుటికిప్పుడూ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చికట్టేది.. (అంటుండగా కాసులు కాలినడకన వచ్చి ఆగాడు.) కాసులు : ఏంటీ.. బావబామ్మర్దిలిద్దరూ తెగ మాటాడేసుకుంటున్నారు. ఏంటి.. కథ సూరయ్య : కథా.. కాకరకాయా.. మా క ట్టాలు చెప్పుకొంటున్నాం.. అదును దాటిపోతోంది. కాడి కడతానికి పైసల్లేవ్.. కాసులు : అదేంటి సూరయ్య.. మొన్న ఎలచ్చన్లో మనూరొచ్చిన చంద్రబాబు రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పారుగా.. సూరయ్య : ఆ.. అవును.. అదే నమ్మి ఓటేశాం. ఆయన గారు ముఖ్యమంత్రి కాగానే రుణాలు రద్దుచేసి.. బ్యాంకోళ్లు డబ్బు లిత్తారని ఎదురుచూశాం. తీరా ఓటు దాటిన తర్వాత గేటు మూసినట్లుగా ఉంది పరిస్థితి. అదేదో రీషెడ్యూలంటా.. అది కూడా కిందటేడాది ఆరు నెళ్లకేనంటా.. కాసులు : నీవు చెప్పేది నిజమే సూరయ్య. కమిటీ అంటూ ఓ 40 రోజులు గడపుకొచ్చారు.. తీరా రీషెడ్యూలంటా మెలిక పెట్టారు. ఇదే జరిగితే మనకు పావలా వడ్డీ ఏమో గానీ, 13 శాతం వడ్డీతో పాటు చక్రవడ్డీ, బారువడ్డీలో బ్యాంకోళ్లు మన ఆస్తుల్ని గింజేసుకుంటారు. ఇంకో విషయం తెలుసా.. మనం బ్యాంకులో తనఖా పెట్టిన పొలం దస్తావేజులు ఇవ్వరంటా. మన పిల్లల పెళ్లిళ్లకు అవసరమయ్యి పొలం అమ్ముదామన్నా ఇక కుదరదు. అది సరే గానీ రామ్మూర్తీ ఎలచ్చన్ల ముందు హామీలు ఇచ్చినప్పుడు ఇవన్నీ తెలీయదా ఏంటీ.. రామ్మూర్తి : అవును కాసులు.. ఏదో విధంగా గద్దెనక్కెమా లేదా అన్నట్టుగానే ఉంది వీళ్ల తీరు. లేదంటే ఏంటీ.. మనకు రుణాలు మాఫీ చేస్తే పొరుగు రాష్ట్రాలు ఊరుకోవంటా. వాళ్లు కూడా అడుగుతారంటా. ఇది ముందు తెల్వదా వాళ్లకు. అంతెందుకు.. మాది ఉమ్మడి కుటుంబం. మా తమ్ముడు, అన్న కూడా రుణాలు తీసుకున్నారు. కుటుంబానికి ఒక్కరికే రుణమాఫీ అంటే మా పరిస్థితేంటీ. కాసులు : అదీ సరే గాని రామ్మూర్తీ.. అటుచూడూ.. ఉరుకులు పరుగుల మీద వస్తోందీ.. మన పురుషోత్తమేనా.. రామ్మూర్తి : అవునవునూ.. ఆపండపండీ.. ఏంటీ సంగతి పురుషోత్తం.. పురుషోత్తం : ఏం చెప్పమంటారు బాబు. ఆ చంద్రబాబు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని చెప్పడంతో మా ఆవిడ శీతాలు బ్యాంకు నుంచి తీసుకున్న రుణం కట్టకుండా, కైకలూరులో కలర్ టీవీ, ఫ్రిజ్, డబుల్‌కాట్ మంచాలు.. ఇంకా ఏవేవో కొనేసింది. దాని సిగతరగ ఇప్పుడేమో బ్యాంకోళ్లు ఇంటి మీద పడ్డారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాబ్బాబు.. కాస్త మీరైన చెప్పండి. రామ్మూర్తి : అందరి పరిస్థితి అదేలే.. పదండి ఆ గొడవెంటో చూద్దాం.. అని నలుగురు ముందుకు కదిలారు. -
పైసా విదల్చని ప్రభుత్వం
కైకలూరులో స్టౌ ప్రమాద బాధితుల ఆక్రందన ఎనిమిది నెలలు గడుస్తున్న అందని పరిహారం ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు కైకలూరు : కైకలూరు సంత మార్కెట్లో జరిగిన స్టౌ ప్రమాద బాధితులు పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. ఎనిమిది నెలలు గడుస్తున్నా సాయం అందక పోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. గతేడాది నవంబరు 12న మార్కెట్లో బజ్జీల బండి వద్ద స్టౌ పేలింది. కాగుతున్న నూనె 10 మందిపై పడింది. ఈ ఘటనలో కైకలూరుకు చెందిన తోట పోతురాజు (65), అడపా సుబ్బలక్ష్మి (33), ఖాదర్ బాషా (26), ఆగొల్లు శిరీషా కుమారి (19), కైకలూరు మండలం పల్లెవాడకు యాళ్ళ ఎలీషారావు (19), మండవల్లి మండలం దెయ్యంపాడుకు చెందిన కంభంపాటి మేరి సరోజిని (58), భైరవపట్నానికి చెందిన నత్తల వాణిశ్రీ (50), కలిదిండి మండల పేట కలిదిండికి చెందిన లింగం నాగమణి (50), పశ్చిమగోదావరి జిల్లా కోమటిలంకకు చెందిన పెనుగొండ సలోమి (17), ఇదే జిల్లా ఏలూరు మండలం మాదేపల్లి చెందిన బురగ తేరేజమ్మ (45)లు గాయపడ్డారు. వీరంతా విజయవాడలోని పలు ప్రైవేటు ఆస్పత్రిలలో చికిత్స పొందారు. వారం రోజులు మృత్యువుతో పోరాడి నవంబరు 19న కైకలూరుకు చెందిన బజ్జిల బండి యజమాని తోట పోతురాజు, అడపా సుబ్బలక్ష్మి, కంభంపాటి మేరి సరోజిని, గురజ తేరేజమ్మలు మరణించారు. కోమటిలంకకు చెందిన పెనుగొండ సలోమి 47 రోజులు మృత్యువుతో పోరాటం చేసి నవంబరు 29న కన్నుమూసింది. ఇందులో ఖాదర్‌బాషా, ఆగొల్లు శిరీషాకుమారి, నత్తల వాణిశ్రీ, యాళ్ళ ఎలిషారావు, లింగం నాగమణిలు క్షతగాత్రులుగా మిగిలారు. గొల్లుమంటున్న ఆగోల్లు శిరీషా తల్లిదండ్రులు స్టౌ ప్రమాదంలో ఆగొల్లు శిరీషాకు 50 శాతం శరీరం కాలింది. ఆమె స్థానిక వైవీఎన్నార్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ చదివింది. కుమారీ టాకీస్ వద్ద ఓ సెల్ దుకాణంలో పని చేస్తోంది. మార్కెట్ సమీపంలోని ఇంటి వద్ద భోజనం చేసి తిరిగి దుకాణానికి వెళుతుండగా ప్రమాదబారిన పడింది. విజయవాడలో 6 నెలలుగా ఓ చర్చిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. మంచంపై కదలకుండా ఉండటంతో కొద్దిరోజుల కిందట కుడికాలు బిగిసుకుపోయింది. ఆగొల్లు శ్రీనివాసరావు, సీతామహాలక్ష్మి దంపతులకు ఇద్దరు ఆడ, ఇద్దరు మగ సంతానం. శిరిషా రెండో కుమార్తె. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం వారిది. ఇప్పటి వరకు వైద్యం నిమిత్తం రూ. లక్షా 50 వేలు ఖర్చు అయ్యిందని,ప్రభుత్వం ఆదుకోవాలని శ్రీనివాసరావు కోరారు. మృతురాలు అడపా సుబ్బలక్ష్మి భర్త సుబ్బారావు 2004 మృతిచెందాడు. వీరికి నాగలక్ష్మి (16), మణికంఠస్వామి (20), భవాని (14) పిల్లలు. ప్రమాదం జరిగిన రోజున టౌన్‌హాలులో రచ్చబండ కార్యక్రమానికి సుబ్బలక్ష్మి వచ్చింది. ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు హామీ రైతు పరామర్శ యాత్రలో భాగంగా ప్రతిపక్ష నేత హోదాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవంబరు 26న కైకలూరు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం ఆధికారంలో ఉంటే మృతులకు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షలు పరిహారం అందించేవారిమని, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రూ. 2లక్షలైనా అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం పార్టీ నుంచి మృతులకు రూ. 10 వేలు, క్షతగాత్రులకు రూ. 5వేలు అందించారు. క్షతగాత్రులకు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు రూ. 5వేలు చొప్పున అంతకు ముందు అందించారు. ప్రమాదం జరిగినప్పుడు మృతులకు అపద్బంధు పథకం కింద నష్టపరిహారం వచ్చే విధంగా అధికారులు నివేదికలు పంపారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నగదు వచ్చే ఏర్పాట్లు చేస్తామని స్థానిక నాయకులు వాగ్దానాలు చేశారు. ఇప్పటి వరకు బాధితులకు సాయం అందలేదు. సీఎం చంద్రబాబు ఆదుకోవాలని బాదితులు కోరుతున్నారు. -
క్రీడాస్ఫూర్తిని నింపిన రన్
4వేల మంది హాజరు కిక్కిరిసిన కైకలూరు రహదారులు రన్లో పాల్గొన్న ఎంపీ మాగంటి కైకలూరు :అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా కైకలూరులో సోమవారం నిర్వహించిన ఒలింపిక్ రన్ క్రీడా స్ఫూర్తిని నింపింది. జిల్లా క్రీడాధికార సంస్థ, ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ రన్లో పలు విద్యాసంస్థలకు చెందిన సుమారు 4వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఉదయం డిగ్రీ కాలేజీకి చెందిన ఒక బ్యాచ్‌ను ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), ఏలూరురోడ్డు వద్ద మరో బ్యాచ్‌ను మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ప్రారంభించారు. రెండు బ్యాచ్‌ల్లోని నాయకులు, విద్యార్థులు కాగడాలతో తాలూకా సెంటర్ వద్ద ఏర్పాటుచేసిన సభా వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాగంటి మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులు క్రీడలపై ఆసక్తి చూపాలని పిలుపునిచ్చారు. జిల్లా క్రీడాధికారి రామకృష్ణ మాట్లాడుతూ కైకలూరులో స్టేడియం నిర్మాణానికి రూ.2.10 కోట్ల నిధులు మంజూరయ్యూయని చెప్పారు. స్థల సేకరణ జరిగితే పనులు ప్రారంభిస్తామన్నారు. జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసానికి ప్రతీకలన్నారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు మాట్లాడుతూ కైకలూరు నుంచి వడ్లమన్నాటి పాండురంగారావు, మండవల్లి నుంచి మార్తమ్మ వంటి వారు జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చూపారని, వారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కేపీ రావు మాట్లాడుతూ 2018లో నిర్వహించే ఒలింపిక్ గేమ్స్‌ను మన రాష్ట్రంలో నిర్వహించాలంటూ బిడ్ వేయనున్నట్లు చెప్పారు. కైకలూరులో రాష్ట్రస్థాయి పోటీలు త్వరలో నిర్వహిస్తామన్నారు. స్థానిక ఒలింపిక్ నిర్వహణ కమిటీ సభ్యుడు కేవీఎన్‌ఎం నాయుడు మాట్లాడుతూ కైకలూరులో ఎంతోమంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారన్నారు. కైకలూరు కరాటే మాస్టర్ ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో రన్లో పాల్గొన్నవారికి తాగునీరు, బిస్కెట్లు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ రన్ నిర్వహణ కమిటీ సభ్యులు గురజాడ ఉదయశంకర్, ఎంఏ రహీమ్, పీఈటీలు లూయిస్, లక్ష్మణరావు, శ్రీనివాసరావు, పీడీ సత్యనారాయణ, సర్పంచి నర్సిపల్లి అప్పారావు, జెడ్పీటీసీ బొమ్మనబోయిన విజయలక్ష్మి, నాయకులు చలమలశెట్టి రామానుజయ్య, మార్కెట్‌యార్డు చైర్మన్ సామర్ల శివకృష్ణ, న్యాయవాది కారి శరత్‌బాబు, సయ్యపురాజు గుర్రాజు, నేషనల్, జాగృతి, భాష్యం, చైతన్య, హోలిక్రాస్, కేపీఎస్, భుజబలపట్నం, కానుకొల్లు, కైకలూరు ప్రభుత్వ బాలుర, బాలికల హైస్కూళ్లు, ఓరియంటల్ హైస్కూల్, వికాస్, విద్యాంజలి కాలేజీలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. -
కొల్లేరుకు పూర్వ వైభవం
మంత్రి కామినేని వెల్లడి కైకలూరు : కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని కొల్లేరు ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకొస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, వైద్య విద్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. ఆయన మంత్రి పదవి స్వీకరించిన తర్వాత ఆదివారం మొదటిసారి కైకలూరు విచ్చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఉప్పుటేరు సరిహద్దు నుంచి కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ర్యాలీగా వచ్చిన ఆయన తన స్వగ్రామమైన వరహాపట్నంలో లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుని కైకలూరు మార్కెట్‌యార్డులో జరిగిన అభినందన సభలో మాట్లాడారు. తన తల్లి జీవించి ఉంటే ఇప్పుడు తన ఎదుగుదల చూసి ఎంతో సంతోషపడేదని చెప్పారు. కొల్లేరు ప్రాంత సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానన్నారు. ట్రాక్టర్లతో రైతులు సొంత ప్రయోజనాల కోసం తీసుకువెళ్లే మట్టిపై అధికారులు కలగచేసుకోవద్దని సూచించారు. ఈ విషయం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లానని, ఆయన మైనింగ్ అధికారులతో మాట్లాడారని చెప్పారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ కొల్లేరు సమస్యల పరిష్కారానికి మంత్రి కామినేనితో కలసి కృషి చేస్తామన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడారు. కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ కొల్లేరు ఆపరేషన్ సమయంలో ధ్వంసం చేసిన 7500 ఎకరాలను తిరిగి పంపిణీ చేసే విధంగా కృషి చేయాలని కోరారు. టీడీపీ రాష్ట్ర నాయకులు చలమలశెట్టి రామానుజయ్య, మార్కెట్‌యార్డు చైర్మన్ సామర్ల శివకృష్ణ, ఏలూరు పార్టీ నాయకులు ఎస్ఆర్ఎం బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామినేని వెంకట కృష్ణ ప్రసంగించారు. అనంతరం జిల్లా అధికారుల సమాచారంతో కూడిన ‘విజయ భేరి’ డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కామినేని, మాగంటిని గజమాలలతో ఘనంగా సత్కరించారు. -
కైకలూరులో బీజేపీకి శ్రేణులు దూరం
కావూరి సాంబశివరావు చేరికను వ్యతిరేకిస్తున్న కార్యకర్తలు తమకు ప్రాధన్యత లేదంటూ పార్టీకి నాయకుల రాజీనామా కైకలూరు, న్యూస్‌లైన్ : ‘పార్టీ అధికారంలో లేకపోయినా సమస్యలపై ఒంటరి పోరాటం చేశాం.. అధిష్టానం చెప్పిన కార్యక్రమాలను తూ.చ. తప్పకుండా పాటించాం.. ఎన్నికలు వచ్చే సరికి ముందు నుంచి కష్టపడిన కార్యకర్తలను పక్కనబెట్టారు.. ఇది అన్యాయం’’ అంటూ కైకలూరు నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ, టీడీపీ పొత్తుల్లో భాగంగా కైకలూరు సీటును ఇటీవలే బీజేపీలో చేరిన కామినేని శ్రీనివాస్‌కు కట్టబెట్టారు. గత ఎన్నికల్లో కామినేని పీఆర్పీ తరుఫున పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గానికి అప్పుడప్పుడు చుట్టపుచూపుగా వచ్చిన ఆయనకు టికెట్ ఇవ్వడాన్ని కార్యకర్తలు వ్యతిరేకించారు. తర్వాత నాయకులు బుజ్జగించడంతో కామినేని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇటీవల వెంకయ్యనాయుడు ప్రచార సభకు పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన ప్రాధన్యం ఇవ్వలేదని బీజేపీ నాయకులు మదనపడ్డారు. చివరికి పొత్తుల పార్టీలో ఇమడలేమంటూ కైకలూరుకు చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వేంపాటి విష్ణురావు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మంగళవారం రాత్రి సీమాంధ్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబుకు ఫ్యాక్స్ చేశారు. కిసాన్ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ బొల్లా అభిమన్యుకుమార్ పదవిని వదులుకోడానికి సిద్ధమవుతున్నారు. ముందు నుంచీ బీజేపీ తరఫున ప్రజా సమస్యలపై పోరాడిన నాయకులను పక్కన పెట్టడం పార్టీకి నష్టమేనని కార్యకర్తలు భావిస్తున్నారు. కావూరి చేరికపై వ్యతిరేకత ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు గురువారం భీమవరంలో జరిగే మోడీ బహిరంగ సభలో బీజేపీలో చేరనున్నారు. ఆయన చేరికను పార్టీ కైకలూరు నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఆయన టీడీపీ టికెట్ ఆశించగా, మాగంటి బాబు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. నియోజకవర్గంలో అనేక సమస్యలపై బీజేపీ నాయకులుగా కావూరిపై పోరాటం చేశామని, ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేయడం తమకు ఇష్టం లేదని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధిగా రాష్ట్ర విభజన అంశంలో ఆయన చేసిందేమీ లేదని, పైగా ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని వివరిస్తున్నారు. బీసీలకు ప్రాధాన్యం ఇచ్చిన వైఎస్సార్ సీపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు సముచిత స్థానం కల్పించారని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ బొల్లా అభిమన్యుకుమార్ చెప్పారు. కైకలూరు నియోకవ ర్గంలోని బీసీ ఓటర్లు ఈ విషయాన్ని గ్రహించాలని సూచించారు. ఎన్నికల ప్రాచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి గురువారం కైకలూరు వచ్చినప్పుడు, ఆయన సమక్షంలో బీజేపీ నుంచి పెద్ద సంఖ్యలో ఆ పార్టీలో చేరనున్నామని ఆయన తెలిపారు. -
డిఎన్ఆర్ 30వేలు, రామప్రసాద్ అయితే 50 వేలు...
-
డిఎన్ఆర్ 30వేలు, రామప్రసాద్ అయితే 50 వేలు...
విజయవాడ: తాను పోటీ చేస్తే 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిచేవాడినని, ఇప్పుడు తాను మద్దతు ఇచ్చే ఉప్పల రామ ప్రసాద్ 50 వేల మెజార్టీతో గెలుస్తారని వైఎస్ఆర్ సిపి నేత దూలం నాగేశ్వరరావు (డిఎఎన్ఆర్) చెప్పారు. కృష్ణా జిల్లా కైకలూరు శాసనసభ స్థానానికి తొలుత దూలం నాగేశ్వరరావుని అనుకున్నారు. అయితే బిసిలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ స్థానాన్ని ఉప్పల రామప్రసాద్కు కేటాయించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యకర్తల సమావేశంలో అందరూ ఒకే మాట చెప్పారు. అభ్యర్థి ఎవరైనా వైఎస్ జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి కావడం తమకు ముఖ్యం అని చెప్పారు. దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ రామ ప్రసాద్‌ను 50 వేల మెజార్టీతో గెలిపిస్తామన్నారు. జగన్ సిఎం కావాలని, ప్రజా సమస్యలు తీరాలని అన్నారు. కొల్లేరు ప్రజల సమస్యలు తీరాలంటే వైఎస్ఆర్ సీపీని గెలిపించాలని ఆయన కోరారు. వైఎస్ఆర్ సీపీ విజయాన్ని ఏ ఒక్క శక్తి ఆపలేదని నాగేశ్వరరావు అన్నారు. -
కైకలూరు టీడీపీలో ముదురుతున్న ముసలం
టిక్కెట్ల కలకలం ఇంటి సమస్యలే జయమంగళను దూరం చేస్తున్నాయా? తెరపైకి కొత్త ముఖాలు వ్యతిరేకిస్తున్న మాగంటి, జయమంగళ అనుచరగణం కైకలూరు, న్యూస్‌లైన్ : కైకలూరు తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల కలకలం మొదలైంది. ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు పార్టీలో చేరతారని వస్తున్న ఊహాగానాలపై లోక్‌సభ సీటు ఆశిస్తున్న మాగంటి బాబు వర్గం కారాలు మిరియాలు నూరిన విషయం విదితమే. తాజాగా జిల్లాలోని తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కైకలూరు మినహా మిగతావి యథాతథంగా పోటీలో ఉండే అవకాశం ఉందని ఓ పత్రికలో (సాక్షి కాదు) వచ్చిన కథనం కైకలూరు నియోజకవర్గ పార్టీ వర్గాల్లో శుక్రవారం కలకలం రేపింది. నియోజకవర్గంలో అన్ని మండలాల నాయకులు ఈ అంశంపై స్థానిక మాగంటి బాబు నివాసంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి నిప్పులు చెరిగారు. టీడీపీ, బీజేపీ పొత్తుల్లో భాగంగా ఇప్పటికే బీజేపీలో చేరిన యెర్నేని సీతాదేవికి కైకలూరు సీటు కేటాయిస్తే కచ్చితంగా వ్యతిరేకిస్తామని కార్యకర్తలు కుండబద్దలు కొట్టినట్టు చె ప్పారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే జయమంగళ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కడం, కార్యకర్తల్లో విభేదాలపై అధిష్టానం ఈ సారి సీటు కేటాయింపులో ఆచితూచి వ్యవహరిస్తుందనే అనుమానం కార్యకర్తల్లో ఉంది. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున అవకాశం దొరికితే పోటీ చేయడానికి మరో ఇద్దరు నేతలు కాచుకు కూర్చున్నారు. సీటివ్వకపోతే వ్యతిరేకిస్తాం... పత్రిక కథనంతో కంగుతున్న నాయకులు జయమంగళకు సీటు కేటాయించకపోతే వ్యతిరేకిస్తామని శుక్రవారం టీడీపీ ఏలూరు లోక్‌సభ పరిశీలకుడు గరికపాటి రామ్మోహనరావుకు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన చేసేదిలేక పత్రిక కథనాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని నచ్చచెప్పి పంపించినట్లు సమాచారం. ఈ విషయంపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఈడ్పుగంటి వెంకట్రామయ్య, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు పెన్మెత్స త్రినాథరాజు, వల్లభనేని శ్రీనివాస చౌదరి, కొత్తూరు విఠల్, రేమల్లి విజయబాబు, నాయకులు సమావేశంలో మాట్లాడుతూ మాగంటి, జయమంగళకు మాత్రమే తమ మద్దతు ఉంటుందని తేల్చిచెప్పారు. -
ఏసీబీ వలలో పంచాయతీ ఈవో
రూ.8 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం మధ్యవర్తినీ అదుపులోకి తీసుకున్న అధికారులు బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కోసం సొమ్ము డిమాండ్ కైకలూరు, న్యూస్‌లైన్ : కైకలూరు పంచాయతీ ఈవో ఆర్.భవానీప్రసాద్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. బిల్డింగ్ ప్లాన్ అనుమతుల కోసం గురువారం రూ.8 వేలు లంచం తీసుకోగా అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. స్థానిక ఏలూరు రోడ్డు సమీపంలో నివాసముంటున్న చేపల రైతు సైదు ఆనందరావు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎన్నికల నామినేషన్ల విధుల్లో ఉన్న ఈవోకు ఎనిమిది రూ.1000 నోట్లను లంచంగా అందించేందుకు వెళ్లాడు. బయటకు వచ్చి నగదు తీసుకున్న ఆయన వాటిని మధ్యవర్తి, లెసైన్స్డ్ సర్వేయర్ గుడిపాటి జగన్నాథానికి ఆ సొమ్ము అందజేశాడు. ఇంతలో మారువేషాల్లో ఉన్న అవినీతి నిరోధక శాఖ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని చూసి జగన్నాథం పారిపోతుండగా అధికారులు వెంటపడి పట్టుకున్నారు. అతనికి దేహశుద్ధి చేసి గదిలోకి తీసుకెళ్లి విచారణ చేశారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద చివరి రోజు నామినేషన్లు కావడంతో మండంలోని వివిధ గ్రామాల అభ్యర్థులు, మద్దతుదారులతో కోలాహలంగా ఉంది. ఇంతలో ఒక్కసారిగా జగన్నాథాన్ని ఏసీబీ అధికారులు బలవంతంగా తీసుకెళ్లడంతో ఏం జరుగుతోందో తెలియని గందరగోళ స్థితి ఏర్పడింది. అసలేం జరిగిందంటే... మండవల్లి మండలం దేవి చింతపాడుకు చెందిన సైదు పాండురంగారావు స్థానిక ఏలూరు రోడ్డులో స్థలం కొన్నాడు. ఆయన మరణానంతరం కుమారుడు ఆనందరావు భవనం నిర్మించుకున్నాడు. ఇటీవల పై అంతస్తు నిమిత్తం బ్యాంకు రుణం కోసం పంచాయతీ ప్లాన్ అప్రూవల్ పొందేందుకు ఫిబ్రవరి 28న కైకలూరు పంచాయతీ ఈవో భవానీప్రసాద్‌ను కలిశాడు. రూ.20 వేలు లంచం ఇస్తే వెంటనే ఇస్తానని ఆయన సమాధానమిచ్చాడు. తన తండ్రి బతికున్నప్పుడే అప్రూవల్ కోసం దాఖలు చేసుకున్నామని చెప్పగా, ఆ రసీదులు తీసుకురావాలని చెప్పాడు. తీరా తీసుకొచ్చాక వాటికి కాలం చెల్లిందని, కొత్తవి తీసుకోవాలని తెలిపాడు. ఇలా అనేక పర్యాయాలు కార్యాలయం చుట్టూ తిప్పటంతో విసిగి వేసారిపోయిన ఆనందరావు ఈ నెల 18న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల పథకం ప్రకారం ఈవోతో మాట్లాడగా జగన్నాథంతో మాట్లాడాలని చెప్పాడు. చివరికి రూ.8 వేలకు పనిపూర్తిచేసేందుకు ఒప్పందం కుదిరింది. ఆనందరావు గురువారం పంచాయతీ కార్యాలయంలో అప్రూవల్ నిమిత్తం రూ.6,586 చెల్లించి ఆ రసీదుతో లంచం నగదు రూ.8 వేలు తీసుకుని ఎంపీడీవో కార్యాలయం వద్దకు వచ్చాడు. జగన్నాథం ఎదురుగా నగదును అందించాడు. పంచాయతీ సిబ్బంది ఏకంగా రసీదు పుస్తకాన్ని కూడా ఈవో వద్దకు పంపించారు. అధికారులు రసీదు పుస్తకాన్ని కూడా సీజ్ చేసి, పలువురు పంచాయతీ సిబ్బందిని కూడా విచారణ చేశారు. ఈవో ఇంటిపై సోదాలు చేస్తున్నాం : డీఎస్పీ ఏసీబీ డీఎస్పీ ఆర్.విజయ్‌పాల్ విలేకరులతో మాట్లాడుతూ లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఈవోను శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు. గుడివాడలోని ఈవో ఇంటిలో సోదాలు చేస్తున్నామని తెలిపారు. ఇటీవల గుంటూరు, విజయవాడ పరిధిలో 9 కేసులు నమోదు చేశామన్నారు. అధికారులు లంచం అడిగితే 9440446164, 9440446167, 9440446133 సెల్ నంబర్లకు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. దాడిలో ఏసీబీ సీఐలు నాగరాజు, శ్రీనివాస్, 10 మంది సిబ్బంది పాల్గొన్నారు. లంచగొండుల ఆట కట్టించడానికే... కైకలూరు పంచాయతీ కార్యాలయంలో కింది స్థాయి నుంచి పైస్థాయి సిబ్బంది వరకు తనను చాలా ఇబ్బందులకు గురిచేశారని, చివరకు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించానని బాధితుడు ఆనందరావు చెప్పారు. పలుమార్లు ఈవోను కలవగా.. రూ.20 వేలు ఇస్తే వెంటనే పని పూర్తిచేస్తానని చులకనగా మాట్లాడారని తెలిపారు. -
ప్రజాపోరు
తిరగబడుతున్న ప్రజలు వైఎస్ మరణంతో నిలిచిన అభివృద్ధి అడ్డుపడుతున్న అటవీశాఖ ఓట్ల కోసం రాజకీయ నేతల వల కైకలూరు, న్యూస్‌లైన్ : జలగం వెంగళరావు ప్రభుత్వం 1974లో బలవంతంగా కొల్లేరు ప్రజలతో చేపల చెరువులు తవ్వించింది. ఆరేళ్లకే ఆక్వారంగం అభివృద్ధి చెంది సిరులు కురిపించే అక్షయపాత్రలా మారింది. అక్రమార్కుల కన్ను కొల్లేరుపై పడి లీజుల రూపంలో ఆక్రమణలపర్వం కొనసాగింది. పర్యావరణవేత్తల ఫిర్యాదులతో 1999లో +5 కాంటూరు వరకు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని 77 వేల 131 ఎకరాలను అభయారణ్యంగా గుర్తించారు. దీని పరిరక్షణకు అప్పటి టీడీపీ ప్రభుత్వం 120 జీవో జారీచేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2006లో వైఎస్ ప్రభుత్వం కొల్లేరు ఆపరేషన్ చేపట్టి రెండు జిల్లాల్లో 31 వేల 125.75 ఎకరాల విస్తీర్ణంలోని ఆక్రమిత చేపల చెరువులను ధ్వంసం చేసింది. వైఎస్ బతికుంటే మరోలా ఉండేది.. కొల్లేరు ఆపరేషన్‌కు కారణ మైన 120 జీవో చంద్రబాబు హయాంలో జారీచేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో తప్పని పరిస్థితుల్లో వైఎస్ ప్రభుత్వం ఆపరేషన్ చేపట్టింది. ప్రస్తుతం వివాదానికి కారణమైన సర్కార్ కాల్వ కర్రల వంతెన స్థానంలో పెద్దింట్లమ్మ వారధి నిర్మాణానికి 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 12 కోట్లు మంజూరు చేశా రు. ఆయన మరణానంతరం అటవీశాఖ ఆంక్షలు, ప్రభుత్వ నిర్లక్ష్యం.. వెరసి వారధి నిర్మాణం అటకెక్కింది. కొల్లేరు ఆపరేషన్ తర్వాత ప్రత్యేక పునరావాస ప్యాకేజీ కోసం రూ. 350 కోట్లను వైఎస్ కేటాయించారు. +5 కాంటూరు నుంచి +3 కాంటూరు వరకు కొల్లేరును కుదించాలనే సాహసోపేతమైన నిర్ణయాన్ని అసెంబ్లీ ఆమోదించి కేంద్రానికి నివేదించారు. జిల్లాలో కొల్లేరు ఆపరేషన్ సమయంలో అదనంగా కొట్టేసిన 7.500 ఎకరాల భూములకు పట్టాలివ్వడానికి 2008లో ప్రయత్నించగా చివరి నిమిషంలో కార్యక్రమం రద్దయింది. జిరాయితీ భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కింద రూ. 625 కోట్లు అందించాలని, రెండు జిల్లాల్లో చేపల చెరువులు కోల్పోయిన రైతులకు +5 కాంటూరు పైన భూమిని సేకరించి పంపిణీ చేయాలని నిర్ణయించారు. వీటిని అమలుచేసే సమయంలోనే వైఎస్ మృతిచెందారు. ఓట్ల వేటలో.. సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో రాజకీయ నేతలు కొల్లేరుపై దృష్టిసారించారు. కొల్లేటివాసుల ఓట్లను కొల్లగొట్టడానికి గిమ్మిక్కుల పర్వానికి తెరలేపారు. కైకలూరు మండలంలోని ఆటపాక నుంచి పశ్చిమగోదావరి జిల్లా కోమటిలంక వరకు అభయారణ్యం పరిధిలో ఉండడంతో రహదారి నిర్మాణానికి అటవీశాఖ అభ్యంతరం తెలిపింది. దీనికి ఏలూరు ఎంపీ, కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, టీ డీపీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ అడ్డుపడ్డారు. అటవీశాఖ వీరిపై కేసులు సైతం నమోదు చేసింది. గత ఏడాది ఇందిరమ్మ బాట కార్యక్రమానికి వచ్చిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో అదనంగా కొట్టేసిన 7.500 ఎకరాలపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తానని చెప్పి కమిటీ వేసి ఊరుకున్నారు. తర్వాత కొల్లేరు ప్రాంతాలకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు జయమంగళ వెంకటరమణ, కలవపూడి శివ కొల్లేటి గ్రామాల్లో పాదయాత్రలు చేశారు. ఈ విధంగా అమలు కాని వాగ్దానాలను వల్లిస్తూ వివిధ రాజకీయ పార్టీలు కొల్లేరు ప్రజలకు దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నాయి. కొల్లేరులో జరిగిన సంఘటనలు... 1971 - రామ్సార్ సదస్సులో కొల్లేరును మంచినీటి సరస్సుగా గుర్తించారు 1976 - చేపల చెరువులను కచ్చితంగా తవ్వాలని 118 జీవో విడుదల 1999 - ఆక్రమిత చెరువుల తొలగింపునకు 120 జీవో విడుదల 2006 - కొల్లేరు ఆపరేషన్‌తో ఆక్రమిత చెరువుల ధ్వంసం 2008 - కొల్లేరును +5 నుంచి +3 కాంటూరు వరకు కుదింపు చేస్తు అసెంబ్లీలో తీర్మానం 2010- కొల్లేరును చిత్తడి నేలల చట్టం పరిధిలో చేర్చడం 2011- రెవెన్యూ శాఖ చేపల చెరువులపై నాలా చట్టం విధింపు 2012- కొల్లేరు సరస్సును ఎకో సెన్సిటివ్ జోన్లో చేర్చడం -
ఊరంతా సంక్రాంతి
కైకలూరు మండలంలోని గోనెపాడులో సంక్రాంతి సండిని పరిశీలించేందుకు ‘న్యూస్‌లైన్’ ఆదివారం సందర్శిం చిది. గ్రామం సంక్రాంతి కళ సంతరించుకుంది. బంధువులతో ప్రతి ఇంటా సందడి నెలకొంది. ఏ ఇంట చూసినా ఘుమఘుమలాడే పిండివంటలు తయారవుతూ కనిపించాయి. సరదాల కోడిపందాలు జరుగుతున్నాయి. పతంగులతో చిన్నారుల పరుగులు, పట్టుపరికిణీలతో పల్లెపడుచుల హొయలు, రంగు రంగుల రంగవల్లులు కనువిందుచేశాయి. సూర్యోదయానికి ముందుగానే యువతులు, మహిళలు వాకిళ్లను ఊడ్చి కళ్లాపి చల్లి ముగ్గులు వేస్తూ కనిపించారు. ముగ్గులకు రంగులు అద్ది, గొబ్బెమ్మలతో అలంకరించారు. హరిదాసు కీర్తనలు ఆలపిస్తూ ఇంటింటినీ సందర్శించాడు. గంగిరెద్దులోళ్లు డోలూ సన్నాయి వాయిద్యాలతో డూడూబసవన్నలను ఆడించారు. గ్రామంలోని చెరువులో పది మంది యువకులు కోడిపుంజులకు స్నానాలు చేయించారు. బద్దకంపోయి చలాకీగా పందేల్లో పాల్గొనాలంటే ఈ స్నానాలు తప్పవని వారు చెప్పారు. ‘సూరమ్మ.. పిన్నీ మీ అల్లుడు పండక్కి వస్తున్నాడా...’ అంటూ ఒకరు, కోడలా... మనవడు ఉదయమే బస్సు దిగాడంటగా ఏడీ ఇంక బయటకు రాలేదు..’ అంటూ మరొకరు.... ‘ఒరేయ్ అబ్బాయ్ కోడి పందేనికి వెళ్దామా’ అంటూ మరొకరు పలుకరించుకుంటూ కనిపిం చారు. ఉదయం ఆరు గంటల నుంచే అరుగులపైకి చేరిన గ్రామస్తులు లోకాభిరామాయణాన్ని చర్చించుకున్నారు. యువతులు పట్టు పరికిణీల్లో తమ వీధుల్లో ఇళ్ల ముందువేసిన ముగ్గులను పరిశీలించి వాటికి మార్కులు వేశారు. అనంతరం ఒప్పులగుప్పు, తొక్కుడుబిళ్ల వంటి ఆటలాడారు. చిన్న పిల్లలు రంగురంగుల పతంగులను ఎగురవేస్తూ వీధుల్లో అటూ ఇటూ పరుగులు తీశారు. ఇంటి పనులు పూర్తిచేసుకుని ఏడు గంటల నుంచి మహిళలు బృందాలుగా పిండివంటల తయారీకి సిద్ధమయ్యారు. రోటిపై కుందుచేర్చి రోకళ్లతో కొందరు బియ్యాన్ని పిండి కొట్టగా, మరి కొందరు ఆ పిండిని జల్లించారు. పిండి కొట్టడం పూర్తయ్యాక అరిసెలు, మిఠాయి, చెక్కలు, తదితర వంటలు వండే పనిలో నిమగ్నమయ్యారు. బంధువుల రాకతో సంతోషం ఏడాదిలో పెద్ద పండగ ఇది. బంధువులందరూ ఒక్కచోటకు చేరితే ఆ సంతోషమే వేరు. ఈ కలయికలే ప్రేమలు పెంచుతాయి. మా మనవడు మద్రాసులో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. వాడి రాకకోసం ఎదురుచూస్తున్నాం. కాలం మారే కొద్ది సంప్రదాయలు కనుమరుగవుతున్నాయి. వాటిని కాపాడటం మన బాధ్యత. - బొల్లా లక్ష్మీనృసింహమూర్తి, గోనెపాడు చుట్టాలతో ఊరంతా కళకళ సంక్రాంతి పండగ వచ్చిదంటే ఊరంతా చుట్టాలతో కళకళలాడుతుంది. కొత్త దంపతులు, పొరుగూరిలో ఉద్యోగాలు చేస్తున్నవారు కచ్చితంగా ఊరొస్తారు. ఈ సంతోషం ఎప్పుడూ ఇలానే ఉండాలి. మా అబ్బాయి విశాఖపట్నంలో ఉంటున్నాడు. పండక్కి ఊరొస్తున్నాడు. వాడికి అరెసెలంటే ఎంతో ఇష్టం. వాడికి ఇష్టమైన పిండి వంటలు చేసిపెడతా. - నంగెడ్డ సూరమ్మ, గోనెపాడు సరదాల సంక్రాంతి సంక్రాంతి పండుగ వస్తుందంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇంటినిండా చుట్టాలు, చిన్నపిల్లలతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి చిన్నారులకు భోగిపళ్లు పోసి పండుగను సరదాగా జరుపుకుంటాం. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తాం. - వత్తుమిల్లి అశ్వని, జుఝవరం, పామర్రు మండలం కొట్టిన పిండితోనే అరిసెలు మేము స్వయంగా రోకళ్లతోకొట్టిన పిండివంటలు చేస్తాం. మిల్లు పట్టించుకోం. మా చుట్టు పక్కల వాళ్లం అందరం కలసి రోటిలో పిండి కొట్టుకుని అరిసెలు, ఇతర వంటకాలు చేసుకుంటాం. ఏళ్ల తరబడి ఇలాగే వండుకుంటున్నాం. సంక్రాంతి, దీపావళి పండుగలకు ఒకరి పనులకు మరొకరం సాయపడుతూ సందడిగా పనులు చేసేస్తాం. - మద్ది సామ్రాజ్యం, మర్రిపాలెం, నాగాయలంక మండలం సంక్రాంతంటే ఆనందం సంక్రాంతి అంటే మాకు ఎక్కడలేని ఆనందం. గృహాలకు శుభం చేకూరుస్తుందని ధనుర్మాసంలో పోటీపడి వాకిళ్లలో పేడకళ్లాపు చల్లి ముగ్గులు వేస్తాం. కాలం మారినా సంక్రాంతిని వదిలేది లేదు. పిండివంటలు వండుతాం, భోగిపళ్లు పోస్తాం. చెరకు గడలు, తేగలను సంక్రాంతి పండుగలో భాగస్వామ్యం చేస్తాం. ఈ కాలంలో అవి మహారుచిగా ఉంటాయి. - కొట్ర రమాదేవి, రేమాలవారిపాలెం,నాగాయలంక మండలం -
పురిటి గడ్డ.. మరిచిపోదు నా బిడ్డ
భారీగా విదేశీ పక్షుల సంతానోత్పత్తి మొదటి సారి గ్రేహెరాన్ పక్షుల గూళ్లు పెరుగుతున్న పర్యాటకులు కళకళలాడుతున్న ఆటపాక కేంద్రం కైకలూరు, న్యూస్‌లైన్ : తన రెక్కల చాటున గుడ్లను ఉంచుకుని పొదుగుతున్న ఎర్రకాళ్ల కొంగలు.. వేటాడిన మేతను పిల్లల నోటికి అందిస్తున్న తల్లి పక్షులు... బుడిబుడి అడుగులు వేయడానికి ప్రయత్నిస్తున్న పక్షి పిల్లల విన్యాసాలు... పెలికాన్ పక్షి పిల్లల కిలకిలరావాలతో ఆటపాక పక్షుల కేంద్రం అలరారుతోంది. కొల్లేరు ఆపరేషన్‌కు పూర్వం ఆక్రమిత చేపల చెరువుల వల్ల కొల్లేరులో కాలుష్యం పెరిగి విదేశీ పక్షుల వల సలు తగ్గాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి సహసోపేతంగా చేపట్టిన కొల్లేరు ఆపరేషన్ తరువాత పర్యావరణం పూర్వస్థితికి చేరింది. ఆటపాక పక్షుల కేంద్రం వద్ద గతంలో ఎన్నడూ లేని విధ ంగా ఈ ఏడాది విదేశీ పక్షులు గూళ్లు నిర్మించుకుని భారీగా సంతానోత్పత్తి చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 5 వేల పెలికాన్ పక్షులు, వాటి పిల్లలు 1500, పెయింటెడ్ స్టాక్ (ఎర్రకాళ్ల కొంగ) పక్షులు 2500, వాటి పిల్లలు 200, టీల్స్ (పరజలు) 2 వేలు, గ్లోబీ ఐబీస్ (కంకణాల పిట్ట) 500 ఉన్నాయి. సాధారణంగా ఈ విదేశీ పక్షలు నవంబర్ నుంచి మార్చి నెల వరకు సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. గతంలో అంతంత మాత్రంగానే సంతానోత్పత్తి జరిగేది. ఈ సారి పరిస్థితులు అనుకూలించడంతో విదేశీ పక్షుల రాకపెరిగింది. వాటి సంతానోత్పత్తి కూడా భారీగా జరుగుతోంది. విదేశీ పక్షులు, వాటి పిల్లలను తిలకించేందుకు సందర్శకుల రాకకూడా పెరిగింది. మొదటిసారి గ్రేహేరాన్ పక్షులు గూళ్లు ఆటపాక పక్షుల కేంద్రం చరిత్రలోనే మొదటిసారి మిగిలిన పక్షులతో కలసి గ్రేహెరాన్ (నారాయణ కొంగ) పక్షులు గూడు నిర్మించాయి. ఇక్కడికి 100 గ్రేహేరాన్ పక్షులు వలస వచ్చాయి. వాటిలో ఒక జంట గూడు పెట్టింది. ఈ గూడులో ఆడపక్షి పెట్టిన మూడు గుడ్లలో నుంచి సోమవారం పిల్లలు బయటకొచ్చాయి. సాధారణంగా ఈ పక్షుల సంతానోత్పత్తి కొల్లేరు జమ్ము పొదల్లో ఎవరికంటా పడకుండా చేస్తాయి. ఈ పక్షి గూడును బహిరంగంగా ఎప్పుడూ చూడలేదని 35 సంవత్సరాల అనుభవమున్న ఫారెస్టు సిబ్బంది ఖాన్ పేర్కొన్నారు. -
స్టౌ పేలి నలుగురు మృతి
కైకలూరు, న్యూస్‌లైన్ : కైకలూరులో ఈ నెల 12న స్టౌ పేలిన ఘటనలో గాయపడిన పదిమందిలో నలుగురు విజయవాడలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. కానూరులోని టైమ్ ఆస్పత్రిలో ఒకేరోజు కొద్ది నిమిషాల వ్యవధిలో వీరంతా మృతిచెందడంతో ఆస్పత్రి ప్రాంగణంలో విషాదం అలుముకుంది. వారి బంధువుల రోదనలతో ఆస్పత్రి హోరెత్తింది. మృతుల వివరాలివీ... మృతుల్లో కైకలూరుకు చెందిన తోట పోతురాజు (65), అడపా సుబ్బలక్ష్మి (33), మండవల్లి మండలం దయంపాడుకు చెందిన కంభంపాటి మేరీ సరోజిని (60), పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం మాదేపల్లికి చెందిన బురగ తేరేజమ్మ (45) ఉన్నారు. పునుగుల బండి యజమాని పోతురాజు గత 30 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నాడు. అతనికి నలుగురు పిల్లలు. ఎన్నడూలేని విధంగా ఈ ఘటన జరిగిందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అడపా సుబ్బలక్ష్మి కైకలూరులో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి వచ్చింది. కూరగాయలు కొనుక్కొని ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదానికి గురైంది. ఆమెకు నలుగురు పిల్లలు. మేరీసరోజిని కైకలూరుకు పనిపై వచ్చి ఆటో కోసం ఎదురుచూస్తుండగా ప్రమాదం బారిన పడి ప్రాణాలు వదిలింది. గూడూరుకు చెందిన నక్కల బసంతి అలియాస్ వాణిశ్రీ (50) ప్రమాదం జరిగిన రోజునే గూడూరు నుంచి కైకలూరుకు వచ్చింది. ఆమె రోడ్డు పక్కన కూర్చుని పూసలు, క్యాట్బాల్స్, ఇతర సామగ్రి అమ్ముకుంటుంది. ఈ ఘటనలో గాయపడ్డ ఆమె ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. గాయపడినవారిలో మిగిలినవారు చికిత్స పొందుతుండగా ప్రాణాపాయం నుంచి ఆగళ్ల శిరీషాకుమారి, పెనుగొండ సలోమి బయటపడినట్లు వైద్యులు తెలిపారు. అనాథలుగా మిగిలిన బిడ్డలు... సుబ్బలక్ష్మి స్వస్థలం పేటకలిదిండి. భర్త సుబ్బారావు 2004లో మృతిచెందాడు. వీరికి నాగలక్ష్మి (16), మణికంఠ స్వామి (20), భవాని (14) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ దూరమై వారు రోదిస్తున్న తీరు అందరినీ కలసివేసింది. బాధితులకు ప్రభుత్వం సాయం చేయాలని బంధువులు కోరుతున్నారు. సుబ్బలక్ష్మి మృతదేహానికి పేట కలిదిండిలో దహనసంస్కారాలు చేపట్టారు. మరో మృతురాలు మేరీసరోజిని భర్త యాకోబుకు రెండో భార్య. ఇద్దరూ కూలికెళితే గానీ పొయ్యి వెలగని పరిస్థితి వారిది. మలి వయసులో భార్యను కోల్పోయిన యాకోబు రోదించిన తీరు పలువురిని కంటతడిపెట్టించింది. భర్త చనిపోయిన ఆరు నెలలకే... మరో మృతురాలు బురగ తేరేజమ్మ భర్త వెంకటేశ్వరరావు ఆరు నెలల క్రితమే మరణించాడు. ఇద్దరు కుమారులకూ వివాహమైంది. ప్రస్తుతం ఆమె కూడా మరణించడం కుటుంబంలో విషాదం నింపింది. బంధువులు మృతదేహన్ని మాదేపల్లి తీసుకువెళ్లారు. న్యాయం చేస్తాం : సబ్‌కలెక్టర్ మృతిచెందినవారి బంధువులు, కుటుంబసభ్యులను సబ్‌కలెక్టర్ దాసరి హరిచందన ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు. ఆపద్బంధు పథకం ద్వారా కుటుంబసభ్యులకు సాయం అందిస్తామని చెప్పారు. చికిత్స పొందుతున్నవారు పూర్తిగా కోలుకునేవరకు ఆరోగ్యశ్రీ అమలు చేస్తామని తెలిపారు. కైకలూరు సీఐ అశోక్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ కైకలూరులో బళ్ల వద్ద కిరోసిన్ స్టౌలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బళ్ల యజమానులు గ్యాస్ పొయ్యిలపై వంటకాలు చేయాలని సూచించారు. మృతదేహాలకు పంచనామా మృతదేహాలకు కైకలూరు తహశీల్దారు వి.వి.శేఖర్, సీఐ అశోక్‌కుమార్‌గౌడ్ పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై కైకలూరు టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదు చేశారు. -
కైకలూరులో షర్మిల సమైక్య శంఖారావం
-
రాహుల్‌ను ప్రధాని చేసేందుకే సీమాంధ్రులకు అన్యాయం: షర్మిల
-
రాహుల్‌ను ప్రధాని చేసేందుకే సీమాంధ్రులకు అన్యాయం: షర్మిల
తెలంగాణ, సీమాంధ్రుల మధ్య చిచ్చు పెట్టి కాంగ్రెస్ చలికాచుకుంటోందని, రాహుల్‌ను ప్రధాని చేసేందుకు కోట్ల మంది సీమాంధ్రులకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. కృష్ణా జిల్లా కైకలూరులో జరిగిన సమైక్య శంఖారావం బస్సు యాత్రలో ఆమె ఉద్వేగభరితంగా ప్రసంగించారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా చంద్రబాబులో చలనం లేదని, బ్లాంక్ చెక్ ఇచ్చి రాష్ట్ర విభజనకు ప్రధాన కారణమైంది చంద్రబాబేనని షర్మిల మండిపడ్డారు. హత్య చేసి.. ఆ శవం మీద ఎక్కిఎక్కి ఏడ్చినట్లు చంద్రబాబు తీరు ఉందన్నారు. టీడీపీ సహా ఐదు పార్టీలు రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉన్నాయని, వైఎస్ఆర్ సీపీ సహా మూడు పార్టీలు విభజనకు ఎప్పుడూ అనుకూలంగా లేవని తెలిపారు. చంద్రబాబు ఇప్పుడైనా కళ్లు తెరిచి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుని ఆయన కూడా రాజీనామా చేయాలని, చంద్రబాబు, టీడీపీ నేతలు రాజీనామాలు చేసేంతవరకు సీమాంధ్రలో వారెవరినీ అడుగు పెట్టనీయకూడదని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారని, వైఎస్ఆర్ ఉండి ఉంటే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేది కాదని ప్రధానే అన్నారని షర్మిల గుర్తుచేశారు. కాంగ్రెస్, టీడీపీ కుట్ర పన్ని జగనన్నను జైలులో పెట్టించాయని, బోనులో ఉన్నా సింహం సింహమే, త్వరలోనే జగనన్న బయటకు వస్తారని చెప్పారు. -
ఇద్దరే పిల్లలున్నారంటూ ఎమ్మెల్యే వెంకటరమణ తప్పుడు అఫిడవిట్: భార్య ఫిర్యాదు
కృష్ణా జిల్లా కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణపై ఆయన భార్య సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. విడాకులివ్వాలంటూ తనను వేధిస్తున్నారని, వరకట్న వేధింపులకు కూడా గురిచేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. పైపెచ్చు, తమకు ముగ్గరు పిల్లలుంటే, ఇద్దరే ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో తప్పుగా పేర్కొన్నారని తెలిపారు. వెంకటరమణ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి తనపై వేధింపులు మరింత ఎక్కువయ్యాయని ఆమె చెప్పారు. తక్షణమే ఆయన పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సునీత పోలీసు స్టేషన్లో బైఠాయించారు. ఎమ్మెల్యే వ్యవహారంపై మండవల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. దీన్ని సమగ్రంగా దర్యాప్తు చేసి, వాస్తవాలు తెలిశాక ఎన్నికల కమిషన్‌కు , కలెక్టర్‌కు పూర్తి వివరాలు చెబుతామని పోలీసులు తెలిపారు. -
వరకట్న వేధింపుల కేసులో టిడిపి ఎమ్మెల్యే