డిఎన్ఆర్ 30వేలు, రామప్రసాద్ అయితే 50 వేలు... | Kaikaluru YSRCP candidate Uppala Rama Prasad | Sakshi
Sakshi News home page

డిఎన్ఆర్ 30వేలు, రామప్రసాద్ అయితే 50 వేలు...

Published Mon, Apr 21 2014 6:05 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

డిఎన్ఆర్ 30వేలు, రామప్రసాద్ అయితే 50 వేలు... - Sakshi

డిఎన్ఆర్ 30వేలు, రామప్రసాద్ అయితే 50 వేలు...

విజయవాడ: తాను పోటీ చేస్తే 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిచేవాడినని, ఇప్పుడు తాను మద్దతు ఇచ్చే ఉప్పల రామ ప్రసాద్ 50 వేల మెజార్టీతో గెలుస్తారని వైఎస్ఆర్ సిపి నేత దూలం నాగేశ్వరరావు (డిఎఎన్ఆర్) చెప్పారు. కృష్ణా జిల్లా కైకలూరు శాసనసభ స్థానానికి తొలుత దూలం నాగేశ్వరరావుని అనుకున్నారు. అయితే బిసిలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ స్థానాన్ని ఉప్పల రామప్రసాద్కు కేటాయించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యకర్తల సమావేశంలో అందరూ ఒకే మాట చెప్పారు. అభ్యర్థి ఎవరైనా వైఎస్ జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి కావడం తమకు ముఖ్యం అని చెప్పారు.

దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ రామ ప్రసాద్ను 50 వేల మెజార్టీతో గెలిపిస్తామన్నారు. జగన్ సిఎం కావాలని, ప్రజా సమస్యలు తీరాలని అన్నారు. కొల్లేరు ప్రజల సమస్యలు తీరాలంటే వైఎస్‌ఆర్‌ సీపీని గెలిపించాలని ఆయన కోరారు. వైఎస్‌ఆర్‌ సీపీ విజయాన్ని ఏ ఒక్క శక్తి ఆపలేదని నాగేశ్వరరావు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement