
సాక్షి, కైకలూరు : ఓట్లు అడగడానికి ప్రజల్లోకి వెలుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు. 2014లో అబద్దపు హామీలతో టీడీపీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారంటూ మండిపడుతున్నారు. కైకలూరులో ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీడీపీ కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థి జయమంగళ వెంకటరమణను ప్రజలు నిలదీశారు.
2014 టీడీపీ మేనిఫెస్టోలోని ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదంటూ ధ్వజమెత్తారు. దీంతో ఖంగుతిన్న జయమంగళ సర్ధి చెప్పడానికి ప్రయత్నించారు. అనంతరం అందరు మాట్లాడితే తానేమి చెప్పలేనని, ఏం మట్లాడకూ అంటూ గట్టిగా అరిచి చేతిలో మైకును తీసి జనాలపైకి విసిరారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడుసామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment