JAYAMANGALA Venkataramana
-
'కొల్లేరు సమస్యపై సీఎం జగన్‌ను కలుస్తా.. ఆ తర్వాత రాజకీయ నిర్ణయం'
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొల్లేరు ప్రాంత సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వినతిపత్రం సమరి్పస్తానని తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ ఇన్చార్జి జయమంగళ వెంకటరమణ చెప్పారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. కొల్లేరు మూడో కాంటూరు వరకు కుదింపు, ఆక్వా జోన్ పరిధిలో మరిన్ని చెరువులు చేర్చటం, ఈబీసీలకు పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలు అందించడం తదితర అంశాలతో ముఖ్యమంత్రిని కలిసి విన్నవిస్తానని, ఆయన స్పందననుబట్టి రాజకీయ నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. కైకలూరు నియోజకవర్గంలో టీడీపీలో ఐదుగురిని బరిలో నిలిపి వారితో పనిచేయిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని చెప్పారు. వైఎస్సార్ హయాంలో అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందే 250 నియోజకవర్గాలకు అభ్యర్థులను నిర్ణయించారని, అది సరైన విధానమని తెలిపారు. నియోజకవర్గంలో ఐదుగురు నాయకులు ఉండటం వల్ల చివర్లో ఒకరికి టికెట్ వస్తే మిగిలినవారు వెన్నుపోటుదారులుగా మారుతున్నారని విమర్శించారు. 1999 నుంచి తెలుగుదేశం పార్టీలో సేవ చేస్తున్నానని, ఈ క్రమంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నానని వివరించారు. ఓ పౌరుడిగా ముఖ్యమంత్రిని కలిసే హక్కు ఉంటుందని, తాను గతంలో నలుగురు సీఎంలను కలిసి కొల్లేరు సమస్యలను విన్నవిస్తే అందరూ సానుకూలంగా స్పందించారని చెప్పారు. తనపై ఇటీవల హత్యాయత్నం జరిగితే రక్షణ కావాలని ప్రభుత్వానికి లేఖ రాశానని, అందుకే గన్‌మెన్‌ను కేటాయించారని ఆయన తెలిపారు. చదవండి: సైన్యం సన్నద్ధం -
2014మేనిఫెస్టోపై నిలదీత.. మైకు విసిరిన టీడీపీ నేత
-
మేనిఫెస్టోపై నిలదీత.. మైకు విసిరిన టీడీపీ నేత
సాక్షి, కైకలూరు : ఓట్లు అడగడానికి ప్రజల్లోకి వెలుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు. 2014లో అబద్దపు హామీలతో టీడీపీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారంటూ మండిపడుతున్నారు. కైకలూరులో ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీడీపీ కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థి జయమంగళ వెంకటరమణను ప్రజలు నిలదీశారు. 2014 టీడీపీ మేనిఫెస్టోలోని ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదంటూ ధ్వజమెత్తారు. దీంతో ఖంగుతిన్న జయమంగళ సర్ధి చెప్పడానికి ప్రయత్నించారు. అనంతరం అందరు మాట్లాడితే తానేమి చెప్పలేనని, ఏం మట్లాడకూ అంటూ గట్టిగా అరిచి చేతిలో మైకును తీసి జనాలపైకి విసిరారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడుసామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఆమెకు ఏదైనా జరిగితే నాదే బాధ్యత!
తనకు పిల్లల భవిష్యత్ ముఖ్యమని కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ స్పష్టం చేశారు. తన భార్య సునీత తనపై చేసిన ఆరోపణలు అవాస్తమని చెప్పారు. మానవత్వంతో ఆమె పొరపాట్లను సహిస్తున్నానని అన్నారు. తన నుంచి ప్రాణహాని ఉందని సునీత చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఆమె ప్రాణాలకు ఆయన హామీయిచ్చారు. ఆమె ఏదీ జరిగినా తనదే పూచీ అన్నారు. ఆమెకు ఏదైనా జరిగితే కర్త, కర్మ, క్రియ తనదే అన్నారు. తనను కాపాడు కోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. కోటి రూపాయిలు ఇవ్వాలని సునీత బెదిరిస్తోందని వెల్లడించారు. డబ్బు కోసమే ఆమె ఇదంతా చేస్తోందని ఆరోపించారు. పిల్లల భవిష్యత్ కోసమే బతుకుతున్నానని చెప్పారు. పిల్లలను బాగు చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఆమెకు తన ఆస్తే కావాలని వెంకటరమణ ఆరోపించారు. ఈ ఆస్తి కోసమే ఇంత చేశారన్నారు. ఆమె బ్లాక్ మెయిల్ చేయడం ప్రపంచమంతా చూస్తోందని అన్నారు. ఆమె సుఖంగా ఉంటుందంటే తన ఆస్తిని ఇచ్చేసేందుకు సిద్ధమన్నారు. తన భార్యతో కలిసివుందామని ఇప్పటికీ అనుకుంటున్నానని తెలిపారు. యముడునయితే పరిస్థితి వేరేగా ఉండేదన్నారు. హైకోర్టు ఆదేశించినా పిల్లలను పాఠశాలకు పంపకపోవడం కోర్టు ధిక్కారం అవుతుందన్నారు. పిల్లల భవిష్యత్ కాపాడుకోవాల్సిన సునీతపై ఉందన్నారు. పదే పదే కేసులు పెడితే వారి భవిష్యత్ ఏమవుతుందో ఆలోచించుకోవాలన్నారు. తనను చంపేసి సునీత జైలుకు వెళ్లినా, ఆమెను చంపేసి తాను జైలుకు వెళ్లినా పిల్లల భవిష్యత్ ఏంటని ప్రశ్నించారు. అయితే వెంకట రమణ తనను పనిమనిషిగా కన్నా హీనంగా చూశారని సునీత ఆరోపించారు. ఈ రోజుకి కూడా తనకు మనిషిగా గుర్తించడం లేదన్నారు. రాజకీయంగా ఎదగడానికి తమను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. తనను శారీరకంగా, మానసికంగా గాయపరిచారని వాపోయారు. అధికారం ఉందన్న గర్వంతో విర్రవీగుతున్నారని, ఆడవాళ్లంటే ఆయన చిన్నచూపు అని ధ్వజమెత్తారు. తన కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరించారని చెప్పారు. 15 ఏళ్ల నుంచి నరకం అనుభవిస్తున్నానని చెప్పారు. ఈ నరకం ఇక చాలన్నారు. పిల్లలు పేరు చెప్పి తన భర్త తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. పిల్లలపై ప్రేమ ఉంటే తనను ఆరు నెలలు పుట్టింట్లో ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. పిల్లలకు జ్వరమొచ్చినా ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. ఆయనపై తనకు నమ్మకం లేదన్నారు. పిల్లల కోసమే బతుకుతున్నట్టు వెంకట రమణ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని సునీత ఆరోపించారు. తన పిల్లలు ఆయన దగ్గర వుంటే తనకు దక్కరని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. తాను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఎన్నో ఆస్తులు సంపాదించారని, వాటిని తన ముందు దాచి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పిల్లల భవిష్యత్ ఆలోచించే ఇన్నాళ్లు తన భర్తతోకాపురం చేశానని సునీత చెప్పారు. ఆయన మాటలకు, చేతలకు పొంతన ఉందని చెప్పారు. ఆయనతో కలిసివుండడం కుదరదని సునీత స్పష్టం చేశారు. పిల్లల భవిష్యత్ తనకు ముఖ్యమని వెంకట రమణ పునరుద్ఘాటించారు. -
టీడీపీ ఎమ్మెల్యేపై మరోసారి భార్య ఫిర్యాదు
-
టీడీపీ ఎమ్మెల్యేపై మరోసారి భార్య ఫిర్యాదు
విజయవాడ : కృష్ణాజిల్లా కైకలూరు టీడీపీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణపై ఆయన భార్య సునీత మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన భార్య సునీత తన భర్త నుంచి ప్రాణభయం ఉందని రెండో సారి పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశారు. తనను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నారని, ప్రాణభయం ఉందంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం సునీత తన భర్త నుంచి వేరుగా ఉంటున్నారు. మూడు నెలల పాటు మెయింటెనెన్స్‌తో పాటు భార్య, పిల్లల ను చక్కగా చూసుకోవాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలను పాటించకుండా.. మళ్లీ వేధింపులు ప్రారంభించారని సునీత చెబుతున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ గతంలో రెండు కేసులు నమోదు అయ్యాయి. భార్య సునీత ఫిర్యాదు మేరకు కైకలూరు పోలీసులు ఆయనపై తొలుత గృహహింస చట్టం-498 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. విషయం న్యాయస్థానానికి వెళ్లిన తర్వాత మరో రెండు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. హత్యాయత్నానికి ప్రయత్నించారనే ఆరోపణపై 307, బలవంతంగా విడాకుల పత్రాలపై సంతకాలు తీసుకున్నారనే ఆరోపణపై 384 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 2012లో భార్యభర్తలు ఇద్దరు తమకు విడాకులు మంజూరు చేయాలని సీనియర్ సివిల్ జడ్జిని ఆశ్రయించటంతో వారిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చే ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భార్యా భర్తలిద్దరూ కోర్టుకు హాజరవగా, తనకు విడాకులు వద్దని సునీత జడ్జికి విన్నవించిన విషయం తెలిసిందే. -
పందెంకోళ్లు కత్తులు దూశాయ్!
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లా సరిహద్దుల్లో కోడిపందేలు రెండు రోజులుగా జోరుగా సాగుతున్నాయి. హనుమాన్‌జంక్షన్ సమీపంలో.. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం తాళ్లమూడి వద్ద, కృత్తివెన్ను పల్లెపాలెం సమీపంలోని లోసరి వద్ద భారీఎత్తున పందేలు వేశారు. లోసరిలో నిర్వహించిన కోడిపందేల శిబిరాన్ని 16 మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు రెండు రోజులపాటు సందర్శించారు. జిల్లాలో కోడిపందేలు, పేకాట జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు పోలీసులు చేసిన హెచ్చరికలు అభాసుపాలయ్యాయి. జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని పోలీసులు ప్రకటించినా..ఈ అవరోధాలన్నింటినీ దాటి పందెంరాయుళ్లు తమ పంతం నెగ్గించుకున్నారు. మొవ్వ మండలం కోసూరు, పామర్రు మండలం జమిగొల్వేపల్లిలో కోతముక్క జోరుగా సాగింది. ఒకవైపు పోలీసులు దాడి చేస్తున్నా.. మరో వైపు పందెగాళ్లు సెల్ఫోన్ల ద్వారా సమాచారం పంపుతూ ఎక్కడికక్కడే పందేలు నిర్వహించారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో కోడిపందేలకు అనుమతులు లేకపోవడంతో ఆ ప్రాంతంవారంతా జిల్లాలోని పలుచోట్లకు తరలివెళ్లి పండగను సరదాతీర్చుకున్నారు. రెండు రోజులుగా జిల్లాలో కోడిపందేలు, పేకాటల రూపంలో రూ. 50 కోట్లకు పైగానే చేతులు మారినట్లు సమాచారం. పందేలు జరిగిన తీరిదీ.. కైకలూరు మండలం భుజబలపట్నం, కలిదిండి మండలం పులపర్రు, చింతలపాడులో శిబిరాలు ఏర్పాటుచేసి పెద్దఎత్తున కోడిపందేలు నిర్వహించారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, మాజీ మంత్రి మాగంటి బాబు స్వయంగా పోటీలను ప్రారంభించారు. ఇక్కడ రెండు రోజుల పాటు యథేచ్ఛగా పందేలు జరిగాయి. గుడివాడ పట్టణం, మండలం సరిహద్దుల్లో రెండు ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు పోటాపోటీగా రెండు శిబిరాలు ఏర్పాటు చేసి కోడిపందేలు నిర్వహించారు. నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి, ఆగిరిపల్లి, ముసునూరు, నూజివీడు ప్రాంతాల్లో కోడిపందేలకు అడ్డు, అదుపు లేకుండాపోయింది. మైలవరంలోని దేవుడు చెరువు, సూరిబాబుపేట, పోరాటనగర్, కనిమెర్లతండా, పుట్లూరు తదితర ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగాయి. అవనిగడ్డ నియోజకవర్గంలోని ఘంటసాల మండలం శ్రీకాకుళం, పాపవినాశనం గ్రామాల సరిహద్దులో కరకట్ట పక్కనే పెద్ద ఎత్తున కోడిపందేల శిబిరం నిర్వహించారు. శ్రీకాకుళం రేవు వద్ద పందెంరాయుళ్ల రాకతో తిరునాళ్లను తలిపించింది. పామర్రు నియోజకవర్గంలోని మొవ్వ మండలం పెడసనగల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన కోడిపందేల శిబిరాన్ని మంత్రి పార్థసారథి రెండు రోజులూ వచ్చి సందర్శించారు. బల్లిపర్రు, పామర్రు, కురుమద్దాలి, పెరిసేపల్లి, యలకుర్రు తదితర ప్రాంతాల్లో జోరుగా పేకాట, కోడిపందేలు సాగాయి. పెడన నియోజకవర్గంలోని బంటుమిల్లి మండలం పెందుర్రులో భారీగా కోడిపందేల బరిని ఏర్పాటు చేశారు. ఇక్కడ పగలు సమయంలో కోడిపందేలు, రాత్రి సమయంలో కోతముక్క జోరుగా సాగాయి. నాగేశ్వరరావుపేట, అర్తమూరు, చెరుకుమిల్లి తదితర ప్రాంతాల్లో కోడిపందేలు ఇష్టారాజ్యంగా సాగాయి. కృత్తివెన్ను మండలం పల్లెపాలెం సమీపంలో పశ్చిమగోదావరి జిల్లాలోని లోసరి వంతెనకు సమీపంలో పంటపొలాల్లో పెద్దఎత్తున పందేలు నిర్వహించారు. ఈ శిబిరాన్ని 16 మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు సందర్శించటం గమనార్హం. గూడూరు మండలంలోని పిండివానిపాలెం, గూడూరు, పెడన మండలం తోటమూల, కట్లపల్లి, ఉప్పలకలవగుంట తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున కోడిపందేలు నిర్వహించారు. బందరు మండలంలోని పోలాటితిప్ప, కోన, చిన్నాపురం, కానూరు తదితర ప్రాంతాల్లో పేకాట, కోడిపందేలు జోరుగా సాగాయి. -
విడాకుల కేసులో కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే
మచిలీపట్నం : విడాకుల కేసులో కైకలూరు టీడీపీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ నిన్న కోర్టుకు హాజరయ్యారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, ఆయన భార్య సునీత గతంలో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. 2012లో భార్యభర్తలు ఇద్దరు తమకు విడాకులు మంజూరు చేయాలని సీనియర్ సివిల్ జడ్జిని ఆశ్రయించటంతో వారిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చే ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భార్యా భర్తలిద్దరూ కోర్టుకు హాజరవగా, తనకు విడాకులు వద్దని సునీత జడ్జికి విన్నవించారు. ఈ కేసు విచారణను న్యాయమూర్తి జనవరి 11వ తేదీకి వాయిదా వేశారు. -
టీడీపీ ఎమ్మెల్యేపై మరో రెండు కేసులు
కైకలూరు, న్యూస్‌లైన్: కృష్ణాజిల్లా కైకలూరు టీడీపీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణపై బుధవారం మరో రెండు కేసులు నమోదయ్యాయి. భార్య సునీత ఫిర్యాదు మేరకు కైకలూరు పోలీసులు ఆయనపై తొలుత గృహహింస చట్టం-498 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. విషయం న్యాయస్థానానికి వెళ్లిన తర్వాత మరో రెండు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. హత్యాయత్నానికి ప్రయత్నించారనే ఆరోపణపై 307, బలవంతంగా సంతకాలు తీసుకున్నారనే ఆరోపణపై 384 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మచిలీపట్నంలో అడిషనల్ ఎస్పీ షెముషి బాజ్‌పాయ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దంపతులకు బుధవారం నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ ఈ నెల 30కి వాయిదా పడింది. -
కైకలూరు ఎమ్మెల్యే...‘కొంప’ కొల్లేరు !
కైకలూరు/మండవల్లి, న్యూస్‌లైన్ : కొల్లేటి గ్రామాల ప్రతినిధిగా మెలుగుతున్న కైకలూరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు జయమంగళ వెంకటరమణ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. ఆయన సతీమణి.. తనను మానసికంగా వేధించి గృహహింసకు పాల్పడ్డారంటూ సోమవారం రాత్రి మండవల్లి పోలీసుస్టేషన్లో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది. కైకలూరు మండలం కొట్డాడ గ్రామానికి చెందిన జయమంగళ వెంకటరమణ మొదటి భార్య మృతిచెందడంతో 1997లో మండవల్లి మండలం పులపర్రు గ్రామానికి చెందిన మోరు సునీతను తిరుమలలో రెండో వివాహం చేసుకున్నారు. వీరికి పూజిత, రమ్య, అనే ఇద్దరు అమ్మాయిలు, తేజ అనే ఒక అబ్బాయి ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో నివాసం ఉండే వీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కైకలూరు శివారు లోకుమూడి వద్ద నివాసముంటున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో సునీత కొంతకాలంగా పుట్టింట ఉంటున్నారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా ఆమె మండవల్లి పోలీసులను ఆశ్రయించారు. తనతో పాటు బిడ్డలకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కైకలూరు సీఐ అశోక్‌కుమార్ గౌడ్ స్టేషన్లో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇద్దరు పిల్లలని అబద్ధం చెప్పారు.. ఎన్నికల సమయంలో తనకు ఇద్దరు పిల్లలను తన భర్త అబద్ధం చెప్పారని ఫిర్యాదులో సునీత పేర్కొన్నారు. దీనిపై తాను వారించినా వినలేదని చెప్పారు. జెడ్పీటీసీ, ఎమ్మెల్యే పదవులు వచ్చిన తర్వాత ఆయనలో పూర్తి మార్పు వచ్చిందని తెలిపారు. ఆయనకు మద్యం సేవించడంతో పాటు పలువురితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానంగా ఒకానొక సందర్భంలో ఆయన సర్వీస్ రివాల్వర్‌తో తనపై ఒక రౌండ్ కాల్పులు జరిపారన్నారు. అదృష్టవశాత్తూ ఆ బుల్లెట్ గోడకు తగలిందని వివరించారు. తనతో మోసపూరితంగా కాగితాలపై సంతకాలు తీసుకుని కోర్టులో విడాకులకు పంపారన్నారు. ఈ విషయమై ప్రశ్నించగా బెదిరించారని చెప్పారు. తనకు విడాకులు తీసుకోవటం ఇష్టం లేదని చెప్పి కోర్డులో న్యాయపోరాటం చేయడానికి సిద్ధపడితే అనుచరులతో బెదిరించారని పేర్కొన్నారు. చివరకు తనకు పుట్టిన బిడ్డలను సైతం అనుమానించి డీఎన్ఏ పరీక్షను కోరడం తనను మానసికంగా వేధించిందన్నారు. తనకు, బిడ్డలకు ప్రాణరక్షణ కల్పించాలని కోరారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు 498 సెక్షన్ కింద గృహహింసపై కేసు నమోదు చేశారు. బెయిలబుల్ కేసు అయినా నేరం నిరూపితమైతే మూడేళ్ల శిక్షపడే అవకాశముంటుందని పోలీసులు వివరించారు. ఆది నుంచీ సంచలనాలే.. ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఆది నుంచి సంచలనాలకు వేదికగా నిలుస్తున్నారు. కొల్లేరుపై ఆధ్యయనం చేయడానికి వచ్చిన అజీజ్ కమిటీ ముందు గోచీగుడ్డతో మావులు ఎత్తి సంచలనమయ్యారు. ఇటీవల గుడివాడ రైతు సదస్సులో విలేకరులపై మాట తూలడంతో ఆందోళనలు జరిగాయి. కొల్లేరు ప్రజలకు న్యాయంచేస్తే టీడీపీని వీడి కాంగ్రెస్‌కు జై కొడతానని ప్రకటించారు. -
కైకలూరు ఎమ్మెల్యే...‘కొంప’ కొల్లేరు !
కైకలూరు/మండవల్లి, న్యూస్‌లైన్ : కొల్లేటి గ్రామాల ప్రతినిధిగా మెలుగుతున్న కైకలూరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు జయమంగళ వెంకటరమణ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. ఆయన సతీమణి.. తనను మానసికంగా వేధించి గృహహింసకు పాల్పడ్డారంటూ సోమవారం రాత్రి మండవల్లి పోలీసుస్టేషన్లో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది. కైకలూరు మండలం కొట్డాడ గ్రామానికి చెందిన జయమంగళ వెంకటరమణ మొదటి భార్య మృతిచెందడంతో 1997లో మండవల్లి మండలం పులపర్రు గ్రామానికి చెందిన మోరు సునీతను తిరుమలలో రెండో వివాహం చేసుకున్నారు. వీరికి పూజిత, రమ్య, అనే ఇద్దరు అమ్మాయిలు, తేజ అనే ఒక అబ్బాయి ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో నివాసం ఉండే వీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కైకలూరు శివారు లోకుమూడి వద్ద నివాసముంటున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో సునీత కొంతకాలంగా పుట్టింట ఉంటున్నారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా ఆమె మండవల్లి పోలీసులను ఆశ్రయించారు. తనతో పాటు బిడ్డలకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కైకలూరు సీఐ అశోక్‌కుమార్ గౌడ్ స్టేషన్లో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇద్దరు పిల్లలని అబద్ధం చెప్పారు.. ఎన్నికల సమయంలో తనకు ఇద్దరు పిల్లలను తన భర్త అబద్ధం చెప్పారని ఫిర్యాదులో సునీత పేర్కొన్నారు. దీనిపై తాను వారించినా వినలేదని చెప్పారు. జెడ్పీటీసీ, ఎమ్మెల్యే పదవులు వచ్చిన తర్వాత ఆయనలో పూర్తి మార్పు వచ్చిందని తెలిపారు. ఆయనకు మద్యం సేవించడంతో పాటు పలువురితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానంగా ఒకానొక సందర్భంలో ఆయన సర్వీస్ రివాల్వర్‌తో తనపై ఒక రౌండ్ కాల్పులు జరిపారన్నారు. అదృష్టవశాత్తూ ఆ బుల్లెట్ గోడకు తగలిందని వివరించారు. తనతో మోసపూరితంగా కాగితాలపై సంతకాలు తీసుకుని కోర్టులో విడాకులకు పంపారన్నారు. ఈ విషయమై ప్రశ్నించగా బెదిరించారని చెప్పారు. తనకు విడాకులు తీసుకోవటం ఇష్టం లేదని చెప్పి కోర్డులో న్యాయపోరాటం చేయడానికి సిద్ధపడితే అనుచరులతో బెదిరించారని పేర్కొన్నారు. చివరకు తనకు పుట్టిన బిడ్డలను సైతం అనుమానించి డీఎన్ఏ పరీక్షను కోరడం తనను మానసికంగా వేధించిందన్నారు. తనకు, బిడ్డలకు ప్రాణరక్షణ కల్పించాలని కోరారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు 498 సెక్షన్ కింద గృహహింసపై కేసు నమోదు చేశారు. బెయిలబుల్ కేసు అయినా నేరం నిరూపితమైతే మూడేళ్ల శిక్షపడే అవకాశముంటుందని పోలీసులు వివరించారు. ఆది నుంచీ సంచలనాలే.. ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఆది నుంచి సంచలనాలకు వేదికగా నిలుస్తున్నారు. కొల్లేరుపై ఆధ్యయనం చేయడానికి వచ్చిన అజీజ్ కమిటీ ముందు గోచీగుడ్డతో మావులు ఎత్తి సంచలనమయ్యారు. ఇటీవల గుడివాడ రైతు సదస్సులో విలేకరులపై మాట తూలడంతో ఆందోళనలు జరిగాయి. కొల్లేరు ప్రజలకు న్యాయంచేస్తే టీడీపీని వీడి కాంగ్రెస్‌కు జై కొడతానని ప్రకటించారు.