కృష్ణాజిల్లా కైకలూరు టీడీపీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణపై ఆయన భార్య సునీత మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంపుతానని తన భర్త బెదిరిస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ గతంలో రెండు కేసులు నమోదు అయ్యాయి. భార్య సునీత ఫిర్యాదు మేరకు కైకలూరు పోలీసులు ఆయనపై తొలుత గృహహింస చట్టం-498 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.