
సాక్షి, కైకలూరు: సీనియర్ రాజకీయ నాయకుడు, కృష్ణా జిల్లా కైకలూరు మాజీ ఎమ్మెల్యే యెర్నేని రాజారామచందర్ (రాజబాబు) (82) ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. కలిదిండి మండలం కొండూరు గ్రామానికి చెందిన రాజబాబు 1993, 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వీరాభిమాని అయిన రాజబాబు కైకలూరు నియోజకవర్గంలో 100 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. వైఎస్‌ఆర్ మరణం తరువాత క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. ఎర్నేని మృతి పట్ల కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment