rajababu
-
ఉత్తరాంధ్రలో ఆగ్రహ జ్వాలలు.. కూటమిలో ప్రకంపనలు
పరవాడ/చీపురుపల్లి/పాడేరు/కామవరపుకోట/తిరుపతి తుడా: విపక్ష కూటమిలో ఏర్పడిన నిరసన జ్వాలలు రాష్ట్రవ్యాప్తంగా ఎగిపిపడుతూనే ఉన్నాయి. ఐదేళ్లపాటు డబ్బు ఖర్చు చేయించి తీరా టికెట్ కేటాయింపు వంతు వచ్చేసరికి డబ్బు మూటలతో దిగి, లాబియింగ్ చేసినవారికే కూటమిలో టికెట్ కేటాయిస్తున్నారంటూ టీడీపీపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారాలు చేస్తూ ఇంట్లో కూర్చున్నవారికి టికెట్ ఇస్తున్నారని, కనీసం పార్టీ సభ్యత్వం లేని వ్యక్తులకు టికెట్లు కేటాయిస్తున్నారని తూర్పారబడుతున్నారు. టీడీపీ తనకు తీరని అన్యాయం చేసిందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి భావోద్వేగానికి లోనయ్యారు. వెన్నలపాలెంలో బండారు స్వగృహంలో శనివారం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ తాను ఏ పాపం చేశానని టికెట్ కేటాయించలేదని ప్రశ్నించారు. కార్యకర్తల నిర్ణయం మేరకే తన భవిష్యత్తు ప్రయాణం ఉంటుందని చెప్పారు. నమ్మిన కార్యకర్తలకు అన్యాయం జరిగితే అండగా నిలుస్తానని బండారు వారికి హామీ ఇచ్చారు. దీంతో కార్యకర్తలు స్పందిస్తూ మీ బాటలోనే మేం కూడా నడుస్తామని స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటూ పార్టీకి దూరంగా ఉంటూ లాబీయింగ్ చేసుకుంటే టికెట్లు వచ్చే పరిస్థితి టీడీపీలో ఉన్నదని విజయనగరం జిల్లా చీపురుపల్లి టీడీపీ నాయకుడు కిమిడి నాగార్జున కంటతడి పెట్టుకున్నారు. చదువుకున్నప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకున్నా గానీ.. వచ్చాక తెలిసింది నమ్మించి గొంతు కోస్తారని, యువత రాజకీయాల్లోకి రావద్దని, పొరపాటున వస్తే జీవితాలను చంద్రబాబు చిదిమేస్తారని విమర్శించారు. ఆయన ఇంటి ముందు టీడీపీ భవిష్యత్‌కు గ్యారెంటీ, సూపర్ సిక్స్ కరపత్రాలను పార్టీ కార్యకర్తలు తగలబెట్టారు. నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి మణికుమారి తదితరులు చెడు సంప్రదాయాలకు టీడీపీ తెరతీసింది: కోరాడ రాజబాబు ధ్వజం చంద్రబాబు చెడు సంప్రదాయానికి తెరతీసి అవినీతి అనకొండ గంటా శ్రీనివాసరావుకు భీమిలి టికెట్ ఇచ్చారని కోరాడ రాజబాబు ధ్వజమెత్తారు. శనివారం ఆనందపురంలోని తన నివాసంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పార్టీని పట్టించుకోకుండా వ్యాపారాలు చేసుకున్న గంటాకు టికెట్ ఇవ్వడం ఏమి సంప్రదాయమని ప్రశ్నించారు. వే లంలో టికెట్లు అమ్ముకోవాలనుకుంటే చంద్రబాబు ఒక రేటు పెడితే తాను కూడా టికెట్ కొనుక్కునేవాడినన్నారు. మూడు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ తెలియచేస్తానన్నారు. పాడేరు టీడీపీ అభ్యర్ధి కిల్లు వెంకట రమేష్‌నాయుడు ఓటమే ధ్యేయంగా పనిచేస్తామని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి స్పష్టం చేశారు. మూడు నెలల క్రితం పార్టీ కండువా కప్పుకున్న వ్యక్తికి టికెట్ ఎలా కేటాయిస్తారని గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. గిరిజనులంటే చంద్రబాబుకు ఎందుకంత చిన్న చూపని ప్రశ్నించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు పాడేరు, కొయ్యూరులో చంద్రబాబు ఫ్లెక్సీలు, కరపత్రాలకు నిప్పంటించి నిరసన తెలిపాయి. మాజీ మంత్రి మణికుమారి డబ్బులు కోసం ప్రస్తావిస్తూ తన అభ్యర్థిత్వాన్ని ఈ ఎన్నికల్లో పరిశీలించాలని టీడీపీ పెద్దలను కోరానని, అయితే డబ్బు ఎంత ఖర్చు పెట్టగలవు అన్ని ప్రశ్నిస్తే డబ్బుతో తూగలేక ఈసారికి డ్రాప్ అవుతానని చెప్పానన్నారు. కె.కోటలో కుమ్ములాటలు ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలో టీడీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. చింతలపూడి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ మండలంలో ఆ పార్టీ కార్యాలయ ప్రారంభానికి వచ్చిన సందర్భంగా గంటా మురళికి పార్టీలోని మరో వర్గానికి మధ్య వివాదం వచ్చింది. అప్పటికే రగిలిపోతున్న ఆ వర్గం గంటా మురళిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. గతంలో ఇక్కడ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కొత్తూరులో ఏర్పాటుచేసిన టీడీపీ జిల్లా నాయకుల సమావేశంలోనూ ఈ రెండు వర్గాలూ ఇదేవిధంగా కొట్లాటకు దిగాయి. పొత్తులో భాగంగా తిరుపతి ఎమ్మెల్యే స్థానాన్ని జనసేనకు, తిరుపతి పార్లమెంట్ స్థానాన్ని బీజేపీకి కట్టబెట్టడంతో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ విలేఖరుల సమావేశంలో కంటతడి పెట్టుకున్నారు. వైఎస్సార్సీపీ నుంచి బయటకు తోసేసిన వ్యక్తులను కూటమి అభ్యర్థులుగా ప్రకటించడాన్ని తప్పుబడుతూ ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు టీడీపీ నాయకుల తన గొంతుగోశారని ఆవేదన వ్యక్తం చేశారు. -
రాష్ట్రంలోనే అతి పెద్ద గృహ సముదాయం గుడివాడలో
-
రెండు రోజుల్లో 58.67 లక్షల మందికి పింఛన్లు
సాక్షి, అమరావతి/సంగం/బిట్రగుంట: అవ్వాతాతలకు పింఛన్ల పంపిణీ రెండో రోజు కూడా కొనసాగింది. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ సొమ్మును అందించారు. మార్చికి సంబంధించి రెండో రోజు మంగళవారం నాటికి 58,67,623 మందికి రూ.1,404.24 కోట్లు అందజేశారు. ఇప్పటివరకు 95.56 శాతం మేర పంపిణీ చేశామని సెర్ప్ సీఈవో రాజాబాబు తెలిపారు. బుధవారం కూడా వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్ అందిస్తారని చెప్పారు. హైదరాబాద్‌కు వెళ్లి మరీ పింఛన్ అందజేత ఓ వలంటీర్ తన పరిధిలోని లబ్ధిదారుకు పింఛన్ అందించడానికి ఏకంగా మరో రాష్ట్రానికి ప్రయాణించాడు. వివరాల్లోకెళ్తే.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం సిద్ధీపురం క్లస్టర్లో పరుచూరు కృష్ణవేణమ్మ అనారోగ్యంతో కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటున్న కుమారుడి వద్ద ఉంటోంది. ఇప్పటికే రెండు నెలలుగా పింఛన్ తీసుకోలేకపోయింది. మార్చి 1 వచ్చినా రాకపోవడంతో ఆమె పింఛన్ ఆటోమేటిక్‌గా రద్దయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో వలంటీర్ రమేష్ సోమవారం రాత్రి హైదరాబాద్ వెళ్లి మరీ మూడు నెలల పింఛన్ రూ.6,750 ఆమెకు అందించి వచ్చి అందరి ప్రశంసలు అందుకున్నాడు. 500 కిలోమీటర్లు ప్రయాణించి మరీ.. ఓ వలంటీర్ సొంత ఖర్చులతో తన ద్విచక్ర వాహనంపై పోను.. రాను 500 కిలోమీటర్లు ప్రయాణించి మరీ పింఛన్ సొమ్ము అందించాడు. వివరాల్లోకెళ్తే.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు పంచాయతీ చెంచులక్ష్మీపురం గ్రామానికి చెందిన లంక అయ్యమ్మది నిరుపేద కుటుంబం. భర్త చనిపోవడంతో వితంతు పింఛన్‌పైనే ఆధారపడి జీవనం సాగిస్తోంది. గుండె సంబంధిత సమస్యతో పది రోజుల నుంచి చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నెల ఒకటిన పింఛన్ పంపిణీ సమయంలో అయ్యమ్మ అందుబాటులో లేని విషయం తెలుసుకున్న వలంటీర్ వై.శ్రీకాంత్ చెన్నైకి వెళ్లి పింఛన్ అందజేయాలని నిర్ణయించుకున్నాడు. రైళ్లు కూడా సమయానికి అందుబాటులో లేకపోవడంతో మంగళవారం తన ద్విచక్రవాహనంపై చెన్నై వెళ్లి ఆమెకు పింఛన్ అందజేసి శభాష్ అనిపించుకున్నాడు. -
తొలిరోజే అవ్వాతాతల చేతికి రూ.1,351.94 కోట్లు
సాక్షి, నెట్వర్క్: మళ్లీ ఒకటో తేదీ రావడం ఆలస్యం.. వలంటీర్లు తెల్లవారుజామునే అవ్వాతాతల ఇళ్లకు వెళ్లి వారికి పింఛన్ అందజేశారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 56,57,160 మందికి రూ.1,351.94 కోట్లు పంపిణీ చేశారు. తొలి రోజు 92.13 శాతం మందికి పింఛన్ సొమ్ము ఇచ్చామని సెర్ప్ సీఈవో రాజాబాబు తెలిపారు. మంగళ, బుధవారాల్లో కూడా అందిస్తామని చెప్పారు. ► మార్చికి సంబంధించి మొత్తం 61,40,090 మందికి పింఛన్ల పంపిణీకి రూ.1,473.88 కోట్లను ఫిబ్రవరి 26నే అన్ని సచివాలయాల కార్యదర్శుల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ► బయోమెట్రిక్ ద్వారా పింఛన్ తీసుకోవడంలో లబ్ధిదారులకు ఏదైనా ఇబ్బంది ఏర్పడితే మరో మూడు పద్ధతుల ద్వారా పింఛన్లు అందించేందుకు వీలు కల్పించారు. లబ్ధిదారుడి కుటుంబంలోని వేరొకరి బయోమెట్రిక్ ద్వారా డబ్బుల పంపిణీకి అవకాశమిచ్చారు. 120 కిలోమీటర్ల దూరం వెళ్లి మరీ.. 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరీ ఆస్పత్రిలో ఉన్న వ్యాధిగ్రస్తురాలికి పింఛన్ అందించాడు.. చిత్తూరు జిల్లా కలకడ మండలానికి చెందిన వలంటీర్. మండలంలోని ఎనుగొండపాళ్యెం పంచాయతీకి చెందిన వలంటీర్ హరినాథ్ పరిధిలోని పి.రమణమ్మ అనే వృద్ధురాలు తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆర్థికావసరాలు తెలుసుకున్న హరినాథ్ సొంత ఖర్చులతో తిరుపతికి వెళ్లి మరీ ఆమెకు పింఛన్ అందజేశాడు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం బి.కొత్తూరు వలంటీర్ చవల చినబాబు.. అంబటి అప్పారావు అనే లబ్ధిదారుడి ఇంటికి పింఛన్ ఇవ్వడానికి వెళ్లగా ఆయన అనారోగ్యంతో కాకినాడ ఆస్పత్రిలో ఉన్నట్లు బంధువులు చెప్పారు. దీంతో చినబాబు అప్పటికప్పుడు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకినాడ వెళ్లి ఆయనకు పింఛన్ అందజేశాడు. అలాగే అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివమ్మ అనే వృద్ధురాలికి గుంటూరు జిల్లా కాజ గ్రామ వెల్ఫేర్ సెక్రటరీ 16 కిలోమీటర్లు ప్రయాణించి మరీ పింఛన్ సొమ్ము అందించారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ద్వారకాతిరుమల మండలం గుళ్లపాడుకు చెందిన డయాలసిస్ పేషెంట్ ఏలేటి మంగమ్మకు వలంటీర్ గొన్నూరి అంజనిమిత్ర స్వయంగా అక్కడకు వెళ్లి పింఛన్ సొమ్ము అందజేసింది. మరికొద్ది గంటల్లో పెళ్లి కాబోతున్నా.. ఆ వలంటీర్‌కు మరికొద్ది గంటల్లో పెళ్లి కాబోతున్నా తన పరిధిలోని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశాడు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరంలో వలంటీర్ జావీద్ పెళ్లి దుస్తుల్లోనే ఇంటింటికీ వెళ్లి పింఛన్ అందించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. పొలాలకెళ్లి మరీ పింఛన్ పంపిణీ ఇంటికే కాదు.. అవసరమైతే లబ్ధిదారుల పని ప్రదేశానికి వెళ్లి మరీ పింఛన్ అందిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.. వలంటీర్లు. ప్రకాశం జిల్లా పెద్ద చెర్లోపల్లి (పీసీపల్లి) మండల పరిధిలోని తురకపల్లి గ్రామ వలంటీర్ శ్రీహరి తన పరిధిలోని లబ్ధిదారు కాకర్ల వరమ్మ నువ్వుల కళ్లంలో పనిచేస్తుంటే అక్కడికి వెళ్లి మరీ పింఛన్ సొమ్ము అందించాడు. బాలింతయినా బాధ్యత మరవని వలంటీర్ పది రోజుల క్రితం పండంటి బాబుకు జన్మనిచ్చిన ఆ వలంటీర్.. అటువంటి పరిస్థితుల్లోనూ తన బాధ్యతను మరవలేదు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని జనార్దనస్వామి కాలనీకి చెందిన గ్రామ వలంటీర్ దేశాభక్తుల వరలక్ష్మి పచ్చి బాలింతరాలు. అయినప్పటికీ సోమవారం ఉదయాన్నే తన పరిధిలోని లబ్ధిదారులకు మరో వలంటీర్ సాయంతో పింఛన్లు అందజేసి అందరితో శభాష్ అనిపించుకుంది. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్- రాజబాబు
-
‘చేయూత’తో పేదరికానికి చెక్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు అందజేసే డబ్బును పెట్టుబడిగా ఉపయోగించుకుంటే పేదరికానికి శాశ్వత పరిష్కారం కనిపిస్తుందని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన 25 లక్షల మంది వైఎస్సార్ చేయూత లబ్ధిదారులకు వ్యక్తిగతంగా లేఖలు రాశారు. 45 ఏళ్ల వయస్సు నిండి 60 ఏళ్ల మధ్య ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750ల చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల ఆర్థిక సాయానికి ఉద్దేశించిన ‘వైఎస్సార్ చేయూత’ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ బుధవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. లబ్ధిదారులందరి బ్యాంకు ఖాతాల్లోకి సీఎం జగన్ ఈ మొత్తాన్ని జమచేస్తారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, నియోజకవర్గస్థాయిలో ఎమ్మెల్యేలు, మండల, గ్రామస్థాయిలో లబ్ధిదారులతో కలిసి స్థానిక నేతలు ఈ పథకం ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సెర్ప్, మెప్మాలు ఏర్పాట్లుచేశాయి. అలాగే, సీఎం ప్రారంభోత్సవ కార్యక్రమాన్నీ ఆయాచోట్ల వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు సెర్ప్ సీఈఓ రాజాబాబు తెలిపారు. లబ్ధిదారులకు సీఎం లేఖ.. అక్కచెల్లెమ్మలందరికీ హృదయ పూర్వకంగా అభినందనలతో.. ► ఆగస్టు 12, 2020 నుంచి ‘చేయూత’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజికవర్గాల్లోని 45–60 ఏళ్ల మధ్య ఉన్న పేద అక్కచెల్లెమ్మలకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ► నా పాదయాత్ర సమయంలో అక్కచెల్లెమ్మలు చెప్పిన ప్రతిమాటా గుర్తుంది. వయస్సు మీద పడుతున్నా, రోజంతా కష్టపడినా వచ్చే ఆదాయం ఏమాత్రం సరిపోవడంలేదని, జీవితాలు మారటంలేదన్న మీ ఆవేదనను అర్ధంచేసుకుని చేయూత పథకాన్ని ఎన్నికల ప్రణాళికలో చేర్చాం. ► ఏటా రూ.18,750ల చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల సహాయం చేస్తామన్న మాటను నిలబెట్టుకుంటున్నా. అక్కచెల్లెమ్మలు ఈ డబ్బును సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు.. దేశంలోనే అతిపెద్ద కంపెనీలు, బ్యాంకుల ద్వారా సహాయాన్ని, సహకారాన్ని అందించేందుకు ఒప్పందాలు చేసుకున్నాం. ► మీకు అందే రూ.18,750లను ఎలా ఉపయోగించుకుంటారన్న అంశంపై ఎలాంటి షరతుల్లేవు. అయితే.. ఈ డబ్బును పెట్టుబడిగా మార్చుకుని వస్తువులు కొని.. అమ్మి మరికొంత లాభం సంపాదించేందుకు వీలుగా పాల ఉత్పత్తుల దిగ్గజం అయిన అమూల్, ప్రజలంతా నిత్యం కొనుగోలు చేసే ప్రముఖ కంపెనీలు ప్రోక్టర్ అండ్ గ్యాంబల్, ఐటీసీ, హెచ్‌యూఎల్, రిలయెన్స్ ఉత్పత్తుల్ని హోల్‌సేల్ ధరల కంటే తక్కువకే మీకు ఇప్పించేలా వారితో ఒప్పందాలు చేసుకున్నాం. మున్ముందు మరెన్నో కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటాం. ఈ ఉత్పత్తుల్ని తక్కువ రేటుకు కొని మార్కెట్ చేస్తే, మన ప్రభుత్వం ఇచ్చే సాయంతో మీరు మరో మెట్టు ఎదగగలుగుతారన్న భావంతోనే ఈ పథకాన్ని మరింత విస్తృతం చేశాం. ఇది ఒక ప్రత్యామ్నాయమైతే.. మీకు మీరుగా మీ నిర్ణయం ప్రకారం సృష్టించుకునే వ్యాపారావకాశాలకు ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చు. కోళ్లు, పాడిపశువుల పెంపకం, గొర్రెలు–మేకల పెంపకం, కిరాణా వ్యాపారం, చేనేత, వస్త్ర వ్యాపారం, తదితర లాభసాటి ఉత్పత్తుల తయారీకి ప్రభుత్వమిచ్చే డబ్బును పెట్టుబడిగా ఉపయోగించుకుంటే పేదరికానికి శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న మంచి ఆలోచనతో ఈ పథకాన్ని అమలుచేస్తున్నాం. ► ఒకవేళ అమూల్, ప్రోక్టర్ అండ్ గ్యాంబల్, ఐటీసీ, హెచ్‌యూఎల్, రిలయెన్స్ కంపెనీలతో మీరు వ్యాపార భాగస్వామ్యం కావాలంటే ఈ ఉత్తరంతో మీకు అందిస్తున్న ఎంపిక పత్రాన్ని పూర్తిచేసి గ్రామ–వార్డు వలంటీర్‌కు అందించినట్లయితే సెర్ప్ లేదా మెప్మాల ద్వారా బ్యాంకులు, ఆయా కంపెనీలతో అనుసంధానం చేస్తారు. మీరు వ్యాపారం చేయడానికి వారు సహకరిస్తారు. అక్కచెల్లెమ్మల జీవితాల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యానికి అన్ని విధాలుగా కృషిచేస్తున్న మహిళా పక్షపాత ప్రభుత్వానికి ఎల్లప్పుడూ మీ అండదండలు ఉండాలని.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దేవుడి చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని నిండు మనస్సుతో కొరుకుంటున్నాను. ఇట్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ -
కొత్తగా 1.15 లక్షల మందికి పింఛన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 1,15,269 మంది నేడు పింఛన్ డబ్బులు అందుకోనున్నారు. మొత్తమ్మీద 59.03 లక్షల మందికి ప్రభుత్వం బుధవారం పింఛన్ డబ్బులను పంపిణీ చేయనుంది. ఇందుకోసం రూ.1,442.21 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2.68 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లు బుధవారం ఉదయమే ఎక్కడికక్కడ లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్ డబ్బుల పంపిణీ మొదలు పెట్టనున్నారు. జూలై నెల నుంచి కొత్తగా 5,165 మంది దీర్ఘకాలిక రోగులు, 1,10,104 మంది వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు పింఛన్ డబ్బులు అందుకోబోతున్నారని సెర్ప్ సీఈవో రాజాబాబు మంగళవారం వెల్లడించారు. ► కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో బయోమెట్రిక్ విధానానికి బదులుగా ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌తో లబ్ధిదారుని ఫొటో తీసుకునే విధానంలోనే ఈసారి కూడా డబ్బుల పంపిణీ కొనసాగనుంది. ► లాక్డౌన్ తదితర కారణాలతో గత మూడు నెలలుగా పింఛను డబ్బులు తీసుకోని వారికి కూడా బకాయిలతో కలిపి పంపిణీ చేయాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్టు అధికారులు వెల్లడించారు. ► సొంత ఊరికి ఇప్పటికీ దూరంగా ఉన్న 4,010 మంది లబ్ధిదారులు పోర్టబులిటీ(అంటే పంపిణీ సమయానికి లబ్ధిదారుడు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకునే విధానం) ద్వారా డబ్బులు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోగా... 3,364 మంది తాము వేరే చోట ఉన్నామని, తమ ఊరికి తిరిగొచ్చాక ఇప్పటి పెన్షన్ డబ్బులు తీసుకుంటామని ముందస్తు సమాచారం అందజేశారు. మరోవైపు 26,034 మంది లబ్ధిదారులు తమ పింఛను డబ్బులను తాత్కాలికంగా ఇప్పుడు తాముంటున్న నివాస ప్రాంతానికి బదిలీ చేసి పంపిణీ చేయాలని ఆయా ప్రాంత వలంటీర్ల ద్వారా సమాచారమిచ్చారు. ► కాగా, జూన్ నెలలో రెండు విడతల్లో 2.11 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరవగా.. మొదటి విడతలో మంజూరైన 1.15 లక్షల మందికి జూలై ఒకటిన పింఛన్ డబ్బు పంపిణీ చేస్తున్నామని, మిగతా 96 వేల మందికి ఆగస్టు ఒకటి నుంచి పంపిణీ చేస్తామని సెర్ప్ సీఈవో రాజాబాబు తెలిపారు. జూలై ఒకటిన చేపట్టే పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ముందుగానే నిధులు విడుదల చేసింది. దీంతో రెండో విడతలో మంజూరు చేసిన 96 వేల పింఛన్లకు ఆర్థిక శాఖ నుంచి నిధులు మంజూరు చేసే ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ కారణం వల్ల వారందరికీ ఆగస్టు నుంచి డబ్బుల పంపిణీ మొదలవుతుందని ఆయన తెలిపారు. -
కైకలూరు మాజీ ఎమ్మెల్యే రాజబాబు కన్నుమూత
సాక్షి, కైకలూరు: సీనియర్ రాజకీయ నాయకుడు, కృష్ణా జిల్లా కైకలూరు మాజీ ఎమ్మెల్యే యెర్నేని రాజారామచందర్ (రాజబాబు) (82) ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. కలిదిండి మండలం కొండూరు గ్రామానికి చెందిన రాజబాబు 1993, 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వీరాభిమాని అయిన రాజబాబు కైకలూరు నియోజకవర్గంలో 100 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. వైఎస్ఆర్ మరణం తరువాత క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. ఎర్నేని మృతి పట్ల కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. -
నేటి నుంచి కొత్త పెన్షన్ కార్డులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పింఛను పొందే లబ్ధిదారులందరికీ ప్రత్యేక పెన్షన్ గుర్తింపు కార్డులను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి పంపిణీ చేయనుంది. వివిధ రకాల పింఛన్లకు సంబంధించి ఫిబ్రవరిలో 54,68,322 మందికి ప్రభుత్వం నిధులు విడుదల చేయగా.. వారందరికీ సోమవారం నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు వలంటీర్ల ద్వారా కొత్త కార్డులు పంపిణీ చేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో రాజాబాబు తెలిపారు. ఫిబ్రవరి నెలలో కొత్తగా పింఛన్లు మంజూరైన వారికి పింఛను పుస్తకంతోపాటు గుర్తింపు కార్డు ఇస్తారు. మిగిలిన పాత పింఛనుదారులందరికీ ఇప్పటికే పింఛను పుస్తకాలు పంపిణీ చేసిన నేపథ్యంలో వారికి కొత్తగా కేవలం గుర్తింపు కార్డులను మాత్రమే పంపిణీ చేయనున్నట్లు ఆయన వివరించారు. ఇదిలావుండగా.. అనర్హులుగా తేలిన వారికి సంబంధించి ప్రస్తుతం రీ సర్వే జరుగుతోందని, ఇందులో అర్హులుగా తేలిన వారికి మార్చి 1వ తేదీన గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే కొత్తగా 6,14,244 మందికి పింఛన్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. -
గోల్డెన్ బయోపిక్స్ ఇవి వస్తే బాగుండు!
భారతీయ సినిమాకు ఆద్యుడైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ 1913లో మొదటి ఫీచర్ ఫిల్మ్‌గా ‘రాజా హరిశ్చంద్ర’ను తెరకెక్కించాడు. హరిశ్చంద్రుడు నిజ జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడో ఈ సినిమా తీయడానికి దాదా సాహెబ్ ఫాల్కే కూడా అన్ని కష్టాలు పడ్డాడు. ఆయన ‘రాజా హరిశ్చంద్ర’ను తీయడం వెనుక పడిన కష్టాన్ని, తపనని, జీవితాన్ని ఆధారం చేసుకొని మరాఠీలో ‘హరిశ్చంద్రచి ఫ్యాక్టరీ’ అనే సినిమా తీశారు 2010లో. మనకు సినిమా ఇచ్చిన మహనీయునికి సినిమా ద్వారా ప్రకటించగలిగిన నివాళి అది. కాని తెలుగులో అలాంటి నివాళి మరో ఎనిమిదేళ్లు గడిస్తే తప్ప రాలేదు. సావిత్రి పై తెరకెక్కించిన ‘మహానటి’ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తొలి బయోపిక్. అయితే సావిత్రి గురించి మాత్రమే బయోపిక్ తీస్తే సరిపోతుందా? నిజానికి మన ఇండస్ట్రీ ఎందరి బయోపిక్లకో బాకీ పడి ఉంది. అవన్నీ నిజరూపు దాలిస్తే తెలుగు ప్రేక్షకులకు మించి ఆనందపడేవారు మరొకరు ఉండరు. బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో అసలు ఎందరి బయోపిక్‌లు ఇంకా తీయవలసి ఉందో ఒకసారి చూద్దాం. వీళ్ల జీవితం వెండితెర మీద ఎందుకు ఆసక్తికరమో కూడా పరిశీలిద్దాం. చిత్తూరు నాగయ్య ఒకరి జీవితం ఎప్పుడు ఆసక్తిగా ఉంటుందంటే ఆ జీవితంలో నాటకీయ పరిణామాలున్నప్పుడు. చిత్తూరు నాగయ్య తెలుగువారికి సంబంధించి చాలా పెద్ద సింగింగ్ స్టార్. ఇంకా చెప్పాలంటే సింగింగ్ స్టార్ల తరానికి ఆయన ఆఖరు ప్రతినిధి. ఆయన చూసిన స్టార్డమ్ అంతకు ముందు ఎవరూ చూడలేదు. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా ఆయన అద్భుతమైన గీతాలను, సంగీతాన్ని తెలుగువారికి ఇచ్చారు. ఇక ఆయన దానధర్మాల గురించి చాలా కథలే ఉన్నాయి. అంత ఐశ్వర్యం చూసి ఆ తర్వాత దెబ్బ తినడం, కార్లు బంగళాలు పోగొట్టుకోవడం, తన తర్వాత వచ్చిన వారు స్టార్డమ్కు చేరుకున్నా కేరెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో హుందాతనంతో గొప్ప గొప్ప పాత్రల్లో నటించడం ఇవన్నీ ఒక మంచి బయోపిక్కు విలువైన సరంజామా అవుతుంది. నాగయ్య బయోపిక్ వల్ల తొలినాటి తెలుగు సినిమా చరిత్ర కూడా చెప్పినట్టవుతుంది. కె.వి.రెడ్డి తెలుగు దర్శకులలో ఎవరి గురించైనా మొదటి బయోపిక్ తీయదలిస్తే కె.వి.రెడ్డే అందరి ఎంపిక అవుతారనేది వాస్తవం. జనాకర్షక సినిమా ఫార్ములాను కనిపెట్టి సూపర్‌డూపర్ హిట్స్ తీసిన కె.వి.రెడ్డి ఎన్.టి.ఆర్ కెరీర్‌ని ‘పాతాళభైరవి’, ‘మాయాబజార్’ చిత్రాలతో మలుపు తిప్పారు. రాయలసీమ నుంచి వచ్చి మద్రాసులో స్థిరపడి నాగిరెడ్డి, చక్రపాణి వంటి ఉద్దండులతో కలిసి పని చేస్తూ భావితరాలకు ఆదర్శప్రాయంగా నిలిచిన కె.వి.రెడ్డి బయోపిక్ చాలా విలువైనది అవుతుంది. అసలు ఆయన ‘మాయాబజార్’ ఎలా తీసి ఉంటాడు అన్న ఒక్క అంశాన్ని తీసుకొని కూడా ఒక బయోపిక్ తీస్తే ఎంతో బాగుంటుందని అభిమానులు అనుకుంటే అందులో కాదనేమాట ఏమైనా ఉంటుందా? అదే జరిగితే పింగళి నాగేంద్రరావు, మార్కస్బాట్లే, ఆర్ట్ డైరెక్టర్ గోఖలే... వీళ్లను కూడా తెర మీద చూడొచ్చు. అక్కినేని నాగేశ్వరరావు ఎన్.టి.ఆర్ బయోపిక్ తయారవు తున్న సందర్భంగా నాగార్జునను అక్కినేని బయోపిక్ గురించి ప్రశ్నించినప్పుడు ‘అంత డ్రమెటిక్ సంఘటనలు ఏమున్నాయని నాన్నగారి జీవితంలో బయోపిక్ తీయడానికి’ అన్నారు. నిజానికి అక్కినేని జీవితంలో ఉన్న డ్రమెటిక్ సంఘటనలు మరొకరి జీవితంలో లేవు. ఆయనకు చదువు లేదు. నాటకాలలో స్త్రీ పాత్రలు పోషించి పోషించి బాడీ లాంగ్వేజ్ ప్రభావితం అయి ఉంది. మద్రాసు చేరుకున్నాక ముందు జానపద హీరోగా మారి ఆ తర్వాత సోషల్ హీరోగా స్థిరపడడానికి చాలా స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది. గొంతు విషయంలో, పర్సనాలిటీ విషయంలో ఉన్న పరిమితులను జయించడానికి మరెంతో స్ట్రగుల్ చేశాడాయన. మరోవైపు గొప్ప కంఠం, పర్సనాలిటీ ఉన్న ఎన్.టి.ఆర్తో సరిసాటిగా నిలవడానికి, ఆత్మవిశ్వాసంతో పోరాడటానికి ఆయన చేసిన కఠోర శ్రమ ఎంతో స్ఫూర్తిదాయకమైనది. హైదరాబాద్‌కు వలస రావడం, స్టూ్టడియో కట్టడం, కెరీర్ పీక్‌లో ఉండగా మసూచి రావడం, గుండె ఆపరేషన్ వల్ల కెరీర్‌కే దూరమవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడటం, వీటన్నింటిని జయించి పెద్ద హీరోగా కొనసాగగలగడం... ఇవన్నీ బయోపిక్ తీయడానికి ఎంతో సరిపోతాయి. జమున దక్షిణాది వారికి యమున తెలుసు. కానీ ఉత్తరాది పేరు జమునతో పాపులర్ అయిన అచ్చ తెలుగు స్టార్ జమున. తెలుగువారి తొలి లాంగ్ స్టాండింగ్ గ్లామర్స్టార్గా ఈమెను చెప్పుకోవచ్చు. భానుమతి, సావిత్రి, బి.సరోజ, రాజశ్రీ వంటి బొద్దు హీరోయిన్ల నడుమ సన్నగా, లావణ్యంగా ఉంటూ గ్లామర్‌ను మెయిన్‌టెయిన్ చేశారామె. పురాణాల్లో సత్యభామ కన్నా సినిమాల్లోని ఈ సత్యభామే తెలుగువారికి ఎంతో ప్రియం అంటే జమున ఆ పాత్రను ఎంత గొప్పగా పోషించారో తెలుస్తుంది. సత్యభామ తీరుకు తగినట్టుగానే జమునలో కూడా ఆత్మాభిమానం, ఆత్మగౌరవం మెండు. కొన్ని స్పర్థల వల్ల ఏ.ఎన్.ఆర్, ఎన్.టి.ఆర్ వంటి సూపర్స్టార్లు తమ సినిమాల నుంచి ఆమెను దూరంగా పెట్టినప్పుడు చెదరకుండా, కంగారుపడి రాజీ కుదుర్చుకోకుండా స్థిరంగా నిలబడి పోరాడిన వనిత ఆమె. ఆ సమయంలో హిందీలో కూడా నటించి అక్కడా పేరు గడించారు. హరనాథ్‌ను తెలుగువారి ఆల్టర్నేట్ స్టార్‌గా ఎస్టాబ్లిష్ చేయడంలో జమున పాత్ర ఎంతో ఉంది. రాజకీయాలలో కూడా సక్సెస్ అయిన జమున జీవితం ఒక మంచి బయోపిక్. రాజబాబు చార్లిచాప్లిన్ కథకు రాజబాబు కథకు అట్టే తేడా లేదు. ఒక కమెడియన్‌గా రాజబాబు సాధించినంత క్రేజ్ ఎవరూ సాధించలేదు. రాజబాబు పోస్టర్ మీద ఉంటే ఆ సినిమాలు ఆడేవి. రాజబాబు సినిమాలో ఉంటే డిస్ట్రిబ్యూషన్ చాలా సులువైపోయేది. మద్రాసులో అవకాశాలు రాక ముందు రాజబాబు ట్యూషన్లు చెప్పారు. పస్తులు పడుకున్నారు. తాను గొప్ప స్టార్ అయ్యాక ఖరీదైన కారు కొన్నాక ఏ పేవ్మెంట్ మీద పడుకున్నారో ఆ పేవ్మెంట్ దగ్గరకు వెళ్లి నిలుచునేవాడాయన. పేదల అవస్థలు అనుభవించినవాడు కనుక పేదలకు విపరీతమైన దాన ధర్మాలు చేసేవాడు. ఆయన ఉంటే తమను చూడరు అని పెద్ద పెద్ద హీరోలు కూడా తమ సినిమాల్లో రాజబాబును పెట్టుకోవడానికి జంకేవారు. రాజబాబు కమెడియన్‌గా ఎంత దుడుకు హాస్యం చేసినా నిజ జీవితంలో తాత్వికుడు. హాస్యనటుడైన కిశోర్ కుమార్ గంభీరమైన సినిమాలు తీసినట్టే తెలుగులో రాజబాబు ‘మనిషి రోడ్డున పడ్డాడు’ వంటి గంభీరమైన సినిమాలు తీశారు. మద్యపానం ఆయనను 48 ఏళ్ల వయసుకే మృత్యువును చేరువ చేసింది. రాజబాబు బయోపిక్ తీయడం అంటే పరోక్షంగా రమాప్రభ బయోపిక్ తీయడమే. ఒక గొప్ప హాస్యజంటను వెండితెర మీద నిక్షిప్తం చేయవచ్చు ఈ సినిమా తీస్తే. సూర్యకాంతం ఒక గయ్యాళి ప్రేక్షకులకు ఇంత అభిమానమైన వ్యక్తిగా మారగలదా? ఒక గయ్యాళి పేరును భావి తరాలలో ఎవరికీ పెట్టలేని స్థాయిలో ఆమె ముద్ర వేయగలిగిందా? ఒక నటి పేరే ఒక స్వభావం పేరుగా మారడం వెనుక ఆ నటి చేసిన ప్రయాణం ఏమిటి? సూర్యకాంతం కథ చెప్పుకోవడం అంటే తెలుగు సినిమాలో స్త్రీ సహాయక పాత్రల చరిత్ర చెప్పుకోవడమే. నాటి సినిమాలలోనే కాదు నేటి సీరియల్స్‌లో కూడా కథ నడవడానికి సూర్యకాంతం పాత్రే కీలకం అని గ్రహిస్తే ఆమె ఎన్ని సినిమాలను ప్రభావితం చేసి ఉంటుందో ఊహించవచ్చు. తెర జీవితానికి నిజ జీవితానికి పోలిక లేని ఈ నటి బయోపిక్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని చెప్పడంలో సంశయం లేదు. సూర్యకాంతం బయోపిక్ తీయడం అంటే రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, పద్మనాభంల బయోపిక్‌ను పరోక్షంగా తీయడమే. ఈమె సినిమా తీయడం కష్టం కాకపోవచ్చు. కానీ ఈమె పాత్రను పోషించే నటిని వెతికి తేవడం మాత్రం కష్టం. ఎందుకంటే సూర్యకాంతం లాంటి సూర్యకాంతం మళ్లీ పుట్టలేదు కనుక. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బాలూ బయోపిక్ అంటే తెలుగు సినిమా సంగీత ప్రయాణాన్ని వెండితెర మీద చూడటమే. ఘంటసాల వంటి లెజండ్ మార్కెట్లో ఉన్నప్పుడు గాయకుడిగా నిలదొక్కుకోవడానికి బాలూ ఎంతో ఆత్మవిశ్వాసంతో, కఠోర శ్రమతో ప్రయత్నించారు. సంగీత దర్శకుడు ఎస్.పి.కోదండపాణి ఆయనను దగ్గరకు తీయడం, వారిద్దరి మధ్య అనుబంధం ఈ బయోపిక్‌లో ఒక ఎమోషనల్ పార్ట్ అవుతుంది. బాలూ పెళ్లి నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. అదీ ఆసక్తికరమైన మలుపు అవుతుంది కథలో. సూపర్ స్టార్ కృష్ణతో స్పర్థ ఒక ముఖ్య ఘట్టం. రామకృష్ణ విజృంభిస్తున్న రోజుల్లో ఏ.ఎన్.ఆర్కు పాడటానికి ఆయన ధోరణిని అనుకరించి హిట్ కొట్టడం, నెమ్మదిగా తమిళ, కన్నడ, హిందీ భాషల్లోకి ఆయన ప్రతిభ పరివ్యాప్తం కావడం ఎన్ని గంటల సినిమాకైనా ముడిసరుకే. బాలూ బయోపిక్‌లో తప్పనిసరిగా కనిపించే ఇతర పాత్రలు పి.సుశీల, ఎస్.జానకి, సంగీత దర్శకుడు చక్రవర్తి. బాలూ క్లోజ్‌ఫ్రెండ్, ఆయనకు సుదీర్ఘంగా సెక్రటరీగా పనిచేసిన విఠల్ కూడా ఒక ముఖ్య పాత్రధారి. బాలూకు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు. కనుక ఆయన సినిమా అన్ని భాషలలో హిట్టయ్యే అవకాశం ఉంటుంది. వీరు మాత్రమే కాదు... ఎస్.వి.రంగారావు, ఘంటసాల, కత్తి వీరుడు కాంతారావు, బాపు–రమణ, సాలూరు రాజేశ్వరరావు, వాణిశ్రీ, హరనాథ్, దాసరి నారాయణరావు... వీరందరి బయోపిక్‌లు తీయదగ్గవే. కానీ బయోపిక్‌లు తీయడం కత్తిమీద సాము. గతంలో మణిరత్నం వంటి దర్శకులు కూడా ఎం.జి.ఆర్, కరుణానిధిలపై తీసిన బయోపిక్ ‘ఇద్దరు’ ప్రతికూల ఫలితాన్ని ఇచ్చింది. హిందీలో అజారుద్దీన్ పై తీసిన బయోపిక్ సఫలం కాలేదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏవో కాంట్రవర్సీలు, ఎత్తి చూపదగ్గ అంశాలు ఉంటాయి. వాటిని కూడా ఒప్పించి బయోపిక్‌లు తీయగలిగితే కథలు లేని ఈ కాలాన వీటికి మించిన కథలు ఉండవు. -
యథేచ్ఛగా గోవధ
అనధికార కబేళాపై అధికారుల దాడి కబేళాకు సిద్ధం చేసిన గోవులు స్వాధీనం గోశాలకు తరలింపు రామచంద్రపురం: ‘హృదయ విదారకమైన దృశ్యాలు.... పశువధలు,... పశుకళేబరాలు.. వ్యర్థ పదార్థాలు, దుర్భరమైన దుర్వాసన వస్తున్న ప్రదేశాలు... ఇదీ.. రామచంద్రపురం పట్టణంలోని రాజబాబు నగర్‌లోగల పరిస్థితి. కొంతకాలంగా కాలనీలో జరుగుతున్న అనధికార కబేళా అంశాన్ని గతంలో సాక్షి పలు సందర్భాల్లో ప్రచురించింది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అధికారులు, మీడియా సంయుక్తంగా దాడులు నిర్వహించగా అక్రమ పశువధలు కనిపించాయి. పట్టణంలోని రాజగోపాల్ సెంటర్‌కు కూత వేటు దూరంలో గల రాజబాబునగర్‌లో కొంత కాలంగా నిర్వహిస్తున్న అనధికార కబేళాపై తహసీల్దార్ పి.రామ్మూర్తి, కమిషనర్ సీహెచ్ శ్రీరామశర్మ, ఎస్సై నాగరాజు దాడులు నిర్వహించారు. రోడ్డు పక్కనే గల ఒక పాడు బడ్డ ఇంట్లో కబేళాకు తరలించేందుకు సిద్ధం చేసిన 11 ఆవులున్నాయి. సమీపంలో నాలుగు ఇళ్లలో కబేళా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఒక ఇంట్లో అప్పుడే పీక కోయబడిన గోమాతను అధికారులు గుర్తించారు. తాళాలు వేసి ఉన్న మరో మూడు ఇళ్లను తెరిచి చూడగా పశు కళేబరాలు, అవశేషాలు, చర్మాలు, ఎండబెట్టిన పేగులు కనిపించాయి. దీంతో పాటు డ్రెయిన్లలో రక్త కలిసిన నీరు ప్రవహించడాన్ని అధికారులు గుర్తించారు. ఈ అంశాలపై అధికారులు స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. కబేళాకు తీసుకువచ్చిన 11 ఆవులను రాజమండ్రిలోని గోశాలకు తరలిస్తున్నట్లు తహసీల్దార్ రామ్మూర్తి తెలిపారు. ఈ కబేళాపై పంచనామా నిర్వహించి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు కమిషనర్ సీహెచ్ శ్రీరామశర్మ తెలిపారు. అంతేకాకుండా ఆయా ఇళ్లలోని పశు వ్యర్థాలను, పేగులను, చర్మాలను తొలగించి పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయిస్తామని వివరించారు. స్థానికులు ఆరోగ్య పరిర„ý ణకు తమకు సహకరించాలని కమిషనర్ కోరారు. కబేళా నిర్వాహకులపై మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్సై నాగరాజు తెలిపారు. -
తాటిపర్తిలో ఉద్రిక్తత
గొల్లప్రోలు :మండలంలోని తాటిపర్తి గ్రామంలో మంగళవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పంచాయతీ కార్యాలయ సమీపంలో ఉన్న హోటల్‌ను తొలగించే ప్రయత్నంలో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన దాసం నాగరాజు కుటుంబం 70 ఏళ్లుగా పంచాయతీ కార్యాలయ సమీపంలో హోటల్ నిర్వహిస్తోంది. నాగరాజు మరణానంతరం అతడి కొడుకు రాజబాబు ఈ హోటల్ ద్వారా జీవనోపాధి పొందుతున్నాడు. మూడు నెలలు క్రితం రాజబాబు కూడా మంచానపట్టాడు. దీంతో అతడి భార్య చంద్రావతి, ఇద్దరు కుమార్తెలు హోటల్ నడుపుతున్నారు. కాగా సోమవారం రాత్రి పంచాయతీ సిబ్బంది హోటల్‌ను పడగొట్టి ఆ స్థలంలో ఇటుకలు పేర్చారు. పడగొట్టిన స్థలంలో బరకం(టార్పలిన్) కప్పుకుని యథావిధిగా మంగళవారం చంద్రావతి హోటల్ నడిపింది. సాయంత్రం పంచాయతీ సిబ్బంది వచ్చి హోటల్‌ను తొలగించాలని ఆదేశించారు. దీంతో హోటల్ నిర్వాహకుడు రాజబాబు కుటుంబసభ్యులు తాము 70 ఏళ్లుగా హోటల్ నడుపుకుంటున్నామని, ఇప్పుడు తొలగిస్తే ఎలా బతికేదని సిబ్బందిని ప్రాధేయపడ్డారు. అయితే పంచాయతీ సిబ్బంది అవేవీ పట్టించుకోకుండా మహిళలను తోసివేసి హోటల్ సామాన్లు చిందరవందరగా పడేశారు. పంచాయతీ రిక్షాలను హోటల్ స్థలంలో మళ్లించారు. దీనిని అడ్డుకోబోయిన రాజబాబు, అతడి భార్య సత్యవతిపై దురుసుగా ప్రవర్తించారు. అవమానం భరించలేని కుటుంబసభ్యులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఈ సమయంలో స్థానికులు అడ్డుకుని వారిని వారించారు. తమపై కావాలనే పంచాయతీ సర్పంచ్, ఇతరనాయకులు వేధింపులకు గురిచేస్తున్నారని చంద్రావతి ఆరోపించింది. ప్రభుత్వ స్థలంలో 30కుపైగా షాపులు ఉండగా తమపై కక్ష కట్టారన్నారు. రాజకీయ నాయకుడి విగ్రహం ఏర్పాటుకు తమ జీవనాధారమైన హోటల్‌ను ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగిస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై, తన కుటుంబంపై దాడి చేసిన, చేయించిన పంచాయతీ సిబ్బంది, సర్పంచ్‌పైన పోలీస్ కేసు పెడతానని తెలిపారు. కాగా పంచాయతీ కాంట్రాక్ట్ సిబ్బంది జి. శివశ్రీనువాస్ మాట్లాడుతూ సర్పంచ్ ఆదేశాల మేరకు ఆక్రమణను తొలగించామన్నారు. తాము ఎవరిపైనా దాడికి దిగలేదన్నారు. -
సత్తా చాటిన విశాఖ జట్లు
ముగిసిన రాష్ట్ర అర్చరీ పోటీలు రాష్ర్ట జట్ల ఎంపిక విశాఖపట్నం : రాష్ట్ర స్థాయి ఆర్చరీ (విలు విద్య) చాంపియన్‌షిప్‌లో విశాఖ జిల్లా జట్లు సత్తాచాటాయి. ఇండియన్ రౌండ్, ఒలింపిక్ రౌండ్లలో విశాఖ క్రీడాకారులు, రికర్వ్, కాంపౌండ్ రౌండ్లలో కృష్ణా జిల్లా జట్లు ప్రతిభ చూపాయి. మహిళా విభాగంలో తూర్పుగోదావరి, కడప, కర్నూలు, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి వచ్చిన 28 మంది క్రీడాకారిణులు తలపడగా రికర్వ్ రౌండ్లో ఎనిమిది మంది పాల్గొన్నారు. పురుషుల విభాగంలో అనంతపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల నుంచి అర్చర్లు తలపడ్డారు. ఎలిమినేషన్లో మూడు రౌండ్ల పాటు పోటీలు సాగాయి. ఒలింపిక్ రౌండ్లో ఎలిమినేషన్ పద్ధతిలో పురుషుల విభాగంలో సాగిన పోటీల్లో చివరి వరకూ నిలిచిన నలుగురూ విశాఖ క్రీడాకారులే కావడం గమనార్హం. దూరమే లక్ష్యంగా సాగిన పోటీలను 360 పాయింట్లకు నిర్వహించి అత్యధిక పాయింట్లు సాధించిన తొలి నలుగుర్ని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. ఎలిమినేషన్లో విజేతకు తొలి ర్యాంక్ ఇవ్వగా మొత్తంగా నలుగుర్ని జట్టుకు ఎంపిక చేశారు. రికర్వ్‌లో నాగబాబుపై ధీరజ్, కొండలరావుపై రఘనాథ్, సుధాకర్‌పై రామ్‌చంద్ర, శ్రీసత్యపై రాజీవ్ విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నారు. విజేతగా నిలిచిన ధీరజ్ స్వర్ణాన్ని అందుకోగా, రామచంద్ర రజతాన్ని, రాజీవ్ కాంస్యాన్ని సాధించారు. నాలుగో స్థానంలో నిలిచిన రఘు రాష్ట్ర జట్టుకు అర్హత సాధిం చాడు. కాంపౌండ్‌లో విజేత నవీన్‌కుమార్ స్వర్ణాన్ని అందుకోగా, ఫణిభూషణ్ రజతం సాధించాడు. ఇండియన్ రౌండ్లో డి.సంతోష్‌పై బైరాగి నాయుడు, ఖాదిర్‌పై ఎస్.సంతోష్, పిచ్చయ్యపై రమేష్, శివపై రాజబాబు సత్తాచాటి సెమీస్‌కు చేరుకున్నారు. జాతీయ రికార్డు సాధించిన బైరాగి నాయుడు స్వర్ణాన్ని అందుకోగా రాజబాబు రజతం, రమేష్ కాంస్యం అందుకున్నారు. నాలుగో స్థానంలో సంతోష్ నిలిచాడు. ది ఒలింపిక్ సంఘం విశాఖ, జిల్లా ఆర్చరీ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఏయూ గోల్డెన్ జూబ్లీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఏపీ స్టేట్ సీనియర్స్ తొలి అంతర జిల్లాల ఆర్చరీ పోటీలను ఏయూ వీసీ జి.ఎస్.ఎన్.రాజు ఆదివారం ప్రారంభించారు. పోటీల ప్రారంభ కార్యక్రమంలో విశాఖ సంఘం అధ్యక్షుడు టి.ఎస్.ఆర్.ప్రసాద్, కార్యదర్శి ఎం.శ్యాంబాబు, రాష్ట్ర అర్చరీ సంఘం కార్యదర్శి సిహెచ్.సత్యనారాయణ, జిల్లా ఆర్చరీ సంఘం కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పోటీల ముగింపు కార్యక్రమంలో ఏయూ రిజిస్ట్రార్ రామ్మోహన రావు విజేతలకు మెడల్స్ అందించారు. రికర్వ్, కాంపౌండ్, ఇండియన్ రౌండ్లలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన క్రీడాకారుల్ని ర్యాంక్‌ల వారీగా రాష్ట్ర జట్టుకు మహిళా, పురుషుల విభాగాల్లో ఎంపిక చేశారు. కాంపౌడ్ రౌండ్లో పర్వేషా షిండేకు రాష్ట్ర జట్టుకు నేరుగా అర్హత కల్పించారు. ప్రస్తుతం ఆమె ఆసియన్ గేమ్స్‌లో పాల్గొంటున్నందున ఈ పోటీల్లో హాజరుకాలేకపోయింది. ఆర్చరీలో మహిళా విజేతలు ఏపీ స్టేట్ అంతర జిల్లాల అర్చరీ చాంపియన్‌షిప్‌లో గీతిక, హరిత, వినీల విజేతలుగా నిలిచారు. కాంపౌండ్, రికర్వ్ రౌండ్లలో కృష్ణా జిల్లాకు చెందిన మహిళా ఆర్చర్లు రాణించగా ఇండియన్ రౌండ్లో విశాఖ ఆర్చర్లు ప్రతిభ చూపారు. కాంపౌండ్‌లో గీతిక లక్ష్మి, వై.అనూష, కె.జోత్స్న, ఇండియన్ రౌండ్లో జయ వినీల, వర్షాదాస్, వి.గాయత్రి తొలి మూడు స్థానాల్లో నిలిచారు. రికర్వ్‌లో హరిత, నీలిమ తొలి రెండు స్థానాలు సాధించారు. -
అధికార మదంతోనే టీడీపీ దాడులు
కాకినాడ, న్యూస్‌లైన్ : అధికారం చేతికి రాగానే తెలుగుదేశం నేతలు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ శెట్టిబత్తుల రాజబాబు ఆరోపించారు. పార్టీ శ్రేణులు సంయమనం పాటించి దాడులను తిప్పికొట్టాలన్నారు. కాకినాడలో ఆదివారం విలేకర్లతో మాట్లాడుతూ కోట్లు కుమ్మరించి అడ్డదారుల్లో అధికారం చేజిక్కించుకున్న టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడున్నారని ధ్వజమెత్తారు. కేవలం 2 శాతం స్వల్ప ఓట్లు తేడాతో అధికారాన్ని చేజిక్కించుకున్న టీడీపీ అధికారమదంతో విర్రవీగుతుందన్నారు. కాకినాడ ఎంపీ తోటనరసింహం తాను ఎంపీనన్న స్పృహను కూడా కోల్పోయి ఒక వీధి రౌడీలా వైఎస్సార్ సీపీ నాయకుల ఇళ్లల్లోకి చొరబడి దాడులకు తెగపడడం చూస్తుంటే మున్ముందు వీరి ఆగడాలు ఏ స్థాయి లో ఉంటాయో అర్థమవుతుందన్నారు. ఎస్సీల ఇళ్లల్లోకి కూడా వెళ్లి ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిపైనా భౌతిక దాడులకు దిగడం టీడీపీ నేతల రౌడీయిజానికి పరాకాష్టగా మారిందన్నారు. ఇదే రీతిలో టీడీపీ శ్రేణులుంటే మాత్రం వైఎస్సార్ సీపీ శ్రేణులు చూస్తూ ఊరుకోబోరని తగిన రీతిలో ప్రతిఘటించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. -
గుమ్మడిలా.. బొప్పాయి ఇలా..
ఇది గుమ్మడి కాయ అనుకుంటున్నారా.. కాదు. ఇది బొప్పాయి. కానీ గుమ్మడి కాయ ఆకారంలో ఉంది. చెట్టుకు ఉన్నప్పుడు చూస్తేనే ఇది బొప్పాయి కాయ అని గుర్తు పట్టగలం. చెట్టు నుంచి కోస్తే మాత్రం అచ్చం గుమ్మడి కాయలా కనిపిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదల గ్రామంలో కొప్పినీడి రాజబాబు ఇంటి పెరట్లోని చెట్టుకు అచ్చం గుమ్మడి కాయల్ని పోలిన బొప్పారుులు కాస్తున్నారుు. ఏటా 50 వరకూ ఇదే తరహాలో కాయలు కాస్తున్నాయని రాజబాబు చెప్పారు. -
కబళిస్తున్న మహమ్మారి
బుచ్చెయ్యపేట మండలంలోని కొండపాలెం ప్రశాంతతకు నిలయం. ఈ గ్రామస్తులు గొడవలు పడి ఇంతవరకూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన సందర్భం లేదు. స్థానిక ఎన్నికల్లో పోటీ పడిన పాపానపోలేదు. ఊరందరిదీ ఒకేమాట. ఒకేబాట. ఇప్పుడా గ్రామాన్ని కిడ్నీవ్యాధి మహమ్మారి పీడిస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా 20 నుంచి 80 ఏళ్ల వరకూ అందరూ ఈ వ్యాధి బాధితులే. ఏడాది కాలంలో దీని బారిన పడి ఆరుగురు చనిపోయారు. మరో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇంకా పదిమంది ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. సుమారు 600 జనాభా ఉన్న ఈ గ్రామంలో రక్షిత తాగునీటి పథకం లేదు. అందరికీ గ్రామంలోని గొట్టపుబావే ఆధారం. బోరునీరే వ్యాధికి కారణమని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామానికి చెందిన చిన్ని రాజబాబు (38), మత్సకర్ల కన్నారావు (42), మంత్రి చిన్న (37), మత్సకర్ల సన్నిబాబు (48), జామి రాములమ్మ (49), మత్సకర్ల అప్పలనాయుడు (50)లు ఈ వ్యాధితో చనిపోయారు. తాటికొండ అప్పారావు (50), మత్సకర్ల రాజారావు (52), శ్రీరాములు (54), కోరిబిల్లి అర్జునమ్మ (36)ల పరిస్థితి విషమంగా ఉం ది. వీరికి నయం కాదని తేల్చేశాక విశాఖ కేజీహెచ్ నుంచి ఇటీవల డిశ్చార్జి చేసి పంపించేశారు. ఈ గ్రామానికి చెందిన మాజీ మండలాధ్యక్షుడు ఎం.వి.వి.సత్యనారాయణతో పాటు మత్సకర్ల అప్పారావు, పెద్దాడ శ్రీను, బొడ్డేడ భూలోక, గుమ్మిడి సింహాద్రి, సిహెచ్.రామునాయుడు, తదితరులు ఇదే వ్యాధికి గురయ్యారు. రోజు రోజుకు పరిస్థితి అదుపుతప్పుతుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రామంలోని నీరు తాగడానికి పనికి రాదని అధికారులు గుర్తించినా, ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని ప్రాణాలను కాపాడాలని మాజీ ఎంపీపీ ఎం.వి.వి.సత్యనారాయణ, సర్పంచ్ ఎం.భవాని, నాయకులు తాతయ్యలు, నాగేశ్వరరావు కోరుతున్నారు. -
త్వరలో మరో మహిళా డిగ్రీ కళాశాల
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో మహిళా విద్యను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరో మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటి వరకు కాకినాడలో మాత్రమే మహిళా డిగ్రీ కళాశాల ఉంది. రెండో కళాశాలను అమలాపురంలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి నెలకొల్పనున్నారు. అమలాపురంలో ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాల ఉంది. ప్రభుత్వం నియమించిన కమిటీ అమలాపురంలో సోమవారం పర్యటించి అధ్యయనం చేసింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను కమిటీ సందర్శించింది. కోనసీమలో ఉన్న 29 ప్రైవేటు జూని యర్ కళాశాలలో దాదాపు 6,600 మంది బాలికలు చదువుతున్నట్టు కమిటీ గుర్తించింది. రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చప్పిడి కృష్ణ, అధ్యాపకుడు కె.శ్రీనివాసరావుతో కూడిన బృందం ఈ అధ్యయనం చేసింది. అమలాపురం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కేఎస్ రాజబాబు బృందానికి వివరాలు అందజేశారు. డిగ్రీ కళాశాలకు 24 మంది అధ్యాపకు లు, 12 మంది అధ్యాపకేతర సిబ్బంది అవసరమని కమిటీ ప్రభుత్వానికి సమర్పించనున్న నివేదికలో పేర్కొం ది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రస్తుతం అమలాపురంలో ఉన్న ప్రభు త్వ జూనియర్ బాలికల కళాశాలలోనే మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయనున్నట్టు కమిటీ ప్రతినిధి చప్పిడి కృష్ణ సోమవారం స్థానిక విలేకరులకు తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ విభాగాల్లో తరగతికి 60 మంది విద్యార్థుల చొప్పున కళాశాల ప్రారంభం కానుం ది. జిల్లా మంత్రి తోట నరసింహం అమలాపురంలో కళాశాల ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తెచ్చా రు. సీఎం ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించడంతో కళాశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. -
సిబ్బందిపై సీరియస్
భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలం ఇందిరాక్రాంతి పథం కార్యాలయ పరిధిలో గల కొంతమంది సిబ్బంది సమాఖ్యల అభివృద్ధికి కేటాయించిన నిధులను కొల్లగొడుతున్నారనే విషయం తేటతెల్లమైంది. ఐకేపీ సిబ్బంది స్వాహా పర్వంపై ‘సాక్షి’లో వచ్చిన కథనాల నేపథ్యంలో విచారణకు వచ్చిన రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ చీఫ్ విజిలెన్స్ అధికారి రాజబాబు నేత్రుత్వంలోని బృందం శనివారం కూడా క్షేత్రస్థాయిలో పర్యటించింది. దుమ్ముగూడెం మండలానికి వెళ్లిన అధికారులకు మహిళా సమాఖ్య సభ్యులు ఐకేపీ సిబ్బంది తీరుతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్న విషయాన్ని గుర్తించిన చీఫ్ విజిలెన్స్ అధికారి రాజబాబు అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట లక్ష్మీనగరంలోని సమాఖ్య కార్యాలయాన్ని సందర్శించి ఐకేపీ ద్వారా సమాఖ్యల అభివృద్ధికి అమలు చే స్తున్న పథకాలపై సమీక్షించారు. ఈ పథకాలు సమాఖ్యల సభ్యులు ఏ విధంగా వినియోగించుకుంటున్నారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్త్రీనిధి ద్వారా పంపిణీ చేసిన రుణాలు, రికవరీ, పాడిగేదెల పంపిణీ, వాటి వినియోగం వంటి అంశాలపై వారితో చర్చించారు. ‘క్లస్టర్ పరిధిలో ఎంతమంది లబ్ధిదారులకు గేదెలు అందజేశారు.. వాటి ని ఎన్నిసార్లు తనిఖీ చేశావు’ అని క్లస్టర్ కో- ఆర్డినేటర్ శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. తాను వాటిని చూడలేదని సమాధానం చెప్పడంతో ఆయనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలా అయితే మీకు ఉద్యోగాలెందుకని మందలించారు. అనంతరం దుమ్ముగూడె ం గ్రామాన్ని సందర్శించి సమాఖ్య సభ్యులతో నేరుగా మాట్లాడారు. విద్యార్థులకు అందాల్సిన స్కాలర్షిప్పులు ఐకేపీ సిబ్బంది కాజేశారని శ్రీనగర్ కాలనీలో కొంతమంది మహిళలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో విజిలెన్స్ అధికారి రాజబాబు అక్కడే ఉన్న ఇన్చార్జి ఏపీఎం లక్ష్మీదుర్గ నుంచి వివరాలు తెలుసుకొని స్వాహా చేశారని నిర్ధారించుకుని అసహనం వ్యక్తం చేశారు. సుమారు రూ.19 వేలు వాడుకున్న సిబ్బంది ఇటీవలే వాటిని బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు వెల్లడైంది. అలాగే వెన్నెల గ్రూపునకు చెందిన మహిళలు ఐకేపీ సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు చేశారు. స్త్రీ నిధి కింద పావలా వడ్డీ రుణాలు ఇచ్చే సమయంలో ఒక్కో గ్రూపు నుంచి రూ.20 వేల వరకూ మినహాంచుకుంటున్నారని, ఈ విషమాన్ని అధికారుల దృష్టికి పలుమార్లు తెచ్చినా ఫలితం లేదని ఫిర్యాదు చేశారు. అనంతరం మండలంలోని డబ్ల్యూ రేగుబల్లి గ్రామాన్ని సందర్శించి మహిళా సమాఖ్య సభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత మణుగూరు మండల సమాఖ్య కార్యాలయాన్ని పరిశీలించి ఆరోపణలపై విచారణ జరిపారు. మొత్తంగా ఆయన వెళ్లిన ప్రతిచోటా మహిళా సమాఖ్యలు చేసిన ఫిర్యాదులు వాస్తవమేనని రుజువు కావడంతో ఐకేపీ సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఏపీడీ ఆర్.జయశ్రీ తదితరులు ఉన్నారు. చర్యలు తీసకుంటాం..రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా అమలయ్యే అన్ని రకాల పథకాలు సమాఖ్యలకు ఏ మేరకే అందుతున్నాయనే దానిపై పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నామని, అవకతవకలకు పాల్పడిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని రాజబాబు చెప్పారు. దుమ్ముగూడెంలో విలేకరులడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెపుతూ.. అన్ని రకాల కార్యక్రమాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. సమగ్ర నివేదిక అనంతరం తగిన చర్యలు ఉంటాయన్నారు. -
రాజబాబు హాస్యజగత్తులో చిరంజీవి
రాజమండ్రి కల్చరల్, న్యూస్‌లైన్ : తెలుగు సినీ జగత్తులో హాస్యం ఉన్నంత కాలం రాజబాబు మన హృదయాలలో చిరంజీవిగా ఉంటాడని రాజబాబు సోదరుడు చిట్టిబాబు అన్నారు. రాజబాబు 78వ జయంతి సందర్భంగా ఆదివారం ఉదయం గోదావరి ఒడ్డున గల ఆయన విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో చిట్టిబాబు మాట్లాడారు. నాటి హీరోలతో సమానంగా పారితోషికాన్ని అందుకున్న రాజబాబు మానవతావాది అని, ఆపదలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేశారని చిట్టిబాబు పేర్కొన్నారు. ‘మా’ అధ్యక్షుడు మురళీమోహన్ మాట్లాడుతూ ‘మా అందరికీ ఆయన అన్నవంటి వాడు, ఆదర్శ కళాకారుడు రాజబాబు. ఆయన హాస్యం అందరినీ అలరించేది’ అని పేర్కొన్నారు. రాజబాబు విగ్రహానికి గజమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పేదసాదలకు ఆహారం వితరణ చేశారు. రాజబాబు మేనల్లుడు కవివరపు శ్రీనివాస్, బాబులు, బాబి, రాజబాబు అభిమానులు పాల్గొన్నారు.