యథేచ్ఛగా గోవధ
యథేచ్ఛగా గోవధ
Published Fri, Jan 27 2017 12:08 AM | Last Updated on Tue, Sep 5 2017 2:11 AM
అనధికార కబేళాపై అధికారుల దాడి
కబేళాకు సిద్ధం చేసిన గోవులు స్వాధీనం
గోశాలకు తరలింపు
రామచంద్రపురం: ‘హృదయ విదారకమైన దృశ్యాలు.... పశువధలు,... పశుకళేబరాలు.. వ్యర్థ పదార్థాలు, దుర్భరమైన దుర్వాసన వస్తున్న ప్రదేశాలు... ఇదీ.. రామచంద్రపురం పట్టణంలోని రాజబాబు నగర్‌లోగల పరిస్థితి. కొంతకాలంగా కాలనీలో జరుగుతున్న అనధికార కబేళా అంశాన్ని గతంలో సాక్షి పలు సందర్భాల్లో ప్రచురించింది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అధికారులు, మీడియా సంయుక్తంగా దాడులు నిర్వహించగా అక్రమ పశువధలు కనిపించాయి. పట్టణంలోని రాజగోపాల్ సెంటర్‌కు కూత వేటు దూరంలో గల రాజబాబునగర్‌లో కొంత కాలంగా నిర్వహిస్తున్న అనధికార కబేళాపై తహసీల్దార్ పి.రామ్మూర్తి, కమిషనర్ సీహెచ్ శ్రీరామశర్మ, ఎస్సై నాగరాజు దాడులు నిర్వహించారు. రోడ్డు పక్కనే గల ఒక పాడు బడ్డ ఇంట్లో కబేళాకు తరలించేందుకు సిద్ధం చేసిన 11 ఆవులున్నాయి. సమీపంలో నాలుగు ఇళ్లలో కబేళా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఒక ఇంట్లో అప్పుడే పీక కోయబడిన గోమాతను అధికారులు గుర్తించారు. తాళాలు వేసి ఉన్న మరో మూడు ఇళ్లను తెరిచి చూడగా పశు కళేబరాలు, అవశేషాలు, చర్మాలు, ఎండబెట్టిన పేగులు కనిపించాయి. దీంతో పాటు డ్రెయిన్లలో రక్త కలిసిన నీరు ప్రవహించడాన్ని అధికారులు గుర్తించారు. ఈ అంశాలపై అధికారులు స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. కబేళాకు తీసుకువచ్చిన 11 ఆవులను రాజమండ్రిలోని గోశాలకు తరలిస్తున్నట్లు తహసీల్దార్ రామ్మూర్తి తెలిపారు. ఈ కబేళాపై పంచనామా నిర్వహించి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు కమిషనర్ సీహెచ్ శ్రీరామశర్మ తెలిపారు. అంతేకాకుండా ఆయా ఇళ్లలోని పశు వ్యర్థాలను, పేగులను, చర్మాలను తొలగించి పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయిస్తామని వివరించారు. స్థానికులు ఆరోగ్య పరిర„ý ణకు తమకు సహకరించాలని కమిషనర్ కోరారు. కబేళా నిర్వాహకులపై మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్సై నాగరాజు తెలిపారు.
Advertisement