ramachandrapuram
-
బాబు బాదుడుపై రామచంద్రపురం YSRCP నేతలు పోరుబాట
-
టీడీపీ, జనసేన అక్రమ మద్యం దందా..
-
జనసేన పార్టీ ఆఫీస్ ముందు కార్యకర్తల ఆందోళన
-
పోలీసు స్టిక్కర్ తగిలించి.. గంజాయి తరలించి
రామచంద్రాపురం (పటాన్చెరు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ ఏజెన్సీ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని బాలానగర్ ఎస్వోటీ, రామచంద్రాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ నరేందర్‌రెడ్డి అందించిన వివరాలివి. మహారాష్ట్ర బడ్లాపూర్‌కు చెందిన ధీరజ్ మున్నాలా డ్రైఫ్రూట్స్ వ్యాపారం చేస్తుంటాడు. అందులో సరైన ఆదాయం రాకపోవడంతో స్నేహితుడు ప్రశాంత్ సంజయ్ షిండేతో కలిసి విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి విక్రయించాలని నిర్ణయించాడు. ఇన్నోవా కారు అద్దెకు తీసుకొని ఇద్దరూ విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వినయ్ మండల్ ద్వారా కిలో రూ.3 వేల చొప్పున 58.5 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. వాటిని 39 ప్యాకెట్లుగా విభజించి కారులో పెట్టుకుని మహారాష్ట్రకు బయల్దేరారు. వీరు గంజాయి తరలిస్తున్నట్లు గురువారం సాయంత్రం బాలానగర్ ఎస్వోటీ పోలీసులు, రామచంద్రాపురం పోలీసులకు సమాచారం అందింది. దీంతో రామచంద్రాపురం పట్టణ పరిధిలోని ఇక్రిశాట్ వద్ద గంజాయి తరలిస్తున్న ఇన్నోవా వాహనాన్ని పట్టుకున్నారు. అందులో ఉన్న ధీరజ్ మున్నాలా జైస్వాల్, ప్రశాంత్ సంజయ్ షిండేలను అదుపులోకి తీసుకొని విచారించగా విషయం బయటపడింది. కాగా ఇన్నోవా వాహనానికి నంబర్ ప్లేట్ మార్చి, ముందు భాగంలో పోలీస్ స్టిక్కర్‌ను పెట్టుకొని గంజాయిని తరలిస్తున్నట్టు విచారణలో తేలింది. దాంతో వారి వద్ద నుంచి రూ.11 లక్షల 70 వేల విలువైన 58.8 కిలోల గంజాయిని, ఇన్నోవా కారు, డూప్లికేట్ నంబర్ ప్లేట్, కొడవలి, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
అడవిలో 15 కిమీ నడిస్తే గాని మా ఊరు రాదు..జగన్ వచ్చాకే మా జీవనం మెరుగ్గా..
-
మువ్వన్నెల పతాకమా.. అందుకో నా వందనం
రామచంద్రపురం రూరల్: దేశ స్వాతంత్య్రోద్యమ నేతల్లోని అగ్రగణ్యుల్లో ఒకరు.. ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి.. నేతాజీ సుభాష్‌చంద్రబోస్. ద్రాక్షారామ ప్రధాన రహదారిపై ఆయన విగ్రహం సైనిక దుస్తుల్లో ఠీవీగా సెల్యూట్ చేస్తూ నిలబడి ఉంటుంది. బోసు బొమ్మ సెంటర్‌గా పేరొందిన ఆ ప్రాంతంలో నేతాజీ విగ్రహం ఎదురుగా ద్రాక్షారామ పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యాన మంగళవారం జాతీయ జెండా ఎగురవేశారు. ఆ జెండాకు నేతాజీ సెల్యూట్ చేస్తున్నట్టుగా విగ్రహం వెనుక నుంచి పంచాయతీలో ట్యాంక్ వాచర్‌గా పని చేస్తున్న ఆకుల శ్రీనివాసరావు (ట్యాంకు శ్రీను) ఫొటో తీశారు. ఇది మంగళవారం బాగా వైరల్ అయ్యింది. ఈ ఫొటోను పలువురు తమ వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నారు. -
AP: పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి పాదపూజ
రామచంద్రపురం(కోనసీమ జిల్లా): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పాదాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శనివారం కడిగారు. దుశ్శాలువాలు, పూలమాలలు, నూతన వ్రస్తాలతో ఘనంగా సత్కరించారు. వీరితో పాటు పోలీసులు, వైద్యులను కూడా సన్మానించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛతకు భోగి, స్వేచ్ఛతకు సంక్రాంతి, సేవకు గుర్తుగా కనుమ పండుగ జరుపుకొంటారని తెలిపారు. చదవండి: పెళ్లయిన ఆ జంటలు.. ఇక ప్రత్యేక కుటుంబాలు -
అమరావతి పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్
సాక్షి, కోనసీమ: అమరావతి పేరిట చేపట్టిన పాదయాత్రకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బ్రేకులు పడ్డాయి. శనివారం ఉదయం రామచంద్రాపురం వద్ద అమరావతి యాత్ర నిలిచిపోయింది. హైకోర్టు ఆదేశాల మేరకు యాత్రలో పాల్గొన్న వారు.. గుర్తింపు కార్డులు ధరించి యాత్ర చేసుకోవాలని పోలీసులు సూచించారు. అయితే గుర్తింపు కార్డులు చూపించని నేపథ్యంలో యాత్ర నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో.. నాలుగు రోజులపాటు పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇవ్వాలనే నిర్ణయానికి యాత్రికులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అమరావతి పాదయాత్ర విషయంలో ఏపీ హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పాదయాత్రలో కేవలం 600 మంది మాత్రమే ఉండాలని, డీజీపీకి అందచేసిన జాబితాలో ఉన్న వ్యక్తులే పాల్గొనాలని స్పష్టం చేసింది. పాదయాత్రకు సంఘీభావం తెలపాలనుకునే వ్యక్తులు ఇరువైపులా ఉండి మద్దతు తెలపవచ్చని, అయితే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ యాత్రలో పాల్గొనడానికి వీల్లేదని ఆదేశించింది. ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. దీనివల్ల అసాంఘిక శక్తులతో శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారంటూ పిటిషనర్లు వ్యక్తం చేస్తున్న ఆందోళన తొలగిపోతుందని పేర్కొంది. -
అమరావతి పాదయాత్రకు రామచంద్రపురం లో నిరసన సెగ
-
లాడ్జిలో వ్యభిచారం.. వేర్వేరు రూమ్‌ల్లో రెండు జంటలు.. షాకిచ్చిన పోలీసులు
రామచంద్రపురం(కోనసీమ జిల్లా): పట్టణంలోని ఎస్ఎస్ గ్రాండ్ లాడ్జిలో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో సీఐ వి.శ్రీనివాస్ నేతృత్వంలో పోలీసులు దాడి చేసి వేరు వేరు రూమ్‌లలో వ్యభిచారం చేస్తున్న ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. లాడ్జి యజమాని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, లాడ్జిలో పనిచేసే వీరబాబును అరెస్టు చేసినట్లు రామచంద్రపురం ఎస్ఐ డి.సురేష్‌బాబు గురువారం విలేకరులకు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. చదవండి: కోడి గుడ్డు తింటే ఏం జరుగుతుందో తెలుసా? -
బండెనక బండికట్టి..
రామచంద్రపురం: ప్రకృతి విపత్తులు, తెగుళ్ల మూలంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అత్యధికంగా పంటల బీమాను అందజేస్తుండటాన్ని పురస్కరించుకుని కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో అన్నదాతలు మంగళవారం వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపారు. 500 ట్రాక్టర్లతో 22 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గంలో గత ఖరీఫ్ సీజన్లో తుపాను వల్ల రైతులు అత్యధికంగా నష్టపోయారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రత్యేకంగా అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఈనేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గతంలో ఎన్నడూ రాని విధంగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద ఈ నియోజకవర్గానికి రూ.130 కోట్లు విడుదలయ్యాయి. దీంతో రైతులు కె.గంగవరం మండలం పామర్రు నుంచి గొల్లపాలెం వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. కష్టకాలంలో ప్రభుత్వం తమకు అండగా నిలిచిందని కొనియాడారు. మంత్రి తనయుడు నరేన్ ఈ ర్యాలీని ప్రారంభించారు. -
మనసు ‘దోశ’కున్న మంత్రి వేణు
రామచంద్రపురం(కోనసీమ జిల్లా): బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శనివారం ఉదయం రామచంద్రపురంలో నడుచుకుంటూ తిరిగారు. ఖుర్ఫాన్ హోటల్ వద్ద ఆగి కష్టం సుఖం మాట్లాడారు. తానే స్వయంగా పెనం మీద దోశ వేశారు. టీ తాగుతూ అక్కడ ఉన్న వారితో కాసేపు మాట్లాడారు. చదవండి👉: నాటుకోడి పులుసు.. రాగిముద్ద.. ఆహా ఆ రుచే వేరు.. పుంజు రూ.5 వేలు! -
చదువులమ్మకు చక్కనైన గుడి.. కృత్తివెంటి పాఠశాల
రామచంద్రపురం: దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపు దిద్దుకుంటుందన్న మాటకు సజీవసాక్ష్యంగా నిలుస్తుంది ఆ పాఠశాల. ఎంతోమంది విభిన్న రంగాల్లో రాణించడానికి ఇక్కడే పునాది పడింది. అదే రామచంద్రపురంలోని శత వసంతాల సరస్వతీ నిలయం.. కృత్తివెంటి పేర్రాజు పంతులు జాతీయోన్నత పాఠశాల. ఈ పాఠశాల వార్షికోత్సవం ఆదివారం జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.. పునాదిరాళ్లు పడ్డాయిలా.. కృష్ణా జిల్లా మచిలీపట్నం చెంతన ఉన్న కృత్తివెన్ను గ్రామానికి చెందిన కృత్తివెంటి కృష్ణారావు కుమారుడు పేర్రాజు పంతులు 1852లో కాకినాడలో జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాదిగా స్థిరపడిన ఆయన ఒక కేసు వాదించేందుకు రామచంద్రపురం వచ్చారు. ఆ కేసు విషయంలో నిరక్షరాస్యులైన ఇద్దరు అన్నదమ్ములు తీరు ఆయను కలచివేసింది. గుర్రపు బగ్గీలో కాకినాడ తిరిగి వెళ్తూ.. తన బంట్రోతుతో పేర్రాజు పంతులు ‘‘కాటన్ దొర ఆనకట్ట కట్టారు. దీనివల్ల ఈ ప్రాంతంలో పంటలు పండుతున్నాయి. కానీ దానితో సమానంగా ఇక్కడి వారి బుర్రలు మాత్రం పెరగడం లేదు. నాడు : 1906 ప్రాంతంలో పాఠశాల ఇలా.. విద్య లేని విత్తం అనర్థదాయకం. ఇక్కడొక పాఠశాల ఉంటే బాగుండును’’ అని అన్నారట. ఇందులో భాగంగానే ఆయన 1905లో జాతీయ పాఠశాల పేరుతో రామచంద్రపురంలో మిడిల్ స్కూల్‌ను స్థాపించారు. 1910 వరకూ ఆయనే పర్యవేక్షించే వారు. తరువాత 1920 వరకూ జిల్లా బోర్డు నియమించిన కమిటీ, 1921 – 1969 మధ్య జిల్లా బోర్డు ఈ పాఠశాలను పర్యవేక్షించేవి. తొలి ప్రధానోపాధ్యాయునిగా వీఎస్ రామదాసు పంతులు నియమితులయ్యారు. అప్పట్లో ఇక్కడ 4 నుంచి 8వ తరగతి వరకూ బోధించేవారు. ఆలమూరు, అనపర్తి, వేళంగి, కోటిపల్లి తదితర సుదూర గ్రామాల నుంచి విద్యార్థులు వచ్చి ఈ స్కూల్లో చేరారు. ఎంతోమంది కృషితో.. ఆరంభంలోనే అందరినీ ఆకట్టుకున్న ఈ మిడిల్ స్కూల్ 1906లో ఉన్నత పాఠశాలగా రూపాంతరం చెందింది. దీనికి పేర్రాజు పంతులు 94 ఎకరాల 21 సెంట్ల భూమిని దానం చేసి, పాఠశాల అభివృద్ధికి వినియోగించాలని స్పష్టం చేశారు. 1909 తరువాత వచ్చిన సీకే గోవిందరావు సుమారు 23 ఏళ్ల పాటు ప్రధానోపాధ్యాయునిగా పని చేసి కృత్తివెంటి పాఠశాల శిల్పిగా చరిత్రలో నిలిచిపోయారు. పాఠశాల రజతోత్సవాన్ని పూర్తి చేసి, స్వర్ణోత్సవ కాలానికి అంకురార్పణ చేసిన గోవిందరావును ఆర్నాల్డ్‌తో పోల్చారు. దినదినాభివృద్ధి చెందుతూ వచ్చిన ఈ పాఠశాల.. పూర్వ విద్యార్థి, ఎమ్మెల్యే అయిన నందివాడ సత్యనారాయణరావు, అప్పటి మున్సిపల్ చైర్మన్ అడ్డూరి పద్మనాభరాజుల కృషితో కృత్తివెంటి పేర్రాజు పంతులు జాతీయోన్నత పాఠశాలగా మారింది. పాఠశాలకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చిన సందర్భంలో.. కపిలేశ్వరపురం జమీందార్ ఎస్‌బీపీబీకే సత్యనారాయణరావు కృషితో 1969లో జూనియర్ కళాశాలగా ఆవిర్భవించింది. ఇంకా పూర్వ విద్యార్థులైన శ్రీ రాజా కాకర్లపూడి రాజగోపాల నరసరావు, రాజా రామచంద్ర బహుద్దూర్, అడ్డూరి పద్మనాభరాజు, నందివాడ సత్యనారాయణరావు, చుండ్రు శ్రీహరిరావు తదితరుల కృషితో కృత్తివెంటి విద్యాసంస్థలు ఎంతో అభివృద్ధి చెందాయి. 2006లో శత వసంతాలను పూర్తి చేసుకుంది. 2009లో శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గానికి తొలి మంత్రి అయిన ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పాఠశాలను సందర్శించారు. తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. వైఎస్సార్ హయాంలోనే కృత్తివెంటి ఉద్యాన పాలిటెక్నిక్, కృత్తివెంటి వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హయాంలో కృత్తివెంటి డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు. సినీ ప్రముఖులు మిత్తిపాటి కామేశ్వరరావు (గులేబకావళి కథ ఫేం), మాస్టర్ రాజు (తెనాలి రామకృష్ణ ఫేం), ఫొటోల నారాయణస్వామి (వింధ్యారాణి ఫేం), ప్రముఖ సంగీత దర్శకుడు జేవీ రాఘవులు, క్యారెక్టర్ నటుడు రాళ్లపల్లి, ప్రఖ్యాత ఛాయాగ్రాహ దర్శకుడు చోటా కె. నాయుడు, మెజీషియన్ బీవీ పట్టాభిరామ్, ఇంకా రావులపర్తి భద్రిరాజు, ఇంద్రగంటి శ్రీకాంత్‌శర్మ, పైడిపాల, ప్రముఖ సినీ గేయ రచయిత అదృష్ట దీపక్, వైణిక విద్వాంసుడు ద్విభాష్యం నగేష్‌బాబు, వెదురుపాక విజయదుర్గా పీఠం గాడ్... వీరే కాకుండా రాజవంశానికి చెందిన రాజగోపాల నరసరావు, రాజ బహుద్దూర్ రామచంద్రరాజు, రాజా గోపాలబాబు, నందివాడ సత్యనారాయణరావు వంటి వారెందరో ఇక్కడే విద్యనభ్యసించారు. ఎంతో ఖ్యాతి.. ► కృత్తివెంటి పేర్రాజు పంతులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం కల్పించారు. ఆయన దానం చేసిన కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా మైదానం రామచంద్రపురం నడిబొడ్డున ఉంది. ఇక్కడి నుంచి ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు తయారయ్యారు. కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణం బాస్కెట్‌బాల్‌కు అంతర్జాతీయ స్ధాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నాటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ హయాంలో జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ► ఈ పాఠశాలలో మధురకవి ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి తదితర ఎంతో మంది ప్రముఖులు అధ్యాపకులుగా సేవలందించారు. ► భారత స్వాంతంత్య్ర ఉద్యమంలో తన ప్రాణాన్ని అర్పించిన విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు ఈ స్కూలులో 6వ తరగతి చదివారు. -
జ్ఞాపకాల ‘సిరి’.. ఆ రెండు చిత్రాలూ ఆణిముత్యాలే..
1970, 80లలో ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలని తపనతో నిర్మాతలు, దర్శకులు పని చేసేవారు. భక్తి రసం, కళాత్మకం, సందేశాత్మకం ఇలా ఏదో ప్రత్యేకతతో సినిమా తీసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ఉండేది. ఇప్పుడు పూర్తిగా వ్యాపార దృక్పథంతోనే చిత్రాలు తీస్తున్నారు. సినిమాలు తీయడానికి రూ.కోట్లలో ఖర్చు అవుతున్నా ఆడించేందుకు థియేటర్లు ఉండటంలేదు. రామచంద్రపురం: తెలుగు సినీరంగంలో గుర్తుండిపోయే రెండు చిత్రాల నిర్మాణ సారథ్యంలో ఆయన పాలుపంచుకున్నారు. ఆ రెండు సినిమాలూ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొంది అపూర్వ విజయాలు సాధించినవే.. చిరస్మరణీయ చిత్రాలైన సిరివెన్నెల, సిరిసిరిమువ్వ చిత్రాల నిర్మాతల్లో ఒకరు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన ఊజూరి వీర్రాజు.. ఈ రెండు సినిమాలూ ఆఖండ విజయభేరి మోగించినా తర్వాత ఆయన మరో సినిమా జోలికి పోలేదు. 76ఏళ్ల వీర్రాజుకు ఒక అబ్బాయి..నలుగురు అమ్మాయిలు ఉన్నారు. తనను సినిమా నిర్మాణం వైపు అడుగులు వేయించిన పరిస్థితులను ఆయన సాక్షితో పంచుకున్నారు. తన జీవితంపై చెరగని ముద్ర వేసిన ఆ సినిమాల గుర్తులు తన గుండెలో ఎప్పటికీ పదిలంగాఉంటాయంటారాయన. రాజస్దాన్‌లో షూటింగ్ అనంతరం సిరివెన్నెల చిత్రం బృందం అంగరతో స్నేహమే నడిపించింది.. రామచంద్రపురంలో మాకు మార్కేండేయ ఇంజినీరింగ్ వర్క్ షాపు ఉండేది. సిని నిర్మాత అంగర సత్యం నేను స్నేహితులం..కలిసి చదువుకున్నాం. ఆయన తరచూ మా వర్క్‌షాప్ వద్దకు వచ్చేవారు. ఈయన ద్వారా పూర్ణోదయ క్రియేషన్స్ సంస్థ అధినేత ఏడిద నాగేశ్వరరావు పరిచయమమ్యారు. వీరు మా షెడ్డు వద్దే సినిమా ప్లాన్ల గురించి చర్చించుకునేవారు. అప్పుడే నా మనసు సినిమా నిర్మాణం వైపు మళ్లింది. 1975లో అంగర సత్యంతో కలిసి తమిళ వెర్షన్ ‘‘తిరుమల దైవం’’ సినిమాను శ్రీవెంకటేశ్వర కల్యాణంగా డబ్ చేసి నిర్మించాం. రూ. 2 లక్షల వరకూ ఖర్చయింది. రూ.1లక్ష లాభం వచ్చింది. తరువాత రెండు మూడు సినిమాలు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేశాం. ఏడిద నాగేశ్వరరావు డైరెక్ట్ సినిమాకు ప్లాన్ చేద్దామన్నారు. 1976లో దర్శకులు కె విశ్వనాథ్ వద్దకు వెళ్లాం. నా క్లాస్మేట్ నల్లమిల్లి భాస్కర్‌రెడ్డితో కలిసి సిరిసిరిమువ్వ సినిమాను నిర్మించాలనుకున్నాం. రూ. 3లక్షలు అవుతుందని ఏడిద నాగేశ్వరరావు నన్ను ఒప్పించారు. రూ 13లక్షలయ్యింది. డిస్ట్రిబ్యూటర్స్ సహాయ పడ్డారు. నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ సగం పెట్టుబడి పెట్టి వెనక్కి వెళ్లిపోయారు. సినిమా కథ.. దర్శకుని మీద నమ్మకంతో అప్పులు చేసి సినిమా తీశాం. సినిమా పెద్ద హిట్ అయ్యింది. మాకు రూ.కోటి వరకు లాభమొచి్చంది. ఈ సినిమా హక్కులు మాకే ఉన్నాయి. దీనిపై ఇప్పటికీ ఎంతోకొంత డబ్బులు వస్తూనే ఉన్నాయి. సిరిసిరిమువ్వ ఎక్కువ సార్లు రిలీజ్ చేశాం. 1978లో శంకరాభరణం తీద్దామని అనుకున్నా కుదరలేదు. అదే సమయంలో రామచంద్రపురంలో గీతా థియటర్ నిర్మాణంలో ఉండటంతో అవకాశం మిస్సయ్యాను. ప్రముఖులకు దగ్గరయ్యా.. ‘‘ సిరిసిరి మువ్వ సినిమా చాలా వరకు రామచంద్రపురం పరిసరాల్లోనే చిత్రీకరించాం. ఇక్కడి వాళ్లు చాలా మంది అందులో నటించారు. అప్పట్లో ఇక్కడ బస చేయటానికి సరైన వసతులుండేవి కావు. దర్శకులు కె విశ్వనాథ్‌తో పాటు చంద్రమోహన్, జయప్రద వంటి నటులను మా స్నేహితుల ఇళ్లలోనే ఉంచేవాళ్లం. ఈ సినిమాకు జాతీయ స్ధాయిలో రెండు, రాష్ట్ర స్ధాయిలో 6 అవార్డులను అందుకున్నాం. విశ్వనాథ్, వేటూరి, కనకాల దేవదాసులాంటి వారికి దగ్గరయ్యాను. పదేళ్ల గ్యాప్ తర్వాత 1986లో మళ్లీ విశ్వనాథ్‌గారితో కలిసి సిరివెన్నెల సినిమా నిర్మించాం. సందేశాత్మక చిత్రంగానే విడుదల చేశాం. నిర్మాణ సందర్భంలో మా చిత్రం హిట్ అవ్వదని.. డబ్బులు రావని విమర్శలు వినిపించేవి. కానీ డబ్బులు గురించి ఆలోచించలేదు. సందేశంతో కూడిన కళాత్మకమైన చిత్రం అందించాలనే భావించాం. దీనికి కూడా అవార్డుల పంట పండింది. ఇందులో సీతారామశాస్త్రి రాసిన పాటలు పెద్ద హిట్ అయ్యాయి. ఆ చిత్రమే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ఆయన పేరు విన్నప్పుడల్లా గర్వంగా..ఆనందంగా ఉంటుంది. బాలకృష్ణ, ఏ కోదండరామిరెడ్డిలతో, స్వాతి ముత్యం తరువాత కమలహాసన్‌తో సినిమాలకు ప్లాన్ చేసినా కుదరలేదు. విశ్వనాథ్‌గారితో పరిచయంతో స్వాతికిరణం, స్వాతిముత్యం, శుభసంకల్పం చిత్రాలకు పనిచేశాను. రామచంద్రపురంలో తీసిన ప్రతి చిత్రానికి వెనకుండి సహకరించేవాడ్ని. ఇప్పటికీ సినిమా మీద మక్కువ పోలేదు. రామచంద్రపురంలో ఏదైనా సినిమా షూటింగ్ చేస్తే కచ్చితంగా నన్ను సంప్రదిస్తుంటారు. నాటి సినిమా జ్ఞాపకాలు నేటికి గుర్తుకు వస్తునే ఉంటాయి. హిందీలో సర్గమ్(సిరిసిరిమువ్వ) కోసం మద్రాసు నుంచి బెంగళూరుకు హిందీ నటి రేఖను విమానంలో తీసుకువచ్చే బాధ్యతను నాకు పురమాయించారు. అప్పుడు టిక్కెట్ ధర రూ250. ఎంతో పేరున్న హిందీ హీరోయిన్ రేఖను తీసుకువస్తుంటే అందరి మావైపే చూశారు. సినిమా తీశాక ఆర్థిక పరంగా ఎలా ఉన్నా సంతృప్తి అనేది మిగిలి ఉంటుంది. సిరిసిరి మువ్వ, సిరివెన్నెల నిర్మాతలలో ఒకడిగా నా జన్మకు సరిపడా సంతృప్తి మిగిలింది. సిరిసిరిమువ్వ తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, కన్నడ భాషలతో పాటుగా అమెరికా, మాస్కో వంటి దేశాలలోనూ పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. నేటికి ఆ సినిమా సంఘటనలు తీపి గుర్తులే. -
తాగి..పాముతో తందనాలాడాడు
రామచంద్రాపురం: మెడలో ఆరడుగుల పామును వేసుకుని ప్రజలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేశాడొక యువకుడు. శుక్రవారం సాయంత్రం రామచంద్రాపురంలోని భారతీనగర్ చౌరస్తాలో ఈ సంఘటన జరిగింది. దాదాపు గంటకుపైగా ఆ యువకుడు పాముతో ప్రజలను బెంబేలెత్తించాడు. బీహెచ్ఈఎల్ టౌన్షిప్లో దేవాలయం ముందు భిక్షాటన చేసే యువకుడు మహేశ్ శుక్రవారం మద్యం తాగి నాగుపామును మెడలో వేసుకుని బయల్దేరాడు. బెల్ టౌన్ షిప్ లోపలి నుంచి ఎల్ఐజీ చౌరస్తా (భారతీనగర్) వరకు వచ్చాడు. రోడ్డుపై అందరినీ బెదిరిస్తూ డబ్బులు అడిగాడు. దీంతో స్థానికులు పోలీసులు, పాములు పట్టే వారికి సమాచారం అందించారు. పాములు పట్టే వారు వచ్చి ఆ పామును స్వాధీనపరచుకున్న వెంటనే స్థానికులు కొందరు కోపంతో యువకుడిపై దాడికి దిగారు. పోలీసులు చేరుకుని మహేశ్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకుపోయారు. ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. -
తిరుపతి రాయల చెరువుకు లీకేజీ.. ఏ క్షణానైనా కట్ట తెగిపడే అవకాశం
సాక్షి, చిత్తూరు: ఏపీలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాయలసీయలో వానలు ఎన్నడూలేని విధంగా అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. తాజాగా భారీ వర్షాలతో తిరుపతి రామచంద్రాపురంలోని రాయల చెరువు కట్టకు స్వల్ప గండి పడటంతో వరద నీరు లీకవుతోంది. చెరువు కట్ట నుంచి కొద్దికొద్దిగా జారుతోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు సమీప ప్రజలు పరుగులు తీస్తున్నారు. ఒకవేళ రాయల చెరువు తెగితే సుమారు వంద పల్లెలకు ముంపు ప్రమాదం పొంచి వుందని అధికారులు చెబుతున్నారు. చదవండి: Heavy Rains, Floods: సీఎం జగన్ కీలక ఆదేశాలు దీంతో చెరువు దిగువన పల్లెలను అధికారులు అప్రమత్తం చేశారు. అంతేగాక రాయల చెరువు మార్గంలో వాహన రాకపోకలు నిలిపివేశారు. సంతబైలు, ప్రసన్న వెంకేటశ్వరపురం, నెన్నూరు, గంగిరెడ్డిగారిపల్లి, సంజీవరాయపురం, కమ్మపల్లి, గొల్లపల్లె, కమ్మకండ్రిగ, నడవలూరు,వెంకట్రామపురం, రామచంద్రాపురం, మెట్టూరులో ప్రజలను అప్రమత్తం చేశారు. పల్లెలు ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హరినరయన్ తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు అక్కడే పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. -
కూతురు బాధ చూడలేఖ.. ఓ తండ్రి ఆత్మహత్య
సాక్షి, రామచంద్రపురం రూరల్: కూతురు జీవితం పెళ్లి పేరుతో నాశనమైందనే వేదనతో ఓ తండ్రి లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ద్రాక్షారామకు చెందిన తలపాగల శ్రీనివాసరావు(61) ఫొటో స్టూడియో నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈయన బీఫార్మసీ చదువుకున్నారు. భార్య సుజాత, కుమారుడు భవాని శంకర్, కూతురు ఈశా మాలిని ఉన్నారు. గతేడాది డిసెంబరులో మాలినికి వివాహం ఏలూరు సమీపాన ఫతేబాదకు చెందిన కారుపర్తి గౌతంకుమార్‌తో జరిపించారు. రూ.2 లక్షలు నగదు, 15 కాసులు బంగారం కట్నంగా అందజేశారు. అయితే పెళ్లయిన మర్నాటి నుంచే మాలినికి వేధింపులు మొదలయ్యాయి. కట్న కానుకల కోసం వేధించడంతో మాలిని పుట్టింటిలోనే ఉండిపోయింది. తండ్రి శ్రీనివాసరావు కలత చెందేవారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినా అరెస్టులు జరగలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం అతను ఆత్మహత్య చేసుకోవాలని భావించి పాయిజన్ ఇంజక్షన్ చేసుకున్నట్లు సమాచారం. చదవండి: (విషాదం: పెళ్లి విషయంలో ధైర్యం చూపారు.. బతికే విషయంలో తెగువ చూపలేక..) అనంతరం భార్యతో కలసి ద్రాక్షారామ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ ఎస్సై తులసీరామ్‌ను కలసి కుమార్తె కేసు విషయమై మాట్లాడుతూ పడిపోయారు. వెంటనే ఆయనను స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రికి పంపించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారించారు. తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులకు శ్రీనివాసరావు దస్తూరీతో లేఖ కనిపించింది. అల్లుడు గౌతమ్‌కుమార్, అతని తల్లిదండ్రులతోపాటు మిగిలిన కుటుంబ సభ్యులు కట్న, కానుకల కోసం వేధించారని లేఖరో పేర్కొన్నారు. అందరి పేర్లు రాస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సోదరితోపాటు బావ గురించి కూడా లేఖలో శ్రీనివాసరావు ప్రస్తావించారు. మరో అమ్మాయికి ఇలాంటి బాధ రాకూడదని రాశారు. -
ఏపీ: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి
రామచంద్రపురం: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. రామచంద్రపురం పురపాలక పరిధిలోని చాకలిపేట మున్సిపల్ హైస్కూల్‌ను మంత్రి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో నాడు–నేడు పనులను పరిశీలించారు. విద్యాకానుక కిట్ల పంపిణీపై ఆరా తీశారు. జగనన్న గోరుముద్ద పథకం అమలు తెలుసుకునేందుకు స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. విద్యార్థులకు వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. నాణ్యతైన ఆహారం అందిస్తున్నారని సిబ్బందిని అభినందించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రోడ్ల దుస్థితికి నాటి టీడీపీ ప్రభుత్వమే కారణమని ఆయన విమర్శించారు. నాణ్యతకు తిలోదకాలిచ్చిన రోడ్ల నిర్మాణాలు మూడేళ్లు తిరగకుండా ధ్వంసమయ్యాయన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.5 వేల కోట్లతో రోడ్ల మరమ్మతులు చేయాలని ఆదేశించారన్నారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్పర్సన్ గాధంÔð ట్టి శ్రీదేవి, వైస్ చైర్మన్లు కోలమూరి శివాజీ, చింతపల్లి నాగేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిల్ విప్ వాడ్రేవు సాయిప్రసాద్, కో ఆప్షన్ సభ్యులు గుబ్బల గణ, పట్టణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గాధంశెట్టి శ్రీధర్ తదితరులున్నారు. ఇవీ చదవండి: బుల్లెట్ బండికి బామ్మ స్టెప్పులు.. వామ్మో ఏ చేసింది రా బాబు ! అందగత్తెకు మత్తు మరక.. మళ్లీ తెరపైకి ప్రముఖ యాంకర్ -
రోడ్డు దాటుతున్న కుటుంబాన్ని వేగంగా ఢీ కొట్టిన టూ వీలర్
-
మాజీ ప్రియుని హత్య.. మహిళ, రెండవ ప్రియుడు అరెస్టు
సాక్షి, బెంగళూరు: ఈ నెల 5వ తేదీన తాలూకా రామచంద్రపురం అటవీ ప్రాంతంలో ఘజైల్‌ఖాన్ అనే వ్యక్తి హత్య కేసులో నిందితులను రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు హిందూపురం తాలూకా మద్దిపి గ్రామానికి చెందిన ప్రమీళ (26), ఆమె రెండవ ప్రియుడు సురేశ్ (27)లు. ప్రమీళ భర్తను వదిలేసి మొదట్లో హిందూపురంవాసి, ఆటోడ్రైవర్ ఘజైల్ ఖాన్ అలియాస్ సుహేల్ (24)తో సహజీవనం చేసేది. అతనితో గొడవలు రావడంతో సురేశ్‌కు దగ్గరైంది. అయినా ఘజైల్‌ఖాన్ ఆమెను వేధిస్తుండడంతో సురేశ్‌తో కలిసి రామచంద్రపురం అటవీప్రాంతానికి పిలిపించి హత్య చేసింది. శనివారం రాత్రి నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. టిప్పర్ ఢీకొని మృతి క్రిష్ణగిరి: బిహార్ రాష్ట్రానికి చెందిన రాజేష్‌కుమార్ (44) సూళగిరి దిగువపేటలో నివాసముంటూ టైల్స్ వ్యాపారం చేసేవాడు. శనివారం రాత్రి ద్విచక్రవాహనంలో వెళ్తుండగా సూళగిరి సమీపంలోని పవర్‌గ్రిడ్ వద్ద టిప్పర్ లారీ ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సూళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: రాత్రి భోజనం చేసి నిద్రపోయింది.. ఉదయం లేచి చూసేసరికి.. -
బయట బిర్యానీ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
సాక్షి, రామచంద్రపురం: బిర్యానీ, నూడిల్స్, చికెన్ జాయింట్లు, మటన్ ధమ్ బిర్యానీ, పిజ్జాలు, బర్గర్లు, స్వీట్లు, పప్పులు, పాలు, నీళ్లు ఇలా కల్తీకి కాదు ఏదీ అనర్హం అన్నట్టు ఉన్నాయి. ఆహార పదార్థాల తయారీలో అక్రమాలకు పాల్పడడంతో ప్రజారోగ్యం దెబ్బతింటోంది. ఇటీవల కాలంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హోటల్స్‌లో సేల్స్ పెరగటంతో ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టి తయారీలో విచ్చలవిడిగా ఎసెన్సులు, ఇతర రంగులను వాడుతున్నారు. ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసిన ప్రభుత్వం వాటిని అరికట్టేందుకు సిద్ధమైంది. ఇటీవల ఆహార పదార్థాల కల్తీ నియంత్రణ అధికారులు హోటల్స్, సూపర్ మార్కెట్లు, బేకరీల్లో నిర్వహిస్తున్న ఆకస్మిక దాడుల్లో విచ్చలవిడి రంగుల వాడకం బయట పడింది. లెసెన్స్‌లు లేకుండా నిర్వహణ ఆహార పదార్థాలు తయారు చేసేవారు, నిల్వ చేసే వ్యాపారస్తులు, రవాణా చేసే సంస్థలు లైసెన్స్‌లు తీసుకోవాలి. ఆహార భద్రతా నియమావళి ప్రకారం లైసెన్సులు లేకుండా వ్యాపారం చేస్తే సెక్షన్ 63 ఎఫ్ఎస్ఎస్సీ యాక్ట్ 2006 ప్రకారం కేసులు నమోదు చేసి రూ. 5లక్షల జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధిస్తారు. జిల్లాలో గల ఆహార పదార్థాల అమ్మకాలు, రవాణా, నిల్వ చేసే వ్యాపార, వాణిజ్య సంస్థలు 75శాతం లైసెన్సులు లేకుండానే నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. రంగులు కలిపిన బిర్యానీ శాంపిల్స్‌ను తీస్తున్న ఫుడ్ కంట్రోల్ జాయింట్ కమిషనర్ పూర్ణ చంద్రరావు విస్తృతంగా దాడులు ఆహార కల్తీ నియంత్రణ అధికారులు విస్త్రృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. మండపేట, రామచంద్రపురం పట్టణాల్లో హోటల్స్, సూపర్ మార్కెట్లపై దాడులు నిర్వహించగా ఆహార భద్రతా నియమాళికి విరుద్ధంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. 90శాతం హోటల్స్ లైసెన్సులు లేకుండా వ్యాపారం చేస్తున్నట్లు వెలుగు చూసింది. 30కిపైగా చికెన్, పప్పులు, నిల్వ మాంసం, బిర్యానీ, వంటకాల్లో వాడుతున్న కలర్స్ వంటి వాటి శాంపిల్స్‌ను సేకరించిన అధికారులు పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లో ల్యాబ్‌కు పంపించారు. 15రోజుల్లో ఫలితాలు రానున్నాయి. వీటిని బట్టి ఆయా షాపులు, హోటల్స్‌పై చర్యలు తీసుకొంటారు. నిల్వ మాంసంతో సమస్యలు చికెన్, మటన్, బిర్యానీ, బేకరీల్లోను, స్వీట్స్ తయారీల్లోను ఎసెన్స్, సింథటిక్ రంగులు అధికంగా వేస్తుండటంతో క్యాన్సర్ వంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. హోటల్స్‌లో చికెన్, మటన్, రొయ్యలు ఎక్కువ రోజులు డీప్ ఫ్రిజ్‌లో ఉంచి వాడుతున్నారు. నిల్వ మాసం తింటే అజీర్తి సమస్యలు, ముఖ్యమైన అవయవాలు పనిచేయకపోవటం వంటి సమస్యలు వస్తాయి. -
క్వారి గుంతలో దూకి తల్లి, ఇద్దరు చిన్నారులు ఆత్మహత్య
-
ఇది గోదారోళ్ల డ్రింకండీ.. దీని టేస్ట్ సూపరండీ బాబూ..
ఆర్టోస్.. ఇది పక్కా లోకల్.. ఈ సాఫ్ట్ డ్రింకు ఒక్కసారి తాగితే చాలు.. జిహ్వ ‘వహ్వా’ అనక మానదు. ఆ రుచి మళ్లీ మళ్లీ కావాలని కోరకా మానదు. ‘రామచంద్రపురం రాజుగారి డ్రింకు’గా పేరొందిన ఈ శీతల పానీయం గురించి తెలియనివారే ఈ ప్రాంతంలో ఉండరంటే అతిశయోక్తి కానేకాదు. కార్పొరేట్ కూల్‌డ్రింక్ కంపెనీలు ఎన్ని వచ్చినా.. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం ‘ఆర్టోస్’ వందేళ్లకు పైగా తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. ఈ ఉగాది సందర్భంగా విస్తరణ బాట పట్టిన ఈ సంస్థ.. మరిన్ని రుచులతో సరికొత్త డ్రింకులు తయారు చేసేందుకు శ్రీకారం చుట్టింది. రామచంద్రపురం: ‘ఏంటీ గోలీ సోడానా? అయ్యబాబోయ్! ఎవ్వరూ తాగకండి. అందులో భూతం ఉంది’ అంటూ ఒకప్పుడు అందులో నుంచి వచ్చే గాలికి జనం హడలిపోయే స్థాయి నుంచి.. ‘ఆర్టోసా! ఏదీ మరోటి ఇవ్వండి తాగుతాం’ అనే స్థాయిలో ఆర్టోస్ సాఫ్ట్ డ్రింక్ ప్రాచుర్యం పొందింది. దేశంలో ఎక్కడ ఏ డ్రింకులు తాగినా.. గోదావరి సీమకు వచ్చేసరికి మాత్రం ఆర్టోస్ తాగి వెళ్లాల్సిందే. అచ్చం ద్రాక్ష పండ్ల మాదిరిగానే ఉండే దాని రుచి చూడాల్సిందే. మూడు తరాల కృషి ఆర్టోస్ పరిశ్రమ ఈ స్థాయికి రావడం వెనుక మూడు తరాల కృషి ఉంది. రామచంద్రపురం పట్టణానికి చెందిన అడ్డూరి రామచంద్రరాజు కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో వృథాగా పడి ఉన్న గోలిషోడా మెషీన్‌ను 1912లో కొనుగోలు చేశారు. దానిని ఇక్కడికి తెచ్చి, విశాఖపట్నం పోర్టు ద్వారా ఇంగ్లండ్ నుంచి స్పేర్ పార్టులు తెప్పించి, మరమ్మతులు చేయించారు. ఆ మెషీన్‌తో పట్టణంలో గోలీసోడా తయారీకి శ్రీకారం చుట్టారు. అప్పట్లో గోలీసోడా ద్వారా వస్తున్న గ్యాస్‌ను చూసి ప్రజలు దానిలో భూతం ఉందని, ఎవ్వరూ తాగకూడదని చెప్పుకొనేవారు. దీంతో అప్పట్లో అంతంత మాత్రంగానే సోడాలు అమ్ముడు పోయేవి. అప్పట్లో రాజుగారు ఒక్కరే వెల్ల ప్రాంతం నుంచి తాగునీరు తెచ్చుకుంటూ సోడాలు తయారు చేసేవారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో పట్టణంలో సేద తీరేందుకు వచ్చిన బ్రిటిష్ మిలిటరీ సైనికులకు ఈ గోలీసోడాను అందించేవారు. దీంతో ఇది మరింత ప్రాచుర్యం పొందింది. 1919లో రామచంద్రరాజు తమ్ముడు జగన్నాథరాజు తన చదువు ముగించుకున్న అనంతరం అప్పట్లో మద్రాసులో ప్రాచుర్యం పొందిన స్పెన్సెన్స్ డ్రింక్ తాగి, అటువంటి సాఫ్ట్ డ్రింక్ తయారు చేయాలని భావించారు. ఈ నేపథ్యంలో దానిని తయారు చేసే విధానాన్ని, ముడి సరకును లండన్, జర్మనీ ప్రాంతాల నుంచి రప్పించారు. అదే ఏడాది ఏఆర్ రాజు డ్రింక్స్ పేరుతో సాఫ్ట్ డ్రింక్ తయారీ ప్రారంభమైంది. ఒక్క నీరు తప్ప మిగిలిన ముడి సరకులన్నీ విదేశాల నుంచే దిగుమతి చేసుకునే వారు. ఈ డ్రింకులను అప్పట్లో తోపుడు బండ్లు, ఎడ్ల బండ్ల ద్వారా రాజమహేంద్రవరం వరకూ అర్ధణా నుంచి మూడు పైసలకు అమ్మేవారు. 1930లో సెమీ ఆటోమెటిక్ మెషీన్ అమర్చి మరింతగా డ్రింకులను మార్కెట్లోకి తీసుకువచ్చారు. 1955లో ఇంగ్లండ్ నుంచి పూర్తి స్థాయి ఆటోమెటిక్ మెషీన్ రప్పించారు. డ్రింక్స్‌కు ‘ఆర్టోస్’గా పేరు మార్చారు. అనేక ఒడుదొడుకులను ఎదుర్కొంటూనే అదే ఏడాది పేటెంట్ హక్కులు కూడా పొందారు. తరువాత ఆయన కుమారులు పద్మనాభరాజు, సత్యనారాయణరాజులు ఆర్టోస్ డ్రింక్‌ను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువచ్చారు. 1912 నుంచి ఇప్పటి వరకూ సుమారు ఆరుసార్లు డ్రింక్ రూపాంతరం చెందుతూ వచ్చింది. 1955లో 30 మంది సిబ్బంది ఉండగా ప్రస్తుతం వారి సంఖ్య సుమారు 150కి పెరిగింది. అప్పటి నుంచీ మన జిల్లాతో పాటు విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాకు కూడా ఆర్టోస్ డ్రింక్‌ను పంపిణీ చేస్తున్నారు. ఈ కంపెనీకి మూడు జిల్లాల్లోనూ 100 మందికి పైగా డీలర్లు ఉన్నారు. ఇప్పటికే రామచంద్రపురం పరిసర గ్రామాలకు ఆర్టోస్ వాటర్ బాటిళ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. వందేళ్ల తరువాత రెండో యూనిట్ ఆర్టోస్ ఫ్యాక్టరీ వందేళ్లు పూర్తి చేసుకున్న తరువాత మూడో తరం వారైన ఆర్టోస్ బ్రదర్స్ అడ్డూరి జగన్నాథవర్మ, వీరభద్రరాజు, రవీంద్రలు పరిశ్రమలో అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో రెండో యూనిట్‌ను మంగళవారం ప్రారంభించారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ చెలికాని స్టాలిన్, మంత్రి వేణు తనయుడు నరేన్, మున్సిపల్ చైర్పర్సన్ గాధంశెట్టి శ్రీదేవి చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. ఇక నుంచి 1.25, 250, 200 మిల్లీలీటర్ల ప్లాస్టిక్ బాటిళ్లతో ఇప్పటి వరకూ అందిస్తున్న ద్రాక్షతో పాటు మ్యాంగో, లెమన్, ఆరెంజ్ ఫ్లేవర్లలో కూడా డ్రింకులు తయారు చేయనున్నారు. అలాగే సోడాలు కూడా తయారు చేస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో.. వందేళ్లుగా గోదావరి ప్రజలు ఆదరిస్తున్న ఆర్టోస్‌ను మరిన్ని రుచులతో అందించేందుకు అత్యాధునిక టెక్నాలజీతో రెండో యూనిట్ ప్రారంభించాం. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని యంత్రాలను అమర్చి బాటిల్ యూనిట్ ఏర్పాటు చేశాం. గతంలో కంటే మరింత వేగంగా ఆర్టోస్ డ్రింక్‌ను వినియోగదారులకు అందించే ప్రయత్నంలో భాగంగానే రెండో యూనిట్ ప్రారంభించాం. – అడ్డూరి జగన్నాథవర్మ, ఆర్టోస్ అధినేత చదవండి: చంద్రబాబు నుంచి ప్రాణ హాని.. చంద్రబాబు పిలుపు: మందు తాగండి.. ఓటు వేయండి -
ఎందరో ప్రముఖులకు ఇక్కడ ఓనమాలు
సాక్షి, రామచంద్రపురం (తూర్పు గోదావరి): స్థల మహిమో.. వ్యవస్థాపకుల సంకల్ప బలమో కానీ కొన్ని పాఠశాలలు నిజమైన సరస్వతీ నిలయాలుగా వెలుగొందుతాయి. ఆయా పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు వామనుల్లా ఇంతింతై వటుడింతయై అన్నట్టు ప్రజ్ఞలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. అది ఎంత ఎత్తంటే వారు చదువుకున్న పాఠశాలకు కీర్తి ప్రతిష్టలు తెచ్చేంతలా. పుత్రోత్సాహం తండ్రికి అన్నట్టు పాఠశాల వ్యవస్థాపకుల లక్ష్యం మట్టిలో మాణిక్యాలను వెలికితీయడమే కదా. అలాంటి ‘ఉన్నత’మైనదే కృత్తివెంటి పాఠశాల. శనివారం 116వ వార్షికోత్సవం జరుపుకొంటోంది. పాఠశాల ప్రస్థానం ఇదీ.. కృష్ణాజిల్లా మచిలీపట్నం వద్ద ఉన్న కృత్తివెన్ను గ్రామానికి చెందిన కృత్తివెంటి కృష్ణారావు కుమారుడు కృత్తివెంటి పేర్రాజు 1852లో కాకినాడలో జన్మించారు. న్యాయవాది అయిన ఆయన ఓ కేసు నిమిత్తం రామచంద్రపురం వచ్చి కక్షిదారులైన ఇద్దరు అన్నదమ్ముల నిరక్ష్యరాస్యతను చూసి కలవరపడ్డారు. తిరుగుప్రయాణంలో బంట్రోతుతో కృత్తివెంటి ‘కాటన్ దొర ఆనకట్టకట్టారు. దీని వల్ల ఈ ప్రాంతంలో పంటలు పండుతున్నాయి. కానీ.. దానితో సమానంగా వీరి బుర్రలు మాత్రం పెరగటంలేదు. విద్యలేని విత్తం అనర్థదాయకం.. ఇక్కడొక పాఠశాల ఉంటే బాగుండును’ అన్నారట. ఆయన అభీష్టం మేరకు 1905లో 4 నుంచి 8వ తరగతి వరకు విద్యా బోధన చేసేందుకు పాఠశాల స్థాపించి జాతీయ పాఠశాలగా నామకరణం చేశారు. 1906లో ఉన్నత పాఠశాలగా రూపాంతరం చెందింది. అందుకోసం పేర్రాజు పంతులు 94.21 ఎకరాలను దానం చేసి పాఠశాల అభివృద్ధికి వినియోగించాలని స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉద్యానవన పాలిటెక్నిక్, వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుకు ఆయన దానం చేసిన స్థలంలో అంకురార్పణ జరిగింది. నియోజకవర్గానికి చెందిన మొట్టమొదటి మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పాఠశాలను సందర్శించి భవన, తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. మరెందరో విద్యాభాస్యం వందేళ్లు పైబడి పాఠాలు నేర్పిన ఈ సరస్వతీ నిలయం మరెందరినో ఎన్నో రంగాలలో తీర్చిదిద్దింది. భారత స్వాంతంత్య్ర ఉద్యమంలో తన ప్రాణాలనే అర్పించిన విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు ఈ పాఠశాలలో 6వ తరగతి చదివారు. సినీ ప్రముఖులు మిత్తిపాటి కామేశ్వరరావు (గులేబకావళికథ ఫేం), మాష్టర్ రాజు (తెనాలి రామకృష్ణ ఫేం), ఫొటోల నారాయణస్వామి (వింధ్యారాణి ఫేం), ప్రముఖ సంగీత దర్శకుడు జేవీ రాఘవులు, క్యారెక్టర్ యాక్టర్ రాళ్లపల్లి, ప్రఖ్యాత ఛాయాగ్రహ దర్శకుడు చోటా కే నాయుడు, మెజీషియన్ వి.పట్టాభిరామ్, రావులపర్తి భద్రిరాజు, ఇంద్రగంటి శ్రీకాంత్‌శర్మ, పైడిపాల, ప్రముఖ సినీ గేయ రచయిత, విమర్శకుడు, కవి, అదృష్టదీపక్, వీణావాదనలో దిట్ట ద్విభాష్యం నగేష్‌బాబు, వీరే కాకుండా రాజగోపాలనరసరావు, రాజబహదుర్ రామచంద్రరాజు, నందివాడ సత్యనారాయణరావు వంటి మహామహులు ఇక్కడే విద్యాభ్యాసం చేశారు. -
జనగామ : దొంగల బీభత్సం.. ఒకే రోజు 11 ఇళ్లలో చోరి
సాక్షి, జనగామ : జిల్లాలోని బచ్చన్నపేట మండల పరిధిలోని రామచంద్రపురంలో సోమవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. సోమవారం అర్థరాత్రి రామచంద్రపురంలోని 11 ఇళ్లల్లో దొంగతనం చేసి పెద్దమొత్తంలో నగదు, బంగారు ఆభరణాలను అపహరించారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ గా చేసుకుని దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
పల్లె ముంగిటే పాలన సంక్షేమ పథకాల లాలన..
(ఎల్.శ్రీనివాసరావు, రాజమహేంద్రవరం) జిల్లా: తూర్పుగోదావరి మండలం: రామచంద్రపురం గ్రామం: తాడిపల్లి ► వెయ్యికి కొంచెం అటు ఇటుగా ఉండే జనాభా. తొంభై శాతం మంది వ్యవసాయం, కూలి పనులు చేసుకునే వారే. ఊరిలో అడుగు పెట్టగానే శివాలయం వీధి సెంటర్లో రచ్చబండ. పది మంది వరకు రైతులు కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఒకరిద్దరు తప్ప అంతా ఆరు పదుల వయస్సు దాటిన వారే. సాక్షి వారిని పలకరించగా– గ్రామ సచివాలయం, వలంటీర్లు వచ్చాక మా బోటి వాళ్ల కష్టాలు తీరాయి బాబూ అంటూ 80 ఏళ్లు పైబడ్డ ఓ పెద్దాయన ఆనం దంతో చెప్పాడు. 40, 50 ఏళ్లు ఉన్న మరో ఇద్దరు కల్పించుకుని ఇప్పుడు చాలా మార్పు కనిపిస్తోందని, దేనికీ లంచాలు ఇవ్వాల్సిన పని లేదని, నాయకులను బతిమలాడాల్సి న అవసరం లేకుండా పోయిందంటూ చె ప్పారు. పింఛన్, రైతు భరోసా, అమ్మ ఒడి వంటి పథకాలు ఎటువంటి కష్టం లేకుండా అర్హులందరికీ అందుతున్నాయన్నారు. . ► ప్రభుత్వ కార్యాలయాల్లో పని ఉంటే ఏడెనిమిది కిలోమీటర్ల దూరం ఉన్న మండల కేంద్రానికి వెళ్లాల్సిందే. 4 కిలోమీటర్ల దూ రం వెల్ల గ్రామానికి నడచి వచ్చి అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరానికి ఆటో ఎక్కాల్సి వచ్చేది. సచివాలయం, వలం టీర్లు వచ్చాక సర్కారు సేవలు గుమ్మంలోకి రావడం చూస్తుంటే ఏడాదిలో ఎంత మార్పు అంటున్నారు స్థానికులు. చిన్న గ్రామంలో ఆరుగురికి ఉద్యోగాలు ఈ గ్రామంలో ఏకంగా ఆరుగురికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. సాదా అనంతలక్ష్మి వార్డు శానిటరీ కార్యదర్శి, పిల్లి మౌనిక వార్డు ఇంజనీరింగ్ అసిస్టెంట్, బోయిన శ్రీలక్ష్మి మహిళా పోలీస్, డెంకాని దుర్గాప్రసాద్ ఇంజినీరింగ్ అసిస్టెంట్, కురుపూడి శివరామకృష్ణ వెటర్నరీ అసిస్టెంట్, మాచవరపు నవ్య సుధ అగ్రికల్చరల్ అసిస్టెంట్‌గా ఉద్యోగాలకు ఎంపికై విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారున్నారు. అభివృద్ధి అడుగులు ఓ మూలకు విసిరేసినట్టు ఉండే బడి. పిల్లలకు మరుగుదొడ్లు లేవు. ప్రహరీ కట్టించి మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలనేది చాలా కాలంగా ఉన్న సమస్య. వలంటీర్లు ఇంటింటా సర్వేకు వచ్చినప్పుడు బడికి ప్రహరీ కోసం అడిగిన వారం రోజులు తిరగకుండానే ‘నాడు–నేడు’లో రూ.14 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో మంచి నీరు, మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మాణాలు పూర్తి కావొచ్చాయని ప్రజలు చెప్పారు. గ్రామంలో మూడు పక్కలా మూడు చెరువులు ఉన్నాయి. ఏ చెరువు చూసినా దుర్గంధంతో, పూడికతో ఉండేవి. ఈ విషయమై సచివాలయంలో చెప్పగా వారం తిరగకుండా మూడుచెరువుల మరమ్మతులు చేపట్టారు. ఒక చెరువు పని పూర్తి అయిపోయింది. మిగిలిన రెండు చెరువుల మరమ్మతులు చేస్తున్నారని, నెలలో అవి పూర్తవుతాయని సంతోషంగా చెప్పారు. గ్రామంలో నాలుగంటే నాలుగు రోడ్లు ఉన్నాయి. వర్షంలో మోకాలి లోతు బురదలో వెళ్లే రోజులు పోయి రూ.35 లక్షలతో ఊరంతా సీసీ రోడ్లు వచ్చాయి. ప్రభుత్వమే మా ఇంటికి వచ్చినట్టుగా ఉంది.. నాకు 72 ఏళ్లు వచ్చాయి. వలంటీర్లు ఇంటికి వచ్చి సాధక బాధకాలు అడిగి వెళ్తుంటే ప్రభుత్వమే మా ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తోంది. పింఛన్ కోసం అర్జీతో మనవడిని బతిమలాడి మోటార్ బైక్ ఎక్కి రామచంద్రాపురం ఆర్డీవో ఆఫీసుకో, కాకినాడ కలెక్టర్ ఆఫీసుకో వెళ్లే వాళ్లం. ఇప్పుడు వలంటీర్లే మా ఇంటికి వచ్చి అర్జీ ఇచ్చి, దాన్ని పూర్తి చేసి వేలిముద్రలు వేయించుకుని పింఛన్ ఇప్పించారు. ప్రభుత్వం నాకు రూ.2,250 ఫించన్ ఇస్తోంది. – మాధవరపు సత్యనారాయణ,, తాడిపల్లి పంట బాగా పండింది.. నాకు రెండు కుంచాల సొంత చేను ఉంది. దీనికి రైతు భరోసా డబ్బులు నా ఖాతాలో పడ్డాయి. మరో 4 ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. ఈ ఏడాది పంట బాగానే పండింది. – వాసంశెట్టి నాగ ఆంజనేయులు, కౌలు రైతు చాలా మార్పు వచ్చింది నేను 7 ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. పొలం పనులు లేని సమయంలో కూలి పనులకు వెళుతుంటాను. గతంలో ఏదైనా అవసరం వస్తే కూలి పనులు మానుకుని ఆఫీసులు చుట్టూ తిరిగే వాళ్లం కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. అంతా బాగుంది. – కొప్పిశెట్టి శివశంకర్, కౌలు రైతు చదువు మానిపిద్దాం అనుకున్నా.. మేము నాయీబ్రాహ్మణులం. ఆయన ఇంటింటికి వెళ్లి వృత్తి చేస్తుంటారు. పల్లెటూరు కావటంతో అంతగా పని ఉండదు. ఏడో తరగతి చదువుతున్న మా అబ్బాయి వెంకట ఆదిత్యకు అమ్మఒడి పథకం కింద రూ.15 వేలు ఇచ్చారు. అమ్మాయి రామచంద్రపురం డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. స్తోమత లేక చదువు మాన్పించేద్దామని అనుకున్నాను. సరిగ్గా అదే సమయంలో విద్యా దీవెన ద్వారా రూ.10 వేలు వచ్చాయి. అవి వేణ్నీళ్లకు చన్నీళ్ల సాయంగా నిలిచాయి. – సుందరపల్లి నందీశ్వరి, గృహిణి -
మద్యానికి బానిసైన తమ్ముడిని దారుణంగా..
సాక్షి, రామచంద్రాపురం(పటాన్చెరు): నిత్యం తాగొచ్చి డబ్బులు కావాలని వేధిస్తున్న తమ్ముడిని సొంత అన్నే హత్య చేసిన సంఘటన రామచంద్రపురం పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ రమేశ్ కథనం ప్రకారం.. రామచంద్రపురం పట్టణంలోని బొంబాయి కాలనీలో నివాసముండే సయ్యద్ చిన్న కుమారుడు లతీఫ్(25) పెయింటర్‌గా పని చేస్తున్నాడు. మద్యానికి బానిసైన లతీఫ్ నిత్యం డబ్బుల కోసం కుటుంబ సభ్యులను వేధించేవాడు. బుధవారం కూడా ఎప్పటిలాగానే లతీఫ్ మద్యం సేవించి తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. ఉన్న ఇంటిని అమ్మి డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను వేధింపులకు గురిచేయడంతో తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లారు. గురువారం తిరిగి లతీఫ్ గొడవ చేయడంతో అతని అన్న ఇబ్రహీం కోపంతో లతీఫ్‌పై గొడ్డలితో దాడి చేశాడు. దాంతో లతీఫ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఏం చేయాలో తోచని ఇబ్రహీం తమ్ముడి మృతదేహాన్ని భారతీనగర్ డివిజన్ పరిధిలోని మ్యాక్ సొసైటీ కాలనీ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో నిప్పు పెట్టి వెళ్లిపోయాడు. మృతదేహం కొంతమేరకు కాలిపోగా కుక్కలు, పందులు మృతదేహాన్ని పీక్కు తిన్నాయి. శుక్రవారం ఆ మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేవలం తల మాత్రమే ఉండటంతో బొంబాయి కాలనీవాసులు లతీఫ్‌గా గుర్తించారు. ప్రదీప్ సోదరుడు ఇబ్రహీంని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు సంగతి బయటపడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉద్యోగం ఇచ్చిన సంస్థనే..
సాక్షి, రామచంద్రాపురం: పని చేస్తున్న కంపెనీలో డబ్బు దొంగిలించాడు. ఆ దొంగతనం మరెవరో చేశారని యాజమాన్యాన్ని నమ్మించేందుకు చేతికి గాయం చేసుకుని కట్టుకథలు అల్లాడు. మొత్తం రూ.12.5 లక్షలు తస్కరించాడు. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. మాదాపుర్ డీసీపీ వెంకటేశ్వర్రావు, ఏసీపీ కృష్ణప్రసాద్‌లు ఆ వివరాలను పోలీసులకు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల మేరకు.. ఆర్సీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ఇండస్ట్రియల్ ఏరియాలో పెనుబల్లి సురేందర్‌రెడ్డి అనే వ్యాపారి భార్గవ్ ఇండస్ట్రీస్ పేరుతో పరిశ్రమను నిర్వహిస్తున్నారు. కంపెనీలో మెటీరియల్ కొనుగోలుకు ఈ నెల 9న రూ.12.50 లక్షలను పరిశ్రమలోని ఆఫీసు గదిలోని లాకర్లో దాచారు. అదే కంపెనీలో ఒడిషాకు చెందిన సుశాంత్ కుమార్ జెనా అనే యువకుడు అసిస్టెంట్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. లాకర్లో పెట్టిన సొమ్మును చూసి దాన్ని కాజేసేందుకు పథకం వేశాడు. ఈ క్రమంలో లాకర్‌ను బద్దలు కొట్టి రూ.12.50 లక్షలను సుశాంత్‌కుమార్ దొంగలించాడు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. ప్లాన్ ప్రకారం తనకు తానుగా గాయాలు చేసుకున్న సుశాంత్ గుర్తు తెలియని వ్యక్తులు లాకర్‌ను పగులగొట్టి డబ్బు తీసుకెళ్లారని యజమానిని నమ్మించే ప్రయత్నం చేశారు. తన చేతికి తనే గాయం చేసుకున్నాడు. కట్టుకథతో యాజమాన్యాన్ని నమ్మించే ప్రయత్నం చేశాడు. కంపెనీలో జరిగిన దొంగతనం విషయాన్ని సురేందర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించి సుశాంత్‌పై అనుమానంతో విచారించామని పోలీసు అధికారులు వెల్లడించారు. ఆ విచారణలో దొంగతనం చేసిన వెంటనే ఆ సొమ్మును సుశాంత్ తన స్వగ్రామానికి చెందిన మరో వ్యక్తి రాజ్‌బిహారీ బెహరాకు రూ.9.30 లక్షలను ఇచ్చి గ్రామానికి వెళ్లాలని పంపించి వేశాడు. ఒడిషా వెళ్తున్న ఆ రాజ్ బిహారీని బస్సులో ప్రయాణిస్తుండగా పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద దొరికిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. రూ.1.25 లక్షలు సుశాంత్ అప్పు తీర్చాడు. ఆ సొమ్ముతోపాటు మొత్తం డబ్బును పోలీసులు వారిద్దరి నుంచి స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లోనే నేరం చేసిన ఇద్దరిని పట్టుకున్నామని పోలీసు అధికారులు వివరించారు. నిందితులిద్దరినీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించనున్నట్లు చెప్పారు. ఈ కేసు పరిశోధనలో క్రియాశీలకంగా వ్యవహరించిన సీఐ రమేష్‌కుమార్, ఎస్ఐలు రవికుమార్, భాస్కర్, కానిస్టేబుళ్లు నారాయణ, యాదయ్య, సత్యనారాయణలను డీసీపీ అభినందించారు. -
మూడు రాజధానులు కావాల్సిందే
సాక్షి, ద్రాక్షారామ (రామచంద్రపురం రూరల్): రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి మూడు రాజధానులు ఉండాల్సిందేనంటూ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని ద్రాక్షారామలో సుమారు 2 వేల మంది మహిళలు, విద్యార్థినులు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో ‘అమరావతి ఒక్కటే వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేణు మాట్లాడుతూ.. రాష్ట్రమంతా ముక్త కంఠంతో మూడు రాజధానుల అవసరాన్ని ఎలుగెత్తి చాటుతుంటే, చంద్రబాబు, ఆయన అనుయాయులు మాత్రం తమ రియల్ ఎస్టేట్ ఆశలు ఆవిరి అయిపోతున్నాయని ప్రజల్లో అయోమయం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ ఏం చేసినా ప్రజా శ్రేయస్సు కోసమే చేస్తారనే దృఢమైన నిర్ణయం ప్రజల్లో ఉందని, అందుకే మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ నిర్ణయం నూరు శాతం కరెక్ట్ తాళ్లరేవు: అమరావతి విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్నది నూటికి నూరుపాళ్లు కరెక్ట్ అని పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం జార్జీపేట గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలన వికేంద్రీకరణ, అభివృద్ధి రాష్ట్రమంతా జరగాలని, లేదంటే రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా ఒక రాష్ట్రం అయ్యే పరిస్థితి వస్తుందన్నారు. సదుపాయాలు అందరికీ సమానంగా ఉండాలంటే ప్రతి జిల్లాలో అభివృద్ధి జరగాలని చెప్పారు. సంబంధిత వార్తలు చంద్రబాబును అడ్డుకుంటాం వారిలో సమాజ హితం లేదు అలా చేస్తే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి? జగన్ అంటే చంద్రబాబుకు ద్వేషం: పోసాని -
మీ వివరాలు చెప్పారో.. దోచేస్తారు
ఇటీవల సైబర్ నేరాలు ఎక్కువ అయ్యాయి. ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకొని అధికమొత్తం డబ్బు ఎరవేసి వారి నుంచే వారి వివరాలు సేకరించి ఆన్లైన్ దోపిడీకి పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడో కాదు.. నియోజకవర్గంలో సైతం పెరిగిపోయాయి. సాక్షి, రామచంద్రపురం(తూర్పుగోదావరి) : ‘‘ హలో మీ పేరు సుస్మితేనా...?’ ‘అవునండీ .. ఎవరండీ మాట్లాడేది..?’ ‘నేను ఇన్సూరెన్సు(ఇన్సూరెన్సు పేరు చెప్పరు)కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. మీ నాన్నగారు చనిపోయారా?’ ‘అవునండీ.. చనిపోయి నాలుగు నెలలయ్యింది. అయినా ఎందకడుగుతున్నారు?’ ‘మీ నాన్నగారి పేరు మీద లక్ష రూపాయలు ఇన్సూరెన్సు ఉంది. ఆ డబ్బులు మీ అక్కౌంట్లో జమ చేయాలి. మీ అక్కౌంటు నంబర్, ఏటీఎం కార్డు నంబర్ చెబుతారా?’ ‘ఆ( చెబుతాను రాసుకోండి.’ ‘సరే నండి.. మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. వెంటనే చెప్పండి.’ ‘అలాగే నండి... ఓటీపీ వచ్చింది.. 1255 రాసుకొండి.’ ‘ఓకే నండి రాసుకున్నాను.. మీ అక్కౌంట్లో మొదట రూ. 2వేలు కట్ అవుతాయి. ఆ తరువాత లక్ష రూపాయలు జమవుతాయి.’ ఈ సంభాషణ అనంతరం ఏటీఎం కార్డు నంబర్, మొబైల్ నంబర్‌కు ఓటీపీ నంబర్‌ను అవతలి వ్యక్తికి చెప్పిన మరుక్షణం ఆమె ఖాతాలో నుంచి రూ. 20వేలు కట్ అయ్యాయి. అంతమొత్తం ఎందుకు కట్ అయ్యిందని ఫోన్ చేద్దామంటే అవతలి వ్యక్తి ఫోన్ లిప్టు చేయడు. ఫోన్ కలువదు.. ఇదీ ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్న సైబర్ నేరం. ఓఎల్ఎక్స్లో పాత వస్తువులు పెట్టి ఎక్కడో బెంగళూరులో ఉన్న వ్యక్తి లక్షలు కాజేయటం, జనం బలహీనతలను ఆసరాగా చేసుకుని వారి బ్యాంకు ఖాతాలలో సొమ్ములు కాజేయటం ఇటీవల పరిపాటిగా మారిపోయింది. బెంగళూరు, ముంబై, చెన్నై కేంద్రాలుగా ఈవిధమైన నేరాలకు పాల్పడుతూ ప్రజలను మోసగించి సొమ్ములు కాజేస్తున్నారు. నియోజకవర్గంలోని రామచంద్రపురం పట్టణం, కె.గంగవరం, ద్రాక్షారామలలో ఈ విధమైన నేరాలు చోటు చేసుకున్నాయి. ఇటువంటి మోసాలు నియోజకవర్గంలో సుమారు 20 వరకు జరిగినట్టు తెలుస్తోంది. కొంత మంది పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటే మరికొందరు ఎవరికీ చెప్పడం లేదు. ఒక్కొక్కరి ఖాతా నుంచి రూ. 10 వేల నుంచి రూ. 25వేల వరకు కాజేస్తున్నారు. వచ్చిన ఫోన్‌కాల్స్‌ను బట్టి పోలీసులు విచారిస్తుంటే ఫేక్ అడ్రసులు ఉంటన్నాయి. ఫిర్యాదును బట్టి అటు ముంబాయి, బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్ల లేక, మోసగాళ్ల ఆచూకీ లభ్యం కాక పోలీసులు పడుతున్నపాట్లు వర్ణనాతీతం. ఓఎల్ఎక్స్లో పాత వాహనాలను అమ్ముతాము. విడతలవారీగా సొమ్ములు చెల్లించాలని పోస్టింగ్‌లు పెట్టి, రెండు మూడు సార్లు బ్యాంకు అక్కౌంట్లో డబ్బులు కూడా వేసిన తరువాత ఆ వస్తువు లేక, డబ్బులు పోగొట్టుకున్న వారు ఎందరో. అప్రమత్తమైన పోలీసులు: ఈ విధమైన సైబర్ నేరాల నుంచి ప్రజలకు చైతన్యపరచేందుకు రామచంద్రపురం పోలీసులు నడుంబిగించారు. మోసగాళ్ల ఆచూకీ తెలియక సతమతమయ్యే కన్నా సైబర్ నేరాలకు గురికాకుండా ప్రజలను చైతన్యం చేసే దిశగా రామచంద్రపురం సీఐ పెద్దిరెడ్డి శివగణేష్ నేతృత్వంలో పోలీసులు చర్యలు ప్రారంభించారు. గుర్తు తెలియనివారికి ఏటీఎం కార్డు నంబర్లు, ఓటీపీ నంబర్లు ఇవ్వకూడదని, బ్యాంకు ఖాతా వివరాలు చెప్పకూడదని రామచంద్రపురం పట్టణంలో ఆటో ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం నుంచి రామచంద్రపురం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలలో ఆటో ద్వారాను ప్రధాన రహదారుల్లోను పోలీసు సిబ్బంది ప్రజలకు వివరిస్తున్నారు. అప్రమత్తంగా ఉండండి అపరిచిత ఫోన్ కాల్స్‌తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా బ్యాంకు వివరాలు అడిగితే చెప్పవద్దు. మీ బ్యాంకు అక్కౌంట్ల నుంచి మీ ద్వారానే సొమ్ములు కాజేస్తున్నారు. చోరీ జరిగిన తరువాత కంటే ముందుగానే ప్రజలు అప్రమత్తంగా ఉంటారనే ఉద్దేశ్యంతో ఆటోల ద్వారా ప్రచారం చేస్తున్నాం. దీనిపై ప్రజలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. – పెద్దిరెడ్డి శివగణేష్, సీఐ, రామచంద్రపురం -
తల్లి, కూతుళ్ల దారుణ హత్య
సాక్షి, తూర్పుగోదావరి: తల్లి, కూతుళ్లు దారుణ హత్యకు గురైన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. రామచంద్రాపురం చప్పిడివారి సావరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను తల్లి బలుస మాధవి(45), కూతురు కరుణ(18)గా పోలీసులు గుర్తించారు. మాధవి స్థానిక నారాయణ పాఠశాలలో పనిచేస్తుంది. మృతురాలు భర్త, కుమారుడు కాకినాడలో ఒక హోటల్లో పని చేస్తున్నట్లు తెలిసింది. తెల్లవారు జామున ఈ హత్యలు జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. హత్యలకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే భార్య, కుమార్తెను భర్తే హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
వివాహితను ప్రేమ పేరుతో నమ్మించి..
సాక్షి, చిత్తూరు : రెండు నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఓ వివాహిత శవమై తేలడం స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే ఓ యువకుడు ప్రేమ పేరుతో ఆ మహిళను హతమార్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటన జిల్లాలోని రామచంద్రపురం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని పీవీ పురంకు చెందిన భానును పది సంవత్సరాల క్రితం.. రాయలచెరువుకు చెందని ముని శేఖర్‌తో వివాహం జరిగింది. వీరికి ఒక పాప కూడా ఉంది. శేఖర్ కొంత అమాయకుడు కావడంతో భాను రెండేళ్లుగా పుట్టింటిలోనే ఉంటున్నారు. శేఖర్ మాత్రం తరచూ భార్య వద్దకు వచ్చి వెళ్లేవాడు. అయితే ఇంటి వద్దే ఉంటున్న భానుకు అదే మండలంలోని రామాపురంకు చెందిన హరి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొద్ది రోజులకే భాను కనిపించకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. దీంతో భాను తల్లిదండ్రులు రామచంద్రపురం పోలీసులను ఆశ్రయించారు. హరి మీద అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు భానును హరి నమ్మించి హతమార్చినట్టు నిర్ధారించారు. రామచంద్రపురం వద్ద పాతిపెట్టిన భాను మృతదేహాన్ని వెలికి తీశారు. హరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు నెలల క్రితం కనిపించకుండా పోయిన బిడ్డ శవంగా తేలడంతో ఆమె తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. భాను కన్పించకుండా పోయినప్పుడే పోలీసులు స్పందించి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని వారు చెబుతున్నారు. -
అక్రమార్కులకు హైకోర్టు నోటీసులు
సాక్షి, రామచంద్రపురం (తూర్పు గోదావరి): నిషేధిత సర్వే నంబర్లలోని భూములను రిజిస్ట్రేషన్ చేయరాదని చట్టం చెబుతుంది. కానీ రామచంద్రపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దీనిని పట్టించుకోవడం లేదు. నిబంధనలను తుంగలో తొక్కి గత ఏడాది నవంబర్‌లో లెప్రసీ మిషన్ ట్రస్టు స్థలాన్ని అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆక్రమించేసిన విషయం తెలిసిందే. ఈ అక్రమ దందాపై కొంతమంది స్థానికులు హైకోర్టును ఆశ్రయించగా.. అక్రమార్కులకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నోటీసులు అందించిందనే విషయం ఆలస్యంగా తెలిసింది. రామచంద్రపురం – పసలపూడి ప్రధాన రహదారికి ఇరువైపులా బ్రిటిష్ పరిపాలన కాలంలో ఒక దాత ఉదారంగా ఐదెకరాల స్థలం ఇచ్చారు. ఈ ప్రాంతాల్లోని కుష్ఠు వ్యాధిగ్రస్తుల కోసం దీనిని దానం చేసి, దీని నిర్వహణ కోసం ట్రస్టు ఏర్పాటు చేశారు. దేశంలోనే ఎంతో పేరొందిన ది లెప్రసీ మిషన్ ట్రస్టు ద్వారా ఇక్కడ ఆసుపత్రి ఏర్పాటు చేసి వైద్య సేవలందించేవారు. ఇందులో కొంత భాగం ప్రస్తుతం రామచంద్రపురం మున్సిపాలిటి పరిధిలో ఉంది. ఇందులో లెప్రసీ ఆసుపత్రితో పాటు రోగులుండేందుకు భవనాలు నిర్మించారు. రోడ్డుకు మరోవైపు పసలపూడి పంచాయతీ పరిధిలో సుమారు 4 వేల చదరపు గజాల స్థలం ఉంది. ఇందులో వైద్యుల విశ్రాంతి కోసం భవనాలు నిర్మించారు. దశాబ్దాల కాలం పాటు జిల్లావ్యాప్తంగా కుష్ఠు రోగులకు ఇక్కడ వైద్యసేవలు అందించారు. క్రమంగా కుష్ఠు వ్యాధిగ్రస్తులు తగ్గడంతో కొంతకాలంగా వైద్యసేవలు నిలిపివేశారు. ట్రస్టుకు సంబంధించిన ఈ ఆస్తుల క్రయ విక్రయాలకు వీలులేదు. దీంతో ఈ స్థలాలకు సంబంధించిన సర్వే నంబర్లపై మార్కెట్ వేల్యూ పుస్తకంలో రెడ్‌మార్కు పెట్టి ఉంచారు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ స్థలాలపై అక్రమార్కుల కన్నుపడింది. దీంతో రామచంద్రపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిబంధనలను తుంగలో తొక్కుతూ ప్రొహిబిటెడ్ సర్వే నంబర్లలో ఉన్న ఈ స్థలానికి అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు చేశారు. గత ఏడాది నవంబర్ 20వ తేదీన రామచంద్రపురం – పసలపూడి రోడ్డులో పసలపూడి పంచాయతీ పరిధిలోకి వచ్చే లెప్రసీ మిషన్ ట్రస్టుకు చెందిన 460/12, 461/2బి సర్వే నంబర్లలోని సుమారు 4 వేల చదరపు గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నిబంధనలకు పాతర లెప్రసీ మిషన్ ట్రస్టుకు చెందిన 460/12, 461/2బి సర్వే నంబర్ల భూమి ఆన్లైన్లో నిషేధిత సర్వే నంబర్లలో ఉంది. కానీ అప్పటి సబ్ రిజిస్ట్రార్ వీటికి అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేశారు. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 7649/18, 7650/18, 7651/18 నంబర్లతో ఈ రిజిస్ట్రేషన్లు జరిగాయి. తద్వారా కబ్జాదారులు సుమారు రూ.10 కోట్ల విలువైన ఈ స్థలాన్ని కేవలం రూ.1.80 కోట్లకు కాజేసే యత్నం చేశారు. హైకోర్టు నోటీసులు లెప్రసీ ట్రస్టు ఆస్తులను కాపాడాలనే ధ్యేయంతో పట్టణానికి చెందిన మట్టా ఉమాశంకరావు, లెప్రసీ సంఘం నాయకులు ఆవుపాటి విరాట్, పంపన రామకృష్ణ, జల్లి సత్యంనాయుడు అప్పట్లో ఈ వ్యవహారంపై కలెక్టర్‌తో పాటు జిల్లా రిజిస్ట్రార్‌కు, డీఐజీ తదితర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో వారు గత మార్చిలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి, జిల్లా కలెక్టర్‌కు, న్యూఢిల్లీలోని లెప్రసీ మిషన్ ట్రస్టుకు, రామచంద్రపురం ఆర్డీవోకు, జిల్లా రిజిస్ట్రార్‌కు గత నెల 25న నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉండగా ట్రస్టు బైలాస్ పంపించాలని కోరుతూ న్యూఢిల్లీ ట్రస్టు కార్యాలయానికి అప్పటి జిల్లా రిజిస్ట్రార్ లేఖ కూడా రాశారు. కానీ అది ఏమైందనేది ఇప్పటివరకూ వెలుగులోకి రాలేదు. ఎంతో విలువైన ఈ భూములు అన్యాక్రాంతమయ్యే పరిస్థితులు తలెత్తాయని, ప్రస్తుత జిల్లా అధికారులు ఈ భూబాగోతంపై విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు, ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నారు. -
రైతుల చేతికే తాళాలు
సాక్షి, జలుమూరు (శ్రీకాకుళం): రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆదేశాలతో మండల పరిధిలోని రామచంద్రాపురం ఎత్తిపోతల పథకం మరమ్మత్తులకు రూ.80 లక్షలతో అంచనాలు వేసి నిధులు మంజూరుకు కలెక్టర్‌కు నివేదించనున్నామని ఎత్తిపోతల పథకం డీఈఈ ఎన్.శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఈ ఎత్తిపోతల పథకంతోపాటు పలు పథకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామచంద్రాపురం ఎత్తిపోతల పథకం తాళాలు ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉండడం వాస్తవమేనన్నారు. వీటిని తీసుకుని పథకం చక్కగా నిర్వహిస్తున్న రైతులకు అప్పజెప్పనున్నామన్నారు. ఇటీవల ఎత్తిపోతల పథకం ఈఈ లక్ష్మీపతితోపాటు పలువురు అధికారులతో మంత్రి ధర్మాన కృష్ణదాస్ సమీక్షించారన్నారు. పథకం నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారన్నారు. ఈ పథకం సుమారు 500 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా కేవలం 250 ఎకరాలకు మాత్రమే అందిస్తుందని డీఈఈ తెలిపారు. 150 హెచ్‌పీ గల రెండు మోటార్లలో ఒకటి మాత్రమే (75 హెచ్‌పీ) పని చేస్తుందన్నారు. వీటి మరమ్మతులతోపాటు పైపులైన్లు కూడా బాగుస్తామన్నారు. గతంలో ఆర్సీసీ పైపులు ఉండేవని వీటి స్థానంలో పీసీఎస్ పైపులు వాడనున్నామన్నారు. పంపు హౌస్ నుంచి సుమారు 100 మీటర్లు దాటిన తరువాత పైపులైన్లు మరమ్మతులకు గురైనట్లు తెలిపారు. ఏఈలు, రైతులు పాల్గొన్నారు. అధికారులు, రైతులతో మాట్లాడుతున్న డీఈఈ శ్రీనివాసరావు -
టీడీపీ శ్రేణులపై జనసేన కార్యకర్తల ఫిర్యాదు
-
టీడీపీ నేతల దౌర్జన్యం
సాక్షి, రామచంద్రాపురం: ఓ పత్రికా విలేకరి బరితెగించాడు. వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యయత్నంకు ప్రయత్నించాడు. అడ్డుకున్న దళిత నాయకుడిని కులం పేరుతో దూషించాడు. బాధితుడు చేసిన పాపం ఏంటంటే టీడీపీని వీడి వైఎస్సార్సీపీలోకి చేరడమే. రామచంద్రాపురం మండలం అనుప్పల్లికి చెందిన గుర్రప్ప ఓ పత్రికలో తిరుపతి విలేకరిగా పనిచేస్తున్నాడు. ఆదివారం అనుప్పల్లిలో టీడీపీ అభ్యర్థి నాని ప్రచార కార్యక్రమంలో గుర్రప్ప టీడీపీ కార్యకర్తగా వ్యవహరించాడు. ఇటీవల టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన వెంకటేష్‌రెడ్డి ఓటును తొలగించాలని గుర్రప్ప ఫారం– 7ను పెట్టాడు. దీనిపై వెంకటేష్‌రెడ్డి ఆదివారం అనుప్పల్లిలో గుర్రప్పను ప్రశ్నించాడు. ‘టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి ఎలా చేరతావు అంటూ గుర్రప్ప ఆగ్రహాంతో వెంకటేశ్వరరెడ్డిపై దాడి చేశాడు. గుర్రప్పతో పాటు అతని బంధువు, మరో పత్రికా విలేకరి దేవా, టీడీపీ నాయకులు మున్నా, జానకీరాంలు తీవ్రంగా కొట్టారు. వెంకటేష్‌రెడ్డిని కింద పడేసి పెద్ద బండరాయిని ఎత్తి అతని ముఖంపై వేసేందుకు గుర్రప్ప ప్రయత్నించాడు. సమీపంలో ఉన్న దళిత నాయకుడు నాదముని వారించాడు. ఆగ్రహాంతో ఊగిపోయిన గుర్రప్ప నాధమునిని కులం పేరుతో దూషించాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేష్‌రెడ్డిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నాధముని, వెంకటేశ్వరరెడ్డి ఫిర్యాదుల మేరకు వెర్వేరుగా కేసులు నమోదు చేసి విచారిస్తున్నట్లు రామచంద్రాపురం పోలీసులు తెలిపారు. -
బాబు బాగోతాన్ని అజయ్ కల్లమే బయటపెట్టారు : వైఎస్ షర్మిల
సాక్షి, తూర్పుగోదావరి : జాబు రావాలంటే బాబు రావాలి అని పదేపదే చెప్పిన చంద్రబాబు తెలుగు కూడా సరిగా రాని తన సుపుత్రడు లోకేశ్ పప్పుగారికి మాత్రం ఏకంగా మూడు మంత్రి పదవులిచ్చారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల విమర్శించారు. తండ్రీ, కొడుకులు కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. గత నలభయ్యేళ్ల ఆంధ్రరాష్ట్ర చరిత్రలో లేనంత అవినీతి టీడీపీ ఐదేళ్ల పాలనలో జరిగిందని సాక్షాత్తూ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన అజయ్ కల్లం చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. బస్సు యాత్ర నిర్వహిస్తున్న షర్మిల ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలోని కోటిపల్లి ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. అసలైన నాయకుడు వైఎస్సార్.. ప్రతి పేదవాడికి అండగా, ప్రతి రైతుకు ధైర్యంగా కలిగించేలా, ప్రతి మహిళకు భరోసా కలిగించేలా దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన అందించారు. మన పర తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన వ్యక్తి ఒక్క వైఎస్సార్ మాత్రమే. ఒక్క రూపాయి పన్ను పెంచకుండా గొప్ప పరిపాలన అందించిన రికార్డు వైఎస్సార్‌ది. అందుకే ఆయన చనిపోయినా కోట్ల మంది ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉన్నారు. కానీ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎలా ఉన్నారు. వెన్నుపోటుకు, అబద్ధాలకు, అవినీతికి, అరాచకాలకు మారుపేరు బాబు. రైతు రుణమాఫీ అంటూ చేసిన మొదటి సంతకానికే దిక్కులేదు. డ్వాక్రామహిళలకు రుణమాఫీ చేస్తానన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ఐదేళ్లు ఏమి చేయకుండా పసుపు కుంకుమ అంటూ భిక్షం వేస్తున్నట్లు ఇస్తున్నారు. ఎంగిలి చేయి విదిలిస్తున్నారు. అక్కా చెల్లెళ్లు మోసపోకండమ్మా. కేవలం మహిళలను మభ్యపెట్టడానికి చంద్రబాబు డబ్బులు ఇస్తున్నారు. బాబు వల్ల చదువులు ఆపేస్తున్నారు.. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ ఆస్పత్రులను తీసేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు అయితే కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స చేసుకోవాలట. సామాన్యులు అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలట. ఇదెక్కడి న్యాయం? ఇది అమానుషం కాదా. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు. పిల్లలకు ఫీజు కట్టలేక తల్లిదంద్రులు కట్టలేక అప్పులు పాలు అవుతున్నారు. తల్లిదంద్రులను అప్పుల పాలు చేయకుండా మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారు. పోలవరం.. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు. కానీ కమిషన్ మింగొచ్చనని చంద్రబాబు ఆ ప్రాజెక్టును తీసుకున్నారు. 15వేల కోట్లు ఉన్న పోలవరం ప్రాజెక్టును 60వేలకోట్లకు పెంచారు. నిజానికి ఇది కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టు. కానీ కమీషన్ కోసం చంద్రబాబు తీసుకున్నారు. మూడేళ్లలో పూర్తి చేస్తా అన్నారు. చేశారా? చిత్తశుద్ది ఉంటే పోలవరాన్ని నిర్మించేవారు. ఆ సొమ్మంతా బాబు బొజ్జలో.. అమరావతి.. నాకు అనుభవం ఉందని, హైదరాబాద్‌ను నేనే కట్టానని, అమరావతిని నేనే కడతా అన్నారు. ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ అయినా కట్టారా? కేంద్ర ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క బిల్డింగ్ కట్టలేదు. ఏమైంది ఆ డబ్బంతా? ఆ డబ్బంత చంద్రబాబు బొజ్జలో ఉంది. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు పెట్టిస్తాడట. ఐదేళ్లు సీఎంగా ఉండి అమరావతి ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కట్టలేదు కానీ ఇంకో ఐదేళ్లు ఇస్తే అమెరికా చేస్తారాట. మన చెవిలో పూలు పెడతాడట. నమ్ముతారా? నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి. వేణుగోపాలకృష్ణ, అనురాధలను భారీ మెజారిటీతో గెలిపించండి ఈ నెల 11న ఎన్నికలు ఉన్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలచుకోండి. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలి. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద ప్రతి మే మాసంలో రూ. 12500 రూపాయలు ఇస్తారు. గిట్టుబాటు ధరకై మూడు వేల కోట్ల రూపాయలతోతో ఒక నిధి ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తారు. సున్నా వడ్డికే రుణాలు ఇస్తారు. కాలేజీ విద్యార్థులు ఏ కోర్సు అయినా చదవచ్చు. ఏ కోర్సు చదివిన ప్రభుత్వం ఉచితంగా చదివిస్తుంది. ఆరోగ్య శ్రీలో కార్పొరేట్ ఆస్పత్రిలను చేరుస్తాం. పిల్లలను బడికి పంపించడానికి తల్లిదండ్రులకు రూ. 15వేలు ఇస్తాం. అవ్వలకు తాతలకు పెన్షన్లు రూ. రెండు వేల నుంచి క్రమంగా మూడు వేలకు పెంచుతాం. వికలాంగులకు పెన్షన్లు మూడు వేలు ఇస్తాం. 45 సంవత్సరాల దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకి 75 వేల రూపాయిలు అందిస్తాం. రామచంద్రాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ , అమలాపురం వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి చింతా అనురాధను భారీ మెజారీటీతో గెలిపించండి.మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. -
బాబు బాగోతాన్ని అజయ్ కల్లమే చెప్పారు : వైఎస్ షర్మిల
-
అజాతశత్రువుకు అశ్రునివాళి
అజాత శత్రువుగా కడప జిల్లా ప్రజలకు ఎనలేని సేవలు అందించిన మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా శ్రేణులు తీవ్ర దిగ్భాంతి చెందారు. ఆయన హత్య వెనుక కుట్రదాగి ఉందని, నేరస్తులను కఠినంగా శిక్షించాలని నినదించారు. వైఎస్ వివేకానంద రెడ్డి మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సాక్షి, కాకినాడ రూరల్: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ సోదరుడు, సీనియర్ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి అకాల మరణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ రూరల్ పార్టీ కార్యాలయంలో కన్నబాబు ఆధ్వర్యంలో శుక్రవారం వైఎస్ వివేకానందరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వెన్నంటే ఉంటూ పార్టీ కార్యక్రమాలలో ముందుండి నడిపే వివేకానందరెడ్డి అకాల మరణం తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు నురుకుర్తి రామకృష్ణ (కిట్టు), రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కర్నాసుల సీతారామాంజనేయులు, నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు గీసాల శ్రీనివాసరావు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి జమ్మలమడక నాగమణి, రాష్ట్ర యువజన కార్యదర్శి లింగం రవి, గొల్లపల్లి ప్రసాదరావు, గంజా సత్యనారాయణ, పుల్ల చైర్మన్ శ్రీను, కొత్తపల్లి గిరీష్, పాలిక నర్శింహమూర్తి, సమనాసి ప్రసాద్, చెరుకూరి సుజాత, కొప్పిశెట్టి శివపార్వతి, పాలిక వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు. ఆకస్మిక మృతి బాధాకరం : రాజా తుని: వైఎస్ వివేకానందరెడ్డి మృతి పార్టీకి తీరని లోటని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. స్థానిక శాంతినగర్‌లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం వివేకానందరెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా వివేకానందరెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజా మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలన్న కోరిక నేరవేరకుండా తుది శ్వాస విడిచి అందరినీ విషాదంలో నింపారని ఆవేదన వ్యక్తం చేశారు. తుని పట్టణ శాఖ పార్టీ అధ్యక్షుడు రేలంగి రమణాగౌడ్, తుని మండల పార్టీ అధ్యక్షుడు పోతల రమణ, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు నార్ల రత్నాజీ, కీర్తి బాలకృష్ణ, ఎస్సీ సెల్ తుని నియోజకవర్గ అధ్యక్షుడు గారా శ్రీనివాసరావు, తుని మండల యూత్ కన్వీనర్ చోడిశెట్టి వెంకటేష్, నాయకులు వంగలపూడి వాసు, శివ, నైషీ, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ వివేకానందరెడ్డికి నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే రాజా సీబీఐ విచారణ జరిపించాలి: బోస్ రామచంద్రపురం రూరల్: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో తీవ్ర దిగ్భాంతికి లోనైనట్లు వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూ తెలిపారు. ఎన్నికల సమయంలో వైఎస్సార్ సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నంగా కన్పిస్తోందని శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ప్రతిపక్ష నాయకుడి కుటుంబానికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం రాజకీయాల్లో తిరిగే సామన్యులకు ఏమి రక్షణ కల్పిస్తుందని ఆయన ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి వెంటనే సీబీఐ ఎంక్వయిరీ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని బోస్ డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీకి తీరని లోటు కోటనందూరు (తుని): వైఎస్ వివేకానందరెడ్డి మరణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఆ పార్టీ కాకినాడ పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు పెదపాటి అమ్మాజీ అన్నారు. ఆమె శుక్రవారం కోటనందూరులో మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి లేని లోటును ఆ కుటుంబానికి వివేకానందరెడ్డి భర్తీ చేసేవారని, ఆయన మరణంతో వైఎస్ కుటుంబ సభ్యులకు అన్యాయం జరిగిందన్నారు. మృదుస్వభావి, అందరినీ చిరునవ్వుతో పలకరించే వివేకానందరెడ్డి ఇకలేరనే వార్త పార్టీ శ్రేణులను శోకసంద్రంలో ముంచిందన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అమ్మాజీ చెప్పారు. -
ఉద్యోగిని దుస్తులు మార్చుకుంటుండగా..
రామచంద్రపురం: రైల్వే స్టేషన్‌లోని ఓ గదిలో తోటి ఉద్యోగిని దుస్తులు మార్చుకుంటుండగా రహస్య కెమెరాతో చిత్రీకరించిన ఓ సూపరింటెండెంట్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం రైల్వేస్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రామచంద్రపురం రైల్వే స్టేషన్లో మహ్మద్ రియాజ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇదే స్టేషన్లో ఓ వివాహిత గేట్‌కీపర్‌గా సుమారు ఏడాది నుంచి విధులు నిర్వహిస్తోంది. ఇటీవల స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ ఎత్తివేయడంతో ఆ గదిలో మహిళా ఉద్యోగి దుస్తులు మార్చుకుని యూనిఫాం వేసుకుంటోంది. ఇది గమనించిన రియాజ్ గదిలోని ఓ ప్రదేశంలో రహస్య కెమెరాను అమర్చి చిత్రీకరణకు పాల్పడ్డాడు. గత కొంతకాలంగా ఈ తతంగం సాగుతుండగా బుధవారం గదిలో దుస్తులు మార్చుకుంటున్న సమయంలో కెమెరాకు ఉన్న చిన్న ఎల్ఈడీ బల్బు వెలుగు కనిపించడంతో అనుమానం వచ్చి తీసి చూడగా అసలు విషయం బయటపడింది. సూపరింటెండెంట్ ల్యాప్‌టాప్‌లో కెమెరాలో చిత్రీకరించిన వీడియోలను గుర్తించిన బాధితురాలు పైఅధికారులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సతీష్ తన సిబ్బందితో రామచంద్రపురం రైల్వే స్టేషన్‌కు చేరుకొని రహస్య చిత్రీకరణను నిర్ధారించారు. కెమెరాను, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేసి రైల్వే డీఆర్ఎంకు నివేదిక అందించారు. డీఆర్ఎం ఆదేశాల మేరకు నిందితుడు మహ్మద్ రియాజ్‌ను సస్పెండ్ చేశారు. -
ఎస్ఐ వంశీధర్ మృతదేహం లభ్యం
-
నీట మునిగిన ఎస్సై
ఘంటసాల(అవనిగడ్డ): తనకు జన్మనిచ్చిన తల్లికి పునర్జన్మనిచ్చాడు ఓ తనయుడు. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి కాలువలో పడిన కారు నుంచి తల్లిని కాపాడాడు. కానీ తాను మాత్రం నీటి ప్రవాహానికి గల్లంతయ్యి తన వారందరికీ తీరని దుఃఖం మిగిల్చాడు. కృష్ణా జిల్లా పాపవినాశనం వద్దనున్న పంట కాలువలోకి శనివారం ఓ కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం ఎస్ఐ కోట వంశీధర్ గల్లంతయ్యారు. డీఎస్పీ పోతు రాజు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణా జిల్లా కోడూరు మండలం ఇస్మాయేల్‌బేగ్ పేటకు చెందిన వంశీధర్(30) రామచంద్రపురం ఎస్ఐగా పనిచేస్తు న్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి లక్ష్మికి 4 నెలల కిందట గన్నవరంలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో గుండె ఆపరేషన్ చేయించాడు. ఆమెకు వైద్య పరీక్షలు చేయించేందుకు శనివారం రామచంద్రపురం నుంచి కారులో గన్నవరంలోని ఆస్పత్రికి వచ్చాడు. వైద్య పరీక్షల అనంతరం మందులు తీసుకొని.. తల్లితో కలసి ఇస్మాయేల్‌బేగ్ పేటకు బయలుదేరాడు. పాపవినాశనం వంతెన వద్దకు వచ్చేసరికి వీరి కారు అదుపు తప్పి.. పక్కనే ఉన్న పంట కాలువలోకి బోల్తా కొట్టింది. అప్రమత్తమైన వంశీధర్ కారు డోర్ తెరిచి తల్లిని నీటిలో నుంచి ఒడ్డుకు చేర్చాడు. స్థానికులు ఆమెని రహదారి మీదకు తీసుకెళ్లగా.. వంశీధర్ ఒడ్డుకు ఎక్కే క్రమంలో నీటి ప్రవాహ వేగానికి పట్టుతప్పి మళ్లీ కాలువలోకి పడిపోయాడు. స్థానికులు తాడువేసి కాపాడే ప్రయత్నం చేసేటప్పటికే వంశీధర్ నీటమునిగి పోయి గల్లంతయ్యాడు. దీనిపై సమాచారం అందుకున్న అవనిగడ్డ ఎస్ఐ మణికుమార్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేశ్ ఘటనాస్థలికి చేరుకొని వంశీధర్ కోసం గాలించారు. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ వి.పోతురాజు విజయవాడ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందా న్ని పిలిపించి.. గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కూతవేటు దూరంలో కారు దొరికినప్పటికీ.. వంశీధర్ ఆచూకీ మాత్రం లభించలేదు. జాతీయస్థాయి క్రీడాకారుడు.. ఈ ప్రమాదం నుంచి బయటపడిన లక్ష్మి ప్రస్తుతం అవనిగడ్డలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేశ్, ఆయన సతీమణి ఆస్పత్రికి చేరుకుని ఆమెను పరామర్శించారు. గల్లంతైన వంశీధర్.. సింహాద్రి రమేశ్‌కు మేనల్లుడు. జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో రజత పతకం సాధించిన వంశీధర్ క్రీడల కోటాలో 2012లో ఎస్ఐ పోస్టుకు ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం ద్రాక్షారామంలో ఎస్ఐగా పనిచేశారు. అక్కడ్నుంచి కాకినాడ టౌన్‌కి బదిలీ అయ్యారు. ప్రస్తుతం రామచంద్రపురం ఎస్ఐగా పనిచేస్తున్నారు. -
రుణం తీర్చుకునే తరుణం ఇదే..
నాలుగేళ్లు.. నానా సమస్యలు.. నా అన్నవారు లేక.. నేనున్నా అనేవారు లేక.. గుడ్ల నీరు బయటకు రానీయక.. నోట మాట లోపలికి మింగేస్తూ ఎన్నో వర్గాల ప్రజలు.. ఉగ్గబెట్టుకుని ఉన్న ఊపిరి వదలాలంటే భయపడిన వారే నేడు కట్టలు తెగిన ఆనందంతో ముందుకు ఉరుకుతున్నారు.. రాజన్న తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు పరుగుపరుగున వస్తున్నారు. రుణం తీర్చుకునే తరుణం ఇదే.. నీ వెంట మేమున్నాం నాలుగేళ్ల కంటకపాలన విముక్తి నీతోనే.. నిన్ను గెలిపించుకోవడం మా అవసరం. మహానేత సంరక్షణలో ఎంతో పొందిన తమను అస్పృçశ్యులుగా భావించి ఏ పథకాన్నీ అందుకోనీయకుండా మోకాలడ్డారు. ఆనాటి సంక్షేమ రాజ్యం నీతోనే అంటూ వెంట రాగా.. ప్రజా సంకల్ప యాత్ర సాగిస్తున్న జన హృదయాధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల సమస్యలు, వినతులూ వింటూ జగన్నాయకులపాలెం నుంచి రామచంద్రపురం వరకూ ముందుకు సాగారు. -
సత్యం ‘సమాధి’
వెంకటాయపాలెం(రామచంద్రపురం రూరల్): రెండు దశాబ్దాల క్రితం నాటి కేసు.. ఎలాగైనా బయటపడేందుకు అధికార బలం ప్రయోగించారు. ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెచ్చి లొంగదీసుకున్నారు. బాధితుల కులాన్నే మార్చేశారు. వారు దళితులు కాదని నిరూపించేందుకు పాత సమాధికి కొత్త పేరు తగిలించారు. దాన్ని ఫొటో తీసి కోర్టుకు అందజేశారు. అలాగే తప్పుడు ధ్రువీకరణ పత్రాలను కోర్టుకు సమర్పించారు. ఏకంగా న్యాయస్థానాన్నే తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. తూర్పు గోదావరి జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే సాగించిన అరాచకమిది. 18 దళిత సంఘాల నిజనిర్ధారణ కమిటీ విచారణలో వెలుగు చూసిన వాస్తవాలు నివ్వెరపరుస్తున్నాయి. నిజ నిర్ధారణ కమిటీ వివరాల ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో 21 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఇద్దరు దళితులకు శిరోముండనం చేయించారు. అప్పట్లో ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో తోట త్రిమూర్తులు మూడు నెలలు జైలులో ఉండి వచ్చారు. అప్పటి నుంచీ కేసు కోర్టుల్లో నలుగుతూనే ఉంది. ఏడాదిన్నర కాలంగా విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో విచారణ సాగుతోంది. గత ఏడాది అక్టోబర్‌లో తుది తీర్పు ఇచ్చే సమయంలో... కేసు నుంచి బయటపడేందుకు తోట త్రిమూర్తులు కొత్త ఎత్తుగడ వేశారు. ఎస్సీలు కాదని నిరూపించేందుకు.. కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని శిరోముండనం కేసులో తుది తీర్పు ఇచ్చే సమయంలో బాధితులైన కోటి చినరాజు, దడాల వెంకటరత్నంలను కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో శిరోముండనం బాధితులు అసలు దళితులే కాదని, క్రైస్తవ మతం స్వీకరించారని, ‘బీసీ–సి’ వర్గానికి చెందినవారని నిరూపించి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నుంచి బయటపడేందుకు ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పావులు కదిపారు. ఇందులో భాగంగా మండల తహసీల్దార్, గ్రామ వీఆర్వోలను సెలవుపై పంపించారు. తమకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడంపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. వారికి వెంటనే ఆ పత్రాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈలోగా బాధితులు ఎస్సీలు కాదని, క్రైస్తవ మతం స్వీకరించారంటూ ఎమ్మెల్యే త్రిమూర్తులు గ్రామంలోని తన పాలేరు కాలుకుర్చ జీవరత్నంతో తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయించారు. దీనికి సాక్ష్యంగా స్మశానంలో బాధితుడు కోటి చినరాజు తల్లి నాగమ్మ సమాధి అంటూ శిలువ ఉన్న ఒక పాత సమాధి ఫొటోను జత చేశారు. బాధితులు చినరాజు, వెంకటరత్నంలు రామచంద్రపురంలోని ఏసు ప్రేమాలయం చర్చిలో క్రైస్తవ మతం స్వీకరించారని, అందుకు తానే సాక్ష్యమని పాస్టర్ పేరిట ఎన్.శామ్యూల్ రాజు అనే వ్యక్తితో చెప్పించారు. ఆ వివరాలతో బాధితులు క్రైస్తవ మతానికి చెందినవారేనని తహసీల్దార్, ఆర్డీవోలు కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన 18 దళిత సంఘాల నేతలు నిజనిర్ధారణ కమిటీగా ఏర్పడి తహసీల్దార్‌ను, ఏసు ప్రేమాలయం చర్చి నిర్వాహకులను, గ్రామస్తులను విచారించారు. ఈ విచారణలో వాస్తవాలు బహిర్గతమయ్యాయి. బాధితులు ఎస్సీలు కాదని నిరూపించేందుకు ఎమ్మెల్యే చేసిన ప్రయత్నాలపై ఫొటోలు, వీడియో సాక్ష్యాలను కమిటీ సభ్యులు సేకరించారు. బాధ్యులను సస్పెండ్ చేయాలి వెంకటాయపాలెం గ్రామ స్మశానంలో ప్రొద్దోకు లక్ష్మి క్రైస్తవ మహిళ సమాధి ఉంది. దానిపై శిలువ, ముందు వైపున ఆమె పేరుతో శిలాఫలకం ఉంది. అదే సమాధి వెనుక వైపున కోటి నాగమ్మ పేరిట మరో శిలాఫలకాన్ని అతికించి, దానిని ఫొటో తీసి, జాయింట్ కలెక్టర్ కోర్టుకు సమర్పించారని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు గుర్తించారు. అలాగే, శామ్యూల్‌రాజు అనే పాస్టర్ తమ చర్చిలో లేరని ఏసు ప్రేమాలయం చర్చి నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అధికారుల తీరుపై దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రలోభాలకు లొంగిపోయి, క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండా దళితులకు అన్యాయం చేసేలా నివేదిక ఇవ్వడం దారుణమని మండిపడుతున్నారు. ఇప్పటికైనా బాధితులకు ఎస్సీ కుల ధ్రువపత్రాలను అందించాలని, అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఎమ్మెల్యే తోట త్రిమూర్తులును పదవి నుంచి తొలగించాలని, తప్పుడు నివేదిక ఇచ్చిన తహసీల్దార్, ఆర్డీవోలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
యూనిఫాం వేసుకురాలేదని..
- బాలికను బాలుర టాయిలెట్స్‌లో నిలబెట్టిన టీచర్ - సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఘటన - పాఠశాల ఎదుట తల్లిదండ్రులు, టీఆర్ఎస్ నాయకుల ఆందోళన - స్పందించిన కేటీఆర్.. వెంటనే డిప్యూటీ సీఎం దృష్టికి.. - విచారణకు ఆదేశించిన కడియం రామచంద్రాపురం(పటాన్చెరు): పాఠశాలకు యూనిఫాం వేసుకురాలేదని ఓ విద్యార్థినిని బాలుర మూత్రశాలలో నిలబెట్టారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం ఎంఐజీ కాలనీలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానిక రావూస్ ప్రైవేటు హైస్కూల్‌కు ఐదో తరగతికి చెందిన ఓ విద్యార్థిని శనివారం యూనిఫాం వేసుకోకుండా సివిల్ డ్రెస్‌లో వచ్చింది. గమనించిన పీఈటీ.. యూనిఫాం ఎందుకు వేసుకురాలేదని ప్రశ్నించింది. యూనిఫాం ఆరలేదని, అందుకే సివిల్ డ్రెస్ వేసుకుని వచ్చినట్లు విద్యార్థిని చెబుతున్నా.. టీచర్ వినిపించుకోలేదు. బాలికను తీసుకెళ్లి బాలుర మూత్రశాలలో నిలబెట్టింది. సాయంత్రం ఇంటికి ఏడుస్తూ వచ్చిన విద్యార్థిని.. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఇక ఆ స్కూల్‌కు వెళ్లనంటూ ఏడుస్తూ చెప్పింది. చిన్నారి తండ్రి రామకృష్ణ విషయాన్ని పాఠశాల యాజమాన్యం దృష్టికి సోమవారం తీసుకెళ్లారు. అయితే వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆయన స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కలిసి పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. గతంలోనూ పాఠశాల యాజమాన్యం విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు అనేకం ఉన్నాయని వారు ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు సెలవు ప్రకటించింది. మరోవైపు విద్యార్థిని తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఘటనపై ఫిర్యాదు చేశారు. చెప్పినా వినిపించుకోలేదు: విద్యార్థిని యూనిఫాం ఆరకపోవడంతో సివిల్ డ్రెస్ వేసుకుని స్కూల్‌కు వెళ్లాను. పీఈటీ పిలిచి యూనిఫాం ఎందుకు వేసుకురాలేదని తిట్టారు. విషయం చెబుతున్నా, డైరీలో రాసి ఉందని చెప్పినా వినిపించుకోలేదు. బాలుర బాత్రూమ్లో నిలబెట్టారు. స్కూలుకు వెళ్లనంటోంది: రామకృష్ణ, చిన్నారి తండ్రి యూనిఫాం ఆరకపోవడంతో పాపను సివిల్ డ్రెస్‌లో స్కూల్‌కు పంపించాం. విషయాన్ని డైరీలో సైతం రాశాం. పాప చెప్పేది వినిపించుకోకుండా ఉపాధ్యాయురాలు తిడుతూ అబ్బాయిల టాయిలెట్స్‌లో నిలబెట్టడం దారుణం. ఆ స్కూలుకు వెళ్లనంటే వెళ్లనని మా కూతురు ఏడుస్తోంది. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. ఎలాంటి శిక్ష వేయలేదు: ప్రియాంక, పీఈటీ ఉపాధ్యాయురాలు విద్యార్థినిని యూనిఫాం ఎందుకు వేసుకురాలేదని మాత్రమే అడిగాను. అంతేతప్ప బాత్రూమ్లో నిలబెట్టలేదు. తరగతి గది పక్కన బాలుర బాత్రూమ్ ఉంది. దాని ఎదురుగా బయటే పాపను ప్రశ్నించాను తప్ప ఎలాంటి శిక్ష వేయలేదు. డిప్యూటీ సీఎం సీరియస్.. విచారణకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: యూనిఫాం వేసుకోలేదని విద్యార్థినిని బాలుర టాయిలెట్స్ వద్ద నిలబెట్టిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పాఠశాలను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలోని ఓ స్కూల్లో యూనిఫాం వేసుకుని రాలేదని అబ్బాయిల టాయిలెట్ వద్ద అమ్మాయిని నిలబెట్టారని ట్వీటర్లో వచ్చిన పోస్ట్‌పై మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇలాంటి సంఘటనలు జరగకూడదని, విషయాన్ని వెంటనే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్తానని సమాధానమిచ్చారు. అనంతరం కేటీఆర్ ట్వీట్‌పై స్పందించిన కడియం.. బాలికను ఇబ్బంది పెట్టిన హైస్కూల్‌కు వెంటనే వెళ్లి తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు డీఈవోలు సత్యనారాయణరెడ్డి, విజయకుమారి.. బీహెచ్ఈఎల్లోని రావూస్ హైస్కూల్‌ను తనిఖీ చేశారు. యూనిఫాం వేసుకొని రానందున స్కూల్ పీఈటీ విద్యార్థినిని అబ్బాయిల టాయ్‌లెట్ వద్ద నిలబెట్టినది వాస్తవమేనని ధ్రువీకరించారు. విజయకుమారి విలేకరులతో మాట్లాడుతూ.. ఈ పాఠశాలకు రంగారెడ్డి జిల్లాలో అనుమతులు ఉన్నాయని, కానీ సంగారెడ్డి జిల్లా పరిధిలో కొనసాగిస్తున్నారని తెలిపారు. దీనిపై గతంలో నోటీసులు కూడా ఇచ్చామని, అయినా స్పందించకపోవడంతో రెండుసార్లు పాఠశాలను సీజ్ చేశామని వివరించారు. మరోవైపు పీఈటీని వెంటనే తొలగించామని పాఠశాల యాజమాన్యం అధికారులకు తెలియజేసింది. ఈ మేరకు జరిగిన సంఘటనను, స్కూల్ మేనేజ్మెంట్ తీసుకున్న చర్యలను వివరిస్తూ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. నివేదిక అందగానే చర్యలు చేపడతామని కడియం వెల్లడించారు. -
ఏడడుగుల సంబంధం...
రామచంద్రపురం : స్థానిక పదంవారివీధిలో క్రీస్తు సంఘం చర్చిలో మరుగుజ్జుల జంట వివాహం చేసుకుని ఒక్కటైంది. కాకినాడకు చెందిన పులిదిండి తాతారావు (4 అడుగులు)కు పట్టణానికి చెందిన బూల మాధవి (3 అడుగులు)లకు చర్చి పాస్టర్ నందిక ప్రసాద్ పెద్దల సమక్షంలో వివాహం చేశారు. వీరిద్దరూ మరుగుజ్జులు కావడంతో ప్రభుత్వం సహకారాన్ని అందించి ఆదుకోవాలని పెద్దలు కోరారు. పెద్దలు కొమ్ము అబ్బులు, కొమ్ము నాగేశ్వరరావు, కొమ్ము సురేష్, మడికి చాయా, చాపల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఈ బాలుడికి...ఏదీ ‘ఆధారం’
- ఒకే పేరుతో ఐదు ఆధార్ కార్డులు - అసలు నంబరేదో తెలియక తికమక - సమన్వయలోపంతో బయటపడిన నిర్లక్ష్యం. రామచంద్రపురం: ‘ ఆధార్ కార్డు రావాలంటే సవాలక్ష నిబంధనలు ... ఒకసారి నంబరు ఖరారైందంటే దేశవ్యాప్తంగా ఎక్కడైనా అదే ‘ఆధారం’. అందుకే అన్నింటా ఆధార్ లింక్ చేశారు. ఈ హడావుడి చూస్తే ఎంతో పక్కాగా సాగుతుందోనని అనిపిస్తోంది కదూ. కానీ రామచంద్రాపురం పట్టణంలోని కొత్తూరులో ఘటన వింటే ‘ఇదేమిటీ కొత్త పితలాటకం’ అని ముక్కున వేలేసుకుంటారు. ఇక్కడ నాలుగేళ్ల బాబుకు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు ఆధార్ కార్డులు మంజూరు చేసేసిన వైనం బయటపడింది. రామచంద్రాపురం ఒకటో వార్డులోని మడికి లక్ష్మీ సుజాత కుమారుడు మడికి ధర్మ అనే బాలుడికి ఆధార్‌కార్డులు పోస్టు ద్వారా వచ్చాయి. ఆ కవరు విప్పి చూడగా పేరు ఒక్కటే ... వేర్వేరు నంబర్లతో ఐదు ఆధార్ కార్డులు రావటంతో ఏది ఉంచుకోవాలో తెలియక అయోమయానికి గురయ్యారు. . ‘ఆధార్’ నమోదు ఇలా... సాధారణంగా ‘ఆధార్’ నమోదు కోసం మీ సేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తును తీసుకోవాలి. ఈ దరఖాస్తు నింపిన తరువాత ఇందులో సమాచారం నిజమేనని సంబంధిత వీఆర్వోతో ధ్రువీకరించాలి. తల్లిదండ్రుల ఆధార్ కార్డుల జిరాక్స్లో మీసేవా సెంటర్లో వేలిముద్రలు తీసుకొని ఐరిష్‌తో నమోదు చేస్తారు. . జరుగుతుందిలా... గతంలో కొంత మంది ప్రయివేటు ఏజెన్సీలకు ఆధార్ నమోదు బాధ్యతను అప్పగించారు. సంబంధిత కిట్లు వారి వద్దనే ఉండిపోవటం, అధికారుల పర్యవేక్షణ లేకపోవటంతో ఆయా ప్రవేటు వ్యక్తులు ఊరూరా తిరిగి ఇంటింటికీ వెళ్లి నిబంధనలకు విరుద్ధంగా వీఆర్వోల ధ్రువీకరణ లేకుండానే ఎన్‌రోల్‌మెంట్‌ను చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆధార్ ఎన్రోల్మెంట్కు రూ.100 నుంచి రూ. 200 వరకూ వసూలు చేస్తున్నారు. ఈవిధంగా జిల్లాలోని పలు డివిజన్ల పరిధిలో ఈ తతంగం సాగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రామచంద్రపురం డివిజన్లోని రాయవరం, రామచంద్రపురం, కె.గంగవరం. కాజులూరు, మండపేట, అనపర్తి, బిక్కవోలు మండలాలతోపాటుగా మండపేట, రామచంద్రపురం మున్సిపాలిటీలు కాకినాడ డివిజన్, అమలాపురం తదితర డివిజన్ పరిధిలోని మండలాల్లో కూడా ఇటువంటి వ్యవహారం అధికంగా సాగుతున్నట్టు సమాచారం. ఇంటింటికీ వెళ్లి నమోదు చేస్తున్నవారికి సరైన అవగాహన లేకపోవటం, వీఆర్వోల ధ్రువీకరణ లేకుండానే అశాస్త్రీయంగా ఒకరినే పలుమార్లు ఎన్రోల్ చేస్తుండడంతో ఈ పొరపాట్లు జరుగుతున్నాయని రెవెన్యూ వర్గాలే చెబుతున్నాయి -
ఫైబర్‌గ్రిడ్ ఎక్కడ?
- జనవరి 5న రామచంద్రపురం సభలో ప్రకటించిన సీఎం - 45 రోజుల్లో ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు - 100 రోజులు దాటినా అతీగతీ లేదు - ఐటీ మంత్రిగా ఆయన తనయుడు లోకేష్ నేడు రాక - ఇప్పటికైనా ఏర్పాటుచేస్తారా అని ఎదురు చూస్తున్న ప్రజలు సాక్షి, రాజమహేంద్రవరం : ‘‘రామచంద్రపురం పట్టణంలో 45 రోజుల్లో ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తాం. పట్టణంలో ఉన్న 12,500 ఇళ్లకు కనెక్షన్ ఇస్తాం. రూ.149కే టీవీ, ఇంటర్నెట్ వినియోగించకోవచ్చు. 45 రోజుల తర్వాత నేను మీతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడతాను’’ - ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనవరి 5న రామచంద్రపురంలో జరిగిన ‘జన్మభూమి - మా ఊరు’ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సభలో చెప్పిన మాటలు. ఇది విన్న రామచంద్రపురం ప్రజలు సంతోషంలో ఓలలాడారు. ఇక ప్రతి నెలా రూ.149కే కేబుల్ కనెక్షన్ వస్తుందని, కంప్యూటర్ ఉన్నవారికి ఇంటర్నెట్ బిల్లు కట్టనవసరంలేదని భావించారు. యువత, స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఉచితంగా ఇంటర్నెట్ ఉపయోగించుకోవచ్చని ఆనందపడ్డారు. ముఖ్యమంత్రి ఈ మాటలు చెప్పి 100 రోజులు దాటింది. ఇప్పటివరకూ ఆ హామీకి అతీగతీ లేదు. 45 రోజుల్లోనే ఫైబర్‌గ్రిడ్ ఏర్పాటు చేస్తామని చెప్పిన సీఎం ఆ తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. ఫైబర్‌గ్రిడ్ ఏర్పాటుపై అధికారులకు ఎటువంటి ఆదేశాలూ ఇవ్వలేదు. 45 రోజులు పూర్తవుతున్నా ఎటువంటి చర్యలూ కనిపించకపోవడంతో ఎన్నికల హామీల్లాగే దీనిని కూడా చంద్రబాబు గాల్లో కలిపేశారని అనుకున్నారు. తాజాగా చేసిన మంత్రివర్గ విస్తరణలో చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్‌కు ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఇచ్చారు. ఫైబర్‌గ్రిడ్ ఏర్పాటు ఐటీ పరిధిలో ఉంటుంది. అప్పటివరకూ ఈ శాఖ పల్లె రఘునాథరెడ్డి వద్ద ఉండడంతో ఐటీ రంగంలో పరుగు తీయలేకపోయామని భావించిన ముఖ్యమంత్రి ఆ శాఖను తన తనయుడికి కట్టబెట్టారు. లోకేష్ ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా మన జిల్లాకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో తండ్రి చంద్రబాబు తమకు ఇచ్చిన హామీ నెరవేర్చడంపై లోకేష్ దృష్టి పెడతారా? లేదా? అని రామచంద్రపురం ప్రజలు ఎదురు చూస్తున్నారు. -
మున్సిపల్ చైర్మన్‌గా గోపాలబాబు ప్రమాణస్వీకారం
రామచంద్రపురం : స్థానిక మున్సిపల్ చైర్మ¯ŒSగా ఎస్ఆర్కే గోపాలబాబు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. స్థానిక కౌన్సిల్ హాల్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో తొలుత ఆయనను చైర్మ¯ŒSగా టీడీపీ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఈ సమావేశానికి ప్రత్యేకాధికారిగా హాజరైన జేసీ ఎస్.సత్యనారాయణ ఈమేరకు ఎన్నిక ధ్రువపత్రాన్ని ఆయనకు అందజేశారు. గోపాలబాబు ఇటీవల జరిగిన 17వవార్డు ఉప ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలుపొందిన విషయం విదితమే. ఎక్స్అఫీషియో సభ్యునిగా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, కమిషనర్ చిలకమర్తి శ్రీరామశర్మ, మున్సిపల్ మేనేజర్ జి. రాధాకృష్ణ హాజరయ్యారు. మండపేట మున్సిపల్ చైర్మ¯ŒS చుండ్రు శ్రీవరప్రకాశ్ ఈ సందర్భంగా విచ్చేసి గోపాలబాబును అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
రామచంద్రాపురం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం గంగిరెడ్డిపాలెం వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఎన్ ఆర్ కంపల్లి గ్రామానికి చెందిన హంస(48) రోడ్డు మీద నుంచి వెళ్తున్న వ్యక్తిని లిఫ్ట్ అడిగి అతని స్కూటర్‌పై రామచంద్రాపురం వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో వాహనం పై నుంచి ఎగిరి పడిన ఆమెకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. వాహనం నడుపుతున్న వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
జల్లికట్టులో అపశ్రుతి
రామచంద్రాపురం(చిత్తూరు): జల్లికట్టులో అపశ్రుతి చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం నేతకుప్పం గ్రామంలో ఆదివారం జరుగుతున్న జల్లికట్టులో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. జల్లికట్టును తమ కెమరాల్లో బంధించడానికి యత్నిస్తున్న ఇద్దరు యువకులకు కరెంట్ షాక్ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. -
యథేచ్ఛగా గోవధ
అనధికార కబేళాపై అధికారుల దాడి కబేళాకు సిద్ధం చేసిన గోవులు స్వాధీనం గోశాలకు తరలింపు రామచంద్రపురం: ‘హృదయ విదారకమైన దృశ్యాలు.... పశువధలు,... పశుకళేబరాలు.. వ్యర్థ పదార్థాలు, దుర్భరమైన దుర్వాసన వస్తున్న ప్రదేశాలు... ఇదీ.. రామచంద్రపురం పట్టణంలోని రాజబాబు నగర్‌లోగల పరిస్థితి. కొంతకాలంగా కాలనీలో జరుగుతున్న అనధికార కబేళా అంశాన్ని గతంలో సాక్షి పలు సందర్భాల్లో ప్రచురించింది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అధికారులు, మీడియా సంయుక్తంగా దాడులు నిర్వహించగా అక్రమ పశువధలు కనిపించాయి. పట్టణంలోని రాజగోపాల్ సెంటర్‌కు కూత వేటు దూరంలో గల రాజబాబునగర్‌లో కొంత కాలంగా నిర్వహిస్తున్న అనధికార కబేళాపై తహసీల్దార్ పి.రామ్మూర్తి, కమిషనర్ సీహెచ్ శ్రీరామశర్మ, ఎస్సై నాగరాజు దాడులు నిర్వహించారు. రోడ్డు పక్కనే గల ఒక పాడు బడ్డ ఇంట్లో కబేళాకు తరలించేందుకు సిద్ధం చేసిన 11 ఆవులున్నాయి. సమీపంలో నాలుగు ఇళ్లలో కబేళా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఒక ఇంట్లో అప్పుడే పీక కోయబడిన గోమాతను అధికారులు గుర్తించారు. తాళాలు వేసి ఉన్న మరో మూడు ఇళ్లను తెరిచి చూడగా పశు కళేబరాలు, అవశేషాలు, చర్మాలు, ఎండబెట్టిన పేగులు కనిపించాయి. దీంతో పాటు డ్రెయిన్లలో రక్త కలిసిన నీరు ప్రవహించడాన్ని అధికారులు గుర్తించారు. ఈ అంశాలపై అధికారులు స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. కబేళాకు తీసుకువచ్చిన 11 ఆవులను రాజమండ్రిలోని గోశాలకు తరలిస్తున్నట్లు తహసీల్దార్ రామ్మూర్తి తెలిపారు. ఈ కబేళాపై పంచనామా నిర్వహించి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు కమిషనర్ సీహెచ్ శ్రీరామశర్మ తెలిపారు. అంతేకాకుండా ఆయా ఇళ్లలోని పశు వ్యర్థాలను, పేగులను, చర్మాలను తొలగించి పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయిస్తామని వివరించారు. స్థానికులు ఆరోగ్య పరిర„ý ణకు తమకు సహకరించాలని కమిషనర్ కోరారు. కబేళా నిర్వాహకులపై మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్సై నాగరాజు తెలిపారు. -
ముగిసిన బాస్కెట్‌బాల్ టోర్నీ లీగ్ మ్యాచ్‌లు
నేడే సెమీఫైనల్స్, ఫైనల్స్ రామచంద్రపురం : పట్టణంలో నిర్వహిస్తున్న ఐదో జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో లీగ్మ్యాచ్లు మంగళవారం ముగిశాయి. ఈ పోటీలు స్థానిక కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న విషయం తెలిసిందే. పురుషుల ప్రిలిమినరీ పోటీల్లో గుడివాడపై మార్టేరు జట్టు, ఏపీ పోలీస్ జట్టుపై రామచంద్రపురం ఎ, ఆర్బీఐ రాజమండ్రిపై రాయుడు వారియర్స్ ఒడిశా, అట్లరీ బాయిస్ హైదరాబాద్‌పై ఈస్ట్‌కోస్టు విశాఖ, ఎన్టీఆర్ గుంటూరుపై సాయిరాజ నందిని ఛత్తీస్‌గఢ్, రామచంద్రపురం బి జట్టుపై అనంతపురం, అమలాపురంపై తెలంగాణ పోలీస్, జి మామిడాడ జట్టుపై ఏఓసీ హైదరాబాద్ జట్లు విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. కాగా క్వార్టర్ ఫైనల్స్‌లో మార్టేరు జట్టు రామచంద్రపురం ఎ జట్టుతోను, రాయుడు వారియర్స్ ఒడిశా జట్టు ఈస్ట్‌కోస్టు విశాఖ, అనంతపురం జట్టు సాయిరాజ నందిని చత్తీస్‌గఢ్ జట్టుతోను, ఏఓసీ హైదరాబాద్ జట్టు తెలంగాణ పోలీస్ జట్టుతోను తలపడనున్నాయి. మహిళల విభాగంలో.. మహిళల విభాగంలో సీపీఏ రాజమండ్రిపై మార్టేరు ఎన్టీఆర్ గుంటూరు జట్టు, ఆర్బీఐ రాజమండ్రిపై మార్టేరు జట్లు విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. మొత్తం పురుషుల విభాగంలో 36 జట్లు, మహిళల విభాగంలో 10 జట్లు పాల్గొన్న ఈ పోటీలలో ఇప్పటి వరకూ 46 లీగ్ మ్యాచ్‌లను నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచి క్వార్టర్ ఫైనల్స్‌తో పాటుగా సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లకు కూడా నిర్వహిస్తారు. బాస్కెట్‌బాల్ అసోసియేష¯ŒS జిల్లా అధ్యక్షుడు సి స్టాలిన్, గన్నమని చక్రవర్తి పాల్గొన్నారు. -
ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీని ఎలా చేధించారంటే..
-
అదృష్టదీపక్‌కు సత్కారం
రామచంద్రపురం : విజయవాడ స్వరా జ్య మైదా¯ŒSలో జరిగిన జాతీయ పుస్తక మహోత్సవంలో తనను ఘనంగా సత్కరించినట్టు ప్రముఖ సినీ గేయ రచయిత, కవి, విమర్శకుడు అదృష్టదీపక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం, ఎన్టీఆర్ ట్రస్ట్‌ల సంయుక్త ఆధ్వర్యాన జరిగిన ఈ మహోత్సవంలో ‘రచయితల సాహిత్యానుభవాలు’ అనే కార్యక్రమం నిర్వహించారన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 20 మంది పైగా కవులు తమ సాహిత్యానుభావాలను సాహితీ అభిమానులతో పంచుకున్నారన్నారు. ఇందులో హాస్యావధాని శంకరనారాయణ, చంద్రలత, అమ్ముంగి వేణుగోపాల్, ఎలనాగ, కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, నామాడి శ్రీధర్, దేవదానంరాజు తదితర కవులతోపాటు తానూ పాల్గొన్నట్లు అదృష్టదీపక్ తెలిపారు. సభానంతరం డాక్టర్ జీవీ పూర్ణచందు, బండ్ల మాధవరావు, గుత్తికొండ సుబ్బారావు, ఎక్స్‌రే కొల్లూరి, ఎమెస్కో విజయకుమార్ తదితరుల చేతుల మీదుగా సత్కారం అందుకున్నట్లు ఆయన వివరించారు. -
హోరాహోరీగా బాస్కెట్‌బాల్ టోర్నీ
రామచంద్రపురం : స్కూల్ గేమ్స్ ఫెడరేష¯ŒS అండర్–19 బాలుర, బాలికల 62వ బాస్కెట్‌బాల్ పోటీలు స్థానిక కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో హోరాహోరీగా జరుగుతున్నాయి. రెండో రోజైన గురువారం నాటికి పోటీలు క్వార్టర్స్ దశకు చేరుకున్నాయి. పూల్–ఏలో కృష్ణా, కడప, పూల్–బీలో గుంటూరు, పశ్చిమ గోదావరి, పూల్–సీలో చిత్తూరు, అనంతపురం, పూల్–డీలో తూర్పుగోదావరి, కర్నూల్ జట్లు క్వార్టర్స్‌కు చేరుకున్నాయి. కర్నూల్‌పై గుంటూరు, చిత్తూరుపై కడప, అనంతపురంపై కృష్ణా, తూర్పుగోదావరిపై పశ్చిమ గోదావరి జట్లు తలపడనున్నాయి. బాలికల విభాగంలో వైజాగ్‌పై చిత్తూరు 33–15, నెల్లూరుపై అనంతపురం 36–02, కృష్ణాపై తూర్పుగోదావరి 22–11, పశ్చిమగోదావరిపై కర్నూల్ 20–10, నెల్లూరుపై కర్నూల్ 17–8 పాయింట్లతో గెలుపొందాయి. తూర్పుగోదావరి–చిత్తూరు, విశాఖ–కృష్ణా, అనంతపురం–పశ్చిమ గోదావరి జట్లు తలపడనున్నాయి. ఎస్జీఎస్ ప్రతినిధి పి.సీతాపతి, ఎస్జీఎస్ అండర్–19 జిల్లా కార్యదర్శి వై.తాతబ్బాయి పోటీలను పర్యవేక్షించారు. పీడీలు జంపన రఘురాం, గెడా శ్రీనివాస్ బాస్కెట్‌బాల్ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నమని చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
రెండు కార్లు ఢీ.. ఏడుగురికి తీవ్ర గాయాలు
ముగ్గురి పరిస్థితి విషమం రామచంద్రపురం: పసలపూడి– చోడవరం బైపాస్ రోడ్డులో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. రామచంద్రపురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజమండ్రికి చెందిన పిన్ని వీరాస్వామి ఆయన భార్య శ్రావణి నాగజ్యోతి,పిల్లలు భవ్యశ్రీ సత్య, మనోహర్ సత్యదీప్, శ్రావణి నాగజ్యోతి తాతయ్య సీతారామయ్య, నానమ్మ మంగ తాయారు, పిన అత్తగారు తణుకు శ్రీదేవి మండపేట వచ్చారు. అక్కడి నుంచి సామర్లకోట వెళ్లారు. కారులో వారు తిరిగి మండపేట వస్తుండగా రామచంద్రపురం బైపాస్ రోడ్డులో ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టింది. దాంతో వారందరూ తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని హుటాహుటిన రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు మనోహర్ సత్యదీప్, సీతారామయ్య, మంగతాయారుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని కాకినాడ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)కి తరలించారు.ఎస్సై శ్రీనునాయక్ ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎదురుగా వచ్చి ఢికొట్టిన కారు డ్రైవరు, మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై తెలిపారు. -
రెండు గ్రామాల్లో దొంగల హల్చల్
రామచంద్రాపురం(భువనగిరి అర్బన్) భువనగిరి మండలంలోని రామచంద్రాపురం, రామకృష్ణపురం గ్రామాల్లో ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో దొంగలు హల్చల్ చేశారు. నాలుగు ఇళ్లలో చోరీ చేశారు. మరో రెండిళ్లలో దొంగతనానికి ప్రయత్నించారు. ఈ ఇళ్లలో మొత్తం అరతులం బంగారం, 40 తులాల వెండి, రూ. 2వేల నగదు అపహరించుకుపోయారు. పోలీ సులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన స్వప్న భర్త బుచ్చిరెడ్డి కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె తన చిన్న కూతురు స్వర్ణలతతో కలిసి ఉంటున్నారు. శనివారం తమ ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌లోని నాగారంలో ఉన్న ఆమె పెద్ద కుమార్తె స్వాతి ఇంటికి వె ళ్లారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో దొంగలు ఇంటికి ఉన్న తాళంను తమ వెంట తెచ్చుకున్న గడ్డపారతో పగులగొట్టి లోనికి ప్రవేశించి బెడ్ రూంలో ఉన్న రెండు బీరువాలను తెరిచారు. అందులో ఉన్న అర తులం బంగారం, 20 తులాల వెండి, 1000 రూపాయల నగదును అపహరించకపోయారు. మరో ఇంట్లో.. అక్కడి నుంచి వారి ఇంటికి ఎదురుగా ఉన్న కొమ్మురెల్లి వెంకట్‌రెడ్డి గృహంలోకి ప్రవేశించారు. కాగా వెంకటరెడ్డి కొన్ని రోజులుగా తన ఇంటికి కీడు వచ్చిందని పక్కన మరో ఇంట్లో ఉంటూ సామగ్రి అందులోనే ఉంచాడు. దాంతో వదిలేసిన ఇంట్లోని బీరువాను తెరచి అందులో ఉన్న 24 తులాల వెండి సామగ్రిని, రూ. వెయ్యి నగదు చోరీ చేశారు. రామకృష్ణాపురంలో.. రామకృష్ణాపురం గ్రామానికి చెందిన భువనగిరి సోమయ్య ఇంట్లో ఎవరూ లేక పోవడంతో బీరువాలో ఉ న్న రూ. 5 వేల నగదును అపహరించుకుని, పక్కనే ఉన్న కోళ్ల మహేష్‌కు చెందిన ఎఫ్‌జెడ్ బైకును తీసుకెళ్లారు. అక్కడి నుంచి వెళ్లి సుర్పంగ మల్లేష్, భువన గిరి ఈశ్వర్ ఇళ్లలో చోరీకి ప్రయత్నించారు. ఇళ్లలో ఉన్న వారు గమనించడంలో అక్కడి నుంచి పారిపోయారు. బైక్‌ను గ్రామ సమీపంలో వదిలి వెళ్లారు. ఉదయం 5 గంటల సమయంలో తలుపులు తెరచి ఉండటాన్ని చూసిన గ్రామస్తులు చోరీ జరిగిందని భావించి వెంటనే గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ అర్జునయ్య, ఎస్ఐ సాజిదుల్లా, సిబ్బంది వెంటనే అక్కడికి చెరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఉదయం 8 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరిం చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు రూరల్ ఎస్ఐ ఎండీ.సాజిదుల్లా తెలిపారు. -
హాస్టల్ విద్యార్థి మృతి
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు రామచంద్రపురం : రాత్రి మంచంపై నిద్రపోయిన బాలుడు తెల్లారేసరికి విగత జీవిగా మారాడు. రామచంద్రపురం హాస్టల్లో విద్యార్థి మృతి అనుమానాస్పదంగా జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రౌతులపూడి మండలం ఎం. కొత్తూరుకు చెందిన వంతు చిట్టిబాబు(16) పట్టణంలోని లలితానగర్‌లో గల కృత్తివెంటి పేర్‌ారజు పంతులు పశు వైద్య పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సుమారు నెల్లాళ్ల క్రితం కాలేజీలో చేరిన చిట్టిబాబు పక్కనే గల హాస్టల్లో ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం యథావిధిగా తన కార్యక్రమాలను ముగించుకుని భోజనం చేసి తోటి విద్యార్థులతో కలిసి హాస్టల్లో మంచంపై నిద్రపోయాడు. శనివారం ఉదయాన్నే విద్యార్థులందరూ లేచి తమ పనులు చేసుకుంటుండగా చిట్టిబాబు ఎంతకీ లేవలేదు. దాంతో సహవిద్యార్థులకు అనుమానం వచ్చి చూసే సరికి మరణించినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు వచ్చి పరిశీలించి చిట్టిబాబు తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు. ప్రిన్సిపాల్ కె. అశ్వినీకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. చిట్టిబాబు 10వతరగతిలో 9.8 పాయింట్లు సాధించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా విజయవాడలో ప్రతిభా అవార్డును అందుకున్నాడు. చిట్టిబాబు మృతితో కళాశాల విద్యార్థుల్లో విచారం చోటు చేసుకుంది. -
విద్యుదాఘాతంలో పాలిటెక్నిక్ విద్యార్థి మృతి
రామచంద్రపురం(అవనిగడ్డ): మండల పరిధిలోని రామచంద్రపురం దివిసీమ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి రాయి యస్వంత్‌రెడ్డి (16) విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కంటిపూడికి చెందిన యస్వంత్‌రెడ్డి నాలుగు నెలల క్రితం దివిసీమ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ కోర్సులో చేరాడు. రామచంద్రపురంలోని కళాశాల వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్నాడు. బుధవారం రాత్రి స్నానం చేసిన తరువాత ఇనుపతీగపై బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. ఇది గమనించిన వసతిగృహ సిబ్బంది వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా పరీక్షచేసిన వైద్యులు అప్పటికే మరణించినట్టు ధ్రువీకరించారు. ఈ మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మణికుమార్ చెప్పారు. శుక్రవారం నుంచి కళాశాలకు దసరా సెలవులు ఇవ్వాల్సి ఉండగా, యస్వంత్‌రెడ్డి మృతితో గురువారం నుంచి కళాశాలకు సెలవులిచ్చారు. ఒక్కగానొక్క కొడుకు! కంటిపూడికి చెందిన వెంకటరెడ్డి, సుజాతకు యస్వంత్‌రెడ్డి ఒక్కగానొక్క కుమారుడు. వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగించే ఈ కుటుంబం పలు ఇబ్బందులు ఎదురైనా తమ కుమారుడుని ఉన్నత చదువులు చదివించుకుని ప్రయోజకుడిని చేయాలనుకున్నారు. ఈ నే పథ్యంలో అల్లారు ముద్దుగా పెంచుకుని చదివించుకుంటున్న కొడుకు ఇలా మరణించడంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు, సర్పంచి నలుకుర్తి పృధ్వీరాజ్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు వైద్యశాలకు చేరుకుని మృతుని తల్లిదండ్రులను పరామర్శించారు. -
42 తులాల బంగారం అపహరణ
రామచంద్రపురం: ఇంటిలో ఎవరూ లేని సమయంలో దుండగులు ఇంటి తాళాలను బద్దలు కొట్టి కొల్లగొట్టారు. భాదితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని కేఎస్ఆర్ నగర్‌కు చెందిన బిక్కిన వెంకటేశ్వరరావు తన తల్లికి ఆపరేషన్ చేయించేందుకు హైదరాబాద్ వెళ్లారు. ఇంటిలో భార్య శిరీష మాత్రమే ఉన్నారు. కాగా ఆదివారం సాయంత్రం శిరీష ఇంటికి తాళం వేసి హౌసింగ్ బోర్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి Ðð ళ్లారు. ఆమె తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళాలు, ఇంటిలోని బీరువా తలుపులు బద్దలుకొట్టి ఉన్నాయి. బీరువాలో గల 42 తులాల బంగారం, 10 తులాల వెండితో పాటు రూ. 20 వేల నగదును దొంగలు అపహరించుకు పోయారు. ఈ సమాచారాన్ని సోమవారం పోలీసులకు అందించటంతో రామచంద్రపురం డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, సీఐ కె. శ్రీధర్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాకినాడ నుంచి క్లూస్ టీం సభ్యులు సంఘటన స్థలంలో ఆధారాలను సేకరించారు. శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మొత్తం విలువ రూ 4.45లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. -
జాతీయ రహదారిపై తగ్గని నీరు
రామచంద్రాపురం: పట్టణంలోని నాగులమ్మ దేవాలయం సమీపంలో జాతీయ రహదారిపై నాలుగో రోజు కూడా నీరు పెద్ద ఎత్తున చేరింది. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఇప్పటికే రోడ్డుపై నీరు ఉండడంతో రోడ్డు గుంతలమయంగా మారింది ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారు. స్థానిక పోలీసు అధికారులు రోడ్డు వద్దనే ఉండి ట్రాఫిక్‌ను పూర్తిస్థాయిలో నియంత్రిస్తున్నారు. ద్విచక్రవాహనదారులను ఈ మార్గంంలో రాకుండా చెరువు కట్టపై నుంచి పంపిస్తున్నారు. అయితే ఆ నీళ్లలో నుంచి కార్లు మొరాయించడంతో యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సందర్శించారు. నీటి తీవ్రత పెరగడంతో జెసీబీల ద్వారా నీరు పోయేలా కాలువలు తీశారు. -
ఏమైందో.. ఏమో!
దంపతుల ఆత్మహత్య.. అనాథగా మిగిలిన చిన్నారి రామచంద్రాపురం: అనుమానాస్పద స్థితిలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన రామచంద్రాపురం పోలీసుస్టేషన్ పరిధిలోని విద్యుత్‌నగర్ కాలనీలో గురువారం రాత్రి జరిగింది. ఎస్సై ప్రవీణ్‌రెడ్డి కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా తాడిపత్రికి చెందిన సీహెచ్ వెంకటసురేశ్ (30), అదే ప్రాంతానికి చెందిన భవాని (25)కి ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు సాయిదీప్ ఉన్నాడు. కాగా, వెంకటసురేశ్ హైటెక్‌సీటీ ప్రాంతంలోని హెచ్‌సీఎల్ పరిశ్రమలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. 8 నెలల క్రితం జీడిమెట్ల నుంచి వచ్చి విద్యుత్‌నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేవారని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. కాగా, గురువారం సాయంత్రం పరిచయస్తుడు ఒకరు వెంకటేశ్ ఇంటికి వచ్చారని, ఆ సమయం సాయిదీప్ ఏడుస్తుండగా గమనించి.. ఆయన లోనికి వెళ్లి చూడగా ఘోరం వెలుగు చూసిందని మృతుల బంధువులు చెబుతున్నారు. సదరు పరిచయస్తుడు ఇచ్చిన సమాచారంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. వారంతా లోనికి వెళ్లి చూడగా బెడ్రూమ్లో భవాని ఉరివేసుకొని ఉంది. ఆమె గదికి లోపలి నుంచి గడియపెట్టి ఉంది. భార్య మొదట ఆత్మహత్య చేసుకోవడంతో.. ఆ భయంతో సురేశ్ కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా, మృతురాలి అన్న పవన్‌కుమార్‌కు పోలీసులు సమాచారం ఇచ్చారు. తన బావ ఎవరికో అప్పు ఇప్పించాడని, ఆ విషయంలో కొద్ది రోజులుగా బాధ పడుతున్నట్టు వివరించాడు. అంతేకాకుండా వెంకటేశ్ తాగుడుకు బానిస కావడంతో చికిత్స చేయించుకుంటున్నట్టు తెలిపారు. తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవడంతో సాయిదీప్ అనాథగా మిగిలాడు. -
ఉరేసుకొని దంపతుల ఆత్మహత్య
మెదక్: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా రామచంద్రపురంలోని బీహెచ్ఈల్ వింగ్-2లో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న వెంకట సురేష్(34), భవాని(26) దంపతులు గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఆ దంపతులిద్దరూ ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
భారీగా.. ‘తిరంగా’
‘భారతమాతకు జై, వందేమాతరం’ నినాదాలతో పట్టణం మారుమోగింది. ప్రధాని మోదీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీచేపట్టిన తిరంగా యాత్రలో భాగంగా గురువారం బీజేపీ, మోడరన్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో 1,100 అడుగు భారీ జాతీయ పతాకంతో పట్టణ వీధులలో చేసిన ప్రదర్శన ప్రజలలో ఉత్తేజాన్ని నింపింది. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు అయ్యాజీ వేమా, పార్టీ పట్టణ అధ్యక్షుడు కొట్టువాడ హరిబాబు, మోడరన్ అధినేత జీవీ రావుల నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి చిట్టిబాబు, తమలంపూడి రామకృష్ణ, కోన సత్యనారాయణ, జాస్తి విజయలక్ష్మి, చక్రవర్తి, బుల్లబ్బులు, అవసరాల వెంకటరమణ, ఆకేటి కృష్ణ, బండారు సూరిబాబు, సతీష్‌నాయుడు, వంజరపు రామకృష్ణ, సుందరసింగ్ తదితరులుపాల్గొన్నారు. – రామచంద్రపురం -
ఆశ్రమం ముసుగులో దగా
చిన్నారులతో భిక్షాటన అనాథలతో చెలగాటం నిర్వాహకుడి నిర్వాకం పోలీసులు పట్టుకోవడంతో వెలుగుచూసిన వైనం ఆశ్రమాన్ని సీజ్ చేసిన అధికారులు రామచంద్రాపురం: పేరుకు ఓ అనాథ ఆశ్రమం. అక్కడ ఆశ్రమం ఉన్నట్టు ఎవరికీ తెలియదు. పైగా అందులో ఎంత మంది పిల్లలున్నారు? వారు ఏం చేస్తున్నారన్నదీ నిన్నటి వరకు రహస్యమే.. నేడు అసలు గుట్టు రట్టు కావడంతో అందరి దృష్టి ఆ అనాథ ఆశ్రమంపైనే పడింది. ఐటీ కారిడార్లలో భిక్షాటన చేస్తున్న చిన్నారులను పోలీసులు పట్టుకోవడం.. అధికారులు ఆశ్రమాన్ని సీజ్ చేయడం చకచకా జరిగిపోయాయి.. వివరాలిలా ఉన్నాయి.. అమీన్పూర్ ప్రాంతంలో బ్రహ్మపుత్ర పేరిట ఓ అనాథ ఆశ్రమాన్ని ఖమ్మం జిల్లాకు చెందిన జెమ్స్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు. ఈ ఆశ్రమాన్ని సుమారు ఐదేళ్లుగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఆశ్రమంలో 20 మంది వరకు చిన్నారులున్నారు. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల చిన్నారులు కూడా ఇందులో ఆశ్రయం పొందుతున్నారు. వీరందరికీ విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. అయితే సెలవు రోజుల్లో వీరి చేత భిక్షాటన చేయిస్తుండటం గమనార్హం. ‘అనాథ ఆశ్రమానికి చేయూత నివ్వండి’ అనే స్టిక్కర్ ఉన్న డబ్బాలను వీరి చేతికిచ్చి రోడ్లపై భిక్షాటన చేయిస్తున్నారు. బుధవారం రాత్రి గచ్చిబౌలి పోలీసులు ఐటీ సెక్టార్లో భిక్షాటన చేస్తున్న ఇద్దరు చిన్నారులను పట్టుకోవడంతో అసలువిషయం బయటకు వచ్చింది. ఆ చిన్నారులు ఉంటుంది అమీన్పూర్ ప్రాంతం అని తెలియడంతో వెంటనే వారు రామచంద్రాపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనాథ ఆశ్రమంపై దాడిచేయడంతో ఎన్నో విషయాలు వెలుగుచూశాయి. అసలు ఆశ్రమానికి అనుమతే లేదని పోలీసులు గుర్తించారు. ఇక్కడ ఆశ్రమం ఉన్నట్టు స్థానికులకు కూడా తెలియలేదంటే ఎంత గుట్టుగా నిర్వహిస్తున్నారో అర్థమవుతోంది. సేకరించిన డబ్బు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి తెలియదు. ఆశ్రమంలో ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులకు తెలియలేదా? లేక చూసిచూడనట్టు వ్యవహరించారా? అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అనాథ ఆశ్రమాల పేరిట అక్రమ దందాలు చేసేవారిపై నిఘా ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. భిక్షాటన సమయంలో ప్రమాదం జరిగితే అందుకు బాధ్యత ఎవరిదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గురువారం సదర్ ఆశ్రమాన్ని అధికారులు సీజ్ చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అనుమతిలేని అనాథ ఆశ్రమాలను గుర్తించి వారిపై కఠినచర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అనుమానం వచ్చి పట్టుకున్నాం ఐటీ కారిడార్లలో ఇద్దరు చిన్నారులు చేతిలో డబ్బాలు పట్టుకొని భిక్షాటన చేస్తున్నారు. ఈ చిన్నారులు ఇక్కడికి ఎలా వచ్చారన్న అనుమానంతో వారి వద్దకు వెళ్లి విచారించగా తమను ఫాస్టర్ జెమ్స్ వదిలివెళ్లారని తిరిగి సాయంత్రం తీసుకువెళతారని చెప్పారు. తాము రామచంద్రాపురం పోలీసులకు సమాచారం అందించాం.అమీన్పూర్లో ఆశ్రమానికి వెళ్ళిచూడాగా అందులో ఇరవై మంది అనాథ విద్యార్థులు ఉన్నారు. - ఎస్ఐ వెంకటేశ్, గచ్చిబౌలి ఎనిమిది నెలల క్రితం వచ్చాను నేను ఎనిమిది నెలల క్రితం ఈ ఆశ్రమానికి వచ్చాను. స్థానిక ఫాదర్ స్కూల్లో నర్సరీ చదువుతున్నాను. తనను ఇక్కడ బాగానే చూసుకుంటున్నారు. - కన్నయ్య, కల్హేర్ ఈ డబ్బు మా కోసమే మాది మహబూబ్‌నగర్. కొంత కాలంగా అనాధ ఆశ్రమంలో ఉంటున్నాను. ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను. తమను సారు ప్రధాన కూడళ్ళ వద్ద దింపుతారు. తాము ఆశ్రమానికి సహాయం చేయాల్సిందిగా కోరుతాం. వచ్చిన డబ్బు మాకోసమే ఖర్చు చేస్తారు. - వెంకటేష్, మహబూబ్‌నగర్ డబ్బు సేకరించి సారుకు ఇస్తాం నేను స్థానిక ఫాదర్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాను. మా సారు జెమ్స్ మమ్మల్ని బాగానే చదివిస్తారు. మంచిగా చదవకపోతే కొడతారు. సెలవు దినాల్లో తమను గచ్చిబౌలి ప్రాంతంలో దింపుతారు. తాము డబ్బులు సేకరించి సారుకు ఇస్తాం. ఆ డబ్బులతో తమకు పుస్తకాలు, దుస్తులు కొనిస్తుంటారు. - అనురాగ్సేత్ విద్యార్థి చిన్నారులతో భిక్షాటన చేయించడం నేరం చిన్నారులతో భిక్షాటన చేయించడం నేరం. అలా చేసిన వారిపై కఠిన చర్చలు తప్పవు. గచ్చిబౌలి ఎస్ఐ చిన్నారులను పట్టుకుని విచారిస్తే అన్ని విషయాలు వెలుగుచూశాయి. అధికారులు పట్టనట్టు వ్యవహరించడం వల్లే అక్రమ దందాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో అనుమతి లేని ఆశ్రమాలు సుమారు 30 వరకు ఉన్నాయని సమాచారం ఉంది. దీనిపై అధికారులు దృష్టి సారించాలి. - ఎంఎస్. చంద్ర, కార్పెడ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ -
బిడ్డలు పుట్టేందుకు మందు ఇస్తామని మోసం
రామచంద్రాపురం(కమలాపురం): బిడ్డలు పుట్టేందుకు మందు ఇస్తామని చెప్పి దంపతులను మోసం చేసిన ఘటన కమలాపురం మండలం రామచంద్రాపురంలో మంగళవారం చోటు చేసుకుంది. 108 సిబ్బంది తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని రామచంద్రాపురానికి చెందిన ప్రేమకుమారి, దానమయ్యలకు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే ఇంత వరకు వారికి సంతానం కలగ లేదు. మంగళవారం గుర్తు తెలియని ఒక మహిళ, ఒక పురుషుడు గ్రామంలోకి వచ్చి బిడ్డలు పుట్టేందుకు నాటు మందు ఇస్తామని ప్రచారం చేసుకుంటూ వెళ్లారు. దీంతో బిడ్డలపై మమకారం పెంచుకున్న ప్రేమకుమారి వారిని పిలిచి మందు ఇవ్వాలని కోరింది. రు.3500 తీసుకుని వారు నాటు మందు ప్రేమ కుమారి ఇంట్లోనే తయారు చేసి ఇచ్చారు. ఆ మందు తాగిన అర గంట నుంచి ప్రేమకుమారికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. ఇరుగు పొరుగు వారు తేరుకొని చూసే సరికి మందు ఇచ్చిన వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, బాధితురాలు రిమ్స్‌లో ఫిర్యాదు చేస్తే అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి తమకు బదిలీ చేస్తారని తెలిపారు. -
మాక్ ఒలంపిక్స్
రామచంద్రాపురం: రియో ఒలింపిక్స్ సందర్భంగా తీసుకొని మండల పరిధిలోని వెలిమెల గ్రామంలోని గాడియం ఇంటర్నేషనల్ పాఠశాలలో శనివారం మాక్ ఒలింపిక్స్ క్రీడాపోటీలను నిర్వహించారు. కార్యక్రమాన్ని పాఠశాల అడ్మిన్ సుధాకర్‌రెడ్డి, డైరెక్టర్ కీర్తిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పలు పోటీలు నిర్వహించారు. ఒలింపిక్స్‌కు సంబంధించిన విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారిణి అర్చన మాట్లాడుతూ రియో ఒలింపిక్స్ ఎలా ప్రారంభమయ్యాయే అదే మాదిరిగా ఇక్కడ కూడా ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం పాఠశాల డైరెక్టర్ కీర్తిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. క్రీడల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. ఒలింపిక్స్‌పై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఒలింపిక్స్ జ్యోతిని సీఎస్ రెడ్డి వెలిగించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హేమ తదితరులు పాల్గొన్నారు. (ఒక్కటే ఫొటో) రియో ఒలంపిక్స్, మాక్ ప్రోగ్రామ్, రామచంద్రాపురం 06పీటీసీ24: క్రీడాకారి అర్చనకు పుష్పగుచ్చం అందజేత -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
చిత్తూరు : తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాగుట్టును చిత్తూరు పోలీసులు రట్టు చేశారు. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అగ్నిప్రమాదంలో మహిళకు తీవ్రగాయాలు
రామచంద్రాపురం (తూర్పుగోదావరి జిల్లా) : తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో శనివారం సాయంత్రం 6.30 గంటలకు ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ముచ్చుమిల్లి వీధిలోని సాయిబాబా ఆలయ సమీపంలో నివాసముండే వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఇంట్లో బాణాసంచా నిల్వ ఉంచడంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న వాణి అనే మహిళ తీవ్రంగా గాయపడింది. మంటలు వేగంగా చెలరేగడంతో ఇరుగుపొరుగువారు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. ఫైరింజన్ మంటలను ఆర్పుతోంది. -
ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి
రామచంద్రాపురం (మెదక్) : ఆడుకునేందుకు వెళ్తున్నామంటూ బయలుదేరిన చిన్నారులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ సంఘటన పటాన్చెరు మండలం అమీన్పూర్ గ్రామంలోని పెద్ద చెరువు వద్ద సోమవారం వెలుగు చూసింది. పోలీసులు, మృతుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా నందిపల్లికి చెందిన కృష్ణమూర్తి జీవనోపాధి కోసం ఎనిమిదేళ్ల క్రితం పటాన్చెరు మండలం అమీన్‌పూర్‌కు వలస వచ్చారు. అమీన్పూర్ శివారులోని కోకాకోలా పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. కాగా అతని కుమారుడు మురళి (9) స్థానిక షైన్ లిటిల్ హైస్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. ఇంటి పక్కనే నివాసముండే మధ్యప్రదేశ్‌కు చెందిన మన్సూర్లాల్ వర్మ కుమారుడు రాజీవ్‌వర్మ (10) స్థానిక షైన్ లిటిల్ హైస్కూల్లోనే మూడో తరగతి చదువుతున్నాడు. ఈ రెండు కుటుంబాలు పక్క పక్కనే ఉండటంతో మురళి, రాజీవ్ వర్మ కలసి ఆడుకునేవారు. ఆదివారం సాయంత్రం ఇద్దరూ ఆడుకుంటూ సమీపంలోని పెద్దచెరువు వద్దకు వెళ్లారు. ఈత కొట్టేందుకు అందులో దిగి, మునిగిపోయారు. రాత్రయినా చిన్నారులు ఇళ్లకు చేరుకోకపోయేసరికి కుటుంబసభ్యులు వెదుకులాట ప్రారంభించారు. సోమవారం ఉదయం చెరువులో బాలుర మృతదేహాలు లభించాయి. -
ఐదేళ్ల బాలుడి అదృశ్యం
-
ఐదేళ్ల బాలుడి అదృశ్యం
రామచంద్రాపురం: నగరంలోని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదేళ్ల బాలుడు కనిపించకుండా పోయిన ఘటన కలకలం సృష్టిస్తోంది. తెల్లాపూర్‌నకు చెందిన బి.ధన్‌రాజ్‌సింగ్, నమ్రత దంపతులు స్థానిక డార్విన్ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్నారు. వారికి ఎల్కేజీ చదువుతున్న పృథ్వినారాయణసింగ్(5)కుమారుడు ఉన్నాడు. ఆదివారం ఉదయం దంపతులు పృథ్వీని డార్విన్ స్కూల్ వద్ద వదిలి సర్వే కోసం బీరంగూడ గ్రామానికి వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో స్కూల్ వాచ్మెన్ పోన్ చేసి బాలుడు కనిపించకుండా పోయాడని సమాచారం ఇచ్చాడు. దీంతో దంపతులు అక్కడికి చేరుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో వెదికారు. అయినా కుమారుడి జాడ తెలియక పోయేసరికి ఆదివారం రాత్రి తల్లిదండ్రులు రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదే చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పండుగకు వెళ్లి వచ్చేసరికి.. భారీగా దోచేశారు
రామచంద్రాపురం: దసరా సెలవులకు బంధువుల ఇంటికి వెళ్లి పండుగ చేసుకుని తిరిగి ఇంటికి చేరుకున్నవారి ఆనందాన్ని దొంగలు అడియాసలు చేశారు. ఇంటికి తాళాలు వేసి వెళ్లినవారు.. ఇంటికి వచ్చేసరికి తలుపులు బార్లా తెరిచి ఉండటంతో కంగుతినడం వాళ్ల వంతైంది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం ఉట్రుమిల్లి గ్రామంలో భారీ దొంగతనం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎల్ఐసీ ఏజెంట్ శేషగిరిరావు నాలుగు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం ఉదయం వారు ఇంటికి చేరుకునేసరికి తలుపులు పగులగొట్టి..ఇంటిలోని వస్తువులన్నీ చిందరబందరగా ఉన్నాయి. ఇంట్లో ఉన్న రూ.15 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు కనిపించక పోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రామచంద్రాపురంలో చెవిరెడ్డి బైక్ ర్యాలీ
చిత్తూరు : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ దీక్ష చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు. రామచంద్రాపురం పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ ప్రత్యేక హోదా కోసం మద్దతు తెలపాలని ప్రజలను కోరారు. ఈ ర్యాలీలో యువజన విభాగం జనరల్ సెక్రటరీ బి.ఓబుల్ రెడ్డితో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
మధ్యాహ్నభోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత
రామచంద్రాపురం (తూర్పుగోదావరి జిల్లా) : తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం తాడిపల్లి ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. పాఠశాలలో వండిన భోజనాన్ని తిన్న వెంటనే విద్యార్థులకు వాంతులు అయ్యాయి. ఉపాధ్యాయులు 108కు ఫోన్‌చేసి విద్యార్థులను రామచంద్రాపురం ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం అక్కడ విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. -
ఆటో బోల్తా: ఒకరి దుర్మరణం
రామచంద్రాపురం: ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, పదిమంది తీవ్ర గాయాలపాలయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం జగన్నాథగిరి సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. రామచంద్రాపురం మండలం గల్ల గ్రామానికి చెందిన పది మంది అన్నవరం క్షేత్రానికి ఆటోలో బయలు దేరారు. ఆ ఆటో జగన్నాథగిరి మలుపులో అదుపు తప్పి ర్యాంపులోకి దూసుకెళ్లింది. దీంతో ఆటోలో ఉన్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
గ్యాస్ లీకేజీపై గ్రామస్తుల ఆందోళన
రామచంద్రాపురం (తూర్పు గోదావరి) : గెయిల్ పాయింట్ నుంచి గ్యాస్ లీక్ కాకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలోని ఓదూరు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామంలోని గెయిల్ పాయింట్ నుంచి బుధవారం అర్థరాత్రి నుంచి గ్యాస్ లీకవుతోంది. గురువారం ఉదయానికి గ్యాస్ గ్రామమంతటా వ్యాపించింది. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ప్రజలు కాకినాడ- రామచంద్రాపురం రహదారిపై బైఠాయించారు. దీంతో పోలీసులు, గెయిల్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. గ్రామస్తులతో చర్చలు ప్రారంభించారు. -
ముత్తూట్ మినీగోల్డ్ ఫైనాన్స్‌లో భారీ దోపిడీ
-
ముత్తూట్ మినీగోల్డ్ ఫైనాన్స్‌లో భారీ దోపిడీ
బీరంగూడ: మెదక్ జిల్లాలోని రామచంద్రాపురం మండలం బీరంగూడలో బుధవారం భారీ దోపిడీ జరిగింది. ముత్తూట్ మినీగోల్డ్ ఫైనాన్స్‌లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. కస్టమర్లలా వచ్చి పనిచేస్తున్న సిబ్బందిని లాకర్ రూంలో నిర్భంధించి 5 కేజీల బంగారం, నగదును దుండగులు దోచుకెళ్లినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
వీఐపీ రిపోర్టర్ : రామ చంద్రాపురం ఆర్డీఓ సుబ్బారావు
-
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
రామచంద్రాపురం: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరు కృషి చేయాలని స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌లో బాల సహాయ కేంద్రాన్ని ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల కార్మికులు ఎక్కడ కనిి పంచినా వెంటనే తమకు సమాచారం అందివ్వాలన్నారు. లేనిపక్షంలో స్ధానిక పోలీసులకు సమాచారం ఇచ్చినా చాలన్నారు. పిల్లలను పనికి పంపించిన తల్లిదండ్రుల మీద కేసు నమోదు చేయవచ్చన్నారు. బాల కార్మికులతో పనిచేయించుకుంటే వారికి జరిమానాతో పాటు శిక్ష కూడా విధించవచ్చన్నారు. బాల నేరస్థులను పోలీస్‌స్టేషన్‌కు తీసుక వచ్చినపుడు వారితో పోలీసులు మర్యాదగా ప్రవర్తించాలన్నారు. వారిని పోలీసులు యూనిఫాంలో కాకుండా సివిల్ డ్రెస్సులో సున్నితంగా విచారించాలన్నారు. అనంతరం వారిని జువనైల్ కోర్టుకు పంపిస్తామన్నారు. వారి పక్షాన వాదించేందుకు ఉచితంగా న్యాయవాది ఉంటారన్నారు. నేరం రుజువైతే జువనైల్ హోంకి తరలిస్తామన్నారు. బాలల హక్కులను కాపాడేందుకు జిల్లాలో ఐదుగురు ప్రతి నిధులను నియమించామన్నారు. కార్యక్రమంలో డీఎస్సీ ఎస్. సురేందర్‌రెడ్డి, సీఐ నరేందర్, ఎస్ఐ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాలలను నేరస్తులుగా చూడొద్దు జిన్నారం : బాలలను నేరస్తులుగా చూడకుండా, వారికి తగిన కౌన్సెలింగ్ఇచ్చి చేసిన తప్పును మళ్లీ చేయకుండా ఉండే విధంగా చూడాలని స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ దుర్గాప్రసాద్ పోలీసులకు సూచించారు. జిన్నారం మండలంలోని బొల్లారం పీఎస్‌లోనూతనంగా ఏర్పాటు చేసిన బాలల సహాయ కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బొల్లారం పీఎస్‌లో బాలల సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందన్నారు. బాలలతో పనులు చేయించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చిన్నారులు ఎలాంటితప్పు చేసినా వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకురాకుండా రిసెప్షన్ వద్దే కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. బాలలను నే రస్తులుగా చూడొద్దన్నారు. ఎలాంటి ఫిర్యాదులైనా 1098కు ఫోన్ చేయాలన్నారు. కార్యక్రమంలో రామచంద్రాపురం సీఐ నరేందర్, ఎస్ఐ ప్రశాంత్, సిబ్బంది పాల్గొన్నారు. -
‘ప్రత్యేక’కు ఇక బై
అమలాపురంటౌన్, న్యూస్‌లైన్ : మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలనకు చివరిక్షణాలు సమీపిస్తున్నాయి. మరో వారం పదిరోజుల్లో కొత్త కౌన్సిళ్లు కొలువుదీరనున్నాయి. మూడున్నరేళ్లుగా సాగిన ప్రత్యేకాధికారుల పాలన పట్టణవాసుల్లో తీవ్రఅసంతృప్తిని కలిగించింది. 2005లో జరిగిన మున్సిపల్ ఎన్నికల తర్వాత జిల్లాలో ఏర్పడ్డ మున్సిపల్ పాలకవర్గాల కాలపరిమితి 2010 సెప్టెంబర్ 30తో ముగిసింది. అప్పటి నుంచి ఏదో ఒక సాకుతో ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తూ ప్రత్యేకాధికారుల పాలనను ఆరునెలలకోసారి పొడిగిస్తూ వచ్చింది. ఇలా మూడున్నరేళ్లలో ఏడు సార్లు పొడిగించింది. చివరకు కోర్టు జోక్యం చేసుకోవడంతో తప్పనిసరై ఎన్నికలను నిర్వహించింది. అందుబాటులో లేక... మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన మొదటి ఆరునెలలు సంతృప్తికరంగానే సాగింది. ఆ తర్వాత ప్రత్యేకాధికారులు పాలనపై శ్రద్ధ చూపలేకపోయారు. తమ సొంత శాఖ విధులతోనే తలమునకలయ్యే ఆ అధికారులు ప్రత్యేక పాలన విధులను పూర్తి స్థాయిలో నిర్వర్తించలేకపోయారు. వారు కేవలం ఫైళ్లపై సంతకాలకే పరిమితమయ్యారు. పట్టణాల్లో పేరుకుపోతున్న క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టి సారించలేకపోయారు. మూడో ఏడాది వచ్చేసరికి ఫైళ్లపై సంతకాలకోసం ప్రత్యేకాధికారులు ఉన్న జిల్లా కేంద్రానికో... డివిజన్ కేంద్రానికో మున్సిపల్ సిబ్బంది తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో మున్సిపల్ సిబ్బందికి ప్రజల సమస్యలపై జవాబుదారీతనం కరవైంది. అమలాపురం, రామచంద్రపురం, పిఠాపురం తదితర మున్సిపాలిటీల్లో వీధిలైట్లు, తాగునీరు, పారిశుధ్య సమస్యలు ఎక్కువయ్యాయి. గట్టెక్కనున్న సమస్యలు మరో పది రోజుల్లో మున్సిపల్ కొత్త కౌన్సిళ్లు జిల్లాలో కొలువుదీరనున్నాయి. ప్రజలు తమ సమస్యలను స్థానిక కౌన్సిలర్ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరింపజేసుకోవచ్చు. కౌన్సిలర్లు కూడా తమ తమ వార్డుల్లో రోజూ పర్యటిస్తూ సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకు వెళ్లో లేదా కౌన్సిల్లో చర్చించో వాటి పరిష్కారానికి చొరవ చూపుతారు. మున్సిపల్ సిబ్బంది కూడా కౌన్సిలర్లకు భయపడి అప్రమత్తంగా విధులను నిర్వహిస్తారు. ఉదాహరణకు జిల్లాలో ప్రస్తుతం అన్ని మున్సిపాలిటీల్లో పింఛన్లు నెలలో సగం రోజులు గడిచినా కూడా లబ్ధిదారులకు అందని పరిస్థితి ఉంది. ఇకపై సక్రమంగా పింఛన్లు అందే అవకాశం ఉంది. -
వైఎస్ పథకాలే ప్రచార అస్త్రాలుగా
రామచంద్రాపురం, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రచార అస్త్రాలుగా చేసుకుని ఓటర్ల వద్దకు వెళ్తున్నట్టు వైఎస్సార్ సీపీ పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి జి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సోమవారం ఆయన రామచంద్రాపురం పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని శ్రీనివాస్‌నగర్ కాలనీ, పాత రామచంద్రాపురంలో ఇంటింటి ప్రచారం చేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ దివంగత నేత వైఎస్సార్ పథకాలను ఓటర్లకు వివరిస్తున్నట్టు తెలిపారు. పేదల సంక్షేమం కోసం మహానేత వైఎస్సార్ ఎన్నో పథకాలు, కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎంతో మంది పేదలు ఉన్నత విద్యను అభ్యసించినట్టు తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లక్షల మంది కార్పొరేట్ వైద్యాన్ని అందుకున్నారన్నారు. ఇలాంటి ఎన్నో పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలు లబ్ధిపొందినట్టు ఆయన చెప్పారు. మహానేత పథకాలే తమను విజయ పథాన నిలుపుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సంజీవరావు, సారా శ్రీనివాస్, విఠల్, మురళి, సతీష్ పాల్గొన్నారు. -
మన తలరాతను మార్చే ఎన్నికలివి: జగన్
-
మన తలరాతను మార్చే ఎన్నికలివి: వైఎస్ జగన్
రామచంద్రాపురం: మరో 45 రోజుల్లో జరగనున్న ఎన్నికలు మన తలరాతను మార్చేవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మా గుండె లోతుల్లో దివంగత నేత వైఎస్ఆర్ ఉన్నారని ప్రతి ఒక్కరూ చెబుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జరిగిన రోడ్డు షోలో జగన్ ప్రసంగించారు. రాముడి పాలనను చూడలేదు కానీ...రాజశేఖరుని సువర్ణయుగాన్ని చూశామన్నారు. ఇప్పటికీ బాబు భయానక పాలన గుర్తుకు వస్తోందన్నారు. చంద్రబాబు ఆల్ ఫ్రీ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. రైతు రుణాలు మాఫీ చేస్తానని, ఉచిత విద్యుత్ ఇస్తానని బాబు ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. ఓట్ల కోసం చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తానంటున్నారని తెలిపారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కాబట్టి... లేనిపోని హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ప్రతి పిల్లవాడ్ని తాను చదివిస్తానని వైఎస్ జగన్ హామీయిచ్చారు. రాష్ట్ర చరిత్రను మార్చే ఐదు సంతకాలు చేస్తానని చెప్పారు. అమ్మఒడి పథకం అమలుపై తొలి సంతకం చేస్తానన్నారు. అవ్వా, తాతల జీవితాలకు ఊరటనిచ్చేలా రెండో సంతకం, రైతన్న ఇంట వెలుగు నిండేలా మూడో సంతకం చేస్తానని చెప్పారు. పల్లెలకు స్వయంపాలనపై మరో సంతకం చేస్తానని వైఎస్ జగన్ అన్నారు. -
బాలికను కిడ్నాప్ చేసిన ముగ్గురిపై నిర్భయ కేసు
రామచంద్రాపురం, న్యూస్‌లైన్: ఓ విద్యార్థిని వెంటపడి కిడ్నాప్ చేసి వేధించిన ముగ్గురిపై రామచంద్రాపురం పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి సోమవారం అరెస్టు చేశారు. ఎస్ఐ రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... జీవనోపాధికోసం మరో రాష్ట్రం నుంచి వచ్చిన ఓ కుటుంబం రామచంద్రాపురంలో స్థిరపడింది. ఈ కుటుంబంలోని 15 సంవత్సరాల బాలిక స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది. ఈ బాలిక చదువుతున్న పాఠశాలలో ఓ కార్యక్రమం నిర్వహించగా, బెల్ విద్యుత్‌నగర్‌కు చెందిన మతిన్ డెకరేషన్ చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలోనే బాలికపై కన్నేసి అతను మాటల్లో దింపి తన ఫోన్ నంబర్ ఇచ్చాడు. తరచూ బాలికతో ఫోన్లో మాట్లాడుతూ అప్పుడప్పుడూ కలిసేందుకు ప్రయత్నించేవాడు. ఈ క్రమంలోనే తన మిత్రులైన రామచంద్రాపురానికి చెందిన ఆటోడ్రైవర్ సుల్తాన్, జవహర్‌నగర్‌కు చెందిన టెన్నీస్ కోచ్ మహేశ్‌లను బాలికకు పరిచయం చేశాడు. వీరంతా బాలికను అప్పుడప్పుడూ పాఠశాల నుంచి ఆటోలో తీసుకెళ్లి ఇంటివద్ద దింపేవారు. ఈ క్రమంలోనే ఈ నెల 26న మతిన్, సుల్తాన్, మహేశ్‌లు హైదరాబాద్ చూపిస్తామంటూ బాలికకు మాయమాటలు చెప్పి ఆటోలో తీసుకువెళ్లారు. అనంతరం హైదరాబాద్ నుండి ఆ బాలిక ను బీదర్‌కు తీసుకెళ్లారు. అయితే ఉదయం పాఠశాలకు వెళ్లిన బాలిక సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అదే రోజు రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలిక ఇంట్లో ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేయగా బాలిక బీదర్‌లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు శనివారం బీదర్‌కు వెళ్లి బాలికతో పాటు ముగ్గురు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. అనంతరం నిందింతులను తమదైనశైలిలో విచారించిన పోలీసులు వారు తెలిపిన వివరాల మేరకు వారిపై నిర్భయచట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. -
చైన్ స్నాచింగ్‌లపై ప్రత్యేక నిఘా
రామచంద్రాపురం, న్యూస్‌లైన్ : ఆర్సీ పురం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరుగుతున్న చైన్ స్నాచింగ్‌ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఐజీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం రామచంద్రాపురం డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించా రు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. పాత కేసు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. సబ్ డివిజన్ పరిధిలో జరుగుతున్న నేరాలు, కేసులు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రామచంద్రాపురం పట్టణ పరిధిలో జరుగుతున్న చైన్ స్నాచింగ్‌ల విషయం తన దృష్టి లో ఉందని, అందుకు సంబంధించిన విషయంపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. దీనిపై ప్రజల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో నిఘాను పటిష్టం చేస్తున్నామన్నారు. రామచంద్రాపురం పటాన్చెరు పరిధిలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు పరిశీలనలో ఉందని తెలిపారు. మహబూబ్‌నగ ర్, ప్రకాశం జిల్లాల సరిహద్దులోని నల్లమల అ డవిలో ఓ దళం సంచరిస్తున్నట్లు అనుమానం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కవిత, సీఐలు శ్రీనివాస్, శంకర్‌రెడ్డి, భీంరెడ్డి,గంగాధర్, ఎస్ఐలు రవీందర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, వెంకట్, లోకేష్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పటాన్చెరు పీఎస్ తనిఖీ చేసిన ఐజీ పటాన్చెరు టౌన్ : శాంతి భద్రతల పరిరక్షణలో భా గంగా గ్రామాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు హైదరాబాద్ రేంజ్ ఐజీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపా రు. పోలీస్ స్టేషన్ల సాధారణ తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఆయన పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌ను సం దర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక పోలీస్‌స్టేషన్ పరిసరాలను, రికార్డులను పరిశీలించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. పోలీస్‌స్టేషన్ పని తీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. క్రైం రేటు అదుపులో ఉందన్నారు. దోపిడీ దొంగతనాలు, చైన్‌స్నాచింగ్, మర్డర్ కేసులు ఛేదించడంలో పోలీసు లు మంచి పనితీరును చూపుతున్నారని కొనియాడారు. గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి గ్రామానికి ఓ పోలీస్ నేతృత్వంలో రక్షణ కల్పిస్తామన్నారు. అతని ద్వారా ఎప్పటికప్పుడు పోలీస్‌స్టేషన్ అధికారికి సమాచారం అందుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్పీ విజయ్‌కుమార్, డీఎస్పీ కవిత, సీఐలు శంకర్‌రెడ్డి, మహబూబ్‌ఖాన్‌లు ఉన్నారు. -
యువతి దారుణ హత్య
రామచంద్రాపురం, న్యూస్‌లైన్: బియ్యం తెస్తానని చెప్పి ఇంట్లో నుండి బయలుదేరిన ఓ యువతి హత్యకు గురైంది. ఈ ఘటన రామచంద్రాపురం పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. పట్టణంలోని శ్రీనివాస్‌నగర్‌లో నివాసం ఉండే రేష్మ(20) ఏడో తరగతి వరకు చదువుకొని ఇంట్లోనే ఉంటుంది. ఆమె తల్లి షమీం భర్తతో విడిపోయి రామచంద్రాపురం పట్టణానికి వచ్చి జీవిస్తున్నారు. షమీం పారిశ్రామికప్రాంతంలోని ఓ పరిశ్రమలో హౌస్‌కీపింగ్ డిపార్టమెంట్లో పనిచేస్తుంది. ఆమెకు నలుగురు సంతానం కాగా రేష్మా పెద్ద కూతు రు. మంగళవారం మధ్యాహ్నం బియ్యం తెస్తానని ఇంట్లో వారికి చెప్పి రేష్మ బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఇదిలాఉండగా బుధవారం తెల్లవారుజామున భెల్ టౌన్‌షిప్‌లోని హోలిక్రాస్ జూనియర్ కళాశాల వెనక ముళ్ల పొదల్లో దారుణ హత్యకు గురై కనిపించిది. మృతదేహాన్ని చూసిన భెల్ పారిశుద్ధ్య కార్మికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు రవీందర్‌రెడ్డి, వెంకట్, లోకేష్‌లు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. రేష్మ తలపై బలమైన ఆయుధంతో మోది హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేష్మ దుస్తులు కూడా సక్రమంగా లేకపోవడంతో ఈ హత్య పలు అనుమానాలకు తావిస్తోంది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం రేష్మ మృతదేహన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ కవిత సందర్శించారు. క్లూస్ టీం సం ఘటన స్థలానికి సందర్శించి ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు జరుపుతామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
ఉలిక్కిపడ్డ ఆర్సీపురం
రామచంద్రాపురం, న్యూస్‌లైన్: రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌లోని బోన్సాయ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో మంగళవారం మధ్యాహ్నం భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు టెక్నిషియన్లు, ఇద్ద రు మహిళలు గాయపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా వందలాది మంది ఆందోళనకు గురయ్యారు. అయితే గ్యాస్ కారణంగానే పేలుడు జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ పేలుడు ధాటికి నాలుగు ఫ్లాట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మూడో అంతస్తులో జరిగిన ఘటనతో కింది ఫ్లోర్(211)లో నివసిస్తున్న మహిళలిద్దరికి గాయాలు కావడంతో ఆసుపత్రిపాలయ్యారు. కాగా పేలుడు జరిగిన ఇంట్లో చాలా కాలంగా ఎవ్వరూ ఉండటంలేదు. రహీం, ఖమల్ అనే ఇద్దరు టెక్నిషియన్లు బోన్సాయ్ అపార్ట్మెంట్ మొత్తంలో ఇన్‌బిల్ట్ గ్యాస్ వ్యవస్థను మరమ్మతులు చేసేందుకు వచ్చారు. వారు ఇతర ఇళ్లల్లో గ్యాస్‌పైపులైన్ పనులను ముగించుకుని మూడో అంతస్తుకు వచ్చి ఇంటి (311) కాలింగ్ బెల్ నొక్కారు. సరిగ్గా అప్పుడే పేలుడు జరిగింది. గాయపడ్డ టెక్నీషియన్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గ్యాస్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. రెండో అంతస్తులో(312)లో ఉంటున్న వారు అప్పుడే బయటకు వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఆ ఫ్లాట్ గోడలు పూర్తిగా కూలిపోయాయి. మొత్తం అపార్ట్మెంట్లోని పలు ఫ్లాట్ల కిటికీల అద్దాలు పగిలాయి. లిఫ్టు ధ్వంసమైంది. పేలుడుతో ఆనుకుని ఉన్న ఇతర అపార్ట్మెంట్ల అద్దాలు, గోడలు కూడా ధ్వంసమయ్యాయి. పేలుడు జరిగిన ఇంటి యజమాని ప్రకాశ్ అమర్లాల్ బజాజ్ ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఈ గదిలో ఎలాంటి సామగ్రిలేదు. జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. సంగారెడ్డి నుంచి క్లూస్‌టీం కూడా ఇక్కడకు చేరుకుని పరిశోధన నిర్వహించింది. పేలుడు శబ్దం కిలోమీటర్ దూరం వరకు వినిపించిందని ప్రజలు చెబుతున్నారు. ఘటన స్థలాన్ని సందర్శించిన వారిలో డీఎస్పీ కవిత, సీఐలు శ్రీనివాస్, భీంరెడ్డి, ఎస్ఐ రవీందర్‌రెడ్డిలు ఉన్నారు. గ్యాస్‌తోనే పేలుడు బోన్సాయ్ అపార్ట్మెంట్లో పేలుడుకు కారణం గ్యాసేనని పోలీసులు ని ర్ధారణకు వచ్చారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఇన్‌బిల్ట్ గ్యాస్ మెకానిక్ రహీంతో పోలీసు అధికారులు వివరాలు సేకరించారు. గ్యాస్ అన్ని ఫ్లాట్లకు సరఫరా అవుతున్నదీ లేనిదీ మెకానిక్ పరిశీలిస్తున్నాడు. కొం తమందికి గ్యాస్ రావడంలేదని తెలుసుకున్న మెకానిక్ ఫ్లాట్ నంబర్ 311 వద్దకు వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు. ఆ ఫ్లాట్ యాజమాని కొన్ని నెలలుగా అందులో ఉండడంలేదు. గ్యాస్వాల్వ్ ఓపెన్‌చేసి ఉండడం వల్ల గ్యాస్ అంతా రూంలో నిండి ఉండవచ్చునని, బెల్ కొట్టగానే పేలుడు జరిగిందని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారణకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. -
తస్మదీయులా..లేపెయ్యండి పేర్లు
రామచంద్రపురం, న్యూస్‌లైన్ : ఓటు హక్కు పవిత్రమైదని, అర్హులైన ప్రతివారూ ఓటు నమోదు చేయించుకోవాలని ఎన్నికల సంఘం పదేపదే ప్రకటనలు చేస్తోంది. అందుకు అనుగుణంగా సంబంధిత అధికారులు, సిబ్బంది అర్హులందరినీ జాబితాలోకి ఎక్కించేందుకు కృషి చేయాల్సి ఉంది. అయితే రామచంద్రపురం నియోజకవర్గంలో అందుకు భిన్నంగా జరుగుతోంది. ఇప్పటికే ఓటర్లుగా నమోదై, జాబితాల్లో ఉన్న వారి పేర్లను మూకుమ్మడిగా తొలగించే కుతంత్రం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తమకు కాక ప్రత్యర్థి పక్షాలకు ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓటు వేస్తారని అనుమానం ఉన్న వారి పేర్లను జాబితాల నుంచి తొలగించాలని అధికార పార్టీ నాయకుడొకరు అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ఓడిపోతానన్న భయం పీడిస్తున్న ఆ నేత అడ్డదారుల్లోనైనా గెలుపు బాట వేసుకోవడానికి బరి తెగిస్తున్నారని, నియోజకవర్గంలోని కాజులూరు, కె.గంగవరం, రామచంద్రపురం మండలాలతో పాటుగా మున్సిపల్ పరిధిలో మొత్తం సుమారు 20 వేల మంది తస్మదీయుల (తమకు చెందని వారు) ఓట్లను తొలగించాలని ఆయా మండల తహశీల్దార్లను ఆదేశించినట్టు సమాచారం. ఇప్పటికే ఆయా గ్రామాల్లోని తమ కార్యకర్తలతో తయారు చేయించిన ‘తొలగింపు’ జాబితాలను తహశీల్దార్లకు అందించగా.. వారు వాటిని సంబంధిత జాబితాలను బూత్ లెవెల్ అధికారులకు (బీఎల్ఓ) అందించినట్టు తెలుస్తోంది. సదరు నేత ఆదేశాలను తలదాల్చిన ఓ తహశీల్దార్ ‘ఫారం-7(మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన, వివాహమై అత్తింటికి వెళ్లిన వారి పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగించేందుకు నిర్దేశించినది)లు ఎన్ని వచ్చాయి? మీకిచ్చిన ‘తొలగింపు’ జాబితాలను ఏం చేశారు?’ అంటూ బీఎల్ఓలను ఒత్తిడి చేస్తున్నారు. అధికార పార్టీ నేత కుటిల వ్యూహం నేపథ్యంలోఏ బూత్‌లో ఎవరి ఓటు గల్లంతవుతుందోనన్న ఆందోళన నియోజకవర్గంలోని ఓటర్లను పీడిస్తోంది. నియోజకవర్గంలో ఓటర్లలో అత్యధికులు.. ముఖ్యంగా బీసీ, ఎస్సీ వర్గాల వారు ైవె ఎస్సార్ కాంగ్రెస్ సానుభూతిపరులుగా ఉంటున్నారు. దీంతో రానున్న సాధారణ ఎన్నికల్లో ఓటమి తప్పదని కలవరపడుతున్న అధికార పార్టీ నేత ఇప్పటి నుంచే పథకం ప్రకారం అలాంటి ఓట్ల తొలగింపునకు పూనుకున్నారని సమాచారం. ఈ క్రమంలోనే కొన్ని జాబితాలను తయారు చేయించి మండల స్థాయిలో ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న తహశీల్దార్లకు అందించారు. ఇలాంటి జాబితాల్లో అత్యధికంగా బీసీ, ఎస్సీ ఓటర్ల పేర్లు ఉండటం గమనార్హం. చనిపోయిన వారి పేర్లతో పాటు పనుల కోసం తాత్కాలికంగా వలస వెళ్లిన వారి పేర్లతోనూ ఫారం-7లు నింపిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఓట్ల తొలగింపునకు ముందస్తుగా ఆయా ఓటర్లకు నోటీసులు జారీ చేయాలి. అనంతరం గ్రామ సభలను ఏర్పాటు చేసి ఓట్లను తొలగించాలి. కానీ కొన్ని గ్రామాల్లో నోటీసులు కూడా లేకుండానే ఓట్లను తొలగిస్తున ్నట్లు ఓటర్లు గ గ్గోలు పెడుతున్నారు. కె.గంగవరం మండలంలో తొలగించాల్సిన ఓటర్లకు పాత తేదీలను వేసి నోటీసులు అందించాలని ఉన్నతాధికారి బీఎల్ఓలను ఆదేశించినట్టు సమాచారం. అధికార పార్టీ నేత అందించిన జాబితాల ప్రకారం ఓట్లను తొలగించాలని ఒత్తిడి చేయడంతో బీఎల్ఓలు ఇరకాటాన్ని ఎదుర్కొంటున్నారు. తాత్కాలికంగా కూలి పనులకు వలస వెళ్లిన వారి ఓట్లు ఎలా తొలగిస్తారని కొ ంత మంది ప్రశ్నిస్తున్నారు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇక్కడే ఉన్నాయని, ప్రతి నెలా రేషన్‌ను తీసుకుంటున్నా ఊర్లో ఉండటం లేదని కొందరు చెపుతున్న అవాస్తవాలను పరిగణించడమేమిటని నిలదీస్తున్నారు. బీసీ, ఎస్సీ ఓటర్లనే లక్ష్యంగా చేసుకోవడంపై ఆయా వర్గాల వారు మండిపడుతున్నారు. జాబితాలు అందించడం అవాస్తవం.. ఓటర్ల తొలగింపుపై కె.గంగవరం మండల తహశీల్దార్ ఎన్.రమేష్‌ను వివరణ కోరగా గ్రామాల్లో తాత్కాలికంగా వలస వెళ్లిన వారికి నిబంధనల మేరకు నోటీసులు అందిస్తున్నామన్నారు. గ్రామసభలను పెట్టి సమాచారం సేకరించిన అనంతరమే జాబితా నుంచి తొలగిస్తామన్నారు. అధికార పార్టీ వారు జాబితాలను అందించిన మాట అవాస్తవమని, తాను బీఎల్ఓలకు ఎలాంటి ఆదేశాలను జారీ చేయలేదని స్పష్టం చేశారు. -
భెల్‌లో ‘స్థానిక’ సమరం
రామచంద్రాపురం, న్యూస్‌లైన్: నవరత్న అవార్డు పొందిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, బీహెచ్ఈఎల్(భెల్)లో ‘స్థానిక’ ఉద్యమం ఊపందుకుంది. భెల్‌లోని ఉద్యోగాల నియామకాల్లో స్థానికులకు 80 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ మూడు రోజులుగా ఉద్యమిస్తున్న నిరుద్యోగులకు శనివారం ప్రజాప్రతినిధులు కూడా మద్దతు పలికారు. టీఆర్ఎస్ నేత హరీష్‌రావు, పటాన్చెరు ఎమ్మెల్యే నం దీశ్వర్గౌడ్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి నిరుద్యోగ యువతకు ధైర్యం చెప్పారు. అండగా ఉండి న్యాయం జరిగేదాకా పోరాడతామన్నా రు. అంతకుముందు ఉద్యమ కార్యాచరణలో భాగంగా స్థానిక యువకులు శనివారం భెల్ టౌన్‌షిప్‌లోని నె హ్రూ విగ్రహం నుండి భెల్ ఈడీ కార్యాలయం వరకు భా రీ ర్యాలీగా తరలివెళ్లారు. అధికార కార్మిక సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు, భెల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం భెల్ టౌన్‌షిప్‌లోని గాం ధీ విగ్రహం వద్ద వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడుతూ, భెల్ నియామకాల్లో స్థానికులకు 80 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఏళ్ల తరబడి వేడుకుంటున్నా యాజమాన్యం స్పందించడం లేదన్నారు. ఇటీవల జరిగిన రాత పరీక్షల్లోనూ ఇతర రాష్ట్రాల వారికే ప్రాధాన్యం ఇచ్చారని వారు ఆరోపించారు. దీనిపై న్యాయ విచారణ చే పట్టాలని డిమాండ్ చేశారు. భెల్ అధికార కార్మిక సంఘం అధ్యక్షుడు క్రిష్ణంరాజు భెల్ పరిశ్రమలో పనిచేస్తున్న తమిళ అధికారులకు తొత్తుగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేదాకా ఉద్యమిస్తామన్నారు. న్యాయం జరిగేదాకా పోరాటం: హరీష్‌రావు స్థానిక యువతకు మద్దతు తెలిపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మాట్లాడుతూ, ఉద్యోగ భర్తీకి ముందే తాను భెల్ యాజమాన్యంతో మాట్లాడి స్థానిక యువతకు అవకాశం కల్పించాలని కోరగా, యాజమాన్యం అందుకు హామీ ఇచ్చిందన్నారు. అయితే నియామకాల్లో మాత్రం భెల్ యాజమాన్యం తన హామీని విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భెల్ ఉద్యోగాల్లో స్థానిక నిరుద్యోగులకు 80 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. యాజమాన్యం అధికారుల అండతో ఏకపక్షంగా బయటి రాష్ట్రాల వారికి ఉద్యోగ భర్తీలో పెద్దపీట వేసిందన్నారు. స్థానికులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా టీఆర్ఎస్ ఉంటుందన్నారు. వెంటనే స్థానిక యువతకు ఉద్యోగ భర్తీలో అవకాశం కల్పించేలా మరొక నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయన సూచించారు. డిల్లీ స్థాయిలో ఒత్తిడి తెస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదన్నారు. అండగా ఉంటాం: నందీశ్వర్ గౌడ్, భూపాల్ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ, భెల్‌లో ఉద్యోగ నియామకాల విషయాన్ని కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రి వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందరూ కలిసి వస్తే తాను కూడా భెల్ చైర్మన్ వద్దకు వెళ్లి చర్చించేందుకు సిద్ధమన్నారు. డిసెంబర్ నెలలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నందున, అంతవరకు భెల్‌లో నియామకాలను నిలిపివేయాలన్నారు. ఆ తర్వాత నోటిఫికేషన్ జారీ చేస్తే తెలంగాణ పది జిల్లాలలో ఐటిఐ చదివిన నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందన్నారు. నిరుద్యోగ యువకులు శాంతియుతంగా ఉద్యమించాలని, యాజమాన్యం దిగిరాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు తామూ కలిసి వస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ, ఇక్కడ ఐటిఐ చదివి పాసైన ప్రతి ఒక్కరికీ భెల్‌లో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానికులకు 80 శాతం రిజర్వేషన్ ఇచ్చి మిగిలిన 20 శాతం బయటి రాష్ట్రాల వారికి ఇవ్వాలన్నారు. స్థానిక నిరుద్యోగులకు న్యాయం జరిగేంతవరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ, కార్పొరేటర్ పుష్పానగేష్ యాదవ్, తెల్లాపూర్ సర్పంచ్ సోమిరెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గాలి అనిల్‌కుమార్, భెల్ టీఎన్టీయూసీ అధ్యక్షుడు రాజునాయక్, నాయకులు మోహన్ గౌడ్, నగేష్ యాదవ్, శంకర్ యాదవ్, రత్నం, శ్రీశైలం యాదవ్, చిలకమర్రి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈడీతో భేటీ యువకులతో కలిసి ఆందోళన చేపట్టిన అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావ్, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణలు భెల్ ఈడీతో భేటీ అయ్యారు. నియామకాల్లో స్థానిక యువతకు పెద్ద పీట వేయాలని, అప్పటివరకు ఇంటర్వ్యూలను వాయిదా వేయాలని కోరారు. అంతేకాకుండా భెల్ ఏర్పాటు సమయంలో భూములు కోల్పోయిన వారి కుటుంబాలకు ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు. రాత పరీక్షల అనంతరం ఇంటర్య్వూకు పిలిచినవారిలో 1,544 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉండగా, తెలుగు వారు 290 మంది మాత్రమే ఉన్నారని ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన భెల్ యువకుల ఆందోళన, ప్రజాప్రతినిధుల మద్దతుతో భెల్ యాజమాన్యం స్పందించింది. ప్రజాప్రతినిధులు కోరినట్లుగా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా వాయిదా వేసేందుకు, ఈ విషయాన్ని ఢిల్లీలోని కార్పొరేట్ అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నట్లు ఈడీ పేరిట ఓ పత్రికా ప్రకటనను వెలువరించింది. -
దీపావళికి వస్తారనుకున్నాం....
రామచంద్రపురం, న్యూస్‌లైన్ :‘దీపావళికి ఇంటికి వస్తానమ్మా అని చెప్పిన కొడుకు, కోడలు ఇలా దూరమవుతారని అనుకోలే దు’ అంటూ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. పట్టణానికి చెందిన పలుకూరి నాగవెంకట రాజేష్(31), రమ్య(26)లతో పాటు వారి కుమార్తె రితిమ(3) బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సు ప్రమాదంలో బుధవారం మరణించిన సంఘటనతో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్‌లో రమ్య మేనమామ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు బెంగళూరు నుంచి వీరు వస్తుండగా మహబూబ్‌నగర్ వద్ద ప్రమాదానికి గురయ్యారు. పట్టణానికి చెందిన బచ్చు వీరభద్రరావు, రత్నావళిలకు రాజేష్ రెండో కుమారుడు. అయితే రాజేష్‌ను అమ్మమ్మ పలుకూరి మంగారాజు దత్తతకు తీసుకున్నారు. రాజేష్ స్థానిక పిల్లావారి మున్సిపల్ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించగా కృత్తివెంటి పేర్రాజు పంతులు జూనియర్ కళాశాలలో ఇంటర్, వీఎస్ఎంలో డిగ్రీ, ఎంసీఏను చదివారు. అనంతరం ఉద్యోగం నిమిత్తం అమెరికాలో ఉన్నారు. కొన్నాళ్ల తరువాత బెంగళూరు సీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగంలో జాయినయ్యారు. కాకినాడకు చెందిన రమ్యతో రాజేష్‌కు 2009 మేలో వివాహం జరిగింది. 2010 డిసెంబర్ రెండున వీరికి రితిమ జన్మించింది. రైలు టికెట్ దొరకనందునే బస్‌లో.. రమ్య మేనమామ కూతురు వివాహానికి హాజరయి అనంతరం రామచంద్రపురం దీపావళికి వద్దామనుకున్నారు. అయితే ఇంతలోనే ఈ ప్రమాదం సంభవించింది. ఇదే ఏడాది ఫిబ్రవరిలో రాజేష్ తల్లిదండ్రులు బెంగళూరులో జరిగిన రితిమ అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొనట్టు చెబుతున్నారు. హైదరాబాద్ పెళ్లికి వచ్చేందుకు రైలు టికెట్ రిజర్వ్ కాలేదని భార్య, కుమార్తెతో కలిసి బస్సులో వస్తున్నట్టు తనకు రాజేష్ చెప్పాడని తల్లి రత్నావళి విలపించారు. పట్టణానికి చెందిన ఇద్దరు యువ ఇంజనీర్ల జంట బెంగళూరు బస్సు ప్రమాదంలో మృత్యువాత పడడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు త్వరలో శంకుస్థాపన
రామచంద్రాపురం, న్యూస్‌లైన్: లింగంపల్లి నుంచి రామచంద్రాపురం వరకు రానున్న ఎంఎంటీఎస్ కోసం చేపట్టే పనులకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్టు మెదక్ ఎంపీ విజయశాంతి తెలిపారు. శుక్రవారం ఆమె రామచంద్రాపురంలో విలేకరులతో మాట్లాడారు. తెల్లాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు 4.75 కిలోమీటర్ల లైన్ కోసం రూ.28 కోట్లను వెచ్చిస్తున్నట్టు తెలిపారు. మొదట పటాన్‌చెరుకు ఎంఎంటీఎస్‌ను తేవాలని అనుకున్నా కొన్ని సాంకేతిక కారణాల వల్ల రామచంద్రాపురం వరకే పరిమితమైనట్టు చెప్పారు. ఈ పనులను లండన్‌కు చెందిన సంస్థ దక్కించుకుందని, ఏడాదిలోపు పనులు పూర్తి కావచ్చన్నారు. ఎంఎంటీఎస్ విషయంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు మారినా ప్రజల ఆశీస్సులతో అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్టు చెప్పారు. పనుల శంకుస్థాపన కోసం కేంద్ర రైల్వేశాఖ మంత్రితోపాటు ముఖ్యమంత్రి సమయం తీసుకున్నట్టు తెలిపారు. అక్కన్నపేట నుంచి మెదక్ వరకు రైల్వేలైన్ పనులను త్వరలో ప్రారంభించేలా కృషి చేస్తానన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తున్నట్టు చెప్పారు. ఓ వైపు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూనే మరోవైపు అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు విజయశాంతి తెలిపారు. సమావేశంలో పీసీసీ కార్యదర్శి షేక్ అబ్దుల్ ఘని, టెలికం బోర్డు సభ్యుడు రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.