జాబు రావాలంటే బాబు రావాలి అని పదేపదే చెప్పిన చంద్రబాబు తెలుగు కూడా సరిగా రాని తన సుపుత్రడు లోకేశ్ పప్పుగారికి మాత్రం ఏకంగా మూడు మంత్రి పదవులిచ్చారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల విమర్శించారు. తండ్రీ, కొడుకులు కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. గత నలభయ్యేళ్ల ఆంధ్రరాష్ట్ర చరిత్రలో లేనంత అవినీతి టీడీపీ ఐదేళ్ల పాలనలో జరిగిందని సాక్షాత్తూ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన అజయ్ కల్లం చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. బస్సు యాత్ర నిర్వహిస్తున్న షర్మిల ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలోని కోటిపల్లి ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు.