
నీరు పోయేందుకు జేసీబీ సహాయంతో కాల్వ తవ్వకం
పట్టణంలోని నాగులమ్మ దేవాలయం సమీపంలో జాతీయ రహదారిపై నాలుగో రోజు కూడా నీరు పెద్ద ఎత్తున చేరింది.
రామచంద్రాపురం: పట్టణంలోని నాగులమ్మ దేవాలయం సమీపంలో జాతీయ రహదారిపై నాలుగో రోజు కూడా నీరు పెద్ద ఎత్తున చేరింది. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఇప్పటికే రోడ్డుపై నీరు ఉండడంతో రోడ్డు గుంతలమయంగా మారింది ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారు. స్థానిక పోలీసు అధికారులు రోడ్డు వద్దనే ఉండి ట్రాఫిక్‌ను పూర్తిస్థాయిలో నియంత్రిస్తున్నారు.
ద్విచక్రవాహనదారులను ఈ మార్గంంలో రాకుండా చెరువు కట్టపై నుంచి పంపిస్తున్నారు. అయితే ఆ నీళ్లలో నుంచి కార్లు మొరాయించడంతో యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సందర్శించారు. నీటి తీవ్రత పెరగడంతో జెసీబీల ద్వారా నీరు పోయేలా కాలువలు తీశారు.