Rain water
-
అసెంబ్లీ, మంత్రుల నివాసాలకు వరద నీరు
పాట్నా: బిహార్ రాజధాని పాట్నాలో ఆదివారం(ఆగస్టు12) కురిసిన భారీ వర్షానికి వరదలు పోటెత్తాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రోడ్లపై ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయింది. రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలోకి వరదనీరు వచ్చింది. అసెంబ్లీకి కొద్ది దూరంలో ఉన్న మంత్రుల బంగ్లాలున్న ప్రాంతంలోనూ భారీగా నీరు నిలిచింది. గడిచిన కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గండక్, కోసి, గంగా, మహానంద, కమల నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సీఎం నితీశ్‌కుమార్ పాట్నాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. భారీ వర్షాలు పడినపుడు వరద నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
పార్లమెంట్లో వర్షపు నీరు లీకేజీ!.. కాంగ్రెస్ వాయిదా తీర్మానం
పార్లమెంట్ భవనంలో వర్షపు నీరు లీకేజీ కావడం.. ఆ వీడియోలు కాస్త నెట్టింటకు చేరడంతో తీవ్ర చర్చ జరుగుతోంది. ఢిల్లీలో నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న వానకు రాష్ట్రపతి ఛాంబర్ దగ్గరి లాబీలో పైకప్పు నుంచి నీరు కారుతోంది. అయితే.. ఈ లీకేజీపై పార్లమెంట్ నిర్వాహణ అధికారులు స్పందించాల్సి ఉంది. మరోవైపు కిందటి ఏడాది మే నెలలో సన్సద్ భవనం ప్రారంభం కావడం తెలిసిందే. ఈ భవనం.. అందులో హంగుల కోసం 1,000 కోట్ల రూపాయల్ని వెచ్చించారు. అయితే.. ప్రస్తుతం వాటర్ లీకేజీ అంశాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ వాటర్ లీకేజీ అంశాన్ని సభలో చర్చించాలని భావిస్తోంది. ఈ మేరకు.. వాటర్ లీకేజీ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ విప్ మాణిక్కం ఠాగూర్.. లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అదే జరిగితే కేంద్ర ప్రభుత్వం దీనికి ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి. Paper leakage outside, water leakage inside. The recent water leakage in the Parliament lobby used by the President highlights urgent weather resilience issues in the new building, just a year after completion. Moving Adjournment motion on this issue in Loksabha. #Parliament pic.twitter.com/kNFJ9Ld21d— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) August 1, 2024 -
ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: జీవో 111 రద్దు అనంతర పరిణామాలను రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. జీవో ఎత్తివేత తర్వాత ఎదురయ్యే పర్యావరణ సమస్యలను అంచనా వేస్తూ దానికి తగ్గట్టుగా మార్గదర్శకాల జారీకి కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా జీవో రద్దుతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల మనుగడ ప్రశ్నార్థకమవుతుందనే పర్యావరణ వేత్తల ఆందోళనను పరిగణనలోకి తీసుకుంటూ అచితూచి అడుగులేస్తోంది. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా.. జలాశయాల ఉనికికి భంగం కలుగకుండా ప్రణాళికా బద్ధమైన అభివృద్ధికి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. భారీ నిర్మాణాలు, పరిశ్రమలతో జంట జలాశయాలు కలుషితం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోనుంది. స్థిరాస్తి వ్యాపారం, నిర్మాణాలకు ఎడాపెడా అనుమతులు ఇచ్చేసి చేతులు దులుపుకోకుండా.. మురుగు నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు, వరద కాల్వల నిర్మాణం, గ్రీన్‌బెల్ట్, బఫర్ జోన్ పరిధుల నిర్ధారణ తదితర అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది. సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ల నుంచి అభ్యంతరాలు రాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అత్యున్నత స్థాయి అధికారులు, నిపుణుల కమిటీ కొత్త నిబంధనల రూపకల్పనలో తలమునకలైంది. జీవో 111 పరిధిలోని ఏడు మండలాల్లో 84 గ్రామాలుండగా వీటిల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కలుపుకొని సుమారు 1.35 లక్షల ఎకరాల భూమి ఉంది. జెడ్‌ఎల్‌డీ ప్రాంతాల్లో నివాస సముదాయాలు వర్షపాతాన్ని అధ్యయన నివేదిక ఆధారంగా తక్కువ వర్షపాతం ఉండి, జలాశయాల మనుగడకు ఇబ్బంది లేని ప్రాంతాన్ని జీరో లెవల్ డిశ్చార్జి (జెడ్‌ఎల్‌డీ)గా గుర్తించనున్నారు. ఈ ప్రాంతంలో హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారమే నివాస సముదాయాల నిర్మాణాలకు అనుమతి ఇస్తారు. వాణిజ్య కార్యకలాపాలకు అస్సలు అనుమతులు ఉండవు. ఇక ఈ ప్రాంతాల్లోని నివాసాల నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాలను శుద్ధి చేసి, తిరిగి ఆ నీటిని అక్కడే వివిధ ఇతర అవసరాలకు వినియోగించుకునే విధంగా తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. శాటిలైట్ మ్యాపుల ద్వారా గ్రీన్ చానళ్ల గుర్తింపు.. మురుగు, వర్షపు నీరు జంట జలాశయాలకు చేరితే వాటి ఉనికికే ప్రమాదమనేది పర్యావరణవేత్తల ప్రధాన అభ్యంతరం. దీనికి పరిష్కారం చూపించగలిగితే సమస్య ఉండదని భావించిన నిపుణులు కమిటీ.. అసలు వరద నీరు జలశయాలకు ఏ ప్రాంతం నుంచి చేరుతుందో అధ్యయనం చేయాలని నిర్ణయించారు. గత 50 ఏళ్ల వర్షపాతాన్ని అధ్యయనం చేసి నీటి ప్రవాహ మార్గాన్ని శాటిలైట్ మ్యాపుల ద్వారా గుర్తించనున్నారు. జలాశయాల ఎగువ నుంచి వచ్చే ఈ నీరు జీవో 111 పరిధిలోని 84 గ్రామాల గుండా ఎలా ప్రవహిస్తుందో నిర్ధారిస్తారు. ఈ ప్రవాహ మార్గాన్ని గ్రీన్ ఛానల్‌గా గుర్తిస్తారు. ఈ చానల్స్ వద్ద వరద కాలువలను నిర్మిస్తారు. ఒకవేళ కాలువల నిర్మాణం కోసం భూములు తీసుకోవాల్సి వస్తే గనక ప్రస్తుత మార్కెట్ రేటు కట్టి ఇవ్వాలని, అప్పుడే భూ యజమానులు ముందుకొస్తారని అధికారులు ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. బఫర్ జోన్ 500 మీటర్లే! ప్రస్తుతం జంట జలాశయాల చుట్టూరా 10 కిలో మీటర్ల ప్రాంతాన్ని చెరువు పూర్తి స్థాయి సామర్థ్యం (ఎఫ్టీఎల్)గా పరిగణిస్తున్నారు. ఈ ప్రాంతంలో కేవలం పదిశాతం విస్తీర్ణంలో మాత్రమే నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు. అయితే కొత్త నిబంధనలలో ఎఫ్టీఎల్ స్థానంలో 500 మీటర్ల వరకే బఫర్ జోన్ ఉండనుంది. ఈ జోన్ పరిధిలో నిర్మాణాలపై ఆంక్షలుంటాయి. కాగా 300 చదరపు మీటర్లకు పైన ఉన్న ప్లాట్లకు కనిష్టంగా మీటరు వెడల్పుతో ఒకవైపున గ్రీన్ బెల్ట్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
మోడీ తడిసాడు..అభిమాని తుడిచాడు
-
గ్రామాల్లో తాగునీటి వనరులకు పునరుజ్జీవం
సాక్షి, అమరావతి: గ్రామాల్లోని సంప్రదాయ తాగునీటి వనరుల పునరుజ్జీవానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శ్రీసత్యసాయి, అన్నమ య్య, చిత్తూరు, పల్నాడు, వైఎస్సార్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో ఈ పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో వర్షపు నీరు వీలైనంత ఎక్కువ నిల్వ చేసేలా.. నీటి కొలనులు, మంచినీటి చెరువుల వంటి సంప్రదాయ తాగునీటి వనరుల్లో ఉపాధి హామీ పథకం ద్వారా పూడికతీత పనులు చేపట్టబోతోంది. ఉపాధి హామీ పథకం ద్వారా మొత్తం 8 రకాల పనులు చేపట్టను న్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల భాగస్వామ్యంతో ఆ ప్రాంతాల్లో భూమిలోని తేమ శాతం పెంచేందుకు విస్తృతంగా మొక్కల పెంపకం చేపట్టనున్నారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కేటగిరిలో గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో రూ.240 కోట్లతో ఆయా ప్రాంతాల్లోని ప్రభు త్వ భవనాల వద్ద రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ నిర్మాణం తదితరాలు చేపట్టేందుకు ఆ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మార్చి 4 నుంచి దేశవ్యాప్తంగా.. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనుల తరహాలోనే దేశవ్యాప్తంగా మార్చి 4 నుంచి నవంబర్ 30 వరకు ‘జలశక్తి అభియాన్–క్యాచ్ ద రెయిన్ 2023’ పేరుతో కేంద్ర జలశక్తి శాఖ పలు కార్యక్రమాలు నిర్వహించబోతోంది. దేశం మొత్తం మీద నీటి ఇబ్బందులుండే జిల్లాలను గుర్తించి.. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణతో కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మార్చి 4న దీన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నట్టు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఇప్పటికే లేఖలు రాశారు. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటరీ శనివారం వీడియో కాన్పరెన్స్ నిర్వహించి ఈ కార్యక్రమ లక్ష్యాలు, ప్రాధాన్యతల గురించి అన్ని రాష్ట్రాల అధికారులకు వివరించారు. కాగా, పట్టణ ప్రాంతాలో సైతం నీటి ఎద్ద డికి అవకాశమున్న ప్రాంతాల్లో.. వార్డు స్థాయిలో వర్షపు నీటిని నిల్వ చేసుకునేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. -
చెరువులకు చేవ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వాన నీటిని ఒడిసిపట్టేందుకు ప్రభుత్వం చెరువులకు ఊపిరిపోస్తోంది. ఇప్పటికే ఉన్నవాటికి మరమ్మతులు చేయడం.. అవసరమైతే కొత్తవి నిర్మించడానికి పూనుకుంది. కేంద్ర జలశక్తి అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా ‘క్యాచ్ ది రెయిన్’ (వర్షపు నీటిని ఒడిసిపడదాం) పేరుతో చేపడుతున్న ఈ కార్యక్రమం సందర్భంగా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఉండే అన్ని రకాల చెరువుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. వాగుల మధ్య చెక్ డ్యాంలను నిర్మించి కనీసం ఎకరం విస్తీర్ణంలో నీటిని నిల్వ ఉంచే అవకాశం ఉన్నవి మొదలుకొని మైనర్ ఇరిగేషన్ విభాగం పరిధిలో ఉండే పెద్దపెద్ద చెరువులను ఒక్కొక్క వాటర్ బాడీ (నీటిని నిల్వ ఉంచే చెరువు)గా వర్గీకరించగా.. అలాంటివి మొత్తం 1,90,726 ఉన్నట్లు గుర్తించారు. ప్రతీ వాటర్ బాడీ ఎంత విస్తీర్ణంలో ఉందన్న సమాచారంతో పాటు రేఖాంశాలు, అక్షాంశాలతో కూడిన శాటిలైట్ గణాంకాల ప్రకారం అధికారులు జియో ట్యాగింగ్ చేశారు. ఆ వివరాలన్నింటినీ ఆన్లైన్లో పొందుపరిచారు. ఇక రాష్ట్రంలో మొత్తం 13,371 గ్రామ పంచాయతీలతో పాటు 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీ, నగర పంచాయతీలు ఉన్నాయి. అంటే ప్రతి ఊరిలో సరాసరి 10–14 వరకు ఈ తరహా చెరువులున్నాయి. అత్యధికంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే 50 వేల వరకు ఉండగా, అత్యల్పంగా ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలో నాలుగేసి వేలకు లోపునే ఉన్నాయి. ప్రస్తుతం పురోగతిలో 74,722 పనులు ఇక రాష్ట్రంలో అందుబాటులో ఉన్న చెరువులను సద్వినియోగం చేసుకునేందుకు వీలైనంత ఎక్కువ మొత్తంలో వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో అన్ని శాఖలకు సంబంధించి వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా మొత్తం రూ.3,970 కోట్లతో వర్షపు నీటి నిల్వకు ఉపయోగపడే పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా.. చెరువుల్లో పూడికతీత, చెరువు కట్టలు బలోపేతం, వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు చేపట్టడం వంటి 74,722 పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు తెలిపారు. అమృత్ సరోవర్లలో రాష్ట్రం రెండోస్థానం.. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ‘అమృత్ సరోవర్’ పేరిట వచ్చే ఏడాది కాలంలో ప్రతి జిల్లాలో కనీసం 75 చెరువుల చొప్పున కొత్తవి ఏర్పాటుచేయడం.. లేదా పాతవాటిని అభివృద్ధి చేయడం చేయాలని.. వీటిలో 20 శాతం మేర ఈ ఆగస్టు 15కే పూర్తిచేయాలని రాష్ట్రాలకు కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించింది. వీటిలో ఇప్పటికే 20 శాతం కంటే ఎక్కువగా అంటే 519 చెరువులను అభివృద్ధిచేసి దేశంలోనే రెండో స్థానంలో నిలిచినట్లు అధికారులు వెల్లడించారు. -
Hyderabad Rains: మూడ్రోజులుగా ముసురుకుంది.. స్తంభించిన జనజీవనం
సాక్షి, హైదరాబాద్: ఆకాశానికి చిల్లులు పడ్డాయా.. మేఘాలు వర్ష ధారలయ్యాయా అన్నట్లు మూడ్రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలతో నగరం తడిసిముద్దయ్యింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు వచ్చి చేరింది. ఆదివారం ఉదయం హఫీజ్‌పేట్‌లో అత్యధికంగా 7.7 సెంటీమీటర్లు, మైలార్‌దేవ్‌పల్లి, శివరాంపల్లిలలో 6, గాజుల రామారం ఉషోదయ కాలనీలో 5.6, బాలానగర్‌లో 5.3, మియాపూర్, జూపార్కులలో 5.2 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదయ్యింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) రాయదుర్గంలో కనిష్టంగా 4.5 సెంటీమీటర్ల వాన కురిసింది. రామంతాపూర్, కందికల్ గేట్, జీడిమెట్ల, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్, ఆర్సీపురం, తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని కాలనీలు, బస్తీలు జలమయమయ్యాయి. పలు చోట్ల రహదారులు చెరువులను తలపించాయి. మురుగునీటి కాల్వకు మరమ్మతులు కొనసాగుతున్న అనేక చోట్ల వరదనీటితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చదవండి: ప్రాజెక్టులకు వరద పోటు ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్న మార్గాల్లో దెబ్బతిన్న రోడ్లపై గుంతల్లో వాననీరు వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. Its not a rivulet, #Waterlogging on roads due to continuous #HeavyRains near #Attapur area in #Hyderabad, Traffic interrupts. #Telangana govt alerted citizens, declared 3 days holidays to Educational Institutions.#HyderabadRains #heavyrain #Telanganarains #TelanganaFloods pic.twitter.com/Tn1MJblQLo — Surya Reddy (@jsuryareddy) July 10, 2022 జంట జలాశయాలకు వరద ప్రవాహం మణికొండ: గత రెండు రోజులుగా శివారు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గండిపేట (ఉస్మాన్‌సాగర్) చెరువులోకి వరదనీరు పోటెత్తుతుండటంతో ఆదివారం సాయంత్రం రెండు గేట్లను వదలి నీటిని కిందకు వదిలారు. పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1785.80 అడుగులకు చేరుకుంది. పైనుంచి 208 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో 7,9 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 100 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. గండిపేట గేట్లను ఎత్తుతున్న అధికారులు దాంతో మూసీ నదిలో నీటి ప్రవాహం మొదలయ్యింది. గండిపేటలోని గేట్లకు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, జలమండలి డీజీఎంలు నరహరి, వెంకట్రావులు పూజలు నిర్వహించి గేట్లను పైకి ఎత్తారు. రాత్రికి మరింత వరద ఎక్కువైతే అవే గేట్లను మరింత ఎత్తటం, మరిన్ని గేట్లను ఎత్తేందుకు యంత్రాంగం సిద్దంగా ఉందని జలమండలి అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో గండిపేట కౌన్సిలర్లు విజిత ప్రశాంత్ యాదవ్, నాయకులు గోపాల గణేష్, సీఐ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. వరద నీటితో హిమాయత్‌సాగర్ Waves in Hyderabad @balaji25_t @Rajani_Weather#HyderabadRains pic.twitter.com/1L1TCEjNGt — karthikavsk(sharzsCAr) (@karthikavsk) July 10, 2022 నిండుకుండలా హిమాయత్‌సాగర్.. బండ్లగూడ: భారీ వర్షాలు కురుస్తుండడంతో హిమాయత్‌సాగర్ చెరువు వరద నీటితో నిండుకుండను తలపిస్తోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం పెరుగుతోంది. హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1760.50 అడుగులుగా ఉంది. దీంతో ఆదివారం సాయంత్రం 6 గంటలకు జలమండలి మేనేజర్ రేణుక, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్‌ల ఆధ్వర్యంలో 10, 5వ నంబర్ గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు పంపిస్తున్నారు. -
వరద నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు
-
మహబూబ్‌నగర్.. వరద నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు..
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో గత రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి మహబూబ్‌నగర్ మండలం కోడూరు దగ్గర ఉన్న రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో శుక్రవారం ఉదయం రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఓ ప్రైవేటు పాఠశాల బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. దాదాపు 30 మంది విద్యార్థులతో వెళుతున్న భాష్యం టెక్నో స్కూల్‌కు చెందిన బస్సు నీటిలో చిక్కుకుంది. రాంచంద్రపూర్, మాచన్‌పల్లి, సూగురుగడ్డ తాండా నుంచి విద్యార్థులను ఎక్కించుకుని పాఠశాలకు వెళ్తున్న బస్సు వరద నీటిలోకి రాగానే ఆగిపోయింది. చూస్తుండగానే బస్సులోకి నీరు చేరడంతో దీనిని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. విద్యార్దులంతా క్షేమంగా బయటపడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం ట్రాక్టర్ సహాయంతో నీటిలో చిక్కుకున్న బస్సును బయటకు లాగారు. అయితే బస్సు ఇంకాస్త ముందుకు వెళ్ళి ఉంటే పూర్తిగా నీటిలో మునిగిపోయేదని, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చదవండి: భారీ వర్షాలు.. నదిలో కొట్టుకుపోయిన కారు.. 9 మంది మృతి -
బురద నీటిలో పెళ్లి బస్సు!.. రాత్రంతా అక్కడే ఉండటంతో
సాక్షి, వికారాబాద్: పెళ్లి బృందాన్ని తీసుకెళ్తున్న బస్సు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద బురద నీటిలో ఇరుక్కుపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. కోటపల్లి మండలం బర్వాద్ గ్రామానికి చెందిన పెళ్లి బృందం వారు హైదరాబాద్‌లోని బోరబండకు వెళ్లారు. వివాహం ముగిసిన తర్వాత తిరుగుప్రయాణంలో రాత్రి 11గంటలకు మొరంగపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. వంతెన కింది నుంచి బస్సు తీసుకెళ్లేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. అప్పటికే భారీ వర్షం కువరడంతో బ్రిడ్జి కింద వరద చేరింది. బస్సు టైర్లు బురదలో కూరుకుపోవడంతో ముందుకు కదలలేదు. దీంతో వాహనం దిగిన పెళ్లివారు నడుచుకుంటూ రోడ్డుపైకి వెళ్లారు. అక్కడి నుంచి ఆటోల్లో ఇళ్లకు చేరుకున్నారు. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా లాభం లేకపోవడంతో బస్సును అలాగే వదిలేశాడు. తెల్లారేసరికి మరింత వర్షం కురవడం, ఊట నీరు సైతం బ్రిడ్జి కిందకు చేరడంతో సగ భాగానికి పైగా బస్సు నీటిలో మునిగిపోయింది. ఉదయాన్నే అక్కడకు చేరుకున్న బస్సు యజమాని, డ్రైవర్, క్లీనర్, గ్రామస్తుల సాయంతో బస్సును బయటకు తీసేందుకు ప్రయత్నించారు. గతేడాది సైతం ఇవే కష్టాలు గతేడాది వర్షాకాలంలోనూ మొరంగపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఇలాంటి కష్టాలే ఎదురయ్యాయి. ఈ రూట్లో నాలుగైదు గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తారు. వీరికి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. కనీసం బ్రిడ్జి పనులైనా వేగంగా పూర్తిచేయడం లేదు. వంతెన కింద వరద నీరు నిల్వకుండా ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కనిపించని హెచ్చరిక బోర్డులు వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్న చోట హెచ్చరిక బోర్డులు, సూచికలు ఏర్పాటు చేయాలేదు. ఈ విషయాన్ని అటు కాంట్రాక్టర్ ఇటు అధికారులు పట్టించుకోవడం లేదు. భారీ వర్షాలు కురిసిన సమయంలో కొత్తగా ఎవరైనా ఈ రూట్లో వస్తే ప్రమాదం బారిన పడక తప్పదు. గత వర్షా కాలంలో ఇక్కడే ఇరుక్కుపోయిన ఓ లారీ మూడు రోజులుగా అక్కడి ఉండిపోయింది. -
యాదాద్రిలో కొనసాగుతున్న దిద్దుబాటు పనులు
యాదగిరిగుట్ట: ఇటీవల కురిసిన భారీ వర్షానికి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ పరిసరాలు, క్యూలైన్లు చెల్లాచెదురైన విషయం తెలిసిందే. క్యూలైన్లోని గ్రౌండ్ ఫ్లోర్లో వర్షం నీటితోపాటు చెత్తాచెదారం చేరింది. ప్రత్యేక సిబ్బందితో చెత్తాచెదారం తొలగించడంతోపాటు మట్టిని తీసి పక్కన పోస్తున్నారు. వర్షపునీరు లీకవుతున్న ప్రధానాలయం మండపాలకు మరమ్మతులు చేస్తున్నారు. శిల్పులు వాటర్ క్యూరింగ్ పనులను చేపట్టారు. ఆలయ సన్నిధిలో కుంగిపోయిన స్టోన్ ఫ్లోరింగ్‌ను అధికారులు పరిశీలించి, వాటిని బాగుచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కొండపైనే గల విష్ణు పుష్కరిణి వద్ద మట్టి అంతా ఒకేచోటకు చేరడంతో దానిని కూడా తొలగిస్తున్నారు. కూలిపోయిన చలువ పందిళ్లను పునరుద్ధరిస్తున్నారు. కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి, రింగ్ రోడ్డు వంటి ప్రాంతాల్లో మరమ్మతులు చేయాల్సిన చోట్లను ఆర్అండ్ బీ అధికారులు పరిశీలిస్తున్నారు. -
పెళ్లై ఏడాది.. నదిలో కొట్టుకుపోయిన గర్భిణీ మృతి
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కలక్కాడు ప్రాంతంలో వరద నీటిలో కొట్టుకుపోయిన గర్భిణీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నెల్లై జిల్లా కలక్కాడు ప్రాంతంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో కలక్కాడు, నాంగునేరి ఏటీలో ప్రవాహం ఉద్ధృతమైంది. చిదంబరపురం రోడ్డులోని నేల వంతెన నీటిలో మునిగిపోవడంతో కలక్కాడు, చిదంబరంపురానికి రాకపోకలు స్తంభించాయి. కల్లక్కాడు సమీపం చిదంబరపురానికి చెందిన మురుగన్ తన కుమార్తె లేఖ(23) అల్లుడు కుమరి జిల్లా నాగర్ కోవిల్ సీరంకుడికి చెందిన పరమేశ్వరన్‌ను దీపావళికి ఆటోలో తీసుకొచ్చాడు. వంతెన వద్దకు చేరుకునే సరికి చీకటి అయింది. చదవండి: ముగ్గురు డెంటిస్టులున్నా.. ఒక్కరూ చూడలే..చివరికి! ప్రవాహ ఉద్ధృతిని గుర్తించలేక ఆటోనుంచి దిగి పరమేశ్వరన్, లేఖ, మురుగన్, మురుగన్ కుమారుడు భరత్ వంతెన దాటేందుకు ప్రయత్నించారు. వరద ఉద్ధృతి పెరగడంతో నలుగురు కొట్టుకుపోయారు. మురుగన్, భరత్, పరమేశ్వరన్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. లేఖ జాడ లేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని లేఖ కోసం గాలించారు. అర్థరాత్రి సమయంలో కాలువలో ఓ చెట్టుకు చిక్కుకుని ఉన్న లేఖ మృతదేహాన్ని గుర్తించి వెలికి తీశారు. లేఖకు పరమేశ్వరన్‌కు గత జనవరిలో వివాహమైంది. ఆమె ఆరు నెలల గర్భిణి. చదవండి: భార్య వివాహేతర సంబంధం.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య.. 12 గంటల్లోనే -
విజయవాడ: వర్షం కారణంగా రోడ్లపై నిలిచిన వర్షపు నీరు
-
ఢిల్లీకి నయాగరా వాటర్ ఫాల్స్ వచ్చిందిరోయ్.. వైరల్ వీడియో
దేశ రాజధాని ఢిల్లీలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ-ఎన్సీఆర్లో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఏకదాటి వర్షానికి నగరమంతా జలమయమైంది. రోడ్లపై నీరు నిలవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిలిపోయింది. అయితే ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడా భారీ వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ‘తూర్పు, ఆగ్నేయం, ఈశాన్య, ఉత్తర ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, దాద్రి, మీరట్, మోడీనగర్‌లోని ప్రదేశాల్లో తేలికపాటి నుంచి మోస్తరు తీవ్రతతో కూడిన ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని ట్వీట్ చేసింది. ఇదిలా ఉండగా ఢిల్లీ వర్షాలకు సంబంధించిన ఓ ఆసక్తికరమైర వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. రాజధానిలోని ఓ ఫ్లై ఓవర్ మీద వరద ప్రవాహం ఎక్కువవడంతో వర్షపు నీరు కింద ఉన్న రోడ్డు మీదకు పారుతోంది. అయితే ఇది చూడటానికి అచ్చం జలపాతం మాదిరి కనిపిస్తోంది. దీనిని సంజయ్ రైనా అనే ట్విటర్ యూజర్ తన అకౌంట్లో పోస్టు చేశాడు. ఇది చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘ఢిల్లీకి నయాగరా జలపాతం వచ్చింది. ఉత్తరాఖండ్‌లోని కెంప్టీ వాటర్ ఫాల్‌ను తలపిస్తోంది. ఇది ఢిల్లీ ప్రభుత్వ కొత్త 'కార్' వాష్ చేసుకునే ఫెసిలిటీ.’ అంటూ రిప్లై ఇస్తున్నారు. చదవండి: న్యూజిలాండ్‌లో నవారు మంచం ధరెంతో తెలుసా? కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి.. అసలు నిజం ఇదే! Welcome to the #WaterfallCity of #Delhi #DelhiRains pic.twitter.com/ZQtYbwvFB6 — Sanjay Raina (@sanjayraina) August 31, 2021 It's the new 'car' wash facility of the Delhi Govt — deesso (@deesso) August 31, 2021 Delhi mai banega Niagra Fall ... uski ye pehli jhalak hai — Sumit Srivastava (@meet2sumeet) August 31, 2021 -
అక్రమ కట్టడాలు వాళ్ల హయాంలోనివే
సాక్షి, హైదరాబాద్ : చరిత్రలో ఎన్నడూ చూడని భారీ వరదలు వచ్చాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన సమీక్షలో ప్రసంగించిన ఆయన అక్రమ కట్టడాల వల్లే వరదలు వచ్చాయని విమర్శలు చేస్తోన్న ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఇప్పడు ఆరోపణలు చేస్తోన్న నేతల హయాంలోనే అక్రమ కట్టడాలు నిర్మించారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కట్టిన భవనాలన్నీ చట్టానికి లోబడి రూల్స్ ప్రకారమే కట్టిన కట్టడాలని తెలిపారు. వరద ముంపు ప్రజలకు నష్టపరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు గ్రేటర్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. వరదల్లో నష్టపోయిన ప్రజలెవ్వరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం వారిని ఆదుకుంటుందన్నారు. (ఇల్లు కోల్పోయిన వారికి రూ.లక్ష సాయం : కేసీఆర్) 1908 తర్వాత మళ్లీ అలాంటి వరదలు హైదరాబాద్‌ను ముంచెత్తాయని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. పరిస్థితులపై మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, ప్రజల్లోనూ ఉంటున్నారని తెలిపారు. 80మంది సీనియర్ అధికారులతో ప్రత్యేక బృందాన్ని కేటీఆర్ ఏర్పాటు చేశారని తెలిపారు. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ముఖ్యమంత్రి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. మరో మూడు, నాలుగు రోజుల పాటు వర్షసూచన ఉందని, ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు. వరదల్లో ఉన్న ప్రజల కోసం మంత్రులతో సహా కార్పొరేటర్లు 24 గంటలు పనిచేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. 550 కోట్లు నష్ట పరిహారం ప్రకటించినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. (బాధితులకు ఆర్థిక సాయం) -
వరదనీరు ఆసుపత్రిలో చేరకుండా చర్యలు తీసుకోండి
హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రిలో వరద నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉస్మానియా ఆస్పత్రిలో వరద నీరు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదన్న పిల్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. వర్షం నీరు బయటకు వెళ్లే ఏర్పాట్లు సరిగా లేక ఆస్పత్రిలో నీరు నిండుతొందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉస్మానియా ఆస్పత్రిలో వర్షం నీరు మూసీలో కలిసేలా ఏర్పాట్లు చేయాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు రోగులు ఇబ్బంది పడ్డారని హైకోర్టు ప్రస్తావించింది. మరో వారం, పది రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. తదుపరి విచారణను నవంబరు 12కి వాయిదా వేసింది. (‘హైదరాబాద్‌లో అత్యధిక వర్షం, ఇది రెండోసారి’ ) -
ఒడిసి పట్టు.. మునగదు ఒట్టు!
సాక్షి, హైదరాబాద్: ఏటా సెప్టెంబర్‌లో 5 సెం.మీ. వర్షం కురిస్తే చాలు హైదరాబాద్ నిండా మునుగుతోంది. కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లు గ్రేటర్ మునకకు అన్నే కారణాలున్నాయి. వందకుపైగా ముంపు ప్రాంతాలున్నాయి. ఇటీవల కురిసిన జడివానకు పలు లోతట్టు ప్రాంతాల్లో నడుములోతు నీళ్లు రావడంతో దారులు ఏరులను తలపిం చాయి. వరద కారణంగా వాహనదారులు విలవిల్లాడారు. నగరంలో 5 వేల కిలోమీటర్ల మేర విస్తరించిన మురుగునీటి కాల్వలు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసినవి కావడంతో వాటి సామర్థ్యం సరిపోవడంలేదు. పలు చోట్ల మురుగునీటి పైపులైన్లలో నిర్మాణ వ్యర్థాలు పోగుపడటంతో భారీ వర్షం కురిసిన ప్రతిసారి మ్యాన్‌హోళ్లు ఉప్పొంగుతున్నాయి. అలాగే 1,500 కి.మీ. మేర విస్తరించిన నాలాలపై సుమారు 8 వేల ఆక్రమణలను తొలగించడంలో బల్దియా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జడివాన కురిసిన ప్రతిసారి జనం బయటకు రావద్దని బల్దియా హెచ్చరికలు జారీ చేయడం పరిపాటిగా మారింది. ముంపు సమస్య ఇలా... నగరంలో ఏటా నమోదవుతున్న వర్షపాతంలో సింహభాగం ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతూనే ఉంది. రామంతాపూర్, భండారీ లే అవుట్, నందీకాలనీ.. లాంటి ప్రాంతాలు నీటమునగడం సర్వసాధారణంగా మారింది. ఈ వరద ముప్పును తప్పించేందుకు చక్కటి ప్రత్యామ్నాయం ఉందని ఐఐటీ బాంబే నిపుణుల తాజా అధ్యయనంలో తేలింది. నగరంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి పైకప్పుపై పడే వర్షపు నీటిని పదిలంగా ఒడిసిపట్టడమే సమస్యకు పరిష్కారమని స్పష్టం చేసింది. ఇలా చేస్తే ముంపు నుంచి విముక్తి.. గ్రేటర్ విస్తీర్ణం 625 చ.కి.మీటర్లు. నివాసాల సంఖ్య సుమారు 25 లక్షలు. ఏటా నమోదయ్యే వర్షపాతం 800–1000 మిల్లీమీటర్లు. ఏడాదికి సుమారు 50–90 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో 25 లక్షల నివాసాలపై కురిసిన వర్షపు నీటిని వెయ్యి లీటర్ల సామర్థ్యంతో ఇంకుడు గుంతలు తవ్వి నిల్వ చేస్తే 43 శాతం ముంపు ముప్పు తప్పుతుందని ఐఐటీ బాంబే నిపుణుల బృందం స్పష్టం చేసింది. కనీసం ఇంటికి 500 లీటర్ల మేర వర్షపు నీటిని నిల్వ చేసినా.. 35 శాతం వరదముప్పు తప్పుదుందని ఈ నివేదిక వెల్లడించింది. ఇక 200 లీటర్ల నిల్వచేస్తే 22 శాతం.. ఇంటికి వంద లీటర్లయినా నిల్వచేస్తే 11 శాతం ముంపు సమస్య నుంచి విముక్తి లభిస్తుందని వెల్లడించింది. నేలలోకి ఇంకితే.. నగరంలోని ఫుట్‌పాత్‌లు, బహిరంగ ప్రదేశాలు, పార్కులు, పార్కింగ్ ప్రదేశాలు, లోతట్టు ప్రాంతాల్లో... కాంక్రీట్, టైల్స్, బండరాళ్లతో కప్పివేయకుండా మధ్యలో ఖాళీ స్థలాలు వదిలిపెడితే వర్షపు నీరు నేలలోకి ఇంకుతుందని.. వరద తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొంది. సుమారు 185 చెరువుల్లోకి వరద నీటిని చేర్చే ఇన్ ఫ్లో చానల్స్, నాలాలను ప్రక్షాళన చేస్తే ముంపు నుంచి శాశ్వత విముక్తి లభిస్తుందని, వాటిల్లో నీటి మట్టం కూడా పెరుగుతుందని ఈ నివేదిక తెలిపింది. కాగితాలపైనే కిర్లోస్కర్ నివేదిక.. నగరానికి ముంపు సమస్య నుంచి విముక్తి కల్పించేందుకు 2003లో నివేదిక అందించిన కిర్లోస్కర్ కమిటీ వరదనీరు సాఫీగా వెళ్లేందుకు నాలాలను అభివృద్ధి చేయాలని సూచించింది. అలాగే 2007 గ్రేటర్ మొత్తానికీ సమస్య తీరేందుకు ‘సమగ్ర మాస్టర్ ప్లాన్ .. సూక్ష్మస్థాయి వరద నీటి పారుదల నెట్వర్క్ ప్లాన్ .. మేజర్, మైనర్ వరద కాలువల ఆధునీకరణకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు’(డీపీఆర్) తయారు చేసే బాధ్యతను ఓయంట్స్ సొల్యూషన్ ్స ప్రైౖ వేట్ లిమిటెడ్‌కు అప్పగించారు. దాని ప్రాథమిక అంచనా మేరకు గ్రేటర్లో వరద నీటి సమస్య పరిష్కారానికి సుమారు రూ.10,000 కోట్లు అవసరం. బల్కాపూర్ నాలా, కూకట్పల్లి, ముర్కినాలా, పికెట్, ఎర్రమంజిల్, బంజారాహిల్స్, ఎల్లారెడ్డిగూడ, పంజాగుట్ట, యూసుఫ్‌గూడ, నాగమయ్యకుంట, కళాసిగూడ, ఇందిరాపార్కు నాలాలను ప్రక్షాళన చేయాలి. ఆక్రమణలు నిరోధించాలి. కానీ ఈ పనులన్నీ నిధుల లేమితో కునారిల్లుతున్నాయి. తక్షణం చేయాల్సిన పనులివీ.. ► గ్రేటర్లో 1,500 కి.మీ. మేర విస్తరించిన ప్రధాన నాలాలపై ఉన్న సుమారు 8 వేల ఆక్రమణలను తొలగించాలి. ► నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి కావాలంటే.. టౌన్ ప్లానింగ్ విభాగంతో పాటు మరో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ► నాలాల ఆధునీకరణ ఆవశ్యకతను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. దీనికి రాజకీయ పార్టీల, ఎన్జీఓల సహకారం తీసుకోవాలి. ► వరద నీటి కాలువల్లో మురుగునీరు పారకుండా చూడాలి. మురుగునీటి పారుదలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలి. ► స్టార్మ్ వాటర్ డ్రైనేజీ మాస్టర్‌ప్లాన్ ను పరిగణనలోకి తీసుకొని టౌన్ ప్లానింగ్ విభాగం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను అనుమతించరాదు. ఇతర మెట్రో నగరాల్లో ఇలా.. చెన్నై, ముంబై మహానగరాల్లో 50 సెం.మీ.పైగా భారీ వర్షాలు కురిసినా ముంపు తప్పించేందుకు అక్కడి నాలా వ్యవస్థలో భారీ సామర్థ్యంగల పైపులైన్ల ఏర్పాటుతో వరదనీటికి చక్కటి పరిష్కారం చూపారు. ఆ నీటిని సముద్రంలోకి మళ్లించడంతో ఆయా నగరాలకు ముంపు ముప్పు తప్పింది. హైదరాబాద్‌కు సముద్రం లేకపోయినా వర్షపు నీటిని చెరువులు, కుంటలకు మళ్లించడంతోపాటు,లోతట్టు ప్రాంతాల్లో ఇంకుడు కొలనుల ఏర్పాటుచేసి వాటిలోకి మళ్లిస్తే ముంపు తప్పుతుందని నిపుణులు సూచిస్తున్నారు. -
యాదాద్రిలో మండపాల్లోకి వర్షపు నీరు
యాదగిరిగుట్ట: ఇటీవల కురిసిన వర్షాలతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ మండపాల్లోకి వర్షం నీళ్లు వచ్చాయి. ప్రధానంగా అష్టభుజి, అంతర్గత, బాహ్య ప్రాకార మండపాల్లో వర్షం నీళ్లు చేరుతున్నాయి. పంచతల రాజగోపురం వద్ద ఉన్న ప్రాకార మండపంలో నిర్మితం అవుతున్న అద్దాల మండపంలోకి కూడా వాననీరు చేరడంతో పనులు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఆలయ పునర్నిర్మాణ సాంకేతిక కమిటీ సభ్యులు, వైటీడీఏ అధికారులు, ఇంజనీర్లు ఆలయాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ పనులు పూర్తి కాకపోవడంతోనే.. యాదాద్రి ప్రధాన ఆలయంలో చేస్తున్న అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, ఎలక్ట్రికల్ వైరింగ్ పనులు పూర్తి కాకపోవడంతోనే ఇటీవల కురిసిన వర్షానికి ఆలయం, మండపాల్లోకి నీరు చేరినట్లు తెలుస్తోంది. ఆలయంలో లైటింగ్, ఏసీలు, ఇతర అవసరాలకోసం ప్రస్తుతం వైరింగ్ పనులు జరుగుతున్నాయి. వైర్లు కనిపించకుండా వేసిన పైప్లలోకి వర్షం నీళ్లు వెళ్లడంతో అవి ప్రధాన ఆలయంలోకి చేరుతున్నట్లు సమాచారం. అంతే కాకుండా ప్రధాన ఆలయంలోనుంచి నీరు బయటకు వెళ్లేలా అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులు నడుస్తున్నాయి. ఈ పనులు పూర్తి కాకపోవడంతో వాన నీరు చేరినట్లు అధికారులు చెబుతున్నారు. రెయిన్ ఫ్రూఫ్ గట్టి పడకపోవడంతో.. అష్టభుజి ప్రాకార మండపం, ఇన్నర్, అవుటర్ ప్రాకార మండపాల్లోని పై భాగంలో ఉన్న స్లాబ్ మధ్యలోని గ్యాప్‌లను డంగు సున్నంతో మూసేశారు. అలాగే స్లాబ్‌పైన వేసిన రెయిన్ ఫ్రూఫ్ గట్టిపడకపోవడంతో లీకేజీలు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెయిన్ ఫ్రూఫ్ గట్టిపడడానికి సుమారు రెండు సంవత్సరాల వరకు సమయం పడుతుందని తెలుస్తోంది. అయితే ఇప్పుడే ఇలా లీకేజీలు రావడంపై స్థానిక భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నాణ్యతతో పనులు చేపట్టాలని, లీకేజీలు పునరావృతం కాకుండా వైటీడీఏ అధికారులు, టెక్నికల్ కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. కాగా, ఆలయ నిర్మాణ పనుల్లో రాజీపడేది లేదని ఆలయం ఈవో గీతారెడ్డి స్పష్టం చేశారు. లీకేజీల పరిశీలన టెక్నికల్ కమిటీ సభ్యుడు కొండల్రావు, ఆర్అండ్బీ ఎస్ఈ సత్యనారాయణ, ఆర్కిటెక్టు ఆనంద్‌సాయి, ఈఓ గీతారెడ్డి, స్తపతి ఆనందచారి వేలు, శిల్పులు ఆలయంలో లీకేజీలను పరిశీలించారు. అద్దాల మండపంలోకి నీళ్లు ఎలా చేరాయి అనే అంశంపై శిల్పులతో చర్చించారు. అలాగే రెయిన్ ఫ్రూప్ వేశాక కూడ వర్షం నీళ్లు ఎలా లీక్ అవుతున్నాయని అడిగారు. స్లాబ్‌పై ఏర్పాటు చేసిన రెయిన్ ఫ్రూఫ్ పూర్తిగా గట్టి పడటానికి రెండేళ్ల కాలం పడుతుందని, ప్రస్తుతం జరిగిన లీకేజీలను సరి చేస్తామని టెక్నికల్ కమిటీ సభ్యులకు శిల్పులు తెలిపారు. లీకేజీలపై టెక్నికల్ కమిటీ సభ్యుడు కొండల్రావు పలువురిని మందలించినట్లు తెలిసింది. -
జల కల్పన
ఆమె ఓ ఆర్కిటెక్ట్. లక్షల రూపాయలు ఆర్జించే అవకాశం ఉన్న తన కెరీర్‌కే పరిమితమై పోకుండా భావితరాలకు విలువైన నీటి బొట్టును ఒడిసిపట్టి అందించేందుకు జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. తరిగిపోతున్న జలసంపదను పది కాలాల పాటు నిల్వచేసేందుకు వినూత్న డిజైన్లు రూపొందించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన్ననలు పొందారు. ప్రధాని సోషల్ మీడియా అకౌంట్ల నిర్వహణకు అర్హత సాధించిన ఏడుగురిలో ఒకరిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమే కల్పనా రమేశ్. హైదాబాద్‌లోని గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నారు కల్పనా రమేష్. సాహె (సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండీవర్) సంస్థను స్థాపించి దశాబ్దకాలంగా వర్షపునీటి సంరక్షణకు విశేషంగా కృషి చేస్తున్నారు. ఆ వివరాలను సాక్షితో పంచుకున్నారు. ప్రధాని దృష్టి నేను రూపొందించిన వర్షపు నీటి సంరక్షణ డిజైన్లు, చేపడుతున్న అవగాహన కార్యక్రమాలపై సోషల్ మీడియా వేదికగా కొన్ని గ్రూపులకు చెందినవారు దేశవ్యాప్తంగా ఆయా గ్రూపుల్లో పోస్ట్ చేయడంతోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీని ట్యాగ్‌చేశారు. దీంతో ప్రధానమంత్రి కార్యాలయ ‘మై గౌ’ సైట్ సీఈఓ మార్చి 6న నాకు ఫోన్‌చేసి పీఎం సోషల్ మీడియా అకౌంట్ల నిర్వహణకు మీరు అర్హత సాధించారని చెప్పడంతో సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను. ఈ గుర్తింపు నా బాధ్యతను మరింత పెంచింది. నేరుగా ప్రధాని నరేంద్రమోడీకి సంబంధించిన ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సైట్లలో నేను సమాచారాన్ని పొందుపరిచే అవకాశం ఉండదు. మైగౌ సైట్ సీఈఓకు సమాచారం చేరవేస్తే వారు నేను అందించే సమాచారాన్ని పరిశీలించి నా తరఫున ఆయా సైట్లలో నేను కోరిన సమాచారాన్ని పోస్ట్చేస్తారు. ఈ విధానంలో నా ఆలోచనలు, డిజైన్లు కోట్లాదిమందికి చేరతాయని సంతోషంగా ఉంది. విస్తృత అవగాహన గత మూడేళ్లుగా వర్షపునీటి సంరక్షణపై 150కి పైగా అవగాహన కార్యక్రమాలు, 50 ప్రత్యేక చర్చాగోష్ఠులు నిర్వహించాం. తాజాగా హైదరాబాద్‌లోని సిల్వర్‌ఓక్ విద్యాసంస్థలో 6–8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వాననీటి సంరక్షణపై రెండునెలలు క్లాస్‌రూమ్‌లో, మరో రెండు నెలలు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాం. వాళ్లు వెళ్లి ఇళ్లు, కాలనీల్లోనూ అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవలే మజీద్ బండ (కొండాపూర్) ప్రాంతంలో కొడికుంట చెరువును మా సాహె సంస్థ దత్తతకు తీసుకుంది. ఈ చెరువులోకి వర్షపునీరు చేరే ఇన్‌ఫ్లో ఛానల్స్‌ను ప్రక్షాళన చేస్తోంది. ఈ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఇళ్లు, కార్యాలయాల విస్తీర్ణం, నిర్మాణ డిజైన్లను బట్టి వాననీటి సంరక్షణ పిట్స్‌ను మేము డిజైన్ చేస్తున్నాం. నా స్వస్థలం బెంగళూరు. ఆర్కిటెక్చర్లో డిగ్రీ చేశాను. విద్యాభ్యాసం అక్కడే సాగింది. కానీ గత 20 ఏళ్లుగా హైదరాబాద్ నగరంలో ఉంటున్నాం. ఇప్పుడు ఇదే నా ఓన్సిటీ. ఇక్కడే వర్షపునీటి సంరక్షణపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాను. నా భర్త రమేష్ లోకనాథన్ది సాఫ్ట్వేర్ రంగం. ఆయన సహాయ సహకారాలు కూడా నాకెంతగానో ఉన్నాయి. వర్షపు నీటి నిల్వపై క్షేత్రస్థాయిలో పిల్లలకు అవగాహన భవిష్యత్ లక్ష్యం ‘చినుకు.. చినుకు ఒడిసిపట్టు.. భావితరాలకు దాచిపెట్టు’ అన్న నినాదంతో వర్షపునీటిని ఒడిసిపట్టే కృషిలో నిర్విరామంగా పనిచేస్తున్నాను. భవిష్యత్‌లో నా సేవలు, డిజైన్లు ప్రధాని సోషల్‌మీడియా అకౌంట్ల ద్వారా కోట్లాదిమందికి చేరనున్నాయి. ఈ జలయజ్ఞంలో ప్రతీ భారతీయుడు భాగస్వామి కావాలన్నదే నా లక్ష్యం.. నా స్వప్నం. కాంక్రీట్ మహారణ్యంలా మారిన నగరాల్లో వర్షపునీటిలో 80 శాతం వృథా అవుతోంది. ఇందులో 50 శాతం ఒడిసిపట్టినా నీటి కరువు ఉండదన్నదే నా నిశ్చిభిప్రాయం’’అని ముగించారు కల్పన. – ఏసిరెడ్డి రంగారెడ్డి, సాక్షి, హైదరాబాద్ నీటి బ్యాంకు! ఇళ్లు, అపార్ట్మెంట్లలో తక్కువ ఖర్చుతో వర్షపునీటిని సంరక్షించుకోవచ్చు. ఇంటి పైకప్పుపై కురిసిన వర్షపునీటిని నేరుగా కింద ఉన్న నీటి సంపులో నింపుకోవాలి. ఇలా ఇంటి విస్తీర్ణాన్ని బట్టి 30 వేల నుంచి లక్ష లీటర్ల వరకు నిల్వచేయవచ్చు. ఇది నిండిన తరవాత ఓవర్‌ఫ్లో అయ్యే నీటిని ఎండిన బోరుబావిలోకి మళ్లిస్తే మీకు ఏడాదికి సరిపడా జలబ్యాంక్ అందుబాటులో ఉంటుంది. ట్యాంకర్ కష్టాలు లేకుండా చూసుకోవచ్చు. ఏడాదికి సుమారు 35–45 రోజుల పాటు వర్షం తప్పక కురుస్తుంది. ఇందుకోసం ఒకసారి రూ.15–రూ.25 వేల వరకు ఖర్చు చేస్తే సరిపోతుంది. ఉదా.. వెయ్యి చదరపు అడుగుల భవనం రూఫ్‌టాప్‌పై పడిన వర్షపు నీటిని ఒడిసిపడితే 70 వేల లీటర్ల జలబ్యాంక్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నీరు ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి వందరోజుల పాటు సరిపోతాయి. ఇక 2000 చదరపు అడుగుల భవనానికి 1.40 లక్షల లీటర్లు, 3000 చదరపు అడుగుల భవనంపై కురిసిన నీటి ద్వారా 2.10 లక్షల లీటర్లు, 4000 చదరపు అడుగుల భవనానికి 2.80 లక్షల లీటర్ల జలబ్యాంక్ ఏర్పాటు చేసుకోవచ్చు. కల్పన -
ఆహ్లాదం.. ఆనందం
నెల్లూరు, దొరవారిసత్రం: మండల పరిధిలోని తీర గ్రామాల సమీపంలో పులికాట్ సరస్సులోకి వర్షపునీరు కలిసిపోకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో చెక్‌డ్యాంల వద్ద వర్షపునీరు నిల్వ చేరి ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.మీజూరు, వేలికాడు గ్రామాల వద్ద మూడు చెక్‌డ్యాంల నిర్మాణానికి గతంలో శ్రీకారం చుట్టారు. అయితే ఈ పనులు పూర్తి కాలేదు. దీంతో దొరవారిసత్రం, సూళ్లూరుపేట, నాయుడుపేట తదితర మండల ప్రాంతాల్లో కురిసిన వర్షపునీరు పులికాట్ సరస్సులో కలిసిపోయేది. ఈక్రమంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీయ్య చొరవ తీసుకున్నారు. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. కొంతకాలం క్రితం మీజూరు, వేలికాడు ప్రాంతాల్లో అసంపూర్తిగా ఆగిపోయి ఉన్న చెక్‌డ్యాంల వద్ద ఇసుక బస్తాలతో రింగ్ బడ్లను వేసేవిధంగా చర్యలు తీసుకున్నారు. అధికారులు రింగ్ బడ్లు వేయించడంతో వర్షపునీరు పులికాట్ సరస్సులో పూర్తిస్థాయిలో కలిసిపోకుండా నిల్వ చేరింది. దీంతో దొరవారిసత్రం, సూళ్లూరుపేట మండల ప్రాంతాల్లో పలువురు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిల్వ చేరిన నీటిలో పశువులు సేద తీరుతున్నాయి. వాటికి తాగునీటి సమస్య తీరిందని చెబుతున్నారు. కాగా విదేశీ విహంగాలు నీటిలో చేపలను వేటాడుతూ చూపరులకు కనువిందు చేస్తున్నాయి. అనేకమంది చెక్‌డ్యాంల వద్దకు వచ్చి పరిసరాలను చూసి ఆనందిస్తున్నారు. ఓ వైపు మంచినీరు తీర గ్రామాల రోడ్డుకు పడమర వైపున మంచినీరు, తూర్పున పులికాట్ సరుస్సులో ఉప్పునీరు ఉంది. దొరవారిసత్రం, సూళ్లూరుపేట మండల తీర ప్రాంతాల్లో విస్తరించి ఉన్న పులికాట్ సరస్సుకు ఆనుకుని ఆర్అండ్బీ రోడ్డు సుమారు 18 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ రోడ్డే పులికాట్ సరస్సులోకి వర్షపునీరు కలిసిపోకుండా ఆనకట్టలా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మీజూరు, వేలికాడు గ్రామాల సమీపంలోని రోడ్డుపై మూడు చెక్‌డ్యాంలను నిర్మించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ చెక్‌డ్యాంలు పూర్తయితే తీర ప్రాంతాల్లో సాగు, తాగునీటి కష్టాలకు శాస్వత పరిష్కారం లభిస్తుంది. చెక్‌డ్యాం పనులు పూర్తి చేయించేందుకు ఎమ్మెల్యే కిలివేటి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అన్ని అనుమతుల తీసుకుని పనులు మొదలు పెట్టించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం చెక్‌డ్యాంలో ఉన్న నీరు తగ్గితే ఏప్రిల్, మే నెలల్లో పనులు మొదలు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇరిగేషన్ అధికారులు చెప్పారు. -
వందేళ్ల క్రితమే ఒడిసిపట్టారు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: మండువా లోగిలి మధ్య ధ్వజ స్తంభంలా పక్క ఫొటోలోని ఈ ఇత్తడి గొట్టం అమరికను డోలియా అంటారు. పూర్వం వర్షం నీటిని ఒడిసి పట్టి.. దానిని ఓ చోటకు చేర్చి మంచినీటిగా మార్చే ప్రక్రియ కోసం దీనిని వినియోగించేవారు. 130 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ డోలియా తూర్పు గోదావరి జిల్లా రాయవరంలోని వెంకటేశ్వరస్వామి ఆలయం సెంటర్లోని మండువాలో నేటికీ చెక్కు చెదరకుండా సేవలందిస్తోంది. అందులో ఎనిమిది పదుల వయసు దాటిన సాలిగ్రామం నరసింహారావు, ఆయన భార్య అలివేలుమంగ ఉంటున్నారు. ఆ దంపతుల్ని ‘సాక్షి’ పలకరించింది. మండువా విశేషాలు, డోలియా ప్రత్యేకతలను అడిగి తెలుసుకుంది. తాతల కాలంలో నిర్మించారు అప్పట్లోనే ఎంఏ ఇంగ్లిష్ చదివిన ఇంటి యజమాని నరసింహారావు మాట్లాడుతూ.. ‘మండువా లోగిలిపై పడే ప్రతి నీటి బొట్టు వృథా కాకూడదన్న ఉద్దేశ్యంతో డోలియా పెట్టించారు. మా తాత నరసయ్య ఎంతో ఇష్టపడి కట్టించిన మండువాను, అందులోని డోలియాను కాపాడుకుంటూ వస్తున్నాం. అప్పట్లో ఇత్తడి లేదా రాగితో ఇలాంటివి ఏర్పాటు చేసేవారు. ఇంటి కప్పుపై కురిసే వర్షం నీరంతా డోలియా గొట్టం ద్వారా ఇంటి అడుగు భాగంలో నిర్మించిన రాతి ట్యాంక్‌లోకి చేరేది. అప్పట్లో ఇలా నిల్వ చేసిన నీటినే తాగేవాళ్లం. అలాగని అప్పుడు నీటి కొరత లేదు. అప్పట్లో వర్షం నీరంటే ఎలాంటి కాలుష్యం లేనిది. రాగి లేదా ఇత్తడి తొడుగు ద్వారా ఒడిసి పట్టడం వల్ల అందులో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే నశించేది. ఆ నీటిని తాగితే ఆరోగ్యం చేకూరుతుందని గట్టి నమ్మకం. డోలియా ద్వారా వచ్చిన నీరు ఇంటిల్లిపాదికీ వారం, పది రోజులు సరిపోయేది. అది అయిపోయాక చెరువు నీళ్లు తెచ్చుకునే వాళ్లం. వర్షం నీటిని ప్రకృతి వర ప్రసాదంగా భావించేవారు. నీటిని నిల్వ చేసుకునేందుకు, భూగర్భ జలాలను పెంచేందుకు, వినియోగం తరువాత మిగిలిన నీటిని డ్రెయిన్లలోకి పంపించేందుకు మండువా లోగిళ్లలో కనిపించే ప్రత్యేక ఏర్పాట్లు నాటి జీవన శైలికి సాక్ష్యాలు. ప్రతి లోగిలిలో 10 నుంచి 12 కుటుంబాలు నివసించేవి. మండువా చుట్టూ గదులు, వసారాలు, కొట్టు గదులు ఉండేవి. కొన్నింటిలో అయితే మేడలు (డూప్లెక్స్ ఇళ్లు) కూడా ఉండేవి. మా మనుమలు, ముని మనుమలు సెలవులకు వచ్చినప్పుడల్లా ఈ మండువాను, డోలియాను తీసేద్దామనేవారు. ఏది చేయాలన్నా నన్ను ఇంటి నుంచి బయటకు పంపేశాక చేసుకోండని గట్టిగా చెప్పడంతో దాని గురించి మాట్లాడటం మానేశారు’ అని వివరించారు. కాపాడాల్సిన బాధ్యత మాదే నరసింహారావు సతీమణి అలివేలు మంగ మాట్లాడుతూ.. ‘మా మావయ్య గారి తండ్రి 130 ఏళ్ల క్రితం ఎంతో ఇష్టపడి కట్టించిన ఇల్లు ఇది. డోలియాను ఇప్పుడు వాడటం లేదు కానీ.. ఒకప్పుడు చాలా ఉపయోగపడేది. అందుకే దీనిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. రెండు, మూడేళ్లకు ఒకసారి మెరుగు పెట్టించి కాపాడుకుంటున్నాం. పిడుగులు పడినప్పుడు డోలియా ఉండటం వల్ల ఇంట్లో వారెవరికీ ప్రమాదం ఉండదు’ అని చెప్పారు. మండువా అంటే.. మండువా లోగిలి అంటే.. పురాతనమైన సంప్రదాయక పెంకుటిల్లు. చుట్టూ నలువైపులా గదులుంటాయి. కనీసం 10 కుటుంబాలు నివాసం ఉండేలా.. పెద్ద విస్తీర్ణంలో దీర్ఘ చతురస్రాకారం లేదా చతురస్రాకారంలో నిర్మాణం ఉండేది. నాలుగు వైపులా ఒక దానిని ఆనుకుని మరొకటి చొప్పున 10 నుంచి 12 వాటాలు (పోర్షన్లు) ఉండేవి. ప్రతి వాటాలో వంట గది, విశ్రాంతి గది, పడక గది, పెరటి దొడ్డి ఉండేవి. ఒక్కొక్క పోర్షన్లో 8 నుంచి 10 గుమ్మాలను అమర్చేవారు. సింహద్వారం నుంచి పెరటి గుమ్మం వరకు వందకు పైగా గుమ్మాలు ఉండేవి. లోగిలి మధ్యలో కల్యాణ మండపం ఉండేది. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా రావడానికి ఇంటి మధ్య హాలు భాగంలో పైకప్పు లేకుండా నిర్మాణం చేసేవారు. వాన నీరు హాలులో మధ్యలో పడటానికి వీలుగా ఒక గుంట, ఆ గుంటలోంచి నీరు బయటకు పోవడానికి డ్రెయినేజీ పైపు ఉంటాయి. వర్షం వస్తున్నప్పుడు నీటి కోసం బయటకు వెళ్లే అవసరం లేకుండా ఇంట్లోని బిందెలు, పాత్రలలో నింపుకుని అవసరానికి ఉపయోగించుకునేవారు. మండువా చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఖాళీ సమయంలో ఈ మండువా లోగిలిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఉమ్మడి కుటుంబాల మమతల కోవెళ్లుగా మండువా లోగిళ్లు వెలుగొందేవి. అలనాటి నిర్మాణాలకు ప్రతీక కె.గంగవరం మండలం కూళ్ల గ్రామంలో చిట్టూరి వంశీయులు నిర్మించిన మండువా లోగిలి అలనాటి నిర్మాణాలకు ప్రతీకగా రాజసాన్ని చాటుతోంది. ఇక్కడ 1830లో చిట్టూరి గోపాలయ్య నిర్మించిన ఈ మండువా లోగిలో మూడు తరాల వారు నివాసం సాగించారు. గోదావరి ఏటుగట్టుని అనుకుని ఉన్న ఈ గ్రామం తరచూ గోదావరి వరద ముంపునకు గురయ్యేది. ఈ దృష్ట్యా ఏటిగట్టుకు కిలోమీటరు దూరంలో ముంపు బారిన పడకుండా రెండెకరాల విస్తీర్ణంలో 10 కుటుంబాలకు చెందిన 50 మంది ఉండేందుకు వీలుగా దీనిని నిర్మించారు. 189 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లోగిలిలో అన్ని సదుపాయాలను శాస్త్రానికి, వాస్తుకు అనుకూలంగా నిర్మించారు. ఇందులో 114 గుమ్మాలతో నిర్మించిన ప్రతి గది ఆధునిక హంగులను ప్రతింబిస్తుంటుంది. లోగిలి మధ్యలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపం విశేషంగా అకట్టుకుంటుంది. చిట్టూరి వంశంలో మూడో తరానికి చెందిన పార్థసారథి ఈ మండువాను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. అక్కడక్కడా ఇంకా ఉన్నాయ్ తూర్పు గోదావరి జిల్లాలోని కె.గంగవరం మండలం కూళ్ల, ఉప్పలగుప్తం, సన్నవిల్లి, భీమనపల్లి, నంగవరం, గోడి, కూనవరం, పోతుకుర్రు, లక్కవరం, తూర్పుపాలెం, బట్టేల్లంక, కేశనపల్లి, గుడిమెళ్లంక, మోరిపోడు, గుడిమూల, సఖినేటిపల్లి, వీరవల్లిపాలెం, టేకి, పామర్రు గ్రామాల్లో మండువా ఇళ్లు నేటికీ దర్శనమిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని మత్స్యపురి, శివదేవుని చిక్కాల, వీరవాసరం, మల్లవరం, పోడూరు, కుమారదేవం, ఇలపర్రు, బూరుగుపల్లి, చించినాడ, తణుకు, భీమవరం, ఉండి, ఆకివీడు తదితర ప్రాంతాల్లో మండువాలు, డోలియాలను భద్రంగా చూసుకుంటున్నారు. - చిట్టూరి పార్థసారథి -
ఆ పెట్రోల్ బంక్‌లో డీజిల్‌కు బదులు నీరు..!
సాక్షి, సాలూరు: పెట్రోల్ బంక్‌లో డీజిల్ కొట్టించుకోవాలని వెళ్లిన ప్రయాణికులకు వింత పరిస్థితి ఎదురైంది. డీజిల్‌కు బదులు వర్షపు నీరు రావడంతో వాహన చోదకులకు ఇక్కట్లు తప్పలేదు. వివరాల్లోకి వెళితే.. పాచిపెంట మండలంలోని శ్యామలగౌరీపురం సమీపంలో జాతీయ రహదారికి పక్కనున్న ఓ బంక్‌లో డీజిల్‌కు బదులు వర్షపు నీరు వచ్చింది. శనివారం ఉదయం ఐదు గంటల సమయంలో ఓ కారు యజమాని బంక్‌కు వెళ్లి డీజిల్ కొట్టమని సిబ్బందిని కోరాడు. దీంతో సిబ్బంది కారు ట్యాంక్ ఓపెన్ చేసి డీజిల్ కొట్టారు. అయితే ఆ కారు కొంతదూరం వెళ్లాక ఆగిపోయింది. పరిశీలించి చూడగా.. ట్యాంక్‌లో డీజిల్‌కు బదులు వర్షపు నీరు ఉండడంతో కారు ఓనర్ అవాక్కయ్యాడు. వెంటనే ఓ ఆటో సహాయంతో కారును బంక్‌కు తీసుకువచ్చి సిబ్బందిని నిలదీశాడు. అయితే అప్పటికే కొంతమంది వాహనదారులు డీజిల్‌కు బదులు వర్షపునీరు కొట్టిన విషయం గుర్తించి సిబ్బందితో గొడవపడుతున్నారు. వాహనాలు ఆగిపోవడంతో కొంతమంది మెకానిక్‌లను సంప్రదించగా.. మరికొంతమంది వాహనాలను ఆయా షోరూమ్‌లకు తీసుకెళ్లారు. ఇదిలాఉంటే కంపెనీ వారు పదిహేను సంవత్సరాల కిందట పైపులు వేశారని.. అవి పాడవ్వడం వల్ల వర్షపునీరు కలిసిపోయి ఉంటుందని బంకు యజమాని సాధనాల గోపాల్ అన్నారు. ఈ విషయమై కంపెనీ వారికి సమాచారం ఇచ్చామని తెలిపారు. ఆటోకు తాడు కట్టి కారును తీసుకువస్తున్న దృశ్యం కొత్త వాహనం ఆగింది.. పదిహేను రోజుల కిందటే కారు కొన్నాను. అత్యవసరమైన పని మీద ఒడిశా వెళ్తూ బంక్‌లో ఆయిల్ కొట్టించాను. అయితే డీజిల్‌కు బదులు వర్షపునీరు రావడంతో వాహనం ఆగిపోయింది. వెంటనే ఆటో సహాయంతో కారును బంక్‌కు తీసుకువచ్చాను. కారు మరమ్మతులకు అయిన ఖర్చు ఇస్తామని బంకు యజమాని ఒప్పుకున్నారు. ఆటోలు, ద్విచక్ర వాహనాలు కూడా ఆగిపోవడంతో ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. – యమరాపు ముత్యాలునాయుడు, కవిరిపల్లి, మక్కువ మండలం -
కృష్ణానదిలోకి పోటెత్తుతోన్న వరద నీరు
-
ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరద ఉధృతి
-
ఇళ్లల్లోకి వర్షపు నీరు
-
హైకోర్టు భవనంలోకి వర్షపు నీరు
సాక్షి, అమరావతి బ్యూరో: రాజధాని అమరావతిలో నిర్మితమైన భవనాల్లో నాణ్యత లోపం మరోసారి బట్టబయలైంది. బుధవారం కురిసిన వర్షానికి తుళ్లూరు మండలం నేలపాడు వద్ద నిర్మించిన తాత్కాలిక హైకోర్టు భవనం గోడల్లోంచి నీరు కారింది. సుమారు రూ.150 కోట్లతో షేర్వాల్ టెక్నాలజీతో నిర్మించిన భవనం చిన్నపాటి వర్షానికే కారిపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుమారు నాలుగెకరాల విస్తీర్ణంలో గత టీడీపీ ప్రభుత్వం తాత్కాలిక హైకోర్టు (జ్యుడీషియల్ కాంప్లెక్స్) నిర్మాణాన్ని జీ+2 విధానంలో నిర్మించింది. తాజాగా కురిసిన వర్షానికి గ్రౌండ్ ఫ్లోర్‌లోకి నీరు చేరింది. మొదట రూ.98 కోట్ల అంచనాలతో టెండర్లు పిలిచిన అధికారులు ఆ తర్వాత మౌలిక సదుపాయాల కల్పన పేరుతో మరో రూ.56 కోట్లతో మళ్లీ టెండర్లు పిలిచారు. ఇంటీరియర్, ప్రధాన భవనాలకు లిఫ్టులు, మౌలిక వసతులు, ప్రహరీ, ప్రవేశ మార్గాలు, అంతర్గత రోడ్లు, పార్కింగ్, మురుగునీటి పారుదల వ్యవస్థ.. తదితర వాటి కోసమని ఈ మొత్తాన్ని వినియోగించారు. హైకోర్టు నిర్మాణంలో ప్రమాణాలకు పాతరేశారు. అలాగే తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయ భవనాల నిర్మాణాల వ్యయాన్నీపెంచి..టీడీపీ నాయకులు దోచుకున్నారనే విమర్శలున్నాయి. గతంలోనూ ఇవే ఘటనలు ఈ ఏడాది మార్చిలో హైకోర్టు వద్ద జనరేటర్ రూమ్ కోసం ఆరుగదులు నిర్మిస్తుండగా అందులో రెండు గదులకు వేసిన శ్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో నలుగురు కూలీలు గాయపడ్డారు. అలాగే 2017లో కురిసిన వర్షాలకు అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చాంబర్ తడిసిముద్దయింది. గతేడాది కురిసిన వర్షాలకు సచివాలయంలో మాజీ మంత్రులు అమర్నాథ్రెడ్డి, దేవినేని ఉమ చాంబర్లలో వర్షం నీరు కారింది. షేర్వాల్, ప్రీ కాస్టింగ్ టెక్నాలజీతో రాజధానిలో భవనాలు నిర్మించామని ఆర్భాటంగా చెప్పుకొని మురిసి పోయిన టీడీపీ నాయకులు.. నాణ్యతలో డొల్లతనంపై మాత్రం మిన్నకుండిపోతున్నారు. రాజధానిలో జరిగిన నిర్మాణాలపై, వాటికి చేసిన వ్యయంపై, నాణ్యత ప్రమాణాలపై విచారణ చేయించాలని రాజధాని వాసులు డిమాండ్ చేస్తున్నారు. -
నిన్న ఏపీ సచివాలయం.. నేడు హైకోర్టు
సాక్షి, అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆవర్తనంతో రాష్ట్రంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో అమరావతిలోనూ బుధవారం భారీ వర్షం కురుస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చంద్రబాబు నిర్మించిన వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అమరావతి అతలాకుతలం అయిపోతోంది. చదరపు అడుగుకి ఏకంగా రూ. 11 వేలు వెచ్చించి నిర్మించిన అమరావతిలోని టెంపరెరీ భవనాలు.. వర్షపు నీటితో నిండిపోయాయి. వర్షపు నీరు నిన్న, ఈరోజు ఏకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లాబీల్లోకి రావటంతో.. కూలర్లు అన్నీ బయట పడేసి.. సిబ్బంది నీటిని ఎత్తిపోస్తున్నారు. గతంలో ఇదే పరిస్థితి తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయంలో కనిపించింది. ఈ విడత హైకోర్టు వంతు వచ్చింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ సచివాలయం తరహాలోనే హైకోర్టు భవనంలోని పలు ఛాంబర్లలో సీలింగ్ నుంచి వర్షపు నీరు లీకైంది. దీంతో హైకోర్టు ఆవరణలోకి వచ్చిన వర్షపు నీటిని అక్కడ సిబ్బంది తోడి బయటపోశారు. జలమయం అయిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫోటోలు గతంలో కూడా ఏపీ సచివాలయంలోని మంత్రుల ఛాంబర్లలోకి నీరు చేరిన విషయం తెలిసిందే. భారీ వర్షాలకు మంత్రులు ఛాంబర్‌ల్లో సీలింగ్ ఊడిపడి, ఏసీల్లోకి వర్షపు నీరు వచ్చింది. తాజాగా వర్షపు నీటితో.. హైకోర్టు భవన నిర్మాణం చేపట్టిన కంపెనీ డొల్లతనం మరోసారి బయటపడినట్లు అయింది. కూలర్లు అన్నీ బయట పడేసి నీటిని తోడుతున్న సిబ్బంది.. -
తడిసి ముద్దయిన బెజవాడ
సాక్షి, విజయవాడ: అరగంట పాటు ఆగకుండా కురిసిన వర్షానికి విజయవాడ తడిసి ముద్దయింది .ప్రధాన రహదారులు జలమయమయ్యాయి .చిన్నపాటి చెరువులను తలపించాయి. కొద్దిపాటి వర్షానికే నగరంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రహదారులు జలమయం కాగా, ప్రధాన కూడళ్లు చెరువులను తలపించాయి. డ్రైనేజీ వాటర్‌తో కలిసి వర్షపు నీరు రోడ్లపైకి వచ్చేయటంతో వాహన చోదకులు ,పాదచారులు నానా అవస్థలు పడ్డారు. సైలెన్సర్లు నీట మునగటంతో ద్విచక్ర వాహనాలు ముందుకు కదిలేందుకు మొరాయించాయి. ఇక డ్రైనేజ్ నీళ్లు, వర్షం నీటితో కలిపి రోడ్లపైకి వచ్చేయడంతో దుర్గంధం వెలువడుతోంది. దీంతో పాదచారులు ఇబ్బందులు పడ్డారు. కృష్ణా, గుంటూరులో భారీ వర్షం ఇక కృష్ణాజిల్లా గన్నవరం, నందిగామలో భారీ వర్షం పడింది. రోడ్లన్నీ జలమయం కావడంతో డ్రైనేజ్‌లు పొంగి పొర్లుతున్నాయి. వర్షపు నీటితో పల్లపు ప్రాంతాలో చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. అలాగే గుంటూరు జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది. రహదారులు అన్ని జలమయం అయ్యాయి. -
పెట్రోల్‌ట్యాంక్‌లలో వర్షపు నీరు..
మూడు రోజుల క్రితం హయత్‌నగర్ లోని హయత్ ఫిల్లింగ్ స్టేషన్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ లో నీళ్లు కలిసిన డీజిల్ పోయడంతో దాదాపుఇరవై వాహనాలు ముందుకు వెళ్లకుండా మొరాయించడంతో వాహనదారులు బంకు వద్ద ఆందోళనకు దిగారు. సరిగ్గా నెల రోజుల క్రితం కూడా ఇదే బంకు వద్ద నీళ్లతో కూడిన పెట్రోలు వచ్చిందని వాహనదారులు ఆందోళనకు చేపట్టడంతో పౌరసరఫరాల శాఖాధికారులు మాత్రం శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించి చేతులు దులుపుకున్నారు. సాక్షి,సిటీబ్యూరో: నగరంలో పెట్రోల్ బంకుల తీరు మారడం లేదన్నదనేందుకు ఇదీ నిదర్శనం. కాసుల ధ్యాస తప్ప నాణ్యమైన పెట్రోల్, డీజిల్ వాహనదారులకు అందించాలన్న ప్రయత్నం మాత్రం కానరావడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోల్ బంకుల నిర్వహణలో నిర్లక్ష్యం, చేతివాటం వాహనదారులను నిలువు దోపిడీకి గురిచేస్తోంది. ఆయిల్ కంపెనీల నుంచి ఇథనాల్‌తో కూడిన పెట్రోల్ సరఫరా నిల్వలను దెబ్బతీస్తోంది. ఇథనాల్ మిలితమైన పెట్రోల్ నిల్వల్లో పొరపాటున కూడా నీళ్లు కలిస్తే క్రమంగా పెట్రోల్ నీరు మారుతోంది. చమురు సంస్థలు అధికారికంగానే ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాం కింద పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ను కలుపుతున్నట్లు కంపెనీల ఇన్వాయిస్లు స్పష్టం చేస్తున్నాయి. ఇథనాల్‌ను ఇంధనంతో కలపడం వల్ల పెట్రోల్‌లోని ఆక్టేన్ సంఖ్య పెరుగుతుంది. దీంతో ధర కూడా తగ్గించాల్సి ఉంటుంది. అయితే చమురుసంస్ధలు వీటిని పట్టించుకోకుండా పెట్రోల్‌లో సుమారు పదిశాతం ఇథనాల్ కలిపి సరఫరా చేయడం విస్మయానికి గురిచేస్తోంది. వర్షకాలం నేపథ్యంలో ట్యాంకుల్లో కొద్ది పాటి నీరు చేరినప్పటికీ నిల్వలు క్రమంగా నీళ్లుగా మారుతున్నాయి. బంకుల నిర్వాహకులు అడుగు నిల్వల సైతం పంపింగ్ చేస్తుండటంతో వాహనాలు మెకానిక్ షెడ్లకు చేరుతున్నాయి.దీంతో వాహనదారుల ఆందోళనకు దిగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం మొక్కుబడిగా కేసులు నమోదు చేసి మ..మ అనిపిస్తున్నారు. మెకానిక్ షెడ్డుకే.... మహానగరంలో నిత్యం వాహనాలు మెకానిక్ షెడ్లవైపు పరుగులు తీస్తున్నాయి. నీళ్లతో కూడిన పెట్రోల్, డీజిల్ వినియోగంతో వాహానాలు కుప్పగా మారుతున్నాయి. స్టార్ట్ కాకపోవడం, మధ్యలో ఆగిపోవడం తదితర సమస్యలు ఎదురవుతున్నాయి. ఫలితంగా ఇంజిన్‌పై ప్రభావం పడుతోంది. వాహనంలోని బోరు పిస్టన్ పనికిరాకుండా పోయి త్వరగా మార్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. నాలుగుచక్రాల వాహానాలకు మరింత ట్రబుల్స్ తప్పడం లేదు. శాంపిల్స్‌కే పరిమితం పౌరసరఫరాల అధికారులు పెట్రోల్ బంక్‌లలో శాంపిల్స్ సేకరించేందుకు పరిమితమవుతున్నారనే ఆరోపనలు వ్యక్తమవుతున్నాయి. పౌరసరఫరాల శాఖ పెట్రోల్‌పై ఎప్పటికప్పుడు శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపి పరీక్షించాలి. అధికారులు వద్ద కూడా పరీక్షలు నిర్వహించేందుకు పరికరాలు అందుబాటులో ఉండాలి. అయితే అవీ అందుబాటులో ఉన్నా ఉపయోగించిన దాఖలాలు లేవు. పౌరసరఫరాల శాఖ తనిఖీలు నిర్వహించి రెడ్‌హిల్స్‌లోని ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ పరీక్షకు పంపించిన శాంపిల్స్ వేళ్లపై లెక్కపెట్టవచ్చు. నీళ్ల ఇంధనంపై విచారణ నీటితో కూడిన పెట్రోల్, డీజిల్ పంపింగ్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. వర్షపు నీళ్లు ట్యాంకులో చేరి అడుగున నిల్వ ఉంటుంది. దానిని గుర్తించకుండా వాహనాల్లో పంపింగ్ చేయడం తగదు. ఇథనాల్ కారణంగా పెట్రోల్ నీటిగా మారుతుందని డీలర్లు పేర్కొంటున్నారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపిస్తున్నాం. రాథోడ్, డీఎస్వో, రంగారెడ్డి -
ఒడిసి పడదాం.. దాచి పెడదాం
ఘట్కేసర్: విపరీతంగా జనాభా పెరగడంతో హైదరాబాద్ మహానగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. నగరం చుట్టూ ఉన్న మేడ్చల్, రంగారెడ్డిలో కనిపించే పచ్చని పంట పొలాలు నేడు ప్లాట్లుగా మారి వేలాది కాలనీలు వెలిశాయి. చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురయ్యాయి. కాలనీల ఏర్పాటుతో నీటి వనరులకు ఎక్కడికక్కడే అడ్డకట్ట వేయడంతో వర్షాలు కురిసినా నీరు భూమిలోకి ఇంకకుండా రోడ్డుపై చేరి కాలనీలు మునిగిపోతున్నాయి. సెల్లార్లో కారు ఆపి నిద్రపోయిన ఓ డ్రైవర్ కారులోకి వర్షం నీరు చేరి మృతి చెందిన ఘటన నగరంలో జరిగినా అధికారులు, ప్రజల్లో చలనం రావడం లేదు. అభివృద్ధి పేరుతో సీసీ రోడ్లు నిర్మించడంతో కాంక్రీట్ జంగిల్లా మారి వర్షం నీరు ఇంకే అవకాశం లేక మూసీలో కలుస్తున్నాయి. ప్రభుత్వం ఇంకుడు గుంతలపై ప్రచారం చేసినా ప్రజల్లో అవగాహన లేక ఎవరూ ముందుకు రావడం లేదు. నీటి బొట్టును వృథా చేయకూడదని ఘట్కేసర్ మండలం వీబీఐటీ కళాశాల ఇంజినీరింగ్ పూర్తి చేసిన తోట రాజు, రవి, దివాకర్, హెచ్ఓడీ కృష్ణారావు సహకారంతో ముందడుగు వేశారు. వరద ముప్పు రాకుండా భూగర్భ జలాలను పెంచేందుకు నడుం బిగించారు. ‘రిసెప్టివ్ పేవర్స్’ పేరు తో ప్రాజెక్టును తయారు చేసి ఏడాది పాటు కళాశాలలో ప్రయోగించగా మంచి ఫలితం కనిపించడంతో పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వరద ముçప్పును తప్పించే యత్నం.. నగరంలో వరద తీవ్రత తగ్గించి భూగర్భ జలాలను పెంచేందుకు విద్యార్థులు ఈ ప్రాజెక్టును రూపొందించారు. కళాశాలలో 1,400 చదరపు అడుగుల విïస్తీర్ణంలో రూ.1.4 లక్షలతో రిసెప్టివ్ పేవర్‌ను నిర్మించారు. దీనిపై వరద నీటిని పంపించడంతో లోపలికి గుంజుకోవడంతో భూగర్భ జలాలు పెరిగినట్లు గుర్తించారు. ఈ విధానంతో నగరంలో వరద ముప్పును తíప్పించ వచ్చని చెబుతున్నారు. వృథాగా వదలకూడదని.. ఇళ్లల్లో ఇంకుడు గుంతలు నిర్మిస్తే çస్థలం వృథా అవుతుందని చాలామంది ఆసక్తి చూపడం లేదు. ఇంటి స్థలం పోను పార్కింగ్, ఖాళీ స్థలంలో టైల్స్‌కు బదులు ఈ ప్రాజెక్టును అమలు చేస్తే ఎటువంటి సమస్య తలెత్తకుండా వర్షాకాలంలో భూమి చిత్తడిగా మారదు. రోడ్డుపైకి వచ్చిన నీటి ని పేవర్స్ (టైల్స్) పీల్చుకొని కిందున్న కంకరలోకి పంపిస్తాయి. అక్కడి నుంచి భూమిలోకి వెళ తాయి. దీంతో వరదలు రావు. కానీ ఆ ప్రదేశంలో భారీ వాహనాలు కాకుండా కార్లు, ద్విచక్ర వాహనాలు, లైట్ వెహికిల్స్‌ను మాత్రమే నడపాలి. నిర్మాణ విధానం ఇలా.. ప్రాజెక్టును నిర్మించదల్చుకున్న ప్రాంతంలో రెండు ఫీట్ల లోతు æగుంతను తవ్వి ఫీటు మేర 40 ఎంఎం కంకర, తర్వాత అర ఫీటు మేర 20 ఎంఎం కంకర పరచాలి. కంకరపై గోనె సంచులు గాని, జియో టెక్స్ టైల్స్ లేయర్‌ను గాని వేసి మూడు ఇంచుల మేర ఇసుక పోయాలి. అనంతరం ఇసుకపై పేవర్స్ (టైల్స్)ను పార్కింగ్, వాకింగ్ చేసే స్థ«లాల్లో సిమెంట్‌ను వినియోగించకుండా బిగించాలి. ఒకసారి నిర్మిస్తే ఏళ్ల పాటు సేవలందించే ఒక్కో టైల్కు రూ. 480 వ్యయం కాగా చదరపు అడుగుకు మూడు అవసరం అవుతాయి. చుక్క నీరు వృథా కాకుండా లోపలికి వెళతాయి. దీంతో ఎంత వరద వచ్చినా ముప్పు వాటిల్లకుండా నీరంతా భూమిలో ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయి. ఎక్కడ అనుకూలం.... రోడ్లకు ఇరువైపులా, ఫుట్‌పాత్‌లు, పార్కులు, గార్డెన్స్, కాలినడక బాటలో, రైల్వేస్టేషన్స్, బస్‌స్టేషన్స్, పార్కింగ్, వాకింగ్ ట్రాక్‌లు తదితరుల ప్రాంతాల్లో వీటిని ఉపయోగించవచ్చు. -
64% వర్షాన్ని పీల్చుకుంటున్న భూమి!
ఎక్కువ వర్షం పడినప్పుడు సాధారణంగా ఎక్కువ నీరు చెరువులు, నీటి ప్రాజెక్టుల్లోకి చేరటం రివాజు. కానీ, ఇటీవల కాలంలో అలా జరగడం లేదని, పెరుగుతున్న భూతాపం వల్ల భూమాత దాహం అంతకంతకూ పెరిగిపోవడమే ఇందుకు మూలకారణమని ఒక అధ్యయనంలో తేలింది. కుండపోత వర్షం కురిసినప్పుడు కూడా గతంలో మాదిరిగా వాగులు, వంకలు, నదుల్లోకి వరద నీరు ఎక్కువగా చేరటం లేదని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ బృందం అధ్యయనంలో వెల్లడైంది. 160 దేశాల్లో 5,300 నదీ పరీవాహక ప్రాంతాల్లో పరిశీలన కేంద్రాలు, 43 వేల వర్షపాత నమోదు కేంద్రాల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషిస్తే ఇదే అర్థమవుతోందని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ప్రతినిధి శర్మ ఇటీవల వెల్లడించారు. మనం ఇప్పటి వరకు అనుకుంటున్న దానికన్నా భూదాహం ఎక్కువగా ఉందన్నారు. వంద వాన చుక్కలు నేల మీద పడితే అందులో నుంచి 36 చుక్కలు మాత్రమే సరస్సులు, నదులు, భూగర్భ జలాల్లో కలుస్తున్నాయి. మనుషులకు అందుబాటులో ఉండే (ఈ నీటినే సాంకేతిక పరిభాషలో ‘బ్లూ వాటర్’ అంటారు) ఇదే. మిగతా మూడింట రెండొంతుల వర్షపు నీరు కురిసినప్పుడే మట్టిలోకి ఇంకిపోతున్నాయని (ఈ నీటినే సాంకేతిక పరిభాషలో ‘గ్రీన్ వాటర్’ అంటారు) ఈ అధ్యయనంలో తేలింది.వాతావరణ మార్పుల వల్ల కుండపోత వర్షాల సంఖ్య పెరిగినా నదులు, రిజర్వాయర్లలోకి వరద నీరు గతంలో మాదిరిగా పోటెత్తకపోవడానికి నేల ఉష్ణోగ్రత గతంలో కన్నా పెరిగి, ఆవిరైపోయే నీటి శాతం పెరిగింది. అందువల్లే వర్షపు నీటిని భూమి ఎక్కువ మొత్తంలో తాగేస్తోంది. సాధారణ వర్షాలకు నీరు పారి తరచూ రిజర్వాయర్లలోకి నీరు చేరుతుంటేనే రిజర్వాయర్లలో నీరు ఉంటుంది. భారీ వర్షపాతం నమోదైన అరుదైన సందర్భాల్లో మాత్రమే నదులు, రిజర్వాయర్లలోకి నీరు వస్తున్నదని ఈ అధ్యయనం తేల్చి చెబుతోంది. అంటే, గతంలో కన్నా భూమి త్వరగా బెట్టకు వస్తున్న సంగతిని రైతులు గుర్తించాలి. కందకాల ద్వారా ఎక్కువ నీటిని భూమిలోకి ఇంకింపజేసుకుంటేనే పంటలు, ముఖ్యంగా ఉద్యాన తోటలు బాగుంటాయని గుర్తించమని ఈ అధ్యయనం చెబుతోంది. -
పాతాళం నుంచి పైపైకి..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూగర్భజలాలు పెరిగాయి. పాతాళం నుంచి పైపైకి వచ్చాయి. ఆగస్టులో కురిసిన వర్షాలు భూగర్భజలానికి ఊపిరులూదాయి. గడచిన రెండేళ్లుగా తీవ్ర వర్షాభావంతో పాతాళానికి పడిపోయిన భూగర్భజలాలు.. భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి పెరిగిన జల ప్రవాహాల కారణంగా పైపైకి వచ్చాయి. ఒక్క ఆగస్టులో కురిసిన వర్షాలతోనే రాష్ట్రవ్యాప్తంగా సగటున 0.39 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పెరిగింది. మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువుల్లో నీరు సమృద్ధిగా చేరడంతో వర్షపునీరు సంతృప్తికరంగా భూమిలోకి ఇంకిందని భూగర్భ జలవనరుల విభాగం పేర్కొంటోంది. రాష్ట్రంలో గడిచిన రెండేళ్ల కాలంలో అరకొర వానలే పడటంతో తెలంగాణవ్యాప్తంగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. అంతేకాకుండా భూగర్భజలాలు పూర్తిగా ఇంకిపోయి పాతాళానికి చేరుకున్నాయి. గత ఏడాది ఆగస్టులో నీటిమట్టం 10.13 మీటర్లకు పడిపోయింది. భూగర్భ నీటి వినియోగం పెరడగడంతో ఈ ఏడాది మే నాటికి అది ఏకంగా 12.78 మీటర్ల గరిష్టానికి చేరింది. మొత్తం 44,706 చెరువులకుగానూ 15,800 చెరువులు పూర్తిస్థాయిలో నిండాయి. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 200లకు పైగా చెరువులను నింపారు. జూరాల, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల ద్వారా చెరువులకు నీటిని విడుదల చేశారు. దీని వల్ల భూగర్భ జలమట్టం పెరిగింది. గత ఏడాది ఆగస్టులో రాష్ట్ర సరాసరి నీటిమట్టం 10.13 మీటర్లు ఉండగా అది ప్రస్తుతం 9.74 మీటర్లకు చేరింది. 0.39 మీటర్ల మేర భూగర్భజలం పెరగ్గా, ఈ ఏడాది మే నెలతో పోలిస్తే ఏకంగా 3.04 మీటర్ల మేర భూగర్భ జలాల నీటి మట్టం పెరిగింది. మేడ్చల్ జిల్లాలో గత ఏడాది ఆగస్టులో నీటి మట్టం 16.48 మీటర్ల లోతున మట్టం ఉండగా అది ప్రస్తుతం 12.71 మీటర్లుగా నమోదైంది. ఏకంగా 3.77 మీటర్ల మేర భూగర్భజలాలు మెరుగయ్యాయి. ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబాబాద్ జిల్లాల్లోనూ 3 మీటర్లకుపైగా భూగర్భమట్టం పెరిగింది. అయితే, మంచిర్యాల జిల్లాలో గత ఏడాది కంటే భిన్నంగా 3.80 మీటర్ల మేర నీటి మట్టం పడిపోగా, సిద్దిపేట, గద్వాల్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలోనూ భూగర్భమట్టాలు గత ఏడాది కంటే పడిపోయాయి. సరైన వర్షాలు లేని కారణంగా ఆయా జిల్లాల్లో భూగర్భ మట్టాల్లో పెరుగుదల లేదని భూగర్భ జల విభాగం వర్గాలు వెల్లడించాయి. -
ఎయిర్‌పోర్ట్‌లో జలపాతం.!
గువాహటి: అస్సాంలోని లోక్‌ప్రియ గోపినాథ్ బోర్డొలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం(గువాహటి ఎయిర్పోర్ట్) జలపాతాన్ని తలపించింది. సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఎయిర్పోర్ట్ పైకప్పు నుంచి వర్షపు నీరు ప్రయాణికుల లాంజ్‌లోకి చేరింది. ఏసీ, లైట్ల రంధ్రాల నుంచి కారుతున్న వర్షపు నీటితో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దాదాపు గంటపాటు ఇదే పరిస్థితి నెలకొంది. వర్షపు నీరు చేరడం వల్ల లగేజ్ స్ర్కీనింగ్ మెషీన్లు పాడయ్యాయని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. అంతకు మించి ఎటువంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్‌లోకి వర్షపు నీరు చేరడం వల్ల పలువురు ప్రయాణికుల లగేజ్ తడిసిపోయింది. చాలామంది ప్రయాణికులు తమ లగేజ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. గువాహటి ఎయిర్పోర్ట్ విస్తరణ పనుల్లో భాగంగా కొత్తగా నిర్మించిన ప్రయాణికుల లాంజ్‌లో ఇలాంటి పరిస్థితి చోటుచేసుకోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై తక్షణమే విచారణ చేపట్టాలని నెటిజన్లు పౌరవిమానాయాన శాఖ మంత్రి జశ్వంత్ సిన్హాతోపాటు ప్రధాని నరేంద్ర మోదీని కోరుతున్నారు. -
జలపాతాన్ని తలపించిన గువాహటి ఎయిర్పోర్ట్
-
అమరావతి అస్తవ్యస్ధం
-
మంత్రుల చాంబర్లలోకి మళ్లీ వాన!
సాక్షి, అమరావతి బ్యూరో/అమరావతి : అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో ప్రపంచం గర్వించే రీతిలో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించామని చెబుతున్న సీఎం చంద్రబాబు మాటల్లోని డొల్లతనం మరోసారి బట్టబయలైంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోని మంత్రుల బ్లాకులు చిల్లులు పడ్డ కుండల్లా కారాయి. సోమవారం పలువురు మంత్రుల బ్లాకుల్లో సీలింగ్ ఊడి పడడంతో వాన నీటికి ఫర్నీచర్ తడిసిపోయింది. తాత్కాలిక సచివాలయంలోని 4, 5వ బ్లాకుల్లో ఉన్న మంత్రులు గంటా శ్రీనివాసరావు, అమర్నాథ్రెడ్డి, దేవినేని ఉమ చాంబర్లలో సీలింగ్ ఊడిపడటంతోపాటు ఏసీల్లోకి వర్షపు నీరు చేరింది. సీలింగ్ నుంచి వర్షపు నీరు కారడంతో సిబ్బంది విధులకు ఆటంకం ఏర్పడింది. హౌస్ కీపింగ్ సిబ్బంది ఆగమేఘాల మీద పేషీల్లోని నీటిని తొలగించారు. అసెంబ్లీ భవనంలోనూ పలు చోట్ల సీలింగ్ ఊడిపోయి వర్షపు నీరు చేరుతోంది. వర్షం కురిస్తే కారడమే... అతి తక్కువ వ్యవధిలో అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మించి రికార్డు సృష్టించామని సీఎం చంద్రబాబు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తరచూ గొప్పలు చెబుతూ వస్తున్నారు. అయితే వర్షం పడిన ప్రతిసారీ సచివాలయంలోని బ్లాకులు ధారాళంగా లీకేజీ కావడం నిర్మాణాల్లోని డొల్లతనాన్ని రుజువు చేస్తోంది. రూ. వందల కోట్లతో చేపట్టిన తాత్కాలిక నిర్మాణాలు నీరుగారడంపై అధికారులు పెదవి విరుస్తున్నారు. గతేడాది కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నా నిర్మాణాలు చేపట్టిన సంస్థపై సర్కారు చర్యలు చేపట్టకుండా ప్రతిపక్షంపై ఎదురుదాడికి దిగడం గమనార్హం. గతేడాది ప్రతిపక్షనేత చాంబర్లోకి వాన నీళ్లు.. 2017 జూన్‌లో కురిసిన వర్షాలకు సచివాలయం నిర్మాణంలోని డొల్లతనం మొదటిసారిగా బయటపడింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి కేటాయించిన చాంబర్లోకి లీకేజీ వల్ల ధారాళంగా నీరు చేరింది. చాంబర్లో సీలింగ్ ఊడిపడడంతో ఫర్నీచర్, ఫైళ్లు తడిసిముద్దయ్యాయి. ఏసీ, రూఫ్ లైట్ల నుంచి వర్షపు నీరు కారడంతో సిబ్బంది బకెట్లతో తోడారు. ఈ ఘటన తర్వాత నిర్మాణాల్లో లోపాలపై సమగ్రంగా విచారిస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఆ విషయాన్ని గాలికొదిలేసింది. మొదటి నుంచి అనుమానాలే... తాత్కాలిక సచివాలయం పనులు ప్రారంభమైన నాటి నుంచి నిర్మాణంలో లోపాలపై నిపుణులు సందేహాలు వెలిబుచ్చుతూనే ఉన్నారు. నల్లరేగడి భూమిలో నిర్మాణాలు చేపట్టాలంటే పునాదులు పట్టిష్టంగా ఉండాలని గట్టిగా సూచించారు. ఎంత హెచ్చరించినా ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో వర్షం పడిన ప్రతిసారీ సచివాలయంలో ఏదో ఒక బ్లాక్ కారుతోంది. తాత్కాలిక సచివాలయం ఆవరణలో వర్షపు నీరు భారీగా నిల్వ ఉంటోంది. కమీషన్ల దాహంతోనే లీకులు... సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి ఒక్కో చదరపు అడుగుకు తొలుత రూ. మూడు వేలుగా నిర్ణయించిన ప్రభుత్వం తర్వాత వివిధ కారణాలు చూపిస్తూ ఈ మొత్తాన్ని నాలుగు రెట్లకు పెంచింది. చదరపు అడుగుకు రూ.10 వేలకు పైగా ఖర్చుతో చేపట్టిన భవనాలు చిన్న వర్షానికే కారుతుండడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెన్నై, కేరళలలో మాదిరిగా కుండపోత వర్షం పడితే తాత్కాలిక సచివాలయం భవనాల పరిస్థితిని తలుచుకుంటేనే భయమేస్తోందని రాజధాని ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమీషన్ల కోసం నిర్మాణ వ్యయాన్ని ప్రభుత్వం భారీగా పెంచినట్లు చేస్తున్న ఆరోపణలకు ప్రస్తుత సంఘటనలు బలం చేకూరుస్తున్నాయి. నాణ్యత ప్రమాణాలు ఏ మాత్రం పాటించకుండా, ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టడంతో తరచూ చాంబర్లు కారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. -
ఏపీ సెక్రటేరియట్ భవనానికి చిల్లులు
-
చదువుకావాలంటే... ఇలా వెళ్లాలి మరి!
కురుపాం విజయనగరం : ఇక్కడ నీటిలో వెళ్తున్న వీరంతా చదువుకోసం ఎంత కష్టపడుతున్నారో చూడండి. కురుపాం మండలం గొటివాడ పంచాయతీ బోరి గిరిజన గ్రామానికి చెందిన 15మంది వరకు గిరిజన చిన్నారులు ప్రాధమిక విద్యనభ్యసించేందుకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న గొటివాడ మండల పరిషత్ పాఠశాలకు కాలినడకన వెళుతుంటారు. మామూలు రోజుల్లోనైతే ఫర్వాలేదు గానీ... వర్షాకాలం వస్తే మాత్రం ఇదిగో ఇలా దారిలోని వట్టిగెడ్డ వాగు దాటాలి. సోమవారం వారు పాఠశాలకు వెళ్తుండగా వట్టిగెడ్డలోకి నీరు చేరడంతో ఇలా ఒకరి చేయి ఒకరు పట్టుకొని గెడ్డను దాటే ప్రయత్నం చేస్తున్నారు. పొరపాటున జరగరానిదేమైనా జరిగితే ఆ కన్నవారి కడుపుకోత తీర్చేదెవరు? నష్టం జరిగాక పరిహారం ఇచ్చి చేతులు దులుపుకునే అలవాటున్న సర్కారుకు ఇక్కడ ఓ కాజ్వే నిర్మించాలన్న ఆలోచన రాకపోవడమే దురదృష్టకరం. -
తక్కువ ఖర్చు.. వెంటనే నీటి భద్రత!
మెట్ట భూముల్లో ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో.. మీటరు లోతు మీటరు వెడల్పున.. కందకాలు తవ్వుకోవడం వల్ల.. అతి తక్కువ ఖర్చు (ఎకరానికి రూ. 2–3 వేల)తో తవ్విన కొద్ది నెలల్లోనే సాగు నీటి భద్రత సాధించవచ్చని నల్లగొండ మండలం గుళ్లపల్లి గ్రామానికి చెందిన రైతు, విశ్రాంత ప్రిన్సిపల్ పాలవరపు భగవంతరెడ్డి అనుభవపూర్వకంగా చెబుతున్నారు. రైతుల సంక్షేమం కోసం భారీగా ఖర్చు పెడుతున్న ప్రభుత్వాలు చిన్న రైతుల మెట్ట భూముల్లో కందకాలు తవ్విస్తే ఎంతో మేలు జరుగుతుందని ఆయన సూచిస్తున్నారు. నల్లగొండకు 5 కి.మీ. దూరంలోని తమ 13 ఎకరాల ఎర్ర భూమిలో తవ్విన రెండు బోర్లకు నీటి లభ్యత తక్కువగా ఉండటంతో తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంగెం చంద్రమౌళి(98495 66009), మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి(99638 19074)లను 2016 జూన్‌లో భగవంతరెడ్డి సంప్రదించారు. వారు స్వయంగా పొలానికి వచ్చి వాలుకు అడ్డంగా కందకాలు తవ్వించారు. 13 ఎకరాలకు కలిపి రూ. 30 వేలకన్నా తక్కువే ఖర్చయింది. 2016 వర్షాకాలంలో కందకాలు 4,5 సార్లు నిండాయి. కందకాలు తవ్విన 3,4 నెలల్లోనే భూగర్భ జలమట్టం బాగా పెరిగిందని భగవంతరెడ్డి తెలిపారు. 2017 వర్షాకాలంలో కూడా కందకాలు 2,3 సార్లు నిండాయి. దీంతో ఎండాకాలం కూడా నీరు పుష్కలంగా ఉండటంతో నిశ్చింతగా కూరగాయ తోటలను సాగు చేస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పక్కన పొలంలో వరి సాగు చేస్తున్న రైతుల బోర్లలో నీరు రాక పొలం ఎండిపోయే పరిస్థితి వచ్చింది. రెండు నెలల పాటు తమ బోర్ల నుంచే నీటిని ఉచితంగా ఇచ్చామని, ఆ రైతుకు మంచి దిగుబడి రావడం తమకూ సంతోషాన్నిచ్చిందని వివరించారు. ఈ ఏడాది తమ ఇరుగు పొరుగు రైతుల బోర్లలో కూడా నీటి లభ్యత పెరిగిందని ఆయన సంతోషంగా చెప్పారు. ఇది తమ పొలంలో తవ్విన కందకాల వల్ల భూగర్భంలోకి ఇంకిన వర్షపు నీటి వల్లనే సాధ్యపడిందన్నది నూటికి నూరు శాతం వాస్తవమన్నారు. అయితే, రైతులకు కందకాలతో వర్షపు నీటి సంరక్షణపై అవగాహన లోపించిందని, చిన్న రైతుల భూముల్లో ప్రభుత్వమే కందకాలు తవ్వించడం చాలా అవసరమని భగవంతరెడ్డి(94404 05082) సూచిస్తున్నారు. భగవంతరెడ్డి -
వాననీటిలో సీతమ్మ విగ్రహం
పర్ణశాల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల రామాలయం ఆవరణలోని ఉన్న కుటీరంలో సీతమ్మ వారి విగ్రహం చుట్టూ వర్షపునీరు చేరింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆనాటి రామాయణ వనవాస దృశ్యాలతో ఏర్పాటు చేసిన విగ్రహాల చుట్టూ వర్షపు నీరు చేరడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అక్కడ ఉన్న డ్రెయిన్లలో కూడా మురుగు పేరుకుపోయిందని, దీని వల్లే నీరంతా ఇలా విగ్రహాల చుట్టూ వచ్చి చేరుతోందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
వాన నీటిలో నారసింహుడు
యాదగిరికొండ(ఆలేరు) : రూపుదిద్దుకుంటున్న యాదాద్రి ప్రధానాలయంలోని స్వయంభు గర్భాలయం ముం దున్న ముఖమండపం బుధవారం రాత్రి కురిసిన వాననీటితో పూర్తిగా నిండిపోయింది. స్వయంభుమూర్తుల వద్దకు సైతం నీళ్లు వెళ్లాయని పనిచేసే కూలీలు పేర్కొన్నారు. ఇది చాలా అపచారమని, మనం కాళ్లతో తొక్కిన నీరు స్వామి వారిని తాకితే మంచిది కాదని కొందరు అర్చకులు తెలిపారు. ఆ నీటిలోనే నిలబడి ఆరగింపు, ఆరాధన, అభిషేకం కానిస్తున్నారు. కనీసం ఆలయ అర్చకులైనా ఈ విధానం సరైంది కాదని అధికారులకు చెప్పడం లేదు. స్వయంభుమూర్తుల వద్ద నీటిలోనే నిత్యకైంకర్యాలు మమ అనిపిస్తున్నారు. నిర్మాణానికి ముందే ఈ విధంగా వాన నీరు వస్తే ఏ చర్యలు తీసుకోవాలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు అంటున్నారు. ప్రస్తుతానికి మోటార్లతో నీటిని తోడేస్తున్నారు. ప్రతి నిర్మాణానికి డ్రెయినేజీ ముఖ్యమైంది. కానీ ఇంత పెద్ద నిర్మాణం చేపట్టిన అధికారులు వర్షపు నీరు వెళ్లే మార్గం ఆలోచించలేక పోయారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఆర్కిటెక్టు ఆనందసాయి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావులు మట్లాడుతూ కొండపూర్తిగా రాయితో నిండి ఉంద,ని రాయిని పగలకొట్టడం జరగలేదని తెలిపారు. కానీ భవిష్యత్‌లో డ్రెయినేజీ బయటకు కనిపించకుండా చేసి ఎవరూ ఊహించని రీతిలో నిర్మించనున్నట్టు చెప్పారు. -
తటాకాలను తలపిస్తున్న సొరంగ నిర్మాణ ప్రాంతాలు
పెద్దదోర్నాల: మండల పరిధి కొత్తూరు వద్ద జరుగుతున్న వెలుగొండ ప్రాజెక్టు సొరంగ పనులకు సంబంధించి రెండో సొరంగ నిర్మాణ ప్రాంతంలో భారీ ఎత్తున నీరు చేరడంతో ఆ ప్రాంతం తటాకాన్ని తలిపిస్తోంది. ఇటీవల కురిసిన వర్షంతో పాటు సొరంగ మార్గం ద్వారా వచ్చే ఊట నీరు భారీగా చేరడంతో ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద ఈ పరిస్థితి నెలకొంది. సాధారణంగా సొరంగ మార్గాల నుంచి వచ్చే ఊట నీటిని పనులు జరిగే ప్రాంతం నుంచి బయటకు తరలించేందుకు ప్రత్యేకంగా పంపింగ్ వ్యవస్థను రూపొందించారు. ప్రాజెక్టుకు సంబంధించిన విద్యుత్ బకాయిలు భారీగా పేరుకు పోయాయన్న కారణంతో విధ్యుత్ శాఖాధికారులు గత నెల 24వ తేదీన ప్రాజెక్టుకు సంబంధించిన విద్యుత్ సరఫరాను నిలిపేశారు. గుత్తేదారులు గత్యంతరం లేని పరిస్థితుల్లో జనరేటర్ల ద్వారా విద్యుత్ సరఫరా చేసి మోటార్లతో నీరు తోడే కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, నిర్వహణలో అధిక ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంతో జనరేటర్లను రెండు విడతలుగా వినియోగించి నీరు తోడే పనులు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో జనరేటర్లను పొదుపుగా వినియోగిస్తుండటంతో సొరంగ నిర్మాణ ప్రాంతంలో తరుచూ నీరు నిలబడి మడుగును తలపిస్తోంది. -
కందకాలతో తోట పచ్చన
పుస్కూరు రఘుకుమార్, పీతా రవివర్మ అనే ఇద్దరు మిత్రులు రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం వెంకిర్యాల, ఆగిర్యాల గ్రామాల పరిధిలో 50 ఎకరాలలో మామిడి తోటను పదేళ్లుగా సాగు చేస్తున్నారు. వర్షాలు అంతంతమాత్రంగా కురవడం, కురిసిన వర్షం కూడా భూగర్భంలోకి ఇంకే మార్గం లేకపోవడం వల్ల భూగర్భ జలమట్టం మరీ తగ్గిపోయింది. దీంతో తోటలో 5 బోర్లు ఉన్నప్పటికీ ఏ బోరూ సరిగ్గా నీరు పోయకపోవడం సమస్యగా మారింది. పదేళ్ల తోటను కాపాడుకోవడానికి వాన నీటిని సమర్థవంతంగా సంరక్షించుకోవడమే ఉత్తమ పరిష్కార మార్గమని భావించిన రఘు, రవి.. గత ఏడాది తొలుత ఫాం పాండ్ తవ్వించుకున్నారు. ఆ క్రమంలోనే పొలంలో కందకాలు తవ్వడం మంచిదని తెలుసుకొని.. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం పెద్దలను సంప్రదించారు. వీరి కోరిక మేరకు సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గోలి దామోదర్‌రెడ్డి గత ఏడాది మే నెలలో స్వయంగా వచ్చి తోటలో భూమి స్థితిగతులను పరిశీలించి, వాలుకు అడ్డంగా మీటరు లోతున, మీటరు వెడల్పున, 20 మీటర్ల పొడవున కందకాలు తవ్వించారు. అదే వరుసలో 5 మీటర్లు ఖాళీ వదిలి మరో 20 మీటర్ల చొప్పున కందకాలు తవ్వించామని రవివర్మ తెలిపారు. కందకాలు తవ్విన తర్వాత కురిసిన వర్షాలకు రెండు సార్లు కందకాలు నీటితో నిండాయి. వర్షపు నీరంతా బయటకు కొట్టుకుపోకుండా పూర్తిగా భూమి లోపలికి ఇంకింది. ఈ కందకాల పుణ్యానే తమ మామిడి తోట పెరుగుదల, కాపు ఈ ఏడాది బాగుందని.. ఇంత మండు వేసవిలో కూడా పచ్చగా ఉందని రవివర్మ సంతృప్తిగా చెప్పారు. ఆ ప్రాంతంలో ఇతర తోటల్లో బోర్లు ఈ ఏడాది ఆగి ఆగి పోస్తుంటే.. తమ తోటలో బోర్లు మాత్రమే పుష్కలంగా పోస్తున్నాయన్నారు. రెండు బోర్లలో రెండున్నర ఇంచుల నీరు, మూడు బోర్లలో ఒకటిన్నర ఇంచుల బోర్లు కంటిన్యూగా పోస్తుండటానికి కారణం నిస్సంకోచంగా కందకాలేనని రవి వర్మ అన్నారు. రైతులు కందకాలు తవ్వుకుని పంటలను కాపాడుకోవచ్చని రఘు, రవివర్మ (80089 66677) ల అనుభవాలు చాటిచెబుతున్నాయి. పుస్కూరు రఘుకుమార్ -
అసెంబ్లీ గోడల లోపల నీటి ఊట!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తాత్కాలిక భవనాల డొల్లతనమేంటో అధికారుల పరిశీలనలోనే బయటపడింది. ఫైరింజన్ ఉపయోగించి అసెంబ్లీ తాత్కాలిక భవన గోడలపై బయట వైపు నుంచి నీళ్లు కొడితే భవనం లోపలవైపు గదుల్లో నీరు చేరడాన్ని అధికారులు గుర్తించారు. మంగళవారం చిన్నపాటి వర్షానికే.. అసెంబ్లీ తాత్కాలిక భవనంలోని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చాంబర్లోకి నీరు చేరిన విషయం తెలిసిందే. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్, ఇతర అధికారులు బుధవారం అగ్ని మాపక శకటంతో అసెంబ్లీ తాత్కాలిక భవనంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు జరిగే సమయంలోనూ, అనంతరం అసెంబ్లీ లోపలికి మీడియా రాకపోకలపై అసెంబ్లీ అధికారులు ఆంక్షలు విధించారు. తనిఖీల సమయంలోనూ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలను అనుమతించిన భద్రతాధికారులు అదే సమయంలో మీడియా ప్రతినిధులు లోపలికి వెళ్లడానికి గేటు వద్దే అడ్డుకున్నారు. అధికారులు జగన్ చాంబర్ వద్ద గోడ బయట వైపు నుంచి అగ్నిమాపక శకటం ద్వారా నీళ్లు కొట్టారు. కొద్దిసేపటికే గోడ లోపల వైపు నీటి ఊట రావడం పరిశీలనలో తేలినట్టు సమాచారం. -
ఏపీ సచివాలయంలో మళ్లీ లీకేజీలు
-
వైఎస్ జగన్ ఛాంబర్లోకి నీళ్లు ఎలా వచ్చాయి?
సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఛాంబర్లోకి నీరు లీకేజీ ఘటనపై సీఆర్డీఎ అధికారులు బుధవారం తనిఖీలు జరిపారు. మంగళవారం కురిసిన చిన్నపాటి వర్షానికే వైఎస్ జగన్ చాంబర్లోకి వర్షపు నీళ్లు లీకైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఛాంబర్లోకి నీళ్లు ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు అధికారులు పరిశీలన జరిపారు. లీకేజీ ఎక్కడి నుంచి జరిగిందన్న విషయంపై అసెంబ్లీ సిబ్బందిని, పారిశుద్ధ్య కార్మికులను ప్రశ్నించారు. ఛాంబర్లోకి నీళ్లు ఎలా వచ్చాయంటూ రూఫ్ పైన ఫైర్ ఇంజిన్‌తో నీటిని పంప్ చేసి పరిశీలించారు. సీలింగ్ లో ఏర్పడిన లోపం కారణంగానే నీరు లీకైనట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. మంగళవారంనాడు కురిసిన వర్షంతో చాంబర్ సీలింగ్ నుంచి వర్షపు నీరు ధారగా కారడంతో.. ఆ అంశంపై శాసనసభ ఇన్చార్జి కార్యదర్శి ఎం.విజయరాజుకు వైఎస్సార్ సీఎల్పీ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఇన్చార్జి కార్యదర్శి ఆదేశాల మేరకు శాసనసభ సిబ్బంది వర్షపు నీటిని ఎత్తిపోశారు. గతేడాది జూన్‌లో కురిసిన వర్షానికి కూడా ఇదే రీతిలో ప్రతిపక్ష నేత చాంబర్లో వర్షపు నీరు పైనుంచి లీకై చేరింది. ఆ ఘటనపై అప్పట్లో రాద్ధాంతం చేసిన అధికార పార్టీ తూతు మంత్రపు విచారణ జరిపించింది. పైగా నీరు లీకేజీకి సంబంధించి కుట్ర ఉందని అధికార పార్టీ హైడ్రామాకు తెరలేపింది. అప్పట్లో పైపై రిపేర్లు చేసి నట్టు ప్రకటించారు. మంగళవారం కురిసిన అకాల వర్షానికి ప్రతిపక్ష నేత చాంబర్లోకి మరోసారి నీరు లీకవడం గమనార్హం. -
వైఎస్ జగన్ చాంబర్లో మళ్లీ వర్షపు నీటి లీకేజీలు
-
ప్రతిపక్ష నేత చాంబర్లోకి మళ్లీ వర్షపునీరు
సాక్షి, అమరావతి: కోట్ల ఖర్చుతో వెలగపూడిలో నిర్మించిన సచివాలయం, శాసనసభ భవనాల్లో డొల్లతనం మరోసారి బయటపడింది. మంగళవారం సచివాలయం, శాసనసభ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈపాటి వర్షానికే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చాంబర్లోకి మరోసారి వర్షపు నీళ్లు చేరాయి. చాంబర్లో సీలింగ్ నుంచి వర్షపు నీరు ధారగా కారుతోంది. ఈ అంశంపై శాసనసభ ఇన్చార్జి కార్యదర్శి ఎం.విజయరాజుకు వైఎస్సార్ సీఎల్పీ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఇన్చార్జి కార్యదర్శి ఆదేశాల మేరకు శాసనసభ సిబ్బంది వర్షపు నీటిని ఎత్తిపోశారు. గతేడాది జూన్‌లో కురిసిన వర్షానికి ఇదే రీతిలో ప్రతిపక్ష నేత చాంబర్లో వర్షపు నీరు చేరింది. తాజాగా కురిసిన వర్షం కారణంగా ప్రతిపక్ష నేత చాంబర్లోనే మళ్లీ లీకేజీలు బయటపడటం గమనార్హం. -
బయట ఉన్నా బేసిన్లో భాగమే
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో డెల్టా ప్రాంతం ఎక్కువ భాగం కృష్ణా బేసిన్‌కు బయట ఉన్నా అది బేసిన్లో భాగమేనని, డెల్టాలో వర్షం నీరు ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న ప్రాంతంలో మాత్రమే సాగుకు ఉపయోగపడుతుందని ఏపీ సర్కారు బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు వాదించింది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలపై గురువారం కూడా జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు విచారణ జరిగింది. ఏపీ తరఫు సాక్షి కె.వి. సుబ్బారావును తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది వి.రవీందర్రావు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. డెల్టాలో వర్షం వల్ల వచ్చే నీటిని ప్రకాశం బ్యారేజీ ఎగువన మాత్రమే సాగుకు వినియోగిస్తారని, ఇక్కడ కాలువల ద్వారా వచ్చే నీటిని వినియోగించరని సుబ్బారావు సమాధానాలిచ్చారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా పాలార్, పొన్నిర్ నదీ బేసిన్లకు కృష్ణా జలాలను మళ్లిస్తున్నారు కదా? అని రవీందర్రావు ప్రశ్నించగా.. ఇది నిజమేనని, అయితే కృష్ణా నదిలో మిగులు జలాలను మాత్రమే హంద్రీనీవాలో వినియోగిస్తున్నామని సుబ్బారావు సమాధానం చెప్పారు. కృష్ణా బేసిన్లో 95 శాతం డెల్టా ప్రాంతం బేసిన్ బయట ఉందికదా.. అని ప్రశ్నించగా.. డెల్టా వ్యవస్థ బేసిన్‌కు బయట ఉన్నా అది బేసిన్లో భాగమేనని సుబ్బారావు చెప్పారు. ఇక కేసీ కెనాల్ ఆధునీకరణ వల్ల దాని అవసరాలు 39 టీఎంసీల నుంచి 19 టీఎంసీలకు తగ్గుతుంది కదా! అని రవీందర్రావు పేర్కొనగా.. ఈ వాదనను తిరస్కరిస్తున్నట్టు సుబ్బారావు చెప్పారు. తదుపరి విచారణ శుక్రవారం కూడా జరగనుంది. -
అసెంబ్లీ పక్కన కన్వెన్షన్ హాల్
సాక్షి, అమరావతి: మూడేళ్లుగా రాజధాని అమరావతిలో ఒక్క శాశ్వత భవనాన్ని కూడా నిర్మించని రాష్ట్ర ప్రభుత్వం మరో తాత్కాలికానికి సిద్ధమైంది. తాజాగా వెలగపూడిలోని అసెంబ్లీ భవనం పక్కనే కన్వెన్షన్ హాలు నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రూ. వెయ్యి కోట్లకుపైగా ఖర్చుతో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ భవనాలు నిర్మించిన విషయం తెలిసిందే. అంత వ్యయం చేసినా అవన్నీ డొల్లేనని పలుమార్లు స్పష్టమైంది. చిన్న వర్షానికే మంత్రుల గదుల్లో సైతం వర్షపు నీరు ధారాపాతంగా కారిపోవడం, గోడలు బీటలు వారడంతోపాటు పలు సమస్యలు ఈ తాత్కాలిక భవనాల్లో తరచూ కనిపిస్తున్నాయి. అయినప్పటికీ పూర్తి స్థాయి భవనాల నిర్మాణంపై దృష్టి పెట్టని రాష్ట్ర సర్కారు తాత్కాలికంగానే వెలగపూడిలో కన్వెన్షన్ హాలు నిర్మించాలని నిర్ణయించింది. అసెంబ్లీ భవనం పక్కనే ఉన్న పార్కింగ్ స్థలంలో దీన్ని నిర్మిస్తారు. పూర్తిస్థాయి కాంక్రీట్ నిర్మాణమైతే ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో ‘ప్రి ఇంజనీరింగ్’ స్ట్రీల్ కట్టడాన్ని వెంటనే ఏర్పాటు చేయనున్నారు. రూ.4.36 కోట్ల అంచనాతో దీన్ని ఆరు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తోంది. -
శివరాంపల్లిలో చెరువుకు గండి
-
నటుడు శివబాలాజీ,రోజా ఇళ్లలోకి వర్షపు నీరు
-
ముంచెత్తిన వాన
♦ అమరావతి సమీపంలో పొంగిన కప్పల వాగు ♦ కొండవీటి వాగుకు చేరుతున్న వర్షపు నీరు ♦ తెనాలి లోతట్టు ప్రాంతాల్లో దెబ్బతిన్న వరి ♦ ఈ వర్షాలతో పంటలకు మేలే అంటున్న అధికారులు సాక్షి, అమరావతి బ్యూరో : జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కూడా రోజంతా వర్షం కురుస్తూనే ఉంది. ఈ వర్షాలు ప్రస్తుతం వేసిన పంటలకు మేలు చేకూర్చుతున్నాయి. ఇంకా పదును కాని మాచర్ల ప్రాంతాల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రైతులు పెద్ద ఎత్తున పంటలు సాగు చేయనున్నారు. గుంటూరు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో రోడ్లు చిత్తడిగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరి, రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. గుంటూరు నగరంలో మ్యాన్ హోల్‌లు పొంగి ప్రవహిస్తున్నాయి. తాడికొండ నియోజకవర్గంలోని తాడికొండ, కంతేరు, పొన్నెకల్లు, పాములపాడు గ్రామాల్లో వర్షపు నీరు ప్రత్తి పంట పొలాల్లోకి చేరటంలో నీట మునిగాయి. అమరావతి సమీపంలో కప్పల వాగు పొంగి ప్రవహించడంతో రెండు గంటల పాటు అమరావతి – క్రోసూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో కూరగాయల సాధారణ సాగు విస్తీర్ణం 32,500 ఎకరాలు కాగా, ఇందులో ఇప్పటికే 16 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. మిగిలిన విస్తీర్ణంలో ప్రస్తుతం సాగు చేపట్టనున్నారు. జిల్లాలో దాదాపు 2.50 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తు›తం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో 30 వేల ఎకరాల్లో మిర్చి పంట వేయనున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తెనాలి, కొల్లిపర, బుర్రిపాలెం, నందివెలుగు ప్రాంతాల్లో వెదజల్లే పద్ధతిలో సాగు చేసిన వరి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరి మునిగిపోయింది. దాదాపు 50 ఎకరాలకు పైగా వరి పంట నీట మునిగినట్లు సమాచారం. జిల్లాలో 32.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం... జిల్లాలో సగటు వర్షపాతం 32.3 మిల్లీమీటర్లుగా నమోదైంది. తుళ్లూరులో అత్యధికంగా 65.4, నూజెండ్లలో అత్యల్పంగా 5 మిల్లీమీటర్లు నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 47 మండలాల్లో 20 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. మేడికొండూరు 62 మిల్లీమీటర్లు, దాచేపల్లి 58.2, పెదకూరపాడు 55.8, బెల్లంకొండ 54.4, పెదకాకాని 52.4, అమరావతి 50.2, అచ్చంపేట 49.8, తాడికొండ 48.2, తెనాలి 46, కొల్లూరు 45.8, కొల్లిపర 44.6, రెంటచింతల 44.5, క్రోసూరు 42.6, మంగళగిరి 42.2, గుంటూరు 40.4, టి.చుండూరు 38.4, ఫిరంగిపురం 38.2, రాజుపాలెం 38.2, అమృతలూరు 37.2, చేబ్రోలు 36.6, తాడేపల్లి 36.6, సత్తెనపల్లి 33.4, గురజాల 32.4, వేమూరు 32.4, దుగ్గిరాల 31 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎరువులు, విత్తనాలు సిద్ధం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పంటలకు మేలు చేకూర్చేలా ఉన్నాయి. సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచవరం ప్రాంతాల్లో ఇప్పటికే వేసిన ప్రత్తి, అపరాల పంటలకు మేలు చేకూరనుంది. పంటలు వేయకుండా మిగిలిన ఖాళీ పొలాల్లోనూ ప్రస్తుత వర్షాలతో సాగు చేపట్టనున్నారు. ఇప్పటివరకు వర్షాలు లేక సాగు అత్యల్పంగా ఉన్న మాచర్ల ఏడీఏ పరిధిలో ప్రస్తుత వర్షాలతో సాగు విస్తీర్ణం పెరగనుంది. రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులు, విత్తనాలు సిద్ధం చేసి ఉంచాం. పశ్చిమ డెల్టాలో వర్షం ఆగిపోయిన తరువాత వెద పద్ధతిలో వరి సాగు చేయనున్నారు. మిగిలిన పొలాలకు వరి నార్లు పోస్తున్నారు. – కృపాదాస్, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు, గుంటూరు 30వేల ఎకరాల్లో మిర్చి సాగు ప్రస్తుత వర్షాలతో జిల్లాలో మిర్చి విత్తనాలు వేయనున్నారు. 30 వేలకు పైగా ఎకరాల్లో సాగు చేయనున్నారు. పసుపు పంటకు కూడా వర్షం మేలు చేకూర్చనుంది. ప్రస్తుతం జిల్లాలో ఉన్న అరటి, బొప్పాయి, నిమ్మకు సైతం ఈ వర్షం ఊపిరి పోయనుంది. – జయచంద్రారెడ్డి, హార్టీకల్చర్ డీడీ, గుంటూరు -
నీళ్లు ఎలా వెళ్లాయో కనిపెట్టలేకపోయిన ప్రొఫెసర్లు
గుంటూరు: వర్షం లీకేజీతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తాత్కాలిక సచివాలయం భవనాలలోని లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జేఎన్టీయూ ప్రొఫెసర్ల బృందం విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఛాంబర్లోకి నీళ్లు ఎలా వెళ్లాయో ప్రొఫెసర్ల బృందం కనిపెట్టలేకపోయింది. సీఆర్డీఏ కాంట్రాక్టర్లు చెబుతున్న వాదనకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా పోయింది. పైప్ లైను నుంచి వైఎస్ జగన్ కుర్చీ వరకు నీళ్లు వెళ్లే అవకాశం లేదని ప్రొఫెసర్లు చెబుతున్నారు. వైఎస్ జగన్ కుర్చీపైకి సీలింగ్ ఎలా ఊడిందని జేఎన్టియు ప్రొఫెసర్ల ప్రశ్నించగా .... కాంట్రాక్టర్లు నీళ్లు నమిలినట్టు తెలుస్తోంది. వాటర్ లీక్ అయిన ప్రాంతాన్ని, టెర్రస్‌పైన పైపులను బృందం సభ్యులు పరిశీలించారు. సివిల్ పనులను పరిశీలించి సీఐడి అధికారులకు నివేదిక ఇవ్వనున్నారు మరోవైపు సీఐడీ అధికారులకు కూడా ఈ వాటర్ లీకేజీ వ్యవహారం అంతుపట్టడం లేదు. అసెంబ్లీ మొదటి ఫ్లోర్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో పైప్ కట్ చేసినవారిని ఎలా గుర్తించాలనే సందేహం వారిలో తలెత్తుతోంది. అంతేకాకుండా విచారణ ప్రారంభించేసరికి మరమ్మతులు పూర్తి చేయడంతో విచారణ ఎలా అంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. లీకేజీ తర్వాత చాలాచోట్ల మరమ్మతులు చేయడంతో సీఐడీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాటర్ లీకేజీ కంటే వీడియో లీకేజీపైనే సీఐడీ విచారణ కొనసాగుతోంది. కాగా మంగళవారం కురిసిన వర్షానికి సచివాలయంతో పాటు, అసెంబ్లీ భవనాలలో వర్షపు నీరు కారిన విషయం తెలిసిందే. -
అసెంబ్లీ లీక్‌పై మూడో రోజూ సీఐడీ దర్యాప్తు
అమరావతి: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీల్లో వర్షపు నీరు లీక్ అవడంపై సీఐడీ విచారణ మూడో రోజూ కొనసాగింది. సీఐడీ చీఫ్ ద్వారకా తిరుమలరావు ఆధ్వర్యంలో సీఐడీ అధికారులు, సిబ్బంది వర్షపు నీరు లీక్ అయిన ప్రదేశాలను పరిశీలించారు. అలాగే జేఎన్టీయూ ప్రొపెసర్ల బృందం కూడా శుక్రవారం అసెంబ్లీని సందర్శించింది. వాటర్ లీక్ అయిన ప్రాంతాన్ని, టెర్రస్‌పైన పైపులను బృందం సభ్యులు పరిశీలించారు. సివిల్ పనులను పరిశీలించి సీఐడి అధికారులకు నివేదిక ఇవ్వనున్నారు. కాగా మంగళవారం కురిసిన వర్షానికి సచివాలయంతో పాటు, అసెంబ్లీ భవనాలలో వర్షపు నీరు కారిన విషయం తెలిసిందే. -
‘అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్‌పై కుట్ర’
తిరుపతి : ఆంధప్రదేశ్ శాసనసభ సాక్షిగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కుట్ర జరుగుతోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. పథకం ప్రకారమే టీడీపీ నేతలు జగన్‌పై కుట్ర పన్నుతున్నారని ఆమె శుక్రవారమిక్కడ ఆరోపించారు. ఇందులో భాగంగానే ప్రతిపక్ష నేత ఛాంబర్లో లీకేజీ వ్యవహారం నడిచిందన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైఎస్ జగన్‌పై కుట్రలు జరుగుతూనే ఉన్నాయని రోజా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా దాని వెనుక జగన్ ఉన్నట్లు టీడీపీ చెప్పడం సాధారణమైపోయిందని ఆమె ధ్వజమెత్తారు. రేపు ఎప్పుడైనా చంద్రబాబు మనవడు దేవాన్ష్ ఏడ్చినా... జగనే గిచ్చి ఉంటాడని చెప్పినా ఆశ్చర్యపోనక్కరలేదని రోజా ఎద్దేవా చేశారు. భవనం లీకేజీపై తక్షణమే సీబీఐ విచారణకు సిద్ధపడతాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా వందల కోట్ల ఖర్చుతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన రాష్ట్ర నూతన శాసనసభ, సచివాలయం మంగళవారం కేవలం 20 నిమిషాలపాటు కురిసిన సాధారణ వర్షానికే అసెంబ్లీ, సచివాలయం జలదిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అసెంబ్లీలో కేటాయించిన చాంబర్లో లీకేజీల వల్ల వాననీరు ధారాళంగా పారింది. చాంబర్లో సీలింగ్ ఊడిపడింది. సోఫాలు పూర్తిగా తడిసిపోయాయి. ఏసీ, రూఫ్‌లైట్ల నుంచి కూడా వాన నీరు ధారగా కారిపోవడంతో కింద బక్కెట్లు పెట్టారు. చాంబర్లో పడిన వాన నీటిని బక్కెట్లతో పట్టి బయటకు పోసేందుకు సిబ్బంది గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. అయితే తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటూ పైపెచ్చు వర్షాలకు అసెంబ్లీ భవనాలు కురుస్తున్నాయని, లీకేజీలు ఉన్నాయంటూ ప్రతిపక్షాలు అనవసర ప్రచారం చేస్తున్నాయంటూ ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని పరిశీలించేందుకు శుక్ర, , శనివారాల్లో సామాన్య ప్రజానీకంతోపాటు ప్రజాప్రతినిధులు, మీడియా అందరికీ అవకాశం కల్పిస్తున్నామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పడం విశేషం. -
అంతర్జాతీయ రాజధానికి ‘తొలి’ చిల్లు
అసెంబ్లీకి బీటలు.. సచివాలయంలో నీళ్లు సాక్షి, అమరావతి: ప్రపంచ స్థాయి అత్యాధునిక రాజధాని అమరావతి చిన్నపాటి వర్షానికే చిగురుటాకులా వణికిపోయింది. ప్రభుత్వ పెద్దలకు ప్రీతిపాత్రమైన ప్రైవేట్ సంస్థలు రూ.వందల కోట్ల ఖర్చుతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన రాష్ట్ర నూతన శాసనసభ, సచివాలయం బండారం బట్టబయలైంది. మంగళవారం కేవలం 20 నిమిషాలపాటు కురిసిన సాధారణ వర్షానికే అసెంబ్లీ, సచివాలయం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ ప్రాంతమంతా బురదమయంగా మారింది. నిర్మాణం పూర్తయి సంవత్సరమైనా కానీ భవనాల్లో లీకేజీలు బయటపడ్డాయి. వర్షపు నీటితో చాంబర్లు మడుగుల్లా మారాయి. ఫైళ్లు, సోఫాలు, కుర్చీలు, తడిసిపోయాయి. గోడల్లో పగుళ్లు కనిపించాయి. పాత పెంకుటింటి మాదిరిగా అసెంబ్లీ, సచివాలయంలో వర్షపు నీటి ధారల కింద బక్కెట్లు పెట్టాల్సి వచ్చిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నూతన అసెంబ్లీ, సచివాలయంలో లీకేజీలు బహిర్గతం కావడంతో ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పరువు గంగలో కలిసే ప్రమాదం ఉండడంతో వెంటనే అప్రమత్తమైంది. విషయం బయటకు పొక్కకుండా మీడియా ప్రతినిధులను అసెంబ్లీ, సచివాలయం వైపు వెళ్లనివ్వకుండా అడ్డుకుంది. వర్షపు నీటి లీకేజీల దృశ్యాలను చిత్రీకరించవద్దని భద్రతా సిబ్బంది హెచ్చరించారు. సింగపూర్‌లాంటి అత్యాధునిక రాజధాని నిర్మాణంలో సిత్రాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. సీఎం కార్యాలయంలోకి వాన నీరు అసెంబ్లీ, సచివాలయంలోని పలు బ్లాకుల్లోకి వర్షపు నీరు చేరడంతో రికార్డులు తడిసిపోకుండా చూడడానికి ఉద్యోగులు, సిబ్బంది నానా అవస్థలు పడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయం ఉన్న బ్లాకుతోపాటు నాలుగో బ్లాకులోని రెవెన్యూ శాఖ సెక్షన్, ఇతర బ్లాకుల్లోని కారిడార్లలోకి వాన నీరు చేరడంతో సిబ్బంది విధులకు ఆటంకం కలిగింది. భవనాల్లో లీకేజీలతో వచ్చిన నీటిని సిబ్బంది బక్కెట్లతో ఎత్తిపోశారు. వాన నీటికి బయటకు తోడేందుకు చాలా సమయం పట్టింది. సచివాలయం వెలుపల సెక్యూరిటీ గేటు వద్ద సందర్శకుల కోసం నిర్మిస్తున్న భవనంపై నీరు నిలిచిపోయింది. దీంతో ఆ కొత్త భవనం గోడ నానిపోయి బీటలు వారింది. సిబ్బంది జేసీబీతో ఆ గోడను కూలగొట్టారు. సచివాలయం బయట సందర్శకుల కోసం వేసిన టెంట్లు కూలిపోయాయి. అసెంబ్లీ, సచి వాలయం ప్రాంతమంతా నీటితో అస్తవ్యస్తం గా మారిపోయింది. ప్రాంగణంలోని పల్లపు ప్రాంతాల్లో నిలిచిపోయిన నీటిని మళ్లించేందుకు సిబ్బంది నానా తిప్పలు పడ్డారు. ప్రతిపక్ష నేత చాంబర్లో లీకేజీలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అసెంబ్లీలో కేటాయించిన చాంబర్లో లీకేజీల వల్ల వాననీరు ధారాళంగా పారింది. చాంబర్లో సీలింగ్ ఊడిపడింది. సోఫాలు పూర్తిగా తడిసిపోయాయి. ఏసీ, రూఫ్‌లైట్ల నుంచి కూడా వాన నీరు ధారగా కారిపోవడంతో కింద బక్కెట్లు పెట్టారు. చాంబర్లో పడిన వాన నీటిని బక్కెట్లతో పట్టి బయటకు పోసేందుకు సిబ్బంది గంటల తరబడి శ్రమించారు. అసెంబ్లీలో పై అంతస్తు ఉన్నప్పటికీ దిగువ అంతస్తులో వాన నీరు పెద్ద ఎత్తున లీకవ్వడం ఆందోళన కలిగిస్తోంది. భవన నిర్మాణంలో లోపం కారణంగానే వర్షపు నీరు లీకయ్యిందని సిబ్బంది చెబుతున్నారు. వర్షం తగ్గాక మున్సిపల్ మంత్రి పి.నారాయణ అసెంబ్లీ, సచివాలయం పరిస్థితిని ఆరా తీశారు. లోపాలు తెలిసాయి: సీఆర్డీఏ కమిషనర్ మొదటిసారి వచ్చిన వర్షం కావడంతో లోపాలు అర్థమయ్యాయని సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ చెప్పారు. ఆయన మంగళవారం రాత్రి నిర్మాణ సంస్థల ప్రతినిధులు, అధికారులతో కలిసి అసెంబ్లీ, సచివాలయ భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చాంబర్లోకి నీరు రావడంపై చీఫ్ ఇంజినీర్ సమీక్ష జరిపారని తెలిపారు. ఇటీవల ఎలక్ట్రికల్ పనుల కోసం ఒక పైప్‌ను దించడంతో అక్కడ నీరు రూఫ్ నుంచి లోనికి వచ్చిందన్నారు. ఐదో బ్లాకులో సన్‌రూఫ్ నుంచి జల్లు కొట్టడం వల్ల నీరు భవనంలోకి వచ్చిందన్నారు. సన్‌రూఫ్‌ను కిందికి దించుతామన్నారు. కొన్ని భవనాల్లో కిటికి అద్దాలను సరిగ్గా మూయకపోవడం వల్ల నీరు లోపలికి వచ్చిందని చెప్పుకొచ్చారు. బాబు పాలనలో డొల్లతనానికి నిదర్శనం: ఎమ్మెల్సీ వెన్నపూస సాక్షి, హైదరాబాద్ : నిన్న గాక మొన్న నిర్మించిన అసెంబ్లీ భవనంలోకి చిన్నపాటి వర్షానికే నీళ్లు రావడం చంద్రబాబు పాలనలోని డొల్లతనాన్ని సూచిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష నేత కార్యాలయంలోకి నీళ్లు రావడం, పైకప్పు నుంచి నీళ్లు ధారాపాతంగా కురవడాన్ని తీవ్రంగా పరిగణించాలని గోపాల్‌రెడ్డి అన్నారు. వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ భవన నిర్మాణాల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని, ఇందుకు ముఖ్యమంత్రి‡ చంద్రబాబుదే పూర్తి బాధ్యత అని ఆయన విమర్శించారు. ఉరుములు.. మెరుపులు సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటలకు ఆకాశంలో దట్టౖ మెన మేఘాలు కమ్ముకున్నాయి. క్యుములోనింబస్ మేఘాలతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తారంగా వర్షం కురిసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో సచివాలయం చుట్టుపక్కల కూడా భారీ వర్షం కురిసింది. తిరుమలలో మంగళవారం భారీ వర్షం పడింది. చిత్తూరు జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం పడింది. ఈ వర్షాల వల్ల జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పిడుగుపడి భార్యాభర్తలు మృతి చెందగా, చెట్టు కూలి గుర్తుతెలియని వ్యక్తి చనిపోయాడు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారయ్యపేటలో పిడుగుపడి సుమారు 20 టీవీలు దగ్ధమయ్యాయి. మన్యంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతా ల్లో మంగళవారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం తుమ్మలపల్లి గ్రామంలో మంగళవారం పిడుగుపడి ఓ మహిళ మృతి చెందింది. పెదకాకాని మండలం ఉప్పలపాడులో రోడ్డు పక్కన నిలిపిన నాలుగు కంటైనర్ లారీలు సోమవారం రాత్రి ఈదురుగాలులకు తిరగబడ్డాయి. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జలం..జనం
⇒ ఇంకుడు గుంతల ఉద్యమానికి సాక్షి సిద్ధం ⇒ జలసిరి ఒడిసిపట్టేందుకు కదలాలి జనం.. ⇒ నగరంలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న భూగర్భ జలాలు ⇒ ఇంకుడు గుంతలే శరణ్యమంటున్న జల నిపుణులు మరో మహోద్యమానికి ‘సాక్షి’ ముందుకొచ్చింది. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలసిరిని పెంచేందుకు నడుంబిగించింది. పదండి ప్రతి ఇంటి ఆవరణలో విధిగా ఇంకుడుగుంతను ఏర్పాటు చేద్దాం. వృథాగా పోతున్న వాననీటిని ఇంకించి పాతాళం నుంచి జలసిరుల్ని పొంగిద్దాం. జలయజ్ఞాన్ని అకుంఠిత దీక్షతో సాగిద్దాం. ఇందుకు ‘సాక్షి’ మీకు దారి చూపుతుంది. ఎప్పటికప్పుడు సలహాలు..సూచనలు ఇస్తుంది. ఇంకుడు గుంతల గురించి ఇకపై సమగ్ర సమాచారం అందిస్తుంది. ఇందులో భాగంగా నగరంలో వర్షంపాతం..నీటి సరఫరా...వృథా..ప్రజల అవసరాలు, నిపుణుల సూచనలు తదితర అంశాలతో సమగ్ర కథనం నేటి నుంచి వరుసగా ప్రచురిస్తుంది. ఇంకుడు గుంతలపై చైతన్యమే లక్ష్యంగా సాగే ఈ యజ్ఞంలో తొలి కథనం ఇదీ... –సాక్షి, సిటీబ్యూరో సిటీబ్యూరో: అసలు గ్రేటర్ పరిధిలో నివాసాలెన్ని.. ఇంకుడు గుంతల ఏర్పాటు ఎందుకు..? ప్రజల అవసరాలకు కావాల్సిన నీరెంత..? వృథాగా పోతున్న జలం సంగతేంటి..? ఒడిసిపట్టకుంటే భవిష్యత్తలో జనం సంగతేంటి..? నిపుణుల సూచనలు.. ఇతర విషయాల్ని ఒకసారి ఆలకిస్తే... ఇదీ దుస్థితి.. ⇒గ్రేటర్లో విలువైన వర్షపు నీటిని ఒడిసిపట్టే దారి లేకపోవడంతో పాతాళగంగ కనుమరుగవుతోంది. ⇒ప్రతి ఇళ్లు, కార్యాలయం ఆవరణలో ఉన్న బోరుబావికి ఆనుకొని ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయకపోవడంతో రోజురోజుకూ భూగర్భ జలాలు అథఃపాతాళానికి చేరుతున్నాయి. ⇒మారేడ్‌పల్లి, బోయిన్పల్లి, బోడుప్పల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో 1500 అడుగుల లోతు వరకు బోరుబావులు తవ్వినా నీటి చుక్క జాడ కనిపించడంలేదు. ⇒విచక్షణా రహితంగా బోరుబావులు తవ్వడాన్ని నిషేధిస్తూ గతంలో చేసిన వాల్టా చట్టానికి అక్రమార్కులు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. ⇒ఇంటి అవసరాలకోసం వ్యయప్రయాసలకోర్చి బోరుబావులు తవ్వుతున్న వారికి నీటిబొట్టు జాడ కనిపించడంలేదు. భవంతులు లక్షల్లో.. గుంతలు వేలల్లో... గ్రేటర్ పరిధిలో 22 లక్షల భవంతులుండగా.. వర్షపు నీటి నిల్వకు ఉన్న ఇంకుడు గుంతల సంఖ్య కేవలం లక్ష మాత్రమేనని భూగర్భజలశాఖ తాజా పరిశోధనలో వెల్లడైంది. లక్ష గుంతల్లో అధికశాతం నిరుపయోగంగా మారాయి. వీటిపై మట్టి, పెద్ద బండరాళ్లు, సిమెంట్, చెత్తాచెదారం పడడంతో వర్షపునీరు భూగర్భంలోకి చేరే పరిస్థితిలేదు. వీటిని పునరుద్ధరించే విషయంలో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలి. కాలనీ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సహకారం తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకుడుగుంత ఇలా.. మన ఇల్లు లేదా కార్యాలయం ఆవరణలో ఇంకుడుగుంతను నిర్మించేందుకు భూగర్భ జలశాఖ నిపుణుడు సత్యనారాయణ కొన్ని సూచనల్ని అందించారు. ⇒200 చదరపు అడుగుల విస్తీర్ణంగల స్థలంలో ఇంటిని నిర్మిస్తే బోరుబావికి మీటరు లేదా రెండు మీటర్ల దూరంలో రీఛార్జి పిట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ⇒పొడవు, వెడల్పులు 2 మీటర్ల మేర ఉండాలి. ⇒1.5 మీటర్ల లోతున గుంత తీయాలి. ⇒ఇందులో 50 శాతం 40ఎంఎం పరిమాణంలో ఉండే పలుగు రాళ్లు, 25 శాతం 20 ఎంఎం సైజులో ఉండే రాళ్లను నింపాలి. ⇒మరో 15 శాతం బఠానీగింజ పరిమాణంలో ఉండే ఇసుకతో నింపాలి. ⇒10 శాతం ఖాళీగా ఉంచాలి. ⇒భవనం పైకప్పు నుంచి పడిన వర్షపునీరు ఈ పిట్‌పై కొద్దిసేపు నిలిచేలా ఏర్పాటు చేసుకోవాలి. దీంతో భూగర్భజలాల రీఛార్జీ సులువవుతుంది. ⇒మీ బోరుబావి ఎండిపోకుండా ఉంటుంది. -
జాతీయ రహదారిపై తగ్గని నీరు
రామచంద్రాపురం: పట్టణంలోని నాగులమ్మ దేవాలయం సమీపంలో జాతీయ రహదారిపై నాలుగో రోజు కూడా నీరు పెద్ద ఎత్తున చేరింది. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఇప్పటికే రోడ్డుపై నీరు ఉండడంతో రోడ్డు గుంతలమయంగా మారింది ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారు. స్థానిక పోలీసు అధికారులు రోడ్డు వద్దనే ఉండి ట్రాఫిక్‌ను పూర్తిస్థాయిలో నియంత్రిస్తున్నారు. ద్విచక్రవాహనదారులను ఈ మార్గంంలో రాకుండా చెరువు కట్టపై నుంచి పంపిస్తున్నారు. అయితే ఆ నీళ్లలో నుంచి కార్లు మొరాయించడంతో యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సందర్శించారు. నీటి తీవ్రత పెరగడంతో జెసీబీల ద్వారా నీరు పోయేలా కాలువలు తీశారు. -
నల్లవాగు.. పరవళ్లు
కల్హేర్: జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగులో భారీగా వరద చేరింది. బుధవారం ప్రాజెక్టు అలుగుపై నుంచి వరద నీరు పొంగిపొర్లింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1493 ఫీట్లు. పూర్తి నీటి నిల్వ 776.13 ఎంసీఎఫ్‌టీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 1493.166 ఫీట్లు ఉంది. మంగళవారం రాత్రి ఎగువ భాగంలోని కంగ్టి మండలంలో కురిసిన వర్షంతో భారీగా నీరు చేరింది. 400 క్యూసెక్కులు వరకు వరద నీరు ఇన్‌ఫ్లో ఉంది. 200 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉంది. ప్రాజెక్టు అలుగు వద్ద సందర్శకుల తాకిడి పెరిగింది. ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో మండలంలోని చెరువులకు జలకళ వచ్చింది. -
రైళ్ల రాకపోకలు రద్దు
వరదల కారణంగా మాచర్ల– నడికుడి రూట్ బంద్ గుంటూరు (నగరంపాలెం) : పల్నాడులో మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి గురజాల రైల్వేస్టేషన్ సమీపంలో దండేవాగు పొంగి రైల్వే ట్రాకు కొట్టుకుపోవటంతో మాచర్ల–నడికుడి మధ్యలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు గుంటూరు నుంచి బయలుదేరిన ప్యాసింజరు రైలును నడికుడి వరకు నడిపారు. సాయంత్రం అదే రైలును గుంటూరు స్టేషనుకు నడిపారు. మంగళవారం తెల్లవారుజామున మాచర్ల నుంచి బయలుదేరాల్సిన మాచర్ల–భీమవరం రైలును అక్కడే నిలిపివేశారు. బుధవారం కూడా గుంటూరు–నడికుడి మధ్యలోనే రైళ్లను నడపనున్నారు. దండేవాగు నీటి ఉధృతికి కొట్టుకుపోయిన ట్రాకును మంగళవారం మధ్యాహ్నం నీటి ప్రవాహం తగ్గిన వెంటనే పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన రైల్వే అధికారులు ప్రారంభించారు. పాడైపోయిన ట్రాకును తొలగించి నూతన ట్రాకును బుధవారం సాయంత్రం నాటికి సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ విజయశర్మతో పాటు, సీనియర్ డీఈఎన్ కో ఆర్డినేషన్ సైమన్, ఇతర ఇంజనీరింగ్ రైల్వే అధికారులు దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు. -
వరద బీభత్సం
-
తీర ప్రాంత ప్రజలు అప్రమత్తం
అధికారులకు జెడ్పీ ఇన్చార్జ్ సీఈవో వెంకటసుబ్బయ్య ఆదేశం అచ్చంపేట: భారీ వర్షాలకు పులిచింతల ప్రాజెక్టులో భారీగా వరదనీరు చేరుతోందని, ఏ క్షణంలోనైనా ప్రాజెక్టు గేట్లు తెరిచే అవకాశం ఉన్నందున తీర ప్రాంత గ్రామాలను అప్రమత్తం చేయాలని జిల్లా పరిషత్ ఇన్చార్జ్ సీఈవో వెంకటసుబ్బయ్య అధికారులను ఆదేశించారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో మంగళవారం ఆయన ఎమ్మార్వో, ఏపీడీవోలతో పరిస్థితులపై సమీక్షించారు. ప్రాజెక్టులో వరద నీరు చేరడం వల్ల బెల్లంకొండ మండలంలో ఏ విధమైన ఇబ్బందులు తలెత్తవని చెప్పారు. ముందస్తుగా ముంపు గ్రామాలవారిని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు స్థానికులను తరలించాలన్నారు. ముంపు గ్రామాలకు చెల్లించాల్సిన పరిహారం మొత్తం చెల్లించామన్నారు. వేమవరం, రేగులగడ్డ, గోవిందాపురం గ్రామాలకు 50 శాతం చెల్లించినట్లు చెప్పారు. నదీ తీర ప్రాంత గ్రామస్తులు, జాలర్లు ఎవరూ నదిలోకి వెళ్లకుండా నదుల వద్ద సిబ్బందిని కాపలా ఉంచాలని సూచించారు. ప్రాజెక్టులో 20 టీఎంసీల నీరు చేరినా ఏ విధమైన ఇబ్బంది ఉండదని, అచ్చంపేట మండలం ప్రాజెక్టుకు దిగువ ప్రాంతంలో ఉండడం వల్ల ఏ విధమైన అంతరాయం కలగదని తహసీల్దారు జి.సుజాత తెలిపారు. పునరావాస కేంద్రానికి నిర్వాసితులు కోరుకున్న పేరు పెట్టుకునే వెసులుబాటు వుందని, పేరు ఎంపిక చేసుకుని ఉన్నతాధికారులకు పంపితే నెలరోజుల్లో ప్రత్యేక పంచాయతీగా గుర్తింపు వస్తుందన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల నాటికి ప్రక్రియ పూర్తి చేసుకుంటే వాటికి కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశముంటుందన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పీవీ రామారావు ఉన్నారు. -
ఇదిగో.. ఎడారి ఓడిపోతుంది!
రాజస్థాన్‌లో మహోద్యమంగా జలయజ్ఞం ఇసుక నేలల్లో పరుచుకుంటున్న పచ్చదనం - కరువును జయించేందుకు కదిలిన జనం - వంద కోట్ల విరాళంతో ముందుకు వచ్చిన దాతలు - ప్రజల భాగస్వామ్యంతో జల సంరక్షణ అభియాన్ చేపట్టిన రాష్ట్ర సర్కారు - జల వనరులకు పునరుజ్జీవం కల్పించడమే లక్ష్యం - ఏడు నెలల్లో 500 చెరువులు, కుంటల నిర్మాణం - నాలుగేళ్లలో 22 వేల గ్రామాలకు జలకళ దిశగా అడుగులు - భగీరథ యజ్ఞంలో కీలకపాత్ర పోషిస్తున్న తెలంగాణ బిడ్డ శ్రీరాం వెదిరె రాజస్థాన్.. పర్యాటక రంగానికి పర్యాయపదం. కోటలు.. మహల్లు.. చరిత్రకు అద్దం పట్టే కట్టడాలు.. ప్రతీదీ ప్రత్యేకమే. దేశ భౌగోళిక విస్తీర్ణంలో, జనాభాపరంగా అతి పెద్ద రాష్ట్రాల్లో ఒకటి. పశు పోషణలో దేశానికే ఆదర్శం! కానీ.. జల వనరుల్లేక అల్లాడుతోంది. రాష్ట్ర విస్తీర్ణంలో మూడింట రెండొంతుల భూభాగం ఎడారే. ఒకవైపు వరుస కరువు.. మరోవైపు జల సంరక్షణలో అలసత్వం! వెరసి రాష్ట్రంలో భూగర్భ జలాలు పాతాళానికి చేరాయి. పరిస్థితి ఇలాగే ఉంటే మున్ముందు పెను సంక్షోభమే!! కానీ రాబోయే ఆ ఉపద్రవాన్ని ముందే పసిగట్టిన రాజస్థాన్ దిద్దుబాటు దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో జల సంరక్షణను ఉద్యమ స్ఫూర్తితో కొనసాగిస్తోంది. ఈ యజ్ఞంలో తెలంగాణకు చెందిన శ్రీరాం వెదిరె కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ‘మినీచిరపుంజి’గా పేరొందిన ఝాలావర్ జిల్లాలో ఏడు నెలల వ్యవధిలో జల సంరక్షణ కార్యక్రమం ఉద్యమంలా సాగిన తీరును ‘సాక్షి’ క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. ఇదే ఈ వారం ఫోకస్.. - ఝాలావాడ్ నుంచి కల్వల మల్లికార్జున్‌రెడ్డి, సాక్షి ప్రతినిధి ఇదీ రాజస్థాన్.. దక్షిణ, పడమటి ప్రాంతాల నుంచి ఉత్తర, తూర్పు ప్రాంతం వరకు విస్తరించి ఉన్న రాజస్థాన్‌ను ఆరావళి పర్వత శ్రేణి రెండుగా విభజిస్తోంది. దేశంలో భౌగోళికంగా రాజస్థాన్ 10.4 శాతాన్ని ఆక్రమించగా.. దేశ జనాభాలో 5.5 శాతం, పశు సంపదలో 18.70 శాతంగా ఉంది. అయితే దేశంలో లభ్యమవుతున్న భూ ఉపరితల జలంలో కేవలం 1.16 శాతం, భూగర్భ జలంలో 1.70 శాతం మాత్రమే రాష్ట్రంలో లభ్యమవుతోంది. సగటు వార్షిక వర్షపాతం150 మి.మీ. నుంచి 900 మి.మీ. మధ్య ఉంటోంది. 33 జిల్లాల్లోని 295 బ్లాక్‌లలో.. 95శాతం బ్లాక్‌లు డార్క్ ఏరియాలోనే ఉన్నాయి. చంబల్‌తో పాటు మాహి, కాళిసింధ్, బనాస్, సబర్మతి తదితర నదులున్నా.. ఉపరితల జలం కొరత పీడిస్తోంది. 90 శాతం తాగునీరు, 60 శాతం సాగునీటిని భూగర్భం నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి. ప్రతీ మూడేళ్లకోమారు కరువు.. ఐదేళ్లకోమారు తీవ్ర దుర్భిక్ష పరిస్థితిని రాష్ట్రం ఎదుర్కొంటోంది. వర్షాభావ పరిస్థితులు తర చూ తలెత్తుతుండటంతో.. భూగర్భ జలంపై ఒత్తిడి పెరుగుతోంది. జలసిరుల దిశగా.. వర్షపాతం, పారే నీరు, భూగర్భ జలం, మట్టిలో తేమ పెంచడం లక్ష్యంగా చేపట్టిన ‘ఫోర్ వాటర్ కాన్సెప్ట్’ కార్యక్రమం పరిధిని విస్తరించి రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే జల స్వావలంబన్ అభియాన్ (ఎంజేఎస్ఏ)కు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉండే ఈ కార్యక్రమానికి మార్గనిర్దేశనం చేసి, అమలు చేసే బాధ్యతను ‘రాజస్థాన్ రివర్ బేసిన్, వాటర్ రిసోర్సెస్ ప్లానింగ్ అథారిటీ’కి అప్పగించారు. గ్రామాలు జల స్వయం స్వావలంబన సాధించేందుకు.. నాలుగేళ్లలో రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో 22,500 గ్రామాలను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రతీ దశలో ఏడాదిలోపు పనులు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు. 33 జిల్లాల పరిధిలోని 295 పంచాయతీ బ్లాకుల్లో.. ప్రతీ దశలోనూ.. ఒక్కో బ్లాక్‌లో 12 గ్రామాల్లో కార్యక్రమాలు చేపడుతున్నారు. భూగర్భ జల మట్టం, తాగునీరు, నీటిపారుదల, సాగుకు యోగ్యమైన విస్తీర్ణం, పంటల ఉత్పత్తి పెంచడాన్ని లక్ష్యంగా నిర్దేశించారు. వర్షాభావ ప్రాంతంలో కనీసం 40 శాతాన్ని సాగులోకి తేవడంతో పాటు పంటల రకాల్లోనూ మార్పులు తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. కరువు నేర్పిన పాఠం.. రాష్ట్ర విస్తీర్ణంలో 61 శాతాన్ని థార్ ఎడారి ఆక్రమించగా.. దీని మీదుగా వీచే గాలితో భూక్షయం జరుగుతోంది. ఆగ్నేయ, ఈశాన్య ప్రాంతాలు వ్యవసాయానికి అనుకూలమైనా.. నీరు లేదు. రాష్ట్రంలోని భూముల్లో 30 శాతం మేర కొండలు, గుట్టలతో పాటు.. సాగునీటి వసతి లేక నిరుపయోగంగా ఉన్నాయి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తూ.. ఆర్థిక రంగానికి వెన్నెముకగా నిలుస్తోంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 27 శాతం వ్యవసాయ రంగానిదే! 90 శాతం సాగు విస్తీర్ణం వర్షపాతంపైనే ఆధారపడి ఉంది. సగటు వర్షపాతం నమోదైనా వర్షపు నీటిని నిల్వ చేసే అవకాశం లేక.. జల వనరులు అడుగంటుతున్నాయి. దీంతో వ్యవసాయ రం గం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జనాభా పెరుగుదల, పట్టణీకరణ నీటి వనరులకు సవా లు విసురుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 19 జిల్లాలు తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. 44,672 గ్రామాలకుగాను సుమారు 17 వేలకు పైగా గ్రామాలు తీవ్ర తాగునీటి సమస్యతో సతమతమయ్యాయి. రైళ్ల ద్వారా తాగునీటిని సరఫరా చేశారు. ఆహార భద్రత, పశువుల మనుగడ సవాలుగా మారింది. దీంతో జల సంరక్షణ ఆవశ్యకత, సహజ వనరులను సమర్థంగా వినియోగించుకోవాల్సిన పరిస్థితి రాజస్థాన్‌లో తలెత్తింది. తొలి ఫలితం.. ఆశాజనకం! ఈ ఏడాది జనవరి 27న ఎంజేఎస్ఏను ప్రారంభించిన సీఎం.. మొదటి దశ పనులు పూర్తి చేసేందుకు ఐదు నెలల వ్యవధి ఇచ్చారు. మొద టి దశలో 3,529 గ్రామాల్లో రూ.1,800 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. ఇందులో ఉపాధి హామీ పథకం కింద రూ.400 కోట్లు, ఐడబ్ల్యూఎంపీ కింద రూ.200 కోట్లు కేంద్రం నుంచి రాగా.. మిగతా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించింది. తొలి విడతలో 16.5 లక్షల ఎకరాల పరీవాహక ప్రాంతంలో జల సంరక్షణ పనులు చేపట్టి సుమారు 500కు పైగా చెరువులు, కుంటలు నిర్మించారు. జీఐఎస్, జియో ట్యాగింగ్ సాంకేతికత వినియోగించడంతో పాటు తక్కువ ఖర్చుతో జల సంరక్షణ నిర్మాణాలు చేపట్టారు. డబ్బులు ఆదా చేయడంతో పాటు కాంట్రాక్టర్లకు టర్న్ కీ పద్ధతిలో పనులు అప్పగించారు. తొలి దశ పనులు పూర్తి కావడంతో రెండో దశ పనులను రూ.2,500 కోట్లతో ఈ ఏడాది సెప్టెంబర్ 11న ప్రారంభించాలని నిర్ణయించారు. రెండో దశలో 4,200 గ్రామాల ఎంపిక పూర్తి కాగా.. ప్రజా ప్రతినిధుల ఒత్తిడితో మరో వేయి గ్రామాలను అదనంగా చేర్చబోతున్నారు. సర్వే పూర్తి చేసేందుకు ‘వే పాయింట్ మొబైల్ యాప్’తో పాటు డ్రోన్లను వినియోగిస్తున్నారు. రెండో పంటకు అవకాశం ఏర్పడింది ఇక్కడ సగటున 1,300 మిల్లీ మీటర్ల వర్షపాతం ఉన్నా.. కొండ ప్రాంతం కావడంతో వర్షపు నీరు వేగంగా కిందకు పోతోంది. నల్ల రేగడి భూములున్నా పంటలు పండే అవకాశం లేకపోయింది. మొదటి దశలో నా నియోజకవర్గం పరిధిలో 40 వ్యవసాయ కుంటలు నిర్మించారు. వీటి కింద సుమారు 4 వేల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చింది. రెండో విడతలో 98 కుంటల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. గతంలో ఒకే పంట వచ్చేది. ఇప్పుడు రెండో పంటకు అవకాశం ఏర్పడింది. కూరగాయలు, ఉద్యాన పంటల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. - కన్వర్ లాల్ జీ మీనా, ఎమ్మెల్యే, మనోహర్థానా ఎటు చూసినా పచ్చదనమే గతంలో ఈ ప్రాంతం ఎడారిలా ఉండేది. వర్షం కురిసినా.. క్షణాల్లో దిగువకు వెళ్లి నదిలో కలిసేది. ఇప్పుడు ఎటు చూసినా నీళ్ల కుంటలు.. పచ్చదనమే! తాగునీటికి, వ్యవసాయానికి ఇబ్బంది లేదు. మేకలు, పశువులకు గడ్డి, నీళ్లకు కరువు లేదు. మాకు ఏడాదంతా నీరు అందుబాటులో ఉంటుంది. - రతన్‌లాల్, రైతు, హర్నవాడ యజ్ఞంలా చేస్తున్నాం దేశంలోనే అత్యంత దుర్భిక్ష పరిస్థితులు ఉన్న రాజస్థాన్‌లో.. జల స్వయం స్వావలంబన ద్వారా గ్రామీణుల జీవన స్థితిగతులు మార్చేందుకు ఎంజేఎస్ఏ చేపట్టాం. దేశంలోనే ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉండేలా ఈ పథకాన్ని ఓ యజ్ఞంలా నిర్వహిస్తున్నాం. ప్రజలను భాగస్వాములను చేయడంతో పాటు.. జల సంరక్షణకు సంబంధించిన ప్రభుత్వ విభాగాలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చాం. ఉపరితల జల సంరక్షణ, భూ సంరక్షణ, భూగర్భ జల సామర్థ్యం పెంపు, కాలుష్య నివారణ. నీటి లభ్యత పెంచడం, వర్షపు నీరు ప్రవహించే మార్గంలో సూక్ష్మ వ్యవసాయ నీటి నిలువ ట్యాంకుల (ఎంఐటీలు) నిర్మాణం. ఉపరితల జల ప్రవాహాన్ని నిరోధించి.. నీరు ఇంకేలా చేయడం.. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ఎంఐటీ దిగువ ప్రాంతాల్లో చెక్‌డ్యాంల నిర్మాణం, నదులపై చెక్‌డ్యాంలు, బ్యారేజీల నిర్మాణం చేపట్టాం. వ్యవసాయ అవసరాలతో పాటు మిగులు నీటిని దృష్టిలో పెట్టుకుని సూక్ష్మ జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం తదితరాలను మలి దశలో చేపట్టాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం చంబల్, మాహి నదుల పరిధిలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. తర్వాత లూని, వెస్ట్బనాస్, సుక్లి, ఈస్ట్ బనాస్, సబర్మతి, పర్బి పరీవాహక ప్రాంతాల్లో పనులు ముమ్మరం చేస్తాం. ప్రభుత్వ విభాగాలు, ఎన్జీవోలు, కార్పొరేట్ సంస్థలు, మతపరమైన ట్రస్టులు, నాన్ రెసిడెంట్ విలేజర్లు, సోషల్ గ్రూపుల నుంచి నిధుల సేకరించాలని నిర్ణయించాం. తొలి విడతలో సుమారు రూ.100 కోట్లు సేకరించాం. కాంటూరు గుంతలు, ఇంకుడు కుంటలు, వ్యవసాయ కుంటలు నిర్మించి ఝాలావర్ జిల్లాలో క్యాస్రీ నదికి మళ్లీ ప్రాణం పోయడం మా ప్రాథమిక విజయంగా భావిస్తున్నాం. రాష్ట్రంలో నదుల అనుసంధానంపైనా కసరత్తు చేస్తున్నాం. ముఖ్యమంత్రి ఎంజేఎస్ఏ పురోగతి, ఫలితాలపై ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఆశించిన లక్ష్యాన్ని సాధిస్తాం. - శ్రీరాం వెదిరె, ఛైర్ పర్సన్, రాజస్థాన్ రివర్ బేసిన్, వాటర్ రిసోర్సెస్ ప్లానింగ్ అథారిటీ భూగర్భ జలాలు పెరిగాయి గతంలో కొండలు, గుట్టలతో ఈ ప్రాంతం దు మ్మూ, ధూళితో ఉండేది. ప్రభుత్వ చొరవతో కుంటల నిండా నీరు కనిపిస్తోంది. కాంటూరు తవ్వకాలు, కుంటల నిర్మాణంతో మాకు ఉపాధి దక్కింది. నీటినిల్వతో భూ గర్భ జలాలు కూడా మెరుగయ్యాయి. వ్యవసాయ పనులు పెరిగి ఈ సారి కూలీ పనులు కూడా దొరికాయి. - నాథూరాం, రైతు కూలీ, రూప్పురా బల్దియా ఎంజేఎస్ఏ వెనుక తెలంగాణ వ్యక్తి ఈ జలయజ్ఞంలో తెలంగాణకు చెందిన శ్రీరాం వెదిరె కీలక పాత్ర పోషిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఈయన.. రాజస్థాన్ రివర్ బేసిన్, వాటర్ రిసోర్సెస్ ప్లానింగ్ అథారిటీ చైర్మన్ హోదాలో ఎంజేఎస్ఏ అమల్లో కీలక బాధ్యతలు చూస్తున్నారు. బీజేపీ జల వనరుల విభాగం కన్వీనర్‌గా ఉన్న శ్రీరాం.. ప్రస్తుతం కేంద్ర జల వనరుల శాఖ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. తెహ్రీ జలాశయం వద్ద గంగా నది ప్రవాహానికి సంబంధించిన అరైవల్ ప్రాజెక్టులోనూ కీలకంగా పనిచేశారు. కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన అంశాలపై ఆయన పలు పుస్తకాలు రాశారు. తెలంగాణకు చెందిన జల సంరక్షణ నిపుణులు రాకేశ్‌రెడ్డి, జంగారెడ్డి, అఫ్సర్ కూడా ఈ యజ్ఞంలో పాలుపంచుకుంటున్నారు. సజీవ సాక్ష్యం సరోద్ ఝాల్రాపాటన్ పంచాయతీ బ్లాక్ పరిధిలోని సరోద్ గ్రామం ఎంజేఎస్ఏ స్ఫూర్తికి అద్దం పడుతోంది. 2,224 హెక్టార్లలో విస్తరించి ఉన్న సరోద్‌లో 435 కుటుంబాలు ఉండగా.. గతంలో కేవలం 193 హెక్టార్లు మాత్రమే సాగయ్యేది. ఎంజేఎస్‌ఏలో భాగంగా ఇక్కడ 12 ఇంకుడు కుంటలు, 19 వ్యవసాయ కుంటలు నిర్మించడంతో సాగు స్వరూపమే మారిపోయింది. నీటి లభ్యత పెరగడంతో ఈ ఏడాది 328.99 హెక్టార్లలో పంటలు వేశారు. గతంలో నువ్వులు, జొన్న, సజ్జ, మొక్కజొన్న వంటి పంటల సాగుకు పరిమితం కాగా.. ప్రస్తుతం కొత్తిమీర, గోధుమ, పప్పుధాన్యాలు, కూరగాయలు, సోయా పంటల వైపు మొగ్గు చూపారు. బావులు, బోరు బావుల్లో పుష్కలంగా నీరు లభిస్తోంది. సరోద్తోపాటు ఝాలావాడ్ జిల్లాలోని రోజా, ఖేడ్లా, హర్నవాడ తదితర గ్రామాల్లోనూ జలకళ ఉట్టిపడుతోంది. ‘మొక్క’వోని దీక్షతో అంతా ఏకమై.. ఎంజేఎస్ఏ తొలి విడతలో 26 లక్షల మొక్కలు నాటారు. కాంటూరు గుంతలు, చెరువులు, కుంటల గట్లపై జట్రోపా (బయో ఫ్యూయల్), కలబంద, కానుగతోపాటు స్థానిక అవసరాలకు అనుగుణంగా మొక్కలు నాటారు. ప్రతీ 150 నుంచి 200 మొక్కలకు ఒక సంరక్షకుడిని నియమించి.. ప్రతీ నెలా రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వేతనం అందిస్తున్నారు. రెండో దశలో 70 వేల నుంచి కోటి మొక్కలు నాటి.. ఐదేళ్ల పాటు సంరక్షించేందుకు నిధులు కేటాయించారు. మరోవైపు సీఎం వసుంధర తన అరు నెలల వేతనాన్ని విరాళంగా ప్రకటించగా.. విరాళాలు, శ్రమదానం రూపంలో ప్రజలు కూడా ఎంజేఎస్‌ఏలో భాగస్వాములయ్యారు. ప్రజా ప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు రూ.55 కోట్లు, వివిధ వర్గాలు రూ.37 కోట్లు నిధులు సమకూర్చాయి. ఆర్మీ, పోలీసు, మీడియా సంస్థలు, మత సంస్థలు శ్రమదానంలో పాల్గొనడంతో పాటు.. లేబర్, జేసీబీ మెషీన్లు, డీజిల్, సిమెంట్, కాంక్రీట్ తదితరాల రూపంలో విరాళం ఇచ్చారు. భూమి ధరకు నాలుగింతల పరిహారం జల వనరుల అభివృద్ధి కోసం 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూములను సేకరిస్తున్నారు. కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ పరిహారాన్ని నిర్ణయిస్తుంది. భూమి ధరకు అదనంగా 3.5 నుంచి 4 రెట్లు పరిహారం ఇస్తుండగా.. ఇందులో 75 శాతాన్ని ముందే చెల్లిస్తున్నారు. భూమి స్వాధీనం చేసుకున్న తర్వాత చెల్లింపులకు 12 శాతం వడ్డీ ఇస్తున్నారు. పరిహారం తీసుకోని రైతులకు.. జల వనరుల్లో నీరు లేని సమయంలో సాగు చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ఒక్కో ఎకరాకు సగటున సుమారు రూ.8.05 లక్షల పరిహారం లభిస్తోంది. భూ సేకరణలో కోర్టు కేసులు, అభ్యంతరాలు రాలేదని అధికారులు చెప్పడం విశేషం. -
పెద్దచెరువుకు జలకళ
సత్ఫలితాలనిచ్చిన ‘మిషన్ కాకతీయ’ హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు గజ్వేల్‌రూరల్ : ‘మిషన్ కాకతీయ’తో చెరువులన్నీ జలకళతో పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నాయి. చెరువుల మరమ్మతుతో వాటికి పూర్వ వైభవం తెచ్చే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ కాకతీయ’తో వర్షాలకు చెరువులన్నీ నిండుకుండలా మారాయి. సీమాంధ్ర పాలనలో వట్టిపోయిన చెరువులన్నీజలకళతో సంతరించుకునేలా ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్ డివిజన్‌లోనే రెండవ అతి ‘పెద్దచెరువు’గా పేరుగాంచిన మండల పరిధిలోని అహ్మదీపూర్ గ్రామంలోని ‘పెద్ద చెరువు’జలకళను సంతరించుకుంది. ఇటీవలే మిషన్ కాకతీయలో భాగంగా ‘పెద్ద చెరువు’పూడికతీతతో పాటు అదనపు నిధులతో మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు పనులు చేపట్టారు. చెరువుల పునరుద్ధరణలో భాగంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 36 లక్షల నిధులు వెచ్చించగా మరోసారి పెద్ద చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి పరుస్తూ మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు అదనపు నిధులను మంజూరు చేసింది. 624 ఎకరాల ఆయకట్టు కలిగిన పెద్ద చెరువు పరిసర ప్రాంతాల బీడుభూములకు ఈ వర్షాల వల్ల మేలు చేకూరనుంది. అంతేగాకుండా రూ. 5.73కోట్ల అదనపు నిధులతో పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు, చెరువు కట్ట వెడల్పుతో పాటు కట్టమీద వెలిసిన దేవాలయాలకు మరింత దార్శనిక కేంద్రాలుగా మార్చేందుకు అభివృద్ధిచేస్తున్నారు. కాగా గత మూడేళ్ల లో ఎన్నడూలేని విధంగా రెండుమూడు రోజుల క్రితం కురిసిన వర్షాలకు పెద్ద చెరువు 40శాతం నిండుకుంది. ఈ వర్షాలతో ఆయకట్టు భూముల్లో సాగుచేసిన పంటలకు ఢోకా ఉండదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ వల్ల తమ చెరువుకే కొత్త ఆందాలు వస్తున్నాయని సంతోషం వెలిబుచ్చుతున్నారు. -
నీటమునిగిన బీరంగూడ కాలనీ
పటాన్చెరు: బీరంగూడలోని అనేక కాలనీల్లో రోడ్లపై వరదనీరు పొంగిపోర్లింది. బుధవారం ఉదయం నుంచి ప్రారంభమైన కుండపోత వర్షంతో రోడ్లన్నీ జలమయం కాగా అనేక కాలనీల్లో జనజీవనం కొద్దిసేపు స్తంభించిపోయిందనే చెప్పాలి. మంగళవారం రాత్రి నుంచి వర్షం కురిసింది. అయితే ఉదయం గంటపాటు కుండపోత వర్షం పడింది. దాంతో అమీన్పూర్ ప్రాంతంమంతటా లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతొ ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. బీరంగూడలోని సాయికాలనీ. సాయిబగవాన్ కాలనీలో రోడ్లపై రెండు, మూడు అడుగుల లోతు నీరు పొంగిపోర్లింది. రోడ్లన్నీ వరదనీటితో నిండిపోవడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి నీరు చేరింది. బీరంగూడ గుట్ట కింది భాగంలో ఉన్న కాలనీల్లోని అపార్టుమెంట్లలోని సెల్లార్ ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. పార్కుచేసి ఉన్న కార్లు ఇతర వాహానాలను బయటకు తీయలేక చాలా మంది కార్మికులు విధులకు వెళ్లలేకపోయారు. ఆయా కాలనీలకు వచ్చి వెళ్లే పరిశ్రమల, పాఠశాలల బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. బీరంగూడకు దాదాపు 50 పాఠశాలలకు చెందిన బస్సులు నిత్యం విద్యార్థులను ఆయా పాఠశాలలకు తీసుకపోతాయి. కొండాపూర్, హైటెక్ సిటీలకు దగ్గరలోని అనేక కారొరేట్ పాఠశాలల బస్సులు బీరంగూడ ప్రాంతంలో ఉదయం కదలలేకపోయాయి. దాదాపు అరగంట ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరాయి. కూలీలు, ఇతర కార్మికులు తమ విధులకు వెళ్లేందుకు నానా అవస్థలు పడ్డారు. కాంట్రాక్టు కార్మికులు ఆటోల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉండగా గంట సేపు కురిసిన వర్షానికి వారు తమ విధులకు చేరలేకపోయారు. జాతీయ రహాదారిపై కూడ ట్రాఫిక్ జామ్ అయ్యిందనే వార్తలతో చాలా మంది తమ ఇళ్లను విడిచి బయటకు రాలేకపోయారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు మాత్రమే వర్షం పడింది. కిష్టారెడ్డిపేట, బీరంగూడ రోడ్డుపై కూడ వర్షం కారణంగా ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. రాఘవేంద్ర కాలనీ, వందనపురి కాలనీలో రోడ్లన్నీ మట్టివే కావండంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. రోడ్లపై ఏర్పడ్డ పెద్ద గొయ్యిల్లో నీరు నిలిచిపోవడంతో కుంటల్లా మారాయి. -
రహదారులేవో..? వాగులేవో?
-
పొంగి పొర్లుతున్న వాగులు
* గుంటూరు– మాచర్ల రహదారిలో రాకపోకలు డైవర్షన్ * వాహనదారులకు సూచనలు చేసిన పోలీసులు * ఆగుతూ సాగుతూ సాగిన వాహనాల రాకపోకలు సత్తెనపల్లి: నియోజకవర్గంలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురవడంతో లోలెవల్ చప్టాలు పొంగి పొర్లుతున్నాయి. గుంటూరు – మాచర్ల రహదారిలోని బసవమ్మ వాగు, రాజుపాలెం మండలం అనుపాలెం వద్ద గల లోలెవల్ చప్టాలపైగా వర్షపు నీరు మోకాలు లోతు పైనే ప్రవహించడంతో సోమవారం కొద్దిసేపు రాకపోకలను నిలిపి వేశారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయి పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురవడం, బసవమ్మ వాగు లోలెవల్ చప్టా వద్ద ఇద్దరు ద్విచక్ర వాహనదారులు పడి ప్రమాదం నుంచి బయట పడటంతో స్పందించిన పోలీసులు చప్టాల వద్ద కాపలా ఉండి వాహనాల రాక పోకలను గమనిస్తూ సూచనలు చేశారు. పట్టణంలోని బసవమ్మ వాగు లోలెవల్చప్టా వద్ద అర్బన్ ఎసై ్స నక్కా ప్రకాశరావు, ఏఎసై ్స వీరభాస్కరరావు, ఆరుగురు పోలీసు కానిస్టేబుళ్ళు విధులు నిర్వహించి ఒకవైపు మాత్రమే లోలెవల్ చప్టాపైగా వాహనాలు రాక పోకలు సాగించేలా చేశారు. మాచర్లవైపు వెళ్ళే వాహనాలను పట్టణంలోని నరసరావుపేట రోడ్డులోని చెక్‌పోస్టు వద్ద పోలీసులు డైవర్షన్ చేసి వాహనాలను నరసరావుపేట వైపు పంపారు. ఇదిలా ఉంటే ఎక్కువ మంది చప్టాల వద్ద వాహనాలు దిగి చప్టా దాటే వరకు నడిచే ప్రయత్నం చేశారు. పలు కళాశాలలకు వెళ్ళాల్సిన విద్యార్థులకు కాలినడక తప్పలేదు. -
రామప్ప.. రక్షణ లేదప్పా!
- ఆలయం పైకప్పు నుంచి కారుతున్న వర్షపునీరు - చారిత్రక సంపదపై అధికారుల నిర్లక్ష్యం - ఇలాగే వదిలేస్తే ఆలయాలు కూలిపోయే ప్రమాదం వెంకటాపురం, గణపురం : ఎంతో ప్రఖ్యాతి గాంచిన కాకతీయులు నిర్మించిన ఆలయాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. పైకప్పులు దెబ్బతిని చిన్న వర్షానికే నీటితో నిండిపోతున్నాయి. ఈ చారిత్రక సంపదను పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయం నిర్మించి 803 ఏళ్లు దాటుతున్నా శిల్పాలు చెక్కుచెదరలేదు. కానీ కొంతకాలంగాఆలయ పైకప్పు నుంచి వర్షపు నీరు ధారలుగా కారుతోంది. దీంతో ఆలయం బీటలు వారుతోంది. గతంలో ఇలా జరగడంతో 1992లో ఆరు అంగుళాల మందం సిమెంట్‌తో స్లాబ్ వేయించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. తిరిగి 2010 నుంచి ఆలయంలో వర్షపు నీరు కారుతున్నా అధికారులు పట్టించుకోలేదు. దీనిపై ‘సాక్షి’లో వచ్చిన కథనాలతో స్పందించిన పురావస్తుశాఖ అధికారులు రామప్ప ఆలయ పైకప్పు పునర్నిర్మాణానికి 2014 డిసెంబర్లో ప్రతిపాదనలు పంపారు. దాంతో కేంద్ర ం రూ.23లక్షలు మంజూరు చేసింది. ఆ నిధులతో 2015 ఫిబ్రవరి 5న పైకప్పు పునర్నిర్మాణ పనులు ప్రారంభించి.. అంతకు ముందు వేసిన సిమెంట్ పొరను తొలగించారు. తర్వాత తాత్కాలికంగా టార్పాలిన్ కప్పి చేతులు దులుపుకొన్నారు. తర్వాత ఏడాది కూడా పనులు మొదలుపెట్టినా తూతూ మంత్రంగా పూర్తి చేశారు. తాజాగా ఆలయంలో మళ్లీ వర్షపు నీరు కారుతోంది. దీనిపై అధికారులకు సమాచారమిచ్చినా ఆలయూన్ని పరిశీలించేందుకు ఎవరూ రాకపోవడం గమనార్హం. ఈ వర్షాకాలం గడిచేవరకు రామప్ప ఆలయంపై మళ్లీ టార్పాలిన్ కప్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రోజులుగా ఆలయ పైకప్పు నుంచి నీరు కారుతూ చిత్తడిగా మారి.. భక్తులకు ఇబ్బంది ఎదురవుతోంది. పురాతన కట్టడమైన రామప్ప ఆలయ పైకప్పు లీకేజీలు అరికట్టకపోతే ఆలయ శిల్పాలు దెబ్బతింటాయని, ఆలయం కూలిపోయే ప్రమాదం ఉంటుందని పేర్కొంటున్నారు. ఇక గర్భగుడిలోని సోమసూత్రం మూసుకుపోవడంతో అభిషేకాల నీరు, శివలింగాన్ని శుద్ధి చేసే నీరు గర్భగుడిలోనే నిలిచి ఇంకిపోతోంది. దీంతో ఆలయంలోని రామలింగేశ్వరుడు ఒకవైపు ఒరిగిపోతున్నాడు. పూజారులు సైతం మహాశివరాత్రి మినహా మిగతా రోజుల్లో చిలకరింపు అభిషేకాలే చేస్తుండడం గమనార్హం. సోమసూత్రం మూసుకుపోవడంతో ఇలా చిలకరింపు అభిషేకాలు చేస్తున్నట్లు ఆలయ పూజారులు చెబుతున్నారు. గణపేశ్వరాలయానిదీ అదే దుస్థితి వరంగల్ జిల్లా గణపురంలో కాకతీయుల కళా వైభవానికి చిహ్నంగా నిలిచిన గణపేశ్వరాలయంలోనూ వర్షపు నీరు కారుతోంది. నాలుగేళ్ల కింద కేంద్ర పురావస్తు శాఖ నుంచి రూ.2.75 కోట్లు మంజూరైనా దేవాలయం పైకప్పునకు మరమ్మతులు చేయలేదు. ఆ నిధుల్లో నుంచి రూ.75 లక్షలతో హరిత హోటల్ నిర్మించారు. మిగతా నిధులతో ప్రధాన ఆలయం పునర్నిర్మాణ పనులకు 2014 ఆగస్టు 8న శంకుస్థాన చేశారు. కానీ ఆ పనులు ముందుకు కదలలేదు. దాంతో ప్రతి వర్షాకాలంలో ఆలయంలోకి నీరు చేరుతున్నాయి. శిఖర భాగంలో పగులు ఉండటంతో చిన్న వర్షానికి కూడా దేవాలయం నీటితో నిండిపోతోంది. దీంతో దేవాలయ పరిరక్షణ కమిటీ ఏటా టార్పాలిన్లను కొనుగోలు చేసి దేవాలయ గోపురంపై కప్పుతోంది. ఈసారి కూడా ఇటీవలే రూ.16 వేల ఖర్చుతో టార్పాలిన్లను కొనుగోలు చేసి కప్పారు. శివలింగానికి పైన రెండు గొడుగులు పెట్టారు. -
నిండుడు.. అలుగు పోసుడు..
1,207 చెరువులకు జలకళ ప్రాజెక్టుల్లోకి చేరుతున్న వర్షపు నీరు ‘మిషన్’ పనులకు తాత్కాలిక బ్రేక్ ఖమ్మం అర్బన్ : నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువుల్లోకి కొత్త నీరు చేరుతోంది. కొన్ని చెరువులు నిండుతుండగా.. మరికొన్ని అలుగు పోస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 4,517 చెరువులు ఉండగా.. బుధవారం నాటికి అధికారిక లెక్కల ప్రకారం 1,207 చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. 1,846 చెరువుల్లోకి 25 శాతం మేర నీరు చేరింది. 25 శాతం నుంచి 50 శాతం వరకు చేరిన చెరువులు 435, 50 నుంచి 75 శాతం మేర నీరు చేరిన చెరువులు 455, 75 శాతం నుంచి 100 శాతం 574 చెరువుల్లోకి నీరు చేరింది. వర్షాల వల్ల మిషన్ కాకతీయ రెండో విడత పనులకు బ్రేక్ పడింది. రూ.29792.30లక్షల అంచనాతో మొత్తం 962 చెరువులకు ప్రభుత్వం ఈ ఏడాది అనుమతులు ఇచ్చింది. వాటిలో 916 చెరువుల్లో పనులు మొదలుపెట్టగా.. వాటిలో 166 చెరువుల పనులు పూర్తయినట్లు, 750 చెరువుల్లో పనులు తుది దశకు చేరుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో చెరువు అలుగు స్థాయిలోకి నీరు చేరితే ఇక ఈ ఏడాది పునరుద్ధరణ పనులు నిలిచినట్లే. -
పొంచి ఉన్న ప్రమాదం
వ్యాధుల కాలం వచ్చేసింది ఖాళీ స్థలాల్లో నిలుస్తున్న నీరు పట్టించుకోని అధికారులు వర్ధన్నపేట : ఎండలతో ఉక్కిరిబిక్కిరిగా గడిపిన ప్రజలకు ఇటీవల కురుస్తున్న వర్షాలు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఈ వర్షాలతో వాతావరణం చల్లబడినప్పటికీ వ్యాధులు మాత్రం పొంచి ఉన్నాయి. వర్షపు నీరు నివాస గృహాల మధ్య ఉన్న ఖాళీ స్థలాల్లోకి వచ్చి చేరుతుండడంతో దోమలు, ఈగల ఉధృతి ఎక్కువై సీజనల్ వ్యా ధులు ప్రబలే ప్రమాదం ఉంది. గ్రామాల్లో నెలకొన్న పారి శుద్ధ్యంతో సీజనల్ వ్యాధులపై ఆందోళన పెరుగుతోంది. లోపిస్తున్న పారిశుద్ధ్యం వర్షాకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ పంచాయతీ అధికారులు పారిశుద్ధ్య నిర్వహణకు పూర్తిస్థాయి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. చినుకు పడితే చిత్తడిగా మారుతున్నాయి. మండలంలోని కొత్తపెల్లి, కట్య్రాల, ల్యాబర్తి, నందనం, బండౌతపురం, రాంధాన్తండా, డీసీతండాల్లో బురదనీరు రోడ్లపై చేరుతోం ది. ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణిం చడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వ్యాధులు ప్రబలే అవకాశం.. డ్రైయినేజీలు అస్తవ్యస్తంగా ఉండడం మూలంగా వర్షపు నీటితో చెత్తాచెదారం చేరుకుని వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం వర్షపు నీరు చెరువులు, కుంటలు, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చేరుతున్నాయి. వర్ధన్నపేట, ల్యాబర్తి, కట్య్రాల గ్రామాల్లో పైప్‌లై న్ల లీకేజీతో వర్షపు నీరు తాగునీటిని కలుషితం చేస్తున్నాయి. వాటర్‌ట్యాంకుల క్లోరినేషన్ చేసిన దాఖలాలు కనిపించడం లేదు. వేధిస్తున్న కార్యదర్శుల కొరత మండలంలోని 24 గ్రామాల పర్యవేక్షణకు 13 మంది కార్యదర్శులు అందుబాటులో ఉన్నారు. ఒక్కో కార్యదర్శికి రెండు గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకున్నారు. కార్యదర్శుల పని ఒత్తిడితో పూర్తిస్థాయిలో పర్యవేక్ష ణ కరువైంది. గ్రామాల్లో పరిస్థితి సాధారణంగా ఉండగా, శివారు తండా ల్లో పారిశుధ్యం క్షీణించింది. పాటించాల్సిన జాగ్రత్తలు వర్షాకాలంలో కలుషిత నీటిని తాగకుండా ఉండాలి.వేడిచేసి చల్లార్చిన నీటిని తీసుకోవాలి.రాత్రి వేళల్లో దోమల బారి నుంచి రక్షించుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి.విషజ్వరాలు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉండడంతో జ్వరం సూచనలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాం. గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్‌లను నిర్వహిస్తున్నాం. వచ్చే నెల 2 వరకు అన్ని గ్రామాల్లో పర్యటి ంచి పారి శుద్ధ్య పనులను పూర్తిచేస్తాం. డ్రైనేజీ కాలువలు, నీరు నిల్వ ఉండే అవకాశం ఉన్న ప్రదేశాల్లో బ్లీచింగ్ చేస్తాం. - శంకర్, ఈవోపీఆర్డీ -
ఇంకుడు కొంతే
{పచారం కొండంత... చేసింది గోరంత లక్ష ఇంకుడు గుంతల లక్ష్యం తవ్వింది 17,820 గుంతలే వాననీటిని ఒడిసిపట్టే ఉద్దేశంతో ప్రారంభించిన ఇంకుడుగుంతల తవ్వకం జిల్లాలో లక్ష్యాన్ని చేరుకోలేదు. కేవలం ప్రచారార్భాటానికే పరిమితమైన ఈ పథకం కేంద్రం సొమ్ముతో రాష్ట్రం పబ్లిసిటీ సోకుకు ఉపకరించింది. జిల్లాలో లక్ష గుంతలు తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం రూ. 124.76 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఒక్క పైసా కూడా విదల్చకుండా అన్నింటికి ఒకటేమందు అన్నట్లుగా కల్పతరువులా మారిన ఉపాధి హామీ సొమ్మును ఇందుకు వినియోగించారు. సాక్షి, విశాఖపట్నం: ‘ఇంకుడు గుంతలు తవ్వండి..వర్షపు నీటిని ఒడిసిపట్టండి.. భూగర్భ జలాలను పరిరక్షించండి..’ ఇది రాష్ర్ట ప్రభుత్వం పిలుపు. ఈ కార్యక్రమం కోసం చేసిన ఆర్భాటం అంతా ఇంతా కాదు. ఊరూ..వాడా ఊదరగొట్టేలా ప్రచారం చేశారు. గునపం పట్టుకుని, నెత్తినతట్ట పెట్టుకుని ఫొటో దిగడం..పత్రికల్లో గొప్పగా ఏదో సాధించామంటూ ప్రచారం చేసుకోవడం వేసవిలో ఎక్కడ చూసినా ఇదే దృశ్యాలు. ఏ పేపర్ తిరగేసినా ఇవే ‘సిత్రాలు’. సొమ్మొకడిది..సోకు మరొకరిది అన్నట్టుగా సొమ్ము కేంద్రానిది సోకు రాష్ర్ట ప్రభుత్వానిది అన్నట్లుగా సాగింది. ఆచరణలోకి వచ్చి చూస్తే మాత్రం ప్రచారం కొండంత..సాధించింది గోరంత అన్నట్టుగా ఉంది ఇంకుడుగుంతల పథకం. గడిచిన వేసవి సీజన్లో జిల్లాలో ఈ గుంతల ఉద్యమం జోరుగా సాగింది. ఒక్క మన జిల్లాలోనే లక్ష గుంతలు తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం రూ. 124.76 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఒక్క పైసా కూడా విదల్చకుండా అన్నింటికి ఒకటేమందు అన్నట్లుగా కల్పతరువులా మారిన ఉపాధి హామీ సొమ్మును ఇందుకు వినియోగించాలని నిర్ణయించారు. ఏప్రిల్‌లో తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని మే నెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. జూన్‌లో పడే తొలకరి వర్షాలను వడిసిపట్టాలని..తద్వారా భూగర్భ జలాలను పెంపొందించాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. కానీ సాధించింది మాత్రం అంతంతమాత్రమే. -
ఔరా! వర్షం నీళ్లలో వెంకన్న ఆలయమా!
- మూసుకుపోయిన పాతతూములు - మరమ్మతులకు సాహసించని టీటీడీ తిరుమల : చినుకు రాలితే అందరికీ సంతోషమే. అదే చినుకు తిరుమల వెంకన్న ఆలయంపై రాలితే టీటీడీ అధికారులు పరుగులు తీస్తుంటారు. ఆలయంలోని పురాతన తూములు పూడిపోయి నీరు నిలిచిపోవడమే ఇందుకు కారణం. దీనిపై టీటీడీ తర్జనభర్జన పడుతోంది. 2 వేల సంవత్సరాల పూర్వం ఆలయ నిర్మాణం శ్రీవారి ఆలయ విస్తీర్ణం 2.20 ఎకరాలు. తూర్పు, పడమర 414, ఉత్తర, దక్షిణంగా 263 అడుగులు. మొత్తం 1354 అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. పురాణాల ప్రకారం ఆలయాన్ని ఐదువేల యేళ్లకు ముందు తొండమాన్ చక్రవర్తి నిర్మించినట్టు ఉంది. టీటీడీ చారిత్ర ఆధారాలు, శిలాశాసనాల ప్రకారం రెండు వేల సంవత్సరాల ముందు ఆలయ నిర్మాణం జరిగినట్టు తెలుస్తోంది. ఇందులో వెయ్యి సంవత్సరాల వరకు గర్భాలయం ప్రాకారం, 11వ శతాబ్దంలో ఆనంద నిలయ ప్రాకారం, 12వ శతాబ్దంలో సంపంగి ప్రకారం, వెండివాకిలి గోపురం, 13వ శతాబ్దం తర్వాత మహద్వార గోపుర,ప్రాకార, నిర్మాణాలు జరిగాయి. పురాతన తూములు పూడిపోయాయా? ఆలయ నిర్మాణంలో శిల్పులు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రత్యేకంగా నీటి వ్యవస్థకోసం తూములు నిర్మించారు. వాస్తురీత్యా ఉత్తర ఈశాన్య దిశలోని ఆనంద నిలయం ప్రాకారంలోని యోగనృసింహస్వామి ఆలయం పక్క నుంచి వెండివాకిలి ప్రాకారం వద్ద, ఐనా మహల్ ముందుభాగం నుంచి మహద్వార ప్రాకారం వద్ద ఉన్న గొల్ల మండపం ముందు వరకు తూములు నిర్మించారు. అయితే, 14 వ శతాబ్దం తర్వాత ఆలయం ఎన్నెన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. సరికొత్త నిర్మాణాలు వెలిశాయి. మహంతుల కాలంతో పాటు టీటీడీ ఏర్పడిన తర్వాత ఆలయంలో సహజసిద్ధంగా ఉండే మట్టి, రాతి బండలపై క్రమంగా గ్రానైట్ బండలు అమర్చటం పెరిగింది. దీనివల్ల తూముల్లో నిర్మాణాల కారణంగా ఏర్పడిన వృథా, రాళ్లు, గోనె సంచులు పేరుకుపోయాయని నిపుణుల చెబుతున్నారు. వాటితోపాటు నిత్యం ఆలయంలో తయారు చేసే అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల వృథా కూడా ఈ తూముల్లో పేరుకుపోయిందని చెబుతున్నారు. నాలుగేళ్లుగా ఆలయంలో నిలుస్తున్న వర్షపు నీరు ఆలయంలో నిత్యంవాడే నీరు తూముల గుండా వెలుపలకు ప్రవహిస్తోంది. భారీ స్థాయిలో వర్షం వస్తే చాలు యోగనృసింహస్వామి ఆలయం, ఐనా మహల్ ముందు వర్షం నీరు మోకాటిలోతులో నిలుస్తున్నాయి. నాలుగేళ్లుగా ఈ సమస్య ఉంది. తూముల్లో వృథా పేరుకుపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోంది. దీన్ని అధిగమించేందుకు నాలుగు మోటార్లు అమర్చారు. వీటికి ప్రత్యేక పైపులైనుతో ప్రాకారాలపై నుంచి వెలుపల డ్రైనేజీలోకి తరలిస్తున్నారు. అయితే మోటార్లు మోరాయించినపుడు, మరమ్మతులకు గురైన సందర్భాల్లో పరిస్థితి తీవ్రమవుతూ నీరు నిలిచిపోతోంది. మరమ్మతులకు సాహసించని ఇంజనీర్లు పురాతన తూములు మరమ్మతులు చేయాలంటే అదనంగా అమర్చిన గ్రానైట్ రాతి బండల్ని తప్పక తొలగించాల్సి ఉంటుంది. దీనిపై టీటీడీ ఇంజనీర్లు నాన్చుతున్నారు. మరమ్మతు పనులపై ఏమాత్రం చొరవ చూపటం లేదు. భక్తుల మనోభావాలతో కూడిన నిర్మాణం పనుల్లో రాతి బండల్ని తొలగించే సందర్భంలో ఏమైనా జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు? అన్న ధోరణి వారిలో ఉంది. సమీక్షిస్తాం..అవసరమైతే పూడిక తీయిస్తాం పెద్ద వర్షం వస్తే నీళ్లు నిలుస్తుందన్న మాట వాస్తమే. నేను కూడా స్వయంగా పరిశీలించాను. నిపుణులతో సమీక్షిస్తాను. అవసరమైతే తూముల్లో పేరుకుపోయిన పూడిక తీసే పనులు చేయిస్తాం. - టీటీడీ ఈవో సాంబశివరావు -
కోతిబావా.. చిక్కవా!
జూ ఎన్‌క్లోజర్ నుంచి బయటికి వెళ్లిన అరుదైన కోతులు హైదరాబాద్: నెహ్రూ జూలాజికల్ పార్కులో అధికారుల నిర్లక్ష్యం కారణంగా స్క్విరెల్ కోతులు ఎన్‌క్లోజర్ నుంచి బయటికి వెళ్లిపోయాయి. ఎన్‌క్లోజర్‌లో కోతులు లేకపోవడంతో సందర్శకులు యానిమల్ కీపర్లను ప్రశ్నించారు. దీంతో సిబ్బంది జూ అధికారులకు సమాచారం అందించారు. అరుదైన ఈ స్క్విరెల్ మంకీలు 200-260 గ్రాముల బరువు మాత్రమే ఉం టాయి. ఉడుత సైజులో చిన్నగా ఉండే ఈ కోతులు చెట్ల వెనకాల చేరితే గుర్తించడం కష్టం. ఈ కోతుల ఎన్‌క్లోజర్ పైభాగం ఓపెన్‌గా ఉండటం... చుట్టూ చెట్లు ఉండటంతో బయటికి జంప్ చేసి ఉంటాయని జూ అధికారులు పేర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా ఈదురు గాలులతో భారీగా వర్షాలు కురుస్తున్నా జూ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఎన్‌క్లోజర్‌లోని మోడ్‌లో వర్షపు నీరు నిండిపోవడంతో కోతు లు అందులో ఈదుతూ అందిన చెట్టు కొమ్మలను పట్టుకొని బయటికి వచ్చాయి. ఎన్‌క్లోజర్ నుంచి బయటికి వె ళ్లిన మంకీలు ఎల్లో టైగర్ ఎన్‌క్లోజర్ చెట్లపైన ఉన్నట్లు జూ అధికారులు గుర్తించారు. వీటిని పట్టుకునేందుకు ఎన్‌క్లోజర్‌లో ఇనుప జాలీల బోన్‌ను ఏర్పాటు చేశారు. -
వానలోనూ సౌరవిద్యుత్
బీజింగ్: సూర్య కాంతితోపాటు వర్షపు నీటి బిందువుల నుంచి కూడా విద్యుత్తును ఉత్పత్తి చేసే సౌరఘటాలను చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వర్షాకాలంలో తక్కువ సూర్యకాంతి వల్ల ప్రస్తుతం వాడుతున్న సౌరఘటాలు విద్యుత్తును ఉత్పత్తి చేయలేవు. ఓషన్, యానాన్ నార్మల్ వర్సిటీ పరిశోధకులు తయారు చేసిన సౌరఘటాలతో దీన్ని అధిగమించొచ్చు. కర్బన మూలకాలకు చెందిన ‘గ్రాఫేన్’ వాడి వీటిని తయారు చేశారు. విద్యుత్తుకు వాహకమైన గ్రాఫేన్పై వర్షపు నీరు పడినప్పుడు ధనావేశం ఉన్న అయాన్లు, ఎలక్ట్రాన్ల మధ్య బంధం ఏర్పడుతుంది. దీన్ని అనుసరించి గ్రాఫేన్ ఎలక్ట్రోడ్లను వాడి, నీటి బిందువుల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. -
చెన్నై అష్ట దిగ్బంధం
-
నెల్లూరు హైవేపై నిలిచిపోయిన రాకపోకలు
-
నెల్లూరు హైవేపై నిలిచిపోయిన రాకపోకలు
ఆత్మకూరు రూరల్: నెల్లూరు-ముంబాయి ప్రధాన రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆత్మకూరు మండలం వాసిలి వద్ద చెరువు నిండిపోవడంతో హైవేపైకి భారీగా వరద చేరుకుంది. దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఉదృతి తగ్గితే గానీ, సహాయక చర్యలు చేపట్టేందుకు వీలులేని పరిస్థితి నెలకొందని అధికారులు తెలిపారు. -
ఈ నగరానికి ఏమైంది..?
హైదరాబాద్: ఉదయం లేవగానే.. పిల్లలను స్కూల్‌కు ఎలా పంపాలని తల్లిదండ్రులు.. ఆఫీసుకు ఎలా వెళ్లాలని ఉద్యోగులు.. వ్యాపారం సాగేదెలా అని తోపుడుబండ్ల వ్యాపారస్తులు.. ఇలా ఎంతోమందికి బెంగ. ఇక సాయంత్రమైతే ఇంటికి ఎప్పుడు చేరుకుంటామా అనే ధ్యాస. హైదరాబాద్‌లో గత వారం రోజులుగా ఇదే పరిస్థితి. వీటంతటికీ కారణం విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలే. నాలుగు గంటలకే కారు మబ్బులతో చీకటి అలుముకుంటోంది. కాసేపు ఎండ.. తర్వాత భారీ వర్షాలు, రాత్రయితే విపరీతమైన చలి.. ఒకే సీజన్లో మూడు సీజన్ల వాతావరణాన్ని చూడాల్సి వస్తోంది. నగరాన్ని ఎడతెరిపి లేకుండా వర్షాలు ముంచెత్తుతున్నాయి. జనజీవితాన్ని స్తంభింపజేస్తున్నాయి. ఓ వైపు ట్రాఫిక్ జామ్.. మరో వైపు రోడ్లు జలమయం అవుతుండటంతో హైదరాబాదీలు అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలతో పాటు.. రోడ్లన్నీ కూడా జలమయమవుతున్నాయి. భూ ఉపరితలంపై ఏర్పడ్డ ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్లో వర్షపాతం తక్కువగా ఉండటంతో తీవ్ర నిరాశకు గురైన రైతులకు మాత్రం ఇది శుభవార్త. మరోవైపు నదుల్లోకి వరద నీరు వస్తుండటంతో తాగు, సాగు నీటికి కష్టాలు తొలగుతాయని సంతోషం. వర్షాలు పడటం సమస్త మానవాళికి ఉపయోగరకరమే. అయితే హైదరాబాద్‌లో ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి. చినుకు పడితే చాలు.. నగరవాసికి చింతలే. ఓ మోస్తరు వర్షం కురిస్తేనే కష్టాలు తప్పవు. అలాంటిది గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనం అల్లాడిపోతున్నారు. గత నాలుగు రోజులుగా మధ్యాహ్నం సమయంలో భారీ వర్షం కురుస్తుండటంతో సాయంత్రం నాలుగు గంటలకే నగరంలో చీకటి పడుతోంది. శుక్రవారం వరుణుడి దెబ్బకు హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో కూకటివేళ్లతో సహా చెట్లు కుప్పకూలాయి. సచివాలయంలోని ఎల్ బ్లాక్ వద్ద వాహనాలపై చెట్లు కూలాయి. మరో 24 గంటల పాటు కూడా నగరానికి భారీ వర్షసూచన ఉన్నట్టు వాతావరణ నిపుణులు తెలిపారు. వర్షాల వల్ల వాతావరణం చల్లబడినా.. వాన కష్టాలకు నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. -
వాన.. హైరానా
సాక్షి, హైదరాబాద్: ఉపరితల ద్రోణి ప్రభావంతో మంగళవారం మూడోరోజు కూడా గ్రేటర్ హైదరాబాద్ నగరం తడిసి ముద్దయ్యింది. సాయంత్రం వేళ కురిసిన వర్షంతో పలు ప్రధాన ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలాచోట్ల ప్రధాన రహదారులపై భారీగా వర్షపునీరు నిలిచిపోయి ట్రాఫిక్ భారీగా స్తంభించింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. సోమాజిగూడ, ఖైరతాబాద్, పంజగుట్ట, లక్డీకాపూల్, ఎర్రమంజిల్, అబిడ్స్, నాంపల్లి, కూకట్పల్లి, మెహిదీపట్నం, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురవడంతో మోకాళ్ల లోతున నీరు నిలిచిపోయింది. ఆ నీటిలోనే వాహనాలను ముందుకు కదిలించడానికి నగరవాసులు నానా అవస్థలు పడ్డారు. ఇళ్లల్లోకి నీళ్లు చేరడంతో బస్తీ వాసులు ఇబ్బందులు పడ్డారు. మంగళవారం రాత్రి 8.30 గంటల వరకు నగరంలో 7.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది. పోచంపాడులో 10 సెంటీమీటర్ల వర్షపాతం మరోవైపు రాష్ట్రంలో అనేకచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. గత 24 గంటల్లో నిజామాబాద్ జిల్లా పోచంపాడులో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేటలో 8 సెంటీమీటర్లు, సారంగాపూర్, మిర్యాలగూడ, నిర్మల్‌లో 7 సెంటీమీటర్లు, పరిగి, ఇల్లెందు, కమ్మరపల్లె, కూసుమంచిల్లో 6 సెంటీమీటర్లు, గంగాధర, తల్లాడలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.