
జగన్ కార్యాలయం వద్ద నీటిని శుభ్రం చేçస్తున్న సిబ్బంది
సాక్షి, అమరావతి: కోట్ల ఖర్చుతో వెలగపూడిలో నిర్మించిన సచివాలయం, శాసనసభ భవనాల్లో డొల్లతనం మరోసారి బయటపడింది. మంగళవారం సచివాలయం, శాసనసభ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈపాటి వర్షానికే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చాంబర్‌లోకి మరోసారి వర్షపు నీళ్లు చేరాయి. చాంబర్‌లో సీలింగ్ నుంచి వర్షపు నీరు ధారగా కారుతోంది. ఈ అంశంపై శాసనసభ ఇన్‌చార్జి కార్యదర్శి ఎం.విజయరాజుకు వైఎస్సార్ సీఎల్పీ సిబ్బంది ఫిర్యాదు చేశారు.
ఇన్‌చార్జి కార్యదర్శి ఆదేశాల మేరకు శాసనసభ సిబ్బంది వర్షపు నీటిని ఎత్తిపోశారు. గతేడాది జూన్‌లో కురిసిన వర్షానికి ఇదే రీతిలో ప్రతిపక్ష నేత చాంబర్‌లో వర్షపు నీరు చేరింది. తాజాగా కురిసిన వర్షం కారణంగా ప్రతిపక్ష నేత చాంబర్‌లోనే మళ్లీ లీకేజీలు బయటపడటం గమనార్హం.