సాక్షి, అమరావతి: గ్రామాల్లోని సంప్రదాయ తాగునీటి వనరుల పునరుజ్జీవానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శ్రీసత్యసాయి, అన్నమ య్య, చిత్తూరు, పల్నాడు, వైఎస్సార్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో ఈ పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో వర్షపు నీరు వీలైనంత ఎక్కువ నిల్వ చేసేలా.. నీటి కొలనులు, మంచినీటి చెరువుల వంటి సంప్రదాయ తాగునీటి వనరుల్లో ఉపాధి హామీ పథకం ద్వారా పూడికతీత పనులు చేపట్టబోతోంది.
ఉపాధి హామీ పథకం ద్వారా మొత్తం 8 రకాల పనులు చేపట్టను న్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల భాగస్వామ్యంతో ఆ ప్రాంతాల్లో భూమిలోని తేమ శాతం పెంచేందుకు విస్తృతంగా మొక్కల పెంపకం చేపట్టనున్నారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కేటగిరిలో గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో రూ.240 కోట్లతో ఆయా ప్రాంతాల్లోని ప్రభు త్వ భవనాల వద్ద రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ నిర్మాణం తదితరాలు చేపట్టేందుకు ఆ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
మార్చి 4 నుంచి దేశవ్యాప్తంగా..
ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనుల తరహాలోనే దేశవ్యాప్తంగా మార్చి 4 నుంచి నవంబర్ 30 వరకు ‘జలశక్తి అభియాన్–క్యాచ్ ద రెయిన్ 2023’ పేరుతో కేంద్ర జలశక్తి శాఖ పలు కార్యక్రమాలు నిర్వహించబోతోంది. దేశం మొత్తం మీద నీటి ఇబ్బందులుండే జిల్లాలను గుర్తించి.. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణతో కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మార్చి 4న దీన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నట్టు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఇప్పటికే లేఖలు రాశారు.
మరోవైపు.. కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటరీ శనివారం వీడియో కాన్పరెన్స్ నిర్వహించి ఈ కార్యక్రమ లక్ష్యాలు, ప్రాధాన్యతల గురించి అన్ని రాష్ట్రాల అధికారులకు వివరించారు. కాగా, పట్టణ ప్రాంతాలో సైతం నీటి ఎద్ద డికి అవకాశమున్న ప్రాంతాల్లో.. వార్డు స్థాయిలో వర్షపు నీటిని నిల్వ చేసుకునేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment