పార్లమెంట్‌లో వర్షపు నీరు లీకేజీ!.. కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం | Parliament Building Water Leakage Viral Video: Congress Wants Discussion | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో వర్షపు నీరు లీకేజీ.. కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం

Published Thu, Aug 1 2024 8:53 AM | Last Updated on Thu, Aug 1 2024 9:11 AM

Parliament Building Water Leakage Viral Video: Congress Wants Discussion

పార్లమెంట్‌ భవనంలో వర్షపు నీరు లీకేజీ కావడం.. ఆ వీడియోలు కాస్త నెట్టింటకు చేరడంతో తీవ్ర చర్చ జరుగుతోంది. ఢిల్లీలో నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న వానకు రాష్ట్రపతి ఛాంబర్‌ దగ్గరి లాబీలో పైకప్పు నుంచి నీరు కారుతోంది. అయితే.. ఈ లీకేజీపై పార్లమెంట్‌ నిర్వాహణ అధికారులు స్పందించాల్సి ఉంది. 

మరోవైపు కిందటి ఏడాది మే నెలలో సన్‌సద్‌ భవనం ప్రారంభం కావడం తెలిసిందే. ఈ భవనం.. అందులో హంగుల కోసం 1,000 కోట్ల రూపాయల్ని వెచ్చించారు. అయితే.. ప్రస్తుతం వాటర్‌ లీకేజీ అంశాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్‌ వాటర్‌ లీకేజీ అంశాన్ని సభలో చర్చించాలని భావిస్తోంది. 

ఈ మేరకు.. వాటర్‌ లీకేజీ వీడియోను తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన కాంగ్రెస్‌ ఎంపీ, ఆ పార్టీ విప్‌ మాణిక్కం ఠాగూర్‌.. లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అదే జరిగితే కేంద్ర ప్రభుత్వం దీనికి ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి. 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement