water leakage
-
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో వాటర్ లీక్..
సాక్షి, శ్రీశైలం: శ్రీశైలం డ్యామ్ తెలంగాణ జల విద్యుత్ కేంద్రంలో నీరు లీకేజ్ ఘటన వెలుగు చూసింది. అయితే, డ్యామ్‌కు మాత్రం ఎటువంటి ప్రమాదం లేదని తెలంగాణ జెన్కో అధికారులు చెబుతున్నారు.వివరాల ప్రకారం.. శ్రీశైలం డ్యామ్ తెలంగాణ(ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో నీరు లీకేజ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వరుసగా పంప్ మోడ్ ఆపరేషన్ చేస్తుండటంతో బట్టర్ ఫ్లై వాల్వు వద్ద నీరు లీక్ అవుతున్నట్టు అధికారులు గుర్తించారు. అయితే, నీరు లీకేజీ కారణంగా డ్యామ్‌కు ఎటువంటి ప్రమాదం లేదని జెన్కో అధికారులు తెలిపారు. ఈ క్రమంలో నిపుణులతో చర్చించి నివేదికను రూపొందిస్తామని అధికారులు చెప్పారు. -
పార్లమెంట్లో వర్షపు నీరు లీకేజీ!.. కాంగ్రెస్ వాయిదా తీర్మానం
పార్లమెంట్ భవనంలో వర్షపు నీరు లీకేజీ కావడం.. ఆ వీడియోలు కాస్త నెట్టింటకు చేరడంతో తీవ్ర చర్చ జరుగుతోంది. ఢిల్లీలో నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న వానకు రాష్ట్రపతి ఛాంబర్ దగ్గరి లాబీలో పైకప్పు నుంచి నీరు కారుతోంది. అయితే.. ఈ లీకేజీపై పార్లమెంట్ నిర్వాహణ అధికారులు స్పందించాల్సి ఉంది. మరోవైపు కిందటి ఏడాది మే నెలలో సన్సద్ భవనం ప్రారంభం కావడం తెలిసిందే. ఈ భవనం.. అందులో హంగుల కోసం 1,000 కోట్ల రూపాయల్ని వెచ్చించారు. అయితే.. ప్రస్తుతం వాటర్ లీకేజీ అంశాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ వాటర్ లీకేజీ అంశాన్ని సభలో చర్చించాలని భావిస్తోంది. ఈ మేరకు.. వాటర్ లీకేజీ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ విప్ మాణిక్కం ఠాగూర్.. లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అదే జరిగితే కేంద్ర ప్రభుత్వం దీనికి ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి. Paper leakage outside, water leakage inside. The recent water leakage in the Parliament lobby used by the President highlights urgent weather resilience issues in the new building, just a year after completion. Moving Adjournment motion on this issue in Loksabha. #Parliament pic.twitter.com/kNFJ9Ld21d— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) August 1, 2024 -
మిచౌంగ్: చెన్నై అతలాకుతలం, జనం ఇక్కట్లు, వైరల్ వీడియోలు
తమిళనాడులో మిచౌంగ్ తుపాను ప్రజలను వణికిస్తోంది. భారీ వర్షాలతో ముఖ్యంగా చెన్నై నగరం అతలాకుతలమవుతోంది. ప్రధాన రహదారులన్నీ జలమయ మయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతాయం ఏర్పడింది. ఒకచోట మొసలి రోడ్డుపైకి దృశ్యంతోపాటు, తుపాను బీభత్సానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. రన్‌వేపైకి నీరు చేరడంతో చెన్నై విమానాశ్రయాన్ని కూడా మూసివేశారు. దీంతోపాటు ఎవరూ బయటకు రావొద్దంటూ అధికారులు హెచ్చరించారు. రోడ్లన్నీ వరద నీటితో మునిగిపోవడంతో చెన్నై ప్రజారవాణా వ్యవస్థ అస్తవ్యస్థంగా మారిపోయింది. దీంతో నగర వాసుల ఇబ్బందులు అన్ని ఇన్నీకావు. ఇప్పటికే దేశవ్యాప్తంగా తుపాను ప్రభావిత ప్రాంతాలకు పాక్షికంగా లేదా పూర్తిగా రైళ్ల సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. చెన్నైలోని చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముగ్గురు వ్యక్తులు మరణించారు. చెన్నైతో పాటు మరో మూడు జిల్లాల్లో రేపు ప్రభుత్వ సెలవు ప్రకటించారు. బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. అర్ధరాత్రి సమయంలో తుపాను నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణుల అంచనా. 🌀 #Michaungcyclone Police in action. Rescuing a family from a low lying area in Perumal Koil street, Kotturpuram. Removing the fallen trees. #ChennaiRain #Update@SandeepRRathore@R_Sudhakar_Ips@ChennaiTraffic pic.twitter.com/3hqSMEFr5P — GREATER CHENNAI POLICE -GCP (@chennaipolice_) December 4, 2023 Chennai @Suriya_offl fans on duty! Provided food items and other materials at the affected areas.#ChennaiRains #CycloneMichuang pic.twitter.com/WIseZuk3WH — Suriya Fans Club (@SuriyaFansClub) December 4, 2023 -
అన్నారం బ్యారేజీకి ప్రమాదమేం లేదు!
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం (సరస్వతి) బ్యారేజీలో నీటి లీకేజీ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని బ్యారేజీ ఈఈ యాదగిరి తెలిపారు. బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం లేదని, పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలో ఈ బ్యారేజీని నిర్మించిన విషయం తెలిసిందే. దీని నుంచి నీళ్లు లీకవుతున్నట్టుగా బుధవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై ఈఈ యాదగిరి వివరణ ఇచ్చారు. బ్యారేజీ వద్ద 1,275 మీటర్లతో పొడవుతో సీపేజ్ ఉంటుందని.. దీనికి వార్షిక నిర్వహణ (ఓఅండ్ఎం)లో భాగంగానే పనులు చేస్తున్నామని తెలిపారు. ఏటా సివిల్, మెకానిక్, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఉంటుందని, సీపేజ్ తగ్గినప్పుడు మెటల్, ఇసుక వేస్తున్నామన్నారు. పూర్తి నిర్వహణ బాధ్యత అఫ్కాన్ సంస్థదేనని తెలిపారు. ప్రాజెక్టును ఇలాంటి సమస్యలను తట్టుకునే విధంగానే డిజైన్ చేశామన్నా రు. అవసరమైతే కెమికల్ గ్రౌటింగ్ కూడా చేస్తామన్నారు. కాగా బ్యారేజీ పూర్తి నిల్వ సామర్థ్యం 10.87 టీఎంసీలుకాగా, ప్రస్తుతం 5.75 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. -
వీడియో: వందే భారత్ రైలులో వర్షపు నీరు లీక్.. ప్రయాణికుల ఇక్కట్లు!
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, ఈ రైళ్లు ఇప్పటికే పలు ప్రమాదాల్లో దెబ్బతిన్న విషయం తెలిసిందే. అంతకుముందు జంతువులు ఢీకొనడంతో రైలు ముందు భాగం దెబ్బతిన్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక, తాజాగా వర్షాల నేపథ్యంలో రైలులో వర్షపు నీరు కారడంతో ఆ నీళ్లు బోగీలోకి ప్రవేశించాయి. దీంతో, వర్షపు నీటిని సిబ్బంది టబ్స్‌తో పట్టుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన కేంద్రం కేరళకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోదీ కేరళ రాజధాని తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్లో స్వయంగా పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. తిరువనంతపురం నుంచి కాసర్గోడ్ మధ్య రాకపోకలు సాగించే రైలు ఇది. అయితే, ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో డొల్లతనం బయటపడింది. వర్షాల కారణంగా రైలులోకి వర్షపు నీరు రైలు బోగీల్లో కారింది. కాగా, భారీ వర్షాలకు ఈ రైలు చూరు లీక్ కావడంతో బోగీల్లోకి వర్షపు నీరు ప్రవేశించింది. దీంతో, వర్షపు నీటిని సిబ్బంది టబ్స్‌తో పట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోను కేరళ కాంగ్రెస్.. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. దీనిపై సెటైరికల్ కామెంట్స్ చేసింది. వందే భారత్‌లో ప్రయణికులకు గొడుగులు సప్లై చేసే పరిస్థితి ఏర్పడిందంటూ కామెంట్స్ పెట్టింది. Farewell blankets, hello umbrellas: Vande Bharat redefines comfort. pic.twitter.com/8mTKeaqkYL — Congress Kerala (@INCKerala) June 14, 2023 ఇదిలా ఉండగా.. కిందటి నెలలో కురిసిన భారీ వర్షాలకు ఒకసారి ఈ రైలు టాప్ లీక్ కావడం వల్ల వర్షపు నీరు లోనికి ప్రవేశించిన విషయం తెలిసిందే. అప్పట్లో సిబ్బంది దీనికి మరమ్మతు చేశారు. నీరు లోనికి ప్రవేశించకుండా రబ్బర్ బెండ్స్ అమర్చారు. ఇప్పుడు తాజాగా మళ్లీ అదే తరహా పరిస్థితి కనిపించింది. మరోవైపు.. ఈ ఘటనపై దక్షిణ రైల్వే స్పందించింది. కేరళ లేదా సంబంధిత రైలు సేవలను అందించే ఏ ఇతర దక్షిణాది రాష్ట్రం నుండి ఇలాంటి ఘటనలు జరిగినట్టు తమ దృష్టికి రాలేదని స్పష్టం చేసింది. కేరళలో నడుస్తున్న వందే భారత్‌లో అలాంటి ఘటన జరగలేదు అంటూ ట్విట్టర్లో తెలిపింది. ఇది కూడా చదవండి: బీజేపీకి ఊహించని షాక్.. సీనియర్ నేత ఔట్ -
చిన్న వానే.. యాదాద్రి ప్రధానాలయంలో మరోసారి లీకేజీలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయంలో మరోసారి లీకేజీలు బయటపడ్డాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆలయ మండపాల స్లాబ్‌పై నీళ్లు నిలిచాయి. దీంతో అష్టభుజి ప్రాకార మండపం, బ్రహ్మోత్సవ మండపం, వేంచేపు మండపం, ప్రధానాలయ ముఖమండపంలోని అండాళ్ అమ్మవారి ఆలయం వెనుకున్న గోడ, ఆంజనేయస్వామి ఆలయం వెనక భాగాల్లోని గోడ నుంచి వర్షపు నీరు కారుతోంది. గతంలో వర్షం కురిసిన సమయాల్లో లీకేజీలు ఏర్పడ్డ చోట మరమ్మతులు చేపట్టినా లీకేజీలు అవుతున్నాయి. ఇక మాడ వీధుల్లో అక్కడక్కడా వర్షపు నీరు నిలిచింది. క్యూకాంప్లెక్స్ మూడో అంతస్తులో స్లాబ్ బీమ్ నుంచి వర్షపు నీరు చుక్కలుగా పడుతున్నాయి. కొండపైన ప్రొటోకాల్ కార్యాలయం నుంచి ప్రధానాలయానికి వెళ్లే మార్గంలో ఉన్న మట్టి రోడ్డు సైతం కోతకు గురైంది. ఇది కూడా చదవండి: కొత్త భవనంలోకి సచివాలయ శాఖల షిఫ్టింగ్.. కేసీఆర్ ఆఫీస్ ఏ ఫ్లోర్లో ఉంటుందంటే? -
యాదాద్రి ఆలయం రక్షణ గోడ నుంచి వాటర్ లీకేజ్
-
సాగర్ డ్యామ్ నుంచి లీకేజీలు
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీరు లీకవుతోంది. డ్యామ్ నాన్ ఓవర్‌ఫ్లో సెక్షన్లో కొన్ని బ్లాకుల నుంచి పూర్తిగా రెండో వైపునకు నీటి ఊట వస్తోంది. దీనిని అరికట్టడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సమస్య చిన్నదే అయినా ప్రారంభదశలో ఉన్నప్పుడే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. లేనిపక్షంలో డ్యామ్ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. జాయింట్ లేయర్స్ నుంచి వస్తున్న నీరు 1955 నుంచి 1967 మధ్య కాలంలో సాగర్ డ్యామ్ నిర్మాణం జరిగింది. ప్రధాన డ్యామ్‌లో 1 నుంచి 23వ బ్లాకు వరకు ఎడమ వైపు నాన్ ఓవర్‌ఫ్లో పోర్షన్ ఉండగా, 24 నుంచి 50వ బ్లాకు వరకు 26 రేడియల్ క్రస్ట్‌గేట్లు అమర్చి ఉన్న ఓవర్‌ఫ్లో పోర్షన్లు ఉన్నాయి. స్పిల్‌వేకు కుడివైపున 51వ బ్లాకు నుంచి 76 వరకు బ్లాకులు ఉన్నాయి. స్పిల్‌వేకు ఎడమవైపున లిఫ్టుకు కుడివైపున స్లూయీస్గేట్కు పక్కవెంట 22, 23 బ్లాకు వద్ద 510 అడుగులకు దిగువనుంచి నీటి లీకేజీలు వస్తున్నాయి. స్లూయీస్ గేటుకు ఎడమవైపున 51, 52 పోర్షన్లలో నీటిలీకేజీలు ఆగడంలేదు. కుడికాల్వ వైపునగల 73వ బ్లాకులో అదే పరిస్థితి ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్న సమయంలో ఈ లీకేజీలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రాజెక్టు ఆధునీకరణలో భాగంగా 2013లో డ్యామ్ లోపలివైపు ఇనుప జాలి ఏర్పాటు చేసి సిమెంటుతో ప్లాస్టింగ్ (షాట్ క్రీటింగ్) చేశారు. దీంతో కొన్ని చోట్ల నీటి లీకేజీలు ఆగాయి. మరికొన్ని చోట్ల ఆగడం లేదు. రాతికట్టడం జాయింటింగ్ లేయర్స్ నుంచి నీరు వస్తున్నట్లు కనిపిస్తోంది. కాగా, రాతికట్టడం డ్యామ్‌లకు సీపేజీ సహజమేనని అధికారులు కొట్టి పారేస్తున్నారు. -
‘ర్యాలంపాడు’కి బీటలు
గద్వాల రూరల్: ‘ర్యాలంపాడు జలాశయం ప్రమాదపుటంచుల్లోకి వెళ్లింది. కట్ట తెగితే ఏకంగా 20గ్రామాలు పూర్తిగా ఊడ్చుపెట్టుకుని పోవడం ఖాయం.’ ఇదేదో స్థానికులు చెబుతున్న మాట కాదు.. సాగు నీటిపారుదల శాఖ అధికారులే ప్రభుత్వానికి పంపిన హెచ్చరికలు. ఈ క్రమంలో ఇద్దరు సీఈలతో కూడిన ఇంజనీర్ల బృందం శనివారం ర్యాలంపాడు జలాశయాన్ని సందర్శించింది. ఎక్కడ్కెడ లీకేజీలున్నాయో తెలుసుకునేందుకు డ్యాం చుట్టూ ఇంజనీర్లు కలియదిరిగారు. త్వరలో పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు. ►జోగుళాంబ గద్వాల జిల్లాలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా ధరూరు మండలం ర్యాలంపాడు వద్ద రూ.192 కోట్ల వ్యయంతో జలాశయాన్ని నిర్మించారు. 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ జలాశయం నుంచి 1.36లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించేలా లక్ష్యంగా నిర్మాణం చేపట్టారు. 2014లో అందుబాటులోకి వచ్చిన ఈ జలాశయంలో మొదటి నాలుగేళ్లు రెండు టీఎంసీల కంటే తక్కువగానే నీటిని నిల్వ చేశారు. 2018, 2019, 2020లో వరుసగా జలాశయంలో పూర్తిస్థాయి 4 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. అయితే ఈ ఏడాది కూడా భారీగా వరద నీరు జూరాలకు వచ్చి చేరడంతో జూలై మొదటి వారంలోనే నీటిని ర్యాలంపాడు జలాయంలోకి ఎత్తిపోశారు. ఈ క్రమంలోనే జలాశయం ఆనకట్ట నుంచి పెద్ద ఎత్తున నీరు లీకేజీ కావడం మొదలైంది. ఈ విషయాన్ని 25 రోజుల కిందట అధికారులు గురించి.. పొంచి ఉన్న ముప్పును రాష్ట్ర ఉన్నతాధికారులకు తెలియజేశారు. 3 కిలోమీటర్ల మేర నీరు లీకేజీ.. జలాశయం చుట్టూ మూడు కిలోమీటర్ల మేర రాళ్లకట్ట నిర్మించారు. సహజంగా జలాశయాల్లో లీకేజీలు ఎర్త్స్లోపుల నుంచి విడుదలవుతాయి. కానీ ర్యాలంపాడులో మాత్రం 3 కిలోమీటర్ల మేర ఉన్న రాక్‌టోల్ నుంచి భారీగా నీరు లీకేజీ అవుతుంది. జలాశయంలో పూర్తిస్థాయిలో అంటే 4 టీఎంసీల మేర నీటిని నిల్వ చేస్తే కట్టకు గండి పడి దాని కింద ఉన్న 20 గ్రామాలు పూర్తిగా నీటిలో కొట్టుకుపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో గద్వాల పట్టణం, అయిజ, మల్దకల్‌తో పాటు ధరూరు, గద్వాల, మల్దకల్, అయిజ మండలాల్లోని 17 గ్రామాల వరకు పూర్తిగా నీటమునుగుతాయి. ప్రమాదకరమే.. ర్యాలంపాడు కట్ట చుట్టూ రాక్పోల్ ద్వారా నీరు లీకేజీ అవుతున్న విషయాన్ని 25 రోజుల క్రితం గుర్తించాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. శనివారం ప్రత్యేక బృందం జలాశయాన్ని పరిశీలించింది. ర్యాలంపాడు నుంచి వెలువడు తున్న లీకేజీలు ప్రమాదకరంగా ఉన్నాయని, 2 టీఎంసీలకు మించి నీటిని నిల్వ చేయవద్దంటూ సూచించింది. కట్ట తెగితే దాని కింద ఉన్న గ్రామాలు ముంపునకు గురవుతాయని పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడం లేదు. వానాకాలం పంటకు ఇబ్బంది లేకుండా ఆయకట్టుకు నీటిని అందిస్తాం. యాసంగికి మాత్రం కష్టం. – శ్రీనివాస్‌రావు, ఎస్ఈ, జిల్లా సాగునీటిపారుదల శాఖ -
‘ఎంపీని అడ్డుగా పడుకోబెడితే లీకేజీ బంద్’
శివాజీనగర: కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి.. ప్రముఖ నటి, మండ్య స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీశ్‌పై చేసిన విమర్శలు కలకలం రేపాయి. మండ్య జిల్లాలోని ప్రఖ్యాత కేఆర్ఎస్ డ్యామ్ గేట్ల లీకేజ్‌ని అరికట్టడానికి ఎంపీని అడ్డుగా పడుకోబెడితే సరిపోతుందని కుమారస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేఆర్ఎస్ డ్యామ్ లీకేజ్ అవుతోందని, మండ్య జిల్లాకు ఇలాంటి ఎంపీ మునుపెన్నడూ ఎన్నిక కాలేదని పరోక్షంగా సుమలతపై విమర్శలు చేశారు. లీకేజీని అడ్డుకోవడానికి గేట్లకు అడ్డంగా ఎంపీని పడుకోబెట్టాలని ఎద్దేవా చేశారు. కుమారస్వామి వ్యాఖ్యలపై ఎంపీ సుమలత ఘాటుగా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రికి ఒక మహిళ గురించి ఎలా మాట్లాడాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదని, ఆ స్థాయికి దిగజారి మాట్లాడితే ఆయనకు, తనకూ తేడా ఉండదని అన్నారు. -
అహోబిలం రిజర్వాయర్‌కు ‘జియోమెంబ్రేన్’ చికిత్స
సాక్షి, అమరావతి: నిర్మాణ లోపాల కారణంగా పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) స్పిల్‌వే నుంచి భారీగా నీరు లీకవుతోంది. సీపేజీ, లీకేజీల వల్ల ఆ రిజర్వాయర్ భద్రతకే ముప్పు పొంచి ఉండటంతో అందులో సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయడం లేదు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తి నిల్వ సామర్థ్యం 11.1 టీఎంసీలు కాగా.. గరిష్టంగా 4.11 టీఎంసీలకు మించి నీటిని నిల్వ ఉంచడం లేదు. దీంతో అటు ఆయకట్టుకు సాగునీరు.. ఇటు తాగునీటి అవసరాలను తీర్చలేని దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్పిల్‌వే, మట్టి కట్టలలో చిల్లులను ‘జియోమెంబ్రేన్ షీట్ల’తో పూడ్చటం ద్వారా 11.1 టీఎంసీలు నిల్వ చేసి అనంతపురం జిల్లాకు మరింత జలభద్రత చేకూర్చాలని నిర్ణయించింది. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ(హెచ్చెల్సీ)లో అంతర్భాగంగా పెన్నా నదిపై అనంతపురం జిల్లా కూడేరు మండలం కొర్రకోడు వద్ద 11.10 టీఎంసీల సామర్థ్యంతో పీఏబీఆర్‌ను నిర్మించారు. కాలువ ద్వారా 50 వేలు, యాడికి కెనాల్ వ్యవస్థ ద్వారా మరో 50 వేలు కలిపి మొత్తం లక్ష ఎకరాలకు నీళ్లందించేలా ఈ రిజర్వాయర్‌ను నిర్మించారు. స్పిల్‌వే నిండా చిల్లులే.. పీఏబీఆర్ స్పిల్‌వే పొడవు 101.44 మీటర్లు. మట్టికట్ట పొడవు 1,920 మీటర్లు. రిజర్వాయర్ వద్ద పెన్నా నది గర్భం 400 మీటర్లు. రిజర్వాయర్ స్పిల్‌వే ఎత్తు 446 మీటర్లు. ఈ రిజర్వాయర్ నిర్మాణాన్ని లోపాల పుట్టగా నీటి పారుదల నిపుణులు, జల వనరుల శాఖ అధికారులు అభివరి్ణస్తున్నారు. స్పిల్‌వే నిండా చిల్లులే ఉండటంతో రిజర్వాయర్‌లో ఏనాడూ గరిష్టంగా> నీటిని నిల్వ చేయలేని దుస్థితి. కోట్లాది రూపాయలు వెచి్చంచి గ్రౌటింగ్ (స్పిల్ వే ఎగువన బోర్లు వేసి అధిక ఒత్తిడితో సిమెంట్, కాంక్రీట్ మిశ్రమాన్ని పంపి.. చిల్లులను పూడ్చటం) చేసినా చిల్లులు పూడలేదు. లీకేజీలు, సీపేజీ తగ్గలేదు. దాంతో రిజర్వాయర్ భద్రత దృష్ట్యా గరిష్టంగా 4.11 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేస్తున్నారు. దీనివల్ల ఆయకట్టుకు నీళ్లందటం లేదు. అనంతపురం నగరంతోపాటు జిల్లాలో అధిక శాతం పట్టణాలు, గ్రామాలకు తాగునీటిని అందించే పథకాలు ఈ రిజర్వాయర్‌పైనే ఆధారపడ్డాయి. సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయకపోవడం వల్ల తాగునీటిని సరఫరా చేయలేని దుస్థితి ఏర్పడింది. రిజర్వాయర్‌కు పునరుజ్జీవం తమిళనాడులో కడంపరై డ్యామ్, కర్ణాటకలో కృష్ణ రాజసాగర్ డ్యామ్‌లలో సీపేజీ, లీకేజీలను జియోమెంబ్రేన్ షీట్లు వేయడం ద్వారా తగ్గించారు. ఈ నేపథ్యంలో పీఏబీఆర్‌కు జియోమెంబ్రేన్ షీట్లను వేసి, లీకేజీలను అరికట్టాలన్న జల వనరుల శాఖ ప్రతిపాదనకు సర్కార్ ఆమోద ముద్ర వేసింది. అత్యంత పటిష్టమైన జియోమెంబ్రేన్ షీట్లను అధిక ఒత్తిడితో స్పిల్‌వే, మట్టి కట్టలకు ఎగువన భూమిలోకి దించుతారు. వాటి పునాది స్థాయి కంటే దిగువకు దించుతారు. ఈ షీట్లతో స్పిల్‌వేకు తొడుగు వేస్తారు. దాంతో లీకేజీలు, సీపేజీలకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుంది. అప్పుడు పీఏబీఆర్‌లో పూర్తి స్థాయిలో 11.1 టీఎంసీలను నిల్వ చేయడానికి మార్గం సుగమం అవుతుంది. చదవండి: ‘ఎంత కృతజ్ఙత లేని వాడివి నీవు.. చంద్రం’ ఏం జరిగిందో ఏమో.. యువతి అనుమానాస్పద మృతి -
చంద్రబాబు ఇంధ్రభవనం కట్టుకుని.. సచివాలయాన్ని మాత్రం
-
‘లోకేశ్ టెక్నాలజీతో సచివాలయం’
సాక్షి, విజయవాడ: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏపీ సచివాలయంలో లీకేజీలు మరోసారి బయటపడ్డ సంగతి తెలిసిందే. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు లేటెస్ట్ టెక్నాలజీతో తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం నిర్మించినట్టు గొప్పలు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. గతంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఛాంబర్లో నీళ్లు లీక్ అయితే నానా మాటలు అన్నారని.. కానీ ఇప్పుడు మంత్రుల ఛాంబర్లలో అదే పరిస్ధితి నెలకొందన్నారు. సచివాలయాన్ని మంత్రి లోకేశ్ టెక్నాలజీతో నిర్మించారని ఎద్దేవా చేశారు. మంత్రులు, అధికారులు సచివాలయంలోకి వెళ్లడానికి భయపడుతున్నారని అన్నారు. వేల కోట్లు ఖర్చుపెట్టి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టిన చంద్రబాబు, లోకేశ్‌లు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేరళ తరహా వరద వస్తే సచివాలయం కూలిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి పరిస్థితిపై వైఎస్ జగన్ ముందుగానే హెచ్చరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. విజయవాడలో డ్రైన్లు పొంగిపొర్లుతున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నా స్పందించడం లేదని ఆరోపించారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఇంధ్రభవనం కట్టుకుని.. సచివాలయాన్ని మాత్రం లీక్‌ల భవనంగా మార్చారని విమర్శించారు. కాగా, వేల కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన సచివాలయంలో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి; ఏపీ సచివాలయంలో మళ్లీ లీకేజీలు -
ఏపీ సచివాలయంలో మళ్లీ లీకేజీలు
సాక్షి, అమరావతి : ఏపీ సచివాలయంలో మళ్లీ లీకేజీలు బయటపడ్డాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుసున్న వర్షాలకు ఏపీ సచివాలయంలోని మంత్రుల ఛాంబర్లలోకి నీరు వచ్చి చేరింది. భారీ వర్షాలకు సీలింగ్‌లు ఊడిపడుతున్నాయి. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అమర్నాథ్రెడ్డి, దేవినేని ఉమ ఛాంబర్‌ల్లో సీలింగ్ ఊడిపడి, ఏసీల్లోకి వర్షపు నీరు వచ్చిచేరింది. 4, 5వ బ్లాకుల్లోని పలు సెక్షన్లలో సీలింగ్ ఊడిపడింది. అసెంబ్లీ బిల్డింగ్లోనూ పలు చోట్ల సీలింగ్ ఊడిపోయి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. లీకేజీతో అసెంబ్లీ మొదటి అంతస్తులోని రిపోర్టింగ్ సెక్షన్లోకి వర్షలు నీరు వచ్చి చేరుతోంది. -
లీకేజీల బెడద!
నగరవాసులను తాగునీటి పైపులైన్ లీకేజీలు భయపెడుతున్నాయి. నీరు కలుషితమవుతుందనే భయాందోళనలో నగరవాసులు ఉన్నారు. నిత్యం ఏదో ఒక చోట లీకేజీ అవుతున్నా.. కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. లీకేజీ మరమ్మతుల కోసమే ప్రత్యేకంగా కార్మికులున్నా ఫలితం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థ నీటి సరఫరా విభాగం నిద్దరోతోంది. పైపులైన్లకు అడ్డగోలుగా లీకేజీలు ఏర్పడుతున్నా పట్టించుకోవడం లేదు. తాగునీటి పైపులైన్లు, సరఫరాలో ఉన్న లోపాలతో తరచూ రోడ్లపై పైపులైన్లు లీకవుతున్నాయి. నగర పరిధిలోని 50 డివిజన్లలో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట పైపులైన్ లీకేజీలు ఏర్పడుతూనే ఉన్నాయి. లీకేజీలతో వృథాగా ప్రవహిస్తున్న నీటితో రోడ్లు పాడవుతున్నాయి. లీకేజీలతో సరఫరాలో నీరు రంగుమారుతుందని నగరవాసులు పేర్కొంటున్నారు. రూ.లక్షలు ఖర్చు చేసి నీటిని ఫిల్టర్ చేస్తుండగా.. పైపులు పగిలి లక్షల లీటర్ల నీరు డ్రెయినేజీల్లో చేరుతోంది. క్షేత్రస్థాయి సమస్యలను పట్టించుకోకపోగా లీకేజీలను మరమ్మతు చేయడం లేదు. దీంతో శుద్ధిచేసిన నీరు కలుషితమతుంది. అదే నీరు నల్లాల ద్వారా నగరంలో సరఫరా అవుతుంది. లీకేజీల కారణంగా తాగునీరు కలుషితమవుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా రోడ్లపై జరుగుతున్న లీకేజీలతో బీటీ రోడ్లు గుంతలుపడి శిథిలమవుతున్నాయి. లక్షలు పెట్టి వేస్తున్న రోడ్లన్నీ కంకరతేలి ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లీకేజీలపై పట్టింపు కరువు నగరంలోని అన్ని డివిజన్లతోపాటు ప్రధాన రహదారులపై అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. పనులు జరుగుతున్న సమయంలోనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పైపులు పగులుతున్నాయి. అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రాంతాల్లో పైపులు పగలకుండా కార్పొరేషన్ నీటి విభాగం సిబ్బంది పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఓ వైపు పనులు జరుగుతుండగా మరో వైపు పైపులు పగిలినా పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తేనే నీటి వృథా అరికట్టడం సాధ్యమవుతుంది. అయితే నిర్లక్ష్యంతో చిన్నపాటి లీకేజీలే పెద్దగా మారుతున్నాయి. 120 మంది కార్మికులు ఉన్నప్పటికీ ఎక్కడ, ఏం పనులు చేస్తున్నారనే విషయం ఎవరికీ తెలియడం లేదు. అయితే ఈ కార్మికులను ఇతర పనుల్లోకి వినియోగించుకుంటూ లీకేజీలను విస్మరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి లీకేజీలను అరికట్టి తాగునీరు కలుషితం, రంగు మారకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. -
కొంచెం నీరు కొంచెం మద్యం
-
సీఎం బ్లాక్ లోకి నీళ్లు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంలో లీకేజీలు బయటపడుతున్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధులు నిర్వర్తించే బ్లాక్ లోకే వాటర్ లీకయింది. నీళ్ల ట్యాంకు నుంచి భారీగా సీఎం బ్లాక్ లోకి చేరడంతో అదుపుచేసేందుకు సిబ్బంది చాలా కష్టపడాల్సి వచ్చింది. వాటర్ లీకేజీని అదుపు చేసిన తర్వాత బ్లాక్ ను శుభ్రం చేశారు. సచివాలయం ప్రారంభమై కొద్ది నెలలైనా గడవకముందే లీకేజీలు బయటపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. హడావుడిగా పనులు పూర్తి చేయడంతో సచివాలయం నిర్మాణంలో రాజీపడ్డారన్న ఆరోపణలకు ఇటువంటి ఘటనలు బలాన్నిస్తున్నాయి. -
నీళ్లను చూస్తే పరార్
-
హాంఫట్
రూ. పదిలక్షలు.. పదిరోజులు పనులు సరిగా లేక నీరు లీకేజీ తూతూ మంత్రంగా మరమ్మతులు పట్టించుకోని అధికారులు పరకాల : వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చేపట్టిన పైపులైన్ పనులు పది రోజులు గడవకముందే లీకు అయ్యాయి. పైపులైన్ లీకేజీ కావడంతో సంగం నీళ్లు భూమి పాలు అవుతుండగా మిగతా సంగం నల్లాల ద్వారా ఇళ్లకు చేరుతున్నాయి. లక్షలాది నిధులు కేటాయించి చేపట్టిన పైపులైన్ మూడు రోజుల మురిపెనంగా మారింది. పట్టణంలోని వెల్లంపల్లిరోడ్డు, సాయినగర్ కాలనీ, మల్లారెడ్డిపల్లిలో కొంతభాగానికి ఏడాది నుంచి నల్లా నీరు కరువైంది. ప్రధాన రోడ్డులోని అంబేద్కర్ సెంటర్ నుంచి ఆర్టీసీ డిపో వరకు రోడ్డు విస్తరించారు. బస్టాండ్ సెంటర్లో రోడ్డు వేయడంతో పైపులైన్ పగిలిపోవడంతో ఆమూడు కాలనీలకు నీటి సరఫరా నిలిచిపోయింది. అప్పటి నుంచి ప్రజలు నీటి కోసం తీవ్రంగా కష్టాలు పడుతున్నారు. ట్యాంకర్లతో నీటి సరఫరా చేయడంతో అవి ఎటు సరిపోక ఇబ్బందులు పడ్డారు. ప్రజలకు నీటి బాధను దూరం చేయడం కోసం రెండు నెలల క్రితం నీటి కరువు నివారణ కింద రూ.10 లక్షలు కేటాయించారు. పాత సీఎంఎస్ ట్యాంకు నుంచి సాయినగర్ కాలనీ, మల్లారెడ్డిపల్లి, వెల్లంపల్లి రోడ్డుకు పైపులైన్ నిర్మాణం చేపట్టారు. 730 మీటర్ల పొడవుతో చేపట్టిన పైపులైన్ నిర్మాణ పనులు పది రోజుల క్రితమే పూర్తికావడంతో కనెక్షన్ ఇచ్చారు. రెండు రోజులు నీళ్లు పోశాయో లేదో అంతలోనే పైపులైన్ లీకేజీ అయ్యింది. పశువుల సంతకు పోయే దారి పక్కనే పైపులైన్ లీకేజీ కావడంతో రోడ్డు మీద నుంచే కాల్వ మాదిరిగా పోయింది. నల్లాలు విడిచిన ప్రతిసారీ ఇదే పైపులైన్ నుంచి నీరు వృథాగా పోతోంది. కొత్త పైపులైన్ నుంచి అప్పుడే నీరు లీకేజీ కావడంతో అంతా ఆశ్చర్యంగా చూశారు. లక్షలు వెచ్చించి నిర్మాణం చేసింది లీకేజీల కోసమేనా అనే విమర్శలు వ్యక్తమవుతున్నారుు. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు చేస్తే అధికారులు చూసి చూడనట్లు వ్యవహారించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరంభంలోనే లీకేజీల పర్వం మొదలైతే తరువాత ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమ తప్పును మట్టిలోనే కలిపే ప్రయత్నంలో భాగంగా అదే పైపులైన్‌కు మరమ్మతులు చేపట్టారు. లీకేజీ అయిన చోట తవ్వి సిమెంట్‌తో అతికించారు. ఇలా అస్తవ్యస్తంగా ముగించిన పనులకు బిల్లులు విడిపించేందుకు అధికారులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏఈ రవీంద్రనాథ్ వివరణ కోరగా కొత్త పైపులైన్ లీకేజీ అయిన మాట వాస్తవమే. అది చిన్న లీకేజీ మాత్రమే. పైపులను కలిపే సందర్భంలో జాయింట్ లూజ్ అయింది. మళ్లీ మరమ్మతులు చేయించామని తెలిపారు. -
మంజీరా నీళ్లు నేల పాలు
ఓ వైపు హైదరాబాద్ నగరంలో మంచినీరు అందక ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే మరోవైపు మాత్రం మంచినీరు రోడ్డు పై వృధాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆదివారం మధ్యాహ్నం బోరబండలో మంజీర వాటర్ పైప్ లైన్ లీక్ అయ్యింది. దీంతో నీళ్లు వరదగా రోడ్డమీదికి వచ్చాయి. ఇది గుర్తించిన స్థానికులు నీటి సరఫరాను నిలిపి వేయాల్సిందిగా.. అధికారులకు సమాచారమిచ్చారు. అయితే.. గంటలు గడుస్తున్నా.. ఎలాంటి చర్యలు తీసకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు మంచినీళ్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. అధికారులు అలక్ష్యంగా ఉన్నారని విమర్శిస్తున్నారు. -
కోటగిరి ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడి
నిజామాబాద్(కోటగిరి): నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని చెరువు నుంచి వాటర్ లీకేజీ అవుతున్నాయని, వెంటనే మరమ్మతులు చేయించి నీటిని వృధాగా పోకుండా అరికట్టాలని కోరుతూ బుధవారం రైతులు మండల తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం తహశీల్దార్‌ను కలిసి సమస్యను వివరించారు. చెరువుకు మర్మమత్తులు వెంటనే చేయించకపోతే సాగునీటికి, తాగునీటికి కష్టాలు మొదలవుతాయని తెలిపారు. -
నాగార్జునసాగర్ కుడికాలువకు గండి